Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యెనబది నాల్గవ అధ్యాయము - మూలస్నానవిధి

పుష్కరః-స్వయం సూపోషితో విద్వాన్‌ యజమాన ముపోషితమ్‌ | మూలేన స్నాపయే నిత్యం నిర్పుత్యా శాముఖ స్థితమ్‌ ||

దూర్వా కుశమీ పత్ర పూర్ణేన సుదృఢేన చ | కుంభ ద్వయేన స్నాతు స్తు పూజయే న్మధు సూదనమ్‌ ||

విరూపాక్షం సవరుణం చంద్రం మూలం తధై చ | గంధమాల్య నమస్కారధూప దీపాన్న

సంపదా ||

ఏతేషా మేవ జుహుయా త్తథా నామ్నా ఘృతం ద్విజః || పీతవాసా స్తతో భూత్వా మత్స్య కుల్మాష సూకర్తేః ||

సురాకృ సరసంయుక్తైః స్నానోక్తాశా ముఖస్థితః | బలిం నిరృతయే దద్యా జ్జానూ కృత్వా తతః క్షితౌ ||

తతోష్టాదశభిః పుషై#్పః మూలైః పంచభి రేవ చ | సువర్ణగర్భం చ మణిం విద్వాన్‌ శిరసి ధారయేత్‌ ||

కృత్త్వెతత్‌సకలం కర్మ కృషిం బహుఫలాం లభేత్‌ | దక్షిణా చాత్ర దాతవ్యా మూలాని చ ఫలాని చ ||

పేతాని చైవ వస్త్రాణి కనకం రజతం తథా | భోజనం చాత్ర దాతవ్యం బ్రాహ్మణానా మభీప్సితమ్‌ ||

అలంఘయన్‌ మూల మిదం హి తుర్వన్‌ స్నానం సదా భార్గవ వంశముఖ్య |

కృషిం సమాప్నోతి సదైవ విద్వాన్‌ యధే ప్సితం నాత్ర విచార మస్తి || 9

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే మూలస్నాన వర్ణనం నామ చతురశీతి తమోధ్యాయః

పుష్కరుడనియె. తెలిసిన విద్వాంసుడు ఉపవసించి యజమానిని యుపవాసమున్న వానిని గూర్చుండబెట్ట (మూలానక్షత్ర మంత్రముతో) నిరృతి దిశగా మూలాస్నానము సేయింపవలెను. గటిక పోచలు జమ్మియాకులతో నిండిన గట్టివి రెండు కడవలతో స్నాతుడై యజమాని మధువైరిని (విష్ణువును) విరూపాక్షుని (శివుని) వరుణుని చంద్రుని మూలా నక్షత్రదేవతను గంధమాల్యాది షోడ శోపచారములచే బూజింపవలెను. ఈ దేవతలనుద్దేశించి వారి నామములతో నాజ్యుహోమములు చేయవలెను. పసుపు పచ్చని వస్త్రము దాల్చి ముత్స్యములు కుల్మాషములు = గుగ్గిళ్లు సూకరము సుర = కల్లు కృసరము = పులగము, అనువానితో మోకాలు బూమికానించి నిరృతిదేవతకు బలియీయవలెను. ఆమీద పదునెనిమిది పువ్వులతో పంచమూలములతోను = విద్వాంసుడు బంగారమును పొదిగిన రత్నమును శిరమున ధరింపవలెను. ఈ విధానమంతయుంజేసిన యాతడు వ్యవసాయమందు బహూస సమృద్ధమైన ఫలమందును. ఈ ప్రక్రియ యందు దక్షిణగ దుంపలు పండ్లు పసుపుపచ్చని వస్త్రములు బంగారము వెండియు నీయ వలెను. బ్రాహ్మణులు కోరిన మృష్టాన్నభోజనము పెట్టవలెను, మూలా నక్షత్రము దాటకుండ ఈ మూలా స్నానము సేసిన యాతడిందులో గూడ యిది చక్కగ దెలిసిచేసిన వాడు, నిత్యమును వ్యవసాయమం దబీష్టసమృద్ధి నందును. ఇందు విమర్శింపవలసిన దింకేమియు లేదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము దిత్యీయఖండమునందు మూలాస్నానవర్ణనయను నెనబది నాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters