sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టమోZధ్యాయః - గణపతి జననము నారాయణ ఉవాచ - నారాయణమహర్షి ఇట్లనెను. పార్వత్యాః స్తవనం శ్రుత్వా శ్రీకృష్ణం కరుణానిధిః | స్వరూపం దర్శయామాస సర్వాదృశ్యం సుదుర్లభం ||
1 స్తుత్వా దేవి వ్రతపరా కృష్ణసంగలగ్నమానసా | దదర్శ మధ్యే స్వరూపం సర్వమోహనం || 2 సద్రత్నసారరచితే హీరకేణ పరిష్కృతే | యుక్తే మాణిక్యమాలాభీ రత్నపూర్ణే మనోహరే || 3 పీతాంశుకం వహ్నిశుద్ధం వరం వంశకరం పరం | వనమాలాగళం శ్యామం రత్నభూషణభూషితం || 4 కిశోరవయసం చిత్రవేషం వై చందనాంకితం | చారుస్మితాస్యమీడ్యం తచ్ఛారదేందువినిందకం || 5 మాలతీమాల్యసంయుక్తం కేకి పిచ్ఛావచూడకం | గోపాంగనాపరివృతం రాధావక్షః స్థలోజ్వలం || 6 కోటికందర్పలావణ్యలీలాధామ మనోహరం | అతీవ హృష్టం సర్వేష్టం భక్తానుగ్రహకారకం || 7 దృష్ట్వా రూపం రూపవతీ పుత్రం తదనురూపకం | మనసా వరయామాస వరం సంప్రాప్య తత్‌క్షణం || 8 పార్వతీదేవి చేసిన స్తోత్రమును విని దయామయుడగు శ్రీకృష్ణుడు అందరకు కనిపించనిది, దుర్లభ##మైనది అయిన తన రూపమును ఆమెకుచూపించెను. పుణ్యకవ్రతము నాచరించు ఆపార్వతి శ్రీకృష్ణునిపై మనసుంచి ధ్యానింపగా తేజః పుంజమధ్యమున సర్వసమ్మోహనమైన ఆతని రూపు కనిపించినది. ఆ శ్రీకృష్ణుని మెడలో వనమాల శోభించుచుడెను. ఆతడు శ్యామసుందరుడు, రత్నాలంకార సుశోభితుడు. బాలుడు, చిత్రవేషధరుడు, చందన చర్చితగాత్రుడు, శరత్కాల చంద్రునికంటె మిన్నయగు ఆతని ముఖమున చిరునవ్వు ప్రకాశించుచుండెను. ఆతని శిరస్సున నెమిలిపింఛము శోభించుచుండెను. గోపస్త్రీలచే పరివృతుడు, కోటిమన్మథుల లావణ్యము కలవాడు భక్తులననుగ్రహించువాడగు ఆ శ్రీకృష్ణుని రూపమును పార్వతీదేవి చూచి ఆతనివంటి పుత్రుడు కావలయునని మనస్సులో కోరుకొనెను. వరం దత్వా వరేశస్తు యద్యన్మనసి వాంఛితం | దత్వాZభీష్టం సురేభ్యశ్చ తత్తేజోంతరధీయత || 9 శ్రీకృష్ణపరమాత్మ పార్వతీదేవి తన మనసులో కోరుకున్న కోరికను అనుగ్రహించి దేవతలకు సహితము అభీష్టవరముల నొసగి తన తేజోరూపమును అంతర్ధానము చేసెను. కుమారం బోధయిత్వా తు దేవదేవ్యై దిగంబరం | దదుర్నరుపమం తత్ర ప్రహృష్టాయై కృపాన్వితాః || 10 దయగలిగిన దేవతలు సనత్కుమారునకు నచ్చజెప్పి దేవదేవియగు పార్వతికి సాటిలేనివాడును. దిగంబరుడును, అగు పరమేశ్వరుని అప్పగించిరి. బ్రాహ్మణభ్యో దదౌ దుర్గా రతనాని వివిధాని చ | సువర్ణాని చ భిక్షుభ్యో వందిభ్యో విశ్వవందితా || 11 బ్రాహ్మణాన్ భోజయమాస దేవాన్వై పర్వతాంస్తథా || శంకరం పూజయామాస చోపహారై రనుత్తమైః || 12 దుందుభిం వాదయామాస కారయామాస మంగళం | సంగీతం గాపయామాస హరిసంబంధి సుందరం || 13 వ్రతం సమాప్య సా దుర్గా దత్వాదానాని సస్మితా | సర్వాంశ్చ భోజయిత్వా తు బుభుజే స్వామినా సహ || 14 తాంబూలం చ వరం రమ్యం కర్పూరాదిసువాసితం | క్రమాత్ప్రదాయ సర్వేభ్యో బుభుజే తేన కౌతుకాత్ || 15 పార్వతీదేవి పుణ్యకవ్రతావసానమున బ్రాహ్మణులకు వివిధములైన రత్నములను దానము చేసెను. అట్లే భిక్షుకులకు స్తోత్రపాఠకులకు అనేకములైన బంగారునాణములను దానమిచ్చెను. అటుపిమ్మట బ్రాహ్మణులకు, దేవతలకు, పర్వతములకు మృష్టాన్నభోజనమును పెట్టి భర్తయగు శంకరుని గొప్పనైన ఉపహారములతో సంభావించినది. తర్వాత దుందుభివాద్యమును మ్రోగించుచు మంగళవాదమును చేసినది. అట్లే శ్రీహరికి సంబంధించిన పాటలను పాడించినది. ఇట్లు పుణ్యకవ్రతమును పూర్తి చేసి అందరకు దానములనొసగి అందరకు మృష్టాన్నభోజనము నొసగి తాను తన భర్తతో కలసి భుజించెను తరువాత కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములు కల ఇంపైన తాంబూలమును క్రమముగా అందరకు నొసగి తాను సంతోషముతో భుజించినది. పయఃఫేనిభాం శయ్యాం రమ్యాం సద్రత్నమంచకే | పుష్పచందన సంయుక్తాం కస్తూరీ కుంకుమాన్వితాం | రహసి స్వామినా సార్థం సుష్వాప పరమేశ్వరీ || 16 కైలాససై#్యక దేశే చ రమ్యే చందన కాననే | సుగంధికుసుమాఢ్యేన వాయునా సురభీకృతే || 17 భ్రమరధ్వని సంయుక్తే పుంస్కోకిలరుతాశ్రయే | వ్యహర్షీత్సా సురసికా తత్ర తేన సహాంబికా || 18 కైలాసపర్వతముననున్న చందనవనమున చక్కనివాసనగల కుసుమములున్నవి, ఆ పుష్పములకు తగులటవలన అచ్చటి వాయువు పరిమళములను వెదజల్లుచున్నది. తుమ్మెదల ఝంకారములు గండుకోయిలల కూతలచే ఆప్రదేశము మిక్కిలి రమ్యముగానున్నది. అచ్చట రహస్యమైన ప్రాంతమున రత్నములచే నిర్మితమైన మంచముపై పాలనురుగువంటి వస్త్రముకల శయ్యపై పార్వతీదేవి తన భర్తతో కలసిపడుకొనెను. రేతః పతనకాలేచ స విష్ణుర్విష్ణుమాయయా | విధాయ విప్రరూపం తదాజగామ రతేర్గృహం || 19 జటావంతం వినా తైలం కుచేలం భిక్షుకం మునే | అతీవ శుక్లదశనం తృష్ణయా పరిపీడితం || 20 అతీవ కృశగాత్రం చ బిభ్రత్తిలకముజ్వలం | బహుకాకుస్వరం దీనం దైన్యాత్కుత్సితమూర్తిమత్ || 21 ఆజుహావ మహదేవమతివృద్ధోన్నZయాచకః | దండావలంబనం కృత్వా రతిద్వారేZతిదుర్బలః || 22 పరమేశ్వరుని రేతస్సు పడు సమయమున అచ్చటకు విష్ణుమూర్తి తన మాయవల్ల వృద్ధ బ్రాహ్మణ వేషముతో ఆకలివల్ల ఆహారమును యాచించు మిషతో అచ్చటకు వచ్చెను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తైలసంస్కరాములేని జడలతో, చిరిగిపోయిన, మురికిపట్టిన గుడ్డలతో మిక్కిలి కృశించిన శరీరముతో ఉజ్వలమైన తిలకమును ధరించి అతి దుర్బలునివలె చేతిలో కట్టెపట్టుకొని మహాదేవుని అన్నము పెట్టుమని యాచించెను. బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు శివునితో పలికెను. కిం కరోషి మహాదేవ రక్ష మాం శరణాగతం | సప్తరాత్రి వ్రతేZతీతే పారణాకాంక్షిణం క్షుధా || 23 కిం కరోషి మహాదేవ హే తాత కరుణానిధే | పశ్య వృద్ధం జరాగ్రస్తం తృషయా పరిపీడితం || 24 మాతరుత్తిష్ఠ మేZన్నం త్వంప్రయచ్ఛాద్య శివం జలం | అనంతరత్నోద్భవజే రక్ష మాం శరణాగతం || 25 మాతర్మాతర్జగన్మాత రేహి నాహం స్థితో బహిః | సీదామి తృషయా కస్మాత్ స్థితాయామాత్మమాతరి || 26 ఇతి కాకుస్వరం శ్రుత్వా శివస్తోత్తిష్ఠతో మునే | పపాత వీర్యం శయ్యాయాం న యోనౌ ప్రకృతేస్తదా || 27 ఉత్తస్థౌ పార్వతీ త్రస్తా సూక్ష్మవస్త్ర పిధాయ చ | ఆజగామ బహిర్ద్వారం పార్వత్యా సహ శంకరః || 28 ''కరుణానిధియగు మహాదేవా! నీవేమి చేయుచున్నావు నేను అతివృద్ధుడను ఆకలిదప్పులచే బాధపడుచున్నాను. ఓతల్లీ! పార్వతీ! నేను నీశరణుపొందితిని. నీవే లేచి నాకు అన్నమును మంచినీళ్ళను ఇమ్ము. ఓ జగన్మాతా! నేను బయటనిలువలేకపోవుచున్నాను. నాతల్లి దగ్గరనుండగా నేను దప్పితో అలమటింపవలసిన పనిలేకున్నను బాధపడుచున్నాను. ఓమహాదేవా! నేను నిన్ను శరణుపొందితిని. సప్తరాత్రివ్రతమును చేసిననాను. ఇక నేను పారణచేయవలసియున్నది అందువలన మిక్కిలి బాధపడుచున్నాను'' అని అరచెను. ఇట్లు ఆ వృద్ధబ్రాహ్మణుడు ఉచ్ఛైస్వరమున పలుకుచుండగా విని మహాదేవుడుకు రతినుండి లేచెను. ఆ సమయమున ఆతనికి రేతస్ఖలనమగుచుడెను. రతికార్యమును విరమించుకొన్నందువలన మహాదేవుని వీర్యము శయ్యపై పడిపోయినది. పార్వతీదేవి భయముతో సన్నని వస్త్రమును ధరించి లేచి నిలబడి తనభర్తతో కలసి బయటకు వచ్చినది. దదర్శ బ్రాహ్మణం దీనం జరయా పరిపీడితం | వృద్ధం పలితగాత్రం చ బిభ్రతం దండమానతం || తపస్వినమశాంతం చ శుష్కకంఠౌష్ఠతాలుకం | కుర్వంతం పరయా భక్త్యా ప్రణామంస్తవనం తయోః || 30 శ్రుత్వా తద్వచనం తత్ర నీలకంఠః సుధోపమం | ఉవాచ పరయా ప్రీత్యా ప్రసన్నస్తం ప్రహస్య చ || 31 అచ్చట దీనుడు, వృద్ధుడు, ముడుతలు పడిన శరీరము కలవాడు, వంగిపోయినవాడు, చేతిలో కఱ్ఱను ఊతగా ధరించినవాడు, పెదవులు, నాలుక, గొంతు ఎండుకొనిపోయినవాడు, తపస్వియైన బ్రాహ్మణుడు కనిపించెను. అతడు వారిని భక్తితో నమస్కరించి కొనియాడగా మహాదేవుడు ప్రసన్నుడై అమృతమువంటి మాటలనిట్లు పలికెను. శంర ఉవాచ - శంకరుడిట్లు పలికెను. గృహం తే కుత్ర విప్రర్షే వద వేదవిదాం వర | కిం నామ భవతః క్షిప్రం జ్ఞాతుమిచ్ఛామి సాంప్రతం || 32 వేదవేదాంగములు తెలిసినవారిలో శ్రేష్ఠుడవగు ఓ విప్రుడా నీపేరేమి? నీ ఇల్లెచటనున్నది మొదలగు విషయములను నాకు వెంటనే తెలుపుమనెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. ఆగతోZసి కుతో విప్ర మమభాగ్యాదుపస్థితః | ఆద్య మే సఫలం జన్మ బ్రాహ్మణోమద్గృహేZతిథిః || 33 అతిథిః పూజితోయేన త్రిజగత్తేన పూజితం | తత్రైవాధిష్ఠితా దేవా బ్రాహ్మణా గురవోద్విజ || 34 తీర్థాన్యతిథిపాదేషు శశ్వత్తిష్ఠంతి నిశ్చితం | తత్పాద ధౌత తోయేన మిశ్రితాని లభేత్ గృహీ || 35 స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః | అతిథిః పూజితో యేన భారతే భక్తిపూర్వకం || 37 నానాప్రకారపుణ్యాని వేదోక్తాని చ యాని వై | అన్యే చాతిథిసేవాయాః కలాం నార్హంతి షోడశీం || 38 అపూజితోZతిథిర్యస్య భవనాద్వినివర్తతే | పితృదేవాగ్నయః పశ్చాద్గురవో యాంత్యపూజితాః || 39 యాని కాని చ పాపాని బ్రహ్మత్యాది కాని చ | తాని సర్వాణి లభ##తే నాభ్యర్చ్యాతిథిమీప్సితం || 40 ఓ బ్రాహ్మణుడా! నీవెచ్చటినుండి వచ్చితివి. నీవు నా అదృష్టమువలన ఇచ్చటికి వచ్చితివి. నా ఇంటికి బ్రాహ్మణు డతిథిగా వచ్చినందువలన నా జన్మ సఫలమైనది. అతిథిని గౌరవించినచో ముల్లోకములను గౌరవించినట్లే. అతిథిగౌరవముండుచోట దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, సమస్తపుణ్యతీర్థములెల్లప్పుడు ఉండును. అతిథియొక్క పాదములను కడిగినచో సమస్తపుణ్యములు లభించును. అతిథిని తనశక్తి కొలది పూజించువాడు సమస్త తీర్థములందు గ్రుంకులిడిన పుణ్యమును సమస్తయజ్ఞములాచరించిన పుణ్యమును పొందును. అట్లే అతడు సమస్త దానములు చేసిన పుణ్యమును పొందగలడు. వేదములందు పేర్కొనబడిన పుణ్యములన్నియు ఇతరపుణ్యములు సైతము అతిథిసేవయొక్క పదునారవ అంశ##మైన కాజాలవు. అతిథికి మర్యాదజరుగని ఇంటిలో పితృదేవతలు, అగ్నులు, గురువులు పూజల పొందనట్లు వెళ్ళిపోవుదురు. అతిథి సేవచేయనివానికి బ్రహ్మహత్యాది సమస్తపాపములన్నియు లభించునని పార్వతి పలికెను. బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు పలికెను. వ్యాధియుక్తో నిరాహారో యదా వాZనశవ్రతీ | మనోరథేనోZపహారం భోక్తుమిచ్ఛతి మానవః || 41 జానాసి వేదాన్వేదజ్ఞే వేదోక్తం కురుపూజనం | క్షుత్తృడ్భ్యాం పీడితో మాతర్వచనం చ శ్రుతౌ శ్రతుం || 42 వేదవేదాంగములన్ని తెలిసిన ఓపార్వతీ! వేదమునందు చెప్పబడినట్లు అతిథిపూజసేయుము. ఆకలిదప్పులతో బాధపడు మానవుడు తాను రోగముచే బాధపడుచున్నను నిరాహారుడైనను. నిరాహారమే వ్రతముగా స్వీకరించినను గృహస్థు ఇచ్చిన ఉపహారమును మనస్సులోనైనను స్వీకరించుననెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లనెను. భోక్తుమిచ్ఛసి కిం విప్ర త్రైలోక్యే చ సుదుర్లభం | దాస్యామి భోక్తుం త్వామద్య మజ్జన్మ సఫలం కురు || 43 ఓ బ్రాహ్మణుడా! నీవు ఆకలిగొన్నావా? నీకు ఎట్టి భోజనము పెట్టవలెను? ముల్లోకములందు దొరుకని భోజనము నీకు పెట్టెదను. అతిథిసేవచేయుటద్వారా నాజన్మను సఫలము చేయుమనెను. బ్రాహ్మణ ఉవాచ - బ్రాహ్మణుడిట్లు పలికెను. వ్రతే సువ్రతయా సర్వముపహారం సమాహృతం | నానావిధం మిష్టమిష్టం భోక్తుం శ్రుత్వా సమాగతః || 44 సువ్రతే తనపుత్రోZహమగ్రే మాం పూజయిష్యసి | దత్వామిష్టాని వస్తూని త్రైలోక్యే దుర్లభాని చ || 45 తాతాః పంచవిధాః ప్రోక్తా మాతరో వివిధాఃస్మృతాః | పుత్రః పంచవిధః సాధ్వి కథితో వేదవాదిభిః || 46 విద్యాదాతాZన్నదాతా చ భయత్రాతా చ జన్మదః | కన్యాదాతా చ వేదోక్తా నరాణాం పితరః స్మృతాః || 47 గురుపత్నీ గర్భదాత్రీ స్తనదాత్రీ పితుఃస్వసా | స్వసామాతుః సపత్నీచ పుత్రభార్యాzన్నదాయికా || 48 భృత్యః శిష్యశ్చ షోష్యశ్చ వీర్యజః శరణాగతః | ధర్మపుత్రాశ్చ చత్వారో వీర్యజో దనభాగితి || 49 