sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షడ్వింశతితమోZధ్యాయః - జమదగ్ని కార్తవీర్య యుద్ధోపశమన వర్ణనం ƒyLS¸R…Vßá Dªy¿RÁ e ƒyLS¸R…Vß᪫sVV¬s BÈýÁV xmsÖÁZNP ƒ«sV. హరిం స్మరన్ మునిశ్రేష్ఠో వాక్యం శ్రుత్వా చ భూభృతః | హితం సత్యం నీతిసారం ప్రవక్తుముపచక్రమే || 1 మునిశ్రేష్ఠుడగు జమదగ్ని కార్తవీర్యార్జునుడు పలికిన మాటలువిని శ్రీహరిని మనస్సలో స్మరించుకొనుచు, సత్యమైనది, నీతితోకూడుకున్నది హితమైనది అగు మాటను పలుకసాగెను. మునిరువాచ - మునిశ్రేష్ఠుడగు జమదగ్ని ఇట్లు పలికెను. గృహం గచ్ఛ మహాభాగ రక్ష ధర్మం సనాతనం | సర్వసంపత్స్థిరా శశ్వత్స్థితే ధర్మే సునిశ్చితం || 2 త్వాం చ దృష్ట్యా నిరాహారం సమానీయ గృహం నృప | తవ పూజామకరవం యథాశక్తి విధానతః || 3 సాంప్రతం మూర్చితం దృష్ట్వా పాదరేణుం శుభాశిషం | ఆదదాం చేతయాంచక్రే వక్తుమేవోచితం న చ || 4 నృపస్తద్వచనం శ్రుత్వా ప్రణమ్య మునిపుంగవం | రథమన్యం త్వారురోహ యుద్ధం దేహీత్యువాచ హ || 5 ఓ మహారాజా! నీవు ఇంటికిపోయి సనాతనధర్మమును రక్షింపుము. ధర్మము స్థిరముగానున్నచో సమస్త సంపదలు స్థిరముగా ఉండునుకదా! తిండిలేకయున్న నిన్నుచూచి నాఇంటికి తీసికొనివచ్చి నాశక్తికొలది విధివిధానమున నిన్ను గౌరవించితిని. అట్లే ఇప్పుడు రణరంగమున మూర్ఛపడియున్న నీకు శుభాశీస్సులనొసగి మూర్ఛనుండి తేరుకొనునట్లు చేసితిని. ఇంకను నీతో మాటాడుట నాకు తగనిది అని జమదగ్ని పలుకగా అతనిమాటలు విన్న కార్తవీర్యుడు మునికి నమస్కరించి ఇంకొక రథమునెక్కి నాతోయుద్ధము చేయుమని మునితో పలికెను., మునిః కృత్వా చ సన్నాహం తం యోద్ధుముపచక్రమే | రాజా తం యుయుధే తత్ర కోపేనాహత చేతనః || 6 కపిలాదత్త శ##స్త్రేణ న్యస్తశస్త్రం చకార తం | కపిలాదత్తయా శక్త్యా పునర్మూర్ఛామవాప చ || 7 పునశ్చ చేతనాం ప్రాప్య రాజా రాజీవలోచనః | మునినా యుయుధే తత్ర కోపేన పునరేవ చ || 8 ఆగ్నేయం యోజయామాస సమరే నృపపుంగవః | మునిర్నిర్వాపయామాస వారుణన చ లీలయా || 9 నృపేంద్రో వారుణాస్త్రం చ చిక్షేప సమరే మునౌ | వాయువ్యాస్త్రేణ స మునిః శమయామాస లీలయా || 10 వాయవ్యాస్త్రం నృపశ్రేష్ఠ శ్చిక్షేప సమరే తదా | గాంధర్వేణ మునిశ్రేష్ఠం శమయామాస తత్క్షణం || 11 నాగాస్త్రం చ నృపశ్రేష్ఠశ్చిక్షేప రణమూర్ధని, | గారుడేన మునిశ్రేష్ఠో నిజఘాన క్షణాన్ముదా || 12 మహేశ్వరం మహాస్త్రం చ శతసూర్య సమప్రభం | చిక్షేప నృపతిశ్రేష్ఠో ద్యోతయంతం దిశో దశ || 13 వైష్ణవాస్త్రేణ దివ్యేన త్రిలోక వ్ యాపకేన చ | మునిర్నిర్వాపయామాస బహుయత్నేన నారద || 14 మునిర్నాయణాస్త్రం చ చిక్షిపే మంత్రపూర్వకం | శస్త్రం దృష్ట్యా మహరాజో ననామ శరణం య¸° || 15 ఊర్ద్వం చ భ్రమణం కృత్వా క్షణం దీప్త్వా దిశో దశ | ప్రళయాగ్నిసమం తత్ర స్వయమంతరధీయత || 16 జృంభణాస్త్రం చ స మునిశ్చిక్షేప రణమూర్ధని | నిద్రాం ప్రాపత్తేన రాజా సుష్వాప మృతో యథా || 17 దృష్ట్వా నృపం నిద్రితం తం చార్ధచంద్రేణ తత్క్షణం | చిచ్ఛేద సారథిం యానం ధనుర్భాణం మునిస్తదా || 18 ముకుటం చ క్షురప్రేణ చ్ఛత్రం సన్నాహమేవ చ | అస్త్రం తూణం వాజిగణం వివిధేన చ భూభృతః || 19 మునస్తత్సచివాన్యర్వాన్నాగాస్త్రేణౖవ లీలయా | నిబధ్య స్థాపయామాస ప్రహస్య సమరస్థలే || 20 జమదగ్ని మహర్షికూడ యుద్ధసన్నాహము చేసికొని మహారాజుతో యుద్ధము చేయమొదలిడెను. రాజుకూడా కోపముతో యుద్ధము కొనసాగించెను. కపిల ఇచ్చిన శస్త్రముచే ముని మహారాజు చేతిలోని ధనుర్భాణాదికమును హరించి, ఆ కపిలగోవు ఇచ్చిన శక్తితో రాజును మూర్ఛపడగొట్టెను. రాజు మరల తెలివిదెచ్చుకొని కోపము కలవాడై మునితో యుద్ధము చేయసాగెను. కార్తవీర్యుడు ఆగ్నేయాస్త్రమును సంధింపగా ముని దానిని తన వారుణాస్త్రముచేఅవలీలగా శాంతినొందునట్లు చేసెను. మహారాజు వారుణాస్త్రమును ప్రయోగింపగా ముని దానిని వాయువ్యాస్త్రముచే శాంతింపచేసెను. రాజు వాయవ్యాస్త్రమును ప్రయోగించినప్పుడు ముని దానిని గాంధర్వాస్త్రముచే శమింపజేసెను. రాజు నాగాస్త్రమును వేయగా ముని గారుడాస్త్రముచే దానిని నిష్ఫలమొనర్చెను. మహారాజు శతసూర్యులకాంతిగల పాశుపతాస్త్రమును ప్రయోగింపగా జమదగ్ని దివ్యమైన వైష్ణవాస్త్రముచే దానిని వమ్ముచేసెను. మహర్షి నారాయణాస్త్రుమును ప్రయోగించినపుడు రాజు ఆ యస్త్రమునకు నమస్కరించి శరణువేడెను. అప్పుడాయస్త్రము పైకివెళ్ళి క్షణకాలము దశదిశలను ప్రకాశింపజేసి తానుస్వయముగా అంతర్దానము చెందెను. అపుడు ముని జృంభణాస్త్రమును ప్రయోగింపగా రాజు రణరంగమున చనిపోయినట్లు పడిపోయెను. ఆ సమయమున ముని అర్థచంద్రాకారపు శరముచే మహారాజు సారథిని, రథమును, ధునుర్భానణమును పడగొట్టెను. అట్లే తన బాకుచే మహారాజు కిరీటమును, ఛత్రమును పడగొట్టి వివిధ శస్త్రములచే మహారాజుయొక్క తూణీరమును, గజసైన్యమును పడగొట్టి నాగాస్త్రమును ప్రయోగించి మహారాజుయొక్క మంత్రులనందరను కట్టివేసెను. మునిస్తం బోధయామాస సుమంత్రేణౖవ లీలయా | నిబద్ధసర్వామాత్యానాం దర్శయామాస భూమిపం || 21 దర్శయిత్వా నృపం తాంశ్చ మొచయామాస తత్క్షణం | నృపేంద్రమాశిషం కృత్వా గృహం గచ్ఛేత్యువాచ హ || 22 రాజా కోపాత్సముత్థాయ శూలమద్యమ్య యత్నతః | చిక్షేప తం మునిశ్రేష్ఠం మునిః శక్త్యా జఘాన తం || 23 జమదగ్ని ఆ మహారాజును మూర్ఛనుండి లేపి అతని మంత్రులందరు అస్త్రబద్ధులై పడియుంటను అతనికి చూపెను. తరువాత వారినందరను ముక్తులజేసి రాజునాశీర్వదించి అతనిని ఇంటికిపొమ్మని ముని పలికెను. కాని రాజు కోపముతో లేచి శూలమును మునిపైకి విసరివేసెను. ముని యా శూలమును శక్తియను శస్త్రముచే విరిచెను. ఏతస్మిన్నంతరే బ్రహ్మసమాగత్య రణస్థలం | స ప్రీతిం జనయామాస సునీత్యా చ పరస్పరం || 24 మునిర్ననామ బ్రహ్మాణం సంతుష్టశ్చ రణస్థలే | రాజా నత్వా విధిం చర్షిం స్వపురం ప్రయ¸° ముదా || 25 మునిర్య¸° స్వాశ్రమం చ స్వలోకం కమలోద్భవః | ఇత్యేవం కథితం కించిదపరం కథయామి తే || 26 ఆ సమయమున బ్రహ్మదేవుడచ్చటకు వచ్చి ఇద్దరిమధ్య సంధిని కలుగజేసెను. జమదగ్ని అప్పుడు సంతోషముతో బ్రహ్మకు నమస్కరింపగా కార్తవీర్యార్జునుడు బ్రహ్మదేవునకు, మహర్షికి నమస్కరించి తన పట్టణమునకు వెళ్ళిపో యెను. మునియగు జమదగ్ని తన ఆశ్రమమునకు పోగా బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్ళిపోయెను. నారదా! ఈ విధముగా నీకు జమదగ్ని కార్తవీర్యుల యుద్ధవృత్తాంతమునంతయు తెలిపితిని. తరువాతి కథనుకూడా నీకెరింగితునని నారాయణముని పలికెను. ఇ తి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే జమదగ్ని కార్తవీర్య యుద్ధోపశమన వర్ణనం నామ షడ్వింశోZధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంభాషణలో పేర్కొనబడిన జమదగ్ని కార్తవీర్యుల యుద్ధవిరామమను ఇరవై యారవ అధ్యాయము సమాప్తము.