Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదిరెండవ అధ్యాయము - వైశ్వదేవకథనము

పుష్కరః తతోగ్ని శరణం గత్వా స్మార్తేగ్నౌ విధి పూర్వకమ్‌ | వైశ్య దేవంతు కర్తవ్యం హుతోత్సృష్టంతు తాకికే ||

యత్ర క్వచన వా రామః దీప్యమానే థదోదకే || పరిసమూహ్య పర్యుక్ష్య పరిస్తీర్య పరిస్తరేత్‌ ||

సర్వాన్న మగ్నా వుద్ధృత్య జుహుయాత్‌ ప్రయత న్తతః | వాసుదేవాయ దేవాయ ప్రభ##వే చావ్యయాయ చ ||

ఆగ్నయే చైవ సోమాయ మిత్రాయ వరుణాయ చ | ఇంద్రాయ చ మహాభాగః ఇంద్రాగ్ని భ్యాంతధైవ చ ||

విశ్వేభ్య శ్చైవ దేవేభ్యః ప్రజానాం పతయే తధా | అనుమత్యై తథా రామ! ధన్వంతరిణ ఏవ చ ||

వాస్తోష్పత్యై తధా దేవ్యై తతః స్విష్టకృతేగ్నయే | చతుర్ధ్యంతేన నత్వా చ హుత్వైతేఖ్యో బలిం హరేత్‌ ||

తక్షోపతక్షా వభితః పూర్వేణా గ్నిమతః పరమ్‌ | అంబా నామాని ధర్మజ్ఞః దుర్గానామాని చాప్యథ ||

నివన్తీ చ పనీకా చ ప్రభవన్తీ తధైవ చ | మేధవన్తీ చ నామాని సర్వేషా మేవ భార్గవ! ||

ఆగ్నేయాది క్రమేణాథ తత స్సూక్తిషు నిక్షిపేత్‌ || నిర్దిత్యై వసుభాగ్యైచ సుమంగలైన భార్గవ! ||

భద్రంకర్యై తతో దత్వా స్థూణాయై మచ తధా శ్రియై | హిరణ్యకేశ్చై చ తథా వనస్పతయ ఏవ చ ||

ధర్మాధర్మాభ్యాం చ ద్వారే గృహ మధ్యే ధ్రువాయ చ | మృత్యవే చ బహిర్దద్వా ద్వరుణాయోదకా೭೭శ##యే ||

భూతేభ్య శ్చ బహి ర్దద్యాత్‌ శరణ ధనదాయ చ | ఇంద్రా యేంద్ర పురుషేభ్యో దద్యా త్పూర్వేణ మానవః ||

యమాయ్యతత్పరుషేభ్యో దద్యా ద్దక్షిణత స్తతః | వరుణాయ తత్పురుషేభ్యో దద్యా త్పశ్చిమత స్తతః ||

సోమాయ సోమపురుషేభ్యః ఉద గ్దద్యా దన న్తరమ్‌ | బ్రహ్మణ బ్రహ్మ పురుషేభ్యో మధ్యే దద్యా త్తధేవ చ ||

ఆకాశే చ తధైవోర్థ్వం స్థండిలే చ తధా క్షిపేత్‌ | దివాచరేభ్య శ్చ దివా రాత్ర్‌ రాత్రించయరాయ చ ||

బలిం బహి స్తథా దద్యా త్సాయం ప్రాతస్తు ప్రత్యహమ్‌ | పిండ నిర్వాపణం కార్యం సాయం, ప్రాత ర్న కారయేత్‌ ||