క్షుత్త్రుఢ్భ్యాం పీడితో మాతః వృద్ధోZహం శరణాగతః | సాప్రతం తవ వంధ్యాయాః అనాథః పుత్ర ఏవ చ || 50 ఓదేవి! నీవు చక్కగా పుణ్యకవ్రతముచేసి ఆవ్రతమున అనేకవిధములైన ఉపహారములను సమకూర్చినట్లు తెలిసికొని, నాకు ఇష్టమైన మృష్టపదార్థములను సేవింపవలెనని ఇచ్చటకు వచ్చితిని. ఓ సువ్రతా! నేను నీకు పుత్రునివంటివాడను. ముల్లోకములలో దుర్లభ##మైన వస్తువులను నాకొసగి తొలుత నన్ను పూజింపుము. వేదవేదాంగకోవిదులు తల్లి, తండ్రి, పుత్రులు అనేకవిధములుగానుందురని చెప్పుదురు. వారిలో చదువునేర్పువాడు. అన్నముపెట్టువాడు. భయమును పోగొట్టువాడు, జన్మనిచ్చినవాడు, పిల్లనిచ్చినవాడు అను ఐదుగురు తండ్రులవంటివారు. అట్లే గురువుయొక్క భార్య, జన్మనిచ్చినస్త్రీ, చనుపాలిచ్చిన స్త్రీ, మేనత్త, తల్లికి సోదరి మరియు సవతి, కోడలు, అన్నముపెట్టిన స్త్రీ వీరందరు మాతృతుల్యలు, అట్లే సేవకుడు, శిష్యుడు, తనపోషణలోనున్నవాడు, తనపుత్రుడు, శరణువేడినవాడు, వీరందరు పుత్రతుల్యలు, వీరిలో వీర్యజుడైన పుత్రుడు తండ్రి ఆస్తిని పొందును. మిగిలిన నలుగురు ధర్మపుత్రులని పెద్దలు చెప్పుదురు. ఓతల్లీ! ఆకలిదప్పులచే బాధపడుచున్న నేను నిన్ను శరణువేడితిని. అందువలన నేను నీకు పుత్రునివంటివాడనని బ్రాహ్మణుడు పలికెను. పీష్టకం పరమాన్నం చ సుపక్వాని ఫలాని చ | నానావిధాని పిష్టాని కాలదేశోద్భవాని చ || 51 పక్వాన్నం స్వస్తికం క్షీరమిక్షు వికారజం | ఘృతం దధి చ శాల్యన్నం ఘృతపక్వం చ వ్యంజనం || 52 లడ్డుకాని తిలానాం చ మిష్టాన్నం సగుడాని చ | మమాజ్ఞాతాని వస్తూని సుధయా తుల్యకాని చ || 53 తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం | జలం సునిర్మలం స్వాదు ద్రవ్యాణ్యతాని వాసితం || 54 ద్రవ్యాణి యాని భుక్త్వా మే చారు లంబోదరం భ##వేత్ | అనంతరత్నోద్భవజే తాని మహ్యం ప్రదాస్యసి || 55 అనంతరత్ను డగు హిమాలయముయొక్క పుత్రికయగు పార్వతీ! నీవు నాకు పిష్టకమను పిండివంటను, పరమాన్నమును, దోరమాగినపండ్లను, ఆయాదేశములయందు, ఆయాకాలములందు చేయు పిండివంటలను, పక్వాన్నమును, , స్వస్తికమను వంటకమును, పాలను, చెరుకుపాలను, చెరుకుపాలతో చేయబడిన వంటను, నేతిని, పెరుగును, మంచిబియ్యపన్నమును, నేతిలో వేగించిన వంటకమును, బెల్లము, నూవులచే చేయబడిన లడ్డూలను, ఇంకను నాకు తెలియని అమృతోపమానములగు వంటకములను నాకు భోజనమున పెట్టుము. తరువాత కర్పూరాది సుగంధ ద్రవ్యభరితమైన తాంబూలమును. నిర్మలమైన మంచినీళ్ళను నాకిమ్ము. వీటిని భుజించనచో నాకు కడుపుబ్బినట్లగును. అందువలన ఓ పార్వతీ! నాకు వీటివన్నిటిని ఇమ్మని బ్రాహ్మణు డడిగెను. స్వామీ తే త్రిజగత్కర్తా ప్రదాతా సర్వసంపదాం | మహాలక్ష్మీస్వరూపా త్వం సర్వైశ్వర్యప్రదాయినీ || 56 రత్నసింహాసనం రమ్యమమూల్యం రత్నభూషణం | వహ్నిశుద్ధాంశుకం చారు ప్రదాస్యసి సుదుర్లభం || 57 సుదుర్లభం హరేర్మంత్రం హరౌ భక్తిం దృఢాం సతి | హరేః ప్రియా హరేః శక్తిః త్వమేవ సర్వదా స్థితా || 58 జ్ఞానం మృత్యుంజయం నామ దాతృశక్తిం సుఖప్రదాం | సర్వసిద్దిం చ కిం మాతరదేయం స్వసుతాయ చ || 59 మనః సునిర్మలం కృత్వా ధర్మే తపసి సంతతం | శ్రేష్ఠే సర్వం కరిష్యామి న కామే జన్మహేతుకే || 60 స్వకామాత్కురుతే కర్మ కర్మణో భోగ ఏవ చ | భోగౌ శుభాశుభౌ జ్ఞే¸° తౌ హేతూ సుఖదుఃఖయోః || 61 దుఃఖం న కస్మాద్భవతి సుఖం వా జగదంబికే | సర్వం స్వకర్మణా భోగః తేన తద్విరతో బుధః || 62 కర్మ నిర్మూలయంత్యేవ సంతో హి సతతం ముదా | హరిభవనబుధ్యా తత్తపసా భక్తసంగతాః || 63 ఓపార్వతీ! నీభర్త ముల్లోకములకు కారణభూతుడు, అట్లే సమస్తసంపదలనొసగువాడు. నీవు సమసై#్తశ్వర్యములనొసగు మహాలక్ష్మీరూపిణివి. అందువలన నీవు నాకు అందమైన రత్నసింహాసనమును, అమూల్యములైన రత్నభూషణములను, పరిశుద్ధమైన వస్త్రములను ఇమ్ము. అట్లే ఎవరికిని లభ్యముకాని శ్రీహరిమంత్రమును, దృఢమైన శ్రీహరిభక్తిని, మృత్యుంజయమను జ్ఞానమును, సుఖమును కలిగించు దాతృశక్తిని, సమస్తసిద్ధులనొసగుము. నీవు శ్రీహరికి ఇష్టమైనదానవు. శ్రీహరియొక్క శక్తివి నీవే. అట్టి నీవు నీపుత్రునకు ఇవ్వలేనిది ఏదిలేదు. మనస్సున నిర్మలముగానుంచుకొని ధర్మమును, తపస్సును అనుష్ఠింతును. నాకు జన్మకారణమైన కోరికలేవియులేవు. మానవుడు తన కోరికననుసరించి కర్మననుసరించును. ఆ కర్మ భోగమునకు కారణమగుచున్నది. శుభాశుభములుగా భోగము రెండు విధములుగా కలదు. ఆ రెంటిలో ఒకటి సుఖమును కలిగించును. రెండవది దుఃఖమును కలిగించుచున్నది. తాను చేసిన కర్మననుసరించి భోగానుభవము కలగుచున్నందువలన జ్ఞానియగువాడు కర్మకు దూరముగానుండును. ఇంకను సత్పురుషులు కర్మనిర్మూలనము చేయుటకు శ్రీహరి భక్తులకు సాంగత్యమును పెంచుకొని శ్రీహరిని సంతతము ధ్యానించుటతో ప్రయత్నింతురు. ఇంద్రియ ద్రవ్యసంయోగ సుఖం విధ్వంసనావధి | హరిసంతాపరూపం చ సుఖం తత్సర్వకాలికం || 64 హరిస్మరణ శీలానాం వాయుర్యాతి సతాం సతి | న తేషామీశ్వరః కాలో న చ మృత్యుంజయో ధ్రువం || 65 చిరం జీవంతి తే భక్తా భారతే చిరజీవినః | సర్వసిద్ధిం చ విజ్ఞాయ స్వచ్ఛందం స్వర్గగామినః || 66 జాతిస్మరా హరేర్భక్తా జానతే కోటిజన్మనః | కథయంతి కథాం జన్మ లభంతే స్వేచ్ఛయాముదా || 67 పురం పునంతి తే పూతాస్తీర్థాని స్వీయలీలయా | పుణ్యక్షేత్రేzత్రసేవాయై పరార్థం చ భ్రమంతి తే || 68 వైష్ణవానాం పదస్పర్శాత్సద్యః పూతా వసుంధరా | కాలం గోదోహమాత్రం తు తీర్థే యత్ర వసంతి తే || 69 గురోరాస్యాద్విష్ణుమంత్రో యస్య కర్ణే ప్రవిశ్యతి | తం వైష్ణవం తీర్థపూతం ప్రవదంతి పూరావిదః || 70 పురుషాణాం శతం పూర్వముద్దరంతి శతం పరం | లీలయా భారతే భక్త్వా సోదరాన్మతరం తథా || 71 మాతామహానాం పురుషాన్ దశపూర్వాన్ దశాzపరాన్ | మాతుఃప్రసూముద్దరంతి దారుణాద్యమతాడనాత్ || 72 భక్తదర్శనమాశ్లేషం మానవాః ప్రాప్నువంతి యే | తే యాతాః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితాః || 73 న లిప్తాః పాతకైర్భక్తాః సంతతం హరిమానసా | యథాzగ్నయః సర్వభక్ష్యాః యథా ద్రవ్యేషు వాయవః || 74 త్రికోటి జన్మనామంతే ప్రాప్నోతి జన్మ మానవం | ప్రాప్నోతి భక్తసంగం స మానుషే కోటిజన్మతః || 75 భక్తసంగాద్భవేద్భక్తేరంకురో జీవితః సతీ | అభక్త దర్శనాదేవ స చ ప్రాప్నోతి శుష్కతాం || 76 పునఃప్రపుల్లతాం యాతి వైష్ణవాలాపమాత్రతః | అంకురాశ్చావినాశీ చ వర్ధతే ప్రతిజన్మని || 77 తత్తరోర్వర్ధమానస్య హరిదాస్యం ఫలం సతి | పరిణామే భక్తిపాకే పార్షదశ్చ భ##వేద్ధరేః || 78 మహతి ప్రళ##యే నాశో న భ##వేత్తస్య నిశ్చితం | సర్వసృష్టేశ్చ సంహారే బ్రహ్మలోకస్య వేధసః || 79 ఇంద్రియములు ద్రవ్యములతో కలిసిందువలన కలుగు సుఖము దుఃఖమును కలిగించును. అది అశాశ్వతమైనది. శ్రీహరి ఆలాపన చేయుచున్నందువలన కలుగు సుఖము శాశ్వతమైనది. శ్రీహరిని సంతతము స్మరించువారికి మృత్యువులేదు. వారిని కాలుడైనను, మృత్యుంజయుడైనను సంహరింపజాలడు. శ్రీహరిభక్తులు చిరంజీవులై మనియెదరు. వారికి సమస్తసిద్ధులు లభించును. వారు స్వచ్ఛందముగా స్వర్గలోకమునకు పోయెదరు. శ్రీహరి భక్తులకు తమ గతజన్మలన్నియు తెలియుటచే తమయొక్క గతజన్మలన్నిటిని కథలుగా చెప్పుదురు. అట్లే వారు కోరుకొన్న జన్మను పొందగలరు. జన్మతః పవిత్రులైన శ్రీహరిభక్తులు తాము అడుగిడిన మాత్రమున పుణ్యక్షేత్రములను పవిత్రము చేయుదురు. వారు ఇతరుల కొరకు ప్రతిక్షేత్రమును సందర్శింతురు. శ్రీ వైష్ణవుల పాదస్పర్శవల్ల ఈభూమియంతయు పవిత్రమగును. వారు ప్రతిపుణ్యక్షేత్రమున గోదాహకాలమాత్రముందురు. ఆచార్యుని ముఖతః విష్ణుమంత్రమునుపదేశముగాపొందినవానిని వైష్ణవు డని ప్రాచీనులు పేర్కొందురు. అట్టి వైష్ణవుడు తనకు పూర్వమున్న నూరుతరములవారిని తన తరువాత, రాబోవు నూరుతరములవారిని తన సోదరులను, తల్లిని నరకమునుండి ఉద్ధరించును. అట్లే అతడు గత పదితరములు, రాబోవు పదితరములవారగు తల్లివంకవారిని నరకమునుండి ఉద్ధరించును. ఎట్టి మానవులు శ్రీహరిభక్తుల దర్శనమును, వారి ఆశ్లేషమును పొందుదురో వారు సమస్తపుణ్యతీర్థములు దర్శించినవారగుదురు. అట్లే సమస్తయజ్ఞములు చేసిన పుణ్యమునుకూడ పొందుదురు. శ్రీహరిని ఎల్లప్పుడు స్మరించు భక్తులు పాపములనెన్నడు పొందజాలరు. ప్రాణి మూడుకోట్ల జన్మనెత్తిన తరువాత మానవజన్మనెత్తును. అట్టి మానవజన్మలు కోటిపర్యాయములెత్తిన తరువాత శ్రీహరి భక్తుల సమాగమమును పొందును. శ్రీహరి భక్తులతో కలసి తిరుగుచున్నందువలన శ్రీహరిభక్తి కలుగును. శ్రీహరి భక్తిహీనులతోటి సమాగమమువలన ఆ భక్తి శుష్కించిపోవును. శ్రీహరి భక్తులతో కలిసియున్నందువలన ఆభక్తి మరల చిగురించును. ఇట్టి శ్రీహరిభక్తి ప్రతిజన్మయందు వృద్ధియగుచుండును. దానికి చివరిఫలము శ్రీహరి దాస్యమే అది సంపూర్ణముగా ఫలించినపుడు శ్రీహరి దాసుడగును. అట్టి భక్తి ఎంతటి ప్రళయము వచ్చినను, బ్రహ్మదేవుని సమస్త సృష్టి నశించినను నశించిపోదు అని వృద్ధ బ్రాహ్మణుడనెను. తస్మాన్నారాయణ భక్తిం దేహి మామంబికే సదా | న భ##వేద్విష్ణుభక్తిశ్చ విష్ణుమాయే త్వయా వినా || 80 తద్వంతం లోకశిక్షార్థం స్వతపస్తవ పూజనం | సర్వేషాం ఫలదాత్రీ త్వం నిత్యరూపా సనాతనీ || 81 గణశరూపః శ్రీకృష్ణః కల్పే కల్పే తవాత్మజః | త్వత్ర్కోడమాగతః క్షిప్రమిత్యుక్త్వాంత రధీయత || 82 అందువలన ఓ తల్లీ నీవు నాకు శ్రీమన్నారాయణునిపై భక్తి కలుగునట్లు చేయుము. విష్ణుమాయవగు నీయొక్క అనుగ్రహములేనిచో ఎవరికిని విష్ణుభక్తి కలుగజాలదు. నీవు విష్ణుమూర్తి గురించి తపస్సు చేయుచున్నచో పూజచేసినచో ఇవి అన్నియు ప్రపంచమునకు వీటిని నేర్పించుటకొరకేకాని వేరుకాదు. నీవు అందరికోరికలను తీర్చుదానవు. నిత్యస్వరూపిణివి, సనాతనివి, అట్టి నీకు ప్రతికల్పమున శ్రీకృష్ణుడు గణపతియై నీపుత్రుడుగా నీఒడిలోనికి చేరునని చెప్పి అదృశ్యమయ్యెను. కృత్వాంతర్థానమీశశ్చ బాలరూపం విధాయ సః | జగామ పార్వతీతల్పం మందిరాభ్యంతరస్థితం || 83 తల్పస్థే శివవీర్యే చ మిశ్రితః సబభూవ హ | దదర్శ గేహశిఖరం ప్రసూతే బాలకే యథా || 84 శుద్దచంపవర్ణాభః కోటిచంద్రసమప్రభః | సుఖదృశ్యః సర్వజనైశ్చక్షూరశ్మి వివర్ధకః || 85 అతీవసుందరతనుః కామదేవవిమోహనః | ముఖం నిరుపమం బిభ్రచ్ఛారదేందు వినిందకం || 86 సుందరేలోచనే బిభ్రచ్చారుపద్మవినిందకే | ఓష్ఠాధరపుటం బిభ్రత్పక్వబింబవినిందకం || 87 కపాలం చ కపోలం చ పరమం సుమనోహరం | నాసాగ్రం రుచిరం బిభ్రద్వీంద్రచంచువినిందేకం || 88 త్రైలోక్యే వై నిరుపమం సర్వాంగం బిభ్రదుత్తమం | శయానః శయనే రమ్యే ప్రేరయన్ హస్తపాదకం || 89 వృద్ధబ్రాహ్మణ రూపములోనున్న విష్ణుమూర్తి శిశువుగా మారి పార్వతీపరమేశ్వరులున్న మందిరములోని శయ్యపై నుండెను. పార్వతీదేవి పవళించిన శయ్యపైనున్న శిశువు ఆ శయ్యపైనున్న శివవీర్యముతో కలిసిపోయెను. ఆ శిశువు చంపక పుష్పవర్ణముతో, కోటించంద్రులవంటి కాంతిగలిగి, మిక్కిలి సుందరుడై, మన్మథునే మోహింపచేయుచుండెను. అతని ముఖము శరత్కాలచంద్రుని మించిపోవు కాంతితో నుండెను. అతని కళ్ళు పద్మములకంటె అందముగానుండెను. పెదవులు దొండపండుకంటె గొప్పగానుండెను. తల, చెక్కిళ్ళు చాలా అందముగానుండినవి. ముక్కు గరుత్మంతుని ముక్కుకంటె అందముగానుండెను. ఈ విధముగా ఆ శిశువు పార్వతీదేవియొక్క శయ్యపై చేతులు కాళ్ళు ఆడించుచు ముల్లోకములందులేని అందమైన రూపుతోనుండెను. ఇతిశ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణశఖండే నారదనారాయణసంవాదే గణశోత్పత్తివర్ణనం నామాష్టమోzధ్యాయ || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదైన గణశఖండమున నారదనారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన శ్రీగణశోత్పత్తియను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.