sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
10. దశమోzధ్యాయః - జాతి సంబంధ నిర్ణయము సౌతి రువాచ - శ్రీ సౌతిమహర్షి ఇట్లు పలికెను- భృగోః పుత్రశ్చచ్యవనః శుక్రశ్చ జ్ఞానినాం వర | క్రతోరపి క్రియా భార్యా వాలఖిల్యానసూయత || 1 త్రయః పుత్రాశ్చాంగిరసః బభూవుర్ముని సత్తమాః | బృహస్పతి రుతథ్యశ్చ శంబరశ్చాపి శౌనక ||
2 వసిష్ఠస్య సుతః శక్తిః శ##క్తేః పుత్రః పరాశరః | పరాశరసుతః శ్రీమాన్ కృష్ణద్వైపాయనో హరిః ||
3 వ్యాసపుత్రః శివాంశ్చ శుకశ్చ జ్ఞానినాం వరః | విశ్వశ్రవాః పులస్త్యస్య యస్యపుత్రో ధనేశ్వరః || 4 ఓ శౌనకమహర్షీ! భృగువు యొక్క పుత్రులు చ్యవనుడు, శుక్రుడు. క్రతుమహర్షి, అతని భార్యయైన క్రియకు వాలఖిల్యులు పుట్టిరి. అట్లే అంగిరసునికి బృహస్పతి, ఉతథ్యుడు, శంబరుడను ముగ్గురు పుత్రులు కల్గిరి. వసిష్ఠుని పుత్రుడు శక్తి, అతని పుత్రుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు కృష్ణద్వైపాయనుడను వేదవ్యాసుడు. ఆతని పుత్రుడు శ్రీశుకుడు, పులస్త్య మహర్షికి విశ్వశ్రవసుడు అతని పుత్రుడు ధనాధిపతియైన కుబేరుడు. శౌనక ఉవాచ- శౌనక మహర్షి ఇట్లనెను- అహోపురాణ విదుషాం అత్యంతం దుర్గమం వచః | న బుద్ధం వచనం కించిత్ ధనేశోత్పత్తిపూర్వకం || 5 అధునా కథితం జన్మ ధనేశ##స్యేశ్వరాదిదం | పునర్భిన్నక్రమం జన్మ బ్రవీషి కథమేవ మాం || 6 పురాణములు బాగుగా తెలిసిన మీమాటలు నాకు అర్థముగాకున్నవి. ఇంతకుముందు కుబేరుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని వలన పుట్టినట్లు చెప్పినారు. కాని ఇప్పుడు చెప్పిన పద్ధతి దానికి పూర్తిగా భిన్నముగా నున్నది. దీనికి కారణమేమిటి? తెల్పగలరు. సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను- బభూవురేతే దిక్పాలాః పురా చ పరమేశ్వరాత్ | పునశ్చ బ్రహ్మశాపేన స చ విశ్రవసస్సుతః || 7 గురవే దక్షిణాం దాతుముతథ్యశ్చ ధనేశ్వరం | యయాచే కోటి సౌవర్ణం యత్నతశ్చ ప్రచేతసే || 8 ధనేశో విరసో భూత్వా తసై#్మ తద్దాతుముద్యతః | చకార భస్మసాద్విప్ర పునర్జన్మ లలాభ సః || 9 తేన విశ్రవసః పుత్రః కుబేరశ్చ ధనాధిపః | రావణః కుంభకర్ణశ్చ ధార్మికశ్చ విభీషణః || 10 పులహస్య సుతో వాత్స్యః శాండిల్యశ్చ రుచేస్సుతః | సావర్ణిర్గౌతమాజ్జజ్ఞే మునిప్రవర ఏవ సః || 11 కాశ్యపః కశ్యపాజ్జాతః భరద్వాజో బృహస్పతేః | (స్వయం వాత్స్యశ్చ పులహాత్సావర్ణిర్గౌతమాత్తథా || 12 శాండిల్యశ్చ రుచేః పుత్రః మునిస్తేజస్వినాం వరః | బభూవుః పంచగోత్రాశ్చ ఏతేషాం ప్రవరా భ##వే || 13 బభూవుర్ర్బహ్మణో వక్త్రాదన్యా బ్రాహ్మణ జాతయః | తాః స్థితా దేశ##భేదేషు గోత్రశ్చ శూన్యాశ్చ శౌనక || 14 చంద్రాదిత్యమనూనాం చ ప్రవరాః క్షత్రియాః స్మృతాః | బ్రహ్మణో బాహుదేశాచ్చైవాన్యాః క్షత్రియజాతయః || 15 ఊరుదేశాచ్చ వైశ్యాశ్చ పాదతః శూద్రజాతయః | తాసాం సంకరజాతేన బభూవుర్వర్ణ సంకరాః || 16 పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని వలన దిక్పాలకులందరు ఆవిర్భవించిరి. బ్రాహ్మణ శాపము వలన ధనేశుడైన కుబేరుడు తిరిగి విశ్రవసు పుత్రుడుగా జన్మించెను. ఏవిధముగా అంటే పూర్వము ఉతథ్యుడను బ్రాహ్మణుడు విద్యను పూర్తి చేసి గురువుకు దక్షిణ ఇవ్వవలెనని కుబేరుని దగ్గరకు వెళ్ళి కోటి సువర్ణములు (నాణములు) యాచన చేసెను. కాని కుబేరుడు ఉతథ్యుని కోరికను సంతోషముతో మన్నించక ఇవ్వక తప్పదన్నట్లుగా వాటిని ఇచ్చుటకు ప్రయత్నించెను. అందువలన ఉతథ్యుడతనిని భస్మమగునట్లు శపించెను. ఆవిధముగా భస్మమైన కుబేరుడు విశ్రవసుని పుత్రుడుగా పునర్జన్మను పొందెను. అట్లే విశ్రవసునకు రావణుడు, కుంభకర్ణుడు, ధార్మికుడైన విభీషణుడు అనువారు కూడా పుత్రులుగా జన్మించిరి. పులహునకు వాత్స్యుడనువాడు, రుచికి శాండిల్యుడు, గౌతమునకు సావర్ణి, కశ్యపుడు, బృహస్పతికి భరద్వాజుడు, అను పుత్రులు కలిగిరి. ఈ ఐదుగురి వలన ఆయా గోత్రములు, ప్రవరలు జరిగినవి. బ్రహ్మదేవుని ముఖమునుండి ఇతర బ్రాహ్మణ జాతులు ఉద్భవించినవి. వారు ఆయా ప్రదేశములయందు గోత్రములు లేకను ఉన్నారు. చంద్రుడు, సూర్యుడు, మనువుల గోత్రములనుండి క్షత్రియులు పుట్టినారు. బ్రహ్మదేవుని బాహువులనుండి ఇతర క్షత్రియజాతులు పుట్టినవి. అట్లే బ్రహ్మదేవుని తొడలనుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రజాతులు పుట్టినవి. ఆ నాల్గు జాతుల సంకరమవలన వర్ణ సంకరములు జరిగినవి. గోప నాపిత భిల్లాశ్చ, తథామోదక కూబరౌ | తాంబూలి స్వర్ణకారౌ చ వణిగ్జాతయ ఏవ చ || 17 ఇత్యేవమాద్యా విప్రేంద్ర సచ్ఛూద్రాః పరికీర్తితాః | శూద్రావిశోస్తు కరణః అంబష్ఠో వైశ్యద్విజన్మనోః || 18 విశ్వకర్మా చ శూద్రాయాం వీర్యాధానం చకార సః | తతో బభూవుః పుత్రాశ్చ నవైతే శిల్ప కారిణః || 19 మాలాకారః శంఖకారః కర్మకారః కువిందకః | కుంభకారః కాంస్యకారః షడేతే శిల్పినాం వరాః || 20 సూత్రకారశ్చిత్రకారః స్వర్ణకారస్తథైవ చ | పతితాస్తే బ్రహ్మశాపాదయాజ్యా వర్ణసంకరాః || 21 గోవులను కాచువాడు, మంగలి, భిల్లుడు, మోదకుడు, కూబరుడు, తాంబూలమిచ్చువాడు, స్వర్ణకారుడు వీరందరు వైశ్యజాతికి చెందినవారు. వీరిని సచ్చూద్రులందురు. శూద్రస్త్రీయందు వైశ్యునికి పుట్టినవాడు కరణుడు. వైశ్యేస్త్రీయందు బ్రాహ్మణునికి పుట్టినవాడు అంబష్ఠుడు. విశ్వకర్మకు శూద్రస్త్రీయందు శిల్పకారులైన తొమ్మిది మంది పుత్రులుదయించిరి. వారిలో మాలాకారుడు, శంఖకారుడు, కమ్మరి, కువిందకుడు (సాలెవాడు) కుమ్మరి, కంచరి అను ఆరుగురు శిల్పులలో శ్రేష్ఠులు, సూత్రకారుడు (వడ్రంగి) చిత్రకారుడు, స్వర్ణకారుడు బ్రహ్మశాపమువలన పతితులై యాగము చేయుటకు అనర్హులైనారు. శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను- కథం దేవో విశ్వకర్మా వీర్యాధానం చకార సః | శూద్రాయామధమాయాం చ కథం తే పతితాస్త్రయః || 22 కథం తేషు బ్రహ్మశాపో హ్యభవత్ కేన హేతునా | హే పురాణవిదాం శ్రేష్ఠ తన్నః శంసితుమర్హసి || 23 సౌతి మహర్షీ ! దేవుడైన విశ్వకర్మ శూద్రస్త్రీయందు పుత్రుల నేవిధముగా కన్నాడు. వారిలో ముగ్గురు ఎందువల్ల పతితులైనారు. వారికి ఎందువల్ల బ్రహ్మశాపము కలిగినది. ఈ విషయములన్ని పురాణములన్నీ తెలిసిన మహర్షీ! నాకు చెప్పుము. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు చెప్పెను. ఘృతాచీ కామతః కామం వేషవం చక్రే మనోహరం| తామపశ్యద్విశ్వకర్మా గచ్ఛంతీం పుష్కరే పథి || 24 ఆగచ్ఛత్తద్విలోకాచ్చ ప్రసాదోత్ఫుల్లమానసః | తాం యయాచే స శృంగారం కామేన హృతచేతనః || 25 రత్నాలంకార భూషాఢ్యాం సర్వావయవ కోమలాం | యథా షోడశవర్షీయాం శశ్వత్సుస్థిర ¸°వనాం || 26 బృహన్నితంబభారార్తాం మునిమానస మోహినీం | అతివేగకటాక్షేణ లోలాం కామాతిపీడితాం || 27 తచ్ర్చోణీం కఠినాం దృష్ట్యా వాయునాపహృతాంశుకాం | అతీవోచ్చైస్తనయుగం కఠినం వర్తులం పరం || 28 సుస్మితం చారువక్త్రం చ శరచ్చంద్రవినిందకం | పక్వబింబఫలారక్త స్వోష్ఠాధర మనోహరం || 29 సిందూరబిందు సంయుక్తం కస్తూరీబిందు సంయుతం | కపోలముజ్వలం శశ్వత్ మహార్హమణి కుండలం || 30 తామువాచ ప్రియాం శాంతాం కామశాస్త్రవిశారదః | కామాగ్నివర్ధనోద్యోగి వచనం శ్రుతిసుందరం || 31 ఘృతాచియను అప్సర అందమైన వేషము ధరించి పుష్కర ప్రాంతమున వెళ్ళుచుండగా విశ్వకర్మ ఆమెనుచూచెను. ఘృతాచి ఇతనిని చూడగానే వికసించిన మనస్సుతో ఆమె వెంటబడి మన్మథావిష్ట హృదయముతో శృంగార కార్యమునకు రమ్మని ఆమెను ప్రార్థించెను. రత్నాలంకార భూషణములు కలది, కోమలమైన సమస్తావయవములు కలది, పదునారు సంవత్సరముల స్త్రీవలె స్థిరమైన ¸°వనముతో నున్నది. పెద్దదైన నితంబ భారముతో బాధపడుతున్నది, మునుల మనస్సులను సహితము మోహింపజేయునది, కామముతో బాగా నిండినది, ఐన ఘృతాచిని, కఠినమైన ఆమె పిరుదులను, గాలివల్ల కొంగు ప్రక్కకు జరుగుటవలన కనిపించిన కఠినము, గుండ్రము, ఎత్తైన ఆమె చన్నులను, చిరునవ్వుతో శరత్కాల చంద్రుని అపహసించు ఆమె ముఖమును, పండిన దొండపండువలె అందమైన ఆమె అధరోష్ఠమును, సిందూరబిందువులు కస్తూరి బిందువులు, గొప్పనైన మణికుండలములతో ప్రకాశించు ఆమె చెక్కిళ్ళను చూచి కామశాస్త్రపండితుడైన విశ్వకర్మ కామాగ్ని పెంచునట్లు, వినసొంపైన మాటలు ఈవిధముగా పలికెను. విశ్వకర్మోవాచ- విశ్వకర్మ ఇట్లు పలికెను- అయి క్వ యాసి లలితే మమప్రాణాధికే ప్రియే | మమప్రాణాంశ్చాపహృత్య తిష్ఠ కాంతే క్షణం శుభే || 32 తవైవాన్వేషణం కృత్వా భ్రమామి జగతీతలం | స్వప్రాణాంస్త్యక్తుమిష్టోzహం త్వాం న దృష్ట్వా హుతాశ##నే || 33 త్వం కామలోకం యాసీతి శ్రుత్వా రంభాముఖోదితం | ఆగచ్ఛమహమేవాద్య చాస్మిన్వర్త్మన్యవస్థితః || 34 యుభ కాంతే మయా సార్థం యూనా కాంతేన శోభ##నే | విదగ్ధాయా విదగ్ధేన సంగమో గుణవాన్భవేత్ || 35 అహో సరస్వతీ తీరే పుష్పోద్యానే మనోహరే | సుగంధిమందశీతేన వాయునా సురభీకృతే || 36 స్థిర¸°వనసంయుక్తా త్వమేవ చిరంజీవినీ | కాముకీ కోమలాంగీ చ సుందరీషు చ సుందరీ || 37 మృత్యుంజయవరేణౖవ మృత్యుకన్యా జితా మయా | కుబేరభవనం గత్వా ధనం లబ్ధం కుబేరతః || 38 రత్నమాలా చ వరుణాద్వాయోః స్త్రీరత్నభూషణం | వహ్నిశుద్ధం వస్త్రయుగం వహ్నేః ప్రాప్తం మహోజసః || 39 కామశాస్త్రం కామదేవాద్యోషిద్రంజన కారణం | శృంగారశిల్పం యత్కించిల్లబ్ధం చంద్రాచ్చ దుర్లభం || 40 రత్నమాలాం వస్త్రయుగ్మం సర్వాణ్యాభరణాని చ | తుభ్యం దాతుం హృది కృతం ప్రాప్తం తక్షణమేవ చ || 41 గృహే తాని చ సంస్థాప్య చాగతోzన్వేషణ భ##వే | విరామే సుఖసంభోగే తుభ్యం దాస్యామి సాంప్రతం || 42 కాముకస్య వచః శ్రుత్వా ఘృతాచీ సస్మితా మునే | దదౌ ప్రత్యుత్తరం శీఘ్రం నీతియుక్తం మనోహరం || 43 నాయొక్క ప్రాణముల కన్న మిన్నయైన ఓ ప్రియురాలా! నా ప్రాణాలను అపహరించి ఎటు పోవుచున్నావు. కొద్దిసేపు ఇక్కడ ఆగుము. నిన్ను వెదకుచునే ఈ ప్రపంచమునంతా తిరుగుతున్నాను. నీవు కనిపించనిచో అగ్నిలో పడి నా ప్రాణములను తీసికొనుటకు సిద్ధమగుచున్నాను. నీవు మన్మథ లోకమునకు వెళ్ళినట్లు రంభ చెప్పగా విని ఇప్పుడే ఇక్కడికి వచ్చితిని. పుష్పోద్యానములతో అందమైనది. మందమారుతముచే సువాసనగల సరస్వతీనదీ తీరమున యువకుడు, అందగాడు ఐన నాతో రమించుము. అనుభవము కలవారి మధ్య జరుగు సంగమము చాలా గొప్పది. నీవు స్థిరమైన ¸°వనము కలదానవు, చిరంజీవివి, కాముకివి, కోమలాంగివి, సుందరస్త్రీలకు సుందరమైన దానవు. మృత్యుంజయుడైన పరమేశ్వరుని అనుగ్రహమువలన మృత్యువను జయించితిని. కుబేరుని భవనమునకు పోయి అమితమైన సంపదను పొందితిని. అట్లే వరుణుని నుండి రత్నమాలను, వాయువునుండి రత్నభూషణమును, అగ్నినుండి పరిశుద్ధమైన వస్త్రములజతను, మన్మథునివలన స్త్రీలను సంతోషపెట్టు