దేవతార్చన యైన తర్వాత నగ్నిశాలకేగి స్మార్తాగ్ని యందు వైశ్వదేవ మొనరింప వలెను. హోమము కాగా మిగిలిన దానిని ప్రజ్వలించు లౌకికాగ్నియందయినం హోమము చేయవచ్చును. తొలుత పర్యు క్షణముసేసి (ఉదకము చల్లి నలుమూలలం దుడిచి) పరిసమూహనముసేసి పరిస్తరించి (దర్భలను ప్రాగ్దిక్కు మొదలగు నలుదిక్కుల నగ్నియందు పరచి) అన్నమంతయు నుద్ధరించి నియమము నూని హోమము సేయవలెను. దేవుడగు వాసుదేవునకు ప్రభువునకు అవ్యయునకు విశ్వదేవతలకు ప్రజాపతికి ఇంద్రునకు ఇంన్డ్రాగ్నులకు అనుమతికి ధన్వంతరికి వస్తోష్పతికి దేవికి స్విష్టకృ దగ్నికి చతుర్దీ విభక్త్యంతముగా నామము పేర్కొని నమస్కరించి హోమము సేసి వీరందఱకు బలిప్రక్షేపణము సేయవలెను. ఆ బలిని తక్ష+ఉపతలక్షకు, చుట్టు, అగ్నికి తూర్పున వేయవలెను. ఆ మీద అంబానాసములు ( దేవీ నామములు) దుర్గా నామములు నీవన్తీ, పనీకా, ప్రభవంతీ, మేధవన్తీ నామముల సంవుటితో నందరు దేవతల నుద్దేశించి హోమము సేయవలెను. హోమముసేసి అవ్వల అగ్నేయాదిగర్జసూక్తు (దిక్కు) లందు నిర్దితకు పసుభాగికి సుమంగలికి భద్రంకరికి స్థూణకు శ్రీకి (లక్ష్మికి) హిరణ్యకేశికి వనస్పతీకిని బలి నిక్షేపము సేయవలెను. ధర్మ-అధర్మ దేవతలకు ద్వారమందు, గృహ మధ్యమందు ధ్రువునికి, ద్వారము వెలుపల మృత్యు దేవతకు, వరుణునకు జలాశయముందు, భూతముల కింటి వెలుపలను కుబేరుని కింటి యందు. నింద్రునికి నింద్రపురుషులకు (ఇంద్రపరిపార దేవతలకన్నమాట.) తూర్పునను, యమునికి నాయన పరివారమునకు దక్షిణ దిశను, వరుణునికి వరుణుని పరివారమునకును, బడమటి దెసను, సోమునికి, సోమ పరి వారపురుషులకునుత్తరమునను బలినీయవలెను. 'బ్రహ్మకు బ్రహ్మ పరివారమునకు నడుమును, దివాచరులగు దేవతలకు పగలు మీదుగ నాకాశమందును, స్థండిల మందు, భూమిమీద, (మిట్ట నేలమీదను) రాత్రించరులకు రాత్రివేళ బలి ప్రక్షేపము సేయ వలెను. ప్రతి దినము సాయం ప్రాతఃకాలమునందు గృహము వెలుపల బలి వేయవలెను. పిండ నిర్వాపణము సాయంకాలమే చేయ చేయవలెను. ప్రాతఃకాలమందు గూడదు.

పిత్రేతు ప్రథమం పిండం తత్పిత్రే తదనన్తరమ్‌ | తతో దత్యా చ్చ తత్పిత్రే మాత్రేచ దనంతరమ్‌ ||

పితృమాత్రే తత్‌ దద్యాత్‌ తత్‌ శ్వశ్త్వ్రతదనన్తరమ్‌ | దక్షిణాగ్రేషు దర్భేషుసలిలేషు విశేతషతః ||

యత్కించిత్‌ దృశ్యతే గేహే భక్ష్యం వా భోజ్య మేవవా | నివేదయే చ్చ తత్సర్వం శుభం పానం విశేషతః ||

పుషై#్పర్ధూపేన దీపేన పూజయే త్సతతం పితృన్‌ | నామ గోత్రే సదా వాచ్యే పిండ నిర్వాపణ తథా ||

పిండం దద్యాచ్చ కాకానాం తత్ర మంత్రమిమం పరేత్‌ | ఐంద్రావరుణ వాయవ్యా యామ్యావై నైరృతా స్తథా ||

తే కాకాః ప్రతి గృహ్ణన్తు ఇమం పిండం మయోద్ధృతమ్‌ | తతః పిండం శునాం దచ్యా న్మంత్రం తత్ర నిబోధ మే ||

వైవస్వతకులే జాతౌ ద్వౌ శ్యామ శలలౌ శునౌ| తాభ్యాం పిండం ప్రదాస్యామి పథి రక్షంతు మాం సదా||

తతో గ్రాసం గవాం దద్యాదత్ర మంత్రం నిబోధమే | సౌరభేయ్యఃనః సర్వహితాః పవిత్రాః పాపనాశకాః ||

