sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్తవింశతిమోZధ్యాయః - జమదగ్నిసంహార పరశురామ ప్రతిజ్ఞ నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను. హరిం స్మృత్వా గృహం గత్వా రాజా విస్మితమానసః | ఆజగామ మహారణ్య జమదగ్న్యాశ్రమం పునః || 1 రథానాం చ చతుర్లక్షం రథినాం దశలక్షకం | అశ్వేంద్రాణాం గజేంద్రాణాం పదాతీనామసంఖ్యయం || 2 రాజేంద్రాణాం సహ స్త్రం చ మహాబలపరాక్రమం | మహాసమృద్ధియుక్తశ్చ త్రైలోక్యం జేతుమీశ్వరః || 3 సర్వతోవేష్టయామాస జమదగ్న్యాశ్రమం ముదా | రథస్థో వర్మయుక్తశ్చ కార్తవీర్యార్జునః స్వయం || 4 సైన్యశ##బ్దైర్వాద్యశ##బ్దై ర్మహాకోలాహలైర్మునే | జమదగ్న్యాశ్రమస్థాశ్చ మూర్ఛా మాపుర్భయేన చ || 5 కుటీం ప్రవిశ్య బలవాన్ గృహీత్వా కపిలాం శుభాం | పురం గంతుం మనశ్చక్రే దుర్బుద్ధిరసదాశ్రయః || 6 సముత్తస్థౌ మునిశ్రేష్ఠో గృహీత్వా సశరం ధనుః | ఏకాకీ ముక్తగాత్రశ్చ ధేనుం నత్వా హరిం స్మరన్ || 7 ఆశ్రమస్థాన్ జనాన్ సర్వాన్ సమాశ్వాస్య చ యత్నతః | ఆజగామ రణస్థానం నిశ్శంకో నృపతేః పురః || 8 నిర్మమే శరజాలం చ సమునిర్మంత్రపూర్వకం | ఆచ్ఛాదయత్ స్వాశ్రమం తైర్మానవం వర్మణా యథా || 9 అపరం శరజాలం చ నిర్మమే మునిపుంగవః | తైరేవ వారయామాస సర్వసైన్యం యథాక్రమం || 10 మునినా శరజాలేన సర్వసైన్యం సమావృతం | తాని సర్వాణి గుప్తాని యథా పత్రాణి పంజరే || 11 కార్తవీర్యుడు ఇంటికివెళ్ళి హరిని మనస్సులో స్మరించుకొని జరిగినదానికి ఆశ్చర్యపడి తిరిగి జమదగ్నియొక్క ఆశ్రమమునకు వచ్చెను. అతనివెంట నాలుగులక్షల రథములు పదిలక్షల రథికులు, అసంఖ్యాకమైన గజదళము, అశ్వదళము, పదాతిదళము, గొప్పబలపరాక్రమములుగల వేయిమంది రాజేంద్రులుండిరి. ఇట్టి గొప్ప సైన్యముతో కార్తవీర్యుడు ముల్లోకములను సహితము జయింపగలిగియుండెను. కార్తవీర్యుడు తనసైన్యమునంతయు జమదగ్ని ఆశ్రమము చుట్టు నిలిపియుంచెను. ఆ మహారాజు కవచమును ధరించియుండెను. ఆతని సైన్యఘోషవలన, ఆతని సైన్యమందలి వాద్యఘోషవలన జమదగ్నియొక్క ఆశ్రమమున నున్నవారందరు మూర్ఛిల్లిరి. అప్పుడతడు జమదగ్నియొక్క ఆశ్రమమును ప్రవేశించి అందున్న కపిలను బలాత్కారముగా తనపట్టణమునకు తీసికొనిపోవ ప్రయత్నించెను. అప్పుడు జమదగ్ని మహర్షి మూర్ఛనుండి తేరుకొని అమ్ములతోనున్న ధనుస్సును తీసికొని కవచము ధరింపకనే ఒంటరిగా యుద్ధమునకు బయలుదేరెను. బయలుదేరుటకు పూర్వము జమదగ్నిమహర్షి కపిలకు నమస్కరించి శ్రీహరిని మనస్సులో స్మరించుకొనుచు ఆశ్రమమునందున్న సమస్తజనులను ఓదార్చి శంకలేక యుద్ధరంగమును చేరుకొనెను. ఆతడు మంత్రపూర్వకమైన బాణములచే తన ఆశ్రమమును కవచము ధరించిన మానవునివలె కప్పిపుచ్చి మరియొక బాణపరంపరచే శత్రువుల సమస్తసైన్యమును కప్పివేసెను. రాజా దృష్ట్యా మునిశ్రేష్ఠమవరుహ్య రథాత్పురః | సార్థం నృపేంద్రైర్భక్త్యా చ ప్రణనామ కృతాంజలిః || 12 నత్వాZ రురోహ యానం స మునేః ప్రాప్య శుభాశిషః | అరుహ్య చ నృపశ్రేష్ఠః స్వయానం హృష్టమానసః || 13 నృపైస్సార్థం నృపశ్రేష్ఠశ్చిక్షేప మునిపుంగవే | అస్త్రం శస్త్రం గదాం శక్తిం జఘాన క్రీడయా మునిః | మునిశ్చిక్షేప దివ్యాస్త్రం చిచ్ఛేదే లీలయా నృపః || 14 శూలం చిక్షేప నృపతిస్తజ్జఘాన తదా మునిః | అపరం శరజాలం చ నిర్మమే మునిపుంగవః || 15 శస్త్రాసై#్త్రర్దుర్నివార్యైశ్చ ఖండం ఖండం చకార సః | నిబద్ధాశ్శరజాలేన న చ శక్తాః పలాయితుం || 16 జృంభణాస్త్రేణ మునినా తేఛ సర్వే విజృంభితాః | హస్త్యశ్య రథ పాదాత సహితం సర్వసైన్యకం || 17 రాజానం నిద్రితం దృష్ట్వా న జఘాన మునీశ్వరః | గృహీత్వా కపిలాం హృష్టో రుదంతీం శోకముర్ఛితాం | బోధయిత్వాపురః కృత్వాస్వాశ్రమం గంతుముద్యతః || 18 కార్తవీర్యుడు జమదగ్ని మహామునిని చూచి రథమునుండి దిగి తనతోటి రాజులతో కలిసి చేతులు జోడించుకొని అతనికి నమస్కరించెను. జమదగ్ని అతనికి ఆశీస్సులనొసగిన పిమ్మట కార్తవీర్యుడు తన రథమమునధిరోహించి తనతోటి రాజులతో కలిసి మునిపైన బాణవర్షమును కరిపించెను. కార్తవీర్యుడు వేసిన అస్త్రశస్త్రములను గదను శక్తిని ముని అవలీలగా ఖండించి రాజుపై దివ్యాస్త్రమును వేయగా నతడుకూడా దానిని అవలీలగా ఖండించెను. రాజు విసరిన శూలమును ముని ఖండించి మరియొక బాణపరంపరచే శత్రుసైన్యమును కప్పివేసెను. అట్లే శత్రువులు ప్రయోగించిన అస్త్రశస్త్రములను తన శస్త్రాస్త్రములచే ముక్కలుముక్కలుగా చేసెను. కార్తవీర్యునియొక్క సైన్యము జమదగ్ని ప్రయోగించిన బాణములను తప్పించుకొని పారిపోవుటకు కూడా వీలులేకపోయెను. ఆ తరువాత మహర్షి ప్రయోగించిన జృంభణాస్త్రమువలన కార్తవీర్యుడు అతని సైన్యము నిద్రలో మునిగినది. కార్తవీర్యుడు నిద్రలోనున్నందువలన జమదగ్ని అతనిని చంపకశోకమున మునికియున్న కపిలను తన ఆశ్రమమునకు తీసికొనిపోవుటకు ప్రయత్నించెను. ఏతస్మిన్నంతరే రాజా చేతనాం ప్రాప్య నారద | నివారయమాస మునిం గృహత్వా సశరం ధనుః || 19 జగామ కపిలా త్రస్తా స్వస్థానం చ రణాంగణాత్ | మునిశ్చ తస్థౌ నిశ్శంకో గృహీత్వా సశరం ధనుః || 20 బ్రహ్మాస్త్రం చ నృపశ్రేష్ఠః