sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచదశోzధ్యాయః - కార్తికేయ, నందికేశ్వరుల సంవాదము నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లనెను. పుత్రస్య వార్తాం సంప్రాప్య పార్వత్యా సహ శంకరః | ప్రేరితో విష్ణునా దేవైర్మునిభిః పర్వతైర్మునే ||
1 దూతాన్ ప్రస్థాపయామాస మహాబలపరాక్రమాన్ | వీరభద్రం విశాలాక్షం శంకుకర్ణం కబంధకం ||
2 నందీశ్వరం మహాకాళం వజ్రదంతం భగందరం | గోధాముఖం దధిముఖం జ్వలదగ్నిశిఖోపమం ||
3 లక్షం చ క్షేత్రపాలానాం భూతానాం చ త్రిలక్షకం | వేథాళానాం చతుర్లక్షం యక్షాణాం పంచలక్షకం ||
4 కూష్మాండానాం చతుర్లక్షం త్రిలక్షం బ్రహ్మరక్షసాం | డాకినీనాం చతుర్లక్షం యోగినీనాం త్రిలక్షకం ||
5 రుద్రాంశ్చ భైరవాంశ్చైవ శివతుల్యపరాక్రమాన్ | అన్యాంశ్చ వికృతాకారాన్ అసంఖ్యానపి నారద ||
6 తే సర్వే శివదూతాశ్చ నానాశస్త్రాస్త్రపాణయః | కృత్తికానాం చ భవనం వేష్టయామాసురుజ్వలం ||
7 దృష్ట్వా తాన్ కృత్తికాః సర్వాః భయవిహ్వలమానసాః | కార్తికేయం చ జగృహుః జ్వలంతం బ్రహ్మతేజసా ||
8 తన పుత్రుని విషయము తెలిసిన పార్వతీపరమేశ్వరులు విష్ణుమూర్తి, దేవతలు, మునులు, మొదలగువారు ప్రేరేపింపగా మహాబలపరాక్రమవంతులైన దూతలను కృత్తికలదగ్గరకు పంపించిరి. ఆదూతలలో వీరభద్రుడు, విశాలాక్షుడు, శంకుకర్ణుడు, కబంధకుడు, నందీశ్వరుడు, మహాకాళుడు, వజ్రదంతుడు, భగందరుడు, గోధాముఖుడు, దధిముఖుడు, మొదలగువారున్నారు. ఇంకను లక్ష క్షేత్రపాలురు, మూడులక్షల భూతములు, నాలుగు లక్షల భేతాళురు, ఐదులక్షల యక్షులు, నాలుగులక్షల కూష్మాండులు, మూడులక్షల బ్రహ్మరాక్షసులు, నాలుగు లక్షల డాకినులు, మూడులక్షల యోగినులు, వికృతాకారము కలవారు, శివునితో సమామైన పరాక్రమము కలవారు అగు అంతులేని రుద్రులు, భైరవులు మొదలగువారు కలరు. ఆ శివదూతలందరు శస్త్రాస్త్రములను ధరించి కృత్తికలయొక్క భవనమును చుట్టుముట్టిరి. అప్పుడు శివదూతలను చూచి కృత్తికలు అమితమైన భయముతో బ్రహ్మతేజో విరాజితుడగు కార్తికేయుని ఆశ్రయించిరి. కృత్తికా ఊచుః - కృత్తికలు ఈవిధముగా పలికిరి. వత్స సైన్యాన్యసంఖ్యాని వేష్టయామాసురాలయం | న జానీమో వయం కస్య కరాళాని చ బాలక ||
9 నాయనా! ఈ అసంఖ్యాకమైన సైన్యములు మన ఇంటిని చుట్టుముట్టుకొన్నవి. భయంకరమైన ఈ సైన్యములెవ్వరివో మాకు తెలియదని పలికిరి. కార్తికేయ ఉవాచ - కార్తికేయుడు కృత్తికలతో నిట్లనెను. భయం త్యజత కల్యాణ్యో భయం కిం వో మయి స్థితే | దుర్నివార్యః కర్మపాకో మాతరః కేన వార్యతే || 10 అమ్మలారా! మీరు భయపడకుడు. నేనుండగా మీరు భయపడవలసిన అవసరములేదు. ఐనను కర్మఫలితమును ఎవ్వరు వారించలేరని పలికెను. ఏతస్మన్నంతరే తత్రసేనానీర్నందికేశ్వరః | పురతః కార్తికేయస్య తిష్ఠంస్తాసామువాచ హ || 11 ఆ సమయమున శివునిసేనాధిపతియగు నందికేశ్వరుడు కార్తికేయుడు మరియు కృత్తికలముందు నిలబడి ఇట్లు పలికెను. నందికేశ్వర ఉవాచ - నందికేశ్వరు డిట్లు పలికెను. భ్రాతః ప్రవృత్తిం శ్రుణు మే మాతుశ్చాపి శుభావహం | ప్రేషితస్య సురేంద్రస్య సంహర్తుః శంకరస్య చ || 12 కైలాసే సర్వదేవాశ్చ బ్రహ్మవిష్ణుశివాదయః | సభాయాం తే వసంతశ్చ గణశోత్సవ మంగళం || 13 శైలేంద్రకన్యా తం విష్ణుం జగతాం పరిపాలకం | సంబోధ్య కథయామాస తవాన్వేషణకారణం || 14 పప్రచ్ఛ దేవాన్విష్ణుస్తాన్ క్రమేణౖవాస్తిహేతవే | ప్రత్యుత్తరం దదుస్తే తు ప్రత్యేకం చ యథోచితం || 15 త్వమత్ర కృత్తికాస్థానే కథయామాసురీశ్వరం | సర్వే ధర్మాదయో దేవా ధర్మధర్మస్య సాక్షిణః || ఓ తమ్ముడా! నన్ను ఇచ్చటకు పంపించిన శ్రీమహావిష్ణువుయొక్క, జగత్సంహారకారకుడగు శంకరునియొక్క, నీతల్లియగు పార్వతీదేవియొక్క మరియు నాయొక్క మాటలను శ్రద్ధగా వినుము. గణపతియొక్క ఉత్సవమును జరుపుకొను సమయమున కైలాసపర్వతముపై సభలో బ్రహ్మవిష్ణుశివాది దేవతలుండిరి. అప్పుడు పార్వతీదేవి జగత్పరిపాలకుడగు విష్ణువును నీగురించి అడిగినది. అప్పుడు శ్రీమహావిష్ణువు నీగురించి దేవతలనందరినడిగెను. ఆసమయమున దేవతలు ఒక్కొక్కరు తమకు తెలిసిన విషయమును చెప్పిరి. చివరకు ధర్మాధర్మకార్యములకెల్ల సాక్షీభూతులైన ధర్మాధిదేవతలు నీవు కృత్తికల ఇంటిలోనున్నట్లు తెలిపిరి. యా బభూవ రహః క్రీడా పార్వతీశివయోః పురా || 16 దృష్టస్య చ సురైః శంభోర్వీర్యం భూమౌ పపాత హ | భూమిస్తదక్షిపద్వహ్నౌ వహ్నిశ్చ శరకాననే | తతో లబ్ధః కృత్తికాభిరమూభిర్గచ్ఛ సాంప్రతం || 17 తావాభిషేకం విష్ణుశ్చ కరిష్యతి సురైస్సహ | శస్త్రం లబ్ద్వాఖిలం దేవ తారకం సంహనిష్యసి | పుత్రస్త్యం విశ్వసంహర్తుస్త్యాం గోప్తుం న క్షమా ఇమాః || 18 నాగ్నిం గోప్తుం యథా శక్తః శుష్కవృక్షః స్వకోటరే | దీప్తిమాంస్త్యం చ విశ్వేషు తాసాం గేహేషు శోభ##సే | యథా పతన్మహాకూపే ద్విజరాజో న రాజతే || 19 కరోషి జగదాలోకం నాచ్ఛన్నోzస్యాంగతేజసా | యథా సూర్యః కరాచ్ఛన్నో న భ##వేత్పూరుషస్య చ || 20 విష్ణుస్త్యం చ జగద్వ్యాపీ నాసాం వ్యాప్యోzసి శాంభవ | యథా న కేషాం వ్యాప్యం చ తత్సర్వం వ్యాపకం నభః || 21 యోగీంద్రో నానులిప్తస్త్యం భోగీ చ పరిపోషణ | మైవలిప్తో యథాzత్మా చ కర్మభోగేషు జీవినాం || 22 విశ్వాధారస్త్యమీశశ్చ నామృతే సంభ##వేత్ స్థితిః | సాగరస్య యథా నద్యాం సరితామాశ్రయస్య చ || 23 నహి సర్వేశ్వరావాసః సంభ##వేత్కృత్తికాలయే | గరుడస్య యథావాసః క్షుద్రే చ చటకోదరే || 24 త్వాం చ దేవా న జానంతి భక్తానుగ్రహ విగ్రహం | గణానాం తేజసాం రాశిం యథా జ్ఞానమయోగినః || 25 త్వామనిర్వచనీయం చ కథం జానంతి కృత్తికాః | యథా పరాం హరేర్భక్తిమభక్తా మూఢచేతనః || 26 భ్రాతర్యేయం న జానంతి తే తం కుర్వంత్యనాదరం | నాద్రియంతే యథా భేకాస్త్యేకావాసంచ పంకజం || 27 పూర్వము పార్వతీపరమేశ్వరులు రహస్యక్రీడలాడుకొనుచున్నప్పుడు దేవతలు చూడగా శంకరునియొక్క వీర్యము భూమిపై పడినది. భూదేవి అతని వీర్యమును భరింపలేక దానిని వహ్నిలోనుంచగా అగ్నిదేవుడు రెల్లుగడ్డిలో (శరవనములో) దానిని వదలిపెట్టెను. అచ్చట జన్మనెత్తిన నిన్ను కృత్తికలు తీసికొనిపోయిరి. అందువలన నీవిప్పుడు కృత్తికలతో కలసి కైలాసమునకు పోయినచో అచ్చట విష్ణువు నిన్ను సేనాధిపతిగా అభిషేకించును. అప్పుడు దేవతలొసగిన సమస్త శస్త్రములను పొంది నీవు తారాకాసురుని సంహరింపగలవు. నీవు ప్రపంచమునంతయు సంహరింపజాలు మహాదేవునియొక్క పుత్రుడవు. అట్టి నిన్ను ఈ కృత్తికలు కాపాడలేరు. ఎండినచెట్టు తన తొఱ్ఱలో అగ్నిని దాచుకొనజాలనట్లు, దీప్తిమంతుడవైన నీవు ఆ కృత్తికల ఇంటిలో ఉండలేవు. పెద్దబావిలో పడిన గజరాజువలె వీరి ఇంటిలో నీవు ప్రకాశింపలేవు. మానవుడు తన చేతులనడ్డుపెట్టినచో సూర్యుడు మాయముకానట్లు నీవు వీరి తేజస్సువలన మాయము కావు. నీవు సాక్షాన్మహావిష్ణువువలె జగములంతయు వ్యాపించియున్నవాడవు. అందువలన కృత్తికలకు వ్యాప్యుడవుకావు. ఆకాశ##మేవిధముగా దేనికి వ్యాప్యముకాదో అట్లే స్వతః వ్యాపకమగునో నీవట్లే స్వతః వ్యాపకుడవు. నీవు విషయములనుండి నిర్లిప్తుడవైన యోగీంద్రడవు కాన వేరుకాదు. నీవు విశ్వమునకంతయు ఆధారభూతుడవు, ఈశ్వరుడవు. నదులకన్నిటికి నివాసస్ధానమగు సముద్రము ఒక నదిలో ఎట్లు అణగియుండదో అట్లే సర్వాశ్రయుడవైన నీవు కృత్తికల ఇంటిలో ఉండలేవు. గరుత్మంతుడు చిన్న పిట్టగూటిలో ఎట్లుండలేడో నీవుకూడ కృత్తికల ఇంటిలో ఉండలేవు. యోగులుకానివారు జ్ఞానమునెట్లు తెలియరో అట్లే గుణములు, తేజస్సులకు రాశివి, భక్తులననుగ్రహించుటకు జన్మనెత్తిన నిన్ను కృత్తికలు గుర్తింపలేరు. మూఢులైన శ్రీహరిభక్తి రహితులు, మిక్కిలి గొప్పవైన శ్రీహరిభక్తిని గుర్తించునట్లు, కప్పలు తమతో కలసియుండు పద్మము గొప్పదనమును గుర్తించనట్లు కృత్తికలు నీ యొక్క గొప్పతనమును గుర్తింపలేరు. పైగా నీకు అనాదరణ చేయుదురు. అందువలన మావెంట కైలాసమునకు రమ్మని కోరెను. కార్తికేయ ఉవాచ - కార్తికేయుడు ఇట్లు పలికెను. భ్రాతః సర్వం విజానామి జ్ఞానం త్రైకాలికం చ యత్ | జ్ఞానీ త్వం కా ప్రశంసా తే యతో మృత్యుంజయాశ్రితః || 28 కర్మణా జన్మ యేషాం వా యాసు యాసు చ యోనిషు | తాసు తే నిర్వృతిం భ్రాతః నాప్నువంతి చ సంతతం || 29 యే యత్రవసంతి సంతోవా మూఢావా కర్మభోగతః | తేzపి తం బహుమన్యం తే మోహితా విష్ణుమాయయా || 30 సాంప్రతం జగతాం మాతా విష్ణుమాయా సనాతనీ | సర్వాద్యా విష్ణుమాయా చ సర్వదా విష్ణుమంగళా || 31 శైలేంద్రపత్నీగర్భే సా చాలభజ్జన్మ భారతే | దారుణం చ తపస్తప్త్యా సంప్రాపచ్ఛంకరం పతిం || 32 బ్రహ్మాదితృణపర్యంతం సర్వం మిథ్యైవ కృత్రిమం | సర్వే కృష్ణోద్భవాః కాలే విలీనాస్తత్ర కేవలం || 33 కల్పే కల్పే జగన్మాతా మాత మే ప్రతిజన్మని | యజ్జన్మమాయయా బద్దో నిత్యః సృష్టివిధావహం || 34 ప్రకృతేరుద్భవాః సత్యం జగత్యాం సర్వయేషితః | కాశ్చిదంశాః కళాః కాశ్చిత్కలాంశాశేన కాశ్చన || 35 కృత్తికా జ్ఞానవత్యశ్చ యోగిన్యః ప్రకృతేః కళాః | స్తనైశ్చ సంవర్దితోzహముపహారేణ సంతతం || 36 తాసామహం పోష్యపుత్రో మదంబాః పోషణాదిమాః | తస్యాశ్చ ప్రకృతేః పుత్రో గతస్త్వత్స్వామివీర్యతః || 37 న గర్భజోzహం శైలేంద్రకన్యాయా నందికేశ్వర | సా చ మే ధర్మ తో మాతా తథేమా సర్వసమ్మతాః || 38 స్తనదాత్రీ గర్భధాత్రీ భక్ష్యదాత్రీ గురుప్రియా | అభీష్టదేవపత్నీ చ పితుః పత్నీ చ కన్యకాః || 39 సగర్భకన్యా భగినీ పుత్రపత్నీ ప్రియాప్రసూః | మాతుర్మాతా పితుర్మాతా సోదరస్యప్రియా తథా || 40 మాతుః పితుశ్చ భగినీ మాతులానీ తథైవ చ | జనానాం వేదవిహితా మాతరః షోడశ స్మృతా || 41 ఇమాశ్చ సర్వసిద్ధిజ్ఞః పరమైశ్వర్యసంయుతాః | న క్షుద్రా బ్రహ్మణః కన్యాః త్రిషు లోకేషు పూజితాః || 42 సోదరా! నందికేశ్వరా! భూతవర్తమాన భవిష్యత్కాలములకు సంబంధించిన సమస్త జ్ఞానము నాకు కలదు. అట్లే నీవుకూడ మహాజ్ఞానివి. మృత్యుంజయుని ఆశ్రయించియున్న నిన్ను ప్రత్యేకించి పొగడవలసిన పనిలేదు. తమతమ కర్మననుసరించి ఆయా జన్మలనెత్తినవారు ఆయాజన్మలందు మోక్షమును పొందలేరు. కర్మననుసరించి ఆయా జన్మలనెత్తినవారు విద్వాంసులైనా మూర్ఖులైనా వారు విష్ణుమాయవల్ల మోహితులై తమ జన్మ చాలా గొప్పదని భావింతురు. ఆ విష్ణుమాయ జగములకన్నటికి మాతృరూపిణి. సమస్త సృష్టికంటె ఆద్యురాలు. ప్రపంచమునకంతయు మంళమును కలిగించునది. ఆ విష్ణుమాయయే హిమాలయ పర్వతరాజు భార్యయగు మేనక పుత్రిగా జన్మించి అమితమైన, తీవ్రమైన తపమాచరించి శంకరునకు భార్య కాగలిగెను. బ్రహ్మ మొదలుకొని గడ్డివరకున్న సమస్త సృష్టి అశాశ్వతమైనది. మరియు మిథ్యయైనది. ఈ చరాచరసృష్టియంతయు శ్రీకృష్ణునినుండి పుట్టుచున్నది. మరల అతనియందే విలీనమగుచున్నది. నేను ప్రతి కల్పమున మాయకు బద్దుడనై జన్మించుచున్నాను. ఆయా జన్మలలో సహితము జగన్మాతయగు పార్వతీదేవియే నాకు తల్లి. ఈ ప్రపంచముననున్న స్త్రీలందరు ప్రకృతిరూపిణియగు ఆ శక్తి నుండి ఉద్భవించినవారే. వారిలో కొందరు ఆ శక్తియొక్క అంశలుకాగా, మరికొందరు ఆమెయొక్క అంశాంశలు. ఇంకను కొందరు అంశాంశాంశలు. ప్రకృతి యొక్క అంశస్వరూపలైన కృత్తికలు జ్ఞానము కలవారు, యోగినులు కూడ. అట్టి కృత్తికల స్తన్యముచే వారిచ్చు ఉపహారములచే నేను పెరిగినాను. వారికి నేను పెంపుడు కొడుకును. వారు నన్ను పెంచి పెద్దచేసినందువలన వారు నాకు తల్లులు. అట్లే నేను, ప్రకృతిరూపిణి యగు పార్వతికి పుత్రుడను. పరమేశ్వరుని వీర్యమువలన జన్మనెత్తినవాడను. ఐనను ఓ నందీశ్వరా! నేను పర్వతరాజపుత్రియగు పార్వతియొక్క గర్భమునుండి జన్మింపలేదు. అందువలన పార్వతీదేవి ధర్మతః మాతయే కాని జన్మనిచ్చిన తల్లికాదు. అట్లే ఈ కృత్తికలు సహితము ధర్మతః తల్లులే కాని జన్మతః తల్లులు కారు. స్తన్యము నిచ్చునది, గర్భమున ధరించునది, తిండిపెట్టునది, గురువుయొక్క భార్య, ఇష్టదేవతయొక్క భార్య, సవతితల్లి, తన తోబుట్టువులగు స్త్రీలు, కోడలు, తన భార్య తల్లి (అత్తగారు) అమ్మమ్మ, నాయనమ్మ, సోదరుని భార్య, మేనమామ భార్య, మేనత్త, తల్లియొక్క అక్కా చెలెండ్లు, తన సోదరుల పుత్రికలు అను పదునారుగురు తల్లులని వేదమున (ధర్మశాస్త్రమున) చెప్పబడిరి. నన్ను పెంచిపెద్దచేసిన ఈకృత్తికలు సమస్తసిద్ధులను తెలిసినవారు, పరమైశ్వర్యసంపన్నులు, త్రిలోకపూజ్యులు, వీరు బ్రహ్మదేవుని పుత్రికలు కాని క్షుద్రులుమాత్రము కారని పలికెను. విష్ణునా ప్రేరితస్త్యం చ శంభోః పుత్రసమో మహాన్ | గచ్ఛ యామి త్వయాసార్థం ద్రక్ష్యామి సురసంచయం || 43 శ్రీమహావిష్ణువుచే పంపించబడిన శివానుచరుడవగు నీవుకూడ శంకరునకు పుత్రునితో సమానుడవు. అందువలన నీమాటను త్రోసివేయకూడదుకావున నేను నీతోవచ్చి దేవతలనందరను చూచెదనని కార్తికేయుడు పలికెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణశఖండే నారదనారాయణసంవాదే నంది కార్తికేయ సంవాదో నామ పంచదశోzధ్యాయః | శ్రీ బ్రహ్మవైవర్తమహాపూరాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాదసమయమున పేర్కొనబడిన నందీశ్వర, కార్తికేయుల సంవాదముగల పదునైదవ అధ్యాయము సమాప్తము.