ప్రతి గృహ్ణన్తు మేగ్రాసం గావ సై#్రలోక్య మాతరః | తతః స్వస్త్యయనం కార్యం భిక్షాదేయా చ భిక్షువే ||

దత్వాతు సంస్కృతాం భిక్షాం గోదానఫల మప్నుయాత్‌ | బాలం సువాసినీం వృద్ధాం గర్భిణ్యాతుర కన్యకాః ||

భృత్యాం శ్చభోజయే ద్రామ! పూజయిత్వా తథతిధీన్‌ | నైక గ్రామిణ మతిథిం విద్యాన్నాబ్రాహ్మణం తధా ||

అతిథిం భోజయే త్పూర్వం తతో భృత్యాంశ్చ భోజయేత్‌ ||

రాజన్య మథ వా వైశ్యం శూద్రం వా ద్విజ సత్తమ! ||

వైశ్వదేవే చ సంప్రాప్తం భృత్త్యె స్సహచ భోజయేత్‌ | వయోభ్య శ్చ తథా దద్యా చ్చాండాలేభ్యస్తధా భువి || 29

తండ్రికి మొదటి పిండము తాతకు తరువాతచు ఆ తరువాత ముత్తాతకు పిండము నొసంగ వలెను. ఆమీద తల్లికి పితా మాహికి ప్రపితామహికిని దక్షిణాగ్రములైన దర్భములందు పిండ ప్రదానము సేయవలెను. ఉదకములందు పిండ ప్రదానము చాల విశేషము. ఇంటిలో భక్ష్యము=పిండివంట, భోజ్యము తినదగిన అన్నాది పదార్థమేకొంచెమున్నను దానినంతను నివేదింప వలెను. శుభమయిన పానము (పానీయ ద్రవ్యములు తేనె మొదలయినవియు) సమర్పింప వలెను. పితృ దేవతలను పుష్పములతో ధూపదీపములతో నెల్లపుడు పూజింప వలెను. పిండ నిర్వాపణము సేయునెడ వారి నామము గోత్రము సెప్పవలెను. కాకులకును పిండము నొసగింపవలెను. (కాక బలి యన్నమాట) అప్పుడీ మంప్రము పఠింప వలెను. ఐంద్ర (తూర్పున) వరుభ (పడమట) వాయవ్య =వాయవ్యమూల యామ్య=దక్షిణ దిశ నైరృత నిరృతి మూలను నుండు. నాయాకాకులీనే నెత్తివేసిన పిండము గ్రహించును గాక! అనునది యీ మంత్రము యొక్క భావము. ఆ మీద శునకములకు బలి ( శ్వానబలి) పిండమీయ వలెను. అప్పడు మంత్రము వైవ స్వత కులమునం బుట్టిన రెండు కుక్కలు గలవు. ఒకటి నల్లనిది ఒకటి శబలము (పెక్కు రంగులు) గలది. వానికిదిగోపిండము పెట్టుచున్నాను. దారింబోవు నన్ను రక్షించుగాక! అని భావము, అటుపై గోవులకు గ్రాసము=మేత పెట్టవలెను. సర్వహితమైనవి పవిత్రములు, పాపనాశకములు ముల్లోకములకు తల్లులునైన గోవులు నావెట్టిన గ్రాసమును (మేతను) గ్రహించును గాక! అనునది మంత్రార్థము ఆ మీద స్వస్త్యయనము=మంగళా ంరణము (స్వస్తివాచనము.) సేయవలెను. ఆవ్వల భిక్షునకు (సన్న్యాసికి) భిక్షవెల్టవలెను. వై శ్వదేవముచే-సంస్కృతమైన (పవిత్రమయిన) భిక్షనొసగుట వలన గోదానము సేసిన ఫలమందును. బాలుడు సువాసిని గర్భిణి అతురులు (రోగాదులచే పీడితులయిన వారు) కన్యలు భృత్యులు (సేవకులు) మొనలయిన వారికి భోజనము పెట్టవలెను. అట్లే అతిధి పూజ చేయవలయును. ఏకగ్రామవాసియు ఆబ్రాహ్మణుడునతిధియనదగడు. ఇతర గ్రామమునుండి వచ్చిన వాడే యతిథి. బ్రాహ్మణతరుని నతథి యనరాదు. అతిథులకుముందు భోనము నొసంగి తర్వాత భృత్యులకు బెట్టవలెను. వైశ్వదేవ సమయమున వచ్చిన క్షత్రియుని వైశ్శుని శూద్రుని భృత్యులతో పాటు భుజింప జేయవలెను. ఆ మీద పక్షులు, చండాలులకు భూమిపై నన్నము వెట్టవలెను.

