sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
వింశతితమోZధ్యాయః - గణపతేర్గజాస్య యోజనా హేతుకథనం
నారద ఉవాచ- నారద మహర్షి ఇట్లు పలికెను.
హరేరంశ సముత్పన్నో హరితుల్యో భవాన్ ధియా | తేజసా విక్రమేణౖవ మత్‌ప్రశ్నం శ్రోతుమర్హసి || 1
విఘ్ననిఘ్నస్య యద్విఘ్నం శ్రుతం తత్ పరమాద్భుతం | తద్విఘ్నకారణం చైవ విశ్వకారణవక్తృతః || 2
అధునా శ్రోతుమిచ్ఛామి పరం సందేహభంజనమ్ | త్రైలోక్యనాథనయే గజాస్యాయోజనార్థకమ్ || 3
స్థితేష్వన్యేషు బహుషు జంతుష్వబ్జభువః పతే | సుప్రాణినాం సురూపేషు నానారూపేషు రూపిణాం || 4
ఓ నారాయణమునీ! నీవు శ్రీహరియోక్క అంశవలన జన్మించినవాడవు. అందువలనమ నీవు బుద్ధియందు, తేజస్సున,పరాక్రమమున శ్రీహరితో సమానుడవు. విఘ్నాధిపతియైన గణాధిపతికి కలిగిన విఘ్నమును గొప్పగా వివరించితివి. అట్లే ఆ విఘ్నమునకు కారణమైన దానిని, సృష్టికర్తయైన బ్రహ్మదేవునిద్వారా వినిపించితివి.
ఇప్పుడు నాకొక సందేహము కలదు. అది ముల్లోకములకు అధిపతియగు శంకరుని పుత్రునకు ఏనుగముఖమునే ఎందుకు పెట్టిరనునది. ఈ ప్రంరచమున చాలా జంతువులున్నవి. అందమైన రూపములకల అనేక ప్రాణులుండగా ఏనుగ ముఖమునే ఎందులకు అతికించిరనునది నా సందేహము. అని పలికెను.
శ్రీ నారాయణ ఉవాచ- నారాయణ మహర్షి ఇట్లు నారదునితో అనెను.
గజాస్యయోజనాయాశ్చ కారణం శృణు నారద| గోప్యం సర్వపురాణషు వేదేషు చ సుదుర్లభం || 5
తారణం సర్వదుఃఖానాం కారణం సర్వసంపదాం | హారణం వపదాం చైవ రహస్యం పాపమోచనం || 6
మహాలక్ష్మాశ్చ చరితం సర్వమంగళ మంగళం | సుఖదం మోక్షదం చైవ చతుర్వర్గ ఫలప్రదం || 7
గణాధిపతికి ఏనుగ తలను పెట్టు విషయము సమస్త పురాణములలో, వేదములలోనూ రహస్యముగానున్నది. దానికి సంబంధించిన మహాలక్ష్మియొక్క చరిత్రను నీకిప్పుడు వివరింతును.
అది సమస్త దుఃఖములను పోగొట్టును. సమస్త సంపదలను కలిగించును. ఆపదలను తొలగించును. పాపములను పోగొట్టును, సుఖమును, మోక్షమును, ధర్మార్థకామమోక్షములను కలిగించును.
శృణు తాత ప్రవక్ష్యాహం ఇతిహాసం పురాతనం | రహస్యం పాద్మకల్పస్య పురా తాతముఖాత్ శ్రుతం || 8
ఏకదైవ మహేంద్రశ్చ పుష్పభద్రాం నదీం య¸° | మహాసంపన్మదోన్మత్తః కామీ రాజశ్రియాన్వితః || 9
తత్తీర్యేతిరహః స్థానే పుష్పోద్యానే మనోహరే | అతీవ దుర్గమేZరణ్యసర్వజంతువివర్జితే || 10
భ్రమర ధ్వనిసంయుక్తే పుంస్కోకిలరుతశ్రవే | సుగంధి పుష్ప సంశ్లిష్ట నాయునా సురభీకృతే || 11
దదర్శ రంభాం తత్రైవ చంద్రలోకాత్ సమాగతాం | సురత శ్రమ విశ్రాంతికాముకీం కాముకాముకీం || 12
ఇచ్ఛంతీమీప్సితాం క్రీడాం గచ్ఛంతీం మదనాశ్రమం | ఏకాకినీమున్మనస్కాం మన్మథోద్గత మానసాం || 13
సుశ్రోణీం సుదతీం శ్యామాం బింబాధర సరోరుహం | బృహన్నితంబ భారార్తాం మత్తవారణగామినీం || 14
సుస్మితాస్య శరచ్చంద్రాం సుకటాక్షం చ బిభృతీం | బిభ్రతీం కబరీం రమ్యాం మాలతీమాల్య శోభితాం || 15
వహ్నిశుద్ధాంశుక ధరాం రత్నభూషణ భూషితాం | కస్తూరీ బిందునా సార్థం సిందూరం బిభృతీం ముదా || 16
నీలోత్పల దళశ్యామ కజ్జలోజ్వల లోచనాం | మణికుండల యుగ్మాఢ్య గండస్థల విరాజితాం || 17
అత్యున్నతం సుకఠినం పత్రరాజి విరాజితం | సుఖదం రసికానాం చ స్తనయుగ్మంచ బిభృతీం || 18
నారదా ! పాద్మకల్పమున రహస్యముగానున్న ప్రాచీనేతిహసమును నీకు తెలిపెదను. వినుము.
ఒకప్పుడు దేవేంద్రుడు అత్యధిక సంపదవలన కలిగిన మదమువలన ఉన్మత్తుడై ; రాజశోభతో ప్రకాశించుచు, మహాకాముకుడై పుష్పభద్రానదీతీరమునకు పోయెను. ఆ పుష్పభద్రానదీ తీరమున మిక్కిలి రహస్యముగానున్న పుష్పవనమును చేరుకొనెను.
ఆ పుష్పోద్యానము మిక్కిలి సుందరమై , ఎటువంటి జంతువులు లేక తుమ్మెదలు, గండుకోయిలల ధ్వనితో, సువాసన గలిగిన పిల్లవాయువులతో ఆహ్లదజనకముగా నుండెను.
ఆ సమయమున చంద్రలోకమునుండి మన్మథుని కోరి అతని ఆశ్రమమునకు ఒంటరిగా మన్మథుని మనస్సులో భావించుకొనుచున్న రంభ ఆ ప్రాంతమునకు వచ్చెను. ఆమె చక్కని పిరుదులతో, చక్కని, పల్వరుసతో, మదించిన ఏనుగువలె మెల్లగా పోవుచుండెను. చక్కని అందము, శరత్కాలపు చంద్రునివంటిముఖము, చిరునవ్వు, మాలతీపుష్పమాల కలిగిన కొప్పు, మంచిగానున్న వస్త్రము, రత్నభూషణములు, పాపెటలో కస్తూరిచేర్చుక్కతోనున్న సింధూరము, నల్లకలువలవంటి కన్నులు, మణికుందలములు, మకరికాపత్రములతో సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాల చక్కగా నుండెను.
సర్వశోభాం సువేష్యాఢ్యాం సుభగాం సురతోత్సుకాం | ప్రాణాధికాం చ దేవానాం స్వచ్ఛాం స్వచ్ఛందగామినీం || 19
వారమప్సరసం రమ్యామతీవ స్థిర¸°వనాం | గుణరూపవతీం శాంతాం మునిమానసమోహినీం || 20
దృష్ట్యా తామతివేషాఢ్యాం తత్కటాక్షేన పీడితః | ఇంద్రోZతీంద్రియ చాపల్యాత్ ప్రవక్తుముపచక్రమే || 21
చక్కగా అలంకరించుకొని, మన్మథునితో కలయుటకు ఆమె పోవుచుండేను. దేవతలందరకు ప్రాణములకంటె మిన్నయైన రంభ స్వేచ్ఛగా తిరుగు స్వభావము కలది, సుస్థిరమైన ¸°వనము కలది, ఇంకను ఆమె తన రూపవిభ్రమములచే మునులయొక్క చిత్తమును అపహరించు స్వభావము కలది, అతిగా అలంకరించుకొనిపోవుచున్న ఆ రంభను ఏకాంతమున ఇంద్రుడు చూచి ఇంద్రియచాపల్యమువలన ఆమెతో ఇట్లు మాటాడసాగెను.
ఇంద్ర ఉవాచ- ఇంద్రుడిట్లు పలికెను.