కామశాస్త్రమును, చంద్రుని వల్ల దుర్లభ##మైన శృంగార శిల్పమును పొందితిని. రత్నమాలను, వస్త్రములజతను, ఇతరాభరణములను అన్నిటిని నీకు ఇవ్వవలెనని తలచి ఇక్కడకు వచ్చితిని. నిన్ను వెదకు సమయమున వాటినన్నిటిని ఇంటిలో పెట్టి వచ్చితిని. సుఖసంభోగానంతరము వాటినన్నిటిని నీకు ఇత్తును. అను కాముకుడైన విశ్వకర్మ మాటలు విని ఘృతాచి చిరునవ్వుతో నీతి యుక్తము మనోహరమైన ప్రత్యుత్తరమునిట్లిచ్చెను. ఘృతాచ్యువాచ- ఘృతాచి ఇట్లనెను- త్వయా యదుక్తం భద్రంతత్స్వీకరోమ్యధునా పరం | కింతు సామయికం వాక్యం బ్రవీష్యామి స్మరాతుర || 44 కామదేవాలయం యామి కృతవేషా చ తత్కృతే | యద్దినే యత్కృతే యామో వయం తేషాం చ యోషితః || 45 అద్యాహం కామపత్నీ చ గురుపత్నీ తవాzథునా | త్వయోక్తమధునేదం చ పఠితం కామదేవతః || 46 విద్యాదాతా మంత్రదాతా గురుర్లక్షగుణౖః పితుః | మాతుః సహస్ర గుణవాన్నాస్త్యన్యః తత్సమోగురుః || 47 గురోః శతగుణౖః పూజ్యా గురుపత్నీ శ్రుతౌ శ్రుతా | పితుః శతగుణం పూజ్యా యథామాతా విచక్షణా || 48 మాత్రా సమాగమే సూనోః యావాన్ దోషః శ్రుతౌ శ్రుతః | తతో లక్షగుణో దోషో గురుపత్నీసమాగమే || 49 మాతరిత్యేవ శ##బ్దేన యాం చ సంభాషతే నరః | సామాతృతుల్యా సత్యేన ధర్మః సాక్షీ సతామపి || 50 తయా హి సంగతో యస్స్యాత్కాల సూత్రం ప్రయాతి సః | తత్ర ఘోరే వసత్యేవ యావచ్చంద్ర దివాకరౌ || 51 మాత్రా సహ సమాయోగే తతో దోషశ్చతుర్గుణః | సార్థం చ గురుపత్న్యా చ తల్లక్షగుణ ఏవ చ || 52 కుంభీపాకే పతత్యేవ యావద్వై బ్రహ్మణో వయః | ప్రాయశ్చిత్తం పాపినశ్చ తస్య నైవ శ్రుతౌ శ్రుతం || 53 చక్రాకారం కులాలస్య తీక్షణధారం చ ఖడ్గవత్ | వసామూత్ర పురీషైశ్చ పరిపూర్ణం సుదుస్తరం || 54 శూలవత్కృమి సంయుక్తం తప్తమగ్నిసమం ద్రవత్ | పాపినాం తద్విహారం చ కుంభీపాకం ప్రకీర్తితం || 55 యావాన్దోషో హి పుంసాంచ గురుపత్నీసమాగమే | తావాంశ్చ గురుపత్న్యాం వై తత్ర చేత్కాముకీ యది || 56 అద్య యాస్యామి కామస్య మందిరం తస్య కామినీ | వేషం కృత్యా గమిష్యామి త్వత్కృతేzహం దినాంతరే || 57 ఓ విశ్వకర్మా! నీవు చెప్పిన మాటలనన్ని చక్కగా నేను గ్రహించితిని. కాని సందర్భోచితమైన మాటలు ప్రస్తుతము నీకు చెప్పుచున్నాను. నేనిప్పుడు అలంకరించుకొని కామదేవుని ఇంటికి అతని ప్రీతికై పోవుచున్నాను. మేము ఏ దినమున ఎవరి గురించి వెళ్ళుదుమో ఆ దినమున వారికి సంబంధించినవారము. ఈ దినమున నేను మన్మథుని భార్యను. నీకిప్పుడు గురుపత్నిని. ఎందువలననగా నీవిప్పుడే మన్మథుని దగ్గర చదువుకున్నట్లు చెప్పితివి. చదువు చెప్పిన గురువు, మంత్రము నిచ్చిన గురువు తండ్రికంటె లక్షలరెట్లు అధికుడు. తల్లి కంటె వేయి రెట్లు మిన్న. గురువు కన్న గురుపత్ని వందరెట్లు అధికముగ గౌరవించతగినది. విచక్షణాజ్ఞానము కల తల్లి, తండ్రికంటె వందరెట్లు ఎక్కువగా గౌరవించతగినది. మాతృ సంగమము చేసినచో ఎంత దోషము కల్గునో దానికి లక్షరెట్లు గురుపత్నీ సమాగమమువలన దోషము కల్గును. తల్లీ! అని ఏ స్త్రీని పురుషుడు పిలుస్తున్నాడో ఆమె నిజముగా తల్లితో సమానమైంది. ఆ స్త్రీతో సంగమించినవాడు నరకమునకు తప్పకపోవును. అక్కడ సూర్య చంద్రులున్నంతవరకు బాధలనుభవించగలడు. మాతృసంగమము పై దానికంటె నాలుగురెట్లు దుష్టమైనది. ఇక గురుపత్నీ సమాగమము పైదానికంటె లక్షరెట్లు నీచమైనది. బ్రహ్మకల్పమువరకు వాడు కుంభీపాకనరకమున పడి బాధపడును. అట్టి పాపికి ప్రాయశ్చిత్తనునది లేనేలేదు. కత్తివలె మిక్కిలి పదునైన చక్రాకారముననున్నది, వస, మూత్రము, పురీషములతో నిండి దాటుటకసహ్యమైనది, శూలములవంటి క్రిములతో కూడుకున్నది, బాగుగా వేడిచేసిన అగ్నితో సమానమైనది, పాపములు చేసినవారికి విహార భూమి, ఐన నరకమును కుంభీపాకమందురు. గురుపత్నీ సమాగమమున ఏ పాపముచెందునో, గురువును కామించిన స్త్రీతో సంగమించిన అంతటి పాపము చెందును. నేను మన్మథుని కామించి తదనుగుణమేషముతో అతని ఇంటికి పోవుచున్నాను. నేను నీ దగ్గరకు ఇంకొక దినము రాగలను అనెను. ఘృతాచీవచనం శ్రుత్వా విశ్వకర్మా రురోష తాం | శశాప శూద్రయోనిం చ వ్రజేతి జగతీ తలే || 58 ఘృతాచీ తద్వచః శ్రుత్వా తం శశాప సుదారుణం | లభ జన్మ భ##వే త్వంచ స్వర్గభ్రష్టో భ##వేతి చ || 59 ఘృతాచీ కారుముక్త్వా చ సాzగచ్ఛత్కామమందిరం | కామేన సురతం కృత్వా కథయామాస తాం కథాం || 60 సా భారతే చ కామోక్త్యా గోపస్య మదనస్యచ | పత్న్యాం ప్రయాగే నగరే లేభే జన్మ చ కౌశిక || 61 జాతీస్మరా తత్ప్రసూతా బభూవ చ తపస్వినీ | వరం న వవ్రే ధర్మిష్ఠా తపస్యాయాం మనో దధే || 62 తపశ్చకార తపసా తప్తకాంచనసన్నిభా | దివ్యం చ శతవర్షం సా గంగాతీరే మనోరమే || 63 వీర్యేణ సురకారోశ్చ నవ పుత్రాన్ ప్రసూయ సా | పునః స్వర్లోకం గత్వా చ సా ఘృతాచీ బభూవ హ || 64 ఘృతాచీ మాటలు విని విశ్వకర్మ మిక్కిలి కోపించి ఆమెను భూమిపై శూద్రుల ఇంటిలో పుట్టుమని శపించెను. విశ్వకర్మ తనను శపించినందువలన ఘృతాచి చాలా కోపపడి విశ్వకర్మా! నీవు కూడా స్వర్గభ్రష్టుడివై భూలోకమున జన్మించుమని శపించినది. ఈవిధముగా ఘృతాచి విశ్వకర్మను శపించి మన్మథుని గృహమునకు వెళ్ళి అతనితో జరిగిన విషయమునంతయు తెలిపెను. మన్మథుని మాటననుసరించి ఘృతాచి భారతదేశమందున్న ప్రయాగ పట్టణములోఒక పసులకాపరి భార్యకు కూతురుగా జన్మించెను. గోపిక కడుపులో జన్మించినా