Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదవ యధ్యాయము - దేవకర్మాధ్యాయము

పుష్కరః- స్వాచాంతః ప్రయతః స్నాతః ప్రవిశే ద్దేవతాగృహమ్‌ | నమస్కారం తు కుర్వీత తత్ర భక్త్యా సమాహితః ||

ఆఫో హిష్ఠేతి తిసృభిః తతోర్ఘ్యం వినివేదయేత్‌| హిరణ్యవర్ణా ఇతి చ పాద్యంచ తిసృభి ర్ద్విజః

శన్న ఆప ఇత్యనేన దేయం సౌదామనం భ##వేత్‌ || ఇత మాపః ప్రవహత స్నానమంత్రః ప్రకీర్తితః ||

రధే అక్షేషు చ తథా చతస్రస్త్వనులేపనే | యువాసు వాస ఇతి చ నుంత్రో వాసన ఈరితః ||

పుష్పం పుష్పవతీ త్యేవ ధూపం ధూరసి చా ప్యథ | తేజోసి శుక్రమసి దీపం....దద్యా ద్విచక్షణః ||

దధి క్రావ్ణో ఇతి తథా మధు పర్కం నివేదయేత్‌ || హిరణ్య గర్భ ఇత్యష్టౌ ఋచః ప్రోక్తాః నివేదనే ||

అన్నస్య మనుజ శ్రేష్ఠ ! పానస్య సుగంథినః | చామరవ్యజనే మాత్రాం ఛత్రం యానాసనే తధా ||

యత్కించి దేవ మాదిః స్యాత్‌ సావిత్రేణ నివేదయేత్‌ | పౌరుషం చ జపేత్‌ సూక్తం తదేవ జుహుయాత్తథా ||

అర్చాభావే తథా వేద్యాం స్థలే పూర్ణఘటే తథా | నదీతీరేథ కమలే కేశవం పూజయే న్నరః ||

సర్వా7 శుభానాం పరిఘాత కారి సంపూజనం దేవవరస్య విష్ణోః |

కృత్వా నఘాన్‌ క్షప్రమను ప్రయాతి యత్రైకతాం యాతి పితామహస్య ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే దేవకర్మా ధ్యాయోనామ నవతి తమో7ధ్యాయః || 90 ||

పుష్కరుడనియె. స్నానమాచరించి చక్కగ నాచమనముసేసి శుచియై దేవతార్చన గృహముం బ్రవేశించి భక్తితో మనసునిల్పి నమస్కారము సేయవలెను. ''అపోహిష్ఠామయోభువః'' అను మొదలు మూడుమంత్రములు చదివి దేవత కర్ఘ్యమీయవలెను. ''హిరణ్యవర్ణా'' అను మూడుమంత్రములతో పాద్యము ''శన్నాఅపః'' అను మంత్రములతో సౌదామన మీయనగును. ''ఇదమాపః ప్రవహత'' అనునది స్నాన మంత్రము. ''రథే అక్షేషుచ'' అనునది మొదలు నాల్గు మంత్రలతో అనులేపనము (గంధము) సమర్పింపవలెను. ''యువాసువాస'' అనునది వస్త్రమర్పణ మంత్రము, పుష్పము ''పుష్పవతి'' మంత్రముతో ''దూరసి'' అను మంత్రముతో ధూపము ''తోజోని శుక్రమసి'' అనుదానితో దీపము ''దధ్రికావ్ణో'' అనుదాన మధుపర్కము ''హిరణ్యగర్భ'' యను నెనిమిది మంత్రములతో నివేదనము అన్నము పరిమళముగల పానీయము చామరము వ్యజనము (విసనకర్రతోవీచుట) మాత్రను = భూషణమును, ఛత్రమును, యానము ఆసనము మఱియే యుపచారములనైన సావిత్రమంత్రముతో నివేదింపనగును. పురుషసూక్తమును జింపవలెను. దానితోనే హోమముగూడ సేయవలెను, అర్చాభావమందు, అనగా విగ్రహము నిలిపి పూజసేయు నవకాశము లేనప్పుడొక వేది (అరుగు) మీద లేదా యొక చోటున లేదా పూర్ణకుంభమున లేదా నదీతీర మందొక కమలముమీద కేశవుని ఆహ్వానించి పూజింపవలెను, విష్ణు పూజనము సర్వాశుభములను దొలగించును, ఇదిసేసినవాడు బ్రహ్మతో సాయుజ్యము నందగల పుణ్యలోకములకు త్వరగా నేగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమునందు దేవకర్మాధ్యాయమను తొంబదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters