sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
తృతీయోzధ్యాయః - పుణ్యక వ్రత మహిమ శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడిట్లు పార్వతితోననెను. శ్రుణు పార్వతి వక్ష్యామి తన భద్రం భవిష్యతి | ఉపాయతః కార్యసిద్ధర్భవత్యేవ జగత్త్రయో ||
1 సర్వవాంఛితసిద్ధేస్తు బీజరూపం సుమంగళం | మనసః ప్రీతిజనకముపాయం కథయామి తే ||
2 హరేరారాధనం కృత్వా వ్రతం కురు వరాననే | వ్రతం చ పుణ్యకం నామ వర్షమేకం కరిష్యసి ||
3 మహాకఠోరబీజం చ వాంఛకల్పతరుం పరం | సుఖదం పుణ్యదం సారం పుత్రదం సర్వసౌఖ్యదం ||
4 ఓ పార్వతి నీకు శుభము కలుగును. నేను చెప్పు ఉపాయము వలన నీకు తప్పక కార్యసిద్ది జరుగును. సమస్తమైన కోరికలు సిద్దించుటకు హేతునైనది, మంగళ##మైనది, నీకు సంతోషమును కలిగించు ఉపాయము చెప్పెదను. నీవు తొలుత శ్రీమన్నారాయణుని ఆరాధించి పుణ్యకవ్రతమును ఒకసంవత్సరకాలము ఆచరింపుము. ఇవి అన్ని కోరికలను తీర్చును. సర్వసౌఖ్యములను, పుత్రులను, పుణ్యమును కలిగించును. నదీనాం చ యథాగంగా దేవానాం చహరిర్యథా | వైష్ణవానాం యథాzహంచ దేవీనాం త్వం యథాప్రియే || 5 వర్ణానాంచయథావిప్రస్త్రీర్థానాం పుష్కరం యథా | పుష్పాణాం పారిజాతం చ పత్రాణాం తులసీయథా || 6 యథాపుణ్యప్రదానాం చ తిథిరేకాదశీ స్మృతా | రవివారశ్చ వారాణాం యథాపుణ్యప్రదః శివే || మాసానాంమార్గశీర్షశ్చాప్యుతూనాం మధవోయథా || 7 సంవత్సరోవత్సరాణాం యుగానాం చ కృతం యథా | విద్యాప్రదశ్చ పూజ్యానాం గురూనాం జననీయథా | సాధ్వీపత్నీయథాప్తానాం విశ్వస్తానాం మనోయథా || 8 యథా ధనానాం రత్నం ప్రియాణాం చ యథాపతిః | యథాపుత్రశ్చ బంధూనాం వృక్షాణాం కల్పపాదపః || 9 ఫలానాం వై చూతఫలం వర్షాణాం భారతం యథా | బృందావనం వనానాం చ శతరూపా చ యోషితాం || 10 యథా కాశీపురీణాం చ సూర్యస్తేజస్వినాం యథా | యథేందుః సుఖదానాం చ సుందరాణాం చ మన్మథః || 11 శాస్త్రాణాం చ యథా వేదాః సిద్దానాం కపిలో యథా | హనుమాన్వానరాణాం చ క్షేత్రాణాం బ్రాహ్మణాననం || 12 యశోదానాం యథావిధ్యా కవితా చ మనోహరా | ఆకాశో వ్యాపకానాం చ హ్యంగానాం లోచనం యథా || 13 విభవానాం హరికథా సుఖానాం హరిచింతనం | స్పర్శానాం పుత్రసంస్పర్శో హింస్రాణాం చ యథాఖలః || 14 పాపానాం చ యథామిథ్యా పాపినాం పుంశ్చలీయథా | పుణ్యానాం చ యథా సత్యం తపనాం హరిసేవనం || 15 నదులన్నిటిలో గంగానదివలె, దేవతలలో శ్రీహరివలె, వైష్ణవులలో నా (మహాదేవుడు) వలె, దేవతాస్త్రీలలో నీ (పార్వతీదేవి) వలె, కులములన్నిటిలో బ్రాహ్మణులవలె, పుణ్యక్షేత్రములలో పుష్కరమక్షేత్రమువలె, పుష్పములలో పారిజాతపుష్పమువలె, పత్రములలో తులసీపత్రమువలె, పుణ్యప్రదమైన తిథులలో ఏకాదశీతిథివలె, వారములన్నిటిలో ఆదివారమువలె, నెలలన్నిటిలో మార్గశీర్షమాసమువలె, ఋతువులలో గ్రీష్మఋతువువలె, యుగములలో కృతయుగమువలె, పూజ్యులైనవారిలో విద్యనొసగు గురువువలె, పూజ్యులలో తల్లివలె, ఆప్తులైనవారిలో సాధ్వియగు భార్యవలె, విలువైన వస్తువులలో