sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
11. ఏకదశోzధ్యాయః - విష్ణుమూర్తి, వైష్ణవుల ప్రశంస శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను- ద్విజః స భార్యాం సంత్యజ్య కిం చకార విశేషతః | అశ్వినోర్వా మహాభాగ కిం నామ కస్య వంశజౌ || 1 పూర్వము బ్రాహ్మణుడు తన భార్యను వదలి ఏమి చేసెను. అశ్వినీ కుమారుల పేరేమి? వారు ఎవని వంశమువారు? మొదలగు విషయములను తెలుపుము. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను- ద్విజశ్చ సుతపా నామ భారద్వాజో మహామునిః | తపశ్చకార కృష్ణస్య లక్షవర్షం హిమాలయే || 2 మహాతపస్వీ తేజస్వీ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా | జ్యోతిర్దదర్శ కృష్ణస్య గగనే సహసా క్షణం || 3 వరం స వవ్రే నిర్లిప్తమాత్మానం ప్రకృతేః పరం | న చ మోక్షం యయాచే తం దాస్యం భక్తిం చ నిశ్చలాం || 4 బభూవాకాశవాణీతి కురు దారపరిగ్రహం | పశచాద్దాస్యం ప్రదాస్యామి భక్తిం భోగక్షయే ద్విజ || 5 పితౄణాం మానసీం కన్యాం దదౌ తసై#్మ విధిః స్వయం | తస్యాం కల్యాణమిత్రశ్చ బభూవ మునిపుంగవ || 6 యస్య స్మరణమాత్రేణ న భ##వేత్ కలిజం భయం | న ద్రష్టవ్యం బంధుమాత్రం నూనం తత్స్మరణాద్భవేత్ || 7 ఓ శౌనక మహర్షీ! సుతపుడనే భరద్వాజ వంశమునకు చెందిన ముని హిమాలయ పర్వత ప్రాంతమున శ్రీకృష్ణదేవుని గురించి లక్ష సంవత్సరములు తపస్సు చేసెను. ఆతడు బ్రహ్మ వర్చస్సుతో గొప్పగా ప్రకాశించుచు ఆకాశమున జ్యోతిః స్వరూపుడైన శ్రీకృష్ణుని క్షణకాలము దర్శించెను. సుతపునకు పరమాత్మ దర్శనము జరిగినా ఆ పరాత్పరుని ఏ వరము అడుగలేదు. చివరకు మోక్షమును సైతము యాచించలేదు. కాని అతడు పరమాత్మను స్థిరమైన భగవద్దాస్యము, భగవద్భక్తిని తనకు ప్రసాదించమని అడిగెను. అప్పుడు భగవంతుడు ఆకాశవాణి ద్వారా తొలుత వివాహము చేసికొమ్మని, తరువాత భగవద్దాస్యమును, అనుభవక్షయము జరిగిన తరువాత భగవద్భక్తిని ఇత్తునని చెప్పెను. అప్పుడు బ్రహ్మదేవుడు పితృదేవతల మానస కన్యను అతనికిచ్చి వివాహము చేసెను. వారిద్దరకు కళ్యాణమిత్రుడనే పుత్రుడు కలిగెను. కల్యాణమిత్రుడు మిక్కిలి పవిత్రమైనవాడు. అతనిని స్మరించినంత మాత్రముననే కలివల్ల కలుగు భయములన్ని తొలిగిపోవును. కల్యాణమిత్ర జననీం పరిత్యజ్య మహామునిః | శశాప సూర్యపుత్రం చ యజ్ఞభాగ్వర్జితో భవ || 8 ససోదరశ్చ వాzపూజ్యో భ##వేతి చ సురాధమ | వ్యాధిగ్రస్తో జడాంగశ్చ భూయాత్తేz కీర్తిమానితి || 9 ఇత్యుక్త్వా సుతపా గేహం ప్రతస్థే సూనునా సహ | అశ్విభ్యాం సహితః సూర్యః ప్రయ¸° చ తదంతికం || 10 పుత్రాభ్యాం వ్యాధిక్తాభ్యాం సూర్యస్త్రిజగతాం పతిః | మునీంద్రం వై సుతపసం సతుష్టావ చ శౌనక || 11 సుతపమహర్షి (అశ్వినీ కుమార సంగతయైన) తన భార్యను వదలిపెట్టి సూర్యపుత్రుడైన అశ్వినీ కుమారునకు అతని సోదరునకు యజ్ఞభాగము ఉండకుండునట్లు, వ్యాధిగ్రస్తులై జడమైన అవయవములతో గౌరవ దూరులు కమ్మని శపించి తన పుత్రుడైన కల్యాణమిత్రునితో కలిసి ఇంటికి వెళ్ళిపోయెను. ముల్లోకములకు పూజ్యుడైన సూర్యుడు వ్యాధిపీడితులైన తన కుమారులను వెంటపెట్టుకొని సుతపమహర్షి వెంటవెళ్ళి అతనినిట్లు ప్రస్తుతించెను. సూర్య ఉవాచ- సూర్యుడిట్లనెను- క్షమస్వ భగవన్విప్ర విష్ణురూప యుగే యుగే ! మమ పుత్రాపరాధం చ భారద్వాజ మునీశ్వర || 12 బ్రహ్మవిస్ణుమహేశాద్యాః సురాః సర్వే చ సంతతం | భుంజతే విప్రదత్తం తు ఫలపుష్ఫజలాదికం || 13 బ్రాహ్మణావాహితా దేవా శశ్వద్విశ్వేషు పూజితాః | న చ విప్రాత్పరో దేవో విప్రరూపీ స్వయం హరిః || 14 బ్రాహ్మణ పరితుష్టే చ తుష్టో నారాయణః స్వయం | నారాయణ చ సంతుష్టే సంతుష్టాః సర్వదేవతాః || 15 నాస్తి గంగాసమం తీర్థం న చ కృష్ణాత్పరః సురః | న శంకరాద్వైష్ణవశ్చ న సహిష్ణుర్ధరా పరా || 16 న చ సత్యాత్పరో ధర్మః న సాధ్వీ పార్వతీ పరా | న దైవాద్బలవాన్కశ్చిత్ న చ పుత్రాత్పరః ప్రియః || 17 న చ వ్యాధిసమః శత్రుః న చ పూజ్యో గురోః పరః | నాస్తి మాతృసమో బంధుః న చ మిత్రం పితుః పరం || 18 ఏకాదశీవ్రతాన్నాన్యత్ తపో నాzనశనాత్పరం | పరం సర్వధనం రత్నం విద్యారత్నం పరం తతః || 19 సర్వాశ్రమైః పరో విప్రః నాస్తి విప్రసమో గురుః | వేదవేదాంగతత్వజ్ఞ ఇత్యాహ కమలోద్భవః || 20 ప్రతి యుగములో విష్ణుస్వరూపుడవైన ఓ బ్రాహ్మణుడా! నా పుత్రుని తప్పును క్షమించుము. బ్రహ్మ, విష్ణు, మహేశుడు మొదలైన దేవతలు బ్రాహ్మణుడిచ్చు ఫలములను, పుష్పములను, నీటిని అనుభవించుచున్నారు. బ్రాహ్మణులచే ఆవాహనము చేయబడిన దేవతలు సమస్త ప్రపంచములందు పూజలనందుకొనుచున్నారు. అందువలన బ్రాహ్మణుని కంటె గొప్పనైన దేవుడు ఎక్కడ లేడు. విష్ణుమూర్తి స్వయముగా బ్రాహ్మణ రూపమున ఉండును. బ్రాహ్మణుడు సంతోషపడినచో విష్ణుమూర్తి కూడ సంతసించగలడు. నారాయణుడు సంతుష్టుడైనచో సమస్త దేవతలు సంతుష్టులైనయట్లే. గంగానదితో సమానమైన పుణ్యతీర్థము, శ్రీకృష్ణునికంటె గొప్పనైన దేవత, శంకరుని కన్న గొప్ప వైష్ణవ భక్తుడు, భూమికంటె గొప్ప క్షమాశీలి, సత్యము కంటె గొప్ప