క్వగచ్ఛసి వరారోహే స్వ గతాZసి మనోహరే | మయా దృష్టా హి సుచిరాత్కాల్యాణి సుభ##గేZధునా || 22
తవాన్వేషణ కర్తాZహం శ్రుత్వా వాచికమగ్రతః | త్వదాసక్తమనాశ్చాస్మి నాన్యాం వై గణయామి చ || 23
సువాసితజలార్థీ యః కిమిచ్ఛేత్పంకిలం జలం | పంకం నేచ్ఛేచ్చందనార్థీ పంకజార్థీ నచోత్పలం || 24
సుధార్థీ న సురామిచ్ఛేద్దుగ్ధార్థీ నావిలం జలం | సుగంధి పుష్పశాయీ యో హ్యస్త్రతల్పం న చేచ్ఛతి || 25
స్వర్గీ చ నరకం నేచ్ఛేత్సుభగీ దుష్టభోజనం | పండితైస్సహ సంవాసీ నేచ్ఛేత్ స్త్రీ సన్నిధిం నరః | విహాయ రత్నాభరణం కోZపీచ్ఛేల్లోహభూషణం || 26
త్వాం నాశ్లిష్య మహావిజ్ఞాం కాం మూఢోగంతుమిచ్ఛతి | విహాయ గంగాం కో విజ్ఞో నదీమన్యాం చ వాంఛతి || 27
ఇంద్రియైశ్చేంద్రియరతిం వర్ధయంతీం పదే పదే | వరం ప్రార్థయితారశ్చ ప్రాణినశ్చ సుఖార్థినః || 28
ఓ అందమైనదానా! నీవెచ్చటికి పోవుచున్నావు. ఎక్కడినుండి వచ్చుచున్నావు. చాలాకాలమునకు నీవు కనిపించితివి. నేను నిన్నే వెదుకుచున్నాను. నీపైగల కోరికచే సువాసితమైన తియ్యని నీరు తాగువాడు బురదనీరును త్రాగనట్లు, గంధముకావలయుననుకొనువాడు బురదను ముట్టనట్లు, అమృమును కోరువాడు సురను ఇష్టపడనట్లు, పాలు త్రాగువాడు అపరిశుద్ధజలమును ఇష్టపడనట్లు, సువాసనగల పుష్పములయందు నిదురించువాడు అస్త్రశయ్యను కోరుకొననట్లు, స్వర్గముననుండువాడు నరకమును ఇష్టపడనట్లు, అందమైనవాడు దుష్టభోజనము చేయనొల్లనియట్లు, రత్నాభరణములు ధరించువాడు ఇనుముతో చేసిన ఆభరణములను ఇష్టపడని యట్లు, చక్కని తెలివి అందము గల నిన్ను వదలిపెట్టి ఇతరస్త్రీల పొందును కోరుకొనలేను. నీ ఇంద్రియములచే ఇంద్రియసుఖమును పెంపొందించు నిన్ను దవలి ఇంకొక స్త్రీని మనసులోనైన స్మరింపలేకున్నాను. ప్రతిప్రాణియు సుఖాభిలాషియైనను శ్రేష్ఠమైన దానినే ఎక్కువగా కోరుకొనుము.
ఇత్యేవముక్త్వా భగవానవరుహ్య గజేశ్వరాత్ | కామయుక్తశ్చ పురతః తస్థౌ తస్యాశ్చ నారద || 29
కామముతోనున్న దేవేంద్రుడు ఈ విధముగా రంభతో మాటలాడుచు తన గజమగు ఐరావతమునుండి క్రిందకు దిగి రంభ ముందు నిలబడెను.
శ్రుత్వా తద్వచనం రంభా మహాశృంగారలోలుపా! జహాసాZనమ్రదనా పులకాంచిత విగ్రహా || 30
స్మేరాననా కటాక్షేణ స్తనోర్వోర్దర్శనేన చ | నర్మోక్తిగర్భవాక్యేన చాహరత్తస్య చేతనాం || 31
మితం సారం సుమధురం సుస్నిగ్ధం కోమలం ప్రియం | పురుషాయత్తబీజం చ ప్రవక్తుతముపచక్రమే || 32
మహాశృంగారమును కోరికొను రంభ ఇంద్రుని సరససంభాషణములను విని పులకించిపోయి, తలను వంచుకొని నవ్వెను. ఆ రంభ తన చిరునవ్వు, కటాక్షము, స్తనములను ఊరువులను చూపించుట, నర్మోక్తులుగల మాటలు మొదలగు వాటిచే ఇంద్రుని మసస్సును చూరగొనెను. అటుపిమ్మట సుమధురము, కోమలము, ప్రియమైనది, పురుషుని స్వాధీనము చేసికొనుమాటలను
మితముగా ఇట్లు పలకసాగెను.
రంభోవాచ- రంభ ఈ విధముగా పలికెను.
యాస్యామి వాంఛితం యత్ర ప్రశ్నేన తవ కిం ఫలం | నాహం సంతోషజననీ ధూర్తానాం దుష్టమిత్రతా || 33
యథా మధుకరో లోభాత్సర్వపుష్పాసవం లభేత్ | స్వాదు యత్రాతిరిక్తం స తత్ర తిష్ఠతి సంతతం || 34
తథైవ కాముకీ లోకే భ్రమే ద్భ్రమరవత్సదా | చాంచల్యాత్స హి కాస్వేవ వాయువద్రసమాహారేత్ || 35
స పుమానంగవత్ స్త్రీణాం యథా శాఖాశ్చ శాఖినాం | కాముకీ కాకవల్లోలః ఫలం భుంక్త్వా ప్రయాతి చ || 36
స్వకార్యముద్ధరేద్యావత్తావద్వా సప్రయోజనం | స్థితిః కార్యానురోధేన యథా కాష్ఠే హుతాశనః || 37
యావత్తడాగే తోయాని తావద్యాదాంసి తేషు చ | శోషారంభే చ తోయానాం యాంతి స్థానాంతరం పునః || 38
త్వం దేవానామీశ్వరోZసి త్వం కామినీనాం చ వాంఛితః | పుమాంసం రసికం శశ్వద్వాంఛంతి రసికాః సుఖాత్ || 39
యువానం రసికం శాంతం సువేషం సుందరం ప్రియం | గుణినం ధనినం స్వచ్ఛం కాంతమిచ్ఛతి కామినీ|| 40
దుశ్శీలం రోగిణం వృద్ధం రతిశక్తివియోజితం | అదాతారమవిజ్ఞం చ నైవ వాంఛంతి యోషితః || 41
కా మూఢా న చ వాంఛంతి త్వామేవం గుణసాగరం | తవాజ్ఞాకారిణీం దాసీం గృహాణాత్ర యథాసుఖం || 42
ఓ ఇంద్రుడా! నేను ఎచ్చటిపోవుచున్నానను ప్రశ్నవలన నీకేమి ఫలితము కలదు. ఐనను నేను దుష్టులకు సంతోషమును కలిగించుదానను కాదు. దుష్టులతో నేను సావాసమును చేయను.
తుమ్మెద అన్ని పుష్పములనుండి మకరందమును గ్రహించినను రుచిగల కొన్ని పుష్పములపైననే ఎల్లప్పుడుండును. అట్లే కాముకుడు కూడ అంతట తిరిగినను, కొందరినే అనుభవించును. కాకియొట్లు చెట్లపై వ్రాలి పండ్లను తిని పోవునో కాముకుడట్లే ఫలముననుభవించిపోవును. చెరువులలో నీరున్నంతవరకు జవచరములున్నట్లు కాముకుడు తన అవసపముననుసరించి యుండును.
ఐనను నీవు దేవతలకు అధిపతివి. కామినులందరు నిన్నెల్లప్పుడు కోరుకొందురు. రసికులగు స్త్రీలు రసికునే ఎల్లప్పుడు కోరుకొందురు. కామినియగుస్త్రీ యువకుడు. రసికుడు, అందగాడు, చక్కగా అలంకరించుకొనువాడు, గుణవంతుడు, ధనవంతుడగు పురుషుని మాత్రమే కామించును. అట్లే చెడునడక కలవాడు, రోగి, ముసలివాడు, రతిశక్తిలేనివాడు, ధనమునీయనివాడు, తెలివితక్కువవడగు పురుషుని ఎల్లప్పుడు కోరుకొనదు. అందువలన నీవంటి గుణసముద్రుని ఏ స్త్రీ కోరుకొనదు. కావున నీ ఆజ్ఞను శిరసావహించు ఈ దాసిని నీ సుఖమునకై స్వీకరింపుమని రంభ పలికెను.