సాధారణం తత్‌ సర్వేషాం శేషకం గృహిణాం గృహే | వైశ్వదేవే చ సంప్రాప్తే న కంచి దవమానయేత్‌ ||

ఆదాయ సుకృతం యూతి భగ్నాశ శ్చాతిధి ర్గతః | అధ్వనా యస్తు భగ్నాయ బ్రాహ్మణాయ తథా దివి ||

సత్కృత్య భోజనం దద్యాత్‌ తేన స్వర్గే మహీయతే | దేవా బ్రాహ్మణ రూపేణ చరన్తి పృధివీ మిమామ్‌ ||

తస్మాత్సంప్రాప్త మతిథిం ప్రయత్నేన తు పూజయేత్‌ | అతిథిం పూజయే చ్ఛాగ్రే దశగోద ఫలం లభేత్‌ ||

పాద శౌచం తతోదత్వా ప్రాప్తాయాతిథయే గృహే | గోదాన ఫల మాప్నోతి దత్వాచైవ తథా సనమ్‌ ||

ప్రతిశ్రయ ప్రదానేన నాక పృష్ఠే మహీయతే | తాలవృంతానిలం కృత్వా తథా ప్రాప్తాయ మానవః ||

గోదాన ఫల మాప్నోతి వాయులోకం స గచ్ఛతి | తాల వ్యజన హస్తస్తు కృత్వా తదభి చారణమ్‌ || 36

వైశ్వదేవ శేషము ఇంట నున్న యందరికిని సర్వసాధారణము, అది యందరును దినదగినది. వైశ్వదేవ సమయమున వచ్చిన యెవ్వరిని నవమానింప గూడదు, ఇంటికి వచ్చిన యతిథి భగ్నాశుడై (ఆశ తీరక-భోజనము సేయక) వెనుదిరిగి పోవునేనియాతడా యజమాని పుణ్యమును వెంటగొనిపోవును. గృహస్థుడు దారితప్పిబోవు బ్రాహ్మణునికి పగటి పూట సత్కరించి భోజనము పెట్టెనేని యాసుకృతమముచే నతడు స్వర్గమందు సత్కరింప బడును. దేవతలీభూమిపై బ్రాహ్మణరూపమున జరించు చుందురు! అందుచే నింటికేతెంచిన యతిథినిముందుగా సర్వప్రయత్నముల చేతను బూజింప వలెను. అట్లతీథి పూడ సేయనతుడు పది గోవుల దానమిచ్చిన ఫలమనుభవించును. ఇంటికి వచ్చిన యతిథికి పాద్యము (కాళ్ళు కడిగికొనుటకుదకము) నిచ్చినను కూర్చుండుట కాసన మిచ్చినను నా యిచ్చిన పుణ్యాత్ముడు గోదాన ఫలమందును. ఆశ్రయమిచ్చుటచే స్వర్గమున గౌరవింపబడును. వచ్చిన యతిథికి తాటాకు విసన కఱ్ఱతో విసరినచో గోదాన పుణ్య మందును. వాయులోకమేగును.

అతిధౌ భోజనే ప్రాప్తే గోదానపల మాప్నుయాత్‌ | శీతా೭೭హతా తిథిం ప్రాప్య కాష్ఠాన్‌ ప్రజ్వాలయన్నరః ||

ప్రతాపయన్‌ మహాభాగ! దశ##ధేను ఫలం లభేత్‌ | కాయాగ్ని దీప్తి మప్నోతి ప్రాకాశ్యం పరమం తథా ||

తృష్ణా೭೭ర్తా యోదకం దత్వా పానే గోదాన మాప్నుయాత్‌ |

శ్రాంత్‌ సంవాహనం కృత్వా ధేను దాన ఫలం లభేత్‌ ||

రోగిణఃపరి చర్యాంచ కృత్వా దశగుణం లభేత్‌ | పాదా భ్యంగం నరః కృత్వా ప్రాప్తాయాతిథయే నరః ||

గోదాన ఫల మాప్నోతి నాగలోకం చ గచ్ఛతి | ప్రతిశ్రయం తథా దీపం దత్వాచాతిథయే నరః ||

ధేనుదానపలం ప్రాప్య సూర్యలోకే మహీయతే | చక్షుష్మాం శ్చ విబోధ శ్చైవ జాయతే ||

శయనీయ ప్రదానేన వసుదాన ఫలం లభేత్‌ | దంత కాష్ఠ ప్రదానేన సౌభాగ్యం మహ దాప్ను యాత్‌ || 43

శౌచో దక ప్రదానేన గోదాన ఫల మాప్నుయాత్‌ | మృత్ప్రదానేన ధర్మజ్ఞ! విరోధో నాభి జాయతే ||

దత్వానులేపనం మాలాం పరాం లక్ష్మీముపాసతే | తధౌ షధి ప్రదానేన విరోగస్త్వభి జాయతే ||

స్నానాభ్యంగ ప్రదానేన రూపవా నభి జాయతే | తధా స్నానీయ దానేన గంధర్త్వ స్యహ మోదతే ||

స్నానోదక ప్రదానేన వారుణం లోక మాప్నుయాత్‌ | ఉపానహ ప్రదానేన విమాన మధి రోహతి ||

éతధా ఛత్రం ప్రదానేన గణాపత్య మవాప్నుయాత్‌ | వస్త్ర ప్రదానా ద్భవతి రూపవాన్‌ సుభగ స్తథా ||

అశ్వమేథ మవాప్నోతి తధా భూమిప్రదో వరః | యానదః స్వర్గ మాప్నోతి పౌండరీక పదం తధా ||

వారిధానీ స్తధా దత్వా పూర్ణా శ్శీతేన వారిణా | సర్వా సభక్షాః ప్రాప్నోతి గోలోకం మానుషోత్తమ! ||

త్రపుషై ర్వారిణాయొకై శ్శర్కారా ఘృత సంయుత్తెః | సక్తుభి ర్లవణోపేత్తె ర్ఘృత్తె ర్హిరిత సంయుతైః ||

తర్చయిత్వాతిథిం సమ్యక్‌ వారిథాన్యైశ్చ గోరసైః | గోలోకం చిర మాప్నోతి నాత్ర కార్యా విచారణా ||

తృప్తి మాప్నోతి చ తథా యత్ర యత్రాభి జాయతే | కిమిచ్ఛకేన సంయోజ్య చాశ్వ మేథఫలం లభేత్‌ ||

తాంబూలస్య ప్రదానేన గంధర్వైస్సహ మోదతే | తృప్తమభ్యాగతం కృత్వా స్వర్గలోకే మహీయతే ||

ఇతిహాసా నథా శ్వావ్య గోదాన ఫల మాప్నుయాత్‌ | గోప్రదానేన విత్తేన తోషయిత్వా తధాతిధిమ్‌. ||

మహ త్ఫల మవాప్నోతి గంధర్వై స్సహ మోదతే | అనుప్రజ్యాతిథిం రామ! గోదాన ఫల మాప్నుయాత్‌ ||

తస్మాత్‌ సర్వ ప్రయత్నేన పూజయే దతిథిం సదా || రాజన్యా విప్రదైవత్యా నార్యశ్చ పతిదేవతాః ||

గృహస్థోతిథి దైవత్యః తస్మాత్తం పూజయే త్సదా ||

సతత మిహ నరోయః పూజనం చాతిధీనాం తృణ జల మృదు వాక్యైః సారశక్త్యా విదధ్యాత్‌ |

సుర సదసి స పూజ్యో దేవతానాం తథా స్యాత్‌ | భవతి చ నరలోకే జాయమానస్సమృద్ధః||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే వైశ్వదేవ కధనంనామ ద్వినవతి తమోధ్యాయః ||92||