చ చిక్షేప మునౌ తదా | బ్రహ్మాస్త్రేణ మునీంద్రస్య సద్యో నిర్వాణతాం గతం || 21 దివ్యాస్త్రేణ మునిశ్రేష్ఠో నృపస్య సశరం ధనుః | రథం చ సారథిం చైవ చిచ్ఛేదే వర్మ దుర్వహం || 22 అథ రాజా మహాకృద్ధో దదర్శ స్వసమీపతః | దత్తేన దత్తాం శక్తిం తామేకపూరుషఘాతినీం || 23 జగ్రాహ సత్వా దత్తం తం స నత్వా శక్తిముల్బణాం | చూర్ణయామాస తత్రైవ శతసూర్య సమప్రభాం || 24 యత్తేజః సర్వదేవానాం తేజో నారాయణస్య చ | శంభోశ్చ బ్రహ్మణశ్చైవ మాయాయాశ్చైవ నారద || 25 తత్రైవావాహయామాస స యోగీ మంత్రపూర్వకం | తేజసా ద్యోతయామాస గగనం చ దిశో దశ || 26 దృష్ట్వా క్షిపంతీం తాం దేవా హాహాకారేణ చుక్రుశుః | ఆకాశస్థాశ్చ సమరం పశ్యంతో దుఃఖితా హృదా || 27 చి క్షేప తాం చూర్ణయిత్వా కార్తవీర్యర్జునః స్వయం | సద్యః పపాత సా శక్తిర్జ్వలంతీ మునివక్షసి || 28 విదార్యోరో మునేః శక్తిర్జగామ హరిసన్నిధిం | దత్తాయ హరిణా దత్తా శస్త్రాస్త్రనిధయే సదా || 29 మూర్ఛాం సంప్రాప్య స మునిఃప్రాణాంస్తత్యాజ తత్‌క్షణం | తేజోంZబరేభ్రమిత్వా చ బ్రహ్మలోకం జగామ హ || 30 యుద్ధే మునిం మృతం దృష్ట్వా రురోద కపిలా ముహుః | హేతాత తాతేZత్యుచ్చార్య గోలోకం సాజగామహ || 31 సర్వం సా కథయామాస గోలోకే కృష్ణమీశ్వరం | రత్నసింహాసనస్థం తం గోపైర్గోపీభిరావృతం || 32 కృష్ణేన బ్రహ్మణా దత్తా బ్రహ్మణా భృగవే పురా | సా ప్రీత్యా పుష్కరే బ్రహ్మాన్ భృగుణా జమదగ్నయే || 33 నత్వా చ కామధేనూనాం సమూహం సా జగామ హ | తదశ్రుబిందునామర్త్యే రత్నసంధోబభూవహ || 34 అథరాజా తం నిహత్య బోధయిత్వా స్వ సైన్యకం | ప్రాయశ్చిత్తం వినిర్వర్త్య జగామ స్వపురం ముదా || 35 ఆసమయమున కార్తవీర్యుడు తెలివికి వచ్చి ధనుర్భాణములను తీసికొని మహర్షిని అడ్డగించగా కామధేనువు భయపడి తానుండిన ప్రదేశమునకు పోయెను. జమదగ్ని మహర్షికూడా నిర్భయముగా ధనుర్బాణములను తీసికొని నిలుచుండెను. అప్పుడు రాజు మునిపై బ్రహ్మాస్త్రమును వేయగా మహర్షి ఆ బ్రహ్మాస్త్రము చేతనే దానిని నివారించెను. పైగా రాజుయొక్క రథమును, సారథిని, కవచమును అన్నిటిని ఛేదించెను. అందువలన రాజు పరమకృద్ధుడై దత్తత్రేయ మహర్షి తనకిచ్చిన ఏకపురుషఘాతినియగు శక్తిని ప్రయోగించెను. ఆశక్తి నూరుగురు సూర్యుల కాంతిగలది. యోగియగు కార్తవీర్యుడు సమస్త దేవతల తేజస్సును, బ్రహ్మ, విష్ణు, శంకరుడు, మాయాదేవియొక్క తేజస్సును మంత్రపూర్వకముగా ఆ శక్తియందు ఆవాహనచేసి మహర్షిపై ప్రయోగించెను. ఆశక్తి ఆకాశమును దశదిశలను ప్రకాశింపజేయుచుండెను. ఆ సమయమున ఆకాశమున నున్న దేవతలు దుఃఖించుచు హాహాకారములుచేయసాగిరి. ఆ శక్తి జ్వలించుచు మహర్షి రొమ్మునకు తగిలి అతని వక్షస్థలమును భేదించుచు హరిసన్నిధికి పోయెను. ఆ శక్తిని శ్రీహరియే శస్త్రాస్త్రవిశారదుడగు దత్తాత్రేయునకిచ్చెను. అందువలన అది తిరిగి శ్రీహరిసన్నిధికి పోయినది. ఆ శక్తి తగిలినందువలన ముని మూర్ఛను పొంది వెంటనే ప్రాణములను వదిలెను అతని ప్రాణములు ఆకాశమున క్షణకాలము తిరిగి బ్రహ్మలోకమునకు పోయినవి. యుద్దరంగమున మహర్షియగు జమదగ్ని చనిపోయిన వృత్తాంతమును తెలిసికొన్న కపిల తండ్రీ!తండ్రీ! యని పిలుచుచు గోలోకమునకుపోయి గోలోకమున గోపీగోపకులతో రత్నసింహాసనముపైనున్న శ్రీకృష్ణునితో జరిగిన విషయమునంతయు వివరించినది. ఆ కామధేనువును శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకివ్వగా, అతడు భృగుమహర్షికిచ్చెను. ఆ భృగుమహర్షి పుష్కరక్షేత్రమున తన పుత్రుడగు జమదగ్ని మహర్షికిచ్చెను. ఆ కామధేనువు గోలోకమందలి కామధేనువులకు నమస్కరించి వాటివద్దకుపోయెను. ఆ కామధేనువుయొక్క కన్నీళ్ళనుండి రత్నసంధుడనువాడు పుట్టగా, కార్తవీర్యుడు అతనినికూడ సంహరించి తన సైన్యమును ఓదార్చి ప్రాయశ్చిత్తమును కూడ చేసికొని తన పట్టణమునకు తిరిగిపోయెను. ప్రాణనాథం మృతం శ్రుత్వా జగామ రేణుకా సతీ | మునిం వక్షసి సంస్థాప్య క్షణం మూర్ఛామవాస సా || 36 తతః సా చేతనాం ప్రాప్య న రురోద పతివ్రతా | ఏహి వత్స భృగో రామరామ రామేత్యువాచ హ || 37 ఆజగామ భృగుస్తూర్ణం క్షణాద్వై పుష్కరాదహో | ననామ మాతరం భక్త్యా మనోయాయీ చ యోగవిత్ || 38 దృష్ట్వా రామో మృతం తాతం శోకార్తాం జననీం సతీం | ఆకర్ణ్య రణవృత్తాంతం ప్రయాంతీం కపిలాం శుచా || 39 విలలాప భృశం తత్ర హేతాత జననీతి చ | చితాం చకార యోగీంద్రశ్చందనైరాజ్యసంయుతాం || 40 రేణుకా రామమాదాయ తూర్ణం కృత్వా స్వవక్షసి | చుచుంబ గండే శిరసి రురోదోచ్చైర్భృశం ముహుః || 41 రామ రామ మహబాహో క్వ యామి త్వాం విహాయ చ | వత్స వత్సేతి కృత్వైవం విలలాప భృశం ముహుః || 42 మత్ర్పాణాధిక హే వత్స మదీయం వచనం శ్రుణు | పిత్రోః శాషక్రియాం కృత్వా యాయా యుద్ధం న పుత్రక || 43 గృహే తిష్ఠ సుఖం వత్స తపస్యాం కురు శాశ్వతీం | సమరం నైవ సుఖదం దారుణౖః క్షత్రియైః సహ || 44 మాతుర్వచన మశ్రుత్వా ప్రతిజ్ఞా తాం చకార హ | త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కరిష్యామి ధ్రువం మహీం || 45 కార్తవీర్యం హనిష్యామి లీలయా క్షత్రియాధమం | పితౄంశ్చ తర్పయిష్యామి