sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వావింశతిమోZధ్యాయః - లక్ష్మీ దేవి చరిత్ర నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను. ఇంద్రస్చ గురుణా సార్థం సురైః సంహృష్టమానసః | జగామ శీఘ్రం పద్మాయై తీరం క్షీరపయోనిధేః కవచం చ గళేబధ్వా సద్రత్నగుటికాన్వితం | మనసా స్తవనం దివ్యం స్మారం పునః పునః ||
1 తే సర్వే భక్తియుక్తాశ్చ తుష్టువుః కమలాలయాం | సాశ్రునేత్రాశ్చ దీనాశ్చ భక్తి నమ్రాత్మకంధరాః ||
2 సా తేషాం స్తవనం శ్రుత్వా సద్యః సాక్షాద్బభూవ హ | సహస్రదళపద్మాస్థా శతచంద్రసమప్రభా ||
3 జగద్వ్యాప్తం సుప్రభయా జగన్మాత్రం యయా మునే | తానువాచ జగద్ధాత్రీ హితం సారం యథోZచితం || 4 దేవేంద్రుడు శ్రీహరి మాటలకు సంతసించి తన గురువుతో, తోటి దేవతలతో కలిసి మహాలక్ష్మీదేవి కొరకు క్షీరసముద్రతీరమునకు బయలుదేరెను. శ్రీహరి ఇచ్చిన కవచమును రత్నఘటికయందుంచుకొని తన కంఠమున కట్టుకొని లక్ష్మీదేవిని మాటిమాటికి స్తుతించెను. అట్లే దేవతలందరు భక్తితో తలలువంచుకొని కన్నీళ్ళుకారగా దీనవదనములతో లక్ష్మీదేవిని స్తుతించిరి. ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రమును విన్న లక్ష్మీదేవి నూరుచంద్రులవంటి కాంతికలదై వేయి దళములు కల పద్మములో నుండి వారికి ప్రత్యక్షమాయోను. ఆ దేవి యొక్క కాంతివలన లోకమంతయు నిండిపోయినది. అట్టి లక్ష్మీదేవి దేవతలతో హితవైన మాటలు ఇట్లు పలికినది. శ్రీమహాలక్ష్మీ రువాచ- శ్రీమహాలక్ష్మీ ఇట్లు పలికినది. వత్సా నేచ్ఛామి వో గేహన్గంతుం నైవం క్షమాZధునా | భ్రష్టాన్ దృష్ట్వా బ్రహ్మశాపాద్బిభేమి బ్రహ్మశాపతః || 5 ప్రాణా మే బ్రహ్మాణాః సరేవేశశ్వత్పుత్రాధికాం ప్రియాః | విప్రదత్తం చ యత్కించిదుపజీవ్యం సదైవ చ || 6 విప్రా బ్రువంతు మాం తుష్టా యాస్యామి భవదాజ్ఞయా | నమే పూజాం ధ్రువం కర్తుం క్షమాస్తే చ తపస్వినః || 7 గురుభిర్బ్రాహ్మణౖర్దేవైర్భిక్షుభిర్వైష్ణవైస్తథా | యద్యభాగ్యం భ##వేద్దైవాత్తే శప్తాః సంతి తైస్సదా || 8 నారాయణశ్చ భగవాన్బిభేతి బ్రహ్మశాపతః | సర్వబీజం చ భగవాన్ సర్వేశశ్చ సనాతనః || 9 ఓ దేవతలారా! మీ ఇండ్లకు వచ్చుటకు నాకు ఇప్పుడు ఇష్టములేదు. మీరు బ్రాహ్మణశాపమువలన భ్రష్ఠులైనారు. నేను కూడ బ్రాహ్మణశాపమునకు భయపడుదును. బ్రాహ్మణులు నాకు ప్రాణములవంటివారు. వారు నాకు నా పుత్రులకంటె ప్రియమైన వారు. విప్రులొసగినదానిచే జీవించుట మంచిది. అట్టి బ్రాహ్మణుల యనుమతియున్నప్పుడే సంతోషముగా మీఇంటికి వత్తును.