sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
త్రింశత్తమోZధ్యాయః - శివదత్తాస్త్ర శస్త్రాదిప్రాప్తి శంకర ఉవాచ - శంకరుడిట్లు పరశురామునితో పలికెను- కస్త్యం బటో కన్య పుత్రః క్వ వాసః స్తతవనం కథం | కిం వా తేzహం కరిష్యామి వాంఛితం వద సాంప్రతం ||
1 ఓ బ్రహ్మచారీ నీవెవరు? నీతండ్రిపేరేమి? నీవెక్కడ ఉంటున్నావు. ఎందుకు నన్ను స్తుతించుచున్నావు. నీకు నేను చేయగలిగినదేమి? నీ కోరిక ఏమున్నదో నాకు తెలుపుము అని పలికెను. పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను- శోకాకులం త్వాం పశ్యామి విమనస్కం సువిస్మింతం | మయసాZతి శిశుం శాంతం గుణన గుణినాం వరం ||
2 ఓ బ్రహ్మచారీ! నీవు శోకముతోనున్నట్లు కలతచెందిన మనస్సుతో నున్నట్లు కనిపించుచున్నావు. నీవు వయస్సులో చాల చిన్నవాడవు. కాని శాంతుడవు. నీవు గుణములచే గుణవంతులలో కెల్లను గొప్పవాడవనిపించుచున్నది. భృగురువాచ - భార్గవ రాముడిట్లు పలికెను- జమదగ్ని సుతోZహం చ భృగువంశసముద్భవః | రేణుకాంబా మే పరశురామోZహం నామతః ప్రభో || 3 క్రీణీహి మాం దయా సింధో విద్యాపణ్యన కింకరం | త్వామీశ శరణాపన్నం రక్ష మాం దీనవత్సల || 4 మృగయామాగతం భూపం పితా మే చోపవాసినం | చకారాతిథఅయమానీయ కపిలా దత్త వస్తునా || 5 రాజా తం కపిలాలోభాత్ఘాతయామాస మందధీః | కపిలా తం మృతం దృష్ట్వా గోలోకం చ జగామ సా || 6 మాతానుగమనం చక్రేహ్యనాథోహం చ సాంప్రతం | త్వం మేపితా శివా మాతా రక్షమాం పుత్రవత్ప్రభో || 7 మాయాకృతాప్రతిజ్ఞా చ శోకేనైవాతిదుష్కరా | త్రిస్సప్తకృత్వో నిర్భూపాం కరిష్యామి మహీమితి || 8 కార్తవీర్యం హనిష్యామి సమరే తాతఘాతకం | ఇత్యేతత్పరిపూర్ణం మే భగవాన్ కుర్తుమర్హతి || 9 ఓ ప్రభూ! నేను జమదగ్ని మహర్షి పుత్రుడను. నా తల్లి పేరు రేణుక. నేను భృగు వంశమున జన్మించితిని. నాపేరు పరశురాముడు. ఓదయానిధీ! నన్ను విద్యయను మూల్యముచే కొని దాసునిగా చేసికొమ్ము. దీనవత్సలడవగు నీవు శరణుగోరిన నన్ను రక్షింపుము. నాతండ్రియగు జమదగ్నిముని వేటకై వచ్చి తిండిలేక పడియున్న కార్తవీర్యార్జునునకు కామధేనువిచ్చిన వస్తువులచే ఆతిథ్యమునిచ్చెను. అపుడా రాజు కామధేనువు కొరకు మాతండ్రిని చంపెను. నాతల్లియగు రేణుక సహితము నాతండ్రితో అనుగమనము చేసినందువలన నేనిప్పుడు అనాథుడనైతిని. ఇప్పుడు నాకు తండ్రివి నీవే. ఈపార్వతీదేవియే నా తల్లి. అందువలన మీరు మీపుత్రుని కాపాడునట్లు నన్ను కాపాడుడు. నేను తండ్రి చంపబడెనను శోకమువలన ఈభూమినంతయు ఇరువది యొక్క మార్లు తిరిగి రాజులనువారు లేకుండునట్లు చేయుదునని ప్రతిజ్ఞ చేసితిని. అట్లే నా తండ్రిని సంహరించిన కార్తవీర్యుని యుద్దమున చంపెదనని అంటిని. ఓ భగవంతుడా! ఈ నా ప్రతిజ్ఞ తీరునట్లు మీరు చేయుడని పలికెను. బ్రహ్మణస్య వచః శ్రుత్వా దృష్ట్వా దుర్గాముఖం హరః | బభూవానమ్ర వక్త్రశ్చ సా చ శుష్కౌష్ఠ తాలుకా || 10 బ్రహ్మణుడగు భార్గవ రాముని మాటలు విన్న పరమశివుడు పార్వతీదేవి ముఖమును తలవంచుకొని చూడగా, ఆదేవి ఎండిన గొంతు కలదయ్యెను. పార్వత్యువాచ- పార్వతీ దేవి ఇట్లు పలికెను- తపస్విని విప్ర పుత్రస్త్యం నిర్భూపాం కర్తుమిచ్ఛసి | త్రిః సప్తకృత్వః కోపేన సాహసస్తే మహాన్వటో || 11 హంతుమిచ్ఛసి నిః శస్త్రః సహస్రార్జునమీశ్వరం | భ్రూభంగలీలయా యస్య రావణస్తు పరాజితః || 12 తసై#్మ ప్రదత్తం దత్తేన శ్రీహరేః కవచం వటో | శక్తిరవ్యర్థరూపా చ యయా తే హింసితః పితా || 13 హరేర్మంత్రం సంస్తవనం యః పఠేచ్చ దివానిశం | కోవా శక్నోతి తం హంతుం న పశ్యామమీహ భూతలే || 14 ఓ తపస్వీ! నీవు బ్రాహ్మణపుత్రుడవు. శమదమగుణములు ఉండవలసిన వాడవు. కాని నీవు తండ్రిని చంపెనను కోపముతో ఈభూమిపై నున్న క్షత్రియులనందరను ఇరువది యొక్క మార్లు తిరిగి చంపదలచితివి. ఇది గొప్ప సాహసకార్యము. అట్లే రాజగు కార్తవీర్యార్జునుని ఆయుధము లేక చంపవలెనని అనుకొనుచున్నావు. ఆ కార్తవీర్యుడు కనుబొమను ముడినంతమాత్రమున లోక కంటకుడగు రావణుడు జయింపబడెను. అతనికి దత్తాత్రేయుడు శ్రీహరి కవచమును వ్యర్థముకాని శక్తియను ఆయుధమునిచ్చేను. అమోఘమైన ఆ శక్త్యాయుధమువలననే నీతండ్రి చనిపోయెను. శ్రీహరి మంత్రమును, స్తోత్రమును రాత్రింబగళ్ళు పఠించువానిని ఈప్రపంచమున ఎవ్వరుచంపలేరు కావున నీకోరికను వదలు కొమ్మని పలికెను. అయే విప్రగృహం గచ్చ కిం కరిష్యతి శంకరః | అన్యే భూపాశ్చ మద్భృత్యాః కా భీస్తేషాం మయి స్థితే || 15 ఓ బ్రహ్మణకుమారా! నీఇంటికి తిరిగిపొమ్ము. ఈ విషయమున శంకరుడేమి చేయజాలడు. భూలోకమున నున్న ఇతర భూపతులందరు నా సేవకులు. నేనుండగా వారికి భయము కూడ కలుగదని పలికెను. కాళ్యువాచ- కాళికాదేవు ఇట్లు పలికెను. అయే విప్ర వటో జాల్మ నిర్భూపాన్కర్తు మిచ్ఛసి | యథా హి వామనశ్చంద్రం కరేణాహర్తుమిచ్ఛతి || 16 కృతయజ్ఞాన్ మహాపుణ్యాన్ మహాబల పరాక్రమాన్ | దిగంబర సహాయేన మద్భృత్యాన్ హంతుమిచ్చసి || 17 స తయోర్వచనం శ్రుత్వా రురోదోచ్చైశ్చ శోకతః | సహసా పురతస్తేషాం ప్రాణాంస్త్యక్తుం సముద్యతః || 18 విప్రస్య రోదనం శ్రుత్వా శంకరః కరుణానిధిః | పశ్యన్ దుర్గాంచ కాళీం చ జ్ఞాత్వాZశయమధో విభుః || 19 తయోరనుమతిం ప్రాప్య సర్వేశో భక్తవత్సలః | జమదగ్ని సుతం సద్యః ప్రవక్తుముపచక్రమే || 20 దుష్టుడవగు బ్రాహ్మణవటూ! పొట్టివాడు చంద్రుని చేతులతో పట్టుకొనుటకు ప్రయత్నించినట్లు నీవు ఈ భూమిపై నున్న రాజులనందరను చంపవలెనని కోరుకొనుచున్నావు. ఆ రాజులందరు అనేక యజ్ఞముల నాచరించిన మహాపుణ్యాత్ములు. గొప్పపరాక్రమము కలవారు. పైగా నా యొక్క సేవకులు. వీరిని శంకరుని యొక్క సహాయమున చంపవలెనని అనుకొనుచున్నావు అని పలికెను. పరశురాముడు కాళీ పార్వతుల మాటలు విని శోకముతో బిగ్గరగా నేడ్చెను. ఇంకను వెంటనే వారిముందు తన ప్రాణములు వదలిపెట్టుటకు సిద్ధమయ్యెను. అప్పుడా బ్రాహ్మణుని దుఃఖమును చూచిన కరుణానిధియగు శంకరుడు కాళికాదేవి, పార్వతీ దేవియొక్క భావమును గ్రహించి వారి యనుమతితో భార్గవరామునితో ఇట్లు పలికెను. శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను- అద్య ప్రభృతి హే వత్స త్వం మే పుత్ర సమో మహాన్ | దాస్యామి మంత్రం గుహ్యం తే త్రిషు లోకేషు దుర్లభం || 21 ఏవం భూతం చ కవచం దాస్యామి పరమాద్భూతం | లీలయా మత్ర్పసాదేన కార్తవీర్యం హనిష్యసి || 22 త్రిః సప్త కృత్వో నిర్భూపాం కరిష్యసి మహీం ద్విజ | జగత్తే యశసా పూర్ణం భవిష్యతి న సంశయః || 23 ఇత్యుక్త్యా శంకరస్తసై#్మ దదౌ మంత్రం సుదుర్లభం | త్రైలోక్య విజయం నామ కవచం పరమాద్భుతం || 24 స్తవం పూజావిధానం చ పురశ్చరణ పూర్వకం | మంత్రసిద్ధేరనుష్ఠానం యథావన్నియమ క్రమం || 25 సిద్ధిస్థానం కాలసంఖ్యం కథయామాస నారద | వేదవేదాంగాదికం చ పాఠయామాస తత్ క్షణం || 26 నాగపాశం పాశుపతం బ్రహ్మాస్త్రం చ సుదుర్లభం | నారాయణఆస్త్రమాగ్నేయం వాయవ్యం వారుణం తథా || 27 గాంధర్వం గారుడాం చైవ జృంభణాస్త్రం తథైవ చ | గదాం శక్తిం చ పరశుం శూల మవ్యర్థముత్తమం || 28 నానా ప్రకార శస్త్రాస్త్రమంత్రం చ విధిపూర్వకం | శస్త్రాస్త్రాణాం చ సంహారం తూణీ చాక్షయసాయకౌ || 29 ఆత్మరక్షణ సంధానం సంగ్రామ విజయక్రమం | మాయయుద్దం చ వివిధం హుంకారం మంత్రపూర్వకం || 30 రక్షణం చ స్వసైన్యానాం పరసైన్య విమర్దనం | నానా ప్రకారమతులముపాయం రణసంకటే || 31 స్థిత్వా చిరం గురోర్వాసే సర్వవిద్యాం విబోధ్యసః | తీర్థే కృత్వా మంత్రసిద్దిం తాంశ్చ నత్వా జగామ సః || 32 ఓ భార్గవరామా!నేడు మొదలు నీవు నాకు పుత్రుని వంటివాడవు. నీకు ముల్లోకములందును లభించని అతిరహస్యమైన మంత్రమునుపదేశింతును. అట్లే నేను ఉపదేశింపబోవు పరమాద్భుతమైన కవచప్రభావము వలన, నా యొక్క అనుగ్రహమువలన నీవు తప్పక కార్తవీర్యుని చంపెదవు. అట్లే ఈ భూమిపై రాజులు లేకుండ ఇరువదియొక్కమార్లు తిరిగి వారిని చంపెదవు. ఈప్రపంచమున నీకీర్తి నిండిపోవునని పలికి పరమాద్భూతమైన త్రైలోక్యవిజయమను కవచమును, స్తోత్రమును, పూజావిధానమును, పురశ్చరణపద్ధతిని, మంత్రానుష్ఠాన విధానము, దానియొక్క నియమములను, మంత్రము సిద్ధించుస్థలమును, మంత్రము జపింపవలనసిన కాలమును, సంఖ్యము, భార్గవరామునకు పరమశివుడు బోధించెను. అట్లే చతుర్విధ వేదములను, షడ్వేదాంగములు మొదలగు వానిని చదివించెను. అటుపిమ్మట నాగపాశము, పాశుపతము, బ్రహ్మస్త్రము , నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, వారుణాస్త్రము, గాంధర్వాస్త్రము, గరుడాస్త్రము, జృంభణాస్త్రము, తూణీరములను, అక్షయసాయకములను, ఆత్మరక్షణ చేసికొనుపద్ధతిని, యుద్దమున విజయమును పొందు పద్ధతిని, మాయాయుద్ధమును, తన సైన్యముల రక్షించుకొనుపద్ధతిని, శత్రుసైన్యముల నాశనము చేయు రీతిని, యుద్ధమున కష్టము వచ్చినప్పుడు తప్పించుకొను నానాప్రకారములైన ఉపాయములను, మృత్యువును హరించు మోహినీవిద్య మొదలగు వాటిని పరమేశ్వరుడు భార్గవ రామునకు ఉపదేశించెను. భార్గవ రాముడు గురువుయొక్క సమీపమున చాలాకాలముండి సమస్తవిద్యలు నేర్చుకొని పుణ్యతీర్థమున మంత్రసిద్ధిని పొంది గురువగు పరమేశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారదనారాయణ సంవాదే పరశురామస్య శివదత్తాస్త్ర శస్త్రాదిప్రాప్తి వర్ణనం నామ త్రింశత్తమోZధ్యాయః || శ్రీ బ్రహ్మవైనర్త మహాపురాణమున మూడవది యగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన పరశురామునకు శస్త్రాస్త్రప్రాప్తియనెడు ముప్పదియవ అధ్యాయము సమాప్తము.