sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
త్రయోదశోzధ్యాయః - మాలతీదేవి విలాపము సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను - పుత్రోత్సవే చ రత్నాని ధనాని వివిధాని చ l గంధర్వరాజః ప్రదదౌ బ్రాహ్మణభ్యో ముదాన్వితః ll 1 ఉపబర్హణస్తు కాలేన హరేర్మంత్రం సుదుర్లభం l వసిష్ఠేన తు సంప్రాప్య స చక్రే దుష్కరం తప ఃll 2 ఏకదా గండకీతీరే తం చ సంప్రాప్త¸°వనం l గంధర్వపత్న్యో దద్రుశు ః మూర్చమాపుశ్చ తక్షణం ll 3 తాశ్చ తీవ్రం తపః కృత్వా ప్రాణాన్ సంత్యజ్య యోగతః l పంచాశత్తా బభూవుశ్చ కన్యాశ్చిత్రరథస్య చ ll 4 ఉపబర్హణగంధర్వం తాశ్చతం వవ్రిరే పతిం l ముదా మాలా దదు స్తసై#్మ కాముక్య ః పితురాజ్ఞయా ll 5 గృహీత్వా తాశ్చ గంధర్వో యువా సుస్థిర ¸°వన ః l దివ్యం త్రిలక్షవర్ణం చ రేమే రహసి కాముకః ll 6 తతో zపి సురుచిరఁ రాజ్యం కృత్వా తాభి ః సహానిశం l జగామ బ్రహ్మణః స్థానం హరిగాథాం జగౌ మునే ll 7 ఓ శౌనక మహర్షీ ! గంధర్వరాజు తనకు పుత్రుడు పుట్టిన సందర్భమున సంతోషముతో బ్రాహ్మణులకు అనేక విధములైన ధనములను రత్నములను దానము చేసెను. ఉపబర్హణుడు కాలక్రమముగా పెద్ద బెరిగి గురువైన వసిష్ఠ మహర్షివలన సులభ సాధ్యము కాని హరి మంత్రమును పొంది, మిక్కిలి కఠినమైన తపస్సు చేసెను. తరుణ మయస్కుడగు ఆ ఉపబర్హణుని గండకీ నదీ తీరమునుండి పోవుచున్న గంధర్వస్త్రీలు చూచి అతని అందమునకు మూర్చబోయిరి. తరువాత వారందరు కఠినమైన తపస్సుచేసి యోగమార్గమున ప్రాణములు వదలి చిత్రరథుడను గంధర్వునకు ఏబది మంది కూతుళ్ళుగా పుట్టిరి. వారంతా ఉపబర్హణునే భర్తగా కోరుకొని తండ్రయొక్క ఆజ్ఞననుసరించి సంతోషముతో అతని మెడలో వరమాలలను నేసిరి. ఉపబర్హణుడు వారినందరిని తీసుకొని మూడు లక్షల దివ్య సంవత్సరములు వారితో రహస్యముగా క్రీడించెను. తరువాత వారితో కలిసి చాలా సంవత్సరములు రాజ్యమునేలి, ఒకప్పుడు బ్రహ్మలోకమునకు వెళ్ళి అచట హరి కథలను గానము చేయుచుండెను. దృష్ట్యా స రంభా రంభోరు నర్తనే కఠినం స్తనం l బభూవ స్ఖలనం తస్య గంధర్వస్య మహత్మనః ll 8 ద్రుతం తత్యాజ సంగీతం మూర్చాంప్రాప సభాతలే l ఉచ్చై: ప్రజహసుర్దేవా బ్రహ్మా కోపాచ్ఛశాప తం ll 9 వ్రజ త్వం శుద్రయోనిం చ గాంధర్వీం తనుముత్సృజ l కాలే వైష్ణవసంసంర్గాన్మత్పుత్రస్త్వం భవిష్యసి ll 10 వినా విపత్తేర్మహిమా పుంసాం నైవ భ##వేత్సుత l సుఖం దుఃఖంచ సర్వేషాం క్రమేణ ప్రభ##వేదితి ll 11 ఇత్యేవముక్త్వా స విథిరగ్ఛత్పుష్కరాత్ గృహం l ఉపబర్హణగంధర్వస్సజహౌ తాం తనుం తదా ll 12 అచ్చట రంభ నాట్యము చేయుచుండగా ఆమె . యొక్క కఠినమైన స్తనములను చూచి మైమరచి తాను చేయుచున్న హరిగానమును మరచి మూర్ఛపోయెను. ఉపబర్హణుని స్థితికి అచ్చటనున్న దేవతలు నవ్విరి. బ్రహ్మదేవుడు కోపముతో నాతనిని ఈ గంధర్వ శరీరమును వదలిపెట్టి శూద్రుడవై జన్మించుమని శపించెను . ఆతరువాత వైష్ణవులయొక్క సంబంధమువలన తిరిగి నాపుత్రుడవు కాగలవు . పురుషులకు ఆపదలు లేకుండా గొప్ప తనము తెలియదు . సుఖదుఃఖములు క్రమముగా కలుగునని చెప్ప కమలమునుండి తన గృహమునకు పోయెను. ఉపబర్హణుడు బ్రహ్మశాపమువలన తన శరీరమును వదలి పెట్టెను. మూలధారం స్వాధిష్ఠానం మణిపూరమనాహతం l విశుద్ధమాజ్ఞాఖ్యం చేతి భిత్వా షట్చాక్రమేవ చ ll 13 ఇడాం సుషుమ్నాం మేధాం చ పింగళాం ప్రాణహారిణిం l సర్వజ్ఞానప్రదాం చైవ మనస్సంయమినీం తథా ll 14 విశుద్దాం చ నిరుద్దాం చ వాయుసంచారిణీం తథా l తేజశ్శుష్కకరీం చైవ లబపుష్టికరీం తథా ll 15 బుద్ధి సంచారిణీం చైవ జ్ఞానజృంభణకారిణీం l సర్వప్రాణహరాం చైవ పునర్జీవనకారిణీం ll 16 ఏతా ః షోడశధా నాడీర్భిత్వావై హంసవేవ చ l మనసా సహితం బ్రహ్మరంధ్రమానీయ యోగతః ll 17 స్థిత్వా ముహూర్తమాత్మానం ఆత్మన్యేన యుయోజ హ l జాతిస్మరశ్చ యోగీంద్ర: సంప్రాప బ్రహ్మ శౌనక ll 18 వీణాం త్రితంత్రీం దుష్ప్రాప్యాం వామస్కంధే నిధాయచ l శుద్దస్ఫటికమాలాం చ విధృత్వా దక్షిణ కరే ll 19 సంజల్పన్ పరమం బ్రహ్మ వేదసారం పరాత్పరం l పరం నిస్తారబీజం చ కృష్ణ ఇత్యక్షరద్వయం ll 20 ప్రాచ్యాం కృత్వా శిరః స్థానం పశ్చిమే చరణద్వయం l నిధాయ దర్భశయనే శయానఃపురుషో యథా ll 21 గంధర్వరాజస్తం దృష్ట్యా భార్యయా సహతత్‌క్షణం l యేగేన బ్రహ్మ సంప్రాస శ్రీకృష్ణం మనసాస్మరన్ ll 22 మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, అజ్ఞా అనే షట్చక్రములను భేదించుకొని, ఇడ, విశుద్ద, నిరుద్ధ, వాయుసంచారిణి, తేజశ్శుష్కకరి, బలపుష్టికరి, బుద్ధిచంచారిణి, జ్ఞానజృంభణకారిణి, సర్వప్రాణహర, పునర్జీవనకారిణి, అను పదునారు నాడులను భేదించుకొని ఆత్మను మనస్సుతో కలిపి యోగశక్తితో బ్రహ్మరంధ్రమువరకు తీసికొని వచ్చి ఉపబర్హణుడు క్షణకాలము ఆత్మను ఆత్మలోనే ఉంచి తన గత జన్మజ్ఞానము కలిగి పరబ్రహ్మను చేరుకొనెను. ఇంకను అతడు మూడు తీగలుకలవీణను ఎడమ భుజముపై నుంచుకొని, కుడిచేతిలో శుద్ధ స్పటికమాలను ధరించి, వేదములకు సారభూతము, పరాత్పరము, పరబ్రహ్మ, మోక్షకారకము ఐన కృష్ణ అను రెండక్షరములు జపించుచు, శిరస్సు తూర్పునకు, పాదములు పశ్చిమమునకు పెట్టి దర్భల శయ్యపై పడుకొన్న పురుషునివలె మనస్సుతో శ్రీకృష్ణుని స్మరించుచు యోగశక్తి తో పరబ్రహ్మమును చేరుకొనెను. పత్న్యశ్చ బాంధవాస్సర్వే విలప్య రురుదుర్భృశం l జగ్ము ః క్రమేణ శోకార్తా మోహితా విష్ణుమాయయా ll 23 పంచాశద్యోషితాం మధ్యే ప్రధానా మహిషీ చ యా l సాధ్వీ మాలవతీ నామ్నా పరమా ప్రేయసీ వరా ll 24 ఉచ్చైరురోద సా తీవ్రం కాంతం కృత్వా చ వక్షసి l ఇత్యువాచ చ శోకార్తా కాంతం సంబోధ్య చైవ హి ll 25 విష్ణుమాయచే మోపితులైన ఆ గంధర్వ రాజు భార్యలు