ధర్మము, పార్వతి కంటె గొప్ప పతివ్రత, అదృష్టము కంటె గొప్పనైన బలవంతుడు కుమారుని కంటె ఇష్టమైన వ్యక్తి ఉండడు. అట్లే వ్యాధితో సమానమైన శత్రువు, గురువు కన్న గొప్ప పూజ్యుడు, తల్లితో సమానమైన బంధువు, తండ్రిని మించిన స్నేహితుడు, ఏకాదశీ వ్రతమును మించిన వ్రతము, ఉపవాసమును మించిన తపస్సు, రత్నము కంటె గొప్పనైన ధనము, విద్యారత్నమును మించిన రత్నము ఎక్కడా కన్పడదు. ఆశ్రమవాసులందరికంటెను బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. వేదములు, వేదాంగముల తత్వము తెలిసిన బ్రాహ్మణుని కంటె శ్రేష్ఠుడైన గురువు లేడని బ్రహ్మదేవుడు తెలిపినాడు. సూర్యస్య వచనం శ్రుత్వా భారద్వాజో ననామ తం | నీరుజౌ చాపి తత్పుత్రౌ చకార తపసః ఫలాత్ || 21 పశ్చాచ్చ తవ పుత్రౌ చ యజ్ఞభాజౌ భవిష్యతః | ఇత్యుక్త్వా తం చ సుతపాః ప్రణమ్యాహస్కరం మునిః || 22 జగామ గంగాం సంత్రస్తో హరిసేవనతత్పరః | పుత్రాభ్యాం సహితః సూర్యో జగామ నిజమందిరం || 23 ఏతత్సూర్యకృతం విప్ర స్తోత్రం యోమానవః పఠేత్ | విప్రపాద ప్రసాదేన సర్వత్ర విజయీ భ##వేత్ || 24 సూర్యుని మాటలు విని భారద్వాజుడైన సుతపు డతనికి నమస్కరించి, తన తపశ్శక్తివలన సూర్యపుత్రులను వారి వ్యాధినుండి విముక్తులను చేసి, తరువాత వారికి యజ్ఞహవిస్సు తీసుకొను అర్హత లభించగలదని చెప్పి, మరల సూర్యునకు నమస్కరించి నారాయణుని సేవకై గంగాతీరమునకు వెళ్ళిపోయెను. సూర్యుడు తన కుమారులతో కలిసి తన ఇంటికి పోయెను. ఓ శౌనకమహర్షీ! సూర్యుడు చేసిన ఈస్తోత్రమును ఎవరు చదువుదురో, బ్రాహ్మణానుగ్రహమువలన అంతట విజయము వారికి లభించును. బ్రాహ్మణభ్యో నమ ఇతి ప్రాతరుత్థాయ యః పఠేత్ | సః స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః || 25 పృథివ్యాం యాని తీర్థాని తాని తీర్థాని సాగరే | సాగరే యాని తీర్థాని విప్రపాదేషు తాని చ || 26 విప్రపాదోదకం పీత్వా యావత్తిష్ఠతి మేదినీ | తావత్పుష్కరపాత్రేషు పిబంతి పితరో జలం || 27 విప్రపాదోదకం పుణ్యం భక్తియుక్తశ్చ యః పిబేత్ | స స్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః || 28 మహారోగీ యది పిబేద్విప్రపాదోదకం ద్విజః | ముచ్యతే సర్వ రోగాచ్ఛ మాసమేకం తు భక్తితః || 29 అవిద్యో వా సవిద్యో వా సంధ్యాపూతో హి యో ద్విజః | స ఏవ విష్ణుసదృశో న హరౌ విముఖో యది || 30 ఘ్నంతం విప్రం శంపంతం వా న హన్యాన్న చ తం శ##పేత్ | గోభ్యః శతగుణం పూజ్యో హరిభక్తశ్చ స స్మృతః || 31 పాదోదకం చ నైవేద్యం భుంక్తే విప్రస్య యో ద్విజ | నిత్యం నైవేద్యభోజీ యో రాజసూయఫలం లభేత్ || 32 ఉదయమే లేచి బ్రాహ్మణులకు నమస్కరించుచున్నాను అని ఎవడనునో అతడు సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన వానితో సమానుడు. సమస్త యజ్ఞములందు దీక్ష తీసికొన్న వానితో సమానుడు. భూమిపై ఎన్ని పుణ్య తీర్థములున్నవో, సముద్రమున అన్ని తీర్థములున్నవి.సముద్రములో నున్న తీర్థములన్నీ బ్రాహ్మణుల పాదతీర్థముననున్నవి. విప్రులపాదోదకము తాగినచో భూమియున్నంతకాలము ఆతని పితృదేవతలు పుష్కర పాత్రలలో తర్పణ జలము తాగుదురు. పవిత్రమైన బ్రాహ్మణపాదోదకమును తాగినవాడు సమస్త పుణ్య తీర్థములలో స్నానము చేసినవానితో, సమస్త యజ్ఞములందు దీక్షను గైకొన్న వానితో సమానుడు. మహారోగియైనా విప్రపాదోకమును ఒక నెల భక్తితో స్వీకరించినచో అతని సమస్త రోగములు వెంటనే తొలగిపోవును. ప్రతిదినము సంధ్యావందనము చేయు బ్రాహ్మణుడు చదువుకున్నా, చదువుకోకపోయినా, విష్ణుద్వేషములేనిచే అతడు విష్ణుమూర్తితో సమానుడు. విప్రుడు కొట్టినా అతనిని కొట్టవద్దు. శపించినా శపించవద్దు. హరిభక్తుడైతే అతడు ఆవులకన్న వందరెట్లు ఎక్కువగా గౌరవించతగినవాడు. విప్రునియొక్క పాదోదకమును అతని నైవేద్యమును ఎవరు స్వీకరిస్తారో అతడు నిత్యము భగవన్నైవేద్యమును తినువాడు. రాజసూయ ఫలితమనుభవించువాడగును. ఏకాదశ్యాం న భుంక్తే యో నిత్యం కృష్ణం సమర్చయేత్ | తస్య పాదోదకం ప్రాప్య స్థలం తీర్థం భ##వేత్ ధ్రువం || 33 యో భుంక్తే భోజనోచ్ఛిష్టం నిత్యం నైవేద్యభోజనం | కృష్ణదేవస్య పూతోzసౌ జీవన్ముక్తో మహీతలే || 34 అన్నం విష్ఠా పయో మూత్రం యద్విష్ణోరనివేదితం | ద్విజానాం కులజాతానామిత్యాహ కమలోద్భవః || 35 బ్రహ్మా చ బ్రహ్మపుత్రాశ్చ సర్వే విష్ణుపరాయణాః | బ్రాహ్మణస్తత్కులే జాతో విముఖశ్చ హరౌ కథం || 36 పిత్రోర్మాతామహాదీనాం సంసర్గస్య గురోశ్చవా | దోషేణ విముఖాః కృష్ణే విప్రా జీవన్మృతాశ్చయే || 37 స కిం గురుః స కిం తాతః స కిం పుత్రః స కిం సఖా | స కిం రాజా స కిం బంధుః న దదాద్యోహరౌ మతిం || 38 అవైష్ణవాద్విజాద్విప్ర చండాలో వైష్ణవో వరః | సగణః శ్వపచోముక్తో బ్రాహ్మణో నరకం వ్రజేత్ || 39 సంధ్యాహీనోzశుచిర్నిత్యం కృష్ణే వా విముఖో ద్విజః | స ఏవ బ్రాహ్మణాభాసో విషహీనో యథోzరగః || 40 గురువక్త్రాద్విష్ణుమంత్రో యస్య కర్ణే ప్రవిశ్యతి | తం వైష్ణవం మహాపూతం జీవన్ముక్తం వదేద్విధిః || 41 పుంసాం మాతామహాదీనాం శ##తైః సార్థం హరేః పదం | ప్రయాతి వైష్ణవః పుంసామాత్మనః కులకోటిభిః || 42 బ్రహ్మక్షత్రియవిట్ శూద్రాశ్చతస్రః జాతయో యథా | స్వతంత్రా జాతిరేకా చ విశ్వస్మిన్ వైష్ణవాభిధా || 43 ధ్యాయంతి వైష్ణవాః శశ్వద్గోవిందపదపంకజం | ధ్యాయతే తాంశ్చ గోవిందః శశ్వత్తేషాం చ సన్నిధౌ || 44 సుదర్శనం సంనియోజ్య భక్తానాం రక్షణాయ చ | తథాzపిన హి నిశ్చింతోzవతిష్ఠేద్భక్తసన్నిధౌ || 45 ఏకాదశినాడు ఎవరు ఉపవాసముందురో ఎవరు ప్రతిదినము శ్రీకృష్ణుని పూజింతురో వారి పాదోదకము పడిన స్థలము తప్పక పుణ్యతీర్థము కాగలదు. శ్రీకృష్ణునికి నివేదితమైన అన్నమును ఎవరు ప్రతిదినము తిందురో అతడు జీవన్ముక్తుడు కాగలడు. విష్ణుమూర్తికి నివేదింపబడని అన్నము మలముతో సమానము. పాలు మూత్రముతో సమానము. బ్రహ్మ, బ్రహ్మయొక్క పుత్రులందరు విష్ణుభక్తి పరాయణులు. ఆ బ్రహ్మకులములో పుట్టిన బ్రాహ్మణుడు విష్ణుభక్తికి విముఖుడౌతాడా? తల్లి దండ్రులు, మాతామహులు, పితామహులు, గురువు మొదలగువారి దోషమువలన బ్రాహ్మణులు విష్ణుభక్తి విదూరులగుచున్నారు. అట్టివారు జీవన్మృతులు. హరిభక్తి కలిగించని గురువు గురువుకాదు. తండ్రి తండ్రి కాడు. కొడుకు కొడుకు కాదు. స్నేహితుడు, రాజు, బంధువు ఎవరైనను సరియైన వారుకాదు. వైష్ణవుడు కాని బ్రాహ్మణుని కంటె వైష్ణవుడైన చండాలుడు చాలా గొప్పవాడు. విష్ణుభక్తిలేని బ్రాహ్మణుడు నరకమునకు వెళ్ళును. సంధ్యావందనము చేయని బ్రాహ్మణుడు, నిత్యము అశుచియైనవాడు, శ్రీకృష్ణభక్తి రహితుడైన బ్రాహ్మణుడు విషములేని సర్పమువలె పనికిరాని వాడగును. గురువు ముఖమునుండి విష్ణువుకు సంబంధించిన మంత్రము ఎవరి చెవిన పడునో ఆవైష్ణవుడు పరమ పవిత్రుడని, జీవన్ముక్తుడని అందురు. వైష్ణవుడు మాతామహుడు మొదలైన నూరు తరములవారిని, తన వారినందరిని వైకుంఠమునకు చేర్చును. బ్రాహ్మణులు, క్షత్రయులు, వైశ్యులు, శూద్రులవలె వైష్ణవులనేది ప్రత్యేకమైన జాతి. వైష్ణవులెల్లపుడు గోవిందుని పదపంకజములను స్మరించుచుందురు. ఆ గోవిందుడు కూడ వారిని స్మరించును. తన భక్తుల సంరక్షణకై సుదర్శన చక్రమును ఎల్లప్పుడు నియోగించినప్పటికిని పూర్తిగా భక్తరక్షణ చేసితినని నిశ్చింతగానుండడు. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మ ఖండే విష్ణు వైష్ణవ బ్రాహ్మణ ప్రశంసా నామ ఏకాదశోzధ్యాయః శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణములో సౌతి శౌనకసంవాదమను బ్రహ్మఖండమున విష్ణు, వైష్ణవబ్రాహ్మణప్రశంసలుకల పదకొండవ అధ్యాయము సమాప్తము.