ఇత్యుక్త్వా సస్మితా సా చ తం పపౌ వక్రచక్షుషా | కామాగ్నిదగ్ధా విగళల్లజ్జా తస్థౌ సమీపతః || 43
జ్ఞాత్వా భావం స్మరార్తాయాః స్మరశాస్త్రవిశారదః | గృహీత్వాం తాం పుష్పతల్పే విజహార తయా సహ || 44
చుచుంబ రహసి ప్రౌఢాం నగ్నాం చ సుభగాం వరాం | పక్వబింబాధరోష్ఠీం చ సుదత్యా చుంబితస్తయా || 45
నానాప్రకార శృంగారాద్విపరీతాదికాన్మునే | సుఖీ బభూవ తస్యాం వై శృంగారో మూర్తిమానివ || 46
తౌ కామాహితచిత్తౌ నో బుబుధాతే దివానిశం | అన్యోన్య గతచిత్తౌ చ కామార్తే జ్ఞానవర్జితౌ|| 47
స చ కృత్వా స్థలే క్రీడాం తయా సహ సురేశ్వరః | య¸° జలవిహారార్థం పుష్పభద్రానదీజలం || 48
స చకార జలక్రీడాం తయా సహ ముదా క్షణం | జలాత్‌స్థలే స్థలాత్తోయే విజహార పునః పునః || 49
ఈ విధముగా రంభ దేవేంద్రునితో మాటాడుచు చిరునవ్వుతో చూచెను. ఆమె మన్నథాగ్నిచే దహించుకొని పోవుచుండెను. అందువలన సిగ్గువదలి ప్రవర్తించుచుండెను. మన్మథశాస్త్రవిశారదుడగు దేవేంద్రుడు మన్మథునిచే బాధపడచున్న రంభయొక్క మనసును గ్రహింతి ఆమె ను తీసికొని పుష్పశయ్యపై విహరించెను. ప్రౌఢ, అందముగలది, శ్రేష్ఠురాలు దొండపండువలె ఎఱ్ఱని అధరముగల రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా రంభ కూడ అతనిని ముద్దిడెను. విపరీతశృంగారము మొదలగు నానాప్రకారములగు శృంగారములవలన దేవేంద్రుడు రంభతో పరమసౌఖ్యమును పొందెను. కామముతో కూడుకున్న ఆ రంభాదేవేంద్రులు అన్యోన్యముగానుండి జ్ఞానమును వదలి రాత్రింబగళ్ళు తెలియకనుండిరి. దేవేంద్రుడు రంభతో భూమిపై క్రీడలు సల్పి పుష్పభద్రానదిలో జలవిరాహాము కేగెను. జలక్రీడ తరువాత స్థలక్రీడ, తిరిగి జలక్రీజడ అనునట్లు వారు చాలాకాలము విహరించిరి.
ఏతస్మిన్నంతరే తేన వర్త్మనా మునిపుంగవః | సశిష్యో యాతి దుర్వాసా వైకుంఠాచ్ఛంకరాలయం || 50
తం చ దృష్ట్వా మునీంద్రం చ దేవేంద్రః స్తబ్ధమానసః | ననామాగత్య సహసా దదౌ తసై#్మ స చాశిషః || 51
పారిజాత ప్రసూతం యద్దత్తం నారాయణన వై | తచ్చ దత్తం మహేంద్రాయ మునీంద్రేణ మహాత్మనా || 52
దత్వా పుష్పం మహాభాగస్తమువాచ కృపానిధిః | మహాత్మ్యం తస్య యత్కించిదపూర్వం మునిసత్తమః || 53
ఆ సమయమున దుర్వాసమహర్షి తనశిష్యులతో వైకుంఠమునుండి కైలాసమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. దుర్వాసమహర్షిని చూచి దేవేంద్రుడతనికి నమస్కరించెను. అప్పుడా మహర్షి దేవేంద్రునికి ఆశీస్సులనొసగి శ్రీమన్నారాయణుడు తనకు కానుకగానిచ్చిన పారిజాతపుష్పమునతనికిచ్చి ఆ పుష్పముయొక్క మహాత్మ్యమునిట్లు చెప్పసాగెను.
దుర్వాసా ఉవాచ - దుర్వాసమహర్షి ఇట్లు పలికెను.