భోజనమునకు వచ్చిన యతిథిని విసనకఱ్ఱతో నిసరినను, అతనికేరీతినైన (నభిచరించినను) సేవసేసినను గోదాన ఫలమందును. చలికి వడంకుచు వచ్చిన యతిధికి చలి మంట నేర్పరచి వెచ్చతనము గూర్చి పది ధేనువు లిచ్చిన పుణ్యమందును (ధేనువు=అప్పుడే యీనిన ఆవు) ఆయుపచారముచే మేనిలోని యగ్ని యుద్దీపించును. దప్పిక గొన్నవానికి మంచినీళ్ళిచ్చిన గోదాన ఫలమొనగూడ్చును. అలసి వచ్చిన యాతతికి సంవాహనము (కాళ్ళు పట్టుట మొదలగునవి) సేసినను గోదాన ఫలమగును. రోగియైన వానికి పరిచర్య చేసిన పది రెట్లు ఫలమందును. ఇంటికి వంచ్చిన యతిథికి పాదములకు నూనె రాసి యొత్తినను గోదాన ఫలముగలుగుటయే కాదు నాగ లోకమున కేగును. అతిథికి ఆశ్రయము దీపమున నిచ్చిన గోదాన పుణ్యముతో బాటు సూర్య లోకమున సుఖించును. చక్కని నేత్రపటిమ, ప్రకాశము. విజ్ఞానమును పొందును. అతిథికి శయ్యనిచ్చినవసు (ధన) దాన ఫల. మగును. దంత కాష్ఠ మిచ్చిన సఖండ సౌభాగ్యము నందును. శౌచమునకు ఉదక మిచ్ఛిన గోదాన పుణ్యమందును., మృత్తు (శౌచార్థము) మట్టినిచ్చిన నెవ్వరితో నేని విరోధ మొందడు. పూతకు గంధమును పూల మాలను నిచ్చిన పరమైశ్వర్య మందును. ఓషధులు (మందులు మూలికలు) నిచ్చిన విరోగు గు డగును. స్నానముతలంటు సమమకూర్చి రూపవంతుడగును. స్నానీయముల యిన నూనె పరిమళ ద్రవ్యముగల సున్ని పిండి మొదలయినవి యిచ్చిన గంధర్వులతోగూడి యానందించును.స్నానార్థముదకమిచ్చిన వరుణలోకమున సుఖియగును. చెప్పులిచ్చిన విమానమెక్కును. గొడుగునిచ్చిన గాణాపత్యమొందును. వస్త్రము లిచ్చిన నందగాడు సుభగుడు(సౌభాగ్యవంతుడు) అగును. భూమి నిచ్చిన అశ్వమేధ ఫలమందును. యానము (బండి మొదలయినవి) ఇచ్చిన పౌండరీకము సేసినందు వలన వచ్చు. స్వర్గమునందును. చల్లని నీరు నింపిన జలప్రాతములను సర్వభక్ష్యములతో నిచ్చిన గోలోకమందును. త్రపుషములు నీటితో నింపి పంచదార నెయ్యి మొదలయిన వానితో నుప్పుతోను పేలపిండ్లతోను నేతులతోను గోరసముల తోను చక్కగ నతిధిని సంతృప్తి పరచినచో జిరకాల గోలోక శుఖావాసము నందును. ఇందు సందేహములేదు. దేనిమీద నభిలాషగలదో దాని నెల్ల నతిదికి నిచ్చిన పుణ్యుడశ్వమేధఫలమందును. తాంబూలదానము సేసినచో గంధర్వులతో నానందించును. అతిధికి సంతృప్తిని చేసిన యాతడు స్వర్గమున గౌరవింపబడును. ఇతిహాస కంథలువినింపించిన గోదాన ఫలమందును. గోదానముసేసి విత్తమిచ్చి సంతోష పెట్టినవాడు మహాఫలమందును. గంధర్వానంద మొందును. పరశురామ మూర్తీ అతిధి వెంట నించుక వెంబడించినచో గోదాన పుణ్యమగును. అందువలన సర్వ ప్రయత్నములచే నతిథిని బూజింప వలెను. రాజులు విప్రదైవత్యులు. స్త్రీలు పతిదేవతలు గృహస్థులతిధి దైవత్యులు. కావున గృహయజమాని యతిథులను దేవతలిట్లు పూజింపవలెను. ఏ నరుడతిథులను తృణజల మృదు మదుర భాషణములచే సారభూతమైన శక్తిచే (శక్త్యనుసారము) పూజించునో యాతడు స్వర్గమందు దేవతలకే పూజ్యుడైయవని నవతరించి సర్వసంపత్స మృద్ధుడగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున వైశ్వదేవ కథనమను తొంబదిరెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters