sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టాదశోzధ్యాయః - విఘ్నేశ విఘ్నకథనం నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లు పలికెను. నారాయణ మహాభాగే వేదవేదాంగసారగ | పృచ్ఛామి త్వామహం కించిదతిసందేహవాన్యతః ||
1 సుతస్య త్రిదశేశస్య శంకరస్య మహాత్మనః | విఘ్ననిఘ్నస్య యద్విఘ్నమీశ్వరస్య కథం ప్రభో ||
2 పరిపూర్ణతమః శ్రీమాన్పరమాత్మ పరాత్పరః | గోలోకనాథః స్వాంశేన పార్వతీతనయః స్వయం ||
3 అహో భగవతస్తస్య మస్తకచ్ఛేదనం విభో | గ్రహదృష్ట్యా గ్రహేశస్య కథం మే వక్తుమర్హసి ||
4 వేదవేదాంగముల తత్వమంతయు తెలిసిన నారాయణ మహర్షీ! ఒక చిన్న విషయమునడుగుచున్నాను. నేను ఎక్కువ సందేహములున్నవాడను కావున దయచేసి సందేహనివృత్తిసేయుము. మహాత్ముడు, దేవతలకెల్ల అధిపతి, శంకరుని పుత్రుడగు విఘ్నరాజు స్వయముగా విఘ్నములనెల్ల పోగొట్టును. అట్టి విఘ్నాధిపతికి విఘ్నమెట్లు కలిగినది? అట్లే పార్వతీపుత్రుడగు ఆ గణపతి శ్రీకృష్ణభగవానుని అంశ##చే జన్మించెను. గ్రహముల కన్నిటికి అధిపతియగు ఆ గణపతి తల శనిగ్రహము యొక్క చూపుపడినందువలన తెగిపోయినట్లు చెప్పితిరి. ఇదెట్లు సంభవమగునో విశదీకరింపుడని నారదుడు ప్రార్థించెను. నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు పలికెను. సావధానం శ్రుణు బ్రహ్మన్నితిహాసం పురాతనం | విఘ్నేశస్య బభూవేద విఘ్నం యేన చ నారద || 5 ఏకదా శంకరస్సూర్యం జఘాన పరమష్టధా | సమాలిమాలిహంతారం శూలేన బహువత్సలః || 6 శ్రీసూర్యోzమోఘశూలేనాశనితుల్యేన తేజసా | జహౌ స చేతనాం సద్యో రథాచ్చ నిపపాత హ || 7 దదర్శ కశ్యపః పుత్రం మృతముత్తానలోచనం | కృత్వా వక్షసి తం శోకాద్విలలాప భృశం ముహుః || 8 హాహాకారం సూరాశ్చక్రుర్విలేపుర్భయకాతరాః | అంధీభూతం జగత్సర్వం బభూవ తమసాzవృతం || 9 ఓ నారదమహర్షీ విఘ్ననాయకుని శిరస్సు తెగిపడుటకు కారణమైన కథయున్నది. అది చాలా ప్రాచీనమైనది. ఒకప్పుడు సూర్యుడు సుమాలి, మాలి అను వారిని కొట్టుచుండగా పరమకారుణికుడైన శంకరుడు చూచెను. అప్పుడు అతడు కోపమును పట్టజాలక తన శూలముతో ఎనిమిదిమార్లు కొట్టెను. వజ్రమువలె అమోఘమైన శంకరుని శూలముతగులుటచేత సూర్యుడు స్పృహదప్పి రథమునుండి కిందపడిపోయెను. కండ్లు తేలవేసి పడిపోయిన పుత్రుని చూచి కశ్యప ప్రజాపతి తనపుత్రుని రొమ్ముపైనుంచుకొని దుఃఖముతో చాలాకాలము విలపించెను. దేవతలుకూడ భయముతో హాహాకారములు చేయుచు విలపింపసాగిరి. సూర్యుడు లేనందువలన ప్రపంచమంతయు చీకటితో నిండిపోయెను. నిష్ప్రభం తనయం దృష్ట్వా చాశపత్కశ్యతః శివం | తేజస్వీ బ్రహ్మణః పౌత్రః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా || 10 మత్పుత్రస్య యథా వక్షః ఛిన్నం శూలేన తేzద్యవై | త్వత్పుత్రస్య శిరచ్ఛిన్నం భవిష్యతి న సంశయః || 11 శివశ్చ గళితక్రోధః క్షణనైవాశుతోషకః | బ్రహ్మజ్ఞానేన తత్సూర్యం జీవయామాస తత్ క్షణాత్ || 12 బ్రహ్మవిష్ణుమహేశానామంశశ్చ త్రిగుణాత్మకః | సూర్యశ్చ చేతనాం ప్రాప్య సముత్తస్థౌ పితుః పురః || 13 ననామ పితరం భక్త్యా శంకరం భక్తవత్సలం | విజ్ఞాయ శంభోః శాపం చ కశ్యపం స చుకోప చ || 14 మిక్కిలి తేజస్సుకలవాడు, బ్రహ్మదేవుని మనుమడగు కశ్యపప్రజాపతి బ్రహ్మతేజోవిరాజితుడై కాంతిలేక పడియున్న తన పుత్రుడగు సూర్యుని, అతని దురవస్థకు కారకుడైన శంకరుని చూచి కోపముతో నీ శూలముచే నా పుత్రుని