sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
దశమోzధ్యాయః - గణశోద్భవ మంగళం నారాయణ ఉవాచ - నారాయణముని నారదునితో ఇట్లనెను. తౌ దంపతీ బహిర్గత్వా పుత్రమంగళ##హేతవే | వివిధాని చ రత్నాని ద్విజేభ్యో దదతుర్ముదా ||
1 బందిభ్యో భిక్షుకేభ్యశ్చ దానాని వివిధాని చ | నానావిధాని వాద్యాని వాదయామాస శంకరః ||
2 హిమాలయశ్చ రత్నానాం దదౌ లక్షం ద్విజాతయే | సహస్రం చ గజేంద్రణామశ్వానాం చ త్రిలక్షకం ||
3 దశలక్షం గవాం చైవ పంచలక్షం సువర్ణకం | ముక్తామాణిక్యరత్నాని మణిశ్రేష్ఠాని యాని చ ||
4 అన్యాన్యపి చ దానాని వస్త్రాణ్యాభరణాని చ | సర్వాణ్యమూల్యరత్నాని క్షీరోదోత్పత్తికాని చ ||
5 బ్రహ్మణభ్యో దదౌ విష్ణుః కౌస్తుభం కౌతుకాన్వితః | బ్రహ్మ విశిష్టదానాని విప్రాణాం వాంఛితాని చ | సుదుర్లభాని సృష్టౌ చ బ్రహ్మణభ్యో దదౌ ముదా ||
6 ధర్మః సూర్యశ్చ శక్రశ్చ దేవాశ్చ మునయస్తథా | గంధర్వా పర్వతా దేవ్యో దుదుర్దానం క్రమేణ చ ||
7 మాణిక్యానాం సహస్రాణి రత్నానాం చ శతాని చ | శతాని కౌస్తుభానాం చ హీరకాణాం శతాని చ ||
8 హరిద్వర్ణమణీంద్రాణాం సహస్రాణి ముదాన్వితాః || 9 గవాం రత్నాణి లక్షాణి గజరత్నసహస్రకం | అమూల్యాన్యన్యరత్నాని శ్వేతవర్ణాని కౌతుకాత్ || 10 శతలక్షం సువర్ణానాం వహ్నిశుద్దాంశుకాని చ | బ్రహ్మణభ్యో దదౌ బ్రహ్మ తత్ర క్షీరోదధిర్ముదా || 11 హారం చామూల్య రత్నానాం త్రిషు లోకేషు దుర్లభం | అతీవ నిర్మలం సారం సూర్యభానువినిందకం || 12 పరిష్కృతం చ మాణిక్యై ర్హీరకైశ్చ విరాజితం | రమ్యం కౌస్తుభమధ్యస్థం దదౌ దేవీ సరస్వతీ || 13 త్రైలోక్యసారం హారం చ సద్రత్నగణనిర్మితం | భూషణాని చ సర్వాణి సా సావిత్రీ దదౌ ముదా || 14 లక్షం సువర్ణలోష్టానాం ధనాని వివిధాని చ | శతాన్యమూల్యరత్నానాం కుబేరశ్చ దదౌ ముదా || 15 పార్వతీపరమేశ్వరులు తమ పుత్రుని ముఖము చూచి ఆ గదినుండి బయటకు వచ్చి బ్రాహ్మణులకు అనేక రత్నములను దానముచేసిరి. అట్లే స్తోత్రములు చేయు భట్టులకు, భిక్షకులకు కూడ అనేక దానములు చేసి మంగళవాద్యములను మ్రోగించిరి. శిశువుయొక్క తాతగారగు హిమవంతుడు బ్రాహ్మణులకు లక్షలకొలది రత్నములను, వేలకొలది గజేంద్రములను, మూడులక్షల గుఱ్ఱములను, పదిలక్షల గోవులు, ఐదులక్షల సువర్ణముద్రలను ఇంకను ముత్యాలు, మాణిక్యములు, రత్నములు, వస్త్రములు, ఆభరణములు మొదలగు వాటినన్నిటిని దానమొసగెను. శ్రీమహావిష్ణువు బ్రాహ్మణులకు కౌస్తుభమణులను దానముచేయగా బ్రహ్మదేవుడు ఆయా విప్రులు కోరుకొన్న వస్తువులను దానము చేసెను. అట్లే ధర్మదేవత, సూర్యుడు, ఇంద్రుడు, దేవతలు, దేవతాస్త్రీలు, మునులు, గంధర్వులు, పర్వతములు మొదలగు వారందరు అనేక వేల మాణిక్యములను, అనేకవందల రత్నములను, వజ్రములను, పచ్చలను, లక్షలకొలది ఆవులను, వేలకొలది ఏనుగులను దానముచేసిరి. బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు కోట్లకొద్ది బంగారునాణములను, వస్త్రములను దానము చేసెను. సరస్వతీ దేవి గణపతి పుట్టిన సందర్భమున అనేక మణులు, వజ్రములుకల హారములను బ్రాహ్మణులకు దానము చేసెను. సావిత్రీదేవి మంచి రత్నములున్న హారమును, తన సమస్తాభరణములను బ్రాహ్మణులకు దానము చేసెను. ధనపతియగు కుబేరుడు ఆ సమయమున లక్షలకొలది బంగారు నాణములను, వందలకొలది విలువైన రత్నములను ఇంకను అనేక విధములైన వస్తువులను బ్రాహ్మణులకు సంతోషముతో దానము చేసెను. దానాని దత్వా విప్రేభ్యస్తే సర్వే దదృశుః శిశుం | పరమానందసంయుక్తా శివపుత్రోత్సవే మునే || 16 భారం వోడు మశక్తాశ్చ బ్రాహ్మణా బందినస్తథా | స్థాయం స్థాయం చ గచ్ఛంతో ధనాని పథికాతురా || 17 కథయంతి కథాః సర్వే విశ్రాంతా పూర్వదాయినాం | బుద్ధాః శ్రుణ్వంతి ముదితా యువానో భిక్షుకా మునే || 18 విష్ణుః ప్రముదితస్తత్ర వాదయామాస దుందుభిం | సంగీతం పాయయామాస కారయామాస నర్తనం | వేదాంశ్చ పాఠయామాస పురాణాని చ నారద || 19 మునీంద్రానానయామాస పూజయామాస తాన్ముదా | ఆశిషం దాపయామాస కారయామాస మంగళం | సార్థం దేవైశ్చ దేవీభిర్దదౌ తసై#్మ శుభాశిషః || 20 దేవతలందరు పరమసంతోషముతో బ్రాహ్మణులకు దానములు చేసి శిశువును చూచిరి. దేవతలు మొదలగువారు సమర్పించిన దానములను బ్రాహ్మణులు మోయలేక మెల్లమెల్లగా పోవుచు అచ్చటచ్చట విశ్రాంతిగొనుచు తమకిచ్చిన దానములగురించి యువకులకు, భిక్షకులకు కథలు కథలుగా చెప్పుచుండిరి. వారు ఆ బ్రాహ్మణులు చెప్పిన కథలను వినుచు సంతోషపడుచుండిరి. శివపుత్రుడైన గణపతి జన్మోత్సవసమయమున విష్ణుమూర్తి సంతోషముతో వాద్యములను మ్రోగింపజేయుచు నాట్యమును చేయించుచు, సంగీతమును వినిపించుచుండెను. అట్లే అచ్చట వేద, పురాణపారాయణమును చేయించెను. అదేవిధముగా మునీంద్రులను ఆహ్వానించి వారిని పూజలందుకొనునట్లు చేసెను. వారందరు మరియు దేవతలందరు ఆ శిశువునకు ఆశీస్సులనొసరిగి. విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను. శివేన తుల్యం జ్ఞానం తే పరమాయుశ్చ బాలక | పరాక్రమే మయా తుల్యః సర్వసిద్ధీశ్వరో భవ || 21 ఓ బాలకా నీకు శంకరునితో సమానమగు జ్ఞానము ఆయుస్సు కలుగుగాక! అట్లే నాతో సమానమైన పరాక్రమము కలుగునుగాక! నీవు సమస్తసిద్దులకు అధిపతిగా వెలుగొందుదువని ఆశీర్వదించెను. బ్రహ్మవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను. యశసా తే జగత్పూర్ణం సర్వపూజ్యో భవాచిరం | సర్వేషాం పురతః పూజా భవత్వతిసుదుర్లభా || 22 ఓ బాలకా! నీ కీర్తి ప్రపంచమంతయు వెలుగుగాక! నీవు త్వరలో అందరిచే మన్ననలనందుకొందువు. అందరు దేవతలకంటె ముందు నీపూజయే జరుగునని ఆశీర్వదించెను. ధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లు పలికెను. మయా తుల్యః సుధర్మిష్ఠో భవాన్భవతు దుర్లభః | సర్వత్రశ్చ దయాయుక్తో హరిభక్తో హరేః సమః || 23 ఓ శిశూ | నీవు నావలె చక్కని ధర్మమార్గమున చరింతువు. నీవు సర్వజ్ఞుడవు, దయకలవాడవు, శ్రీహరిభక్తుడవు కూడ కాగలవు. నీవు శ్రీహరితో సమానుడవుగా ప్రకాశింతువని ఆశీర్వదించెను. మహాదేవ ఉవాచ - శంకరుడిట్లు పలికెను. దాతా భవ మయాతుల్యో హరిభక్తశ్చ బుద్దిమాన్ | విద్యావాన్ పుణ్యవాన్ శాంతో దాంతశ్చ ప్రాణవల్లభ || 24 ఓ నాప్రాణప్రియమైన బాలకా ! నీవు నాతో సమానముగా దానశీలుడవు, హరిభక్తుడవు, బుద్దిమంతుడవు, విద్యావంతుడవు, పుణ్యవంతుడవు, శాంతుడవు, నిగ్రహవంతుడవు కమ్మని శంకరుడాశీర్వదించెను. లక్ష్మీ రువాచ - లక్ష్మీదేవి ఇట్లు పలికినది. మమస్థితిశ్చ గేహే తే దేహే భవతు శాశ్వతీ | పతివ్రతా మయాతుల్యా శాంతా కాంతా మనోహరా || 25 "ఓ బాలకా నేనే నీశరీరమందు, నీవున్నచోట శాశ్వతముగా నివసింతును" అని ఆశీర్వదించెను. సరస్వత్యువాచ - సరస్వతీదేవి ఇట్లు పలికెను. మయా తుల్యా సుకవితా ధారణా శక్తిరేవ చ | స్మృతిర్వివేచనా శక్తిర్భవత్వతితరాం సుత || 26 ఓ పుత్రా! నీకు నాతో సమానముగా కవిత్వము చెప్పు శక్తి, ధారణచేయు శక్తి, స్మరించుశక్తి, ఆలోచించు శక్తి అనునవి చక్కగా కలుగునని ఆశీర్వదించెను. సావిత్ర్యువాచ - సావిత్రీదేవి ఇట్లనెను. వత్సాహం వేదజననీ వేదజ్ఞానీ భవాచిరం | మన్మంత్రజపశీలశ్చ ప్రవరో వేదవాదినాం || 27 హే వత్స! నేను వేదములకు మాతృరూపిణిని. నీవు నా అనుగ్రహముచే త్వరగా వేదవేదాంగ జ్ఞానవంతుడవగుదువు. నాయొక్క మంత్రమును జపించుచు వేదర్థమును గురించి చర్చించువారిలో అగ్రగణ్యుడవు కాగలవని ఆశీర్వాదమునిచ్చెను. హిమాలయ ఉవాచ - హిమవంతు డిట్లనెను. శ్రీకృష్ణేzతిమతిః శశ్వద్భక్తిర్భవతు శాశ్వతీ | శ్రీకృష్ణతుల్యో గుణవాన్భవ కృష్ణపరాయణః || 28 ఓ బాలకా! నీకు శ్రీకృష్ణునిపై శాశ్వతభక్తియుండుగాక! నీవు శ్రీకృష్ణభక్తుడవై శ్రీకృష్ణునితో సమానమగు సుగుణములతో ప్రకాశింతువని ఆశీస్సులనిచ్చెను. మేనకోవాచ - మేనకాదేవి ఇట్లు పలికెను. సముద్రతుల్యో గాంభీర్యే కామతుల్యశ్చ రూపవాన్ | శ్రీయుక్తః శ్రీపతిసమో ధర్మే ధర్మసమో భవ || 29 ఓ శిశూ! నీవు గాంభీర్యమున సముద్రముతో సమానడవుకమ్ము. అట్లే అందమున మన్మథునితో సమానుడుగా, ధర్మవర్తనమున ధర్మదేవతతో సమానముగా లక్ష్మీయుక్తుడవై శ్రీహరితో సమానముగా వెలుగొందెదవని ఆశీర్వదించెను. వసుంధరోవాచ - భూదేవత ఇట్లు పలికెను. క్షమాశీలో మయా తుల్యః శరణ్యః సర్వరత్నవాన్ | నిర్విఘ్నే విఘ్ననిఘ్నశ్చ భవ వత్స శుభాశ్రయః || 30 ఓ బాలకా! నీవు నావలె ఓర్పు కలిగియుందువు. అందరు నిన్నే శరణు వేడెదరు. విఘ్నములకు దూరుడవై విఘ్నములనన్నిటిని తొలగింతువు. నిన్ను సమస్త శుభలక్షణములు ఆశ్రయించి ఎల్లప్పుడుండునని ఆశీర్వదించెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. తాత తుల్య మహాయోగే సిద్ధః సిద్ధిప్రదః శుభః | మృత్యుంజయశ్చ భగవాన్ భవత్వతివిశారదః || 31 నాయనా! నీవు నీతండ్రివలె మహోయోగిగా, సమస్త సిద్దులకు నిలయుడవుగా, సమస్తసిద్దులనిచ్చే దేవతగా ఉండుము. అత్యంత శుభంకరుడవైన నీవు మృత్యుండయుడవై సమస్తకార్యవిశారదుడవై వర్ధిల్లుమని ఆశీర్వదించెను. ఋషియో మునయః సిద్ధాః సర్వే యుయురాజురాశిషః | బ్రాహ్మణా బందినశ్చైవ యుయుజః సర్వమంగళం || 32 అదేవిధముగా ఋషులు, మునీశ్వరులు, సిద్దులు అందరు ఆ బాలకుని ఆశీర్వదించింరి. బ్రాహ్మణులు స్తోత్రపాఠకులైన భట్రాజులందరు సమస్తము మంగళప్రదము కావలెనని కోరిరి. సర్వం తే కథితం వత్స సర్వమంగళమంగళం | గణశ జన్మ కథనం సర్వవిఘ్న వినాశనం || 33 ఇమం సుమంగళాధ్యక్షం యః శ్రుణోతి సుఖం యతః | సర్వమంగళసంయుక్తః స భ##వేన్మంగళాలయః || 34 అపుత్రో లభ##తే పుత్రమధనో లభ##తే ధనం | కృపణో లభ##తే సత్వం శశ్వత్సంపత్ర్పదాయి చ || 35 భార్యార్థీ లభ##తే భార్యాం ప్రజార్థీ లభ##తే ప్రజాం | ఆరోగ్యం లభ##తే రోగీ సౌభాగ్యం దుర్భగా లభేత్ || 36 భ్రష్టపుత్రం నష్టధనం ప్రోషితం చ ప్రియం లభేత్ | శోకావిష్టః సదాzనందం లభ##తే నాత్రసంశయః || 37 యత్పుణ్యం లభ##తే మర్త్యో గణశాఖ్యానకశ్రుతౌ | తత్ఫలం లభ##తే నూనమధ్యాయ శ్రవణాన్మునే || 38 ఆయం చ మంగళాధ్యాయో యస్య గేహే చ తిష్ఠతి | సదా మంగళసంయుక్తః స భ##వేన్నాత్ర సంశయః || 39 యాత్రాకాలే చ పుణ్యాహే యః శ్రుణోతి సమాహితః | సర్వాభీష్టం స లభ##తే శ్రీగణశప్రసాదతః || 40 వత్స!నారదా! నీకు సర్వమంగళములకు మంగళప్రదమైనది, సమస్త విఘ్నములను తొలగించునది యగు గణశుని జన్మవృత్తాంతమును తెల్పితిని. సమస్తమంగళములకు శ్రేష్ఠమైన ఈ గణశ జన్మవృత్తాంతమునంతయు విన్నవారికి సమస్తమంగళములు కలుగును. అతని గృహమెప్పుడు సమస్త మంగళములకు నిలయము కాగలదు. ఈ గణశజన్మవృత్తాంతమును చక్కగా విన్నచో పుత్రులు లేనివారికి పుత్రసంపద కలుగును. ధనహీనునకు అంతులేని సంపద లభించును. లోభికి దానగుణమబ్బును. భార్యలేనివానికి త్వరలో భార్య లభించును. సదారోగి చక్కిని ఆరోగ్యవంతుడగును. పుత్రులు, భర్త, ధనములను పోగొట్టుకొన్నవానికి తిరిగి వారు లభింతురు. దుఃఖములోనున్నవారికి సంతోషము కలుగును. గణశుని వృత్తాంతమంతయు విన్నవారికి లభించు ఫలితము శ్రీగణశుని జన్మవృత్తాంతముగల ఈ అధ్యాయమునొకదానిని మాత్రమే వినినప్పుటికిని కలుగును. మంగళాధ్యాయమనదగు ఈ ఆధ్యాయము ఉన్న ఇంటిలో సదా మంగళములు జరుగుచునేయుండును. యాత్రలు చేయుచున్నప్పుడు, పుణ్యదినములయందు ఈ అధ్యాయమును నిశ్చలభక్తితో విన్నవారికి శ్రీ గణశుని అనుగ్రహము వలన సమస్తమైన కోరికలు సిద్దించునని నారాయణమహర్షి తెలిపెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణశఖండే నారదనారాయణసంవాదే గణశోద్భవమంగళం నామదశమోzధ్యాయః | శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో మూడవదైన గణశఖండమున నారద నారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన గణశోద్భవమంగళమను పదియవ అధ్యాయము సమాప్తము.