ఘృతాచి తనగత జన్మస్మృతి కలదై తపస్వినిగా మారి గంగానదీ తీరములో నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసినా ఎట్టి వరములను వేడక నిష్కామ తపమునొనరించెను. గోపికగా నుండి తపస్సు చేసికొంటున్న ఆ ఘృతాచి విశ్వకర్మవలన తొమ్మండుగురు కొడుకులను కని శాపవిముక్తి పొంది అప్సరసగా మారి తిరిగి స్వర్గలోకమునకు పోయినది. శౌనక ఉవాచ- శౌనకుడిట్లు అడిగెను- కథం వీర్యం సా దధార సురకారోస్తపస్వినీ | పుత్రాన్నవ ప్రసూతా చ కుత్ర వా కతి వాసరాన్ || 65 ఓ మహర్షీ! గోపికగా జన్మించి తపస్సు చేసికొనుచున్న ఘృతాచి తొమ్మండుగురు కొడుకులను ఏవిధముగ, ఎక్కడ, ఎన్ని దినములకు కన్నది? విశ్వకర్మ సంగమము ఎట్లు జరిగినదో వివరించుము. సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను- విశ్వకర్మాతు తచ్ఛాపం సమాకర్ణ్య ఋషాన్వితః | జగామ బ్రహ్మణః స్థానం శోకేన హృతచేతనః || 66 నత్వా స్తుత్వా చ బ్రహ్మాణం కథయామాస తాం కథాం | లలాభ జన్మ బ్రాహ్మణ్యాం పృథివ్యామాజ్ఞయా నిధేః || 67 స ఏవ బ్రాహ్మణో భూత్వా భువి కారుర్బభూవ హ | నృపాణాం చ గృహస్థానాం నానాశిల్పం చకార హ || 68 శిల్పం చకారయామాస సర్వేభ్యః సర్వతః సదా | విచిత్రం వివిధం శిల్పమాశ్చర్యం సుమనోహరం || 69 ఏకదా తు ప్రయాగే చ శిల్పం కృత్వా నృపస్య చ | స్నాతుం జగామ గంగాం స చాపశ్యత్తత్ర కామినీం || 70 ఘృతాచీం నవరూపాంచ యువతిం తాం తపస్వినీం | జాతిస్మరాం తాం బుబుధే స చ జాతిస్మరో ద్విజ || 71 దృష్ట్వా సకామః సహసా బభూవ హృతచేతనః | ఉవాచ మధురం శాంతః శాంతాం తాం చ తపస్వినీం || 72 విశ్వకర్మ ఘృతాచియొక్క శాపము విని కోపశోకములతో తండ్రియైన బ్రహ్మదేవుని లోకమునకు పోయెను. అక్కడ అతడు బ్రహ్మదేవునికి నమస్కరించి స్తుతించి తనకు జరిగిన విషయమునంత అతనికి తెలుపుకొనెను. బ్రహ్మదేవుని అనుగ్రహమువలన అతడు భూలోకమున ఒక బ్రాహ్మణ స్త్రీ కడుపులో బ్రాహ్మణుడుగా పుట్టి గొప్ప శిల్పిగా మారెను. అతడు రాజులకు, ధనవంతులకు, ఇతరులకు అందమైనవి, ఆశ్చర్యకరమైనవి, విచిత్రమైనవి ఐన వివిధ శిల్పముల చేసి ఇచ్చెడివాడు. ఒక దినము ప్రయాగలోఉన్న మహారాజుకు అవసరమైన శిల్పములు చేయుచు స్నానము చేయుటకు గంగానదికి వెళ్లెను. అక్కడ తన గత వృత్తాంతమంతా తెలిసి తపస్సు చేసికొనుచున్న యువతిని చూచి ఆమె ఘృతాచి యను అప్సరయని తాను విశ్వకర్మనని గత జన్మస్మృతిచే గుర్తించి వెంటనే మన్మథవశుడై తపస్వినియైన ఘృతాచితో ఇట్లు మధురముగా పలికెను. బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడీవిధముగా ననెను- అహోzధునా త్వమత్త్రైవ ఘృతాచి సుమనోహరే | మా మాం స్మరసి రంభోరు విశ్వకర్మాzహమేవ చ || 73 శాపమోక్షం కరిష్యామి భజ మాం తవ సుందరి | త్వత్కృతేzతిదహత్యేవ మనో మే స చ మన్మథః || 74 ద్విజస్య వచనం శ్రుత్వా ఘృతాచీ నవరూపిణీ | ఉవాచ మధురం శాంతా నీతియుక్తం పరం వచః || 75 ఓ ఘృతాచి! నీవు ఇక్కడ ఉన్నావా? నన్ను జ్ఞాపకము చేసికొనుచున్నావా? నేను విశ్వకర్మను. నీకొరకు మన్మథుడు నామనస్సును దహించివేయుచున్నాడు. సుందరి! నన్ను సేవించినచో నీ శాపమును తొలగించగలను. బ్రాహ్మణ కుమారుని ఈ మాటలు విని నూతన రూపములో ఉన్న ఘృతాచి మధురముగా నీతితో కూడుకున్న మాటలను శాంతముగా ఇట్లు పలికెను. గోపికోవాచ- గోపిక ఇట్లు పలికెను- తద్దినే కామ కాంతాzహం అధునా చ తపస్వినీ | కథం త్వయా సంగతా స్యాం గంగాతీరే చ భారతే || 76 విశ్వకర్మన్నిదం పుణ్యం కర్మక్షేత్రం చ భారతం | అత్ర యత్ర్కియతే కర్మ భోగోzన్యత్ర శుభావహం || 77 ధర్మీ మోక్షకృతే జన్మ ప్రలభ్య తపసః ఫలాత్ | నిబద్ధః కురుతే కర్మ మోహితో విష్ణుమాయయా || 78 మాయా నారాయణీశానా పరితుష్టా చ యం భ##వేత్ | తసై#్మ దదాతి శ్రీకృష్ణో భక్తిం తన్మంత్రమీప్సితం || 79 యోమూఢో విషయాసక్తో లబ్ధజన్మా చ భారతే | విహాయ కృష్ణం సర్వేశం స ముగ్ధో విష్ణుమాయయా || 80 సర్వం స్మరామి దేవాహమహో జాతిస్మరా పురా | ఘృతాచీ సురవేశ్యాzహమధునా గోపకన్యకా || 81 తపః కరోమి మోక్షార్థం గంగాతీరే సుపుణ్యదే | నాzత్రస్థలం చ క్రీడాయాః స్థిరస్త్వం భవ కాముక || 82 అన్యత్ర యత్కృతం పాపం గంగాయాం తద్వినశ్యతి | గంగాతీరే కృతం పాపం సద్యో లక్షగుణం భ##వేత్ || 83 తత్తు నారాయణక్షేత్రే తపసా చ వినశ్యతి | యద్యేవ కామతః కృత్వా నివృత్తశ్చ భ##వేత్పునః || 84 ఘృతాచీ వచనం శ్రుత్వా విశ్వకర్మానిలాకృతిః | జగామ తాం గృహీత్వా చ మలయం చందనాలయం || 85 రమ్యాయాం మలయద్రోణ్యాం పుష్పతల్పే మనోరమే | పుష్పచందనవాతేన సతతం సురభీకృతే || 86 చకార సుఖసంభోగం తయా స విజనే వనే | పూర్ణం ద్వాదశవర్షం చ బుబుధే న దివానిశం || 87 బభూవ గర్భః కామిన్యాః పరిపూర్ణః సుదుర్వహః | సా సుషావ చ తత్రైవ పుత్రాన్నవ మనోహరాన్ || 88 ఓ విశ్వకర్మా! నీవు పూర్వము నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మన్మథుని ప్రియురాలను. ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నదానను. ఇది పుణ్యములకు నిలయము, కర్మక్షేత్రమైన భారత భూమి. ఈ భారతక్షేత్రములో గంగానదీ తీరములో నీతో సంగమించుట ఎంతవరకు తగినది? ఇచ్చట చేయు మంచిపని ఇతరత్ర శుభఫలితములిచ్చును. మానవుడు తాను చేసిన తపఃఫలితము ననుసరించి మోక్షము పొందుటకు ఈ జన్మము పొంది విష్ణుమాయచే మోహితుడు. నిబద్ధుడై కర్మచేయుచున్నాడు. నారాయణుని మాయ, ఎవరివలన సంతోషపడునో, అతనికి శ్రీకృష్ణుడు, అతని మంత్రమును, భక్తిని, కోరికలను ఇచ్చును. ఏ వ్యక్తి ఈ భారత ఖండమున జన్మించినను, విషయములపై ఆసక్తితో మూఢుడై, భగవంతుడైన శ్రీకృష్ణుని వదలి ప్రవర్తించునో అతడు విష్ణుమాయా మోహితుడగును. ఓ దేవ స్వరూపుడా! నాకు నా ప్రాక్తనజన్మజ్ఞానమున్నది. పూర్వము నేను ఘృతాచి అనే అప్సరసను. ఇపుడు గోపకన్యనై పుణ్యప్రదమైన గంగానదీ తీరములో మోక్షముకొరకు తపము చేయుచున్నాను. ఈ ప్రాంతము రతిక్రీడకు అనువైన స్థలము కాదు. అందువలన నీవు నీ మనుస్సును స్థిరముగా ఉంచుకొనగలవు. ఇతరత్ర చేసిన పాపము గంగయందు నశించిపోవును. కాని గంగాతీరమున చేసిన పాపము వెంటనే లక్షరెట్లు అధికము కాగలదు. యథేచ్ఛగా చేసిన చెడుపని మరల నివృత్తి చెందవచ్చును. అది నారాయణ క్షేత్రమైన ఈ ప్రదేశమున చేసిన తపస్సువలన సంపూర్ణముగా నష్టమగును. (అందువలన నీ కోరిక శిష్టసమ్మతము కాదు) ఘృతాచియొక్క పై మాటలు విని విశ్వకర్మ గాలివలె మారి ఆమెను చందన వృక్షములకు నిలయమైన మలయపర్వత ప్రాంతమునకు తీసుకొనిపోయెను. అందమైన మలయ పర్వత శ్రేణిలో పువ్వులు, చందనములయొక్క గాలిచే పరిమళించి యున్న పుష్పతల్పములో ఆమెతో సుఖసంభోగమును చేసెను. ఈవిధముగా పన్నెండు సంవత్సరములు రాత్రింబగళ్ళు గడువగా ఆమెకు పరిపూర్ణ గర్భము కలిగి అక్కడనే కొడుకులను కనెను. కృత శిక్షిత శిల్పాంశ్చ జ్ఞానయుక్తాంశ్చ శౌనక | పూర్ణ ప్రాక్తనతో యుగ్యాన్ బలయుక్తా న్విచక్షణాన్ || 89 మాలాకారాన్కర్మకారాన్ శంఖకారాన్ కువిందకాన్ | కుంభకారాన్ సూత్రకారాన్ స్వర్ణ చిత్రకరాంస్తథా || 90 తౌ చ తేభ్యో వరం దత్వా తాన్ సంస్థాప్య మహీతలే | మానవీం తనుముత్సృజ్య జగ్మతుర్నిజమందిరం || 91 స్వర్ణకారః స్వర్ణచౌర్యాద్ర్బాహ్మణానాం ద్విజోత్తమ | బభూవ పతితః సద్యో బ్రహ్మశాపేన కర్మణా || 92 సూత్రకారో ద్విజానాం తు శాపేన పతితో భువి | శీఘ్రం చ యజ్ఞకాష్ఠాని న దదౌ తేన హేతునా || 93 వ్యతిక్రమేణ చిత్రాణాం సద్యశ్చిత్రకారస్తథా | పతితో బ్రహ్మశాపేన బ్రాహ్మణానాం చ కోపతః || 94 కశ్చిద్వణిగ్విశేషశ్చ సంసర్గాత్ స్వర్ణకారిణః | స్వర్ణ చౌర్యాదిదోషేణ పతితో బ్రహ్మ శాపతః || 95 కులటాయాం చ శూద్రాయాం చిత్రకారస్య వీర్యతః | బభూవాట్టాలికాకారః పతితో జారదోషతః || 96 అట్టాలికాకార బీజాత్ కుంభకారస్య యోషితి | బభూవకోటకః సద్యః పతితో గృహకారకః || 97 కుంభాకరాస్య బీజేన సద్యః కోటక యోషితి | బభూవ తైలకారాశ్చ కుటిలః పతితో భువి || 98 సద్యః క్షత్రియ బీజేన రాజపుత్రస్య యోషితి | బభూవ తీవరశ్చైవ పతితో జారదోషతః || 99 తీవరస్య తు బీజేన తైలకారస్య యోషితి | బభూవ పతితో దస్యుః లేటశ్చ పరికీర్తితః || 100 వారే మాలాకారులు (మాలలు అల్లువారు) కర్మకారులు (కమ్మరులు) శంఖకారులు, కువిందకులు (నేతవారు) కుంభకారులు (కుమ్మరులు) సూత్రకారులు (వడ్రంగులు) స్వర్ణకారులు (ఔసలివారు) ఘృతాచీ విశ్వకర్మలు తమ కుమారులకు వరములలిచ్చి, వారినందరిని భూమిపై నుంచి, శాపములవలన తమకు తలిగిన మానవశరీరములను వదిలి తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. స్వర్ణకారుడు స్వర్ణమును దొంగిలించుటవలన బ్రహ్మశాపమునకు గురియై భ్రష్టుడయ్యెను. వడ్రంగి యజ్ఞసంబంధమైన కట్టెలు శీఘ్రముగ ఇవ్వనందున బ్రాహ్మణుల శాపమునకు గురియై పతితుడాయెను. చిత్రకారుడు చిత్రమును తారుమారు చేయుచున్నందువలన, బ్రహ్మశాపమునకు బ్రాహ్మణశాపమునకు గురియై పతితుడాయెను. చివరకు ఒక వర్తకుడు స్వర్ణకారుని స్నేహమువలన స్వర్ణచౌర్యము మొదలగు దోషములు చేసి బ్రహ్మశాపమువలన పతితుడయ్యెను. చిత్రకారునకు శూద్రస్త్రీకి కల్గినవాడు అట్టాలికాకారుడు (భవనములు కట్టువాడు) భవనములు కట్టు మేస్త్రీకి కుమ్మరి స్త్రీకి కల్గినవాడు కోటకుడను ఇళ్ళు కట్టువాడు. కుమ్మరివానికి కోటకస్త్రీకి పుట్టినవాడు తైలకారుడు. క్షత్రియునకు రాజపుత్రస్త్రీకి జారదోషమున పుట్టినవాడు తీవరుడు. తీవరునకు తైలకారస్త్రీకి పుట్టినవాడు దస్యుడు లేటుడని కూడా అతనినందురు. లేటస్తీవరకన్యాయాం జనయామాస షట్ సుతాన్ | మాల్లం మంత్రం చ భండం కోలం కలందరం || 101 బ్రాహ్మణ్యాం శూద్రవీర్యేణ పతితో జార దోషతః | సద్యోబభూవ చండాలః సర్వస్మాదధయోzశుచిః || 102 తీవరేణ చ చండాల్యాం చర్మకారో బభూవహ | చర్మకార్యాం చ చండాలాన్మాంసచ్ఛేదో బభూవహ || 103 మాంసచ్ఛేద్యాం తీవరేణ కోంచశ్చ పరికీర్తితః | కోంచస్త్రీయాంతు కైవర్తాత్ కర్తారః పరికీర్తితః || 104 సద్యశ్చండాలకన్యాయం లేటవీర్యేణ శౌనక | బభూవతుస్తౌ ద్వౌపుత్రౌ దుష్టౌ హడ్డిడమౌ తథా || 105 క్రమేణ హడ్డి కన్యాయాం సద్యశ్చండాల వీర్యతః | బభూవుః పంచపుత్రాశ్చ దుష్టా వనచరాశ్చతే || 106 లేటాత్తీవరకన్యాయాం గంగాతీరే చ శౌనక | బభూవ వేషధారీ చ పుత్రో యుంగీ ప్రకీర్తితః || 107 వైశ్యాత్తీవర కన్యాయాం సద్యః శుండీ బభూవ హ | బభూవ సద్యో యో బాలః గంగాపుత్రః ప్రకీర్తితః || 108 గంగా పుత్రస్య కన్యాయాం వీర్యా ద్వై వేషధారిణః | శుండీయోషితి వైశ్యాత్తు పౌండ్రకశ్చ బభూవహ || 109 క్షత్రాత్కరణకన్యాయాం రాజపుత్రో బభూవ హ | రాజపుత్ర్యాం తు కరణాదాగరీతి ప్రకీర్తితః || 110 క్షత్రవీర్యేణ వైశ్యాయాం కైవర్తః పరికీర్తితః | కలౌ తీవర సంసర్గాద్ధీవరః పతితో భువి || 111 తీవర్యాం ధీవరాత్పుత్రో బభూవ రజకః స్మృతః | రజక్యాం తీవరాచ్చైవ కోయాలీతి బభూవ హ || 112 నాపితాద్గోపకన్యాయాం సర్వస్వీ తస్య యోషితి | క్షత్రాద్బభూవ వ్యాధశ్చ బలవాన్ మృగహింసకః || 113 తీవరాచ్ఛుండికన్యాయాం బభూవుః సప్త పుత్రకాః | తే కలౌ హడ్డి సంసర్గాద్భభూవుర్దస్యవః సదా || 114 లేటుడు తీవర కన్యయందు మాల్లుడు, మంత్రుడు, మాతరుడు, భండుడు, కోలుడు, కలందరుడు అను ఆరుగురు కొడుకులను కనెను. బ్రాహ్మణస్త్రీకి, శూద్రునకు పుట్టినవాడు చండాలుడు. తీవరునకు, చండాల స్త్రీకి కల్గినవాడు చర్మకారుడు. చండాలునకు చర్మకారస్త్రీకి కలిగిన సంతానము మాంసచ్ఛేదకుడు, తీవరునకు మాంసచ్ఛేదస్త్రీకి కోంచుడు, కైవర్తకునకు కోంచస్త్రీకి పుట్టినవాడు కర్తారుడు, లేటునకు చండాల స్త్రీకి హడ్డి, డములను ఇద్దరు పుత్రులు కల్గిరి. చండాలునకు హడ్డి స్త్రీయందు వనచరులను ఐదుగురు పుత్రులు పుట్టిరి. లేటునకు తీవర కన్యకు గంగాతీరమున జన్మించినవాడు గంగాపుత్రుడు. వేషధారికి, గంగాపుత్ర స్త్రీకి కలిగిన సంతానము యుంగి అను వేషధారి. వైశ్యునకు తీవరస్త్రీకి శుండి అనువాడు, వైశ్యునకు శుండి స్త్రీయందు పౌండ్రకు డనువాడు, క్షత్రియునకు కరణకాంతకు రాజపుత్రుడు, కరణునకు రాజపుత్రస్త్రీకి ఆగరి అనువాడు, క్షత్రియునకు వైశ్యస్త్రీకి కైవర్తుడను చేపలు పట్టువాడు కలిగిరి. కైవర్తుడు తీవరస్త్రీ సంపర్కమువలన ధీవరుడైనాడు. ధీవరునకు తీవరస్త్రీకి పుట్టినవాడు రజకుడు. తీవరునకు రజకస్త్రీయందు పుట్టినవాడు ''కోయాలి'' నాపితునకు గోపస్త్రీకి పుట్టినవాడు సర్వస్వి. క్షత్రియునకు సర్వస్వ స్త్రీకి పుట్టినవాడు మృగములను వేటాడే వ్యాధుడు. తీవరునకు శుండి స్త్రీకి కల్గిన ఏడుగురు పుత్రులు హడ్డిస్త్రీ సంసర్గమువలన దస్యులైరి. బ్రాహ్మణ్యామృషివీర్యేణ ఋతోః ప్రథమవాసరే | కుత్సితశ్చోదరే జాతః కూదరస్తేన కీర్తితః || 115 తదశౌచం విప్రతుల్యం పతితశ్చర్తుదోషతః | సద్యః కోటక సంసర్గా దధమో జగతీ తలే || 116 క్షత్రవీర్యేణ వైశ్యాయామృతోః ప్రథమవాసరే | జాతః పుత్రో మహాదస్యుః బలవాంశ్చ ధనుర్ధరః || 117 చకార వాగతీతంచ క్షత్రియేణాzపి వారితః | తేన జాత్యాః సపుత్రశ్చ వాగతీతః ప్రకీర్తితః || 118 క్షత్రవీర్యేణ శూద్రాయాం ఋతుదోషేణ పాపతః | బలవంతో దురంతాశ్చ బభూవుర్ల్మేచ్ఛజాతయః || 119 అవిద్ధకర్ణా క్రూరాశ్చ నిర్భయా రణదుర్జయాః | శౌచాచారవిహినాశ్చ దుర్ధర్షా ధర్మవర్జితాః || 120 వ్లుెచ్ఛాత్కువిందకన్యాయాం జోలా జాతిర్బభూవహ | జోలాత్కువింద కన్యాయాం శరాంకః పరికీర్తితః || 121 వర్ణసంకరదోషేణ బహ్వ్యశ్చాశ్రుత జాతయః | తాసాం నామాని సంఖ్యాశ్చ కోవా వక్తుం క్షమో ద్విజ || 122 వైద్యోzశ్వినీ కుమారేణ జాతో విప్రస్య యోషితి | వైద్యవీర్యేణ శూద్రాయాం బభూవుర్బహవో జనాః || 123 తే చ గ్రామ్యగుణజ్ఞాశ్చ మంత్రోషధి పరాయణాః | తేభ్యశ్చ జాతాః శూద్రాయాం యే వ్యాలగ్రాహిణో భువి || 124 ఒక ఋషివలన బ్రాహ్మణస్త్రీకి ఋతు కాలముయొక్క మొదటి దినమున జరిగిన సంసర్గమువలన కుత్సితోదరమున జన్మించినవాడు ''కూదరు''డు. ఋతు దోషమున జన్మించినను కూదరుని జన్మాశౌచము విప్రుల జన్మాశౌచముతో సమానమైనది. కాని ఆ కూదరుడు కోటకస్త్రీ సంసర్గమువలన అధముడగుచున్నాడు. అట్లే క్షత్రియుడు వైశ్యస్త్రీని ఋతుకాలముయొక్క ప్రథమ దివసమున కలిసినప్పుడు పుట్టినవాడు బలవంతుడు, ధనుర్ధరుడైన మహాదస్యువు. క్షత్రియుడు అతనిని వారించినప్పటికి వాక్కుకు అతీతముగా పుట్టిన ఆ శిశువు ''వాగతీత|| జాతివాడు. అదే విధముగా క్షత్రియునకు శూద్రస్త్రీకి ఋతుకాల దోషమున పుట్టినవాదు వ్లుెచ్ఛజాతులకు చెందినవారు. వారు తక్కిన వారివలె చెవులు కుట్టించుకొనరు. క్రూరులు భయములేనివారు, శౌచాచారములు లేనివారు. ధర్మమును వదిలిపెట్టినవారు. వ్లుెచ్ఛునకు కువిందస్త్రీకి పుట్టినవాడు జోలుడు. ఆ జోలునకు కువిందస్త్రీకి పుట్టినవాడు శరాంకుడు. ఈ విధముగా వర్ణ సంకర దోషమువలన ఇంతకు ముందెన్నడు వినని జాతులెన్నో కలిగినవి. వాటిసంఖ్య వాటిపేర్లు చెప్పనలవి కాదు. అశ్వినీ కుమారునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించినవాడు వైద్యుడు. ఆ వైద్యునకు శూద్రస్త్రీకి చాలామంది పుట్టిరి. వారు పల్లెటూరివారి గుణములు తెలిసినవారు మంత్రములు, ఔషధులనాధారముగా చేసికొని బ్రతుకువారు. వారికి శూద్ర స్త్రీలయందు 'పాములు పట్టువారు' కల్గిరి. శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను- కథం బ్రాహ్మణ పత్న్యాంతు సూర్యప్రత్రోzశ్వినీ సుతః | అహో కేనాzవివేకేన వీర్యాధానం చకార హ || 125 ఓసౌతి మహర్షీ! సూర్యుని పుత్రుడైన అశ్వినీకుమారుడు బ్రాహ్మణుని స్త్రీయందు వివేకము కోల్పోయి ఏవిధముగా కొడుకును కనెనో వివరించి చెప్పగలవు. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను- గచ్ఛంతీం తీర్థయాత్రాయాం బ్రాహ్మణీం రవినందనః | దదర్శ కాముకః శాంతః పుష్పోద్యానే చ నిర్జనే || 126 తయా నివారితో యత్నాద్బలేన బలవాన్సురః | అతీవ సుందరీం దృష్ట్వా వీర్యాధానం చకార సః || 127 ద్రుతం తత్యాజ గర్భం సా పుష్పోద్యానే మనోహరే | సద్యో బభూవ పుత్రశ్చ తప్తకాంచన సన్నిభః || 128 సపుత్రా స్వామినో గేహం జగాను వ్రీడితా సదా | స్వామినం కథయామాస యన్మార్గే దైవసంకటం || 129 విప్రో రోషేణ తత్యాజ తం చ పుత్రం స్వకామినీం | సరిద్భభూవ యోగేన సా చ గోదావరీ స్మృతా || 130 పుత్రం చికిత్సాశాస్త్రం చ పాషయామాస యత్నతః | నానాశిల్పం చ మంత్రం చ స్వయం స రవినందనః || 131 విప్రశ్చ వేతనాజ్జ్యోతిర్గణనాచ్చ నిరంతరం | వేదధర్మ పరిత్యక్తో బభూవ గణకో భువి || 132 లోభీ విప్రశ్చ శూద్రాణామగ్రే దానం గృహీతవాన్ | గ్రహణ మృతదానానామగ్రాదానీ బభూవ సః || 133 కశ్చిత్పుమాన్ బ్రహ్మయజ్ఞే యజ్ఞకుండాత్సముత్థితః | స సూతో ధర్మవక్తా చ మత్పూర్వ పురుషః స్మృతః || 134 పురాణం పాఠయామాస తం చ బ్రహ్మ కృపానిధిః | పురాణవక్తా సూతశ్చ యజ్ఞకుండసముద్భవః || 135 వైశ్యాయాం సూతవీర్యేణ పుమానేకో బభూవ హ | స భట్టో వావదూకశ్చ సర్వేషాం స్తుతిపాఠకః || 136 ఏవం తే కథితః కించిత్ పృథివ్యాం జాతినిర్ణయః | వర్ణ సంకర దోషేణ బహ్వ్యోzన్యాః సంతి జాతయః || 137 తీర్థయాత్రకు పోవుచున్న ఒక బ్రాహ్మణ స్త్రీని జనులెవ్వరు లేని పుష్పోద్యానమున రవినందునడైన అశ్వినీకుమారుడు చూచి కామించి ఆ బ్రాహ్మణస్త్రీ ఎంత నివారించినా వినక బలవంతముగా కలిసెను. అందువలన ఏర్పడిన గర్భమునామె ఆ పుష్పోద్యానములోనే వదిలివేసినది. ఐనను ఆ గర్భము బంగారు వన్నెవంటి పుత్రుడుగా మారెను. అప్పుడామె తన పుత్రుని తీసికొని సిగ్గుతో ఇంటికి పోయి భర్తకు జరిగిన విషయమునంత తెలిపెను. కాని ఆమె భర్త కోపముతో భార్యను, ఆమెకు కల్గిన పుత్రుని వదలిపెట్టగానా స్త్రీ యోగధ్యానముతో నదిగా మారెను. ఆనదియే గోదావరి. అశ్వినీకుమారుడు తన పుత్రునికి స్వయముగా వైద్యశాస్త్రమును, వివిధములైన శిల్పశాస్త్రములను, మంత్రములను నేర్పించెను. బ్రాహ్మణుడు వేతనము తీసికొనుచు నక్షత్రములను గణించుచు వేద ధర్మములను వదిలివేసి జ్యోతిర్గణకుడయ్యెను. ఇంకను అతిలోభమువలన శూద్రుల దగ్గర, గ్రహణసమయములలో, మృతులకు సంబంధించిన దానములను స్వీకరించుచుండెడివాడు. బ్రహ్మయజ్ఞమునందలి యజ్ఞకుండమున పుట్టిన పురుషుడొకడు ధర్మములను, పురాణకథలను చెప్పువాడు. అతడే సూతుడు. నాకు పూర్వపురుషుడు. అట్లే వైశ్యస్త్రీకి సూతునకు పుట్టినవాడు స్తుతిపాఠకుడైన భట్టు. అతడు మంచివక్త. ఓ శౌనకమహర్షీ! భూమిపై నున్న కొన్ని జాతుల గురించి నీకు వివరించితిని. ఆయా వర్ణముల సంకరమువల్ల ఏర్పడిన జాతులు చాలా చాలా కలవు. సంబంధో యేషు యేషాం యః సర్వజాతిషు సర్వతః | తత్వం బ్రవీమి వేదోక్తం బ్రహ్మణా కథితం పురా || 138 పితా తాతస్తు జనకో జన్మదాతా ప్రకీర్తితః | అంబా మాతా చ జననీ జనయిత్రీ ప్రసూరపి || 139 పితామహః పితృపితా తత్పితా ప్రపితామహః | అత ఊర్ధ్వం జ్ఞాతయశ్చ సగోత్రాః పరికీర్తితాః || 140 మాతామహః పితా మాతుః ప్రమాతామహ ఏవచ | మాతా మహస్య జనకః తత్పితా వృద్ధపూర్వకః || 141 పితామహీ పితుర్మాతా తచ్ఛ్వశ్రూః ప్రపితామహీ | తచ్ఛ్వశ్రూశ్చ పరిజ్ఞేయా సా వృద్ధప్రపితామహీ || 142 మతామహీ మాతృమాతా మాతృతుల్యా చ పూజితా | ప్రమాతామహీతి జ్ఞేయా ప్రమాతామహ కామినీ || 143 వృద్ధమాతామహీ జ్ఞేయా తత్పితుః కామినీ తథా | పితృభ్రాతా పితృవ్యశ్చ మాతృభ్రాతా చ మాతులః || 144 పితృష్వసా పితుర్మాతృష్వసా మాతుః స్వసా స్మృతా | సూనుశ్చ తనయో పుత్రః దాయదశ్చాత్మజస్తథా || 145 ధనభాగ్వీర్యజశ్చైవ పుంసి జన్యే చ వర్తతే | జన్యాయాం దుహితా కన్యా చాత్మజా పరికీర్తితా || 146 పుత్రపత్నీర్వధూః జ్ఞేయా జామాతా దుహితుః పతిః | పతిః ప్రియశ్చ భర్తా చ స్వామీ కాంతే చ వర్తతే || 147 దేవరః స్వామినో భ్రాతా ననాందా స్వామినః స్వసా | శ్వశురః స్వామినస్తాతః శ్వశ్రూశ్చ స్వామినః ప్రసూః || 148 భార్యా జాయా ప్రియా కాంతా స్త్రీ చ పత్నీ ప్రకీర్తితా | పత్నీ భ్రాతా శ్యాలకశ్చ స్వసా పత్న్యాశ్చ శ్యాలికా || 149 పత్నీమాతా తథా శ్వశ్రూ స్తత్పితా శ్వశురః స్మృతః | సగర్భః సోదరో భ్రాతా సగర్భా భగినీ స్మృతా || 150 సమస్త జాతులవారికి ఆయా వ్యక్తుల మధ్యగల సంబంధము వేదమందు చెప్పబడినది. పూర్వముబ్రహ్మదేవుడు నాకు తెలిపిన ఈ సంబంధమునుకు చెందిన పదములను శౌనకమహర్షీ నీకు చెప్పుదును. జన్మనిచ్చినవాడు జనకుడు, పిత, తాత, అని పిలువబడును. జన్మనిచ్చిన స్త్రీని జనని, అంబ, మాత, ప్రసూః అని అందురు. తండ్రియొక్క తండ్రిని పితామహుడని, అతని తండ్రిని ప్రపితామహుడని అతని తండ్రి, తాత, మొదలగు జ్ఞాతులను సగోత్రులని పిలుతురు. తల్లి తండ్రి మాతామహుడు, అతని తండ్రి ప్రమాతామహుడు, అతని తండ్రి వృద్ధ ప్రమాతామహుడు. తండ్రియొక్క తల్లి పితామహి, ఆమె అత్త ప్రపితామహీ, ఆమె తల్లి వృద్ధ ప్రపితామహి. తల్లి తల్లి మాతామహి. ప్రమాతామహుని భార్య ప్రమాతామహీ, వృద్ధమాతామహుని భార్య (ప్రమాతామహి అత్త) వృద్ధప్రమాతామహి. తండ్రియొక్క అన్నదమ్ములు పితృవ్యులు. తల్లియొక్క అన్న దమ్ములు మాతులులు. తండ్రియొక్క అక్కా చెల్లెండ్లను పితృష్వసలని, తల్లి యొక్క అక్కా చెల్లెండ్లను మాతృష్వసలని పిలుతురు. తనయుడు, పుత్రుడు, సూనువ, దాయదుడు, ఆత్మజుడు, ధనభాక్కు, వీర్యజుడు అని కొడుకు పేర్లు. జన్య, దుహిత, ఆత్మజ, కన్య అని కూతురు పేర్లు. పుత్రుని భార్యను వధువని, కూతురు భర్తను జామాత అని అందురు. స్వామి, కాంతుడు, ప్రియుడు, పతి అని భర్తను పిలుతురు. భర్తయొక్క తమ్ముని దేవరుడని, భర్త చెల్లెలిని ననాందా అని, భర్తయొక్క తండ్రిని శ్వశురుడని, తల్లిని శ్వశ్రూ అని పిలుతురు. జాయ, ప్రియా, కాంతా, స్త్రీ, పత్ని, అని