sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అథసప్తదశోzధ్యాయః - గణపతి వివాహము, కార్తికేయుని పభిషేక కథనం నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను. అథ విష్ణుర్జగత్కాంతో హృష్టః కృత్వా శుభక్షణం | రత్న సింహాసనే రమ్యే వాసయామాస షణ్ముఖం ||
1 నానావిధాని వాద్యాని కాంస్యతాలాదికాని చ | నానావిధాని యంత్రాణి వాదయామాస కౌతుకాత్ ||
2 వేదమంత్రాభిషిక్యైశ్చ సర్వతీర్థోదపూర్ణకైః | సద్రత్నకుంభశతకైః స్నాపయామాస తం ముదా ||
3 సద్రత్నసారఖచితం కిరీటం మంగళాంగదే | అమూల్యరత్నఖచిత భూషణాని బహూని చ || 4 వహ్నిశుద్ధాంశుకే దివ్యే క్షీరోదార్ణవ సంభవం | కౌస్తుభం వనమాలాం చ తసై#్మ చక్రం దదౌ ముదా ||
5 జగన్నాయకుడైన శ్రీమహావిష్ణువు సంతోషముతో కార్తికేయునకు ఆశీస్సులనొసగి అతనిని రత్నసింహాసనముపై కూర్చుండబెట్టెను. తాళములు మొదలైన అనేకవాద్యములు, జంత్రములు మ్రోగుచుండగా అతనిని వేదమంత్ర ఘోషలమధ్య సమస్తపుణ్యతీర్థములనుండి రత్నకలశములందు తీసికొని రాబడిన నీటిచే అతనిని అభిషేకము చేసెను. అటుపిమ్మట కుమారస్వామికి మంచి రత్నముల కిరీటమును, అంగదములను, అమూల్యరత్నాభరణములను, పరిశుద్దమైన వస్త్రములను, పాలసముద్రమున పుట్టిన కౌస్తుభమణిని, వనమాలను, చక్రమును సంతోషముతో నొసగెను. బ్రహ్మ దదౌ యజ్ఞసూత్రం వేదా వై వేదమాతరం | సంధ్యామంత్రం కృష్ణమంత్రం స్తోత్రం చ కవచం హరేః || 6 కమండలుం చ బ్రహ్మస్త్రం విద్యాం వై వైరిమర్దినీం | ధర్మో ధర్మమతిం దివ్యాం సర్వజీవే దయాం దదౌ || 7 పరం మృత్యుంజయం జ్ఞానం సర్వశాస్త్రావబోధనం | శశ్వత్సుఖప్రదం తత్వజ్ఞానం చ సమనోహరం || 8 యోగతత్వం సిద్దితత్వం బ్రహ్మజ్ఞానం సుదుర్లభం | శూలం పినాకం పరశుం శక్తిం పాశుపతం ధనుః | సంహారాస్త్రవినిక్షేపం తత్సంహారం దదౌ శివః || 9 శ్వేతఛత్రం రత్నమాలాం దదౌ తసై#్మ జలేశ్వరః | గజేంద్రం చ హయేంద్రం చ సుధాకుంభం సుధానిధిః || 10 మనోయాయి రథం సూర్యః సన్నాహం చ మనోరమం | యమదండం యమశ్చైవ మహాశక్తిం హుతాశనః | నానాశస్త్రాణ్యుపాయాని సర్వే దేవా దదుర్ముదా || 11 కామశాస్త్రం కామదేవో దదౌ తసై#్మ ముదాన్వితః | క్షీరోదోzమూల్యరత్నాని విశిష్టే రత్ననూపురే || 12 పార్వతీ సస్మితా హృష్టా పరమానందమానసా | మహావిద్యాం సుశీలాం చ విద్యాం మేధాం దయాం స్మృతి || 13 బుద్ధిం సునిర్మలాం శాంతిం తుష్టిం పుష్టిం క్షమాం ధృతిం | సదృఢాం చ హరౌ భక్తిం హరిదాస్యం దదౌ ముదా || 14 ప్రజాపతిర్దేవసేనాం రత్నభూషణ భూషితాం | సువినీతాం సుశీలాం చ సుందరీం సుమనోహరాం || 15 దదౌ తసై#్మ వేదమంత్రైర్వివాహ విధినా స్వయం | యాం వదంతి మహాషష్ఠీం పండితాః శిశుపాలికాం || 16 కుమారస్వామిని పట్టాభిషేకము చేసిన తరువాత బ్రహ్మదేవుడు వేదములు సంధ్యామంత్రమును, శ్రీకృష్ణమంత్రమును, స్తోత్రమును, కవచమును, కమండలువును, బ్రహ్మస్త్రమును, శత్రువులను సంహరించు విద్యను ఇచ్చెను. ధర్మదేవత ధర్మజ్ఞానమును, తత్వజ్ఞానమును, యోగతత్వమును, సిద్దితత్వమును, బ్రహ్మజ్ఞానమును, శూలము, పినాకము, గొడ్డలి, శక్తి, శివధనుస్సును అస్త్రప్రయోగవిధిని, వాటి సంహారవిధిని ఇచ్చెను. వరుణుడు తెల్లని ఛత్రమును రత్నములు గల మాలనిచ్చెను. చంద్రుడు మంచి ఏనుగను, మంచి గుఱ్ఱమును, అమృతకుంభమునిచ్చెను. సూర్యుడు మనోజవముగల