క్షత్రియక్షతజైస్తథా || 46 తన భర్త చనిపోయెనను విషయమును విన్న రేణుకాదేవి జమదగ్ని ని తన ఎదపైనుంచుకొని క్షణకాలము మూర్ఛపొందెను. ఆ దుఃఖమున ఓ భార్గవరామా రమ్ము రమ్మని పిలవగా భార్గవరాముడు తక్షణమే పుష్కరక్షేత్రమునుండి మనోవేగముతో అచ్చటకు వచ్చి భక్తితో తల్లికి నమస్కరించెను. భార్గవరాముడు తన తండ్రిచనిపోయిన విషయమును తెలుసుకొని తల్లియొక్క దుఃఖమును చూచి కపిల గోలోకమునకు పోవుచున్న వృత్తాంతమును తెలిసికొని అతిగా ఏడ్చెను. యోగీంద్రుడగు భార్గవరాముడు చందనపు కట్టెలతో, నేతితో తండ్రికి చితిని ఏర్పాటుచేసెను. తల్లియగు రేణుకాదేవి తనపుత్రుడగు రాముని అక్కునకు చేర్చుకొని అతని చెక్కిళ్ళను శిరస్సును ముద్దిడుకొని మాటిమాటికి ఏడ్చుచు ఇట్లు పలికెను. ఓ భార్గవరామ నిన్ను వదలి నేనెక్కిడికి పోయెదను నీవునాయొక్క ప్రాణములకంటె మిన్నయైనవాడవు. నాయనా నీతల్లియగు నామాటలు వినుము. నీవు నీపితరులయొక్క అంత్యక్రియను నిర్వర్తింపుము. యుద్ధమును మాత్రము చేయవద్దు. ఇంటిలోనే ఉండి తపస్సును చేసికొనుచుండుము. క్రూరులైన క్షత్రియులతోడి యుద్ధము సుఖమును కలిగింపదు అని రేణుక ఏడ్చుచు పుత్రునితోననెను. కాని భార్గవరాముడు తల్లిమాటలు వినిపించుకొనక ఈభూమిని ఇరువదియొక్క మార్లు క్షత్రియరహితముగా తప్పక చేయుదునని క్షత్రియాధముడగు కార్తవీర్యుని సంహరింతునని, క్షత్రియుల రక్తముచే నా పితృదేవతలకు తర్పణమును చేయుదునని దృఢమైన ప్రతిజ్ఞచేసెను. ఇత్యుదీర్య పురో మాతు ర్విలలాప ముహుర్ముహుః | హితం తథ్యం నీతిసారం బోధయామాస మాతరం || 47 భార్గవరాముడీవిధముగానని తల్లిముందు వెక్కి వెక్కి ఏడ్చుచు సత్యము, హితవు, నీతిసారమైన మాటలనిట్లు పలుకసాగెను. రామ ఉవాచ - భార్గవరాముడిట్లు పలికెను. పితుః శాసన హంతారం పితుర్వధవిధాయకం | యో నహంతి మహామూఢో రౌరవం సవ్రజేత్ ధ్రువం || 48 అగ్నిదో గరదశ్చైవ శస్త్రసాణార్ధనాపహః | క్షేత్రదారాపహారీ చ పితృబంధువిహింసః || 49 సతతం మందకారీ చ నిందకః కటుజల్పకః | ఏకాదశైతే పాపిష్ఠా వధార్హ వేదసమ్మతాః || 50 ద్విజానాం ద్రవిణాదానం స్ధానాన్నిర్వాసనం సతి | వపనం తాడనం చైవ వధుమాహుర్మనీషిణః || 51 తండ్రియొక్క ఆజ్ఞను తిరస్కరించువానిని, తండ్రిని చంపువానిని, చంపని మహామూఢుడు రౌరవనరకమునకు పోవును. ఇంటికి నిప్పుపెట్టువాడు, విషమును పెట్టువాడు, శస్త్రమునుధరించువాడు, ధనమునపహరించువాడు, భూమిని, భార్యను అపహరించువాడు, పితరులను, బంధువులను హింసించువాడు, జాడ్యముగా ప్రవర్తించువాడు, ఇతరులనిందించువాడు, కటువుగా మాట్లాడువాడు అను పదకొండుమంది పాపులనియు, వారు మరణదండనకు అర్హులనియు వేదము సహితము చెప్పుచున్నది. ఈ సమయమున బ్రాహ్మణులీవధార్హమైన పనిచేసినచో వారిధనమును స్వాధీనముచేసికొనుట, ఊరినుండి బహిష్కరించుట, తలకొరిగించుట, కొట్టుట, అనునవి వధతో సమానమైన శిక్షలని పెద్దలందురు. ఏతస్మిన్నంతరే చాజగామ భృగుః స్వయం | అతిత్రస్తో మనస్వీ చ హృదయేన విదూయతా || 52 దృష్ట్వా తం రేణుకారామౌ వినతౌ సంబభూవతుః | సతావువాచ వేదోక్తం పరలోకహితాయ చ || 53 ఆసమయమున విజ్ఞుడగు భృగుమహర్షి బాధపడుచు అచ్చటకు వచ్చెను. అతనినిచూచి రేణుక, భార్గవరాముడు వినయముతో లేచి నమస్కరించిరి. వారిని చూచి భృగుమహర్షి పరలోకహితమునకై వేదసమ్మమైన మాటలను ఇట్లు పలికెను. భృగురువాచ - భృగుమహర్షి ఇట్లు పలికెను. మద్వంశజాతో జ్ఞానీ త్వం కథం విలపసే సుత | జలబుద్బుదవత్సర్వం సంసారే చ చరాచరం || 54 సత్యసారం సత్యబీజం కృష్ణం చింతయ పుత్రక | యద్గతం తద్గతం వత్స గతం నైవాగమిష్యతి || 55 యద్భవేత్తద్భవత్యేవ భవితా యద్భవిష్యతి | పూర్వార్జితం స్వీయకర్మ ఫలం కేన నివార్యతే || 56 భూతం భవ్యం భవిష్యం చ యత్కృష్ణేన నిరూపితం | నిరూపితం యత్తత్కర్మ కేనవత్స నివార్యతే || 57 మాయాబీజం మాయినాం చ శరీరం పాంచభౌతికం | సంకేతపూర్వకం నామ ప్రాతః స్వప్నసమం సుత || 58 క్షుధానిద్రాదయా శాంతిః క్షమాకాంత్యాదయస్తథా | యాంతి ప్రాణా మనోజ్ఞానం ప్రయాతే పరమాత్మని || 59 బుద్ధిశ్చ శక్తయస్సర్వా రాజేంద్రమివ కింకరాః | సర్వే తమనుగచ్ఛంతి తం కృష్ణం భజ యత్నతః || 60 కేవా కేషాం చ పితరః కేవా కేషాం సుతాః సుత | కర్మభిః ప్రేరితాః సర్వే భవాబ్దౌ దుస్తరే పరం || 61 జ్ఞానినో మా రుదంత్యేవ మా రోదీః పుత్ర సాంప్రతం | రోదనాశ్రుప్రపతానాన్మృతానాం నరకం ధ్రువం || 62 సంకేతాభ్యోచ్చారణన యద్రుదంతి చ బాంధవః | శతవర్షం రుదిత్వా తం ప్రాప్నువంతి న నిశ్చతం | పార్థివాంశం చ పృథివీ గృహ్ణాత్యస్థిత్వచాదికం || 63 తోయాంశం చ తథాతోయం శూన్యాంశం గగనం తథా | వాయ్వంశం చ తథా వాయుః తేజస్తేజోZశకం తథా || 64 సర్వేవిలీనాః సర్వేషు కోవాZయాస్యతి రోదనాత్ | నామశ్రుతియశః కర్మ కథామాత్రావశేషితః || 65 వేదోక్తం చైవ యత్కర్మ కురు తత్పారలోకికం | స చ బంధుః స పుత్రశ్చ పరలోక హితాయ యః || 66 భృగోస్తద్వచనం శ్రుత్వా శోకం తత్యాజ తత్ క్షణం | రేణుకా చ మహాసాధ్వీ తం వక్తుముపచక్రమే || 67 ఓ భార్గవరామా! నీవు నావంశమును పుట్టినవాడవు. జ్ఞానవంతుడవగు నీ విట్లు ఏడ్వవచ్చునా? ఈప్రపంచమున చరాచరప్రాణికోటియంతయు నీటిబుడగవలె క్షణములోనే పుట్టును. క్షణములోనే నశించును. నీవిప్పుడు సత్యరూపుడైన కృష్ణుని మనస్సులో స్మరించుకొనుము. జరిగినదేదియో జరిగిపోయినది. జరిగిన విషయము తిరిగిరాదు. అట్లే జరుగవలసినది తప్పక జరుగును. పూర్వజన్మార్జితమైన తన కర్మఫలితమునెవ్వరు తప్పింపలేరు. భూతభవిష్యద్వర్తమానము లన్నియు శ్రీకృష్ణునివలన నిశ్చయింపబడినవి. అట్లు పరమాత్మచే నిర్ణయింపబడిన వాటిని ఎవ్వరు నివారింపగలరు? మాయకు కారణమైన అశాశ్వతులయొక్క ఈ శరీరము పాంచభౌతికమైనది. ఇది ఒక సంకేతమువంటిది కాని స్థిరమైనదికాదు. ఈ శరీరమునుండి పరమాత్మబయలుదేరగనే ఆకలి, నిద్ర, దయ, శాంతి, ఓర్పు, కాంతి, ప్రాణములు, మనస్సు, జ్ఞానము మొదలగునవన్నియు రాజును అనుచరులు అనుసరించిపోవునట్లు బయలుదేరిపోవును. ఇవన్నియు కృష్ణుననుసరించి శరీరమున ప్రవేశించును. కృష్ణుననుసరించి శరీరమునుండి వెడలిపోవును కావున నీవు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు సేవించుచుండుము. తండ్రి, కొడుకు అనుబంధము ఈ అగాధమైన సంసారసాగరమున కర్మలవల్ల ఏర్పడినది. అందువలన జ్ఞానవంతులు ఎన్నడును మృతిచెందిరనుబాధకు లోనుకారు. బంధువులు మృతునికొరకు ఏడ్చి కన్నీరు కార్చినందువలన ఆ మృతునికి నరకము తప్పక లభించును. బంధువర్గము మృతుని పేరుపెట్టి ఎన్ని సంవత్సరములేడ్చినను అతడు తిరిగిరాడు. మృతునియొక్క పార్థివాంశ##మైన చర్మము, ఎముకలు మొదలగువాటిని భూమిగ్రహించగా, జలాంశమును జలమును, ఆకాశాంశమును ఆకాశము, వాయ్వంశను వాయువు, తేజోZంశమును తేజస్సు గ్రహించును. ఈవిధముగా పంచభూతములయందు విలీనమైన మృతునిగూర్చి దుఃఖించినచో అతడు తిరిగి వచ్చునా ? మృతుని పేరు, కీర్తి, సత్కర్మలు మాత్రము మిగిలిపోవును? అందువలన వేదోక్తమైన పారలౌకిక కర్మను నీరు నిర్వహింపుము. పరలోకమునకు సంబంధించిన కర్మ చేయువాడే బంధువు, పుత్రుడు అని పలికిన భృగుమహర్షిమాటలు విన్న రేణుకాదేవి శోకమును వదలిపెట్టి కుమారునితో ఇట్లనెను. ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారదనారాయణసంవాదే జమదగ్నిసంహార పరశురామ ప్రతిజ్ఞాది వర్ణనం ననామ సప్తవింశోZధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణములో మూడవదైన గణపతిఖండమున నారదనారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన జమదగ్నిమహర్షి సంహారము, పరశురాముని ప్రతిజ్ఞలు కల ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.