Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనుబదిరెండవ అధ్యాయము - ఆపద్ధర్మనిరూపణము

పుష్కరః- ఆజీవం తు యధోక్తెన బ్రాహ్మణః స్వేన కర్మథా | జీవేత్‌ క్షత్రియ ధర్మేణ సా హ్యస్య వృత్త్యనన్తరా ||

ఉభాభ్యా మప్యజీవన్‌ వై వైశ్య వృత్తిం సమాచరేత్‌ | బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్ర వృత్తిం వివర్జయేత్‌ ||

శూద్రోబ్రాహ్మణన్‌ వృత్తిం చ విశేషేణ వివర్జయేత్‌ | అజీవ తు స్వవృత్త్యా చ మధ్యవృత్తిం సమాచరేత్‌ ||

బ్రాహ్మణః క్షత్రియోవాపి వైశ్య వృత్త్యా తు వర్తయన్‌ | అయః శస్త్రం విషం మాంసం సోమం గంధాం శ్చ సర్వశః ||

క్షీరం క్షౌద్రం దధి ఘృతం తైలం మజ్జాం గుడం కుశమ్‌ | మద్య నీలం చ లక్షాం చ లవణం ప్రాణీనో 7పి చ ||

విక్రీణీత తిలా న్నైవ పక్వాన్నం గోరసాం స్తథా | రసా రసై ర్నిహన్తవ్యాః గంధేన లవణం రసై#్తః ||

కృతాన్నం చ కృతాన్నేన తిలధాన్యేన తత్సమమ్‌ | వైశ్యో వా క్షత్రియో వాపి వర్జయే ద్ద్విజ జీవికామ్‌ |

సధ్యః పతతి మాంసేన లాక్షయా లవణన చ | త్ర్యహాచ్చ శూద్రో భవతి బ్రాహ్మణః క్షీర విక్రయీ ||

ఇతరేషాం హి పణ్యానాం విక్రయా న్మనుజోత్తమ! | బ్రాహ్మణః సప్తరాత్రేణ వై శ్యభావం హి గచ్ఛతి ||

క్షిప్రాణి యాని రూక్షాణి చ రాణి చ మృదూని చ | వాణిజ్యే తాని శస్యన్తే తిథిం రిక్తాం వివర్జయేత్‌ ||

ద్వికం శతం తు గృహ్ణీయాత్‌ కుశీదేనాపి వర్దయన్‌ | తతోధివం తు గృహ్ణాన శ్చౌరస్యాప్నోతి కల్బిషమ్‌ ||

ప్రతిపద్ద్వాదశీ షష్టీ నక్షత్రాణి థ్రువాణి చ | కుసీదే వర్జనీయాని నిత్యం సూర్య సుతప్య చ ||

కృషౌ భూకు పతే ర్భాగం దత్వా మిర్యా ద్యథో దితమ్‌ | ధ్రువాణి సౌమ్యం మైత్రం చ వాయవ్యం పౌష్ణ మాశ్వినమ్‌ ||

వాసవం శ్రవణం చిత్రా విశాఖా మూల మేవ చ | కృష్యారంభే ప్రశస్య న్తే తథా పుష్య పునర్వసూ ||

కృష్యారంభే ప్రయత్నేన తిధిం రిక్తాం వివర్జయేత్‌ | అంగారకదినం వర్జ్యం, దివసం సూర్యజస్య చ ||

నక్షత్రాణాం యధోక్తానం ముహూర్తేషు చ కారయేత్‌ | ముహూర్తే యది వా బ్రహ్మే సర్వ కర్మసు పూజితే ||

వరాహం పూజయే ద్దేవం శేషం పుథ్వీం తదైవ చ | పర్జన్యం భాస్కరం వాయుం దేవేశం శశినం తథా ||

ఫాలం చగోయు గంచైవ గంధ మాల్యాన్నసంపదా | తతోగ్ని హవనం కుర్యాత్‌ సుసమిద్ధే హుతాశ##నే || 18

