sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వావింశతితమో
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను.
ఆవిర్భూయ హరిస్తసై#్మ కిం స్తోత్రం కవచం దదౌ | మహాలక్ష్మాశ్చ లక్ష్మీశస్తన్మే బ్రూహి తపోధన|| 1
ఇంద్రునకు శ్రీహరి ప్రత్యక్షమై అతనికి ఉపదేశించిన శ్రీమహాలక్ష్మీస్తోత్రము, కవచము ఎటువంటిదో నాకు వివరించి చెప్పుమని నారాయణమునినడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణ ముని ఇట్లు సమాధానమిచ్చెను.
పుష్కరే చ తపస్తప్త్వా విరరామ సురేశ్వరః | ఆవిర్భభూవ తత్రైవ క్లిష్టం దృష్ట్వా హరిః స్వయం || 2
తమువాచ హృహీకేశో వరం వృణు యథేప్సితం | స చ వవ్రే వరం లక్ష్మీమీశస్తసై#్మ దదౌ ముదా || 3
వరం దత్వా హృషీకేశః ప్రవక్తుముపచక్రమే | హితం సత్యం చ సారం చ పరిణామ సుఖావహం || 4
దేవేంద్రుడు పుష్కరక్షేత్రమున శ్రీహరిగురించి తపమాచరించినపుడు అతని తపస్సు చాలా గొప్పదని తలచి శ్రీహరి అతనికి ప్రత్యక్షమాయెను. అప్పుడు శ్రీహరి దేవేంద్రునితో నీకిష్టమైన వరము కోరుకొమ్మని అడుగగా అతడు తనకు సంపద కావలెనని వేడుకొనెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతనికి వరముననుగ్రహించి సత్యము, శ్రేష్ఠమైన హితవాక్యమును ఇట్లు పలికెను.
శ్రీమధుసూదన ఉవాచ - మధుసూదను డిట్లు పలికెను.
గృహాణ కవచం శక్ర సర్వదుఃఖవినాశనం | పరమైశ్వర్యజనకం సర్వశత్రు విమర్దనం || 5
బ్రహ్మణ చ పురాదత్తం విష్టపే చ జలప్లుతే | యద్దృత్వా జగతాం శ్రేష్ఠః సర్వైశ్వ ర్యయుతో విధి ః || 6
బభూవుర్మనవః సర్వే సర్వైశ్వర్యయుతా యుతః |
ఇంద్రా! సమస్త దుఃఖములను పొగొట్టునది, పరమైశ్వర్యమును కలిగించునది, సమస్త శత్రువులను నాశనమొందించునదియగు ఈ కవచమును స్వీకరింపుము.
లోకములన్నియు నీటమునిగియున్న సమయమున దీనిని బ్రహ్మదేవున కొసగితిని. ఈ కవచముయొక్క ప్రభావమువలన బ్రహ్మదేవుడు, జగచ్ఛేష్ఠుడుగా సమసై#్తశ్వర్యయుక్తుడుగా నయ్యెను. అట్లే ఈ కవచముయొక్క ప్రభావమువలన మానవులు కూడ సమస్తసంపదలను పొందినారు.
సర్వైశ్వర్య ప్రదస్యాస్య కవచస్య ఋషిర్విధిః |. 7
పంక్తిశ్ఛందశ్చ సా దేవీ స్వయం పద్మాలయా వరా | సిద్ధైశ్వర్య సుఖేష్వేన వినియోగః ప్రకీర్తితః |
యద్ధృత్వా కవచం లోకః సర్వత్ర విజయీ భ##వేత్ || 8
సమసై#్తశ్వర్యములనొసగు ఈ మహాలక్ష్మీ కవచమునకు ఋషి బ్రహ్మదేవుడు, ఛందస్సు పంక్చీఛందము, లక్ష్మీదేవియే దేవత. ఐశ్వర్య సుఖములకై దీనిని వినియోగించుచున్నారు. ఈ కవచమును ధరించినచో మానవుడు సమస్త విజయములను పొందగలడు.
మస్తకం పాతు మే పద్మా కంఠం పాతు హరిప్రియా నాసికాం పాతు మే లక్ష్మీః కమలా పాతు లోచనే || 9
కేశాన్ కేశవకాంతాం చ కపాలాం కమలాలయా | జగత్ప్రసూర్గండయుగ్మం స్కంధం సంపత్ప్రదా సదా || 10
ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహా పృష్ఠం సదాZవతు | ఓం హ్రీం శ్రీం పద్మాలయాయైస్వాహా వక్షఃసదాZవతు|
పాతుశ్రీర్మమ కంకాళం బాహుయుగ్మం చ తే నమః || 11
ఓం హ్రీం శ్రీం లక్ష్మ్యై నమః పాదౌ పాతు మే సంతతం చిరం | ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా పాతు నితంబకం || 12
ఓం శ్రీం మహాలక్ష్మ్యై స్వాహా సర్వాంగం పాతు మే సదా | ఓం హ్రీం శ్రీం క్షీం మహాలక్ష్మ్యైస్వాహా మాం పాతు సర్వతః || 13
పద్మ నాశిరస్సును, హరిప్రియయగు లక్ష్మీ నా కంఠమును, లక్ష్మీదేవి నా నాసికను, కమలయగు నా కండ్లను, కేశవకాంతయగు లక్ష్మీదేవి నా కేశములను, కమలాలయయగు లక్ష్మీ నా కపాలమును, జగన్మాతయగు లక్ష్మి నా చెక్కిళ్ళను, సంపదలనొసగు లక్ష్మీ నా స్కంధమును, ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహా అను మంత్రము నా పృష్ఠభాగమును, ఓం హ్రీం శ్రీం పద్మాలయాయై స్వాహా అను మంత్రము నా వక్షస్థలమును, శ్రీదేవి నా కంకాళమును, "తేనమః" అను మంత్రము నా బాహువులను, ఓం హ్రీం శ్రీం లక్ష్మ్యైనమః అను మంత్రము నా పాదములను, ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా అను మంత్రము నా నితంబములను, ఓం శ్రీం మహాలక్ష్మ్యైస్వాహా అను మంత్రము సమస్తావయవములను, ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యైస్వాహా అను మంత్రము నన్నెల్లప్పుడు రక్షించుచుండునుగాక.
ఇతి తే కథితం వత్స సర్వసంపత్కరం పరం | సర్వైశ్వర్యప్రదం నామ కవచం పరమాద్భుతం || 14
గురుమభ్యర్చ్య విధివత్కవచం ధారయేత్తు యః | కంఠేవా దక్షిణ బాహౌ స సర్వవిజయీ భ##వేత్ || 15
మహాలక్ష్మీర్గృహం తస్య న జహాతి కదాచన | తస్య ఛాయేన సతతం సా చ జన్మని జన్మని || 16
ఇదం కవచమజ్ఞాత్వా భ##జేల్లక్ష్మీం స మందధీః | శతలక్షప్రజాపేZపి న మంత్రః సిద్ధిదాయకః || 17
దేవేంద్ర! ఈ విధముగా సమస్త సంపదలను ఐశ్వర్యములనొసగు లక్ష్మీ కవచమును నీకు తెలిపితిని. దీనిని, గురువును శాస్త్రప్రకారముగా పూజించి కంఠమునగాని, కుడి దండయందుగాని కట్టుకొన్నచో అతనికి అంతట విజయము లభించును. మహాలక్ష్మీదేవి అతని ఇంటిని ఎన్నడు వదలిపోదు. ఇంకను ప్రతిజన్మయందు ఆ మహాలక్ష్మీ నీడవలె అతనిని వెన్నంటియుండును.
ఈ కవచమును వదలి లక్ష్మీమంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిధ్దినందజాలదు అని శ్రీహరి పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను.
దత్వా తసై#్మ చ కవచం మంత్రం వై షోడశాక్షరం | సంతుష్టశ్చ చ కృపయా చేంద్రాయ చ మహామునే || 19
జగన్నాథుడగు శ్రీహరి దేవేంద్రునకు కవచమునొసగి అటుపిమ్మట షోడశాక్షరమైన లక్ష్మీమంత్రమునతనికి ఉపదేశించెను. "ఓం హ్రీం శ్రీం క్లీం నమో మహాలక్ష్మ్యైస్వాహా" అను మంత్రమునతడు ఇంద్రునకు దయతో నొసగేను.
ధ్యానం చ సామవేదోక్తం గోపనీయం సుదుర్లభం | సిద్దైర్మునీంద్రైర్దుష్ప్రాప్యం ధ్రువం సిద్ధప్రదం శుభం || 20
శ్వేతచంపకవర్ణాభాం శతచంద్రసమప్రభాం | వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణ భూషితాం || 21
ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహకారికాం | సహస్రదళపద్మస్థాం స్వస్థాం చ సుమనోహరం || 22
శాంతాం చ శ్రీహరేః కాంతాం తాం భ##జేజ్జగతాం ప్రసూం || 23
ధ్యానేనా Zనేన దేవేంద్రో ధ్యాత్వా లక్ష్మీం మనోహరాం | భక్త్యా సంపూజ్య సత్యై చ చోపచారాంస్తు షోడశ|| 24
స్తుత్వానేన స్తవేనైవ వక్ష్యమాణన వాసవ | నత్వా వరం గృహీత్వాం చ లభిష్యసి చ నిర్వ్సితిం|| 25
స్తవనం శ్రుణు దేవేంద్ర మహాలక్ష్మ్యాః సుఖప్రదం | కథాయామి సుగోప్యం చ త్రిషు లోకేషు దుర్లభం || 26
మహాలక్ష్మియొక్క ధ్యానశ్లోకములు సామవేదమున కనిపించును. ఇవి చాలా రహస్యముగా నుంచతగినవి, సిద్ధులు మునీంద్రులు మొదలగువారికి సహితము లభించనివి. ఈ ధ్యానము శుభకరమైనది . సిద్ధిని కలిగించునది.
తెల్లని చెంపక పుష్ప మువంటి రంగు కలదు, నూరు పూర్ణచంద్రులతో సమానమైన కాంతికలది, పరిశుద్ధమైన వస్త్రమును ధరించునది, రత్నాలంకారములు కలది, చిరునవ్వుతో నున్న ముఖము కలది, భక్తులనెల్లప్పుడు అనుగ్రహించునది, వేయి దళములు కల పద్మముననుండునది, అందమైనది, శాంతస్వభావముకలది, శ్రీహరికి ప్రియురాలు, జగములకు, తల్లియగు లక్ష్మీదేవిని సేవింపవలెను.
దేవేంద్రా! ఈ ధ్యానశ్లోకములతో లక్ష్మీదేవిని భక్తితో ధ్యానించి, షోడశాపచారములతో ఆమెను పూజించి, చెప్పబోవు స్తోత్రముచే ఆమెను స్తుతించి నమస్కరించినచో ఆ దేవియొక్క అనుగ్రహము తప్పక నీవు పొందుదువు.
దేవేంద్ర! సుఖమును కలిగించు మహాలక్ష్మీస్తోత్రమును నీకు చెప్పెదను వినుము. ఇది మిక్కిలి రహస్యమైనది. ముల్లోకములయందు తేలికగా లభించనిది. కావున సావధానముగా వినుము. అని శ్రీహరి దేవేంద్రునితో పలికెను.
నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను.
దేవి త్వాం స్తోతుమిచ్ఛామి న క్షమాః స్తోతుమీశ్వరాః | బుద్ధేరగోచరాం సూక్ష్మాం తేజోరూపాం సనాతనీం |
అనివార్యగుణాఢ్యాం చ కో వా నిర్వక్తుమీశ్వరః || 27
స్వేచ్ఛామయీం నిరాకారాం భక్తానుగ్రహ విగ్రహాం | స్తౌమి వాజ్ఞ్మనసో పారాం కింవాZహం జగదంబికే || 28
పరాం చతుర్ణాం వేదానాం పారబీజం భవార్ణవే | సర్వసస్యాధిదేవీం చ సర్వసామపి సంపదాం || 29
యోగినాం చైవ యోగానాం జ్ఞానానాం జ్ఞానినాం తథా | వేదానాం వై వేదవిదాం జననీం వర్ణయామి కిం || 30
యయా వినా జగత్సర్వమబీజం నిష్పలం ధ్రువం | యయా స్తనంధయానాం చ వినా మాత్రా సుఖంభ##వేత్ || 31
ప్రసీద జగతాం మాతా రక్షాస్మానతికారాన్ | వయం త్వచ్చరణాంభోజే ప్రసన్నాః శరణంగతాః || 32
నమః శక్తిస్వరూపాయై జగన్మాత్రే నమోనమః | జ్ఞానదాయై బుద్ధిదాయై సర్వదాయై నమోనమః || 33
హరిభక్తి ప్రదాయిన్యై ముక్తిదాయై నమో నమః | సర్వజ్ఞాయై సర్వదాయై మహాలక్ష్మై నమోనమః || 34
కుపుత్రాః కుత్రచిత్సంతి న కుత్రాపి కుమాతరః | కుత్ర మాతా పుత్రదోషం తం విహాయ చ గచ్ఛతి || 35
స్తనంధయేభ్య ఇవ మే హే మాతుర్దేహి దర్శనం | కృపాం కురు కృపాసింధో త్వమస్మాన్భక్తవత్సలే || 36
