sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచమో
నారాయణ ఉవాచ - నారాణుడు నారదునితోనిట్లనెను.
శ్రుత్వా వ్రతవిధానే చ దుర్గా సంహృష్ణమానసా | పునః పప్రచ్ఛ కాంతం సా దివ్యాం వ్రతకథాం శుభాం || 1
నారదా! శంకరుడు చెప్పిన పుణ్యకవ్రతవిధానమును, దాని ఫలితమును విన్న పార్వతి సంతోషించిన మనస్సుతో శుభములనిచ్చు ఆ వ్రతకథను వినిపించుమని మరల పరమేశ్వరుని అడిగె ను.
శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను.
కిమద్భుత ఫలం నాథ విధానం ఫలమస్య చ | అధికాం తత్కథాం బ్రూహి వ్రతం కేన ప్రకాశితం || 2
పరమేశ్వరా! ఈ పుణ్యకవ్రతముయొక్క ఫలము చాల అద్భుతముగా నున్నది. అట్లే ఈవ్రతవిధానము అపూర్వముగానున్నది. అందువలన ఆ పుణ్యవ్రతకథను చక్కగా తెలుపుము. అదేవిధముగా ఆవ్రతమును ఎవరు వాడుకలోనికి తెచ్చిరో తెలుపుము అని అడిగెను.
అథపుణ్యకవ్రతకథా - పుణ్యకవ్రతకథా ప్రారంభము
శ్రీమహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లు పార్వతితోననెను.
శతరూపామనోః పత్నీ రుత్రదుఃఖేన దుఃఖితా | బ్రహ్మణః స్థానమాగత్య సా బ్రహ్మాణమువాచ హ || 3
మనువుయొక్క భార్యయగు శతరూపాదేవికి పుత్రదుఃఖమేర్పడినప్పుడు ఆమె బాధతో బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మతో ఇట్లు పలికెను.
శతరూపోవాచ- శతరూపాదేవి ఇట్లనెను.
బ్రహ్మాన్ కేన ప్రకారేణ వంధ్యాయాశ్చ సుతో బవేత్ | తన్మే బ్రూహి జగద్ధాతః సృష్టికారణకారణ || 4
తజ్జన్మ నిష్పలం బ్రహ్మన్నైశ్వర్యం ధనమేవ చ | కించిన్న శోభ##తే గేహే వినా పుత్రేణ పుత్రిణాం || 5
తపోదానోద్భవం పుణ్యం జన్మాంతరసుఖావహం | సుఖదో మోక్షదోప్రీతిదాతా పుత్రశ్చ పుత్రిణాం || 6
పుత్రీ పుత్రముఖం దృష్ట్వా చాశ్వమేధశతోద్భవం | ఫలం పున్నామనరకత్రాణహేతుం లభేత్ ధ్రువం || 7
ఓ బ్రహ్మదేవుడా! గొడ్రాలైన స్త్రీకి సంతానమెట్లు కలుగునో సృష్టికారణకారణుడవైన నీవు తెలుపుము. తల్లిదండ్రులకు సంతానము లేనిచో వారి జన్మ నిష్ఫలమగును. వారి ఐశ్వర్యము, ధనమంతయు వ్యర్థమగును. సంతానము లేనిచో వారి ఇల్లు బోసిపోయినట్లుండును. తపస్సు దానములవలన కలుగు పుణ్యము రాబోవు జన్మలలో సుఖము కలిగించును. కాని పుత్రుడు సుఖమున సంతోషమును ఈ జన్మలోనే ఇచ్చును. తల్లిదండ్రులు పుత్రుని ముఖము చూచినంతమాత్రమున నూరు అశ్వమేధయాగములు
చేసిన ఫలమును పొందుదురు. అది పున్నామనరకమునుండి వారిని రక్షించును.
పుత్రోత్పత్తేరుపాయం వై వద మాం తాపసంయుతాం | తదా భద్రం న చేత్ భర్త్రా సమాయాస్యామి కాననం || 8
గృహాణ రాజ్యమైశ్వర్యం ధనం పృథ్వీ ప్రజావహాం | కిమేతేనావయోస్తాత వినా పుత్రైరపుత్రిణోః || 9
అపుత్రిణో ముఖం ద్రష్టుం విద్వన్నోత్సహతేzశివం | ముఖం దర్శయితుం లజ్జాం సమవాప్నోత్యపుత్రకః || 10
అథవా గరళం భుక్త్వా ప్రవేక్ష్యామి హుతాశనం | అపుత్రపౌత్రమశివం గృహం స్యాత్ శ్రీవిహీనకం || 11
ఓ బ్రహ్మదేవుడా! సంతానములేదని బాధపడుచున్న నాకు పుత్రోత్పత్తి కలుగు ఉపాయమును తెలుపుము. లేనిచో నేను నా భర్త ఇద్దరము కలసి అడవికి పోయెదము. సంతానములేని మాకు ఈ రాజ్యమెందులకు? ఈ ఐశ్వర్యము, ధనము, భూమి ఇవన్ని ఉన్నప్పటికి వ్యర్థముగానున్నవి.
విద్వాంసుడు పుత్రులు లేనివాని ముఖము చూచుటకు ఇష్టపడడు. ఆ తల్లిదండ్రులు సహితము తమ ముఖమును నలుగురికి చూపుటకు సిగ్గుపడుదురు. నీవు మాకు పుత్రోత్పత్తి కలుగుమార్గము చూపించినచో విషముతిని, లేక నిప్పులోబడి మా ప్రాణములను వదలిపెట్టుదుము. సంతానము లేనివారి ఇల్లు శోభ##లేకయుండును.
ఇత్యేవముక్త్వా సా సాక్షాత్ బ్రహ్మణోzగ్రే రురోద హ | కృపానిధిశ్చ తాం దృష్ట్యా ప్రవక్తుముపచక్రమే || 12
ఈ విధముగాశతరూపాదేవి బ్రహ్మదేవునకు తనబాధ చెప్పుకొనుచు ఏడ్చెను. అప్పుడు దయానిధి యగు బ్రహ్మదేవుడు ఈ విధముగా ఆమెను ఓదార్చెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవు డిట్లు శతరూపతో పలికెను.
శ్రుణు వత్సే ప్రవక్ష్యామి పుత్రోపాయం సుఖావహం | సర్వైశ్వర్యాది బీజం చ సర్వవాంఛాప్రదం శివం || 13
మాఘ శుక్ల త్రయోదశ్యాం వ్రతమేతత్సుపుణ్యకం | కర్తవ్యం శుక్లకాలే చ కృష్ణమారాధ్య సర్వదం || 14
సంవత్సరం చ కర్తవ్యం సర్వవిఘ్న వినాశనం | ద్రవ్యాణి వేదైరుక్తాని వ్రతే దేయాని సువ్రతే || 15
వ్రతం చ కాణ్వశాఖోక్తం సర్వవాంఛితసిద్ధిదం | కృత్వా పుత్రం లభ శుభే విష్ణుతుల్య పరాక్రమం || 16
బ్రహ్మణ శ్చవచః శ్రుత్వా సా కృత్వా వ్రతముత్తమం | ప్రియవ్రతోత్తానపాదౌ లేభే పుత్రౌ మనోహరే || 17
ఓ శతరూపా! సమసై#్తశ్వర్యములను కలిగించునది. అన్ని కోరికలు తీర్చునది,
సుఖమునిచ్చునది యగు పుత్రులు కలుగు ఉపాయము నీకు చెప్పెదను వినుము.
ఈ సుపుణ్యక వ్రతమును మాఘశుద్ధత్రయోదశినాడు సమస్తవాంఛలు తీర్చు శ్రీకృష్ణుని ఆరాధించి చేయవలెను. సమస్త విఘ్నములను తొలగించు ఈ వ్రతమును సంవత్సరకాలము చేయవలెను. ఈ వ్రతమునకు అవసరమగు ద్రవ్యములన్నియు వేదమున చెప్పబడినవి. శుక్లయజుర్ వేదమందలి కాణ్వశాఖలో చెప్పబడిన ఈ వ్రతమునాచరించి విష్ణుమూర్తితో సమాను డగు పుత్రుని పొందుమని బ్రహ్మదేవుడు చెప్పగా విని శతరూపాదేవి ఆవ్రతము నాచరించి ప్రియవ్రత, ఉత్తాపాదులను పుత్రులను పడసినది.
వ్రతం కృత్వా దేవహుతిర్లేభే సిద్దేశ్వరం సుతం | నారాయణాంశం కపిలం పుణ్యకం పుణ్యదం శుభం || 18
అరుంధతీదం కృత్వా తు లేభే శక్తిసుతం శుభా | శక్తికాంతా వ్రతం కృత్వా సుతం లేభే పరాశరం || 19
అదితిశ్చ వ్రతం కృత్వా లేభే వామనకం సుతం | శచీ జయంతం పుత్రం చ లేభే కృత్వేదమీశ్వరీ || 20
ఉత్తానపాద పత్నీదం కృత్వా లేభే ధ్రువం సుతం | కుభేర జాయా కృత్వేదం లేభే చ నలకూబరం || 21
సూర్యపత్నీ మనుం లేబే కృత్వేదం వ్రతముత్తమం | అత్రిపత్నీ సుతం చంద్రం లేబే కృత్వేదముత్తమం || 22
లేభే చాంగిరసః పత్నీ కృత్వేదం వ్రతముత్తమం | బృహస్పతిం సురగురుం పుత్రమస్య ప్రభావతః || 23
భృగోర్భార్యా వ్రతం కృత్వా లేభే దైత్యుగురుం సుతం | శుక్రం నారాయణాంశం చ సర్వతేజస్వినాం వరం || 24
ఈవత్రము నాచరించి దేవహుతి నారాయణాంశుడగు కపిలమహర్షిని, వసిష్ఠమహర్షి భార్యయగు అరుంధతి శక్తిమహర్షిని, అతని భార్య పరాశరుని. అదితి వామనుని, ఇంద్రుని భార్యయగు శచీదేవీ జయంతుని, పొందెను. ఉత్తానపాదుని భార్య సునీతి ఈ వ్రతమునాచరించి తత్ప్రభావమువలన ధ్రువుడను పుత్రుని, కుబేరుని భార్య నలకూబరుడని పుత్రుని. సూర్యుని పత్ని వైవస్వత మనువును, అత్రిభార్యయగు అనసూయ చంద్రుని . అంగిరసమహర్షి భార్య సురగురువగు బృహస్పతిని, భృగుపత్ని నారాయణాంశసంభూతుడైన శుక్రుని పుత్రునిగా పడసెను.
ఇత్యేవం కథితం దేవి వ్రతానాం వ్రతముత్తమం | త్వమేవం కురు కల్యాణి హిమాలయసుతే శుభే || 25
సాధ్యం రాజేంద్రపత్నీనాం దేవీనాం చ సుఖావహం | వ్రతమేతన్మహాసాధ్వి సాధ్వీనాం ప్రాణతః ప్రియం || 26
వ్రతస్యాస్య ప్రభావతే స్వయంగోపాంగనేశ్వరః | ఈశ్వరః సర్వభూతానాం తవపుత్రో భవిష్యతి || 27
ఓ పార్వతీ! వ్రతములలో శ్రేష్ఠమైన పుణ్యకవ్రతమును గూర్చి నీకింతవరకు తెలిపితిని. ఈ వ్రతమును చక్రవర్తుల భార్యలే చేయగలరు. సామాన్యులు దీనిని చేయజాలరు. పతివ్రతలైన స్త్రీలకీ వ్రతము ప్రాణములకంటె మిన్నయైనది. అందువలన నీవీ వ్రతమునుచేసి దీనిప్రభావముచే గోపాంగనలకు ఈశ్వరుడు, సర్వప్రాణులకు ఆరాధ్యుడగు శ్రీకృష్ణుడు నీకు పుత్రుడు కాగలడు అని పరమేశ్వరుడనెను.
ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరరామ చ నారద | వ్రతం చకార సా దేవీ ప్రహృష్టా శంకరాజ్ఞయా || 28
ఈ విధముగా శంకరుడు పార్వతితో పలికినందువలన అతని ఆజ్ఞననుసరించి పార్వతీదేవి పుణ్యకవ్రతమును ఆచరించెను. ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి | సుఖదం మోక్షదం సారం గణశజనికారణం || 29
నారదమహర్షీ! నీకింతవరకు గణపతి జన్మకు కారణమైన వృత్తాంతమునంతయు తెల్పితిని . ఇది వినువారికి సుఖమును మోక్షమును కలిగించును.
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయ గణపతిఖండే నారదనారాయణసంవాదే పుణ్యకవ్రతకథనం నామ పంచమోzధ్యాయః ||
శ్రీబ్రహ్మవైవర్తక మహాపురాణమున మూడవదగు గణపతిఖండములో నారదనారాయణుల ప్రసంగసమయమున పేర్కొనబడిన పుణ్యకవ్రకథనమను
ఐదవ అధ్యాయము సమాప్తము.