రత్నమువలె, ప్రియులందరిలో భర్తవలె, బంధువులందరిలో పుత్రునివలె, వృక్షములన్నిటిలో కల్పవృక్షమువలె, పండ్లలో మామిడిపండువలె, తోటలన్నిటిలో బృందావనమువలె, స్త్రీలందరిలో శతరూపాదేవివలె, పట్టణములన్నిటిలో కాశీపట్టణమువలె, తేజస్సుకలవారిలో సూర్యునివలె, సుందరులైనవారిలో మన్మథునివలె, శాస్త్రములన్నిటిలో వేదములవలె, సిద్దులలో కపిలమహర్షివలె, వానరులలో హనుమంతునివలె, కీర్తినొసగువాటిలో అందమైన కవితవలె, అవయవములన్నిటిలో నేత్రమువలె, స్పర్శలలో పుత్రస్పర్శవలె, హింసించువారిలో దుష్టునివలె, పాపులలో పుంశ్చలివలె, తపస్సులన్నిటిలో హరిసేవవలె వ్రతములన్నిటిలో పుణ్యకవ్రతము చాలా శ్రేష్ఠమైనది. యథా ఘృతం చ గవ్యానాం యథా బ్రహ్మ తపస్వినాం | అమృతం భక్ష్యవస్తూనాం సస్యానాం ధాన్యకం యథా || 16 పుణ్యదానాం యథా తోయం శుద్ధానాం చ హుతాశనః | సువర్ణం తైజసానాం చ మిష్టానాం ప్రియభాషణం || 17 గరుడః పక్షిణాం చైవ హస్తినామింద్రవాహనం | యోగినాం చ కుమారశ్చ దేవర్షీణాం చ నారదః || 18 గంధర్వాణాం చిత్రరథో జీవోబుద్ధిమతాం యథా | సుకవీనాం యథాశుక్రః కావ్యానాం చ పురాణకం || 19 స్రోతస్వతాం సముద్రశ్చ యథాపృధ్వీ క్షమావతాం | లాభానాం చ యథాముక్తిః హరిభక్తిశ్చ సంపదాం || 20 పవిత్రాణాం వైష్ణవాశ్చ వర్ణానాం ప్రణవో యథా | విష్ణుమంత్రశ్చ మంత్రాణాం బీజానాం ప్రకృతిర్యథా || 21 విదుషాం చ యథావాణీ గాయత్రీ ఛందసాంయథా | యథాకుబేరో యక్షాణాం సర్పాణాం వాసుకిర్యథా || 22 యథా పితా తే శైలానాం గవాం చ సురభిర్యథా | వేదానాం సామవేదశ్చ తృణానాం చ యథా కుశః || 23 సుఖదానాం యథా లక్ష్మీర్మనో వై శీఘ్రగామినాం | అక్షరాణామకారశ్చ యథా తాతో హితైషిణాం || 24 శాలగ్రామశ్చ మూర్తీనాం పశూనాం విష్ణుపంజరః | చతుష్పదానాం పంచాస్యో మానవో జీవినాం యథా || 25 యథాస్వాంతం చేంద్రియాణాం మందాగ్నిశ్చ రుజాం యథా | బలినాం చ యథాశక్తిరహం శక్తిమతాం తథా || 26 మహాన్విరాట్ చ స్థూలానాం సూక్ష్మణాం పరమాణుకః | యథేంద్ర ఆదితేయానాం దైత్యానాం చ బలిర్యథా || 27 యథా దధీచిర్దాతృణాం ప్రహ్లాదశ్చైవ సాధుషు | బ్రహ్మాస్త్రం చ యథాzస్త్రోణాం చక్రాణాం చ సుదర్శనం || 28 నృణాం రాజా రామచంద్రో వీరాణాం లక్ష్మణో యథా | సర్వాధారః సర్వసేవ్యః సర్వబీజం చ సర్వదః | సర్వసారో యథాకృష్ణో వ్రతానాం పుణ్యకం తథా || 29 ఆవపాలనుండి ఏర్పడు వస్తువులలో నెయ్యి తపస్సుచేయువారిలో బ్రహ్మదేవుడు పరిశుద్దమైన వస్తువులలో అగ్ని తైజసమైన వస్తువులలో బంగారము దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, కవులలో శుక్రుడు, కావ్యములందు పురాణము క్షమకలవారిలో భూమి, లాభములందు ముక్తి, సంపదలలో శ్రీహరిభక్తి, పవిత్రమైనవారిలో వైష్ణవులు, అక్షరములలో ఓంకారము, మంత్రములలో విష్ణుమంత్రము, బీజములందు ప్రకృతి, విద్వాంసులలో సరస్వతి, ఛందస్సులలో గాయత్రి, యక్షులలో కుబేరుడు, సర్పములందు నాగరాజగు వాసుకి, పర్వతములందు నీతండ్రియగు హిమాలయపర్వతము, ఆవులలో సురభి, వేదములయందు