sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుర్థశోzధ్యాయః - కార్తికేయజన్మకథనం నారాయణ ఉవాచ - నారాయణమహాముని ఇట్లు పలికెను. దేవాస్తస్యాం సభాయాం చ సర్వే సంహృష్టమానసాః | గంధర్వా మునయః శైలా పశ్యంతః సుమహోత్సవం ||
1 ఏతస్మిన్నంతరే దుర్గా స్మేరాననసరోరుహా | ఉవాచ విష్ణుం ప్రణతా దేవేశం తత్ర సంసది ||
2 గణపతి జన్మోత్సవమును తిలకించుచున్న దేవతలు, గంధర్వులు శైలములు (శైలాధిదేవతలు) మునులు, సంతోషమున ఓలలాడుచుండిరి. ఆ సమయమున పార్వతీదేవి చిరునవ్వుకల ముఖముతో శ్రీమహావిష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను. త్వం పాతా సర్వజగతాం నాథ నాహం జగద్బహిః | కథం మత్‌స్వామినో వీర్యమమోఘం రక్షితం ప్రభో ||
3 రతిభంగే కృతే దేవైర్బ్రహ్మణా ప్రేరితైస్త్వయా | భూమౌ నిపతితం వీర్యం కేన దేవేన వై హృతం ||
4 సర్వే దేవాస్త్వత్పురతః తదన్విష్యంతు సాదరం | అరాజకం కథమిదం తిష్ఠతి త్వయి రాజని ||
5 పార్వతీ వచనం శ్రుత్వా ప్రహస్య జగదీశ్వరః | ఉవాచ దేవవర్గే చ మునివర్గే చ తిష్ఠతి ||
5 ఓ జగన్నాథ! నీవు సమస్త జగములను రక్షించుచున్నావు. నేను కూడ ఈ జగములోని దానినే. అందువలన నాకు కూడ నీవే రక్షకుడడవు. కావున నా సంశయమును నీవే తీర్పవలయును. హేప్రభూ! వ్యర్థముకాని నా పతియొక్క వీర్యము ఏవిధముగా రక్షింపబడినది. బ్రహ్మదేవుడు, నీవు ప్రేరేపింపగా మా రతిభంగమును చేసిరి. ఆ సమయమున భూమిపై పడిన వీర్యమును ఏ దేవత రక్షించెను. ఈ విషయమును సమస్తదేవతలు అన్వేషించి తెల్పవలయును. ఈ జగములకన్నిటికి రాజువగు నీవుండగా అరాజకత్వమేట్లేర్పడును. అని అడిగెను. పార్వతీదేవియొక్క మాటలను విని జగదీశ్వరుడైన శీమహావిష్ణువు చిరునవ్వుతో ముని దేవతాగణమున్న ఆసభలో ఇట్లు పలికెను. శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లు పలికెను. దేవాః శ్రుణుత మద్వాక్యం పార్వతీవచనం శ్రుతం | శివస్యామోఘవీర్యం యత్తత్పురా కేన నిర్ హృతం || 7 సభామానయత క్షిప్రం న చేద్దండమిహార్హథ | స కో రాజా నశాస్తా యఃప్రజా బాధ్యశ్చ పాక్షికః || 8 విష్ణోస్తద్వచనం శ్రుత్వా సమాలోచ్య పరస్పరం | ఊచుః సర్వే శివావాక్యై త్రాసితాః పురతో హరేః || 9 ఓ దేవతలారా! నామాటను శ్రద్దగా వినుడు. మీరింతవరకు పార్వతీదేవి పలికిన మాటలు విన్నారు కదా. శివునియొక్క అమోఘమైన వీర్యమును ఎవరు తీసిరి? ఆ వ్యక్తి ని వెంటనే సభలో ప్రవేశ##పెట్టుడు. లేనిచో నేను దండించెదను. ప్రజలను బాధించుచు ప్రజలను రక్షింపనివాడెట్టి రాజు? అందువలన నా ప్రజలలో ఒకతియగు పార్వతిని దుఃఖపెట్టినవానిని తెలిసికొనుట నాధర్మము అని పలికెను. విష్ణుమూర్తియొక్క ఈమాటలను విని దేవతలు ఒకరినొకరు సంప్రదించుకొని, పార్వతీదేవి మాటలకు భయపడి విష్ణుమూర్తితో ఇట్లనిరి. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను. తద్వీర్యం నిర్ హృతం యేన పుణ్యభూమౌ చ భారతే | స వంచితో భవత్వత్ర పుణ్యాహే పుణ్యకర్మణి || 10 పవిత్రమైన ఈ భారతక్షేత్రమున పరమేశ్వరుని వీర్యమును హరించినవానికి పుణ్యకర్మలలోగాని, పుణ్యదివసములలోకాని మేలు జరుగకూడదని బ్రహ్మదేవుడనెను. శ్రీమహాదేవ ఉవాచ - శంకరుడు ఇట్లు సభలో పలికెను. తద్వీర్యం నిర్ హృతం యేన పుణ్యభూహౌ చ భారతే | స వంచితో భవత్వత్ర సేవనే పూజనే తవ || 11 పుణ్యక్షేత్రమైన ఈ భారతావనిలో నా వీర్యమును హరించిన దుష్టుడు నీపూజకు, నీసేవకు అర్హుడు కాకుండగాక యని పలికెను. యమ ఉవాచ - యమధర్మరాజిట్లు పలికెను. సవంచితో భవత్వత్ర శరణాగత రక్షణ | ఏకాదశీవ్రతే చైవ తద్వీర్యం యేన నిర్ హృతం || 12 శివుని వీర్యమును హరించినవాడు శరణుకోరినవారిని రక్షించుటకు, ఏకాదశీవ్రతము నాచరించుటకు అర్హుడు కాజాలడని యమధర్మరాజు పలికెను. ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు ఈవిధముగా పలికెను. తద్వీర్యం నిర్ హృతం యేన పాపినాం పాపమోచనే | భవత్వత్ర యశో లుప్తం తత్పుణ్యం కర్మ సంతతం || 13 పరమేశ్వరుని వీర్యమును హరించినవాని కీర్తి, పుణ్యము మొదలగునవి తొలగిపోవునని ఇంద్రుడు పలికెను. వరుణ ఉవాచ - వరుణుడిట్లనెను. భవత్వత్ర కలౌ జన్మ వర్షే స్యాద్భారతే హరే | శూద్రయాజకపత్న్యాశ్చ గర్భే తద్యేన నిర్ హృతం || 14 పరమశివుని వీర్యమును హరించినవాడు ఈ భారతవర్షమున శూద్రునిచే యాగము చేయించిన పాపాత్ముని ఇంట జన్మించునని వరుణుడనెను. కుబేర ఉవాచ - కుబేరుడిట్లనెను. న్యాసహారీ స భవతు విశ్వాసఘ్నశ్చ మిత్రహా | సత్యఘ్నశ్చ కృతఘ్నశ్చ తద్వీర్యం యేన నిర్ హృతం || 15 పరమశివుని వీర్యమును హరించినవాడు తనవద్ద దాచినసొమ్మునపహరించిన పాపాత్మునితో, తనపైనుంచిన విశ్వాసమును నాశనము చేసిన పాపాత్మునితో, తన మిత్రుని చంపుకొన్న పాపాత్మునితో, సత్యమును తప్పిన పాపాత్మునితో, కృతఘ్నునితో సమానమైనవాడగునని పల్కెను. ఈశాన ఉవాచ - ఈశానుడిట్లనెను. పరద్రవ్యాపహారీ సభవత్వత్ర భారతే | నరఘాతీ గురద్రోహీ తద్వీర్యం