sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్తమోZధ్యాయః - పార్వతీదేవి యొనర్చిన శ్రీకృష్ణ స్తోత్రము నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి నారదునితోనిట్లనెను. హరేరాజ్ఞాం సమాదాయ హరః సంహృష్టమానసః | ఉవాచ పార్వతీం ప్రీత్యా హరిసల్లాప మంగళం || 1 శంకరుడు శ్రీహరియొక్క ఆజ్ఞను గైకొనిసంతోషముతో పార్వతిని పుణ్యకవ్రత ము చేయమని చెప్పెను. శివాజ్ఞాం చ సమాదాయ శివా సంహృష్టమానసా | వాద్యం చ వాదయామాస మంగళం మంగళవ్రతే || 2 సుస్నాతా సుదతీ శుద్ధా బిభ్రతీ ధౌతవాససీ | సంస్థాప్య రత్నకలశం శుక్లధాన్యోపరి స్థిరం || 3 ఆమ్రపల్లవసంయుక్తం ఫలాక్షతసుశోభితం | చందనాగురు కస్తూరి కంకుమేన విరాజితం || 4 రత్నాసనస్థా రత్నాఢ్యా రత్నోద్భవసుతా సతీ | రత్నసింహాసనస్థాంశ్చ సంపూజ్య మునిపుంగవాన్ || 5 రత్నాసింహాసనస్థం చ సంపూజ్య సుపురోహితం | చందనాగురు కస్తూరీ రత్నభూషణభూషితం || 6 సంస్థాప్య పురతో భక్త్యా దిక్పాలాన్రత్నభూషితాన్ | దేవాన్నరాంశ్చనాగాంశ్చ సమర్చ్య విధిబోధితం || 7 సమర్చ్య పరయా భక్త్యా బ్రహ్మవిష్ణు మహేశ్వరాన్ | చందానాగురు కస్తూరీ కుంకుమేన విరాజితాన్ || 8 వహ్నిశుద్ధైస్సువసై#్రశ్చ సద్రత్నైర్భూషణౖస్తథా | పూజాద్రవ్యైశ్చ వివిధైం పూజితాన్ పుణ్యకే మునే | సమారేభే వ్రతం దేవీ స్వస్తివాచనపూర్వకం || పార్వతీదేవి తనభర్తయగు పరమేశ్వరుని ఆజ్ఞను గైకొని మంగళకరమైన పుణ్యకవ్రతమును మంగళవాద్యములతో ప్రారంభించెను. ఆ దేవి చక్కగా స్నానము చేసి ఉతికిని వస్త్రములు ధరించి బియ్యముపైన రత్నకలశమును స్థాపించెను. ఆ రత్నకలశమున మామిడియాకులు, ఫలములు, అక్షతలు, చందనము, అగురు, కస్తూరి, కుంకుమలను వేసి అలంకరించెను. అటుపిమ్మట ఆ దేవి రత్నాసింహాసనముపై కూర్చుండి మునులను రత్నసింహాసనమునపై కూర్చుండబెట్టి గౌరవించెను. అట్లే పురోహితుని రత్నసింహాసనముపై కూర్చుండబెట్టి వారికి చందనము, అగరు, కస్తూరీ, కుంకుమలనిచ్చినది, రత్నభూషణభూషితులైన దిక్పాలకులను తనముందు అష్టదిక్కులలో కూర్చండబెట్టి వారితోపాటు ఇతరదేవతలను, నరులను, నాగులను విధిపూర్వకముగా అర్చించినది. అటుపిమ్మట బ్రహ్మవిష్ణుమహేశ్వరులను చందనము, అగరు, కస్తూరి, కుంకుమలతో, పరిశుద్ధమైన నూతనవస్త్రములతో, రత్నభూషణములతో అనేకవిధములైన పూజాద్రవ్యములచే భక్తిపూర్వకముగా అర్చన చేసి పుణ్యకవ్రతమును స్వస్తివాచన పూర్వకముగా ఆ దేవి ప్రారంభించినది. ఆవాహ్యాభీష్టదేవం తం శ్రీకృష్ణం మంగళే ఘటే | భక్త్యా దదౌ క్రమేణౖవ చోపచారాంస్తు షోడశ || 10 యాని వ్రతే విధేయాని దేయాని వవిధాని చ | ప్రదదౌ తాని సర్వాణి ప్రత్యేకం ఫలదాని చ || 11 ప్రతోక్తమువహారం చ దుర్లభం భువనత్రయే | తచ్చ సర్వం దదౌ భక్త్యా సువ్రతే సువ్రతా సతీ || 12 పార్వతీదేవి తనముందు తండులములపైనున్న మంగళకలశమున తనకు అభీష్టదేవతయగు శ్రీకృష్ణపరమాత్మను ఆవాహనచేసి క్రమముగా షోడశోపచారములనన్నిటిని భక్తితో నొసగినది. అట్లే ఆ పుణ్యకవ్రతమున చేయదగు కార్యములను దానములను అన్నిటిని విడివిడిగా చేసినది. నియమపూర్వకముగా పుణ్యకవత్రమున చెప్పబడిన ఉపహారమునంతయు భక్తితో నొసగినది. దత్వా ద్రవ్యాణి సర్వాణి వేదమంత్రేణ సా సతీ | హోమం చ కారయామాస త్రిలక్షం తిలసర్పిషా | బ్రాహ్మణాన్ భోజయామాస పూజయిత్వాతిథీంస్తథా || 13 భోజయామాస సా దేవీ సువ్రతే సువ్రతా సతీ | ప్రత్యహం సవిధానం చ చక్రే సా పూర్ణవత్సరం || 14 సమాప్తిదివసే విప్రస్తామువాచ పురోహితః | సువ్రతే సువ్రతే మహ్యం దేహి త్వం పతిదక్షిణాం || 15 ఆ పుణ్యకవ్రతమున దానముచేయదగిన వాటినన్నిటిని వేదమంత్రపూర్వకముగా దానముచేసి తిలలు, నేయితో మూడులక్షల పర్యాయములు హోమము చేసినది. అటుపిమ్మట అతిథులనందరను గౌరవించి బ్రాహ్మణులకందరకు భోజనము పెట్టెను. ఇట్లు ప్రతిదినము విధిపూర్వకముగా భోజనము పెట్టుచు సంవత్సరము గడిపినది. సంవత్సరకాలము పూర్ణమైన పిదప వ్రతసమాప్తిదినమున పురోహితుడా పార్వతితో నాకు పతిదక్షిణనిమ్మని కోరెను. ఇతి తద్వచనం శ్రుత్వా విలప్య సురసంసది | మూర్ఛాం ప్రాప మహామాయా మాయామోహితచేతసా || 16 తాం చ తే మూర్ఛితాం దృష్ట్వా ప్రహస్య మునిపుంగవాః | శంకరం ప్రేషయామాస బ్రహ్మావిష్ణుశ్చ నారద || 17 సంప్రార్థితః సభాసద్భిః శివాం బోధయితుం తదా | శివః సముద్యమం చక్రే ప్రవక్తుం వదతాం వరః || 18 మహామాయయగు పార్వతి పురోహితుని మాటలు విని మాయవలన మోహముచెందిన మనస్సుగలదై ఎక్కువగా ఏడ్చి మూర్ఛపడిపోయెను. మూర్ఛపడియున్న పార్వతిని జూచి మునిపుంగవులు నవ్వుచుండగా అచ్చటనున్న సభాసదులు ప్రార్థింపగా బ్రహ్మవిష్ణువులు పార్వతిని ఓదార్చుటకు శివుని పంపిరి. అప్పుడు మాటకారియగు శివుడు పార్వతిని ఓదార్చుటకై ఇట్లు మాట్లాడసాగెను. శ్రీమహాదేవ ఉవాచ | మహాదేవుడిట్లు పార్వతితోననెను. ఉత్తిష్ఠ భ##ద్రే భద్రం తే భవిష్యతి న సంశయః | సాంప్రతం చేతనం కృత్వా మదీయం వచనం శ్రుణు || 19 శివః శివాం తామిత్యుక్త్వా శుష్కకంఠౌష్ఠతాలుకాం | వక్షసి స్థాపయామాస కారయామాస చేతనాం || 20 హితం సత్యం మితం సర్వం పరిణామ సుఖావహం | యశస్కరం చ ఫలదం ప్రవక్తుముపచక్రమే || 21 శ్రుణు దేవి ప్రవక్ష్యామి యద్వేదేన నిరూపితం | సర్వసమ్మతమిష్టం చ ధర్మార్థం ధర్మసంసది || 22 సర్వేషాం కర్మణాం దేవి సారభూతా చ దక్షినా | యశోదా ఫలదా నిత్యం ధర్మిష్ఠే ధర్మకర్మణి || 23 దైవం వా పైతృకం వాZపి నిత్యం నైమిత్తికం ప్రియే | యత్కర్మ దక్షిణాహీనం తత్సర్వం నిష్ఫలం భ##వేత్ | దాతా చ కర్మణా తేన కాలసూత్రం వ్రజేద్ధ్రువం || 24 అథాంతే దైన్యమాప్నోతి శత్రుణా పరిపీడితః | దక్షిణా విప్రముద్దిశ్చ తత్కాలం తు న దీయతే || 25 తన్ముహూర్తే వ్యతీతే తు దక్షిణా ద్విగుణా భ##వేత్ | చతుర్గుణా దినాతీతే పక్షే శతగుణా భ##వేత్ || 26 ఓసర్వమంగళా! నీకు తప్పకశుభము చేకూరును. ఇప్పుడు అవధానముతో నామాట వినుమని ఎండిపోయిన నాలుక, గొంతుకల పార్వతిని తన ఎదపై నుంచుకొని హితమైనవి. సత్యమైనవి కీర్తిని కలిగించునవి సత్ఫలితమునొసగునవి అగు మాటలను ఇట్లు చెప్పసాగెను. ఓదేవి! వేదమునందు పేర్కొనబడినది, అందరకు సమ్మతము, ఇష్టమైనది అగు నామాటను ధర్మపరిపాలకులు కల ఈ సభలో వినుము. దేవసంబంధము, పితృసంబంధమైనను, నిత్యమైనను, నైమిత్తకమైనను ధర్మకార్యములన్నిటిలో ''దక్షిణ'' తప్పక ఈయవలెను. దక్షిణ ఈయనిచో ఆ కర్మయంతయు నిష్ఫలమగును. పైగా దక్షిణలేక ధర్మకార్యములు చేయువాడు చివరకు కాలసూత్రమను నరకమునకు పోవును. ధర్మకార్యములనాచరింపుచున్న సమయమున దక్షిణ ఈ యవలసిన సమయమున దానినీయనిచో శత్రుబాధలనంది దీనుడగును. దక్షిణ ఈయవలసిన సమయము తప్పి ముహూర్తకాలము గడచినచో రెట్టింపు దక్షిణనీయవలెను. ఒక దినము దాటినచో ఈయవలసిన దక్షిణకంటె నాల్గురెట్లెక్కువ దక్షిణనీయవలెను. పక్షము గడచినచో నూరురెట్లెక్కువగా దక్షిణనొసగవలెను. మాసే పంచశతఘ్నా స్యాత్ షణ్యాసే తచ్చతుర్గుణా | సంవత్సరే వ్యతీతే తు కర్మ తన్నిష్ఫలం భ##వేత్ || 27 దాతా చ నరకం యాతి యావద్వర్షసహస్రకం | పుత్రపౌత్రధనైశ్వర్యం క్షయమాప్నోతి పాతకాత్ | ధర్మో నష్టో భ##వేత్తస్య ధర్మహీనే చ కర్మణి || 28 దక్షిణ ఈయవలసిన సమయము నెలదాటినచో ఐదువందల రెట్లెక్కువ దక్షిణీయవలెను. ఆరుమాసములు దాటినచో ఇంకను నాలుగురెట్లెక్కువ దక్షిణనీయవలెను. సంవత్సరము దాటినచో చేసిన ధర్మకార్యమంతయు నిష్ఫలమైపోవును. ఆతడు చేసిన ధర్మమంతయు నశించిపోవును. చివరకతడు వేల సంవత్సరములు నరకముననుండి బాధలననుభవించును అని పలికెను. శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను. రక్షస్వ ధర్మం ధర్మిష్టే ధర్మజ్ఞే ధర్మకర్మణి | సర్వేషాం చ భ##వేద్రక్షా స్వదర్మపరిపాలనే || 29 ధర్మములన్ని తెలిసి ధర్మకార్యములనాచరించు ఓ పార్వతి! నీవు ఈ ధర్మకార్యమున నీధర్మమును పరిపాలింపుము. స్వధర్మపరిపాలన చేసినచో ఇతరులకు కూడా రక్షణ జరుగును. బ్రహ్మోవాచ - బ్రమ్మదేవు డిట్లు పలికెను. యశ్చ కేన నిమిత్తేన న ధర్మం పరిరక్షతి | ధర్మే నష్టే చ ధర్మజ్ఞే తస్య కర్తా వినశ్యతి || 30 మానవుడు ఏదేని ఒక కారణమువలన తాననుష్ఠింపవలసిన ధర్మమును రక్షింపనిచో ధర్మనాశనము జరిగినందువలన ఆ ధర్మకర్మను అనుష్ఠించువాడుకూడ చెడిపోవును. ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను. మాం రక్ష యత్నతః సాధ్విప్రదాయ పతిదక్షిణాం | మయిస్థితే మహాసాధ్వి సర్వం భద్రం భవిష్యతి || 31 ఓ సాధ్వీమణి! ఈ వ్రతమున ఈయవలసిన పతిదక్షణనిచ్చి ధర్మరూపుడనగు నన్ను రక్షింపుము. నేనుచక్కగా నున్నప్పుడు మాత్రమే సమస్తశుభములు జరుగును. దేవా ఊచుః - దేవతలిట్లనిరి. ధర్మం రక్ష మహాసాధ్వి కురు పూర్ణం వ్రతం సతి | వయం తవవ్రతే పూర్ణే కుర్మస్త్వాం పూర్ణమానసాం || 32 ఓ మహాసాధ్వి ధర్మమును చక్కగా పరిపాలించి నీవు చేయుచున్న పుణ్యకవ్రతమును పూర్తిచేయుము. నీవు వ్రతమును సక్రమముగా పూర్తిచేసినచో మేమందరము నీ కోరికను తీరచెదము. మునయ ఊచుః - మునులిట్లనిరి. కృత్వా సాధ్వి పూర్ణహోమం దేహి విప్రాయ దక్షిణాం | స్థితేష్వస్మాసు ధర్మజ్ఞే కిమభద్రం భవిష్యతి || 33 ఓపతివ్రతాశిరోమణి! ఈపుణ్యకవ్రతమున నీవు పూర్ణహోమమును చేసి బ్రాహ్మణునకు పతిదక్షిణనిమ్ము. మేమందరముండగా నీకెట్టి చెడు జరుగదు. సనత్కుమార ఉవాచ - సనత్కుమారుడిట్లనెను. శివే శివం దేహి మహ్యం న చేత్కర్మఫలం త్యజ | సుచిరం సంచితస్యాZపి స్వాత్మనస్తపసః ఫలం || 34 కర్మణ్యదక్షిణ సాధ్వి యాగస్యాహం తు తత్ఫలం | ప్రాప్స్యామి యజమానస్య సంపూర్ణం కర్మణం ఫలం || 35 ఓ పార్వతీదేవి! నాకు శివుని పతిదక్షిణగానిమ్ము. లేనిచో నీవుచేసిన కర్మయొక్క ఫలితమునైనను వదలిపెట్టుము. అట్లే నీవు చాలాకాలమునుండి తపస్సుచేసి సంపాదించిన ఫలితమును కూడా వదలిపెట్టుము. ఈ పుణ్యకవ్రతమున దక్షిణనీయనిచో ఈయాగఫలితమును యజమానియొక్క సమస్తమైన సుకృతమును నేను గైకొందును. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. కిం కర్మణా మే దేవేశాః కిం మే దక్షిణయా మునే | కిం పుత్రేణ చ ధర్మేణ యత్ర భర్తా చ దక్షిణా || 36 వృక్షార్చనే ఫలం కిం వై యది భూమిర్నచార్చ్యతే | గతే చ కరాణ కార్యం కుతః సస్యం కుతః ఫలం || 37 ప్రాణాస్త్యక్తాః స్వేచ్ఛయా చేద్దేహైః స్యాత్కిం ప్రయోజనం | దృష్టిశక్తివిహీనేన చక్షుషా కిం ప్రయోజనం || 38 శతపుత్రసమః స్వామీ సాధ్వీనాం చ సురేశ్వరాః | యది భర్తా వ్రతే దేయః కిం వ్రతేన సుతేన వా || 39 భర్తుర్వంశశ్చ తనయః కేవలం భర్తృమూలకః | యత్ర మూలం భ##వేద్భ్రష్టం తద్వాణిజ్యం చ నిష్ఫలం || 40 ఓ దేవతలారా! ఈ పుణ్యకవ్రతమున భర్తను దక్షిణగా ఈయవలసినచో ఈ వ్రతమెందులకు? ఈ పుత్రుడెందుకు? ఈ ధర్మమెందుకు వీటివలన నాకు ప్రయోజనమేమి లేదు. భూమిని పూజింపక వృక్షమును పూజించినచో ఫలితమేమి? కారణములేనిచో కార్యముండదుగదా. భర్త పతివ్రతలకు అనేకపుత్రులతో సమానమైనవాడు. అట్టి భర్తను ఈ వ్రతమున దానము చేసినచో ఈవ్రతము ఈ వ్రతఫలమైన పుత్రులున్నను ప్రయోజనముండదుకదా. పుత్రుడు భర్తకు చెందనవాడు. భర్తృమూలమైనవాడు. వర్తకములో అసలునకే మోసము కలిగినచో ఆ వాణిజ్యమే వ్యర్థమైపోవునుకదా. అందువలన నాభర్తలేని ఈ వ్రతము వ్యర్థమైనదని పార్వతి పలికెను. శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువు ఇట్లనెను. పుత్రాదపి పరః స్వామీ ధర్మశ్చ స్వామినః పరః | నష్టే ధర్మే చ ధర్మిష్ఠే స్వామినా కిం సుతేన చ || 41 ఓపార్వతీదేవి! భర్త పుత్రునికంటె గొప్పవాడే. అట్లే ధర్మము భర్తకంటె శ్రేష్ఠమైనది. అట్టి ధర్మము నశించినచో భర్త పుత్రులున్నను ప్రయోజనమేముండుననెను. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవు డిట్లనెను. స్వామినశ్చ పరో ధర్మో ధర్మాత్సత్యం చ సువ్రతే | సత్యం సంకల్పితం కర్మ న తు భ్రష్టం కురు వ్రతం || 42 ఓ దేవి! భర్తకంటె ధర్మము గొప్పనిది. దర్మమునకంటెసత్యము పరమశ్రేష్ఠమైనది. సత్యసంకల్పితమైన కర్మ ఇంకను భ్రష్టము కాలేదు కావున వ్రతమును నీవు ఆచరింపుము అని పలికెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. నిరూపితశ్చ వేదేషు స్వశబ్దో ధనవాచకః | తద్యస్యాస్తీతి స స్వామీ వేదజ్ఞ శ్రుణు మద్వచః || 43 తస్య దాతా సదా స్వామీ న చ స్వం స్వామితాం లభేత్ | అహోZవ్యవస్థాభవతాం వేదజ్ఞానామబోధతః || 44 సమస్తవేదములు తెలిసిన బ్రహ్మదేవుడా! వేదములందు ''స్వ'' శబ్దమునకు ధనమను అర్థముకలదు. ఆ ధనము ఎవరివద్ద నుండునో అతనిని స్వామియని పిలుతురు. ఆధనమును దానము చేయువానిని స్వామియని యందురు. కాని ధనమెప్పుడు స్వామికాజలదు. అట్లే పరమశివుని ధనమగు నేను అతనిని ఎట్లు దాసమిత్తును? ఇది చాలా విపరీతమైనదని పలికెను. ధర్మువాచ - ధర్మదేవత ఇట్లు పలికెను. పత్నీవినాZన్యం స్వం సాధ్వి స్వామినం దాతుమక్షమా | దంపతీ ధ్రువమేకాంగౌ ద్వయోర్దానే ద్వకౌ సమౌ || 45 భార్యతప్ప ఇతరులెవ్వరు భర్తృదానము చేయలేరు. ఎందుకంటే దంపతులిద్దరు ఏకాంగరూపులు. ఒకరినొకరు దానము చేయుటలో ఇద్దరకు సమానమైన అధికారము కలదనెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. పీతా దదాతి జామాత్రే స చ గృహ్ణాతి తత్సుతాం | నశ్రుతం విపరీతం చ శ్రుతౌ శ్రుతిపరాయణాం || 46 వేదవేదాంగములన్నియు తెలిసిన ధర్మాదిదేవతలారా! వేదములందు తండ్రి తన కూతురును అల్లునకు దానము చేయునట్లు, అల్లుడు ఆమెను స్వీకరించునట్లు కలదు కాని మీరన్నట్లు భర్త భార్యను, భార్య భర్తను దానము చేయుచున్నట్లు ఎక్కడ కనిపించదు. మీమాట వేదవిరుద్ధముగా నున్నదనెను. దేవా ఊచుః - దేవతలిట్లనిరి. బుద్ధిస్వరూపా త్వం దుర్గే బుద్ధిమంతో వయం త్వయా | వేధజ్ఞే వేదవాదేషు కే వా త్వాం జేతుమీశ్వరాః || 47 నిరూపితా పుణ్యకేతువ్రతే స్వామీ చ దక్షిణాః | శ్రుతౌ శ్రుతోయః స ధర్మో విపరీతో హ్యధర్మకః || 48 వేదమర్మములన్ని తెలిసిన ఓ దుర్గాదేవీ! నీవు బుద్ధిస్వరూపురాలవు. నీ అనుగ్రహము వలన మేమందరము బుద్ధిమంతులమైతిమి. అందువలన నీతో వేదవిషయముల గురించి చర్చించుటకు మాకు సామర్థ్యము లేదు. కానీ వేదములందు పుణ్యకవ్రతమున భర్తను దక్షిణగా ఈయవలెనని చెప్పబడినది. వేదచోదితమైనదే ధర్మము. తద్విరుద్ధమైనది. అధర్మమే యగునని అనిరి. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. కేవలం వేదమాశ్రత్య కః కరోతి వినిర్ణయం | బలవాన్ లౌకికో వేదాత్ లోకాచారం చ కస్త్యజేత్ || 49 వేదే ప్రకృతి పుంసోశ్చ గరీయాన్పురుషో ధ్రువం | నిబోధత సురాః ప్రాజ్ఞా బాలాZహం కథయామి కిం || 50 ఓ దేవతలారా! వేదమును మాత్రమనుసరించి దర్మనిర్ణయము చేయుట పరియైన పద్ధతికాదు. లౌకికమైన ఆచారము వేదముకంటె బలమైనది కావున దానినెవ్వరు కాదనలేరు. వేదములలో సైతము ప్రకృతికంటె పురుషుడు చాలా గొప్పవాడని చెప్పబడినది. అందువలన ప్రకృతిరూపిణియగు స్త్రీ తన పురుషుని ఎట్లు దానముచేయగలదు? మీరందరు మిక్కిలి జ్ఞానవంతులు. నేనో బాలను. మీకు నేనే మి చెప్పగలననెను. బృహస్పతిరువాచ - బృహస్పతి ఇట్లు చెప్పెను. న పుమాంసం వినా సృష్టిర్న సాధ్వి ప్రకృతిం వినా | శ్రీకృష్ణశ్చ ద్వయోః స్రష్టా సమౌ ప్రకృతిపూరుషౌ || 51 అట్లే ఓ పతివ్రతా! పురుషుడు లేకుండా సృష్టి ఎట్లు జరుగదో ప్రకృతిస్వరూపిణియగు స్త్రీలేకుండా సృష్టి జరుగదు. శ్రీకృష్ణపరమాత్మ సృష్టి కార్యమునకై ప్రకృతి పురుషులనిద్దరను సృష్టించెను. కావున ప్రకృతిపురుషులిద్దరు సమానులేయని యనెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. సర్వస్రష్టా చ యః కృష్ణః సోంZశేన సగుణః పుమాన్ | పుమాన్గరీయాన్ ప్రకృతేస్తథైవ న తతశ్చ సా || 52 చరాచరసృష్టికంతయు కారకుడగు శ్రీకృష్ణుని అంశస్వరూపమే పురుషుడు అందువలన అతడు ప్రకృతికంటె శ్రేష్ఠుడు. ప్రకృతి అతనికంటె శ్రేష్ఠురాలెన్నటికీ కాజాలదని పల్కెను. ఏతస్మిన్నంతరే దేవా మునయస్తత్ర సంసది | రత్నేంద్రసారరచితమాకాశే దదృశూ రథం || 53 పార్షదైస్సంపరివృతం యుతం శ్యామైశ్చతుర్భుజైః | వనమాలాపరివృతై రత్నభూషభూషితైః | అవరుహ్య ముదా యానాదాజగామ సభాతలం || 54 తుష్టువుస్తం సురేంద్రాస్తే దేవం వైకుంఠవాసినం | శంఖచక్రగదాపద్మధరమీశం చతర్భుజం || 55 లక్ష్మీ సరస్వతీ కాంతం శాంతం తం సుమనోహరం | సుఖదృశ్య మభక్తానామదృశ్యం కోటి జన్మభిః || 56 కోటికందర్పలావణ్యం కోటి చంద్రసమప్రభం | అమూల్యరత్నరచిత చారుభూషణ భూషితం || 57 సేవ్యం బ్రహ్మది దేవైశ్చ సేవకైః సంతతం స్తుతం | తద్భాసా సంపరిచ్ఛన్నైర్వేష్టితం చ సురర్షిభి || 58 వాసయామాస తం తే చ రత్నసింహాసనే వరే | తం ప్రణముశ్చ శిరసా బ్రహ్మశక్తి శివాదయః || 59 సంపుటాంజలయః సర్వే పులకాంగాశ్రులోచనాః || 60 సస్మితస్తాంశ్చ పప్రచ్ఛ సర్వం మధురయా గిరా | ప్రబోధితః సుబోధజ్ఞః ప్రవక్తుముపచక్రమే || 61 ఆ సమయమున ఆసభలోనున్న దేవతలు మునులు ఆకాశమున రత్ననిర్మితమైన అద్భుత రథమును చూచిరి. ఆ రథము చుట్టు వనమాల, రత్నభూషణములచే అలంకరించబడినవారు నాల్గుభుజములు నల్లనివర్ణముకల అనుచరులుండిరి. ఆ రథమునుండి చతుర్భుజుడు, శంఖచక్ర గదాపద్మముల ధరించినవాడు, వైకుంఠలోకవాసి, లక్ష్మీసరస్వతులకు ప్రియుడు, శాంతుడు, అందమైనవాడు, భక్తులకు తేలికగా కన్పించువాడు భక్తులు కానివారికి కోటిజన్మలకైనను దర్శనమొసగనివాడు. కోటిమన్మథుల లావణ్యము కలవాడు. అందమైన రత్నభూషణములచే ఆలంకృతుడు, అగునారాయణుడు బ్రహ్మాదిదేవతలు, మహర్షులు సేవించుచుండగా క్రిందకు దిగి ఆ సభాస్థలికి వచ్చెను. రత్నసింహాసనమును సుఖోపవిష్టుడైన ఆ నారాయణుని బ్రహ్మశక్తి శివాదిదేవతలు నమస్కరించి చేతులు జోడించుకొని పులకితగాత్రులై కన్నీరుకర్చుచు ఆశ్చర్యమున తేలియాడుచుండగా ఆ శ్రీమన్నారాయణుడు వారి యోగక్షేమములను విచారించి ఇట్లు పలికెను. శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు పలికెను. సహ బుధ్యా బుద్ధిమంతో న వక్తుముచితం సురాః | సర్వే శక్త్యా యయా విశ్వే శక్తిమంతో హి జీవినః || 62 బ్రహ్మాదితృణపర్యంతం సర్వం ప్రాకృతికం జగత్ | సత్యం వినా మాంచ మయా శక్తిః ప్రకాశితా || 63 ఆవిర్భూతా చ సా మత్తః సృష్టా దేవీ మదిచ్ఛయా | తిరోహితా చ సా శేషే సృష్టిసంహారణ మయి || 64 ప్రకృతిః సృష్టికర్త్రీ చ సర్వేషాం జననీ పరా | మమతుల్యా చ మన్మాయా తేన నారాయణీ స్మృతా || 65 సుచిరం తపసా తప్తం శంభునా ధ్యాయతా చ మాం | తేన తసై#్మ మయా దత్తా తపసాం ఫలరూపిణీ || 66 వ్రతం చ లోకశిక్షార్థమస్యా న స్వార్థమేవ చ | స్వయం వ్రతానాం తపసాం ఫలదాత్రీ జగత్త్రయే || 67 మాయయా మోహితాః సర్వే కిమస్యా వాస్తవం వ్రతం | సాధ్యమస్య వ్రతఫలం కల్పే కల్పే కల్పే పునః పునః || 68 సురేశ్వరా మదంశాశ్చ బ్రహ్మశక్తి మహేశ్వరాః | కలాః కలాంశరూపాశ్చ జీవినశ్చ సురాదయః || 69 మృదా వినా ఘటం కర్తుం కులాలశ్చ యథాZక్షమః | వినా స్వర్ణం స్వర్ణకారః కుండలం కర్తుమక్షమః || 70 వినా శక్త్యా తథాZహం చ స్వసృష్టిం కర్తుమక్షమః | శక్తిప్రధానా సృష్టిశ్చ సర్వదర్శనసమ్మతా || 71 అహమాత్మా హి నిర్లిప్తోZ దృశ్యః సాక్షీ చ దేహినాం | దేహాః ప్రాకృతికాస్సర్వే నశ్వరాః పాంచభౌతికాః || 72 ఓ దేవతలారా! మీరందరు బుద్ధిమంతులు, మీకు చెప్పటు దగనిదైనను చెప్పుచున్నాను. ఈ ప్రపంచముననున్న జీవులందరు దుర్గాదేవివలననే శక్తి కలిగియున్నారు. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలుకొని గడ్డిపరకవరకు సమస్తము ప్రాకృతికము, నేను మాత్రము దీనికి అతీతుడను, అట్టి నేను శక్తి స్వరూపిణియగు ఈదేవిని సృష్ట్యారంభకాలమున నాశరీరమునుండి సృష్టించితిని. ఈ దేవి సృష్టి సంహారము జరిగినప్పుడు శేషునిలో అంతర్ధానము చెందును. ఈ దేవి ప్రకృతి స్వరూపిణి. సృష్టికి ప్రధానహేతువు కావునసమస్త చరాచర సృష్టికోటికి జననిగా పేరుపడసినది. ఈ మాయ నాతో సమానమైనది కావున ఈమెను నారాయణియని కూడా పిలుతురు. శంకరుడు నన్నుగురించి తీవ్రమైన తపస్సు చేయుటవలన అతని తపస్సునకు ఫలితముగా ఈ దేవినతని కొసగితిని. ఈ పార్వతీదేవి తాను స్వయముగా సమస్తవ్రతములు, తపస్సులయొక్క ఫలితమునిచ్చును. ప్రస్తుతము ఆదేవి దీనిని జనులందరు వ్రతమును చేయవలనను సంకల్పముతోనే చేయుచున్నదిగాని తనకేదో ప్రయోజనమున్నది అని ఈ వ్రతము చేయుటలేదు. మీరందరు ఆ దేవియొక్క మాయవలన మోహము చెందినారుకానీ ఆమె వాస్తవముగా వ్రతము చేయనవసరములేదు. ఈ వ్రతఫలము ప్రతికల్పమున ఆ దేవికి లభించును. బ్రహ్మ, శక్తి, శివుడు, ఇంద్రుడు, మొదలగు దేవతాధిపతులు నాయొక్క అంశవలన పుట్టినవారు, ఇతరదేవతలు, ప్రాణులు నాయొక్క అంశాంశములనవలన జన్మించినారు. కుమ్మరివాడు మట్టిలేక కుండలెట్లు చేయజాలడో, కంసాలివాడు బంగారములేక కుండలములెట్లు చేయలేడో, అట్లే నేనుకూడా శక్తిస్వరూపిణియగు ఈ దేవిలేక సృష్టిని చేయజాలను, సృష్టికార్యమున ఈ శక్తియే ప్రధానకారణము. నేను నిర్లిప్తుడనై, సమస్తజీవులకు ఆత్మరూపుడనై, సాక్షిగా ఉందును. ప్రకృతికి సంబంధించిన ఈ పాంచభైతికదేహములన్నియు నశించిపోవుననే అని అనెను. అహం నిత్యః శరీరీ చ భానువిగ్రహవిగ్రహః | సర్వాధారా సా ప్రకృతిః సర్వాత్మాZహం జగత్సుచ || 73 అహమాత్మామనో బ్రహ్మా జ్ఞానరూపో మహేశ్వరః | పంచప్రాణాః స్వయం విష్ణుః బుద్ధిః ప్రకృతిరీశ్వరీ || 74 మేధా నిద్రాదయశ్చైతాః సర్వాశ్చ ప్రకృతేః కళాః | సా చ శైలేంద్ర కన్యేషాత్వితి వేదే నిరూపితం || 75 అహం గోలోకనాథశ్చ వైకుంఠేశః సనాతనః | గోపిగోపైః పరివృతః తత్రైవ ద్విభుజః స్వయం || చతుర్భుజోZత్ర దేవేశో లక్ష్మీశః పార్షదైఃవృతః || 76 ఊర్ద్వంపరశ్చ వైకుంఠాత్ పంచాశత్కోటియోజనే | మమాశ్రయశ్చ గోలోకే యత్రాహం గోపికాపతిః || 77 వ్రతారాధ్యస్స ద్విభుజః సచ తత్సలదాయకః | యద్రూపం చింతయేద్యోహితచ్చ తత్ఫలదాయకః || 78 అట్లే సూర్యునివంటి శరీరకాంతిగల నేను నిత్యుడను. ఈ జగములందన్నిటిలో నేను సమస్తప్రాణులకు ఆత్మభూతుడను. ప్రకృతిస్వరూపిణియగు ఈ దేవి సమస్తప్రాణులకు ఆధారభూతమైనది. సమస్తజీవులకు నేను ఆత్మను. బ్రహ్మదేవుడు మనోరూపుడు. మహేశ్వరుడు, జ్ఞానరూపుడు, మేధ, నిద్ర మొదలగునవన్నియు ప్రకృతియమొక్క అంశలు. ఆ ప్రకృతియే ఈ పార్వతీదేవియని వేదములలో చెప్పబడినది. వైకుంఠలోకాధిపతియగు నేను గోపగోపీపరివృతుడునైన శ్రీకృష్ణడను. గోలోకమున నేను ద్విభుజుడనై గోలోకముననుందును. వైకుంఠమున చతుర్భుజుడనై లక్ష్మీపతినై నా అనుచరగణముతో కలసియుందును. ఈ వైకుంఠలోకమునకు ఏబదికోట్ల యోజనములపైన గోలోకము కలదు. అచ్చట నేను గోపికాపతినై రెండుభుజములతో, వ్రతములచే ఆరాధించబడుచు వాటి ఫలితములనొసగుచుందును. జీవులు నన్నేరూపమున స్మరించిన వారికి ఆరూపముతో ఫలితమునొసగుదును. అని నారాయణుడనెను. వ్రతం పూర్ణం కురు శివే శివం దత్వా చ దక్షిణాం | పునః సముచితం మూల్యం దత్వా నాథం గ్రహిష్యసి || 79 విష్ణుదేహా యథా గావో విష్ణుదేహస్తథా శివః | ద్విజాయ దత్వా గోమూల్యం గృహాణ స్వామినం శుభే || 80 యజ్ఞపత్నీం యథా దాతుం క్షమః స్వామీ సదైవ తు | తథా సా స్వామినం దాతుమీశ్వరీతి శ్రుతేర్మతం || 81 ఇత్యుక్త్వా స సభామధ్యే తత్రైవాంతరధీయత | దృష్టాస్తే సా చ సంహృష్టా దక్షిణాం దాతుముద్యతా || 82 ఓ పార్వతీ! శివుని దక్షిణగానొసగి నీవ్రతము పూర్తిచేసికొనుము. తరువాత అతనికి తగిన మూల్యమును చెల్లించి నీభర్తను తిరిగి తీసుకొనుము. గోవులు విష్ణుమూర్తికి దేహములు. అట్లే శివుడుకూడ విష్ణుమూర్తి దేహమే కావున గోమూల్యమును బ్రాహ్మణునకు చెల్లించి నీభర్తను స్వీకరింపుము. యజమాని యజ్ఞకర్మయందు యజ్ఞపత్ని నేవిధముగా దానమిచ్చునో అట్లే యజ్ఞపత్నిసైతము అతనని దానమివ్వవచ్చునని వేదముల యందు చెప్పబడినది. ఇట్లు శ్రీమన్నారాయణుడు ఆ సభాస్థలియందు దేవతలమధ్య పార్వతీదేవికి తెలిపి అంతర్ధానము చెందగా దేవతలందరు సంతోషపడిరి. పార్వతీదేవికూడా ఆతనిమాటలవలన సంతృప్తి చెంది భర్తృదానము చేయుటకు సన్నద్ధమాయెను. కృత్వా శివా పూర్ణహోమం సా శివం దక్షిణాం దదౌ | స్వస్తీత్యుక్త్వా చ జగ్రాహ కుమారో దేవసంసది || 83 ఉవాచ దుర్గా సంత్రస్తా శుష్కకంఠౌష్ఠతాలుకా | కృత్వాంజలిపుటం విప్రంహృదయేన విదూయతా || 84 అప్పుడు పార్వతీదేవి తానుచేసిన వ్రతమున పూర్ణహోమము చేసి బ్రహ్మదేవుని పుత్రుడగు సనత్కుమారునకు తన భర్తయగు శివుని దక్షిణగా నొసగెను. అటుపిమ్మట దుర్గాదేవి ఎండిన గొంతుకతో, పెదవులతో హృదయము క్షోభ##చెందుచుండగా చేతులు జోడించుకొని సనత్కుమారునితో ఇట్లనెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. గోమూల్యం మత్పతిసమమితి వేదే నిరూపితం | గహం లక్షం ప్రదాస్యామి దేహి మత్‌స్వామినం ద్విజ || 85 తదా దాస్యామి విప్రేభ్యో దానిని వివిధాని చ | ఆత్మహీనో హ దేహశ్చ కర్మ కింకర్తుమీశ్వరః || 86 నాభర్తయగు శివునితో ఆవు సమానమైనదని వేదములందు చెప్పబడినది.కావున నీకు లక్ష ఆవులనిచ్చెదను. నాభర్తను తిరిగి నాకిమ్ము. అటుపిమ్మట బ్రాహ్మణులకు వివిధములైన దానములు చేయుదును, నా దేహమిప్పుడు ఆత్మలేకుండనున్నది. అందువలన నేనేమి చేయలేకపోవుచున్నాను. కావునగోమూల్యమును తీసుకొని నాభర్తను తిరిగి ఇమ్మని పార్వతీదేవి సనత్కుమారుని ప్రార్థించినది. సనత్కుమార ఉవాచ - సనత్కుమారుడిట్లనెను. గవాం లక్షేణ మే దేవి వల్గునా కిం ప్రయోజనం | దత్తస్యామూల్యరత్నస్య గవాం ప్రత్యర్పణన చ || 87 స్వస్య స్వస్య స్వయం దాతా లోకః సర్వో జగత్త్రయే | కర్తురేవేప్సితం కర్మ భ##వేత్కిం వా పరేచ్ఛయా || 88 దిగంబరం పురః కృత్వా భ్రమిష్యామి జగత్త్రయం | బాలకానాం బాలికానాం సమూహస్మిత కారణం || 89 ఓ పార్వతీదేవి! నీవు అమూల్యమైన రత్నమును దానమిచ్చితివి. దానికి బదులుగా నీవు లక్ష గోవులిచ్చినను ప్రయోజనమేమున్నది? ఈలోకములన్నిటిలోను అందరు తనయెక్క ఇచ్ఛనుసరించి దానాదికార్యములు చేయుదురు. కర్త తన ఇచ్ఛననుసరించి కర్మచేయును కాని ఇతరుల అభీష్టముననుసరించి దానాది కార్యములు చేయడు. అందువలన స్వీకరించిన దానములను నా ఇష్టము వచ్చినట్లు చేయుటకు నాకధికారమున్నది. కావున శివుని దిగంబరునిగా చేసి బాలురు, బాలికలు నవ్వుచుండగా ముల్లోకములు తిప్పెదను అని పలికెను. ఇత్యుక్త్వా బ్రహ్మణః పుత్రో గ్రహీత్వా శంకరం మునే | సన్ని ధౌ వాసయామాస తేజస్వీ దేవసంసది || 90 సనత్కుమారుడిట్లు పలుకుచు శంకరుని చేతితోపట్టుకొని ఆదేవతాసభలో కూర్చొనబెట్టెను. దృష్ట్వా శివం గృహ్యమాణం కుమారేణ చ పార్వతీ | సముద్యతా తనుం త్యక్తుం శుష్కకంఠౌష్ఠతాలుకా || 91 విచింత్య మనసా సాధ్వీత్యేవమేవ దురత్యయం | న దృష్టోZభీష్టదేవశ్చ న చ ప్రాప్తం ఫలంవ్రతే || 92 సనత్కుమారుడు శివుని చేతబట్టుకొనిపోవుచుండగా పార్వతి చూచి ఎండిపోయిన గొంతు పెదవులుకలదై నాలుక తడియారిపోవుచుండగా తాను చచ్చిపోవుటకు సిద్ధపడెను. ఈవ్రతము చేయుటవలన తనకు అభీష్టదేవదర్శనము జరుగలేదు. ఆశించిన వ్రతఫలముకూడ దక్కలేదు పైగా చెడు జరగినదని భావించి చనిపోవుట కాదేవి ప్రయత్నించెను. ఏతస్మిన్నంతరే దేవాః పార్వతీసహితాస్తదా | సద్యో దదృశురాకాశే తేజసాం నికరం పరం || 93 కోటిసూర్యప్రభోర్ద్వం చ ప్రజ్వలంతం దిశో దశ | కైలాసశైలపురతః సర్వదేవాదిభిర్యుతం || 94 సర్వాశ్రయం గణాచ్ఛన్నం విస్తీర్ణం మండలాకృతిం | తచ్చ దృష్ట్వా భగవతస్తుష్టువుస్తే క్రమేణ చ || 95 ఆసమయమున ఆకాశమున ఒక గొప్పని వెలుగు కనిపించినది. ఆ తేజస్సు కోటిసూర్యులకాంతికంటె మిన్నయై అన్ని దిక్కులలో ప్రకాశించుచుండెను. కైలాసపర్వతముముందు కనిపించిన ఆ తేజస్సు వెంట సమస్త దేవతలుండిరి. సమస్త గణములుండివి. మండలాకారముననున్న ఆ తేజస్సును పార్వతీదేవి మొదలుగాగల సమస్త దేవతలు చూచి క్రమముగా అతనినిట్లు స్తుతించిరి. విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను. బ్రహ్మాండాని చ సర్వాణి యల్లోమవివరేషు చ | సోZయం తే షోడశాంశశ్చ కే వయం యో మహాన్విరాట్ || 96 ఈబ్రహ్మాండములన్నియు మహావిరాట్స్వరూపుని రోమకూపములందు అణగియున్నవి. అట్టి మహావిరాట్పురుషుడు పరమాత్మవగు నీయొక్క పదునారవ అంశము కదా. అందువలన సర్వాతీతుడై పరగుచున్నావని అనెను. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను. వేదోపయుక్తం దృశ్యం యత్ప్రత్యక్షం ద్రష్టుమీశ్వరః | స్తోతుం తద్వర్ణితుమహం శక్తః కిం స్తౌమి తత్పరం || 97 ఓమహానుభావ! వేదములందు పేర్కొనబడినవానిని, ప్రత్యక్షముగానున్నవానిని నేను స్తుతింపగలను. అట్లే చూడగలను. కాని వేదములకంటెను పరుడైన ఆపరమాత్మను నేనెట్లు స్తుతింపగలనని బ్రహ్మదేవుడు పలికెను. శ్రీమహాదేవ ఉవాచ | మహాదేవు డిట్లు పలికెను. జ్ఞానాధిష్ఠాతృదేవోZహం స్తౌమిజ్ఞానవరం చ కిం | సర్వానిర్వచనీయం త్వాం చ స్వేచ్ఛామయం విభుం || 98 ఓ పరమేశ్వరా! నీవు సర్వజ్ఞానముల కతీతుడవు. నిన్ను ఎవ్వరును నిర్వచించి చెప్పలేరు. నీవు స్వేచ్ఛామయుడవు. అట్టి నిన్ను జ్ఞానాధిష్ఠాన దేవతయగు నేను స్తుతింపజాలను. అందువలన ఇతరులు నిన్నేవిధముగా స్తుతింపగలుగుదురు? ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను. అదృశ్యమవతారేషు య ద్దృశ్యం సర్వజంతుభిః | కిం స్తౌమి తేజోరూపం తద్భక్తానుగ్రహ విగ్రహం || 99 నీవు అదృశ్యుడవైనను అవతారసమయమున నిన్ను సమస్తప్రాణులు దర్శింపగలుగుదురు. నీవు భక్తలననుగ్రహించుటకై రూపమునుధరించి అందరకు దర్శనమొసగుచున్నావు. అట్టి తేజస్వ్వరూపుడైన నిన్ను ఎట్లు నేను స్తుతింపగలను దేవా ఊచుః - దేవతలు ఇట్లు పలికిరి. కే వయం త్వత్కలాంశాశ్చ కిం వా త్వాం స్తోతుమీశ్వరాః | స్తోతుం న శక్తాః వేధాయం నచ శక్తా సరస్వతీ || 100 ఓ పరమాత్మా! మేమందరము నీయొక్క అంశాంశ స్వరూపులము. అట్టి మేము నిన్నెట్లు స్తుతింపగలము. అట్లే వేదములు కాని సరస్వతీదేవి గాని నీ సమస్తగుణములను స్తుతింపసమర్థులు కారని పల్కెను. మునయ ఊచుః - మునులిట్లు పలికిరి. వేదాన్పఠిత్వా విద్యాంసో వయం కిం వేదకరాణం | స్తోతుమీశా న వాణీ చ త్వాం వాఙ్మనసోః పరం || 101 మేమందరము వేదములనన్నిటిని చదివి విద్వాంసులమైతిమి కాని వేదములకు మూలపురుషుడవు, వాక్కు మనస్సులకు అతీతముగనున్న నిన్ను మేముకాని చదువులతల్లియగు సరస్వతిగాని స్తుతిచేయసమర్థులముకామని పలికిరి. సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికెను. వాగధిష్ఠాతృదేవీం మా వదంతే వేదవాదినః | కంచిన్న శక్తా త్వాం స్తోతుమహో వాఙ్మ నసఃపరం 102 వేదవేదార్థపారంగతులైన మహర్షులు వాక్కులకు అధిష్ఠానదేవతనని నన్ను స్తుతింతురు కాని వాక్కుకు మనస్సునకు అతీతుడవగు నిన్ను నేను కానీ మహర్షులు కాని సుతింపజాలమని పలికెను. సావిత్ర్యువాచ - సావిత్రీదేవి ఇట్లు పలికెను. వేదప్రసూరహం నాథసృష్టా త్వత్కలయా పురా | కిం స్తౌమి స్త్రీస్వభావేన సర్వకరాణ కారణం || 103 లక్ష్మీరువాచ - లక్ష్మీదేవి ఇట్లు పలికినది. త్వదంశవిష్ణుకాంతాZహం జగత్పోషణకారణీ | కిం స్తౌమి త్తత్కలాసృష్టా జగతాం బీజకారణం || 104 జగములనన్నిటిని పోషించుటకు కారణభూతురాలను నీ అంశ వలన జన్మించిన శ్రీమహావిష్ణువుయొక్క భార్యనగు నేనుకూడా నీ అనంతగుణములను స్తుతింపలేకపోవుచున్నాను. అని పలికెను. హిమాలయ ఉవాచ - హిమాలయ మిట్లనెను. హసంతి సంతో మాం నాథ కర్మణా స్థావరం పరం | స్తోతుం సముద్యతం క్షుద్రః కిం స్తౌమి స్తోతుమక్షమః || 105 ఓ పరమేశ్వరా! నీ కల్యాణగుణగణమును వర్ణించుటకు ప్రయత్నించు నన్ను చూచి సత్పురుషులు ఇతడు చలనములేని వాడనని చెప్పుచు అవహేళన చేయుదురు. అట్టి నీ చుడనగు నేను నిన్ను స్తుతింపజాలను అని అనెను. క్రమేణ సర్వే తం స్తుత్వా దేవా విరరముర్మునే | దేవ్యశ్చ మునయః సర్వే పార్వతీ స్తోతుముద్యతా || 106 ధౌతవస్త్రా జటాభారం బిభ్రతీ సువ్రతా వ్రతే | ప్రేరితా పరమాత్మానం వ్రతారాధ్యం శివేన చ || 107 జ్వలదగ్ని శిఖారూపా తేజోమూర్తిమతీ సతీ | తపసాం ఫలదా మాతా జగతాం సర్వకర్మణాం || 108 ఈవిధముగా దేవతలందరు ఆ పరపమపురుషుని స్తోత్రము చేసిరి. అప్పుడు తెల్లని వస్త్రములను జడలను వ్రతకరాణముగా ధరించిన పార్వతి పరమశివునిచే ప్రేరేపింపబడి ఆ పరమాత్మను స్తుతింపమొదలిడినది. అప్పుడు పార్వతి మండుచున్న అగ్నిశిఖవలెనుండినది. సమస్తకర్మల, తపస్సుల ఫలమునొసగు ఆ సతి సమస్త జగత్తునకు మాతృస్వరూపిణి. ఆమె ఇట్లు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను, పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. కృష్ణ జానాసి మాం భద్రం నాహం త్వాం జ్ఞాతుమీశ్వరీ | కే వా జానంతి వేదజ్ఞా వేదా నా వేదకారకాః || 109 త్వదంశస్త్వాం న జానంతి కథం జ్ఞానంతి కథం జ్ఞాస్యంతి తే కళాః | త్వం చాపితత్వం జానాసి కిమన్యే జ్ఞాతుమీశ్వరాః || 110 సూక్ష్మాత్ సూక్ష్మతమోZవ్యక్తః స్థూలాత్‌స్థూలతమోమహాన్ | విశ్వస్త్వవం విశ్వబీజశ్చ విశ్వరూపః సనాతనః || 111 కార్యం త్వం కారణం త్వం చ కారణానాం చ కారణం | తేజః స్వరూపో భగవాన్ నిరాకారో నిరాశ్రయః || 112 నిర్లిప్తో నిర్గుణః సాక్షీ స్వాత్మారామః పరాత్పరః | ప్రకృతీశో విరాడ్బీజం విరాడ్రూపస్త్వమేవ హి | సగుణస్త్వం ప్రాకృతికః కళయా సృష్టిహేతవే || 113 ప్రకృతిస్త్వం పుమాంస్త్వంచ వేదాZన్యోన క్వచిద్భవేత్ | జీవస్త్వం సాక్షిణో భోగే స్వాత్మనః ప్రతిబింబకం || 114 కర్మ త్వం కర్మబీజం త్వం కర్మణాం ఫలదాయకః | ధ్యాయంతి యోగినస్తేజః త్వ దీయమశరీరి యత్ || 115 కేచిచ్ఛతుర్భుజం శాంతం లక్ష్మీకాంతం మనోహరం | వైష్ణవాశ్చైవ సాకారం కమనీయం మనోహరం | శంఖ చక్రగదాపద్మధరం పీతాంబరంపరం || 116 ద్విభుజం కమనీయం చ కిశోరం శ్యామసుందరం | శాంతం గోపాంగనాకాంతం రత్నభూషణ భూషితం || 117 ఏవం తేజస్వినం భక్తా సేవంతే సంతతం ముదా | ధ్యాయంతి యోగినో యత్తత్ కుతస్తేజస్వినం వినా || 118 త్తతేజో బిభ్రతాం దేవ దేవానాం తేజసా పురా | ఆవిర్భూతా సురాణాం చ వధాయ బ్రహ్మణా స్తుతా || 119 ఓశ్రీకృష్ణా! నీకు నాగురించి తెలియును కాని నేను నీగురించి ఏమియు నెరుగును. వేదజ్ఞులైనను, వేదములైను, వేదకారకులైనవారు సహితము నిన్ను ఎరుగలేరు, నీయొక్క అంశ##లైన బ్రహ్మాదిదేవతలకే నీ తత్వము తెలియనిచో అంశాంశరూపలైన మాబోటివారుకి నీతత్వమెట్లు తెలియును, అట్లే ఈతత్వము నీకే తెలియును కాని ఇతరులకెవ్వరికిని తెలియదాదు. ఓపరమాత్మా! నీవే ప్రపంచమవు, ప్రపపంచకారణమవు, విశ్వరూపుడవు, సనాతనుడవు, సూక్షములకెల్ల పరమసూక్ష్మమైన అవ్యక్తుడవు. అట్లే స్థూలములకెల్ల అతిస్థూలమైన మహత్య్స రూపుడవు. నీవే కార్యమవు. కారణరూపుడవు. కారణములకెల్ల కారణస్వరూపుడవు. తేజఃస్వరూపుడవు, భగవంతుడవు, నిరాకారరూపుడవు, నిరశ్రయుడవు, నిర్లిప్తడవు, నిర్గుణుడవు, సాక్షీభూతుడవు, పరాత్పరుడు, స్వాత్మారాముడు, ప్రకృతీశుడు, విరాట్కాణుడు, విరాడ్రూపుడు అన్ని నీ రూపములే. అట్లే సగుణరూపము నీదే. సృష్టికొరకు నీ అంశాంశతో ప్రాకృతికుడవగుచున్నావు. నీవే ప్రకృతివి, పురుషుడవు, వేదములు, జీవము, కర్మ, కర్మకరాణము, కర్మల ఫలితమునిచ్చువాడు. అన్నియు నీవే. యోగులు నీ తేజఃస్వరూపమునెల్లప్పుడు ధ్యానింతురు. కొందరు విష్ణుభక్తులు నీరూపముల సాకారమని నాలుగు భుజములలో శంఖ చక్ర గదా పద్మాయుధములు ధరించును పీతాంబరుడవై లక్ష్మీపతిగా ఉన్నట్లు ధ్యానింతురు. మరికొందరు ద్విభుజములతో శ్యామసుందరవిగ్రహముతో కిశోర రూపియైన నిన్ను ధ్యానింతురు. వారు నిన్ను శాంతమూర్తిగా గోపాంగనాకాంతుడుగా రత్నాలంకార సుశోభితుడవుగా భౄవింతురు. ఈవిధముగా భక్తులు ఎల్లపుడు తేజోరూపమైన నిన్ను సేవించుచుందరు. యోగులు ఎల్లప్పుడు తేజః స్వరూపమైన నీరూపును తప్ప ఇతరమైన దానిని ధ్యానంపరు. ఓ దేవా! నీతేజస్సును ధరించు దేవతలయొక్క తేజస్సుతో బ్రహ్మదేవుడు నుతింపగా దుర్మార్గులైన రాక్షసుల సంహరించుటకు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినది. నిత్యా తేజః స్వరూపాZహం ధృత్వావై విగ్రహం విభో | స్త్రీరూపం కమనీయం చ విధాయ సముపస్థితా || 120 మాయయా తవ మాయాZహం మోహయిత్వాZసురాన్పురా | నిహత్య సర్వాన్ శైలేంద్రమగమం తం హిమాలయం || 121 తతోZహం సంస్తుతా దేవై స్తారకాక్షేణ పీడితైః | అభవం దక్షజాయాయాం శివస్త్రీ భవజన్మని || 122 త్యక్త్వా దేహం దక్షయజ్ఞే శివాZహం శివనిందయా | అభవం శైలజాయాయాం శైలాధీశస్య కర్మణా || 123 అనేక తపసా ప్రాప్తః శివశ్చాత్రాపి జన్మని | పాణిం జగ్రాహ మే యోగీ ప్రార్థితో బ్రహ్మణా విభుః || 124 శృంగారజం చ తత్తేజో నాలభం దేవమాయయా | స్తౌమి త్వామేవ తేనేశ పుత్రదుఃఖేన దుఃఖితా || 125 వ్రతే భవద్విధం పుత్రం లబ్ధుమిచ్ఛామి సాంప్రతం | దేవేన విహితా వేదే సాంగే స్వస్వామిదక్షిణా || 126 శ్రుత్వా సర్వం కృపాసింధో కృపాం మే కర్తుమర్హసి, | ఇత్యుక్త్వా పార్వతీ తత్ర విరరామ చ నారద || 127 తేజోరూపమైన ఆమూర్తి నాదే. నేను అందమైన శరీరమును ధరించి వచ్చితిని, నీయొక్క మాయవలన ఆవిర్భవించిన మాయాస్వరూపయగు నేను నా మాయవలన రాక్షసులనందరను మోహింపజేసి వారలను సంహరించి హిమాలయపర్వతమును చేరితిని. ఆతరువాత దక్షునిభార్యయందు జన్మించి శివుని భర్తగా పొంది ఆతడు దక్షయజ్ఞములో చేసిన శివనిందను సహించుకొనలేక అచ్చటనే ప్రాణత్యాగము చేసితిని. ఆతరువాత హిమవత్పర్వతము చేసిన తపఃఫలితముగా ఆతనకి కూతురనై జన్మించితిని. అట్లే అత్యధికమైన తపస్సు చేసి ఈ జన్మలోకూడా శివుని భర్తగా పొందగలిగితిని. కాని దేవతలయొక్క మాయవలన నా భర్తృతేజోరూపమైన పుత్రుని మాత్రము పొందలేకపోతిని. అందువలన పుత్రదుఃఖము వల్ల బాధలనందుచున్న నేను ఈ వ్రతమువలన నీవంటి పుత్రుని పొందగలనని అనుకొని వేదమున పేర్కొనబడినట్లు నాభర్తను దక్షిణగా సమర్పించుకొంటిని. ఓ దయామయుడా! దీనురాలనగు నా విషయమునంతయు విని నాపై దయజూపుమని పార్వతి శ్రీకృష్ణునితో అనెను. భారతే పార్వతీస్తోత్రం యః శ్రుణోతి సుసంయుతః | సత్పుత్రం లభ##తే నూనం విష్ణుతుల్యపరాక్రమం || 128 సంవత్సరం హవిష్యాశీ హరిమభ్యర్చ్య భక్తితః | సుపుణ్యకవ్రతఫలం లభ##తే నాత్రసంశయః || 129 విష్ణుస్తోత్రమిదం బ్రహ్మన్ సర్వసంపత్తివర్ధనం | సుఖదం మోక్షదం సారం స్వామిసౌభగ్యవర్ధనం || 130 సర్వసౌందర్యబీజం చ యశోరాశి వివర్ధనం | హరిభక్తిప్రదం తత్వజ్ఞాన బుద్ధిసుఖప్రదం || 131 పార్వతీదేవి చేసిన ఈస్తోత్రమును నియమనిష్ఠలతో విన్నవాడు విష్ణువుతో సమానుడగు మంచిపుత్రుని పొందును. అట్లే ఈ స్తోత్రమును పఠించుచు లేక వినుచు, భక్తితో శ్రీహరినర్చించుచు సంవత్సరపర్యంతము భగవన్నివేదితాన్నమును భక్షించువానికి సుపుణ్యకవ్రతము చేసిన ఫలము లభించును. ఓనారదా! శ్రీకృష్ణస్తోత్రము సమస్తసంపత్తులను కలిగించును. సుఖమును మోక్షమును కలిగించును. భర్తృసౌభాగ్యమును పెంపొందించును, కీర్తని పెంచును, శ్రీహరిభక్తిని కలిగించును. తత్వజ్ఞానమును, బుద్ధిని పరమసౌఖ్యమును ఇచ్చునని నారాయణమహర్షి నాదునితోననెను. ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే పుణ్యకవ్రతే పతిదానే పార్వతీకృత శ్రీకృష్ణస్తోత్రకథనం నామసప్తమోZధ్యాయః | శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదైన గణపతిఖండములో నారదనారాయణ సంవాదసమయమున చెప్పబడిన పుణ్యకవ్రతములో తన పతిని దానము చేయు సందర్భమున పార్వతీదేవి చేసిన శ్రీకృష్ణస్తోత్రమనే ఏడవ అధ్యాయము సమాప్తము.