దేవతానాం యధోక్తానం జుహుయాచ్చ ఘృతాహుతీః |

పుష్కరుడనియె. బ్రాహ్మణుడు తనకు జెప్పబడిన కర్మమొనరించి జీవింపలేనిచో క్షత్రియ ధర్మముచే జీవనము సేయవచ్చును. అది యీతని కనంతర వృత్తి, ఆ రెండు వృత్తులచే గూడ జీవంపనేరనిచో వైశ్యవృత్తి నవంలంభింపవచ్చును. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు శూద్రవృత్తిని వదలివేయవలెను. శూద్రుడు బ్రాహ్మణ వృత్తిని తర్వాత వదలి వేయవలెను, ఏ విధమైన బ్రతుకుదెఱవు లేనపుడు మధ్యవృత్తిని బూనవలెను. బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని వైశ్యవృత్తిచే బ్రదుకవలసి వచ్చెనేని, ఇనుము శస్త్రము విషము మాంసము సోమము పరిమళ వస్తువులు పాలు తేనె పెఱుగు నేయి తైలము (నూనె) మజ్జ = అస్థిస్నేహము బెల్లము దర్భలు కల్లు నీలము లక్క ఉప్పు ప్రాణులును అమ్మవచ్చును. నువ్వులు దర్వాయన్నము గోరసములు (ఆవుపాలు పెరుగు వెన్న నేయి) యేమాత్రము నమ్మగూడదు. రసములను రసపద్థాము చేతను గంధముచే లవణమును. కృతాన్నమును కృతాన్నముచేతను తిలధాన్యము తత్సమధాన్యమును చెల్లు చేసికొనవలెను. వైశ్యుడు క్షత్రియుడును బ్రాహ్మణుని జీవన విధానమున నుసరింపరాదు. బ్రాహ్మణుడు మాంసము లక్క ఉప్పు వ్యాపారముసేసినచో వెంటనే పతితుడగును. పాలుఅమ్మిన బ్రాహ్మణుడు మూడురోజులలో శూద్రుడగును. ఇంక నితరములైన సరకులనమ్ముటచే బ్రాహ్మణుడేడు రాత్రులలో వై శ్యత్వమొందును. క్షివ్రములు = శీఘ్రములు రూక్షములు = కఠినములు చరములు = చరించునవి మృదులములనైన వస్తవులువర్తకము ప్రశస్తము (తప్పలేనిది), రిక్త తిధి వ్యాపారమునకు నింద్యము (రిక్తతిధులు = చవితి, నవమి, చతుర్ధశి.) కుసీదమునందు = వడ్డీవ్యాపారమున నూటికి రెండు రూపాయలు వడ్డీ తీసికొవచ్చును.అంతకుమించి తీసికొన్నవాడు దొంగపొందుపాపమొందును. పాడ్యమి ద్వాదశి షష్ఠియు ధ్రువనక్షత్రములును శనివారమును వడ్డీ వ్యాపారము నందు వర్జ్యములు. వ్యవసాయములో భాగము భూస్వామికిచ్చి వ్యవసాయము సేయవలెను. ధ్రువనక్షత్రాలు సౌమ్యము = సోమదైవత్యము మైత్రము (మిత్రదేవతాకము) వాయవ్యము వాయుదేవతాకము. పౌష్ణము అశ్వని వాసవము (ఐంద్రము) శ్రవణము చిత్ర విశాఖ పునర్వసు పుష్యమి మూలయు కృషి ప్రారంభమునకు మంచివి. రిక్తతిధి యోమాత్రముం గూడదు, మంగళ శనివారములు పనికిరావు శుభములని చెప్పబడిన నక్షత్రములందు సుముహూర్తములందు వ్యవసాయము నారంభింపనగును, బ్రాహ్మ ముహూర్తమన్నిపనులకు పూజనీయము. కృష్యారంభమందు వరాహ స్వామిని శేషుని పృధ్విని పర్జన్యుని భాస్కరుని వాయువును ఇంద్రుని చంద్రుని బలరాముని గోయుగమును గంధమాల్యాన్న సంపదతో బూజింపవలెను. ఈ దేవతలకు చక్కగా సమిద్ధమైన యగ్నియందు హోమము యధావిధిగ చేయవలెను.

