sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టవింశతితమోZధ్యాయః - బ్రహ్మలోక గమనే బ్రహ్మోక్తోపాయం రేణుకోవాచ - రేణుకాదేవి ఇట్లు పలికెను. బ్రహ్మన్ననుగమిష్యామి ప్రాణనాథస్య సాంప్రతం | ఋతోశ్చతుర్థదివసే మృతోZయం చాద్యమానదః ||
1 కర్తవ్యా కా వ్యవస్థాత్ర వద వేదవిదాం వర | త్వమాగతో మే సహసా పుణ్యన కతిజన్మనాం ||
2 ఓ జమదగ్నిమహర్షీ! నేను నాభర్తతో సహగమనము చేయుదును. నాభర్త నాఋతుకాలముయొక్క నాల్గవదినమున చనిపోయెను. కావున ఇప్పుడు నేనేమి చేయవలెనో తెలుపుము. నేను ఎన్నో జన్మలనుండి చేసికొన్న పుణ్యమువలన నాకర్తవ్యమును తెలుపుటకు నీవిచ్చటకు వచ్చితివనెను. కావున నాసందేహమును తీర్పుమని ప్రార్థించెను. భృగురువాచ - భృగుమహర్షి ఇట్లు పలికెను. అహో పుణ్యవతోభర్తు రనుగచ్ఛ మహాసతి! చతుర్థదివసం శుద్ధం స్వామినః సర్వకర్మసు ||
3 శుద్ధాభర్తుశ్చతుర్థేZహ్ని నశుద్దా దైవపిత్ర్యయోః | దైవే కర్మణి పిత్ర్యే చ పంచమేZహ్ని విశుధ్యతే ||
4 వ్యాలగ్రాహీ యథావ్యాలం బిలాదుద్దరతే బలాత్ | తద్వత్స్యామిన మదాయ సాధ్వీ స్వర్గం ప్రయాతి చ ||
5 మోదతే స్వామినా తత్ర యావదింద్రాశ్చతుర్దశ | అతఊర్ధ్వం కర్మభోగం భుంక్ష్వ సాధ్వి శుభాశుభం ||
6 స పుత్రో భక్తిదాతా యః సాచ స్త్రీ యాZనుగచ్ఛతి | స బంధుర్దాన దాతా యః స శిష్యో గురుమర్చయేత్ ||
7 సోZభీష్టదేవో యో రక్షేత్స రాజా పాలయేత్ర్పజాః | స చ స్వామీ ప్రియాం ధర్మే మతిం దాతుమిహేశ్వరః ||
8 స గురుర్థర్మదాతా యో హరిభక్తిప్రదాయకః | ఏతే ప్రశంస్యా వేదేషు పురాణషు చ నిశ్చితం ||
9 ఓ పతివ్రతా శిరోమణి పుణ్యము చేసికొన్న నీభర్తను అనుగమింపుము. ఋతుకాలమునుండి నాల్గవదినము భర్తకు సంబంధించిన సమస్త కర్మలయందును పరిశుద్దమైనదే కాని దేవతలకు పితరులకు సంబంధించిన కర్మలయందు నాల్గవదినము ప్రశస్తముకాదు. ఆ కర్మలయందు ఐదవదినమే పరిశుద్దమైనది. పాములవాడు సర్పములను బలవంతముగా పుట్టనుండి పైకితీసినట్లే పతివ్రతయగు స్త్రీ పరలోకగతుడగు తన భర్తను తీసికొని స్వర్గలోకమునకు చేరును. అచ్చట మన్వంతరకాలము తనభర్తతో కలసిసుఖముగానుండును. అటుపిమ్మట శుభాశుభకర్మఫలములననుభవించును. భక్తి కలిగించువాడే పుత్రుడు, భర్తతో సహగమనముచేయునదే స్త్రీ. దానమిచ్చువాడే బంధువు. గురువును గొప్పగా గౌరవించువాడే శిష్యుడు. తన భక్తుని ఎల్లప్పుడు రక్షించువాడే అభీష్టదేవత. తన ప్రజలను చక్కగా రక్షించువాడే మహారాజు. చక్కని ధర్మమును, శ్రీహరిభక్తిని ఉపదేశించువాడే నిజమైన భర్త. ఇట్టివారినే వేదములు, పురాణములు ప్రశంసించుచున్నవి. అని పలికెను. రేణుకోవాచ - రేణుకాదేవి ఇట్లు పలికెను. గంతుం స్వస్వామినా సార్థం కా శక్తా భారతే మునే | కావాZప్యశక్తా నారీషు తన్మే బ్రూహి తపోధన || 10 ఓమహర్షీ! స్త్రీలలో ఎవరు తన భర్తననుగమించి పోగలరు? ఎవరు పోలేరు అను విషయమును విపులముగా తెలుపుమనెను. భృగురువాచ - భృగుమహర్షి రేణుకాదేవితో ఇట్లుపలికెను. బాలాపత్యాశ్చ గర్భిణ్యో హృదృష్ట ఋతువస్తథా | రజస్వలా చ కులటా గలితవ్యాధి సంయుతా || 11 పతిసేవా విహీనా యా హ్యభక్తా కటుభాషిణీ | ఏతా గచ్ఛంతి చేద్దైవాన్న కాంతం ప్రాప్నువంతి తాః || 12 సంస్కృతాగ్నిం పురోదత్వా చితాసు శయితం పతిం | కాంతాస్తమనుగచ్ఛంతి కాంతాశ్చేత్ర్పప్నువంతి తాః || 13 అనుగచ్ఛంతి యాః కాంతం తమేవప్రాప్నువంతి తాః | సార్థం కృత్వా పుణ్యభోగం దివి జన్మని జన్మని || 14 ఇయంతే కథితా సాధ్వి వ్యవస్తా గృహిణాం ధ్రువం | చంటిపిల్లలుగల స్త్రీలు, గర్భిణీస్త్రీలు, ముట్టుకానివారు, రజస్వలయైనస్త్రీ, కులట, మిక్కిలివ్యాధితోబాధపడుచున్నస్త్రీ, పతిసేవ చేయనిది, శ్రీహరిపై భక్తిలేనిది, కటువుగా మాట్లాడు స్త్రీ వీరందరు భర్తతో సహగమనము చేయుటకు తగనివారు. అట్లే మంత్రపూతమైన అగ్నిని ముందుచి చితిపై పండబెట్టిన భర్తతో అనుగమనము చేసిన స్త్రీలు భర్తను ఊర్ధ్వలోకములందు పొందగలుగుదురు. వారు ప్రతిజన్మయందును భర్తతో కలిసి పుణ్యముననుభవింతురు. ఓ మహాస్వాధ్వి! భర్తను అనుగమించు స్త్రీల విషయమిట్లు చెప్పబడినది. తీర్థే జ్ఞానమృతానాం చ వైష్ణవానాం గతిం శ్రుణు || 15 యా సాధ్వీ వైష్ణవం కాంతం యత్రయత్రానుగచ్ఛతి | ప్రయాతి స్వామినా సార్థం వైకుంఠే హరిసన్నిధం || 16 విశేషో నాస్తి భక్తానాం తీర్థే వాZన్యత్ర నారద | మరణన ఫలం తుల్యం ముక్తానాం కృష్ణభావినాం || 17 తయోః పాతోనాస్తి తస్మాన్మహతి ప్రళయం సతి | నారాయణం తం భ##జేత పుమాన్ స్త్రీ కమలాలయాం || 18 తీర్ధే జ్ఞానమృతశ్చాపి వైకుంఠం యాతినిశ్చితం | సభార్యో మోదతే తత్ర యావద్వై బ్రహ్మణాం శతం || 19 ఇత్యుక్త్వా రేణుకాం తత్ర జామదగ్న్యమువాచహ | వేదోక్తం వచనం సర్వం సభృగుః సమయోచితం || 20 ఓ పతివ్రతా ! పుణ్యతీర్థములందు జ్ఞానముతో చనిపోయిన విష్ణుభక్తుల విషయమును నీకు వివరింతను. పతివ్రతయగు స్త్రీ వైష్ణవుడగు భర్తను అనుగమించిపోయినచో ఆమె తనభర్తతో కలిసి వైకుంఠమున శ్రీహరిసన్నిధికిపోవును. శ్రీకృష్ణుని తమ మనస్సులలో ధ్యానించు భక్తులు పుణ్యతీర్థములలో చనిపోయినను, ఇతరత్ర చనిపోయినను భేదమేమియు కనిపించదు. వారికి మహాప్రళయమున సహితము పునర్జన్మ ఉండదు. అందువలన పురుషుడైనను స్త్రీయైను లక్ష్మీదేవిని, నారాయణుని సేవింపుచుండవలెను. పుణ్యతీర్థములందతు జ్ఞానవంతుడై చనిపోయినచో అతడు తనభార్యతో కలిసి శతబ్రహ్మలయొక్క కాలమువరకు వైకుంఠమున తప్పక నివసించును. ఈ విధముగా జమదగ్ని మహర్షి రేణుకతో పలికి భార్గవరామునితో సమయోచితమైన మాటలను ఇట్లు పలికెను. ఏహి వత్స మహాభాగ త్యజ శోకమమంగళం | ఉత్తానం కురు తాతం చ దక్షిణాశిరసం భృగో || 21 వస్త్రయజ్ఞోపవీతం చ నూతనం పరిధాపయ | అనశ్రునయనో భూత్వా సంతిష్ఠన్ దక్షిణాముఖః || 22 అరణీసంభవాగ్నిం చ గృహాణ ప్రీతిపూర్వకం | పృథివ్యాం యాని తీర్థాని సర్వేషాం స్మరణం కురు || 23 గయాదీని చ తీర్థాని యే చ పుణ్యాః శిలోచ్చయాః | కురుక్షేత్రం చ గంగాం చ యమునాం చ సరిద్వరాం || 24 కౌశికీం చంద్రభాగాం చ సర్వపాప ప్రణాశినీం | గండకీమథ కాశీం చ పనసాం తథా || 25 పుష్పభద్రాం చ భద్రాం చ నర్మదాం చ సరస్వతీం | గోదావరీం చ కావేరీం స్వర్ణరేఖాం చ పుష్కరం || 26 రైవతం చ వరాహం చ శ్రీశైలం గంధమాదనం | హిమాలయం చ కైలాసం సుమేరుం రత్నపర్వతం || 27 వారణాసీం ప్రయాగం చ పుణ్యం బృందావనం వనం | హరిద్వారం చ బదరీం స్మారం స్మారం పునః పునః || 28 ఓ పరశురామా! నాదగ్గరకు రమ్ము. అమంగళకరమైన శోకమును వదలిపెట్టుము. దక్షిణదిక్కునకు శిరసుపెట్టియున్న మీతండ్రి శిరస్సును కొద్దిగా లేపుము. అతనికి నూతన వస్త్రమును నూతన యజ్ఞోపవీతమును ధరింపజేయుము. కంటిలో నీళ్ళుపెట్టుకొనక దక్షిణదిక్కునకు అభిముఖడవై నిలబడి అరణిలో పుట్టిన అగ్నిని ధరించి భూమిపైనున్న తీర్థములనన్నిటిని స్మరించుకొనుము. గయ మొదలగు పుణ్యతీర్థములు, పవిత్రమైన పర్వతములు, కురక్షేత్రము, గంగ, యమున, కౌశికి, చంద్రభాగ, గండకీనది, కాశి, పనస, సరయూనది, పుష్పభద్ర, భద్ర, నర్మద, సరస్వతి, గోదావరి, కావేరి, స్వర్ణరేఖ, పుష్కరక్షేత్రము, రైవతము, వరాహక్షేత్రము, శ్రీశైలము, గంధమాదనము, హిమాలయపర్వతము, కైలాసము, సుమేరువు, రత్నపర్వతము, వారణాసి, ప్రయాగ, బృందావనము, హరిద్వారము, బదరి మొదలగు పుణ్యక్షేత్రములను మాటిమాటికి స్మరింపవలయునని పలికెను. చందనాగరు కస్తూరీ సుగంధికుసుమం తథా | ప్రదాయ వాససాచ్ఛాద్య స్థాపయైనం చితోపరి || 29 కర్ణాక్షి నాసికాస్యే త్వం శలాకాం చ హిరణ్మయీం | కృత్వా నిర్మథనం తాత విప్రేభ్యో దేహి సాదరం || 30 సతిలం తామ్రపత్రం చ ధేనుం చ రజతం తథా | సదక్షిణం సువర్ణం చ దత్వాగ్నిం దేహ్యకాతరః || 31 ఓం కృత్వా దుష్కృతంచ కర్మ జానతా వాప్యజానతా | మృత్యుకాలవశం ప్రాప్య నరం పంచత్వమాగతం || 32 ధర్మాధర్మసమాయుక్తం లోభమోహసమావృతం | దహ సర్వాణి గాత్రాణి దివ్యాన్లోకాన్స గచ్ఛతు || 33 ఇమం మంత్రం పఠిత్వా తు తాతం కృత్వా ప్రదక్షిణం | మంత్రేణానేన దేహ్యగ్నిం జనకాయ హరిం స్మరన్ || 34 ఓం అస్మత్కులే జాతోసి త్వదీయో జాయతాం పునః | అసౌ స్వర్గాయ లోకాయ స్వాహేతి వద సాంప్రతం || 35 చందనము, అగరు, కస్తూరి, సువాసనగల పుష్పములను మృతుని శరీరముపైనుంచి నూతనవస్త్రముచే అతనిని కప్పి చితిపైన ఉంచవలెను. అతని కండ్లు, చెవులు, ముక్కురంధ్రములు నోటిలో బంగారుపుల్లతో తిప్పి నూవులతోనున్న రాగిపత్రమును, ఆవును, వెండిని, దక్షిణతో సహ బంగారమును బ్రాహ్మణులకు దానముచేసి భయపడక మృతుని శరీరమునకు నిప్పంటిచవలెను. ఆ సమయమున ఓంకారమును చదివి తెలిసి లేక తెలియక తప్పులు చేసినవాడును, మృత్యుకాలము ననుసరించి చనిపోయినవాడును, ధర్మాధర్మకార్యములు చేసినవాడును, లోభమోహాదిగుణములు కల ఈ చనిపోయిన మానవుని సమస్తావయవములను అగ్ని దహించుగాక యను మంత్రమును చదువుచు 'ఓం అస్మత్కులేజాతోZసి త్వదీయో జాయతాం పునః అసౌస్వర్గాయ లోకాయస్వాహా"(నీవునాకులమున జన్మించితివి. నీకు సంబంధించినవాడు మరల పుట్టునుగాక! నీవు స్వర్గలోకమునకు పొమ్ము) అను మంత్రమును చదవుచు శ్రీహరిని స్మరించుచు చనిపోయిన నీతండ్రి శరీరమునకు నిప్పునంటింపుము. అగ్నిం దేహి శిరః స్థానే హే భృగో భ్రాతృభిస్సహ | తచ్చకార భృగుః సర్వం సగోత్రైరాజ్ఞయా భృగోః || 36 ఓ భార్గవరాముడా!నీ అనుజులతో కలసి శిరఃప్రదేశమున అగ్నిని పెట్టుమని అనగా భృగుమహర్షి ఆజ్ఞననుసరించి తన సగోత్రీకులతో కలసి భార్గవరాముడు తనతండ్రికి అగ్నిసంస్కారమును చేసెను. అథపుత్రం రేణుకా సా కృత్వా తత్ర స్వవక్షసి | ఉవాచ కించిద్వచనం పరిణామ సుఖావహం || 37 అవిరోధౌ భవాబ్దౌ చ సర్వమంగళమంగళం | విరాధో నాశబోజం చ సర్వోపద్రవకారణం || 38 అకర్తవ్యో విరోధో వై దారుణౖః క్షత్రియైః సహ | ప్రతిజ్ఞా చైవ కర్తవ్యా మదీయే వచనే శ్రుతే || 39 ఆలోచ్య బ్రహ్మణా సార్థం భృగుణా దివ్యమంత్రిణా | యథోచితం చ కర్తవ్యం సద్భిరాలోచనం శుభం || 40 ఇత్యుక్త్వా తం పరిత్యజ్య కాంతం కృత్వా స్వవక్షసి | సా సుష్వాప చితాయాం చ పశ్యంతీ తం హరిస్మృతిః || 41 రేణుకాదేవి తన పుత్రుడగు భార్గవరాముని కౌగిలించుకొని ఇట్లు పలికెను. ఈ సంసారసాగరమున ఎవ్వరితోను విరోధము పెట్టుకొనక ఉండినచో అది సమస్తశుభములను కలిగించును. విరోధము పెట్టుకొనినచో అది సమస్తమైన ఉపద్రవములకు కారణముగును. అందువలన నామాటను విని దుర్మార్గులైన క్షత్రియులతో విరోధము పెట్టుకొనుట తగనిది. చక్కని ఆలోచనలు చెప్పు భృగుమహర్షితో, బ్రహ్మదేవునితో సంప్రదించి యథోచితముగ ప్రవర్తింపుము. మంచివారితో ఆలోచించి పనిచేయుట మిక్కలి శుభ##మైనది. అని పలికి పుత్రుని వదలి భర్తను కౌగలించుకొని అతనిననే చూచుచు శ్రీహరిని మనస్సులో స్మరించుకొనుచు చితిపై పరుండెను. వహ్నిం దదౌ చితాయాం చ సరామో భ్రాతృభిః సహ | భ్రాతృభిః పితృశిషై#్యశ్చ సార్థం స విలలాప హ || 42 రామ రామ రామేతి వాక్యముచ్చార్య సా సతీ | పురస్తాజ్జామదగ్న్యస్య భస్మీభూతా