ఓ లక్ష్మీదేవి! నేను నిన్ను స్తుతి చేయవలెనని అనుకొనుచున్నాను. కాని శ్రేష్ఠులు సహితము నిన్ను స్తుతింపలేరు. నీవు బుద్ధికి గోచరముకానిదానవు. సూక్ష్మరూపవు. తేజోరూపిణివి. సనాతనివి. నీ గుణసంపదను ఎంత గొప్పవాడైనను విశ్లేషింపజాలడు. నీవు స్వేచ్ఛామయివి. ఆకారములేనిదానవు. భక్తులననుగ్రహించుటకై శరీరమును ధరించినదానవు. వాక్కులకు మసస్సునకు అతీతమైన నిన్ను నేను ఏమని స్తుతింపగలను. నీవు నాల్గువేదములకు అతీతమైనదానివి. అనగా నాలుగువేదములు సహితము నిన్ను స్తుతింపలేవు. అట్టి నిన్ను స్తుతి చేయుటకు నేనెట్టివాడను. ఈ సంసారసముద్రమును నీవు తరింపజేయగలదానవు. సమస్త సస్యములకు అధిదేవత, సమస్త సంపదలకు దేవతయగు నిన్ను వర్ణింపజాలను. నీవు యోగులనుష్ఠించు యోగములకు, జ్ఞానులయొక్క జ్ఞానములకు, వేదములకు తల్లివి. నీవు లేనిచో ఈ ప్రపంచమంతయు ఉత్పన్నము కాజాలదు. లేక ఉత్పత్తి జ్ఞానులయొక్క జ్ఞానములకు, వేదములకు, తల్లివి. నీవు లేనిచో ఈప్రపంచమంతయు ఉత్పన్నము కాజాలదు. లేక ఉత్పత్తి జరిగనను దానివలన ఫలితమేమియు ఉండదు. నీవు చంటిపిల్లలకు తల్లివలె ఈ ప్రపంచమును సుఖముగానుంచుచున్నావు.
ఓ జగన్మాతా! నీవు మాపై అనుగ్రహముంచుము. అతి భీతిచెందిన మమ్ములను రక్షింపుము మేమందరము నిన్ను శరణుపొందినవారము.
శక్తిస్వరూపయగు నీకు నమస్కారము. జగన్మాతవగు నీకు నమస్కారము. జ్ఞానమునిచ్చు నీకు నమస్కారము, సమస్తకోరికలను ఈడేర్చు నీకు నమస్కారము . శ్రీహరి భక్తిని, ముక్తిని కలిగించే నీకు నమస్కారము. అట్లే సమస్తము తెలిసినదానివి, సమస్తసౌఖ్యములనిచ్చు నీకు నమస్కారము.
పుత్రులు చెడ్డవారు కావచ్చును. కాని ఎచ్చటను తల్లి చెడ్డది కాజాలదు. తన పుత్రులనెల్లప్పుడు ప్రేమతోనే చూచుకొనును. ఏ తల్లికూడ తన పుత్రుడు చెడ్డవాడని అతనిని వదలిపోదు. ఓ తల్లీ! చంటిపిల్లలపై తల్లి ప్రేమను చూపినట్లు మాపై నీ ప్రేమను చూపుము. అందువలన దయాసముద్రురాలవు భక్తులపై ప్రేమగల ఓతల్లీ మాపై దయ కలిగియుండుమని లక్ష్మీస్తోత్రమును తెలిపెను.
ఇత్యేవం కథితం వత్స పద్మాయాశ్చ శుభావహం | సుఖదం మోక్షదం సారం శుభదం సంపదః ప్రదం || 37
ఇదం స్తోత్రం మహాపుణ్యం పూజాకాలే చ యః పఠేత్ | మహాలక్ష్మీర్గృహం తస్య న జహాతి కదాచన || 38
ఉత్యుక్త్యా శ్రీహరిస్తం చ తత్రైవాంతరధీయత | దేవో జగామ క్షీరోదం సురైః సార్థం తదాజ్ఞయా || 39
నారదా! ఈ విధముగా శుభమును కలిగించునది, సుఖమును, మోక్షమును, సంపదలను ఇచ్చు మహాలక్ష్మీ స్తోత్రమును నీకు తెలిపితిని. ఈ స్తోత్రమును పూజాసమయమున ప్రతిదినము చదువుచున్నచో మహాలక్ష్మీ అతని ఇంటిలో ఎప్పుడు ఉండును.
ఈవిధముగా శ్రీహరి దేవేంద్రునితో పలికి అంతర్ధానము చెందెను. ఇంద్రుడు దేవతలందరు శ్రీహరి ఆజ్ఞననుసరించి క్షీరసముద్రమునకు పోయిరి.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే లక్ష్మీస్తవపూజా కవచకథనం నామ ద్వావింశతితమోZధ్యాయః |
శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారదనారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన లక్ష్మీదేవి స్తోత్రము, పూజ, కవచములను
ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.