sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోవత్రింశతితమోZధ్యాయః - పరశురామస్య కైలాసగమనం నారాయణ ఉవాచ - నారాయణముని ఇట్లు పలికెను- బ్రహ్మణో వచనం శ్రుత్వా ప్రణమ్య చ జగద్గురుం | స్ఫీతస్తస్మాద్వరం ప్రాప్య శివలోకం జగామ సః ||
1 లశ్రయోజనమూర్ధ్వం చ బ్రహ్మలోకాద్విలక్షణం | అనిర్వాచ్య సుశోభాఢ్యం వాయ్వాధారం మనోహరం ||
2 వైకుంఠం దక్షిణ యస్య గౌరీలోకశ్చ వామతః | యదధో ధ్రువలోకశ్చ సర్వలోకాత్పరః స్మృతః ||
3 తేషామూర్ధ్వం చ గోలోకః పంచాశత్కోటి యోజనః | అత ఊర్ధ్వం న లోకశ్చ సర్వోపరి చ స స్మృతః ||
4 మనోయాయీ సయోగింద్రః శివలోకం దదర్శ హ | ఉపమానోపమేయాభ్యాం రహితం మహదద్భుతం ||
5 యోగీంద్రాణాం వరేణ్యౖశ్చ సిద్ధవిద్యావిశారదైః | కోటి కల్పతపఃపూతైః పుణ్యవద్భిర్నిషేవితం || 6 వేష్టితం కల్పవృక్షాణాం సమూహైర్వాంఛితప్రదైః | సమూహైః కామధేనూనాం అసంఖ్యానాం విరాజితం || 7 పారిజాతతరూణఆం చ వనరాజి విరాజితం | పుష్పోద్యానాయుతైర్యుక్తం సదాచాతిసుశోభితం || 8 మణీంద్ర సార రచితైః శోభితైర్మణి వేదిభిః | రాజమార్గ శ##తైర్దివ్యైః సర్వతః పరిభూషితం || 9 మణీంద్ర సార నిర్మాణ శతకోటి గృహైర్యుతం | నానా చిత్ర విచిత్రాడ్యైర్మణీంద్ర కలశోజ్వలం || 10 తన్మధ్యదేశే రమ్యే చ దదర్శ శంకరాలయం | మణీంద్రసార రచితప్రాకారం సుమనోహరం || 11 బ్రహ్మదేవుని మాటలు విని పరశురాముడు అతనికి నమస్కరించి అతనిచే వరమును బడసి శివలోకమునకు పోయెను. ఆ శివలోకము బ్రహ్మలోకమున కంటె లక్షయోజనముల ఎత్తున నున్నది. అది బ్రహ్మలోకమున కంటె విలక్షణమైనది. మంచి శోభకలిగి వాయువే ఆధారముగా నున్నది. ఆలోకమునకు కుడివైపు వైకుంఠము ఎడమవైపు గౌరీలోకమున్నది. దానికి క్రింద సమస్త లోకములపై భాగమున నున్న ధ్రువలోకమున్నది. వైకుంఠము శివలోకము గౌరీలోకముల కంటె పైభాగమున యాభైకోట్ల యోజనముల వైశాల్యముగల గోలోకము కలదు. ఆలోకముపైన ఏలోకము లేదు. అందువలన ఆ లోకము లోకములన్నిటిపైన నున్నట్లు పెద్దలు చెప్పుదురు. యోగీంద్రుడైన పరశురాముడు మనోవేగముతో శివలోకమునకు పోయెను. ఆ లోకమును పోలిన లోకమేదియు ప్రపంచమున లేదు. అచ్చట పరమయోగివరేణ్యులు సిద్ధవిద్యావిశారదులు, కోటి కల్పములనుండి చేయుచున్న తపస్సువలన పరమ పవిత్రులైనవారు, పరమ పుణ్యవంతులు కలరు. అచ్చట కోరికలన్నిటిని తీర్చు కల్పవృక్షములనేకమున్నవి. అట్లే అనేక కామధేనువులు, పారిజాతవృక్షములున్న వనములు, ఇంకను అనేక ఉద్యానవనములు కలవు. అట్లే అనేక రాజమార్గములు కలవు. అచ్చట బాటసారులు విశ్రమించుటకై అక్కడక్కడ మణులచే నిర్మింపబడిన అరుగులున్నవి. అచ్చటి ఇండ్లన్నియు మణులచేతనే నిర్మింపబడినవి. ఆ ఇండ్లపైన చిత్ర విచిత్రములైన కలశములున్నవి. అట్టి కైలాసము యొక్క మధ్య మణిరచితమైన కోటగోడలుగల అందమైన శంకరాలయమున్నది. అత్యూర్థ్యమంబరస్పర్శీ క్షీరనీరనిభం పరం | షోడశద్వార సంయుక్తం శోభితం శతమందిరైః || 12 అమూల్య రత్నరచితై రత్న సోపాన భూషితైః | రత్నస్తంభకపాటైశ్చ హీరకేణ పరిష్కృతైః || 13 మాణిక్యజాలామాలాభిః సద్రత్న కలశోజ్వలైః | నానా విచిత్ర చిత్రేణ చిత్రితైః సుమనోహరైః || 14 ఆలయస్య పురస్తత్ర సింహద్వారం దదర్శ సః | రత్నేంద్రసారఖచిత కపాటైశ్చ విరాజితైః || 15 శోభితం వేదికాభిశ్చ బాహ్యాంభ్యంతరతః సదా | రచితాభిః పద్మరాగైర్మహా మరకతైర్గృహం || 16 నానా ప్రకార చిత్రేణ చిత్రతం సుమనోహరం | శంకరుని నివాసము చాలా ఎత్తుగా ఆకాశమునంటుకొనుచున్నట్లున్నది. అందు పదునారు ప్రధాన ద్వారములు కలవు. నూరు గదులున్నవి. అది రత్నసోపానములతో, రత్నస్తంభములతో, రత్నద్వారములచే అలంకృతము, మాణిక్యముల మాలతో, మంచిరత్నములు గల కలశములతో, అందమైన చిత్రములతో అలంకరింపబడినది. ఆ ఆలయము ముందున్న సింహద్వారమున మంచి రత్నములున్నవి. ఆ ఇంటిముందు, లోపలను పద్మరాగములు, మరకతమణులతోనున్న వేదికలు కలవు. ఈవిధముగా శంకరుడుండు గృహము చాలా అందముగా నుండెను. కరాళ రూపావద్రాక్షీత్ ద్వారపాలౌ భయంకరౌ || 17 మహాకరాళదంతాస్యౌ విరక్తే రక్తలోచనౌ | దగ్ధశైలప్రతీకాశౌ మహబలపరాక్రమౌ || 18 విభూతి భూషితాంగౌచ వ్యాఘ్ర చర్మాంబరౌ వరౌ | పింగళాక్షౌ విశాలాక్షౌ జటిలౌ చ త్రిలోనౌ || 19 త్రిశూల పట్టిశధరౌ జ్వలంతౌ బ్రహ్మతేజసా | తౌ దృష్ట్వా మనసా భీతః త్రస్తః కించిదువాచ హ || 20 శంకరుని ఇంటిముందు మహాభయంకరులు, భయంకరమైన ముఖము పండ్లు కలవారు, ఎఱ్ఱని కండ్లు కలవారు, కాలిపోయిన పర్వతమువలె నల్లనివారు, మహాబలపరాక్రమములు కలవారు, విభూతిచే అలంకరింపబడిన అవయవములు కలవారు, పులితోలును ధరించినవారు, విశాలమైన కండ్లు కలవారు, జడలు దఱించినవారు, మూడు కన్నులు కలవారు, త్రిశూలము, పట్టిశమను ఆయుధములను దఱించినవారు బ్రహ్మతేజో విరాజితులైన ద్వార పాలకులుండిరి. భార్గవరాముడు ఆ ద్వారపాలకులను చూచి మనస్సులో భయపడి ఇట్లు పలికెను. వినయోన వినీతశ్చ దుర్వినీతౌ రమహాబలౌ | ఆత్మనః సర్వవృత్తా%ాంతం కథయామాస తత్పురః || 21 విప్రస్య వచనం శ్రుత్వా కృపాయుక్తౌ బభూవతుః | గృహీత్వాజ్ఞాం చరద్వారా శంకరస్య రమహాత్మనః || 22 ప్రవేష్టుమాజ్ఞాం దదుతురీశ్వరానుచరౌ చరౌ | భృగుస్తదాజ్ఞామాదాయ ప్రవివేశ హరిం స్మరన్ || 23 మహాబలుడు పరాక్రమవంతులు, అధిక గర్వము కలవారగు ద్వారపాలకులకు వినయముతో తన వృత్తాంతము నంతయు నివేదించెను. అతని మాటలు విని ద్వారపాలకులు దయగలవారై అనుచరుని ద్వారా శంకరున కితని వృత్తాంతమును తెలిపి శంకరుని ఆజ్ఞ వడసి శంకరుని దగ్గరకు పంపించిరి. భార్గవరాముడు వారి అనుమతిని పొంది, మనస్సులో శ్రీహరిని స్మరించుకొనుచు శంకరుని సన్నిధికేగెను. ప్రత్యేకం షోడశద్వారా దదర్శ సుమనోహరాః | ద్వారపాలైర్నియుక్తాశ్చ నానా చిత్ర విచిత్రిణా ః || 24 దృష్ట్వా తా మహాదాశ్చర్యాదపశ్యత్ శూలినః సభాం | నానాసిద్ధగణా కీర్ణాం మహర్షి గణసేవితాం || 25 పారిజాతా సుగంధాడ్య వాయునా సురభీకృతాం | దదర్శ తత్ర దేవేశం శంకరం చంద్రశేఖరం || 26 త్రిశూల పట్టిశధరం వ్యాఘ్రచర్మాంబరం పరం | విభూతి భూషితాంగం తం నాగయజ్ఞోపవీతినం | రత్న సింహాసననస్థంచ రత్న భూషణ భూషితం || 27 మహాశివం శివకరం శివబీజం శివాశ్రయం | ఆత్మారామం పూర్ణకామం సూర్యకోటి సమప్రభం || 28 ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకాతరం | శశ్వజ్ఞ్యోతి స్వరూపం చ లోనుగ్రహ విగ్రహం || 29 ధృతవంతం జటాజాలం దక్షకన్యా సమన్వితం | తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం || 30 శుద్ధస్ఫటిక సంకాశం పంచవక్త్రం త్రిలోచనం | గుహ్యం బ్రహ్మ ప్రవోచంతం శిష్యేభ్యస్తత్వముద్రయా || 31 స్తూయమానం చ యోగీంద్రైః సిద్ధేంద్రైః పరిసేవితం | పార్షద ప్రవరైశ్శశ్వత్సేవిజం శ్వేతచామరైః || 32 ధ్యాయమానం పరం బ్రహ్మ పరిపూర్ణతమం పరం | స్వేచ్ఛామయం గుణాతీతం జరామృత్యుహరం పరం || 33 జ్యోతీ రూపం చ సర్వాద్యం శ్రీకృష్ణం ప్రకృతేః పరం | ధ్యాయంతం పరమానందం పులకాంచిత విగ్రహం || సుస్వరం సాశ్రునేత్రం తముద్గాయంతం గుణానిత్వం || 34 భూతైంద్రైర్వె రుద్రగణౖః క్షేత్రపాలైశ్చ వేష్టితం | మూర్ద్నా ననామ పరశురామో దృష్ట్వా తమాదరాత్ || 35 తద్వామే కార్తికేయం చ దక్షిణ చ గణశ్వరం | నందీశ్వరమహాకాలం వీరభద్రం చ తత్పురః || 36 ననామ సర్వాన్ మూర్ద్నా చ భక్త్యా చ పరయా ముదా | దృష్ట్వా హరం పరం తోషాత్ స్తోతుం సముపచక్రమే || 37 సగద్గద పదం దీనస్సాశ్రు నేత్రోZతికాతరః | కృతాంజలిపుటః శాంతః శోకనాశనం || 38 చాలా అందమైనవి, అనేక చిత్ర విచిత్రితములైనవి, ద్వారపాలురుతోనున్న పదునారు ద్వారములనతడు ఆశ్చర్యముతో చూచెను. తరువాత నాభార్గవ రాముడు నానాసిద్ధ గణములు, మహర్షిగణములతో నిండినది, పారిజాత పుష్పముల వాసనతో నిండిన శంకరుని సభను ఆశ్చర్యముతో చూచెను. అచ్చట చంద్రశేఖరుడు, త్రిశూలము, పట్టిసమ అను ఆయుధములు ధరించి యుండెను. వ్యాఘ్రచర్మమును ధరించెను.అతడు శరీరమునందంతట విభూతిని పూసికొని యుండెను. అతడు సర్పయజ్ఞోపవీతమును ధరించెను. ఆ పరమశివుడు రత్నభూషణముల ధరించి రత్నసింహాసనముపై కూర్చొనియుండెను. అతడు మహాశివుడు, మంగళకరుడు, మంగళకారుడు, మంగళములకు ఆశ్రయుడు, ఆత్మారాముడు కోరికలు లేనివాడు, కోటి సూర్యులవంటి కాంతి కలవాడు, చిరునవ్వు కలిగి భక్తుల నెల్లప్పుడు అనుగ్రహించుచుండువాడు. జ్యోతిస్వరూపుడు, లోకములననుగ్రహించుటకై శరీరమును ధరించినవాడు. జటాధారి, పార్వతీదేవీ సమన్వితుడు, తపఃఫలితముల నొసగువాడు. సమస్తసంపదలు కలిగించువాడు. శుద్దమైన స్ఫటికమువంటి కాంతి కలవాడు. ఐదుముఖములు కలవాడు.. మూడు కన్నులు కలవాడు. ఆ పరమశివుడు తన శిష్యులకు తత్వముద్రను ధరించి పరబ్రహ్మను గురించి ఉపదేశించుచుండెను. అతనిని యోగీంద్రులు, సిద్ధేంద్రులు స్తుతింపుచుండగా అనుచరగణము తెల్లని చామరములతో సేవింపుచుండిరి. అతడు పరిపూర్ణుడైన పరబ్రహ్మను ధ్యానించుచుండెను. స్వేచ్ఛామయుడు, గుణాతీతుడు, జరామృత్యువులను పోగొట్టువాడు, జ్యోతీరూపుడు, సర్వాద్యుడు, ప్రకృతికి అతీతుడైన శ్రీకృష్ణుని ధ్యానింపుచు పులకాంకిత శరీరుడై కన్నీళ్ళు కారుచుండగా అతని గుణవైభవమును కీర్తించుచుండెను. ఆపరమేశ్వరుని వద్ద భూత, రుద్ర, క్షేత్రపాల గణముండెను. అతనికి ఎడమవైపు కార్తికేయుడు, కుడివైపు గణపతి, ఎదురుగా నంది, వీరభద్రుడుండిరి. అట్టి పరమశివుని పరశురాముడు చూచి భక్తి తో ప్రణమిల్లి కన్నీళ్లు రాలగా గద్గదస్వరముతో చేతులు జోడించుకొని దీనుడై ఇట్లు స్తుతింపసాగెను. పరశురామ ఉవాచ - భార్గవ రాముడిట్లనెను- ఈశ త్వాం స్తోతుమిచ్ఛామి సర్వథా స్తోతుమక్షమః | అక్షరాక్షయ బీజం చ కిం వా స్తౌమి నిరీహకం || 39 న యోజనాం కర్తుమీశో దేవేశం స్తౌమి మూఢధీః | వేదా న శక్తా యం స్తోతు కస్త్యాం స్తోతుమిహేశ్వరః || 40 వాగ్బుద్ధిమనసాం దూరం సారాత్సారం పరాత్పరం | జ్ఞాన మాత్రేణ సాద్యం చ సిద్ధం సిద్దైర్నిషేవితం || 41 యమాకాశమివాద్యంతమధ్యహీనం తథాZవ్యయం | విశ్వతంత్రమతంత్రం చ స్వతంత్రం తత్ర బీజకం || 42 ధ్యానాసాధ్యం దురారాధ్య మతిసాధ్యం కృపానిధిం | త్రాహి మాం కరుణా సింధో దీనబంధోZతిదీనకం || 43 అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితం | స్వప్నేZప్యదృష్టం భ##క్తైశ్చాధునా పశ్యామి చక్షుషా || 44 శక్రాదయః సురగణాః కళయా యస్య సంభవా | చరాచరాః కళాంశేన తం నమామి మహేశ్వరం || 45 స్త్రీరూపం క్లీబరూపం చ పౌరుషం చ బిభర్తి యః | సర్వాధారం సర్వరూపం తం నమామి మహేశ్వరం || 46 యం భాస్కరస్వరూపం చ శశిరూపం హుతాశనం | జలరూపం వాయురూపం తం నమామి మహేశ్వరం || 47 అనంత విశ్వసృష్టీనాం సంహార్తారం భయంకరం | క్షణన లీలా మాత్రేణ తం నమామి మహేశ్వరం || 48 యః కాలః కాలకాలశ్చ కలిర్బీజం చ కాలజః | అజః ప్రజశ్చ యః సర్వః తం నమామి మహేశ్వరం || 49 ఇత్యేవముక్త్వా స భృగుః పపాత చరణాంబుజే | ఆశిషం చ దదౌ తసై#్మ సుప్రసన్నో బభూవ సః || 50 ఓ పరమేశ్వరా! నిన్ను స్తుతింపవలెనని అనుకొనుచున్నాను. కాని నేనేవిధముగాను నిన్ను స్తుతింపజాలను. నాశనములేని వాడవు. కోరికలు లేని నిన్ను ఏమని స్తుతింపగలను. ఏ పని చక్కగా చేయలేని మూఢుడను దేవేశుడవగు నిన్నేమని స్తుతింపగలను. నిన్ను వేదములే వర్ణింపలేవనిచో మహేశ్వరుడవగు నిన్ను నేనేమని స్తుతింపగలను. నీవు వాక్కునకు, బుద్ధికి, మనస్సునకు తెలియరానంత దూరముగా నున్నావు. సారాత్సారుడవు. పరాత్పరుడవు. జ్ఞానమువల్ల మాత్రమే తెలియగలవు. సిద్దులచే సేవితుడవు. నీవు ఆకాశమువలె ఆదిమధ్యాంతరహితుడవు. అవ్యయుడవు. నీవు దురారాధ్యుడవు. దయకలవాడవు. దీనులకు బంధువైన నీవు నన్ను రక్షింపుము. భక్తులు స్వప్నములో సైతము చూడజాలని నిన్ను నాకండ్లచే నిన్ను చూచుచున్నందువలన నాజీవితము సఫలమైనది. దేవతలందరు నీ అంశమువలన జన్మించినారు. ఈచరాచర సృష్టియంతయు నీ యొక్క అంశాంశవలన జన్మించినది. నీవు స్త్రీరూపుడవు. నపుంసక స్వరూపడవు. అన్ని రూపములు నీవే. నీవు అందరకు ఆధారభూతుడవు. నీవు సూర్య, చంద్ర, అగ్ని, జల వాయురూపుడవు. నీవు అనంతమైన ఈ విశ్వమును క్షణములో సంహరింపగలవు. నీవు కాలుడవు. కాలునకే కాలరూపుడవు. కాలమునకు కాల స్వరూపుడవు. కలికి కారణమైనవాడవు. నీవు జన్మ రహితుడవు. అట్టి నీకు నమస్కారము అని చెప్పి భార్గవ రాముడు ఆ పరమేశ్వరుని పాదములపై వ్రాలగా ఆ దేవదేవుడు ప్రసన్నుడై అతనికి ఆశీస్సులనొసగెను. జామదగ్న్య కృతం స్తోత్రం యః పఠేద్భక్తి సంయుతః | సర్వపాప వినిర్ముక్తః శివలోకం స గచ్ఛతి || 51 పరసురాముడు చేసిన ఈ పరమేశ్వర స్తోత్రమును భక్తితో పఠించినవారు సమస్త పాపములకు దూరమై శివలోకమును తప్పక పొందెదరు. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే పరశురామస్య కైలాసగమనం నామ ఏకోనత్రింశోZధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెల్పబడిన పరశురాముని కైలాసగమనమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.