భాగ్యములేని వారు గురువులు, బ్రాహ్మణులు, భిక్షుకులు వైష్ణవులు మొదలగువారిచే శాపమును పొందుదురు. సమస్తలోకకారకుడై, జగన్నాయకుడై, సనాతనుడైన నారాయణుడుకూడ బ్రాహ్మణుల శాపమన్నచో భయపడును. అందువలన ప్రస్తుతము మీ ఇండ్లకు వచ్చుటకు భయపడుచున్నానని పలికెను. ఏతస్మిన్నంతరే బ్రహ్మన్ బ్రహ్మణా హృష్టమానసాః | ఆజగ్ముః సస్మితాః సర్వే జ్వలంతో బ్రహ్మతేజసా || 10 అంగిరశ్చ ప్రచేతాశ్చ క్రతుశ్చ భృగురేవ చ | పులహశ్చ పులస్త్యశ్చ మరీచిశ్చాత్రిరేవచ || 11 సనకశ్చ సనందశ్చ తృతీయశ్చ సనాతనః | సనత్కుమారోభగవాన్ సాక్షాన్నారాయణాత్మకః || 12 కపిలశ్చాసురిశ్చైవ వోఢుః పంచశిఖస్తథా | దుర్వాసాః కశ్యపోZగస్త్యో గౌతమః కణ్వ ఏవచ || 13 ఔర్వః కాత్యాయనశ్చైవ కణాదః పాణినిస్తథా | మార్కండేయా లోమశశ్చ వసిష్ఠో భగవాన్ స్వయం || 14 బ్రహ్మణా వివిధైర్ద్రవ్యైః పూజయామాసురీశ్వరీం | దేవాశ్చారణ్య నైవేద్యైరుపహారేణ భక్తితః || 15 స్తుత్వా మునీంద్రాస్తాం భక్త్యా చక్రురారాధనం ముదా | ఆగచ్ఛ దేవభవనం మర్త్యం చ జగదంబికే || 16 ఆ సమయమున బ్రహ్మతేజో విరాజితులైన బ్రహ్మణులు సంతోషముతో అచ్చటికి వచ్చిరి. వారిలో అంగిరసుడు ప్రచేతసుడు, క్రతులు, భృగువు, పులహుడు, పులస్త్యుడు, మరీచి, అత్రి, సనక, సనంద, సనాతన, సనత్కుమారులు, కపిలుడు, ఆసురి, వోఢువు, పంచశిఖుడు, దుర్వాసుడు, కశ్యపుడు, ఆగస్త్యుడు, గౌతముడు, కణ్వుడు, ఔర్యుడు, కాత్యాయనుడు, కణాదుడు, పాణిని, మార్కండేయుడు, లోమశుడు, వసిష్ఠుడు మొదలైనవారుండిరి. ఆ బ్రాహ్మణులు నానావిధ ద్రవ్యములతో, అడవిలో లభించు వస్తువులను నైవేద్యముగాపెట్టి భక్తి పూర్వకముగా జగజ్జనని పూజించిరి. అట్లే ఆ దేవిని అనేకములైన స్తోత్రములచే ఆరాధించి ఓ జగన్మాతా! నీవు దేవతల ఇండ్లకు, మానవుల ఇండ్లకు స్వేచ్ఛగా పొమ్మని కోరిరి. తేషాం తద్వచనం శ్రుత్వా తానువాచ జగత్ప్రసూః | పరితుష్టా గాముకీ చ నిర్భయా బ్రాహ్మణాజ్ఞయా || 17 బ్రాహ్మణులమాటలను విన్న లక్ష్మీదేవీ నిర్భయముగా ఇతరుల ఇండ్లకు వెళ్ళదలచి సంతోషముతో నిట్లనెను. శ్రీమహాలక్ష్మీరువాచ - మహాలక్ష్మి ఈవిధముగా పలికెను. గృహాన్ యాస్యామి దేవానాం యుష్మాకం చాజ్ఞయా ద్విజాః | యేషాం గేహం న గచ్ఛామి శృణుధ్వం భారతేషు చ || 18 స్థిరా పుణ్యవతాం గేహే సునీతిపథవేదినాం | గృహస్థానాం నృపాణాం వా పుత్రవత్పాలయామి తాన్ || 19 యం యం రుష్టో గురుర్దేవో మాతా తాతశ్చ బాంధవాః | అతిథిః పితృలోకశ్చ యామి తస్య న మందిరం || 20 మిథ్యావాదదీ చ యః శశ్వదనధ్యాయీ చ యః సదా | సత్వహీనశ్చ దుశ్శీలోనగేహం తస్య యామ్యహం || 21 సత్యహీనః స్థాప్యహారీ మిథ్యాసాక్ష్యప్రదాయకః | విశ్వాసఘ్నః కృతఘ్నోయో యామి తస్యన మందిరం || 22 చింతాగ్రస్తో భయగ్రస్తః శత్రుగ్రస్తోZతిపాతకీ | ఋణగ్రస్తోZతికృపణో న గేహం యామి పాపినాం || 23 దీక్షాహీనశ్చ శోకార్తో మందధీః స్త్రీజితః సదా | న యామ్యపి కదాగేహం పుంశ్చల్యాః పతిపుత్రయోః || 24 యో దుర్వాక్కలహావిష్టః కలిః శశ్వద్యదాలయే | స్త్రీప్రధానా గృహే యస్య యామి తస్య న మందిరం || 25 యత్రనాస్తి హరేః పూజా తదీయగుణ కీర్తనం | నోత్సుకస్తత్ప్రశం సాయాం యామి తస్య నమందిరం || 26 కన్యాన్నవేదవిక్నేతా నరఘాతీ చ హింసకః | నరకాగార సదృశం యామి తస్య నమందిరం || 27 మాతరం పితరం భార్యాం గురుపత్నీం గురుం సుతం | అనాథాం భగినీం కన్యామనన్యాశ్ర్యబాంధవాన్ || 28 కార్పణ్యాద్యో ను పుష్ణాతి సంచయం కురుతే సదా - తద్గేహన్నరకాగారాన్యామి తాన్న మునీశ్వరాః || 29 దశనం వసనం యస్య సమలం రూక్షమస్తకం | వికృతౌ గ్రాసహాసౌ చ యామి తస్య న మందిరం || 30 మూత్రం పురీషముత్కృజ్య యస్తత్పశ్యతిమందధీః | యః శేతే స్నిగ్ధపాదేన యామి తస్య న మందిరం || 31 అధౌతపాదశాయీ యో నగ్నః శేతేZతినిద్రతః | సంధ్యాశాయీ దివాశాయీ యామి తస్య న మందిరం || 32 మూర్ధ్ని తైలం పురా దత్వా యోZన్య దంగముపస్పృశేత్ | దదాతి పశ్చాద్గాత్రే వా యామి తస్య న మందిరం || 33 దత్వా తైలం మూర్ద్ని గాత్రే విణ్మూత్రం యః సముత్సృజేత్ | ప్రణమే దాహరేత్పుష్పం యామి తస్య న మందిరం || 34 తృణం చినత్తి నఖరైర్నఖరైర్వలిఖేన్మహీం | గాత్రే పాదే మలం యస్యయామి తస్య న మందిరం || 35 స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం సురస్య చ | యో హరేత్ జ్ఞానశీలశ్చ యామి తస్య న మందిరం || 36 యత్కర్మ దక్షిణాహీనం కురుతే మూఢధీః శఠః || స పాపీ పుణ్యహీనశ్చ యామి తస్య న మందిరం || 37 మంత్రవి ద్యోపజీవీ చ గ్రామయాజీ చికిత్సకః | సూపకృద్దేవలశ్చైవ యామి తస్య న మందిరం || 38 వివాహం ధర్మకార్యం వా యో నిహంతి చ కోపతః | దివా మైథునకారీ యో యామి తస్య న మందిరం || 39 ఓ బ్రాహ్మణులారా! మీ ఆజ్ఞననుసరించి నేను దేవతల ఇండ్లకు పోయెదను. నీతిమార్గమున పోవు పుణ్యవంతుల ఇండ్లలో నేను స్థిరముగా ఉందును. అట్టి గృహస్థులను, రాజులను నా సంతానమును చూచుకొన్నట్లు రక్షింతును. ఇక నేను ప్రవేశింపని స్థలముల గూర్చి మీకు చెప్పెదను. గురువు, దేవత, తల్లిదండ్రులు, బంధువులు, పితృవర్గము, అతిథి కోపించిపోవువారి ఇండ్లకు నేను పోను. అట్లే అబద్ధములు మాట్లడువాడు, వేదాధ్యయనము చేయనివాడు, సత్వహీనుడు, చెడు ప్రవర్తనకలవాడు, తనను నమ్మి తన దగ్గరుంచిన ధనమును అపహరించువాడు, కూటసాక్ష్యములను చెప్పువాడు, విశ్వాసములేనివాడు, కృతఘ్నుడు, పిసినారి, దీక్షలేనివాడు, భార్యాదాసుడు, దుశ్శీలయగు స్త్రీ కలవాడు, ఎల్లప్పుడు కలహము పెట్టుకొనువారు శ్రీహరి పూజ శ్రీహరి కల్యాణగుణములు కీర్తించనివాడు, ఆతని కల్యాణగుణప్రశంసనొల్లనివాడు, కన్యను, అన్నమును, వేదమును అమ్ముకొని బ్రదుకువాడు, సాటి మానవుల చంపువాడు, హింసించువాడు, తల్లిని, తండ్రిని, భార్యను, గురుపత్నిని, గురువును, పుత్రుని అనాథలను, అక్కాచెల్లెండ్లను, కూతురును, ఏగతిలేని బంధువులను పోషించనివాడు, పండ్లు చక్కగా తోముకొననివాడు, మూత్రమును, మలమును విసర్జించిన తరువాత రహస్యాంగమును చూచుకొనువాడు, కాళ్ళు కడుగుకొనక నిద్రపోవువాడు, నగ్నముగా పరుండువాడు, సంధ్యాసమయమున పగటిపూట నిద్రపోవువాడు, నూనెతో తలనంటుకొని తర్వాత మర్మావయవమును ముట్టుకొనువాడు, మర్మావయవమును ముట్టకొన్న తరువాత శరీరమునకు నూనె పూసికొనువాడు, తలంటుకొనిన పిదప మలమూత్రములు విసర్జించువాడు, గోళ్ళతో భూమిపై రాయువాడు, అట్లే గోళ్ళతో తృణమును గిల్లువాడు, శరీరమున మలము కలవాడు, తాను ఇచ్చిన లేక పరులొసగిన దేవబ్రాహ్మణ వృత్తులనపహరించువాడు, దక్షిణలేని పూజాకర్మలు చేయువాడు, మంత్రప్రయోగము చేసి బ్రతుకువాడు, వైద్యముచేసి బ్రతుకువాడు, వంటలువండి బ్రతుకువాడు దేవాలయమున అర్చనాదులు చేసి బ్రదుకువాడు, వివాహమువంటి ధర్మకార్యముల చెడగొట్టువాడు, పగటిపూట మైథునము చేయువాడు మొదలగువారి ఇండ్లకు నేనెప్పుడు పోనని లక్ష్మీదేవి పలికెను. ఇత్యుక్త్వా సా మహాలక్ష్మీరంతర్ధానం జగామ హ || దదౌ దృష్టిం చ దేవానాం గృహే మర్త్యే చ నారద || 40 తాం ప్రణమ్య సురాస్సర్వే మునయశ్చ ముదాన్వితాః | ప్రజగ్ముః స్వాలయం శ్రీఘ్రం శత్రుత్యక్తం సుహృద్యుతం || 41 నేదుర్దుందుభయస్స్వర్గే బభూవుః పుష్పవృష్టయః | ప్రాపుర్దేవాః స్వరాజ్యం చ నిశ్చలాం కమలాం మునే || 42 లక్ష్మీదేవి పైవిధముగా పలికి దేవతలు మానవుల ఇండ్లలో ఉండుటకు సమ్మతించి అంతర్ధానము చెందెను. దేవతలు మునులందరు ఆ లక్ష్మీదేవిని నమస్కరించి తమ తమ నెలవులకేగిరి. అప్పడు దేవతలనిలయమగు స్వర్గమును శత్రువులు పరిత్యజించిరి, దేవతల స్నేహితులచ్చటకు చేరిరి. దుందుభివాద్యము మ్రోగుచుండగా పుష్పవర్షము కురియుచుండగా దేవతలు చాంచల్యములేని లక్ష్మిని పొంది తమ రాజ్యమును(స్వర్గమును) తిరిగి పొందిరి. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే గణపతేర్గజాస్యత్వం కారాణ లక్ష్మీబ్రాహ్మణవిరోధాది లక్ష్మీచరిత్రకథనం నామ త్రయోవింశోZధ్యాయంః | శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారదనారాయణుల సంవాదమున పేర్కొనబడిన గణపతికి గజముఖమేర్పడుటకు కారణమైన లక్ష్మీచరిత్రకల ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.