బంధువులు, శోకార్తులై మిక్కలి ఏడ్చిరి. ఆ ఉపబర్హణుని ఏబదిమంది భార్యలలో పెద్దదైన మాలావతి భర్త శవముపై బడి ఎలుగెత్తి ఏడ్చెను. దుఃఖవతియైన ఆ మాలావతి భర్తను సంబోదించి ఈ విధముగా అనెను. మాలావత్యువాచ -మాలావతి ఇట్లనెను - హే నాథా రమణ శ్రేష్ఠ విదగ్ధ రసికేశ్వర l దర్శనం దేహి మే బంధో నిమగ్నాం శోకసాగరే ll 26 విస్రంభ##కే సువసనే రమ్యే చందనకాననే పుష్ఫభద్రానదీతీరే పుష్పోద్యానే మనోహరే ll 27 చందనాచలసాన్నిధ్యే చారుచందన కాననే l పుష్పచందన తల్పేచ చందనానిల వాసితే ll 28 గంధమాదన శైలైక దేశే రమ్యే నదీ తటే l పుంస్కోకిల నినాదేచ మాలతీ జాల శాలిని ll 29 శ్రీశైలే శ్రీ వనే దివ్యే శ్రీనివాస నిషేవితే l శ్రీయుక్తే శ్రీపదాంభోజే పూతే zచ్యుత కృతే శుభే ll 30 పురా యాయా కృతా క్రీడా వసంతే రహసి త్వయా l మయా చ దుర్హృదా సార్థం తయా వై దూయతే మనః ll 31 సుధాతుల్యేన వచసా సిక్తాzహం చ పురా త్వయా l దూయతే సతతం తేన పరమాత్మాzతి దారుణం ll 32 సాధునా సహ సంసర్గో వైకుంఠాదపి దుర్లభః l అహో తతోzపి బంధు విచ్ఛేదో మరణా దపిదుష్కర ః ll 33 తస్మాత్తేషాం చ విచ్ఛేధః సాధుశోకకరః పరః l తతోzపి బంధువిచ్ఛేదః శోకః పరమ దారుణ ః ll 34 తతోzపత్యవియోగాహి మరణాదతిరిచ్యతే l సర్వస్మాత్పతిభేదోహి తత్పరం నాస్తి సంకటం ll 35 శయనే భోజనే స్నానే స్వప్నే జాగరణzపిచ l స్వామి విచ్ఛేద దుఃఖంచ నూతనం చ దినేదినే ll 36 సర్వశోకం విస్మరేత్ స్త్రీ స్వామి సంయోగ మాత్రతః l బంధుమన్యం నపశ్యామి యం దృష్ట్వా విస్మరేత్పతిం ll 37 నాzతో విశిష్టం పశ్యామి బాంధవం స్వామినా వినా l సాధ్వీనాం కులజాతానా మిత్యాహ కమలోద్భవ ః ll 38 హే దిగీశాశ్చ దిక్పాలా హే ధర్మ త్వం ప్రజాపతే l గీరీశ కమలాకాంత పతిదానం చ దేహి మే ll 39 ఓ నాథుడా, రమణుడా, రసికేశ్వరుడా ! జీవిత బంధూ ! శోక సాగరంలో మునిగిన నాకు నీ దర్శనము నిమ్ము. పుష్పభద్రానదీతీరమున అందమైన పుష్పోద్యానములో, రమ్యమైన చందన వృక్షముల మధ్య ఏకాంతముగా నున్న భవనములో, చందన పర్వతము యొక్క సమీపమున నున్న చందనవనములో చందన గంధముతో కూడిన పుష్పచందన శయ్యపై, గంధమాదన పర్వత ప్రాంతమున నున్న నదీతీరమున గండు కోయిలల కూతలు వినిపించు మాలతీ తీగల పొదరింటిలో, శ్రీనివాసుడు నివసించుచున్న శ్రీశైలములోని (తిరుమల) దివ్యమైన శ్రీవనములో పూర్వము రహస్యంగా నీవుచేసిన రాసక్రీడలను తలచుకొన్న నా మనస్సు పరిపరివిధముల బాధలకు గురియగుచున్నది . పూర్వము అమృత తుల్యములైన నీమాటలచే పరవశించిపోయినాను. అవి నామనస్సును మిక్కిలి దారుణముగ బాధపెట్టుచున్నవి. మంచివారితో కలిసి ఉండుట వైకుంఠములో ఉండుట కంటె చాలా శ్రేష్ఠమైనది. వారివియోగము వరణము కంటె ఎక్కువ బాధను కలిగించును. అందువలన సజ్జన విరహము అధికమైన శోకమును కల్గించును. దానికన్న బంధుమరణము వలన కలుగు శోకము అతి భయంకంమైనది. బంధుమరణము కంటె పతిమరణమువలన కలుగుశోకము మిక్కిలి బాధాకరము. దానికంటె మించిన బాధ స్త్రీకి ఇంకొకటి లేదు. నిద్రపోయిన సమయమున, భోజన సమయమున, కలలో, జాగ్రదవస్థలోను భర్తృదుఃఖము ప్రతిదినము నిత్యనూతనమై బాధపెట్టును. స్త్రీ భర్తతో కలిసి యున్నప్పుడు సమస్త విధములైన శోకములను మరిచిపోవును. భర్తను మరిపించే బంధువు స్త్రీకి లేనేలేడు. బ్రహ్మదేవుడు సహితము ఇదే విషయము లెలిపినాడు. అందువలన ఓదిక్పాలకులారా !ఓ దర్మదేవత ! ఓ ప్రజాపతి ! ఓ శంకరుడా! ఓ లక్ష్మీపతీ! నాకు మీరు పతిదానము చేయుడు- ఇత్యుక్త్వా విరహార్తా సా కన్యా చిత్రరథస్య చ l మూర్ఛాం సంప్రాప త్రత్రైవ దుర్గమే గహనే వనే ll 40 విచేతనా తత్ర తస్థౌ కాంతం కృత్వా స్వవక్షసి l పరిపూర్ణం దివానక్తం సర్వైర్దేవైశ్చ రక్షితా ll 41 ప్రభాతే చేతనాం ప్రాప్య విలలాప భృశం ముహు: l ఇత్యువాచ పునస్తత్ర హరిం సంభోధ్య సా సతీ ll 42 అని చిత్రరథుని కూతురైన మాలావతి ఏడ్చుచు పతి విరహమును బరించలేక ఆ దుర్గమమైన అడవియందే మూర్చపోయెను. మాలావతి భర్తయొక్క శవముపై పడి చైతన్యమును కోలుపోయి ఒక దినము సంపూర్ణముగా స్మృతి రహితయైయుండెను. అప్పుడామెను సమస్త దేవతలు రక్షించుచుండిరి. మరుసటి దినము ఆమె స్మృతిలోనికి వచ్చినను భర్తకై మిక్కిలి శోకించుచు శ్రీ హరిని సంబోధించి ఇట్లు పలికెను. మాలావత్యువాచ - మాలావతి ఇట్లనెను- హే కృష్ణ జగతాంనాథ నాథ నాహం జగద్బహి ః త్వమేవ జగతాం పాతా మాం న పాసి కథం ప్రభో ll 43 అయం భర్తాzస్య భార్యాzహం మమేతి తవ మాయయా l త్వమేవ సంభవో భర్తా సర్వేషాం సర్వకారణః ll 44 గంధర్వః కర్మణా కాంతః కాంతాzహం చా zస్య కర్మణా l క్వ గతః కర్మభోగాంతే కుత్ర సంస్థాప్య మాం ప్రియాం ll 45 కో వా కస్యపతి ః పుత్ర ః కా వా కస్య ప్రియా ప్రభో l సంయునక్తి విధాతా చ యునక్తి చ కర్మణా ll 46 సంయోగే పరమానందో వియోగే ప్రాణసంకటం l శశ్వజ్జగతి మూర్ఖస్య నాత్మారామస్య నిశ్చితం ll 47 నశ్వరో విషయః సత్యం భువి భోగశ్చ బాంధవ ః l స్వయం త్యక్తః సుఖాయైవ దుఃఖాయ త్యాజితః పరైః ll 48 తస్మాత్సంతః స్వయం త్యక్త్వా పరమైశ్వర్యమీప్సితం l ధ్యాయంతే సతతం కృష్ణపాదపద్మం నిరాపదం ll 49 సర్వత్ర జ్ఞానినః సంతః కా స్త్రీ జ్ఞానవతీ భువి l తతో మహ్యం విమూఢాయై దాతుమర్హతి వాంఛితం ll 50 న మే వాంఛాzమరత్వే చ శక్రత్వే మోక్షవర్త్మని l ఇమం కాంతం వరం దేహి చతుర్వర్గకరం పరం ll 51 యావతీ కామినీ జాతిర్జగత్యాం జగదీశ్వర l కసై#్యచిన్న హి దత్తశ్చ తేన ధాత్రేదృశః పతిః ll 52 తసై#్మ దత్తా గుణా ః సర్వే రూపాణి వివిధాని చ l సుశీలాని చ సర్వాణి చామరత్వం వినా హరే ll 53 రూపేణ చ గుణనైవ తేజసా విక్రమేణచ l జ్ఞానేన శాంత్యా సంతుష్ట్యా హరితుల్య ః ప్రభుర్మమ ll 54 హరిభక్తో