బభూవ సా || 43 భర్తుర్నామ సమాకర్ణ్య తత్రాజగ్ముః హరేశ్చరాః | రథస్థాః శ్యామవర్ణాశ్చ సర్వే చారుచతుర్భుజాః || 44 శంఖచక్రగదాపద్మధారిణో వనమాలినః | కిరీటినః కుండలినః పీతకౌశేయవాసనః || 45 రథే కృత్వా రేణుకాం తాం గత్వాతే బ్రహ్మణః పదం | జమదగ్నిం సమాదాయం ప్రజగ్ముః హరిసన్నిధిం || 46 తౌ దంపతీ చ వైకుంఠే తస్థతుర్హరిసన్నిధౌ | కృత్వా దాస్యం హరేః శశ్వత్సర్వమంగళమంగళం || 47 భార్గవరాముడు తన అనుజులతో కలసి చితికి నిప్పంటించి తన తమ్ములతో తండ్రియొక్క శిష్యులతో కలసి దుఃఖించెను. రామరామరామ అనుచు రేణుకాదేవి భార్గవరామునిముందు భస్మమయ్యెను. తమనాయకునిపేరువిన్న శ్రీహరియొక్క భృత్యులు అచ్చటకు వచ్చిరి. వారు నీలాంబుదశ్యాములు, చతుర్భుజములు కలవారు, శంఖము, చక్రము, గద, పద్మము లను ఆయుధములను ధరించియున్నారు. కిరీటము, కుండలములు, పీతాంబరములు దరించి రథములపైయుండిరి. వారు రేణుకను, జమదగ్ని మహర్షిని రథముపై నెక్కించుకొని శ్రీహరిసన్నిధికి తీసికొనిపోయిరి. ఆదంపతులు వైకుంఠమున శ్రీహరి సన్నిధిలో ఆపరమాత్మకు సేవచేయుచుండిరి. అథ రామో బ్రాహ్మణౖశ్చ భృగుణా సహ నారద | పిత్రోః శేషక్రియాం కృత్వా బ్రాహ్మణబ్యో ధనం దదౌ || 48 గో భూ హిరణ్యవాసాంసి దిన్యశయ్యాం మనోరమాం | సువర్ణాధారసహితాం జలమన్నం చ చందనం || 49 రత్నదీపం రౌప్యశైలం సువర్ణాసనముత్తమం | సువర్ణాధారసహితం తాంబూలం చ సువాసితం || 50 ఛత్రం చ పాదుకే చైవ ఫలం మూల్యం మనోహరం | ఫలం మూలాదికం చైవ మిష్టాన్నం చ మనోహరం | బ్రాహ్మణభ్యో ధనం దత్వా బ్రహ్మలోకం జగామ సః || 51 భార్గవరాముడు భృగుమహర్షి, బ్రాహ్మణులతో కలసి తన పితరులకు పితృకార్యమును నిర్వహించి, బ్రాహ్మణులకు గోవులు, భూమి, బంగారము, బట్టలు, అందమైన పరుపును, సువర్ణమును క్రిందపెట్టి జలమును, అన్నమును, చందనమును, రత్నదీపములను, వెండివస్తువులను, బంగారపు ఆసనము సువర్ణాధారముగ మంచివాసనగల తాంబూలమును, ఛత్రిని, పాదుకలను, ఫలములను, పుష్పమాలలను ఇంకను ధనమును దానము చేసి బ్రహ్మలోకమునకు పోయెను. దదర్శ బ్రహ్మలోకం స శాతకుంభ వినిర్మితం | స్వర్ణప్రాకార సంయుక్తం స్వర్ణంభైర్విభూషితం || 52 దదర్శ తత్ర బ్రహ్మాణం జ్వలంతం బ్రహ్మతేజసా | రత్నసింహాసనస్థం చ రత్నభూషణ భూషితం || 53 సిద్దైస్తపశ్చాంద్రాయణౖః ఋషీంద్రైః పరివేష్టితం | విద్యాధరీణాం నృత్యం చ పశ్యంతం సస్మితం ముదా || 54 సంగీతముపశృణ్వంతం గీయమానం చ గాయకైః | చందనాగరు కస్తూరీ కుంకుమేన విరాజితం || 55 తపసాం ఫళదాతారం దాతారం సర్వసంపదాం | ధాతారం సర్వజగతాం కర్తారం చేశ్వరం పరం || 56 పరిపూర్ణతమం బ్రహ్మ జపంతం కృష్ణమీశ్వరం | గహ్యయోగం ప్రవోచంతం పృచ్ఛంతం శిష్యమండలం || 57 దృష్ట్వా తమవ్యయం భక్త్యా ప్రణనామ భృగుః పరః | ఉచ్చైశ్చ రోదనం కృత్వా స్వవృత్తాంతమువాచ హ || 58 బ్రహ్మలోకమున భవనములన్నియు బంగారముచే నిర్మింపబడినవి. ఆలోకముయొక్క కోటగోడలు, స్తంభములన్నియు బంగారముచేతనే నిర్మింపబడినవి. అట్టి బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు బ్రహ్మతేజస్సుచే ప్రకాశించచుండేను. అతడు రత్నాలంకారములచే అలంకృతుడై రత్నసింహాసనమున కూర్చొనియుండెను. అతనిని సమస్తసిద్దులు, తపస్సులు, చాంద్రాయణాది వ్రతములు మునీంద్రులు పరివేష్టించియుండిరి. అతని సభలో గంధర్వులు గానము చేయుచుండగా అతడు విద్యాధర స్త్రీల యొక్క నృత్యమును దర్శించుచుండెను. ఆ బ్రహ్మదేవుడు చందనము అగరు, కస్తూరి, కుంకుమ మొదలగు సుగంధద్రవ్యములను అలంకరించుకొనియుండెను. అతడు సమస్త తపోఫలములనొసగువాడు, సమస్త సంపదలనిచ్చునాడు. సమస్త జగత్ సృష్టిచేయువాడు, పరమేశ్వరుడు, ఐనను పరబ్రహ్మస్వరూపుడగు శ్రీకృష్ణమంత్రమును ఎల్లప్పుడు జపించుచు తన శిష్యులకు అతిరహస్యమైన యోగమునుగుర్చిచెప్పుచు వారి శంకలకు సమాధానము లిచ్చుచుండెను. అట్టి బ్రహ్మదేవుని పరశురాముడు చూచి బిగ్గరగా నేడ్చుచు తన వృత్తాంతమునంతయు నివేదించెను. భృగురువాచ - భృగువంశమున పుట్టిన పరశురాముడిట్లనెను- బ్రహ్మంస్త్వద్వంశజాతోZహం జమదగ్ని సుతో విధే | పితామహస్త్యమస్మాకం సర్వజ్ఞం కథయామి కిం || 59 మృగయాయాగతం భూపం పితా మే చోపవాసితం | పారణాంకారయామాస కపిలాదత్త వస్తునా || 60 స రాజా కపిలాలోభాత్కార్తవీర్యార్జునః స్వయం | ఘాతయామాస మత్తాతమిత్యుక్త్యోచ్చై రురోద సః || 61 నిరుధ్య బాష్పం స పునరువాచ కరుణానిధిః | మాతా మేZనుగతా సాధ్వీ మాం విహాయ జగద్గురో || 62 అధునాహమనాథశ్చ త్వం మే మాతా పితా గురుః | కర్తా పాలయితా దాతా పాహి మాం శరణాగతం || 63 ఆగతోZహం తవ సభాం ప్రమాతుర్మాతరాజ్ఞయా | ఉపాయేన జగన్నాథ మద్వైరిహననం కురు || 64 ఓ బ్రహ్మదేవుడా! నేను నీవంశమునకు చెందినవాడను. జమదగ్ని మహర్షి పుత్రుడనగు పరశురాముడను. నీవు నాకు పితామహుడవు. సమస్తము తెలిసిన నీకు ప్రత్యేకముగా ఏమి చెప్పవలెను. ఐనను నా తండ్రియగు జమదగ్ని మహర్షి వేటకై వచ్చి తిండి తిప్పలు లేకయున్న కార్తవీర్యునకు కపిలయొక్క అనుగ్రహమువలన లభించిన వస్తువులతో అతనికి భోజనము పెట్టెను. కాని కార్తవీర్యుడు కామధేనువున కాశపడి నాతండ్రిని చంపెనని చెప్పుచు వెక్కి వెక్కి ఏడ్చెను. పరశురాముడు తన కన్నీళ్ళను బలవంతంగా ఆపుకొని తిరిగి ఇట్లు పలికెను. ఓజగద్గురూ! నా తల్లికూడ నన్ను వదలిపెట్టి నా తండ్రిని అనుగమించిపోయినది. అందువలన ఇప్పుడు నేను అనాథుడనైతిని. నీవే నాకు తల్లివి, తండ్రివి, గురువు, కర్తవు, రక్షకుడవు అన్నియు నీవే కావున నిన్ను శరణు పొందిన నన్ను రక్షింపుము. నేనిచ్చటకు నాతల్లియొక్క ఆజ్ఞననుసరించి వచ్చితిని కావున నా శత్రువులను చంపు ఉపాయమును నాకు బోధింపుమనెను. స చ రాజా స చ ధర్మిష్టః స దయాలుర్యశస్కరః | స పూజ్యః సస్థిరశ్రీశ్చ యో దీనం పరిపాలయేత్ || 65 ధనిదీనౌ సమం దృష్ట్యా యః ప్రజాం న చ పాలయేత్ | తద్దేహాద్యాతి రుష్టాశ్రీః సభ##వేద్భ్రష్ట రాజ్యకః || 66 శ్రుత్వా విప్రవటోర్వాక్యం కరుణాసాగరో విధిః | దత్వా శుభాశిషం తసై#్మ వాసయామాస వక్షసి || 67 శ్రుత్వా భృగోః ప్రతిజ్ఞాం చ విస్మితశ్చతురాననః | అతీవ దుష్కరాం ఘోరాం బహుజీవవిఘాతినీం || 68 కర్మణా తద్భవేత్సర్వమితి కృత్వా తు మానసే | ఉవాచ జామదగ్న్యం తం పరిణామం సుఖావహం || 69 ధర్మము నాచరించువాడు, దయగలవాడు, కీర్తిమంతుడగువాడు మాత్రమే రాజన తగును. దీనులపరిపాలించురాజు మాత్రమే గౌరవింపదగినవాడు. ధనవంతులను, దీనులను సమానముగా పరిపాలింపకున్నచో ఆ రాజుయొక్క రాజ్యము నశించును. లక్ష్మీదేవి కూడా అతనిని వదలి వెళ్ళును. బ్రహ్మణవటువగు పరశురాముని మాటలు విన్న బ్రహ్మదేవుడు దయాసముద్రుడై అతనికి ఆశీస్సులనొసగి, కౌగలించుకొనెను. పరశురాముడు చేసి ఘోర ప్రతిజ్ఞను విని బ్రహ్మదేవుడు కూడ ఆశ్చర్యపోయి, ఆ ప్రతిజ్ఞ మహాభయంకరమైనదని, దానివలన చాలామంది చనిపోవుదురని భావించి సమస్తము కర్మ ననుసరించి పోవునని తలచి, పరశురామునితో హితము నిట్లు పలికెను. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను. ప్రతిజ్ఞా దుస్కరా వత్స బహుజీవ విఘాతినీ | సృష్టిరేషా భగవతః సంభ##వే దీశ్వరేచ్ఛయా || 70 సృష్టిః సృష్టా మయా పుత్ర క్లేశేనైశ్వరాజ్ఞయా | సృష్టిలుప్తౌ ప్రతిజ్ఞాతే దారుణాZకరుణా పరా || 71 త్రిః సప్త కృత్వో నిర్భూపాం కర్తుమిచ్ఛసి మేదినీం | ఏక క్షత్రియ దోషేణ తజ్ఞాతిం హంతుమిచ్చసి || 72 బ్రహ్మక్షత్రియ విట్చూద్రైర్నిత్యా సృష్టిశ్చతుర్విదైః | ఆవిర్భూతా తిరోభూతా హరేరేవ పునః పునః || 73 అన్యథా త్వత్ర్పతిజ్ఞా చ భవితా ప్రాక్తనేన తే | బహ్వాయాసేన తే కార్యసిద్దిర్బవితు మర్హతి || 74 శివలోకం గచ్ఛ వత్స శంకరం శరణం వ్రజ | పృథివ్యాం బహవో భూపాః సంతి శంకరకింకరాః || 75 వినాజ్ఞయా మహేశస్య కోవా తాన్ హంతు మీశ్వరః | బిభ్రతః కవచం దివ్యం శ##క్తేర్యెంశకరస్య చ || 76 ఉపాయం కురు యత్నేన జయబీజం శుభావహం | ఉపాయతః సమారబ్దా సర్వే సిద్దంత్యుపక్రమాః || 77 శ్రీకృష్ణ మంత్ర కవచ గ్రహణం శంకరాత్కురు | దుర్లభం వైష్ణవం తేజః శైవం శాక్తం విజేష్యతి || 78 గురుస్తే జగతాం నాథః శివో జన్మ జన్మని | మంత్రో మత్తో న యుక్తస్తే యో యుక్తస్సభ##వేద్విధిః || 79 కర్మణా లభ్యతే మంత్రః కర్మణా లభ్యతే గురుః | స్వయమేవోపతిష్ఠంతే యే యేషాం తేషు తే ధ్రువం || 80 త్రైలోక్య విజయం నామ గృహీత్వా కవచం వరం | త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కరిష్యసి మహీం భృగో || 81 దివ్యం పాశుపతం తుభ్యం దాతా దాస్యతి శంకరః | తేన దత్తేన మంత్రేణ క్షత్ర సంఘం విజేష్యసి || 82 నాయనా!నీవు చేసిన ప్రతిజ్ఞవలన అధికజీవులు నశించును. అట్లే నీ ప్రతిజ్ఞ చాలా కష్టమైనది. ఈసృష్టిని నేను మిక్కిలి కష్టపడి పరమాత్మ ఆజ్ఞననుసరించి నిర్మించితిని. ఈ సృష్టిని నాశనము చేయు నీ ప్రతిజ్ఞ మిక్కిలి భయంకరమైనది. దయలేనిది. నీవు భూమియందు రాజులు లేకుండ ఇరువదియొక్క మార్లు తిరిగి విఃక్షత్రియముగా చేయదలచితివి. ఒక క్షత్రియుడు చేసిన తప్పువలన నీవు ఆజాతినంతయు నశింపచేయదలచుచున్నావు. ఈ సృష్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను నాల్గుభేదములచే నిండియున్నది. ఆ శ్రీహరి సృష్టి కొన్ని నాళ్ళు కనిపించక మరికొన్ని నాళ్ళు కనిపించుచుండును. ఇతరుల సహాయము వల్ల నీ ప్రతిజ్ఞ నెరవేరదు. అది మిక్కిలి యాయాసముచే మాత్రమే సిద్ధించును. అందువలన నీవు శివలోకమునకు వెళ్ళి శంకరుని శరణువేడుము. ఈ భూమిపైనున్న రాజులలో అనేకులు శివుని అనుచరులే. అతని అనుగ్రహము లేనిచో ఎవ్వరును వారిని సంహరింపలేరు. దుర్గ, శంకరులయొక్క కవచమును ధరించినవారికి శంకరుని అనుగ్రహము కలుగును. అందువలన నీ జయమునకు కారణమగు ఉపాయమును యత్నముతో నిర్వర్తింపుము. ఉపాయమువలననే సమస్త కార్యములు సిద్దించుచున్నవి. అందువలన నీవు శంకరుని అనుగ్రహము వలన శ్రీకృష్ణమంత్రమును కవచమును స్వీకరింపుము. దుర్లభ##మైన వైష్టవతేజస్సును మించిన ఏ తేజస్సు ఈభూమిపై కనిపించదు. నీకు జగన్నాథుడైన పరమశివుడు ప్రతిజన్మయందును గురువుగా నున్నాడు. నీవు అతనినుండే శ్రీకృష్ణమంత్రము పొందుట మంచిది. నానుండి నీవు కృష్ణమంత్రమును పొందుటతగనిది. కర్మననుసరించియే మంత్రము, గురువు అనువారు లభింతురు. నీవు త్రైలోక్యవిజయమను శ్రీకృష్ణకవచమును శంకరుని నుండి ఉపదేశముగా పొంది ఈభూమిపై రాజులు లేకుండ ఇరువది యొక్క మార్లు తిరుగుదువు. ఆ శంకరుడు అనుగ్రహించి నీకు పాశుపత మంత్రమును కూడ ఇవ్వవచ్చును. ఆ మంత్రముయొక్క ప్రభావమువలన నీవు క్షత్రియులనందరను జయింతువని చెప్పెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే భృగోః బ్రహ్మలోక గమనే బ్రహ్మోక్తోపాయ వర్ణనం నామ అష్టావింశోZధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన పరశురాముని బ్రహ్మలోక గమనము, బ్రహ్మదేవుడు చెప్పిన ఉపాయము గల ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.