యేన నిర్ హృతం || 16 శంకరుని వీర్యమును హరించినవాడు ఇతరుల ద్రవ్యమునపహరించినవానితో, మానవులను హతమార్చెడు వానితో గురుద్రోహము చేసినవానితో సమాను డగునని పల్కెను. రుద్రా ఊచుః - రుద్రులిట్లనిరి. తే మిథ్యావాదినః సంతు భారతే పారదారికాః | గురునిందారతాః శశ్వత్తద్వీర్యం యైశ్చ నిర్హృతం || 17 పరమశివుని వీర్యమును హరించినవారు అసత్యవాదులతో, పరస్త్రీగమనము చేయువారితో, ఎల్లప్పుడు గురునిందను చేయువారితో సమానముగా పాపమును పొందుదురనిరి. కామదేవ ఉవాచ - కామదేవుడిట్లు పలికెను. కృత్వా ప్రతిజ్ఞాం యో మూఢో న సంపాలయతే భ్రమాత్ | భాజనం తస్య పాపస్య స భ##వేద్యేన తత్ హృతం || 18 శివుని వీర్యమును హరించినవాడు మాటతప్పినవానితో సమానమైన పాపమును పొందునని అనెను. స్వర్వైద్యా వూచతుః - దేవవైద్యులైన అశ్వినీకుమారులిట్లనిరి. మాతుః పితుఃగురోశ్చైవ స్త్రీ పుత్రాణాం చ పోషణ | భ##వేతాం వంచితౌ తౌ చ యాభ్యాం వీర్యం చ తద్ధృతం || 19 శంకరుని వీర్యమును హరించినవారు తల్లిదండ్రులను, గురువును, భార్యాపుత్రులను పోషించనివారితో సమానమైన పాపమును పొందదురు. సర్వే దేవా ఊచుః - దేవతలందరు ఇట్లు పలికిరి. మిథ్యా సాక్ష్యప్రదాతారో భవంత్వత్ర చ భారతే | అపుత్రిణో దరిద్రాశ్చ యైశ్చ వీర్యం హి తద్ధృతం || 20 పరమేశ్వరుని వీర్యమును హరించినవారు కూటసాక్ష్యములు చెప్పువారితో, సంతానము లేనివారితో, దరిద్రులతో సమానమైన పాపమును పొందుదురనిరి. దేవపత్న్య ఊచుః - దేవతాస్త్రీలిట్లనిరి. తా నిందంతు స్వభర్తారో గచ్ఛంతు పరపూరుషం | సంతు బుద్ధివిహీనాశ్చ యాభీర్వీర్యం హి తద్ధృతం || 21 పరమశివుని వీర్యమును హరించిన స్త్రీలు తమతమ భర్తలను నిందచినవారగుదురు. పరపురుషులతో వెళ్ళిన వారగుదురు. బుద్దిలేనివారగుదురని పలికిరి. దేవానాం వచనం శ్రుత్వా దేవీనాం చ హరిఃస్వయం | కర్మణాం సాక్షిణం ధర్మం సూర్యం చంద్రం హుతాశనం || 22 పవనం పృథివీం తోయం సంధ్యే రాత్రిం దివం మునే | ఉవాచ జగతాం కర్తా పాతా శాస్తా జగత్రయే || 23 పరమశివుని వీర్యహరణము గురించి దేవతలు దేవతాస్త్రీలు పలికిన మాటలను విని సృష్టిస్థితిసంహారకారకుడగు శ్రీహరి కర్మసాక్షియగు ధర్మదేవతను, సూర్యుని, చంద్రుని, అగ్నిదేవుని, వాయువును, భూమిని, నీటిని, సంధ్యలను, రాత్రింబగళ్ళనుద్దేశించి ఇట్లు పలికెను. శ్రీవిష్ణురువాచ - శ్రీమహావిష్ణువిట్లనెను. దైవైర్న నిర్హృతం వీర్యం తదేతత్కేన నిర్హృతం | తదమోఘం భగవతో మహేశస్య జగద్గురోః || 24 యూయం చ సాక్షిణో విశ్వే సతతం సర్వకర్మణాం | యుష్మాభిర్నిర్హృతం కిం వా కిం భూతం వక్తుమర్హద || 25 ఈశ్వరస్య వచః శ్రుత్వా సభాయాం కంపితాశ్చ తే | పరస్పరం సమాలోచ్య క్రమేణోచుః పురో హరేః || 26 శివుని వీర్యమును దేవతలెవ్వరు హరించనిచో మరి ఎవరు దానిని హరించినట్లు? ధర్మదిదేవతలారా! మీరందరు ఈ ప్రపంచమున జరుగుచున్న సమస్తకర్మలను సాక్షీభూతులు. మరి మీరేమైనా హరించినారా ? లేనిచో ఆ మహేశుని వీర్యము ఏమైనదో నాకు వివరింపుడనెను. శ్రీహరియొక్క మాటలు విని ధర్మాదిదేవతలు భయపడి తమలో తాము చర్చించుకొని శ్రీహరితోనిట్లనిరి. శ్రీధర్మ ఉవాచ - ధర్మదేవత ఇట్లనెను. రతేరుత్తిష్ఠతో వీర్యం పపాత వసుధాతలే | మయా జ్ఞాతమమోఘం తచ్ఛంకరస్య ప్రకోపతః || 27 శంకరుడు రతిమధ్య లేచినప్పుడు అమోఘమైన అతని వీర్యము భూమిపై పడినదను విషయము మాత్రము నాకు తెలియుననెను. క్షితిరువాచ - భూదేవి ఇట్లు పలికెను. వీర్యం వోఢుమశక్తాzహం తద్వహ్నౌ న్యక్షిపం పురా | అతీవ దుర్వహం బ్రహ్మన్నబలాం క్షంతుమర్హసి || 28 పరమశివుని వీర్యమును నేను భరింపలేక దానిని అగ్నిలో వేసితిని. నేను అబలను. అందువలన అట్లు చేసితిని కావున మీరు నన్ను క్షమింపలెనని వేడుకొనెను. అగ్నిరువాచ - అగ్నిదేవుడిట్లు పలికెను. వీర్యం వోఢుమశక్తోzహం న్యక్షిపం శరకాననే | దుర్బలస్య జగన్నాథ కిం యశః కిం చ పౌరుషం || 29 ఓ జగన్నాథ శంకరుని వీర్యమును భరింపలేక నేను దానిని రెల్లుగడ్డియున్న ప్రాంతమున వదలివేసితిని. నేను దుర్బలుడను నాకు కీర్తిపౌరుషములక్కరలేదు. అందువలన నన్ను క్షమింపుడని వేడెను. వాయురువాచ - వాయుదేవుడిట్లు పలికెను. శ##రేషు పతితం వీర్యం సద్యో బాలో బభూవ హ | అతీవ సుందరో విష్ణో సర్ణరేఖానదీ తటే || 30 హే భగవాన్! రెల్లుగడ్డిలో పడిన పరమశివుని వీర్యము వెంటనే అందమైన బాలుడుగా మారి స్వర్ణరేఖానదీతీరముననుండినట్లు చెప్పెను. శ్రీ సూర్య ఉవాచ - సూర్యభగవానుడిట్లు పలికెను. రుదంతం బాలకం దృష్ట్యాzగమమస్తాచలం ప్రతి | ప్రేరితః కాలచక్రేణ నిశి సంస్థాతుమక్షమః || 31 ఓ జగన్నాథా!