సర్వవిఘ్నహరం పుష్పం నారాయణ నివేదితం | మూర్థ్నీదం యస్య దేవేంద్ర జయస్తసై#్యవ సర్వతః || 54
పురః పూజా చ సర్వేషాం దేవానాగ్రణీర్భవేత్ | తచ్ఛాయేవ మహాలక్ష్మీర్న జహాతి కదాZపి తం || 55
జ్ఞానేన తేజసా బుద్ధ్యా విక్రమేణ బలేన చ | సర్వేదేవాధికః శ్రీమాన్ హరితుల్య పరాక్రమః || 56
భక్త్యా మూర్థ్ని న గృహ్ణాతి యోZహంకారేణ పామరః | నైవేద్యం చ హరేరేవ స భ్రష్టశ్రీ స్వజాతిభిః |
ఇత్యుక్త్వా శంకరాంశశ్చ హ్యగమచ్ఛంకరాలయం || 57
ఈ పారిజాతపుష్పము శ్రీమన్నారాయణుని అర్చనకై సమర్పింపబడినది. దేవేంద్ర! దీనినెవరు శిరసున ధరింతురో వారికి అంతట జయము లభించును. సమస్తదేవతలకంటె ముందుగా అతడే గౌరవింపబడును. అతనిని మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడు అంటిపెట్టుకొనియే యుండును. జ్ఞానమున, తేజస్సునందు, బుద్ధియందు, విక్రమమున, బలమున అతడు శ్రీమన్నారాయణునితో సమానుడగును. సమస్తదేవతలయందు. అతడు శ్రేష్ఠుడై యుండును.
అట్లే అహంకారము వలన ఎవరు ఈ పుష్పమును భక్తితో స్వీకరింపరో, వారు శ్రీహరి నైవేద్యమును స్వీకరింపనివారివలె తమ కులమునుండి భ్రష్టులైపోవుదురని చెప్పి శంకరుని అంశస్వరూపుడగు దుర్వాసమహర్షి కైలాసపర్వతమునకు పోయెను.
తత్స రంభాంతికే తిష్ఠన్ చిక్షేప గజమస్తకే | తేన భ్రష్టశ్రియం దృష్ట్వా సా జగామ సురాలయం || 58
పుంశ్చలీ యోగ్యమిచ్ఛంతీ నాపరం చంచలాZధమా|
దేవేంద్రుడు రంభసమీపమున కామమోహితుడైయుండి ఆ దివ్యపుష్పమును తన గజముయొక్క శిరస్సుపై పారవేసెను. ఆ దివ్యపుష్పమును గౌరవించనందున దేవేంద్రుడు సంపదను కోల్పోగా రంభ స్వర్గమునకు పోయెను. చంచలస్వభావము కలది, అధమురాలు, వారవనితయగు రంభ దేవేంద్రునికంటె యోగ్యుడైన ఇంకొక పురుషునికై వెళ్ళిపోయెను.
దేవరాజం పరిత్యజ్య గజరాజో మహాబలీ || 59
ప్రవివేశ మహారణ్యం తం నిక్షేప్య స్వతేజసా | తత్రైవ కరిణీం ప్రాప్య మత్తః సంబుభుజే బలాత్ || 60
సాZతో బభూవ వశగా యోషిజ్జాతిః సుఖార్థినీ ష తయోర్బభూవాపత్యానాం నివహస్తత్ర కాననే || 61
దేవతలకు అధిపతియగు ఇంద్రుని గజము పారిజాతపుష్పమును శిరస్సుపై ధరించుటవలన ఆ పుష్పమును తిరస్కరించిన దేవేంద్రుని వదలి మహారణ్యమును ప్రవేశించెను. అచ్చటనున్న ఆడఏనుగుతో కలసి తిరిగినందువలన దానికి చాలా సంతానము కలిగినది.
హరిస్తన్మస్తకం ఛిత్వా యోజయామాస బాలకే | ఇత్యేవం కథితం వత్స కిం భూయః శ్రోతుమిచ్ఛసి | గజస్యాయోజనాయాశ్చ కారణం పాపనాశనం || 62
శ్రీహరి ఆ గజముయొక్క తలను తెప్పించి శినియొక్క దృష్టిదోషమువలన శిరస్సు తెగిపోయిన పార్వతీదేవి పుత్రుని శరీరమున కతికించెను.
నారదా! ఈ విధముగా పార్వతీదేవి పుత్రునకు గజశిరస్సు కలుగుటకు కల కారణమును తెలిపితిని. ఈ కథ పాపమును పోగొట్టును. ఇంకను నీవు వినదలచినదేదైన ఉన్నచో అడుగుమని నారాయణముని నారదునితో అనెను.
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే గణపతేర్గజాస్య యోజనా హేతుకథనం నామ వింశతితమోzధ్యాయః |
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాద సమయమున తెల్పబడిన గణపతికి ఏనుగ శిరస్సు ఏర్పడుటకుగల కారణమును తెలుపు
ఇరువదవ అధ్యాయము సమాప్తము.