భార్యను అందురు. భార్యయొక్క అన్నదమ్ములను శ్యాలకుడని, భార్యయొక్క అక్కాచెల్లెండ్లను శ్యాలికా అని, భార్య తల్లిని శ్వశ్రూ అని పిలుతురు. జాయ, ప్రియా, కాంతా, స్త్రీ, పత్ని, అని భార్యనందురు. భార్య యొక్క అన్నదమ్ములను శ్యాలకులని, భార్య యొక్క అక్కా చెల్లెండ్లను శ్యాలికయని, భార్య తల్లిని శ్వశ్రు అని, తండ్రిని శ్వశురుడని అందురు. సోదరుని భ్రాతను సగర్భుడని, సోదరిని భగినీ, సగర్భా అని అంటారు. భగినీజో భాగినేయో భ్రాతృజో భ్రాతృపుత్రకః | అవుత్తో భగినీకాంతః భగినీపతిరేవచ || 151 శ్యాలీపతిస్తు భ్రాతా చ శ్వశురైకత్వహేతునా | శ్వశురస్తు పితా జ్ఞేయః జన్మదాతుః సమో మునే || 152 అన్నదాతా భయత్రాతా పత్నీతాతస్తథైవ చ | విద్యాదాతా జన్మదాతా పంచైతే పితరో నృణాం || 153 అన్నదాతుశ్చ యా పత్నీ భగినీ గురుకామినీ | మాతా చ తత్సపత్నీ చ కన్యా పుత్రప్రియా తథా || 154 మాతుర్మాతా పితుర్మాతా శ్వశ్రూపిత్రోః స్వసా తథా | పితృవ్యస్త్రీ మాతులానీ మాతరశ్చ చతుర్ధశ || 155 పౌత్రస్తు పుత్రపుత్రేచ ప్రపౌత్రస్తత్సుతేzపిచ | తత్పుత్రాద్యాశ్చ యే వంశ్యాః కులజాశ్చ ప్రకీర్తితాః || 156 కన్యాపుత్రశ్చ దౌహిత్రః తత్ఫుత్రాద్యాశ్చ బాంధవాః | గురుపుత్రస్తథా భ్రాతా పోష్యః పరమబాంధవః || 157 భ్రాతృపుత్రస్య పుత్రాద్యాస్తే పునర్‌జ్ఞాతయః స్మృతాః | భాగినేయసుతాద్యాశ్చ పురుషాః బాంధవాః స్మృతాః || 158 గురుకన్యా చ భగినీ పోష్యా మాతృసమా మునే | పుత్రస్య చ గురుః భ్రాతా పోష్యః సుస్నిగ్ధబాంధవః || 159 పుత్రస్య శ్వశురో భ్రాతా బంధుర్వైవాహికః స్మృతః | కన్యాయాః శ్వశురే చైవ తత్సంబంధః ప్రకీర్తితః || 160 గురుశ్చ కన్యకాయాశ్చ భ్రాతా సుస్నిగ్ధబాంధవః | గురుః శ్వశుర భ్రాతౄణాం గురుతుల్యః ప్రకీర్తితః || 161 చెల్లెలి కొడుకు భాగినేయుడు, అన్నదమ్ముల కొడుకు భ్రాతృపుత్రకుడు, అక్కా చెల్లెండ్ల భర్తలను ఆవుత్తులని, భగినీపతి అని, మరదలి భర్తను భ్రాత అని పిలుతురు. కారణము ఇద్దరి మామ ఒక్కడే. భార్య తండ్రి జన్మనిచ్చిన తండ్రితో సమానము, అన్నము పెట్టినవాడు, భయపడకుండ రక్షించినవాడు, భార్యయొక్క తండ్రి, చదువు చెప్పినవాడు, జన్మనిచ్చినవాడు ఈ ఐదుగురు మానవులకు తండ్రులు. అన్నము పెట్టినవాని భార్య, చెల్లెలు, గురువుయొక్క భార్య, తల్లి, ఆమె సవతి, కోడలు, కూతురు, తల్లి తల్లి, తండ్రి తల్లి, అత్త, తండ్రి చెల్లెలు, మామ చెల్లెలు, పినతండ్రి భార్య, మేనమామ భార్య అను ఈపదునాల్గురు మాతృ సమానులు. కొడుకు యొక్క కొడుకు పౌత్రుడు, అతని పుత్రుడు ప్రపౌత్రుడు. అతని కొడుకు మొదలైనవారు వంశ్యులు లేక కులజులు. కూతురుయొక్క కొడుకు దౌహిత్రుడు. అతని పుత్రుడు మొదలైనవారు బంధువులు, గురుపుత్రులు, భ్రాత, పోష్యవర్గములోనివాడు పరమ బాంధవులు. తమ్ముని మనుమడు మొదలగువారు జ్ఞాతులు. మేనల్లుడు మొదలగువారు బంధువులు. గురువు యొక్క కూతురు, భగిని, పోష్యవర్గములో చేరినది తల్లితో సమానురాలు. పుత్రుని గురువు, అతని సోదరుడు, పోష్యవర్గపువాడు దగ్గరి బంధువు. పుత్రునిమామ, అతని సోదరుడు వైవాహిక బంధువర్గములోని వాడు. కూతురుమామ, అతని సంబంధీకులు కూడ వైవాహిక బంధువులే. కూతురు యొక్క గురువు. అతని సోదరుడు చాలా దగ్గరి బంధువులు. మామ, అతని సోదరుల గురువు గురుతుల్యుడు. బంధుతా యేన సార్థంచ తన్మిత్రం పరికీర్తితం | మిత్రం సుఖప్రదం జ్ఞేయం దుఃఖదో రిపురుచ్యతే || 162 బాంధవో దుంఖదో దైవాన్నిస్సంబంధోzసుఖప్రదః | సంబంధాస్త్రివిధాః పుంసాం విప్రేంద్ర జగతీ తలే || 163 విద్యాజో యోనిజశ్చైవ ప్రీతిజశ్చ ప్రకీర్తితః | మిత్రం తు ప్రీతిజం జ్ఞేయం స సంబంధః సదుర్లభః || 164 మిత్రమాతా మిత్రభార్యా మాతృతుల్యా న సంశయః | మిత్రభ్రాతా మిత్రపితా భ్రాతృతాతసమౌనృణాం || 165 చతుర్థం నామసంబంధమిత్యాహ కమలోద్భవః | జారశ్చోపపతిర్బంధుః దుష్టా సంభోగకర్తరి || 166 ఉపపత్న్యాం నవజ్ఞా చ ప్రేయసీ చిత్తహారిణీ | స్వామితుల్యశ్చ జారశ్చ నవజ్ఞా గృహిణీ సమా || 167 సంబంధో దేశ##భేదేచ సర్వదేశే విగర్హితః | ఆవైదికో నిందితస్తు విశ్వామిత్రేణ నిర్మితః || 168 దుస్త్యజశ్చ మహద్భిస్తు దేశ##భేదే విధీయతే | అకీర్తిజనకః పుంసాం యోషితాం చ విశేషతః || 169 తేజీయసాం న దోషాయ విద్యమానే యుగే యుగే || 170 బంధుత్వము దేనివలన ప్రయోజనకరమగునో అదియే స్నేహము. అది సుఖప్రదమైనది. శత్రుత్వము దుఃఖమును కలిగించును. పూర్తిగా సంబంధములేని బంధుత్వము దుఃఖమును కలిగించవచ్చు. విద్యవల్ల ఏర్పడిన సంబంధము, చుట్టరికమువల్ల ఏర్పడిన సంబంధము, ప్రీతివల్ల ఏర్పడిన సంబంధము అని సంబంధము మూడు విధములు. ప్రీతిజ సంబంధము స్నేహము. అది చాలా గొప్పది. నాల్గవ సంబంధము నామ సంబంధము. మిత్రుని తల్లి మిత్రుని భార్య తల్లితో సమానులు. అతని సోదరుడు, తండ్రి, తన సోదరుడు, తండ్రివంటివారు. జారుడు భర్తతో సమానమైనవాడు. అట్లే నవజ్ఞ (ఉంచుకొన్నది) భార్యతో సమానముగా పరిగణించతగినది. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతిశౌనక సంవాదే బ్రహ్మఖండే జాతి సంబంధ నిర్ణయోనామ దశమోz ధ్యాయః శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో సౌతి శౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండమున జాతి సంబంధ నిర్ణయమను పదవ అధ్యాయము సమాప్తము.