స్వర్ణరేఖానదీతీరమున బాలుడు ఏడ్చుచుండుట గమనించితిని. కాని కాలచక్రముననుసరించి భ్రమించువాడను కావున సాయంసమయము అచ్చట ఉండలేక అస్తాచలమువైపు వెళ్ళినట్లు పలికెను. చంద్ర ఉవాచ - చంద్రుడిట్లనెను. రుదంతం బాలకం ప్రాప్య గృహీత్వా కృత్తికాగణః | జగామ స్వాలయం విష్ణో గచ్ఛన్బదరికాశ్రమాత్ || 32 ఓ శ్రీ మహావిష్ణూ ! స్వర్ణరేఖానదీతీరమున ఏడ్చుచుపడియున్న బాలకుని బదరికాశ్రమమునుండి తమ ఇంటికిపోవుచున్న కృత్తికలు చూచి ఆతనినెత్తుకొని తమ ఇంటికిపోయిరని పలికెను. జలమువాచ - జలాధిదేవత ఇట్లనినది. అముం రుదంతమానీయ స్తనం దత్వా స్తనార్థినే | వర్ధయామాసురీశస్య తం తాః సూర్యాధికప్రభం || 33 ఓ పరమేశ్వరా! సూర్యుని మించిన తేజస్సు కల ఆబాలకుడు పాలకొరకు ఏడ్చుచుండగా వారతనిని తమ ఇంటికి తెచ్చి పాలనిచ్చి శంకరుని పుత్రుడగు ఆ బాలుని పెంచుచుండిరని పలికెను. సంధ్యే ఊచతుః - సంధ్యలు ఈవిధముగా పలికిరి. అధునా కృత్తికానాం చ షణ్ణాం తత్పోష్యపుత్రకః | తన్నామ చక్రుస్తాః ప్రేవ్ణూ కార్తికేయ ఇతి స్వయం || 34 ఇప్పుడాబాలుడు షట్కృత్తికలకు పెంపుడుకొడుకు. వారందరతనికి ప్రేమతో కార్తికేయుడని పేరుపెట్టుకొనిరని అనిరి. రాత్రిరువాచ - రాత్రిదేవత ఇట్లు పలికెను. న చక్రుర్బాలకం తాశ్చ లోచనానామగోచరకం | ప్రాణభ్యోzపి ప్రేమపాత్రం యః పోష్టా తస్య పుత్రకః || 35 దినమువాచ - దినాధిదేవత ఇట్లు పలికెను. యాని యాని చ వస్తూని త్రైలోక్యే దుర్లభావి చ | ప్రశంసితాని స్వాదూని భోజయామాసురేవ తం || 36 ఓ పరమేశ్వరా! షట్ కృత్తికలు ముల్లోకములలో చాలా ప్రయత్నము చేసినచో లభించు సుమధురమైన పదార్థములను తెచ్చి కార్తికేయునకు మురిపెముతో తినిపించుచుండిరనెను. తేషాం తద్వచనం శ్రుత్వా సంతుష్టో మధుసూదనః | తే సర్వే హరిమిత్యూచుః సభాయాం హృష్ణమానసాః || 37 పుత్రస్య వార్తాం సంప్రాప్య పార్వతీహృష్టమానసా | కోటిరత్నాని విప్రేభ్యో దదౌ బహుధనాని చ || 38 లక్ష్మీః సరస్వతీ మేనా సావిత్రీ సర్వయోషితః | విష్ణుశ్చ సర్వదేవాశ్చ బ్రాహ్మణభ్యో దదుర్ధనం || 39 ఆ సభాస్థలిలో ధర్మాదిదేవతలు శ్రీహరితో నిట్లు చెప్పగా విని ఆ మధుసూదనుడు సంతోషపడెను. అట్లే తన పుత్రుని విషయము తెలిసికొన్న పార్వతీదేవి సంతోషముతో బ్రాహ్మణులకు కోటిరత్నములను అమితమైన ధనమును దానముచేసినది. అదేవిధముగా లక్ష్మీదేవి, సరస్వతి, మేన, సావిత్రి, శ్రీమహావిష్ణువు మొదలగు దేవతలు, దేవతాస్త్రీలు బ్రాహ్మణులకంతులేని ధనమునిచ్చిరి. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణశఖండే నారదనారాయణసంవాదే కార్తికేయజన్మకథనం నామ చతుర్దశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాదసమయమున చెప్పబడిన కార్తికేయ జన్మవృత్తాంతముగల పదునాలుగవ అధ్యాయము సమాప్తము.