హరిసమో గాంభీర్యే సాగరో యథా l ధీప్తిమాన్ సూర్యతుల్యశ్చ శుధ్ధో మహ్నిసమస్తథా ll 55 చంద్రతుల్య ః సుదృశ్యశ్చ కందర్పసమసుందర ః l బుధ్యా బృహస్పతిసమ ః కావ్యే కవిసమస్తథా ll 56 వాణీచ సర్వశాస్త్రజ్ఞా ప్రతిభాయాం భృగోరివ l కుబేరతుల్యో ధనవాన్ మహాన్ దాతా మనోరివ ll 57 ధర్మే దర్మసమో ధర్మీ సత్యే సత్యవ్రతాధికః l కుమారతుల్యస్తపసా స్వాచారే బ్రహ్మణా సమ ః ll 58 ఐశ్వర్యే శక్రతుల్యశ్చ సహిష్ణుః పృథివీసమ ః l ఏవం భూతో మృతః కాంతః ప్రాణా యాంతి నమే కథం ll 59 ఓ జగత్పతియైన శ్రీకృష్ణా నేను ఈ ప్రపంచమునుండి దూరము కాలేదు . సమస్తజగములు రక్షించునీవు నన్నెందుకు రక్షించవు ? నీమాయవల్లనే ఇతడు నాభర్త, నేను ఇతని భార్యను, ఇదినాది అనే భావములు కలుగుచున్నవి. నీవే అన్నిటికిని కారణము . నీవే అందరిని భరించువాడవు. ఈ గంధర్వుడు నా పూర్వకర్మ ఫలితముగా భర్తయైనాడు . నేను కూడ అతని పూర్వ కర్మ ఫలితముగా భార్యనైతిని. ఈ కర్మలను అనుభవించిన తరువాత ప్రియురాలనైన నన్ను ఎక్కడో వదలి అతడు ఎక్కడకో పోయినాడు. ఎవరు ఎవరికి భర్త ? ఎవరు పుత్రుడు? ఎవరు భార్య ? బ్రహ్మ దేవుడు ఆయా వ్యక్తులు చేసికొన్న కర్మ ఫలితముననుసరించి ఇరువురిని కలుపుతున్నాడు. విడగొట్టుచున్నాడు. ఈ ప్రపంచమున మూర్ఖడు కలిసి యున్నప్పుడు పరమానందమును పొందుచున్నాడు. విడిపోయినప్పుడు ప్రాణసంకటమును పొందుచున్నాడు . తన ఆత్మయందు తానే రమించువ్యక్తి ఈ సుఖదుఃఖములకు అతీతుడై ప్రవర్తించుచున్నాడు. ప్రపంచములోనున్న శరీరసౌఖ్యము, భోగ భాగ్యములు బంధుత్వము అశాశ్వతములు. వీటినన్నింటిని స్వయముగా వదులుకున్నవారు సుఖముగా నుందురు. ఇతరులచే బలవంతముగా వదలిపెట్టబడినచో దుఃఖము కలుగును . అందువలన శ్రేష్ఠులైనవారు వీటిన స్వయముగా వదలిపెట్టి, ఎటువంటి ఆపదలకు కారణము కాని శ్రీకృష్ణపదములను మనస్సులో ధ్యానించుచు తమకు ఇష్టమైన పరమైశ్వర్యమును పొందుచున్నారు. పురుషులు ఎప్పుడైనను, ఎచ్చటనైనను, జ్ఞానవతియైన స్త్రీ ప్రపంచమున కానరాదు. అందువలన ఆజ్ఞానురాలనైన నాకోరికను తప్పక మీరు తీర్చవలెను. నాకు దేవత్వము పైన కాని ఇంద్ర పదవిపై గాని, మోక్షమార్గముపై గాని కోరికలేదు. నాకు ధర్మార్థకామమోక్షములకు కారణమైన భర్తను వరముగానిమ్ము. ఓభగవంతుడా ! భూమిపై నున్న ఏ స్త్రీకి నా భర్తవంటి భర్తను నీవివ్వలేదు. అతని వద్ద సమస్త సుగుణములున్నవి. మంచి రూపము ఉన్నది. అమరత్వము తప్ప తక్కిన సౌశీల్యగుణములన్ని కలవు. నాభర్త రూపమున, గుణమున, తేజస్సున, విక్రమమున, జ్ఞానమున శాంతి సంతుష్టులలో శ్రీహరితో సమానుడు. అతడు హరిభక్తుడు. శ్రీహరితో సమానమైనవాడు. గాంభీర్యమున సముద్రమువంటివాడు., సూర్యునితో సమానమైన ప్రకాశము కలవాడు. అగ్నివలె పరిశుద్దుడు. చంద్రునివలె అందగాడు. మన్మథునివంటివాడు . బుద్ధియందు బృహస్పతి. కవిత్వమున వాల్మీకి వంటివాడు. సర్వశాస్త్రజ్ఞత్వమున సరస్వతి వంటివాడు. ప్రతిభయందు భృగుమహర్షి. కుబేరుని వంటి ధనవంతుడు. మనువు వలె గొప్పదాత. ధర్మమున దర్మదేవతతో సమానుడు. సత్యవ్రతము కలవాడు. తపస్సున కుమారస్వామి వంటివాడు. ఆచారమున బ్రహ్మతో సమానుడు . ఐశ్వర్యమున ఇంద్రునితో సమానుడు. భుమివంటి సహనము కలవాడు. ఇన్ని సుగుణములు కల నాభర్త చనిపోయెను. ఐనను నాప్రాణములు పోకుండ ఉన్నవి. అరే సురా యజ్ఞభాజః ఘృతం భోక్తుం క్షమా భువి l క్షణ నాయజ్ఞభాజశ్చ కరిష్యామి స్వలీలయా ll 60 నారాయణ జగత్కాంత నాహమేవ జగద్భహి ః l శ్రీఘ్రం జీవయ మే కాంతం అన్యథా త్వాం శపామ్యహం ll 61 ప్రజాపతే పుత్రశాపాత్త్వమపూజ్యో మహీతలే - తవైవానధికారిత్వం కరిష్యామ్యధునా భ##వే ll 62 హే శంభో జ్ఞానలోపం తే కరిష్యామి శ##పేన చ l ధర్మలోపం చ ధర్మస్య కరిష్యామ్యేవ లీలయా ll 63 యమాధికారం దూరే చ కరిష్యామి న సంశయఃl సత్యం కాలం శపిష్యామి మృత్యుకన్యాం సునిష్ఠురాం ll 64 శపామి సర్వానత్రైవ జరాం వ్యాదిం వినాzధునా l వ్యాధినా జరయామృత్యుర్న హ్యభూచ్చ పతేర్మమ ll 65 ఇత్యుక్త్వా కౌశికీతీరే చాగచ్చప్తుమేవ తాన్ l మాలావతీ మహాసాధ్వీ శవం కృత్వా స్వవక్షసి ll 66 యజ్ఞ భాగమును యజ్ఞహవిస్సును భుజించు ఓ దేవతలారా! నాశక్తిచే క్షణమున మీకందరకు యజ్ఞభాగము లేకుండ చేయగలను. జగద్రక్షకుడవగు నారాయణా! నేను మాత్రమే లోక బాహ్యురాలను కాలేను. నాభర్తను వెంటనే బ్రతికించకపోయినచో నిన్ను కూడా శపింతును. ఓ బ్రహ్మదేవుడా! నీపుత్రుని శాపమువలన నీవు పూజకు దూరమైనావు. నేనిప్పుడు నీకు సృష్టిచేయు అధికారము లేకుండా చేయగలను. ఓ శివుడా! నేను శపించి నీకు జ్ఞానము లేకుండా చేయుదును. ఓ ధర్మదేవతా నీకు ధర్మలోపము కలుగునట్లు చేయుదును. యముని యొక్క అధికారమును తొలగించగలను. కాలుని, మృత్యుకన్యను కూడా శపింతును. నాభర్త వ్యాధి, ముసలితనములతో చనిపోలేదు కావున జరావ్యాధులు తప్ప మిగిలిన దేవతలనందరను శపింతును అని భర్త శవముపై పడియున్న మహాసాధ్వయైన మాలావతి వారిని శపించుటకు కౌశికీనదీ తీరమునకు వచ్చెను. తాం శప్తుముద్యతాం దృష్ట్యా బ్రహ్మా దేవపురోగమః l జగామ శరణం విష్ణుం తీరం క్షీరపయోనిధేః ll 67 తత్ర స్నాత్వా చ తుష్టావ పరమాత్మానమీశ్వరం l విష్ణుం బ్రహ్మా జగత్కాంతమిత్యువాచ హ భీతవత్ ll 68 శపించుటకు ప్రయత్నించుచున్న ఆ మాలావతిని చూచి దేవతలనందరును ముందుంచుకొని బ్రహ్మ క్షీరసముద్రమునకు విష్ణువును శరణుపొందుటకు వెళ్ళెను . అతడు క్షీరసముద్రమున స్నానము చేసి విష్ణుమూర్తిని స్తుతించి భీతిచెందినవానివలె ఇట్లనెను. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను- ఉపబర్హణపత్నీ సా కన్యా చిత్రరథస్య చ l కాంతహేతోశ్చ మా దేవాన్ శ##పేత్త్వం రక్ష మాధవ ll 69 స్మరంతి సాధవ ః సంతో జపంతి మునయో ముదా l స్వప్నే జాగరణ చైవ సర్వ కార్యేషు మాధవం ll 70 శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణ l రక్ష రక్ష హృషీకేశ వ్రజామ ః శరణం వయం ll 71 పూజా మే పుత్రశాపేన విహతా సాంప్రతం ప్రభో l అధికారహతం మాం చ కురుతే మాలతీ సతీ ll 72 సర్వాధికారే బ్రహ్మాండే త్వయా దత్త ః పురా ప్రభో l సంపదేతాదృశీ నాథ యాస్యత్యేవాధునా మమ ll 73 చిత్రరథుని కూతురు ఉపబర్హణుని భార్యయైన మాలావతి తన భర్త ప్రాణములకై నన్ను, దేవతలను శపించుచున్నది. అందువలన నీవు మమ్మందరిని రక్షింపుము. సాధుపుంగవులు నిన్ను స్మరింతురు. మహర్షులు నిన్ను ఎల్లప్పుడు సర్వకార్యములందు జపింతురు. ఓ శరణాగత దీనార్త త్రాణపరాయణ! హృషీకేశ మమ్ములను రక్షింపుము. మేమందరము నీ శరణు జొచ్చితిమి. నాపుత్రుని యొక్క శాపమువలన నా పూజ పోయినది . ప్రస్తుతము ఈ మాలావతి నన్ను అధికారమునుండి తొలగించుచున్నది. నీవు బ్రహ్మాండమున ఇచ్చిన సర్వాధికార సంపద ఇప్పుడు పోవుచున్నది అని అనెను. మహాదేవ ఉవాచ మహాదేవుడిట్లనెను - త్వయా దత్తం మహాజ్ఞానం గుప్తం సర్వేషు దుర్లభం l శతమన్వంతర తపఃఫలేన పుష్కరే పురా ll 74 ఐశ్వర్యం వా ధనం వాపి విద్యా వా విక్రమోzధవా l జ్ఞానస్య పరమార్థస్య కలాం నార్హంతి షోడశీం ll 75 సర్వాజ్ఞాతం సర్వగుప్తమత్యంతం దుర్లభం పరం l మమ తత్వజ్ఞానరత్నం శాపాన్నిర్యాతి యోషితః ll 76 అహో పతివ్రతాతేజః సర్వేషాం తేజసాం పరం l తేజోzనలేన దగ్దం మాం రక్ష రక్ష హరే హరే ll 77 ఓనారాయణా ! ఇతరులందరికి దుర్లభ##మైనది. మిక్కిలి గుప్తమైనది వంద మన్వంతరముల తపః ఫలితముగా నీవిచ్చినదీజ్ఞానము. ఐశ్వర్యమైనా ధనమైనా, విద్యయైనా, పరాక్రమమైనా పరమార్థ జ్ఞానము యొక్క షోడశ కళకు కూడ సరిపడవు. అత్యంత దుర్లభ##మైనది. మిక్కిలి గుప్తమైనది ఐన నా తత్వజ్ఞానమును ఒక స్త్రీ తొలగించుచున్నది. అన్ని తేజస్సుల కంటె మిన్నయైన పతివ్రతా తేజము చాలా గొప్పది. ఆమె తేజస్సనే అగ్నిచే దగ్దుడనగుచున్న నన్ను రక్షింపుము. ధర్మఉవాచ - ధర్మ దేవత ఇట్లనెను - సర్వరత్నాత్పరం రత్నం ధర్మం ఏవ సనాతనః l యాస్యత్యేవం విధో ధర్మస్త్వయా దత్త ః పురా ప్రభో ll 78 సప్తమన్వంతరతపః ఫలేన పరమేశ్వర l ప్రాప్తో ధర్మో zధునా యాతి శాపేన యోషితః ప్రభో ll 79 దేవా ఊచుః - దేవతలిట్లినిరి - యజ్ఞభాజో ఘృతభుజో వయమేవ త్వయా కృతా ః l యోషిచ్చాపేన తత్సర్వమధునా యాతి మాధవ ll 57 సమస్త రత్నములకంటె మిన్నయైన రత్నము సనాతనమైన ధర్మము. ఏడు మన్వంతరములు నేను చేసిన తపఃఫలితముగా దానిని నీవిచ్చితివి. ఆ ధర్మము ఒక స్త్రీ శాపమువలన పోవుచున్నది అని ధర్మదేవత అనెను. ఓ మాధవ నీవే మాకు యజ్ఞములందు భాగములను ఇచ్చితివి. అట్లే యజ్ఞహవిస్సులను తినునట్లు ఏర్పాటు చేసితివి. ఇదంతయు ఒక స్త్రీ యొక్క శాపముచే తొలగి పోవుచున్నది అని దేవతలనిరి . ఇత్యుక్త్వా సంయతాః సర్వే తస్థుస్తత్ర భయార్దితాః | ఏతస్మిన్నంతరే zకస్మాద్వాగ్బభూవాశరీరిణీ ll 81 యూయం గచ్ఛత తన్మూలం విప్రరూపీ జనార్దనః | పశ్చాద్యాస్యతి శాంత్యర్థమితి వో రక్షణాయ చ ll 82 శ్రుత్వా తద్వచనం దేవా ః ప్రహృష్టమనసోన్ముఖా ః l జగ్ముర్మాలావతీస్థానం కౌశికీ తీరమీశ్వరాః ll 83 తామేవ దదృశుర్దేవా దేవీం మాలావతీం సతీం l రత్నసారేంద్ర భూషాభిరుజ్జ్వలాం కమలా కళాం ll 84 వహ్నిశుద్ధాంశుకాధానా సిందూరబిందు భూషితాం l శరచ్చంద్రప్రభా శాంతాం ద్యోతయంతీం దిశస్త్విషా ll 85 పతిసేవామహాధర్మ చిరసంచితతేజసా l ప్రజ్వలంతీం సుప్రదీప్తశిఖాం వహ్నేరివోత్తమాం ll 86 యోగాసనం కుర్వతీం చ శవవక్షస్థలస్థితాం l సురమ్యాం స్వామినో వీణాం బిభ్రతీం దక్షిణ కరే ll 87 తర్జన్యంగుష్ఠకోటిభ్యాం శుద్ధస్ఫటికమాలికాం l భక్త్యా స్నేహేన కాంతస్య బిభ్రతీం యోగముద్రయా ll 88 చారుచంపకవర్ణాభాం బింబోష్ఠీం రత్నమాలినీం l యధా షోడశవర్షీయాం శశత్సుస్థిర¸°వనాం ll 89 బృహన్నితంబభారార్తాం పీనశ్రోణి పయోధరాం l పశ్యంతీం శవమీశస్య శుభదృష్ట్యా పునః పునః ll 90 ఏవం భూతాం చ తాం దృష్ట్యా దేవాస్తే విస్మయం యయుః l స్థగితాం చ క్షణం తత్ర ధార్మికా ధర్మభీరవః ll 91 అని వారందరు భయముతో అచ్చట ఉండిపోయిరి. ఆ సమయములో వారికి ''మీరందరు మాలావతి దగ్గరకు పొండు. బ్రాహ్మణ వేశధారియైన జనార్థనుడు మీవెనకు మిమ్ముల రక్షించుటకు ఆమెను శాంతి పరచుటకు రాగలడు '' అను అశరీరవాణి మాటలు విని దేవతలందరు సంతోషముతో మాలావతి ఉన్న కౌశికీనదీ తీరమునకు వెళ్ళిరి. అచ్చట పతివ్రతయైన మాలావతి రత్నభూషణములతో లక్ష్మీ దేవి కళ కలిగినదై, నిప్పువలె స్వచ్ఛమైన వస్త్రమును ధరించినదై, సందూరపు బొట్టు కలదై, శాంతురాలై శరత్కాల చంద్రుని కాంతిని దశదిశలను వెదజల్లుచు, పతి యొక్క సేవా ధర్మముచే చాలాకాలమునుండి సంపాదించిన తేజస్సుతో ప్రజ్వరిల్లుచున్న అగ్నిశిఖవలె శవమును వక్షస్థలముపై నుంచుకొని యోగాసనమున నుండి భర్తయొక్క వీణను కుడిచేతిలో పట్టుకొని, చూపుడు వ్రేలు, పెద్దవ్రేలుతో భర్తయొక్క స్ఫటిక మాలను యోగముద్రతో పట్టుకొని, అందమైన చంపకవర్ణపు కాంతి కలదై పదనునారేళ్ళ స్త్రీవలె సుస్థిర ¸°వనవతియై తన భర్త శవమును శుభంకరమైన దృష్టితో మాటి మాటికి చూచుచుండెను . ఆస్థితిలో నున్న మాలావతిని ధార్మికులు, ధర్మమునకు భయపడువారైన దేవతలు చూచి ఆశ్చర్యపడిరి . ఇతి శ్రీబ్రహ్మ వైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖండే మాలావతీ విలాపో నామ త్రయోదశోzధ్యాయః éశ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి - శౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండమున మాలావతీ విలాసమును పదమూడవ యధ్యాయము సమాప్తము.