గోవా భగ ఇతి ద్వాభ్యం సీరాం యుంజం త్యత స్త్రిభిః ||

ఫాలం శునాం సుఫాలేతి లాంగలంచ తధేతి వై | హుత్వా విప్రాన్‌ సమభ్యర్చ్య దక్షిణాభి ర్యధావిధి ||

పూర్వోదక్ప్రవణాం భూమిం వాహయేత్‌ ప్రా గ్ఘలేన తు | సీరా యుంజంత ఇత్యేత ద్పక్‌త్రయం కీర్తయే ద్బుధః ||

యా ఓషధయ ఇత్యేవం బీజం తదను మంత్రయేత్‌ | కృత్వా సువర్ణతోయాక్తం లక్షణ్యో వాపయేత్‌ పుమాన్‌ || 22

ప్రాజ్ముఖై ర్వాహయే ద్గోభిః ప్రాజ్ముఖై శ్చైవ వాపయేత్‌ | శంఖ పుణ్యాహ ఘోషేణ బీజావాపః ప్రశస్యతే ||

బీజా వాపే తధా మంత్రం నిబోధ గదతో మమ | ప్రజాపతే కశ్యపాయ దేవలాయ నమ స్సదా ||

సదా మే బుద్ధతాం దేవీ బీజేషు చ ధనేషు చ | భోజయే ద్బ్రాహ్మణాం శ్చాత్ర తధైవ చ కృషీవలాన్‌ || 25

కాల శ్చ సర్వః పూర్వోక్తః సంగ్రహేపి ప్రశస్యతే | దేవతానాం పితౄణాం చ కృత్వా తత్రాపి పూజనమ్‌ ||

నవవస్త్రపరీధానః శ్వేత మాల్యాను లేపనః | ప్రాజ్ముఖః ప్రాశనం కుర్యాత్‌ పాత్రే సౌవర్ణరాజతే ||

తత్రాపి భోజయే ద్విప్రాన్‌ తధైవ చ కృషీపలాన్‌ | కృష్యే విశేషతః | కార్యం ఫలయజ్ఞం భృగూద్వహ ||

యూపోయం నిహితో మధ్యేపేషీవాసైషకార్షకైః | తస్మా దతంద్రితో దద్యాన్నం ధాన్యార్ధ దక్షిణా

భూమిం భిత్త్వౌ షధీ శ్ఛిత్వా హత్వా కీటపిపీలికమ్‌ | పునన్తి ఖలు యజ్ఞేన కర్షికా నాత్ర సంశయః ||

అష్టాగవం ధర్మహలం షడ్గవం జీవితార్థి నామ్‌ | చతుర్గవం నృశంసానాం ద్విగవం బ్రహ్మఘాతినామ్‌ ||

ఆపదంచ సముత్తీర్యం త్యక్త్వా విత్తం చ కర్మణా | యదర్జితం తతః కుర్యాత్‌ ప్రాయశ్చిత్తం విచక్షణః ||

శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠి తాత్‌ | స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

ఋతేన జీవే దమృతేన జీవేత్‌ మృతేన జీవేత్‌ ప్రమృతేన జీవేత్‌ |

సత్యానృతాభ్యా మధవాపి జీవేత్‌ శ్వవృత్తి మేకాం పరివర్జయేత్తు || 34

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ఆపద్ధర్మోనామ ద్వ్యశీతి తమోధ్యాయః ||