రొమ్ము ఏవిధముగా ఛేదింపబడెనో అట్లే నా శాపమువలన నీ పుత్రుని శిరస్సుకూడ తెగిపడునని శాపమిచ్చెను. త్వరగా సంతోషపడు శంకరుడు కోపమును విడిచి తనయొక్క బ్రహ్మజ్ఞానమువలన సూర్యుని వెంటనే పునర్జీవితుని చేసెను. త్రిమూర్తులయొక్క అంశస్వరూపుడు, త్రిగుణాత్మకుడగు సూర్యుడు చైతన్యము నొంది తండ్రికి, భక్తవత్సలుడగు శంకరునకు భక్తితో నమస్కరించి తన తండ్రియగు కశ్యపప్రజాపతి శంకరునకు శాపమిచ్చిన విషయమును తెలిసికొని తండ్రిని కోపించెను. విషయాన్నైవ జగ్రాహ కోపేనైవమువాచ హ | విషయాంశ్చ పరిత్యజ్య భ##జే శ్రీకృష్ణమీశ్వరం || 15 సర్వం తుచ్ఛమనిత్యం చ నశ్వరం చేశ్వరం వినా | విహాయ మంగళం సత్యం విద్వాన్నేచ్ఛేదమంగళం || 16 ఈ ప్రపంచమున సమస్తము పనికిరానిది, నాశమునొందునది, పరమాత్మమాత్రము వీటికి అతీతుడు. విద్వాంసుడగువాడు మంగళస్వరూపమైన సత్యమును వదలి అమంగళమునెప్పుడు కోరుకొనడు. కావున నేనుకూడ విషయవాంఛను వదలి శ్రీకృష్ణపరమాత్మనెల్లప్పుడు సేవింతునని పలికెను. దేవైశ్చ ప్రేరితో బ్రహ్మా సమాగత్య ససంభ్రమః | బోధయిత్వా రవిం తత్ర యుయోజ విషయేష్వజః || 17 తసై#్మ దత్వాzశిషః శంభుర్బ్రహ్మా చ స్వాలయం ముదా | జగామ కశ్యపశ్చృవ స్వరాశిం రవిరేవ చ || 18 అథమాలీ సుమాలీ చ వ్యాధిగ్రస్తౌ బభూవతుః | శ్విత్రౌ గళితసర్వాంగౌ శక్తిహీనౌ హతప్రభౌ || 19 అప్పుడు దేవతలు పంపగా అచ్చటకు వచ్చిన బ్రహ్మదేవుడు సూర్యునకు జ్ఞానబోధ చేసి విషయములయందు ప్రవర్తించునట్లు చేసెను. తరువాత బ్రహ్మదేవుడు శంకరుడు సూర్యునకు ఆశీస్సులనొసగి తమతమ ఇండ్లకు పోయిరి. కశ్యప ప్రజాపతికూడ స్వస్ధానమునకు వెళ్ళగా సూర్యుడు తానుండవలసిన రాశిలో ఉండెను. ఇక మాలి, సుమాలియనువారు శ్వేతకుష్ఠురోగమువలన అవయములన్నిపోగా శక్తిహీనులు, కాంతిహీనులైరి. తావువాచ స్వయం బ్రహ్మా యువాం చ భజతాం రవిం | సూర్యకోపేన మలినౌ యువామేవం హతప్రభౌ || 20 సూర్యస్య కవచం స్తోత్రం సర్వం పూజావిధిం విధిః | జగామ కథయిత్వా తౌ బ్రహ్మలోకం సనాతనః || 21 తతస్తౌ పుష్కరం గత్వా సిషేవాతే రవిం మునే | స్నాత్వా త్రికాలం భక్త్యా చ జపంతౌ మంత్రముత్తమం || 22 తతః సూర్యాద్వరం ప్రాప్య నిజరూపౌ బభూవతుః | బ్రహ్మదేవుడు మాలి, సుమాలియనువారితో మీరు సూర్యునికోపమువలన ఈవిధముగా రోగగ్రస్తులైతిరి. అందువలన మీరుసూర్యుని సేవింపుడని సూర్యమంత్రమును, సూర్యస్తోత్రమును, కవచమును తెలిపి తన లోకమునకు వెళ్ళిపోయెను. అటుపిమ్మట వారు పుష్కరక్షేత్రమునకు పోయి త్రిసంధ్యలయందు స్నానము చేయుచు సూర్యమంత్రమును భక్తితో జపించుచు సూర్యుని సేవింపసాగిరి. సూర్యుడు వారి భక్తికి మెచ్చి వారికి వరమునీయగా తిరిగి నిజరూపమును పొందిరి. ఇత్యేవం కథితం సర్వం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 23 ఈ విధముగా విఘ్ననాయకునకు విఘ్నము కలుగుటకు కల కారణమునంతయు నీకు వివరించితిని. ఓ నారదమునీ! నీవింకను వినదలచినదేదైనా ఉన్నచో అడుగుమని నారాయణముని అనెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణసంవాదే విఘ్నేశ విఘ్నకథనం నామాష్టాదశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మాహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాదమున పేర్కొనబడిన విఘ్నేశునికి విఘ్నము కలుగుటకు గల కారణమును తెలుపు పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.