Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనుబదవ అధ్యాయము - వర్ణ ధర్మములు

రామః - వర్ణానా మాశ్రమాణాం చ వేత్తి సర్వ మిదం భవాన్‌ | పుష్కరః - అహింసా సత్య వచనం తే స్యా ద్భూతే ష్వనుగ్రహః ||

తీర్ధాను సరణం దానం బ్రహ్మ చర్య మమత్సరమ్‌ | దేవ ద్విజాతి శు శ్రూషా గురుణాం చ భృగూత్తమ! ||

శ్రవణం సర్వ ధర్మాణాం పితౄణాం వూజనం తథా |భక్తి శ్చ భూపతౌ నిత్యం తథా సచ్ఛాస్త్ర నేత్ర తా ||

అనృశంస్య తితిక్షా చ తధా చాస్తి క్య మేవ చ | ధర్మ సామాన్య మేత తై కధితం భృగు సత్తమ ! ||

యజనం యాజనం దానం తధై వాధ్యాపన క్రియా | ప్రతి గ్రహం చాధ్య యనం విప్ర కర్మాణి నిర్దిశేత్‌ ||

దాస మధ్యయనం చైవ యజనం చ యధా విధి | క్షత్రియస్య చ వైశ్యస్య కర్మేదం పరి కీర్తి తమ్‌ ||

క్షత్రియస్య విశేషస్తుప్రజానాం పరిపాలనమ్‌ | కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యస్య పరి కీర్తి తమ్‌ ||

శూద్రస్య ద్విజుశుశ్రూషా సర్వ శిల్పాని చాప్యథ | బ్రామ్మణః క్షత్రియో వైశ్యః త్రయో వర్ణా ద్విజాతయః ||

తేషాం జన్మ ద్వితీయం తు విణ్ఞయం మౌంజి బంధనమ్‌ | ఆచార్య స్తు పితా తత్ర సావిత్రీ జననీ తథా

బ్రాహ్మణ క్షత్రియ విశాం మౌంజీ బంధన జన్మని ||

వృత్త్యా ద్విజా శ్శూద్ర సమా భవన్తి యావ న్న వేదే ప్రభవన్తి రామ ! |

తతః పరం తే ద్విజతాం లభ##న్తే సమస్తకార్యే ష్వధి దైవతం చ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే వర్ణ ధర్మాధ్యాయో నామ అశీతి తమో ధ్యాయః ||

పరుశురాముడు వర్ణముల యాశ్రమముల ధర్మములన్నియునీ వెఱుంగుదువవి యాన తిమ్మన పుష్కరుండనియె. అహింస సత్యవచనము భూతదయ తీర్థాను సరణము దానము బ్రహ్మచర్య మాత్సర్యము లేకుండుట దేవద్విజగురు శశ్రూష సర్వధర్మ శ్రవణము పితృ పూజనము భూపతియెడ భక్తి నిత్యము సచ్ఛాస్త్రదృష్టి ఆనృశంస్యము (నీచములయిన పనుల కొడపడకుండుట) తితిక్ష (సహనము) ఆస్తిక్యము ననునది ధర్మసామాన్యము, సర్వవర్ణసర్వాశ్రయ సామాన్య ధర్మమన్నమాట. యజించుట యజింపజేయుట అధ్యయన మధ్యాపనముదానము ప్రతి గ్రహమునను నీషట్కర్మములువిప్రునివిదానము అధ్యయనము యధావిధియజనముననునివిక్షత్రియుని వైశ్యుని కర్మములు క్షత్రియునికి ప్రజాపాలనము. విశేషధర్మము కృషి = వ్యవసాయము గోరక్షణము వాణిజ్యము వైశ్యుని పనులు. ద్విజశుశ్రూష సర్వశిలములు శూద్రునిపనులు బ్రాహణక్షత్రియ వైశ్యులు ముగ్గురును ద్విజులు వారి రెండజన్మము మేంజి బంధనము (ఉపనయము). దానియం దాచార్యుడు తండ్రి - తల్లి సావిత్రి. ఇది ముగ్గురు ద్విజలకును. ద్విజులు వృత్తిని బట్టి (జీవన వ్యాపారముంబట్టి) శూద్రతుల్యులగుదురు, వేదములందు సామర్ధ్యము లేనంతవరకు శూద్ర సమత్వము విహితము. వేదవిదులయిన మీదట వారు ద్విజత్వము బొందుదురు సర్వకార్యములందధి దేవతలు నయ్యెదరు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమునందు వర్ణధర్మాధ్యాయమను యెనబదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters