sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వాదశోzధ్యయ: - నారదజన్మ కథనము శౌనక ఉవాచ - శౌనకుడిట్లనెను - ఋషి వంశ ప్రసంగేన బభూవుర్వివిధాఃకథాః l ఉపాలంభేన ప్రస్తావాత్కౌతుకేన శ్రుతా : మయా ll 1 ప్రజా వా ససృజు: కే వా ఊర్ధ్వరేతాశ్చ కశ్చన l పిత్రా సహ విరోధేన నారదః కిం చకార సః || 2 పితు ః శాపేన పుత్రస్య కిం బభూవ విదోధతః l పితుర్వా పుత్రశాపేన సౌతే తత్కథ్యతాం శుభం ll 3 ఓ సౌతిమహర్షీ ! ఋషి వంశముల గురించి చెప్పు సందర్భమున తెల్సి న వివిధకథలను ఉత్సాహముతో వింటిని . మహర్షులలో ఎవరెవరు సృష్టిక్రమమునకు పక్రమించిరి ? ఎవరు ఊర్ద్వరేతస్కులైరి ? తండ్రితో విరోధము పెట్టుకున్న నారదుడేమి చేసెను . బ్రహ్మ, బ్రహ్మతనయుడైన నారదుడు పరస్పరము శాపములిచ్చుకొని ఎమైనారో ఆకథనంతయు చెప్పుము - సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లు చెప్పెను - హంసో యతిశ్చారణిశ్చ వోఢుఃపంచశిఖస్తథా l అపాంతరతనూశ్చైవ సనకాధ్యాశ్చ శౌనక ll 4 ఏతైర్వనాzన్యే బహవ ః బ్రహ్మపుత్రాశ్చ సంతతం l సాంసారికా : ప్రజావంతో గుర్వాజ్ఞా పరిపాలకా ః|| 5 అపూజ్య ః పుత్రశాపేన స్వయం బ్రహ్మా ప్రజాపతి ః l తేనైవ బ్రహ్మణో మంత్రం నోపాసంతే విపశ్చితః ll 6 నారదో గురుశాపేన గంధర్వశ్చ బభూ వ సః l కథయామి సువిస్తీర్ణం తద్వృత్తాంతం నిశామయ ll 7 ఓ శౌనకమహర్షీ !హంసుడు , యతి, అరణి, వోఢువు, పంచశిఖుడు అపాంతరతముడు, పనక సనందాదులు తప్ప మిగిలిన బ్రహ్మదేవుని పుత్రులందరు తండ్రయొక్క ఆజ్ఞను పరిపాలించుచు, సాంసారిక జీవనము గడుపుచు సంతానమును కన్నారు . బ్రహ్మదేవుడు, తన పుత్రుడైన నారదుని శాపము వలన పూజించుటకు అనర్వుడయ్యెను. అందువలననే విద్వాంసులు బ్రహ్మను పూజించరు . అట్లే నారదుడు తండ్రి శాపమువలన గంధర్హుడాయెను . ఆ గంధర్వుని వృత్తాంతమును విపులముగా చెప్పుదును. శౌనకమహర్షీ! నీవు వినుము. గంధర్వరాజః సర్వేషాం గంధర్వాణం వరో మహన్ l పరమైశ్వర్యసంయుక్త ః పుత్రహీనో హి కర్మణా ll 8 గుర్వాజ్ఞయా పుష్కరే స పరమేణ సమాధినా l తపశ్చకార శంభోశ్చ కృపణో దీనమానస :ll 9 శివస్య కవచంం స్తోత్రం పమంత్ర చ ద్వదశాక్షరం l దదౌ గంధర్వ రాజాయ వసిష్ఠశ్చ కృపానిధిఃll 10 జజాప పరమం మంత్రం దివ్వం వర్షశతం మునే l పుషృరే స నిరాహరః పుత్రదుఃఖేన తాపితః ll 11 విరామే శతవర్షస్య దదర్శ పురతః శివం l భాసయంతం దశ దిశో జ్వలంతం బ్రహ్మతేజసా ll 12 మహత్తేజః స్వరూపం చ భగవంతం సనాతనం lఈషద్ధాసం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం ll 13 తపోరూపం తపోబీజం తపస్యాఫలదం ఫలం | శరణాగత భక్తాయ దాతారం సర్వసంపదాం ll 14 త్రిశూల పట్టిశధరం వృషభస్థం దిగంబరం l శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం చంద్రశెఖరం ll 15 తప్తస్వర్ణప్రభాజుష్టజటాజాలధరం వరం l నీలకంఠం పచ సర్వజ్ఞం నాగయజ్ఞపవీతకం ll 16 సంహార్తారం చ సర్వేషాం కాలం మృత్యుంజయం పరం l గ్రీష్మమధ్యాహ్న మార్తండకోటిసంకాశమీశ్వరం ll 17 తత్వజ్ఞానప్రదం శాంతం ముక్తిదం హరిభక్తిదం l దృష్ట్వా ననామ సహసా గందర్వో దండవద్భువి ll 18 వసిష్ఠదత్తస్తోత్రేణ తుష్టావ పరమేశ్వరం l వరం వృణుష్వేతి శివస్తమువాచ కృపానిథిః ll స యయాచే హరేర్భక్తిం పుత్రం పరమవైష్ణవం ll 19 సమస్త గంధర్వులలో శ్రేష్ఠుడైన ఒక గంధర్వ రాజుకు మిక్కిలి సంపద ఉన్నప్పటికిని, సంతానము లేనందువలన గురువైన వసిష్ఠ మహర్షియొక్క ఆజ్ఞననుసరించి పుష్కర క్షేత్రములో మిక్కిలి దీక్షతో దీనమునస్కుడై పరమేశ్వరుని గురించి తపస్సు చేసెను . దయకల వసిష్ఠమహర్షి శివస్తోత్రమును, కవచమును శివద్వాదశాక్షరమంత్రమును గంధర్వ రాజునకుపదేశించగా అతడు ఆ శివమంత్రమును పుష్కర క్షేత్రమున నూరు దివ్య సంవత్సరములు జపించెను. ఆ నూరు దివ్య సంవత్సరముల తర్వాత గంధర్వ రాజునకు , బ్రహ్మతేజస్సుచే దిశదిశలను ప్రకాశింపచేయుచున్నవాడు. తేజ ః స్వరూపుడు, సనాతుడు, చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖము కలవాడు, భక్తులనను గ్రహించువాడు, తపో రూపుడు తపః కారణుడు, తపస్సు యొక్కఫల ప్రదాత, శరణాగతులైనవారికి, భక్తులకు సర్వసంపదలనిచ్చువాడు, త్రిశూలము పట్టిశమను ఆయుధముల ధరించినవాడు, వృషభవాహనుడు, దిగంబరుడు, శుద్ధమైన స్పటికమువలె తెల్లనివాడు, ముక్కంటి, చంద్రశేఖరుడు, మేలిమిబంగారు కాంతి గల జడలు ధరించినవాడు, నీలకంఠుడు, సర్వజ్ఞుడు, సర్పములే యజ్ఞోపవీతముగా కలవాడు, అందరిని సంహరించువాడు, కాలస్వరూపుడు, మృత్యంజయుడు, గ్రీష్మకాల మధ్యాహ్నమున కనిపించు కోటి సూర్యులతో సమానమైన కాంతికలవాడు. తత్వజ్ఞానమును తెలుపువాడు, పరమశాంతుడు, ముక్తిని ఇచ్చువాడు, హరి భక్తిని ఇచ్చువాడు. భగవంతుడు ఐన శంకరుని చూచి గంధర్వరాజు సాష్టాంగ దండ ప్రణామమాచారించి వసిష్ఠుడుపదేశించిన శివస్తోత్రముతో స్తుతించెను . దయాసాగరుడైన పరమేశ్వరుడు గంధర్వరాజును, వరము వేడుకొమ్మనగా అతడు శ్రీకృష్ణునిపై భక్తిని హరిభక్తిగల కుమారుని వరముగా నిమ్మని వేడుకొనెను. గంధర్వస్య వచ ః శ్రుత్వా చాహసీచ్చంద్రశేఖర ః l ఉవాచ దీనం దీనేశో దీనబంధుః సనాతనం || 20 గంధర్వ రాజు మాటలు విని దీనులను రక్షించువాడు దీనుల బంధువు ఐన పరమేశ్వరుడు నవ్వి దీనుడైన గంధర్వరాజుతో ఇట్లనెను. శ్రీమహాదేవ ఉవాచ - శ్రీమహాదేవు డిట్లనెను- కృతార్థస్త్యం వరాదేకాదన్యచ్చర్విత చర్వణం | గంధర్వరాజ వృణుషే కో వా తృప్తోzతిమంగళే || 21 యస్య భక్తిర్వరౌ వత్స సుదృఢా సర్వమంగళా l స సమర్థః సర్వవిశ్వం పాతుం కర్తుం చ లీలయా ll 22 ఆత్మనః కులకోటం చ శతం మాతామహస్య చ | పురుషాణాం సముద్ధృత్య గోలోకం యాతి నిశ్చితం ll 23 త్రివిధాని చ పాపాని కోటిజన్మార్జితాని చ l నిహత్య పుణ్యభోగం పచ హరిదాస్యం లభేద్ద్రువం ll 24 తావత్పత్నీ సుతస్తావత్తావదైశ్వర్యమీప్సితం l సుఖంక దుఃఖం నృణాం తావద్యావత్కృష్ణే న మానసం ll 25 కృష్ణే మనసి సంజాతే భక్తిఖడ్గో దురత్యయః l నరాణాం కర్మవృక్షాణం మూలచ్ఛేదం కరోత్యహో || 26 భ##వేద్యేషాం సుకృతినాం పుత్రా ః పరమవైష్ణవా ః | కులకోటిం చ తేషాం తే ఉద్దరంత్యేవ లీలయా ll 27 చరితార్థః పుమానేకాద్వరమిచ్చుః వరాదహో l కిం వరేణ ద్వితీయేన పుంసాం తృప్తిర్న మంగళే ll 28 ధనం సంచితమస్మాకం వైష్ణవానాం సుదుర్లభం l శ్రీకృష్ణే భక్తిదాస్యం చ న వయం దాతుముత్సుకా ః ll 29 వరయాన్యం వరం వత్స యత్తే మనసి వాంఛితం l ఇంద్రత్వమమరత్వం వా బ్రహ్మత్వం లభ దుర్లభం ll 30 సర్వసిద్ధిం మహాయోగం జ్ఞానం మృత్యుజయాదికం l సుఖేన సర్వం దాస్యామి హరిదాస్యం త్యజ ధ్రువం ll 31 ఓగంధర్వరాజాl నీవు చాలా కృతార్థుడవు. నీవు కోరుకున్న వరముకంటె తక్కిన వరమేదైనా చర్విత చర్వణమువలె వ్యర్థమౌతుంది . మిక్కిలి కళ్యాణకరమైన వరముల విషయములో ఎవరు తృప్తి పొందుదురు. వత్స ! సర్వమంగళ స్వరూపమైన శ్రీహరి భక్తి దృఢముగా ఎవరికుండునో ఆభక్తుడు సమస్త ప్రపంచమును తేలికగా రక్షించగలడు. అట్లే తనయొక్క పూర్వీకుల శతకోటిని, మాతామహుల శతకోటిని ఉద్దరించి గోలోకమునకు నిశ్చింతగా వెళ్ళును. అట్లే కోటి జన్మలందు మనోవాక్కాయములచే చేసిన పాపములు పుణ్యములు నశింపగా శ్రీహరి దాస్యము తప్పక అతనికి లభించును. మానవులకు శ్రీహరిపై భక్తి ఎంతవరకు కలుగదో అంతవరకే భార్య, పుత్రులు , ఐశ్వర్యము, సుఖము, దుఃఖము ఉండును . శ్రీకృష్ణునిపై భక్తి ఎర్పడగనే ఆ భక్తి ఖడ్గము మానవుల యొక్క కర్మలనే వృక్షములను సమూలముగా ఛేదించును, ఏపుణ్యపురుషులయొక్క పుత్రులు పరమ వైష్ణవులో, వారు తమ తండ్రుల పూర్వీకులను కోటి మందిని తేలికగా ఉద్దరింతురు. విష్ణుభక్తులమగు మాకు మిక్కిలి దుర్లభ##మైన సంచిత ధనము శ్రీ కృష్ణభక్తి. దానిని ఇతరుల కిచ్చుటకు మేమెప్పుడు ఇష్టపడము. అందువలన నీకిష్టమైన ఇంకేదైనా వరమును కోరుకొనుమ. అది ఇంద్రత్వమైనా, దేవత్వమైనా , దుర్లభ##మైన బ్రహ్మత్వమైనా, సర్వసిద్ధియైనా, మహాయోగము, జ్ఞానము, మృత్యుజయము మొదలైన ఏకోరికనైనా లేక అన్నిటినైనా తేలికగా ఇచ్చెదను. కాని హరిదాస్యమనే కోరికను మాత్రము వదలిపెట్టుము. శంకరస్య వచః శ్రుత్వా శుష్కకంఠోష్ఠతాలుకః l ఉవాచ దీనో దీనేశం దాతారం సర్వసంపదాం ll 32 శంకరుని మాటలు విని గంధర్వ రాజు దీనుడై, ఎండిన గొంతు, పెదవులు, నాలుక కలవాడై సర్వసంపదలిచ్చువాడు, దీనుల కాపాడువాడగు పరమేశ్వరునితో ఇట్లనెను. గంధర్వ ఉవాచ - గందర్వరాజు ఇట్లనెను - యత్పక్ష్మచాలనేనైవ బ్రహ్మణ ః పతనం భ##వేత్ l తద్బ్రహ్మత్వం స్వప్నతుల్యం కృష్ణభక్తోన చేచ్ఛతి ll 33 ఇంద్రత్వమమరత్వం వా సిద్ధి యోగాదికం శివ l జ్ఞానం మృత్యుజయాద్యం వా నహి భక్తస్య వాంఛితం ll 34 సాలోక్య సార్పిట సామీప్య సాయుజ్యం శ్రీహరేరపి l తత్ర నిర్వాణ మోక్షం చ నహి వాంఛంతి వైష్ణవా ః ll 35 శశ్వత్తత్ర దృఢా భక్తిర్హరిదాస్యం సుదుర్లభం l స్వప్నే జాగరణ భక్తా వాంఛంత్యేవం వరం వరం ll 36 తద్దాస్యం వైష్ణవసుతం దేహి కల్పతరో వరం ll త్వాం ప్రాప్య లభ##తే తుష్టం వరం సర్వవరోzవరః ll 37 ఓ మహాదేవా ! భగవంతుడైన శ్రీహరియొక్క కనురెప్పల కదలికతోనే బ్రహ్మదేవుడు పతనమైపోవును. అందువలన బ్రహ్మపదవి కలవంటిది. అటువంటి బ్రహ్మపదవి కావలెనని శ్రీకృష్ణభక్తుడు. ఎప్పుడు కోరుకొనడు . అదే విధముగా ఇంద్రత్వము, అమరత్వము, యోగసిద్ధ, జ్ఞానము, మృత్యుజయము మొదలగు వానిని సాలోక్యము మొదలగు మోక్షములను కూడ వైష్ణవులు ఎప్పుడు కోరుకొనరు. శ్రీ కృష్ణునిపైని దృఢభక్తి, హరిదాస్యము ఇవి చాల దుర్లభ##మైనవి కావున హరిభక్తులు స్వప్నావస్థలోను, జాగ్రదవస్థలోను వీటినే వరములుగా