sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకవింశతిమోzధ్యాయః- ఇంద్రునకు లక్ష్మీ ప్రాప్తి éనారద ఇవాచ - నారదముని ఇట్లు పలికెను. తే దేవా బ్రహ్మశాపేన నిఃశ్రీకా కేన వా ప్రభో | బభూవు స్తద్రహస్యం చ గోపనీయం సుదుర్లభం || 1 కథం వా ప్రాపురేతే తాం కమలాం జగతాం ప్రసూం | కిం చకార మహేంద్రశ్చ తద్భవాన్ వక్తుమర్హసి || 2 ఓ నారాయణమునీ! దేవతలు ఏ బ్రహ్మణశాపమువలన తమ సంపదను కోల్పోయిరో అట్లే దేవేంద్రుడు దేవతలు లోకములకు తల్లియగు లక్ష్మీదేవినెట్లు పొందిరో, రహస్యమైన ఆ విషయమున నాకు వివరింపుడని అడిగె ను. నారాయణ ఉవాచ- నారాయణ మహర్షి ఇట్లనెను. గజేంద్రణ పరాభూతో రంభయా చ సమందధీః | భ్రష్టశ్రీర్దైన్యయుక్తశ్చ స జగామామరావతీం || 3 తాం దదర్శ నిరానందో నిరానందాం పురీం మునే | దైన్యగ్రస్తాం బంధుహీనాం వైరివర్గైః సమాకులాం || 4 ఇతి శ్రుత్వా దూతముఖాజ్జగామ గురుమందిరం | తేన దేవగణౖస్సార్థం జగామ బ్రహ్మణః సభాం || 5 దేవేంద్రుడు తన వాహనమగు గజముచే, రంభ##చే తిరస్కరింపబడి, సంపదను కోల్పోయి, విచారవదనముతో అమరావతీ పట్టణమునకు పోయెను. అప్పుడచ్చట అతని బంధువులు లేక శత్రువులుండిరి. అందువలన ఆ పట్టణము దైన్యముతో నున్నట్లు దూతలు చెప్పగా అతడు తోటి దేవతలతో కలసి బృహస్పతి ఇంటికి వెళ్ళెను. అచ్చటనున్న తన గురువును తీసికొని ఇంద్రుడు బ్రహ్మలోకమునకు పోయెను. గత్వా ననామ తం శక్రః సురైః సార్థం తథా గురః | తుష్టావ వేదవాక్యైశ్చ స్తోత్రేణాzపి చ సంయుతః || 6 ప్రవృత్తిం కథయామాస వాక్పతిస్తం ప్రజాపతిం | శ్రుత్వా బ్రహ్మా నమ్రవక్త్రః ప్రవక్తుముపచక్రమే || 7 దేవేంద్రుడు, అతని. గురువగు బృహస్పతి దేవతలతో కలసి బ్రహ్మదేవుని, వేదవాక్యములచే, స్తోత్రములచే స్తుతించిరి. అప్పుడు బృహస్పతి ఇంద్రుని విషయమునంతయు బ్రహ్మదేవునకెరింగించెను. బృహస్పతి మాటలు విన్న బ్రహ్మదేవుడు తలను వంచుకొని ఇట్లు మాటాలాడసాగెను. బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను. మత్ప్రపౌత్రోZసి దేవేంద్ర శశ్వద్రాజశ్రియా జ్వలన్ | లక్ష్మీసమశచీభర్తా పరస్త్రీలోలుపః సదా || 8 గౌతమస్యాభిశాపేన భగాంగః సురసంసది | పునర్లజ్జావిహీనస్త్వం పరస్త్రీరతిలోలుపః || 9 యః పరస్త్రీషు నిరతః తస్యశ్రీర్వాకుతోయశః | స చ నింద్యః పాపయుక్తః శశ్వత్సర్వసభాసు చ || 10 నైవేద్యం శ్రీహరేరేవ దత్తం దుర్వాససా చ తే | గజమూర్ధ్ని త్వయా న్యస్తం రంభయాZహృతచేతసా || 11 క్వ సా రంభా సర్వభోగ్యా క్వాZధునాం త్వం శ్రియాహతః | సర్వసౌఖ్యప్రదాత్రీ త్వాం గతా త్యక్త్వా క్షణన సా || 12 వేశ్యా సశ్రీకమిచ్ఛంతి నిఃశ్రీకం న చ చంచలా | నవం నవం ప్రార్థయంతీ పరినింద్య పురాతనం || 13 యద్గతం తద్గతం వత్స నిష్పన్నం న నివర్తతే | భజ నారాయణం భక్త్వా పద్మాయాః ప్రాప్తిహేతవే || 14 ఓ దేవేంద్రుడా! నీవు నా మునిమనుమడవు. ఎల్లప్పుడు రాజుగానున్నావు. నీ భార్యయగు శచీదేవి లక్ష్మీదేవితో సమానురాలు. ఐనను పరస్త్రీలోలుడవు. పరస్త్రీ లోలుడవైనందువలననే గౌతమమహర్షి శాపమువలన నీకు ఆకారమున వికారము కలిగినది. ఐనను సిగ్గును వదలి తిరిగి పరస్త్రీ లోలునివైతివి. పరస్త్రీలోలునకు సంపద, కీర్తి యుండునా? ఆ పాపుని అంతటా నిందించుచుందురు. నీకు దుర్వాసమహర్షి శ్రీహరినైవేద్యరూపమైన పుష్పమునీయగా రంభాలోలునివై ఆ పుష్పమును ఏనుగు శిరస్సుపై పారవేసితిని. వేశ్యయగు ఆ రంభ ఇప్పుడెచ్చటనున్నది. నీవు మాత్రము రాజ్యలక్ష్మీని కోల్పోతివి. అందరకు శారీరక సౌఖ్యమునందజేయు %ా రంభ నిన్ను క్షణములో వదలివేసినది. చంచలస్వభావయగు వేశ్య ఎల్లప్పుడు సంపదకలవానినిమాత్రమే కోరుకొనును. అట్లే పాతవారిని వదలిపెట్టుచు కొత్తవారిని కోరుకొనుచుండును. సరే జరిగినదేదో జరిగిపోయినది. జరిగిన కార్యము తిరిగి వేనుకకు రాదు. అందువలన జరిగినదానికై చింతింపక లక్ష్మీదేవియొక్క అనుగ్రమునకై నారాయణుని భక్తితో సేవింపుమని అనెను. ఇత్యుక్త్వా తం జగత్స్రష్టుః స్తోత్రం చ కవచం దదౌ | నారాయణస్య మంత్రం చ నారాయణ పరాయణః || 15 సతైః సార్థం గురుణా హ్యజపస్మంత్రమీప్సితం | గృహీత్వా కవచం తేన పర్యఎ్ఠౌత్ పుష్కరే హరేః || 16 వర్షమేకం నిరాహోరో భారతే పుణ్యదే శుభే | సిషేనే కమలాకాంతం కమలాప్రాప్తి హేతవే || 17 బ్రహ్మదేవుడీవిధముగా పలికి జగత్కారణుడగు శ్రీమన్నారాయణుని మంత్రమును, స్త్రోత్రమును, కవచమును అతనికి ఉపదేశించెను. అప్పుడు దేవేంద్రుడు తన గురువు, ఇతర దేవతలతో కలసి పుష్కరక్షేత్రమున శ్రీహరి మంత్రమును జపించుచు స్తోత్రమును కవచమును పఠించెను. ఇట్లు పుణ్యదేశ##మైన భారతభూభాగమున ఆహారరహితుడై ఒక సంవత్సరమువరకు శ్రీహరిని సంపదకొరకు సేవించెను. ఆగత్య తం హరిస్తసై#్మ వాంఛితం చ వరం దదౌ | లక్ష్మీస్తోత్రం చ కవచం మంత్రమైశ్వర్యవర్థనం || 18 దత్వా జగామ వైకుంఠమింద్రః శ్రీరోదమేవచ | గృహీత్వా కవచం స్తుత్వా ప్రాప పద్మాలయాం మునే || 19 సురేశ్వరోZరిం జిత్వావై హ్యలభచ్చామరావతీం | ప్రత్యేకం చ సురాః సర్వే స్వాలయం ప్రాపురీప్సితం || 20 ఇంద్రుడు చేసిన తపస్సునకు శ్రీహరి సంతోషించి ఇంద్రుని దగ్గరకు వచ్చి అతనికి అభిమత వరమునిచ్చెను. అట్లే ఐశ్వర్యమును పెంపొందించు లక్ష్మీస్తోత్రమును, లక్ష్మీకవచమును, మంత్రమును అతనికి ఉపదేశించి వైకుంఠమునకు పోయెను. ఇంద్రుడు శ్రీమహాలక్ష్మీకవచమును స్వీకరించి లక్ష్మీస్త్రోత్రముచే ఆమెను స్తుతించి లక్ష్మీ దేవి అనుగ్రహము పొందెను. అందువలన ఇంద్రుడు తన శత్రువులను జయించి తన అనుచరులైన దేవతాగణముతో కలసి అమరావతిని (స్వర్గమును) తిరిగి పొందగలిగెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే శక్రలక్ష్మీ ప్రాప్తిర్నామ ఏకవింశతితమోZధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారదనారాయణమునుల సంవాదసమయమున తెలుపబడిన ఇంద్రునకు లక్ష్మీ ప్రాప్తియను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.