రథమునీయగా యముడు యమదండమును, అగ్నిదేవుడు మహాశక్తినిచ్చెను. అట్లే ఇతరదేవతలు కూడ వివిధములైన అస్త్రములను, ఇతరకానుకలనిచ్చిరి. మన్మథుడు కామశాస్త్రజ్ఞానమునీయగా, క్షీరసముద్రము అమూల్యములైన రత్నములను, నూపురములను ఇచ్చెను. పార్వతీదేవి సంతోషముతో కార్తికేయునకు మహావిద్యను, మేధను, దయను, స్మృతిజ్ఞానమును, నిర్మలమైనబుద్దిని, శాంతిని, తుష్టిని, పుష్టిని, క్షమాభావమును, ధృతిని, శ్రీహరిభక్తిని శ్రీహరి దాస్యమునొసగెను. ప్రజాపతి రత్నాలంకారభూషిత, చక్కని వినయము కలది, మంచి నడవడికలది, సుందరి, అగు దేవసేనయను కన్యను వేదమంత్రములనడుమ ఇచ్చి వివాహము చేసెను. ఆ దేవసేననే పండితులు మహాషష్ఠియని, శిశుపాలికయని పిలుతురు. అభిషిచ్య కుమారం చ సర్వే దేవా యయుర్గృహం | మునయశ్చైవ గంధర్వాః ప్రణమ్య జగదీశ్వరం || 17 నారాయణం చ బ్రహ్మాణం ధర్మం తుష్టావ శంకరః | ప్రణనామ హరిం తాత ధర్మమాలింగ్య నారద || 18 ప్రీత్యా య¸° చ శైలేంద్రః సగణః శంకరార్చితః | యే యే తత్రాగతాః సర్వే యయురానందపూర్వకం || 19 కుమారస్వామిని అభిషేకించిన పిదప దేవతలందరు తమ తమ ఇండ్లకు పోయిరి. అట్లే మునులు గంధర్వులు జగదీశ్వరుడగు శివునికి నమస్కరించి తమ తమ నెలవులకు వెళ్ళిరి. శంకరుడు శ్రీహరిని, బ్రహ్మను, ధర్మదేవతను స్తుతించి వారిలో శ్రీహరిని నమస్కరించి, సాగనంపెను. ధర్మదేవతను ఆలింగనముచేసికొని సాగనంపెను. అట్లే శంకరునిచే సమ్మానములనందుకొన్న పర్వతరాజగు హిమవంతుడు తన అనుచరులతో కలసి, తన ఇంటికి పోయెను. ఇంకను కుమారస్వామియొక్క అభిషేక మహోత్సవమునకు వచ్చినవారందరు సంతోషముతో తమతమ స్థానములు చేరుకొనిరి. పరమానందసంయుక్తో దేవ్యా సహ మహేశ్వరః | కాలాంతరే చ తాన్ సర్వాన్ పునరానీయ శంకరః | పుష్టిం దదౌ వివాహేన గణశాయ మహాత్మనే || 20 సుతాభ్యాం సగణౖః సార్థం పార్వతీహృష్టమానసా | సిషేవే స్వామినః పాదపద్మం సా సర్వకామదం || 21 మిక్కిలి ఆనందముతో తన భార్య పుత్రులతతృతీయ ఖండము - 18 వ అధ్యాయములో కాలము గడుపుచున్న శంకరుడు కొంతకాలము తరువాత దేవతనలనందరిని మరల పిలిపించి గణపతికి పుష్టియనెను కన్యనిచ్చి వివాహము చేసెను. పార్వతీదేవి తన పుత్రులతో కలసి సంతోషముతో అన్ని కోరికలను తీర్చు తన భర్తను సేవించుచు కాలము గడపసాగెను. ఇత్యేవం కథితం సర్వం కుమారస్యాభిషేచనం | వివాహః పూజనం తస్య గణశస్య వివాహకం || 22 పార్వతీపుత్రలాభశ్చ దేవానాం చ సమాగమః | కా తే మనసి వాంఛాzస్తి కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 23 ఓ నారదమునీ! నీకీవిధముగా కుమారస్వామియొక్క అభిషేక వృత్తాంతమును వివాహమును మొదలగు విషయములను, గణపతియొక్క వివాహవృత్తాంతమునంతయు తెలిపితి. అట్లే పార్వతీదేవికి తనపుత్రుడగు కుమారస్వామి లభించిన విషయమును దేవతలందరు కైలాసపర్వతమున సమాగమమైన విషయమునంతయు వివరించితిని. ఇంకను నీవేదేని వృత్తాంతము వినదల్చినచో నాకు తెలుపుమని నారాయణముని అనెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే కుమారగణశ వివాహ, కుమారాభిషేక కథనం నామ సప్తదశోzధ్యాయః | శ్రీబ్రహ్మావైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారదనారాయణసంవాదసమయమున పేర్కొనబడిన కుమారస్వామి, గణపతుల వివాహము, కుమారస్వామియొక్క అభిషేక వృత్తాంతము గల పదునేడవ అధ్యాయము సమాప్తము.