కోరుకొందురు. భక్తులకు కల్పవృక్షమువంటి ఓ పరమేశ్వరా నీవు సంతోషపడినచో ఎట్టి అధముడైనను సమస్తవరములు పొందగలుగును కాకవున శ్రీహరిదాస్యమును, శ్రీహరిభక్తుడైన పుత్రుని వరముగా నాకిమ్ము న దాస్యసీదం చేత్ శంబో వరం దుష్కృతినం చ మాం l కృత్వా హి స్వశిరచ్ఛేదం ప్రదాస్యామి హుతాశ##నే ll 38 గంధర్వ వచనం శ్రుత్వా తమువాచ కృపానిథిః భక్తం దీనం చ భ##క్తే శో భక్తానుగ్రహకారకః ll 39 ఓ మహాదేవా ! చెడు పనులు చేయు నాకు ఈవరమును ఇవ్వనిచో, నాతలను తెంచుకొని నిప్పులో పడవేయుదును. అను గంధర్వరాజు మాటలు విని కృపాసముద్రుడు, భక్తులననుగ్రహించు శంకరుడిట్లనెను. శ్రీశంకర ఉవాచ - శ్రీశంకరుడిట్లనెను- హరిభక్తిం హరిదాస్యం పుత్రం పరమ వైష్ణవం l చిరాయుషం చ గుణినం శశ్వత్సుస్థిర ¸°వనం ll 40 జ్ఞానినం సుందరవరం గురుభక్తం జితేంద్రియం lగంధర్వరాజప్రవరం వరేమం లభ మా శుచుః ll 41 ఇత్యుక్త్వా శంకరస్తస్మాజ్జగామ స్వాలయం మునే l గంధర్వరాజస్సతుష్టః ఆజగామ స్వమందిరం ll 42 ప్రపుల్లమానసా ః సర్వే మానవా ః సిద్ధకర్మణ ః నారదస్తస్య భార్యాయాం లేభే జన్మ చ భారతే ll 43 సుషావ పుత్రం సా వృద్ధా పర్వతే గంధమాదనే l గురుర్వసిష్ఠో భగవాన్ నామ చక్రే యథోచితం ll 44 బాలకస్య చ తసై#్యవ మంగళం మంగళే దినే l ఉపశబ్దోzధికార్థశ్చ పూజ్యే చ బర్హణ ః పుమాన్ ll పూజ్యానామధికో బాలస్తేనోపబర్వణాభిదః ll 45 ఓగంధర్వరాజు ! నీకు హరిభక్తి, హరిదాస్యము రెండు కలుగును . అట్లే పరమ వైష్ణవుడు, చిరాయుష్కుడు, సద్గుణవంతుడు, ఎల్లప్పుడు స్థిరముగా ఉండు ¸°వనము కలవాడు, జ్ఞాని, సుందరుడు, గురుభక్తుడు జితేంద్రియుడు ఐన పుత్రుని పొందగలవు. అని శంకరుడు గంధర్వ రాజుతో చెప్పి స్వస్థానమునకు వెళ్ళిపోయెను. అట్లే గంధర్వరాజు సంతోషముతో తన ఇంటికి పోగా అతని భార్యయందు నారదుడు పునర్జన్మనందెను. గంధమాదన పర్వతమున వృద్దురాలైన గందర్వరాజుభార్య శిశువును కనగా వసిష్ఠమహర్షి యథోచితముగా పేరుపెట్టెను. ఉపశబ్దమునకు అధికము అని బర్హణః అనగా పూజ్యుడని అర్థములు కలవు. ఆ శిశువు పూజ్యులలో శ్రేష్ఠుడు కావున ఉపబర్హణుడను పేరు పొందును. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మ ఖండే ద్వాదశోzధ్యాయః ll శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి శౌనక కసంవాదరూపమైన బ్రహ్మఖండమున పన్నెండవ అథ్యాయము సమాస్తము.