సామవేదము, గరకలో దర్భ, సుఖముకలిగించువారిలో లక్ష్మీదేవి, శ్రీఘ్రగమనముకలవారిలో మనస్సు, అక్షరములందు ఆకారము, మేలుకోరువారిలో తండ్రి, భగవంతుని మూర్తులలో సాలగ్రామము, పశువులలో విష్ణుపంజరము, చతుష్పాత్ జంతువులలో సింహము, ప్రాణులలో మానవుడు, ఇంద్రియములందు మనస్సు, రోగములయందు, ఆకలిలేకపోవుట, బలవంతులలో శక్తి, శక్తికలవారిలోనేను (మహాదేవుడు), స్థూలపదార్ధములలో మహావిరాట్స్వరూపము, సూక్ష్మపదార్ధములలో పరమాణువు, ఆదిత్యులలో ఇంద్రుడు, దైత్యులందు బలిచక్రవర్తి, దానముచేయువారిలో దధీచిమహర్షి, సాధుపురుషులలో ప్రహ్లాదుడు, అస్త్రములందు బ్రహ్మాస్త్రము, చక్రములలో సుదర్శనచక్రము, మానవులలో శ్రీరామచంద్రుడు, ఎట్లు గొప్పవారో అట్లే వ్రతములందు పుణ్యకవ్రతము చాలా గొప్పది. వ్రతం కురు మహాభాగే త్రిషులోకేషు దుర్లభం | సర్వశ్రేష్ఠశ్చ పుత్రస్తే వ్రతాదేవ భవిష్యతి || 30 వ్రతారాధ్యశ్చ వై కృష్ణః సర్వేషాం వాంఛితప్రదః | జనో యత్సేవనాన్ముక్తః పితృభిః కోటిభిఃసహ || 31 హరిమంత్రం గృహీత్వా చ హరిసేవాం కరోతి యః | భారతే జన్మ సఫలం స్వాత్మనః కరోతిచ || 32 ఉద్ధృత్య కోటిపురుషాన్వైకుంఠం యాతి సునిశ్చితం | శ్రీకృష్ణపార్షదో భూత్వా సుఖం తత్రైన మోదతే || 33 సహోదరాన్ స్వభృత్యాంశ్చ స్వబంధూన్సహచారిణః | స్వస్త్రియశ్చ సముద్ధృత్య భక్తోయాతి హరేః పదం || 34 తస్మార్గృహాణ గిరిజే హరేర్మంత్రం సుదుర్లభం | జపమంత్రం వ్రతే తత్ర పితృణాం ముక్తికారణం || 35 ఈపుణ్యకవ్రతమందు ఆరాధింపబడువాడు సమస్తజనులకోరికలను తీర్చు శ్రీకృష్ణుడు, ఆదేవదేవుని సేవించినవారు తమ కోటితరముల పితృగణముతో ముక్తుని పొందుదురు. శ్రీహరిమంత్రమును జపించుచు శ్రీహరిసేవనుచేయు భక్తునియొక్క జన్మ ఈభారతదేశమున సఫలమగుచున్నది. అట్లే అతడు తనకు ముందున్న కోటితరములవారిని ఉద్ధరించుచు వైకుంఠమునకుపోవును. తరువాత ఆ భక్తుడు శ్రీకృష్ణుని భృత్యుడై వైకుంఠమున సుఖముగానుండును. ఆ భక్తుడు తన శ్రీహరిభజనవలన తనసోదరులను, భృత్యువులను, తనబంధువులను, తనసహచరులను, స్త్రీలను ఉద్దరించి శ్రీహరియుండు వైకుంఠమును చేరుకొనును. అందువలన ఓ పుణ్యశీలా! పార్వతీ! మిక్కిలి దుర్లభ##మైన శ్రీహరిమంత్రమును గైకొని, పితృదేవతల ముక్తికి కారణమైన ఆ శ్రీహరిమంత్రమును నీవు స్వీకరింపుము. ఈవ్రతమున శ్రీహరిమంత్రమును జపించినచో ఆతని పూర్వపురుషులందరు ముక్తిని పొందుదురు అని పల్కెను. ఇత్యుక్త్వా శంకరో దేవో గత్వా గిరిజయాసహ | శీఘ్రం చ జాహ్నవీతీరం హరేర్మంత్రం మనోహరం || 36 తసై#్య దదౌ చ సంప్రీత్యా కవచం స్తోత్రసంయుతం | పూజావిధాననియమం కథయామాస తాం మునే || 37 శంకరుడిట్లు పార్వతీదేవికి చెప్పి ఆమెను వెంటబెట్టుకొని గంగాతీరమున ఆ దేవికి శ్రీహరిమంత్రమును, కవచమును, స్తోత్రమును పూజావిధానమునంతయు చెప్పెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే తృతీయోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున మూడవ అధ్యాయము సమాప్తము.