''గావోభగ'' అను రెండు మంత్రములచే నాగలిని కట్టి అటుపై మూడుమంత్రములతో ఫాలంశునాం సుఫాల అను మంత్రములతో రాంగలంచ ''తధా'' అను మంత్రముతో హోమముసేసి విప్రులనర్చించి యథావిధి దక్షిణ లిచ్చి తూర్పు ఉత్తర దిశలవాలుగానున్న భూమిని నాగలితో దున్నవలెను. అప్పుడు ''సీరాయుంజంత'' అను మూడుఋక్కులను గీర్తింపవలెను, అవ్యల ''యా ఓషధయిః'' అను మంత్రముచే విత్తనమునభిమంత్రింపవలెను. సువర్ణము (బంగారము) వేసిన జలములతో వానిని దడిపి యధోక్త లక్షణములు గలవాడు భూమిలో జల్లవలెను. ఆచల్లునపుడు ప్రజాపతే కశ్యపాయ దేవతాయ నమస్సదా ''సదామే బుద్ధతాందేవీ చీజేషుధనేషుచ '' అను మంత్రము పఠింపవలెను, బ్రాహ్మణులకు వ్యవసాయదారులకు భోజనము పెట్టవలెను. కృషి ప్రారంభమునకు జెప్పిన శుభసమయమే సంగ్రహమునకు గూడమంచిది. (సంగ్రహము అప్పుడుగూడ దేవతలను పితృదేవతలను బూజించి నూతన వస్త్రములు దాల్చి తెల్లని పూలమాలను గంధముం బూసికొని తూర్పు ముఖముగ గూర్చుండి బంగారు లేదా వెండిపాత్రలో భోజనము సేయవలెను. అపుడుగూడ బ్రాహ్మణులకు వ్యవసాయకులకుగూడ భోజనము పెట్టవలెను, వ్యవసాయమందు ఫలయజ్ఞము చేయుట చాల విశేషము. అందు యూవమొకటి మధ్య క్షేత్రమందు బాతి అన్నదానము చేయవలెను, ధాన్యము ధనదక్షిణయునీయవలెను. భూమినిజీల్చిన ఓషధులనుగోసిన క్రిమికీటములను జీవములనుంపిజనకారణమున గల్గిన దోషము యజ్ఞము వలన బోవును. సందేహము లేదు. ఎనిమిదిగోవులు ధర్మహలము నాఱుగోవులను జీవితార్థులకు (బ్రతుకు తెరవు కోరువారికి) నాల్గావులు నిందితులకు బ్రాహ్మహత్యా పాతకులకు రెండావులను నీయవలెను. ఆపదనుదాటి కర్మాచరణనమిత్తముగ సంపాదించిన ధనము దానముసేసి వివేకవంతుడు కృషిలో గల్గిన హింసాది దోషములకు బ్రాయశ్చిత్తము నిట్లు సేసికొనవలెను. గుణమంతగా లేకున్నను స్వధర్మమే శ్రేయస్కరము.చక్కగా ననుష్ఠించినను పరధర్మము శ్రేయస్కరముగాదు. తన ధర్మమందుండి తాను జచ్చినమేలు. పరధర్మము భయము గూర్చును. ఋతముచే జీవనము చేయనగు అమృతము చేతను బ్రతుకనగును లేదా సత్యా నృతములు రెండింటి చేతను బ్రతుకనగును. శ్వవృత్తి మాత్రము = కుక్క బ్రతుకు పరునికి దాస్యము చేసి ఉద్యోగముచేసి మాత్రము బ్రతుకరాదు. ఋతము = ఉంఛశిలా వృత్తులు, అమృతము = ఆయాచితము, మృతము = యాచితము, ప్రమృతము = వ్యవసాయము, సత్యానృతము = వ్యాపారము (వర్తకము).

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమునందు ఆపద్దర్మ నిరూపణమను నెనుబది రెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters