sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

త్రయస్త్రిం శత్తమోzధ్యాయః - భార్గవరాముని స్వప్నము

నారాయణ ఉవాచ- నాలాయణముని ఇట్లు పలికెను-

శివం ప్రణమ్య సభృగుర్దుర్గాం కాళీం ముదాన్వితః | గత్వా పుష్కర తీర్థంచ మంత్రసిద్ధిం చకారసః || 1

స బభూవ నిరాహోరో మాసం భక్తి సమన్వితః | ధ్యాయన్‌ కృష్ణ పదాంభోజం వాయురోధం చకార సః || 2

దదర్శ చక్షురున్మీల్య గగనం తేజసాzవృతం | దిశోదశ ద్యోతయంతం సమాచ్ఛన్న దివాకరం || 3

తేజోమండల మధ్యస్థం రత్నయానం దదర్శ హ | దదర్శ తత్ర పురుషమత్యంతం సుందరం వరం || 4

ఈషద్ధాస్య ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం | ప్రణమ్య దండవన్నూర్థ్నా వరం వవ్రే తమీశ్వరం || 5

త్రిస్సప్తకృత్వో నిర్భుపాం కరిష్యామి మహీపతి | పాదారవిందే సుదృఢాం తాం భక్తిమనపాయినీం || 6

దాస్యం సుదుర్లభం శశ్వత్త్వత్పాదాబ్జే చ దేహి మే | కృష్ణస్తసై#్మ వరం దత్వా తత్రైవాంతరధీయత || 7

భార్గవ రాముడు శివునకు నమస్కరించి అట్లే దుర్గకు కాళికి కూడ నమస్కరించి శివుని అనుమతితో పుష్కరక్షేత్రమునకు వెళ్ళి అచ్చట మంత్ర సిద్ధికొరకు శ్రీకృష్ణుని మనస్సులో ధానించుకొనుచు ఒక మాస పర్యంతం నిరాహారుడై ప్రాణాయామము చేయుచు తపమాచరించుచుండెను. ఆ పరశురాముడు తపస్సు ముగించి కండ్లు తెరుచునప్పుడు ఆకాశమునంతయు తన దివ్య తేజస్సుతో ఆవరించి, సూర్యునికన్న గొప్ప కాంతితో దశ దిశలు వెలుగుచున్న ఒక దివ్యరథమును చూచెను. ఆ రథమున ఒక సుందరపురుషుడు చిరునవ్వుతో భక్తులననుగ్రహించుటకై వచ్చినట్లు కనిపించెను. ఆ దివ్య పురుషుని చూచి, తాను ఈ భూమిపై నున్న రాజులను ఇరువది యొక్క మార్లు జయించి ఇచ్చట రాజులు లేకుండ చేయునట్లు, శ్రీకృష్ణుని పాదారవిందములపై దృఢమైనది, అపాయరహితమైన దగు భక్తి కలిగియుండునట్లు, శ్రీకృష్ణ దాసుడై యుండునట్లు వరమును వేడగా ఆ పరమాత్మ అట్లే యని భార్గవరాముని అనుగ్రహించి అంతర్ధానమయ్యెను.

భృగుః ప్రణమ్య భవనం తజ్జగాన పరాత్పరం | పస్పంద దక్షిణాంగం చ పరం మంగళ సూచకం || 8

వాంఛా ప్రతీతి జననం సుస్వప్పం చ దదర్శ హ | మనః ప్రసన్నం స్ఫీతం చ తద్బభూవ దివానిశం ||

సంభాష్య స్వజనం సర్వం గృహే తస్థౌ ముదాన్వితః || 9

స్వశిష్యాన్‌ పితృశిష్యాంశ్చ భ్రాతృవర్గాంశ్చ బాంధావాన్‌ | ఆనీయానీయ వివిధాన్మంత్రాంశ్చ స చకారాహ || 10

పౌర్వాపర్యం స్వవృత్తాంతం తానేవోక్త్వా శుభక్షణ | తైరేవ సార్థం బలవాన్‌ బభూవ గమనోన్ముఖః || 11

దదర్శ మంగళం రామః శుశ్రావ జయసూచకం | బుబుధే మనసా సర్వం స్వజయం వైరి సంక్షయం || 12

యాత్రాకాలే చ పురతః శుశ్రావ సహసా మునిః | హరిశబ్దం సింహశబ్దం ఘంటాదుందుభివాదనం || 13

ఆకాశవాణీ సంగీతం జయస్తే భవితేతి చ | నవేంగితం చ కల్యాణం మేఘశబ్దం జయావహం || 14

చకార యాత్రాం భగవాన్‌ శ్రుత్వైవం వివిధం శుభం | దదర్శ పురతో విప్రవంది దైవజ్ఞభుక్షుకాన్‌ || 15

జ్వలత్ప్రదీపం దధతీం పతిపుత్రవతీం సతీం | పురో దదర్శ స్మేరాస్యాం నానా భూషణ భూషితాం || 16

శివం శివాం పూర్ణకుంభం చాషం చ నకులం తథా | గచ్ఛన్‌ దదర్శ రామశ్చ యాత్రామంగళ సూచకం || 17

కృష్ణసారం గజం సింహం తురగం గండకం ద్విపం | చమరీం రాజహంసం చ చక్రవాకం శుకం పికం || 18

మయూరం ఖంజనం చైవ శంఖచిల్లం చ కోరకం | పారావతం బలాకం చ కారండం చాతకం చటం || 19

సౌదామనీం శక్రచాపం సూర్యం సూర్య ప్రభాం శుభాం | సద్యోమాంసం సజీవం చ మత్స్యం శంఖం సువర్ణకం || 20

మాణిక్య రజతం ముక్తాం మణీంద్రం చ ప్రవాళకం | దధి లాజాన్‌ శుక్లధాన్యం శుక్లపుష్పం చ కుంకుమం || 21

పర్ణం పతాకం ఛత్రం చ దర్పణం శ్వేతచామరం | ధేనుం వత్స ప్రయుక్తాం చ రథస్థం భూమిపం తథా || 22

దుగ్ధమాజ్యం తథా పూగమమృతం పాయసం తథా | శాలగ్రామం పక్వఫలం స్వస్తితం శర్కరాం మధు || 23

మూర్జారం చ వృషేంద్రం చ మేషం పర్వతమూషికం | మేఘూచ్ఛన్నస్య చ రవేరుదయం చంద్రమండలం || 24

కస్తూరీం వ్యంజనం తోయం హరిద్రాం తీర్థమృత్తికాం | సిద్ధార్థం సర్షపం దూర్వాం విప్రబాలం చ బాలికాం || 25

మృగం వేశ్యాం షట్పదం చ కర్పూరం పీత వాసనం | గోమూత్రం గోపురీషం చ గోధూళిం గోపదాంకితం || 26

గోష్ఠం గవాం వర్త్మ రమ్యాం గోశాలాం గోగతిం శుభాం | భూషణం దేవమూర్తిం చ జ్వలదగ్నిం మహోత్సవం || 27

తామ్రం చ స్ఫటికం వంద్యం సిందూరం మాల్యచందనం | గంధం చ హీరకం రత్నం దదర్శ దక్షిణ శుభం || 28

సుగంధివాయోరాఘ్రాణం ప్రాప విప్రాశిషం శుభాం || 29

భార్గవరాముడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి తన ఇంటికి బయలుదేరెను. అప్పుడతనికి శుభశకునముగా కుడియవయములు అదరెను. తన కోరిక కనుగుణముగా మంచి కల (సుస్వప్నము) పడెను. అతని మనస్సు ఉద్విగ్నము కాక ప్రసన్నముగా నుండెను. రాత్రింబగళ్ళు వృద్ధి చెందినవి.

ఆ సమయమున బార్గవరాముడు తనవారిని, తనశిష్యులను, తనతండ్రి శిష్యులను, సోదరులను, బంధువులను అందరిని పిలిపించుకొని తన ఇంటిలో సమావిష్టుడై ముందు చేయు కార్యక్రమమునకై వారి ఆలోచనలను అడిగి తెలిసికొనెను. వాటి పూర్వాపరములను తన వృత్తాంతమునంతయు వారికి తెలియపరచి వారియొక్క ఆమోదమువలన తాను బలవంతుడై కార్తవీర్యునితో యుద్ధమునకై బయలుదేరెను.

భార్గవ రాముడు యుద్ధమునకు పోవు సమయమున అతనికి శుభశకునము లెదురైనవి. వాటి వలన అతడు తన శత్రువులు మరణింతురని, తనకు విజయము లభించునని తలచెను.

అతడు యుద్ధయాత్రకై బయలు దేరుచున్నప్పుడు మయూరము, సింహము, గంట దుందుభిధ్వానము వినిపించెను. ఆకాశవాణి కూడ అతనికి జయము కలుగునన్నట్లు పలికినది. అట్లే మంగళమును సూచించు నవేంగితము జయమును సూచించు మేఘ శబ్ధము వినబడినది.

అదే విధముగ అతనికి ఎదురుగా బ్రాహ్మణులు వందిమాగధులు, జ్యోతిష్కులు, భిక్షుకులు కనిపించిరి. వెలిగించిన దీపమును పట్టుకొని, అనేక భూషణములు ధరించి చిరునవ్వుతోనున్న ముత్తైదువ ఎదురు వచ్చినది. అతని యొక్క మార్గమున నక్క, పూర్ణకుంభము, నెమలి, ముంగిస మొదలైన మంగళసూచకములైన జంతువులు పక్షులు కనిపించినవి. అట్లే కృష్ణ సారము, ఏనుగు, సింహము, గుఱ్ఱము, గండకము, చమరీమృగము, రాజహంస, చక్రవాకము, చిలుక, కోకిల, నెమలి, కాటుకపిట్ట, చకోర పక్షి, పావురము, కొంగ, చాతకము, చటము, మెరుపు, ఇంద్రధనుస్సు, సూర్యుడు, సూర్యకాంతి, అప్పుడే తీసిన మాంసము, ప్రాణమున్నచేపలు, శంఖము, బంగారము, పెరుగు, పేలాలు, తెల్లని దాన్యము, తెల్లని పుష్పములు, కుంకుమ, పతాకము, ఛత్రము, అద్దము, తెల్లని చామరము, దూడతోనున్న ఆవు, రథముపై నున్న రాజు, పాలు, నెయ్యి, అమృతమను తిను పదార్థము, పాయసము, సాలగ్రామము, దోరమాగిన పండ్లు, స్వస్తికమను ఆహార పదార్థము, చక్కర, తేనె పిల్లి, ఎద్దు, మేక, అడవి ఎలుక, మబ్బుల నుండి విడిపోయిన చంద్రుడు, సూర్యుడు, కస్తూరి, నీరు, పసుపు, పుణ్యతీర్థములు మన్ను, తెల్లనూవులు, గరక బ్రహ్మణబాలకుడు, బాలిక, జింక, వేశ్య, తుమ్మెద, కర్పూరము, పట్టుబట్ట, గోమూత్రము, గోమయము, గోధూళి,

కొట్టము, పశువులు, నడచు త్రోవ, గోశాల, గోమార్గము, భూషణములు. దేవతామూర్తి, మండుచున్న నిప్పు, మహోత్సవము, రాగి, స్ఫటికము, సింధూరము, గంధము, రత్నము మొదలగువాటిని తన కుడి ప్రక్క చూచెను.

అదే విధముగా సువాసనగల వాయువు నాఘ్రాణించుచు బ్రహ్మణుల యొక్క ఆశీస్సులను పొందెను.

ఇత్యేవం మంగలం జ్ఞాత్వా ప్రయ¸° స ముదాన్వితః | అస్తంగతే దినకరే నర్మదా తీర సన్నిధౌ || 30

తత్రాక్షయవటం దివ్యం దదర్శ సుమనోహరం | అత్యూర్ధ్వ విస్తృతమతి పుణ్యాశ్రమ పదం వరం || 31

పౌలస్త్య తపసః స్థానం సుగంధిమరుదన్వితం | కార్తవీర్యార్జునాభ్యాశే తత్ర తస్థౌ గణౖః సహ || 32

సుష్వాప పుష్పశయ్యాయాం కింకరైః పరిసేవితః | నిద్రాం య¸° పరిశ్రాంతః పరమానంద సంగతః || 33

నిశాతీతే చ సభృగుశ్చారుస్వప్నం దదర్శహ |

ఈ విధముగా మంగళశకునములను చూచుచు భార్గవరాముడు సంతోషముతో యుద్ధ ప్రయాణము చేయసాగెను. సూర్యాస్తమన సమయమున అతడు నర్మదా తీరమున అక్షయ వట వృక్షమును చూచెను. దాని తరువాత మిక్కిలి విశాలమైన పౌలస్త్యముని ఆశ్రమ స్థానమును చేరుకొనెను. ఆ స్థలము కార్తవీర్యార్జునుని పట్టణమునకు సమీపముననున్నది. అచ్చట తనవారితో కలసి, పూలశయ్యపై పరుండెను. అతడు తెల్లవారు సమయమున ఒక సుందరస్వప్నమును చూచెను.

న చింతితం యన్మనః వాయుపిత్తకఫం వినా || 34

గజాశ్వశైల ప్రాసాద గో వృక్షఫలితేషు చ | ఆరుహ్యమాణమాత్మానం రుదంతం కృమిభక్షితం || 35

ఆరుహ్యమాణమాత్మానం నౌకాయాం చందనోక్షితం | ధృతవంతం పుష్పమాలాం శోభితం పీత వాససా || 36

విణ్మూత్రోక్షిత సర్వాంగం వసాపూయ సమన్వితం | వీణాం వరాం వాదయంతమాత్మానం చ దదర్శ హ || 37

విస్తీర్ణ పద్మ పత్రైశ్చ స్వం దదర్శ సరిత్తటే | దధ్యాజ్యమధుసంయుక్తం భుక్తవంతం చ పాయసం || 38

భుక్తవంతం చ తాంబూలం లభంతం బ్రహ్మణాశిషం |ఫలపుష్పప్రదీపం చ పశ్యంతం స్వం దదర్శ హ ||39

పరిపక్వఫలం క్షీరముష్ణాన్నం శర్కరాన్వితం | స్వస్తికం భుక్తవంతం స్వం దదర్శ చ పునః పునః || 40

జలౌకసా వృశ్చికేన మీనేన భుజగేన చ | భక్షితం భీతమాత్మానం పలాయంతం దదర్శ సః || 41

తతో దదర్శ చాత్మానం మండలం చంద్రసూర్యయోః | పతిపుత్రవతీం నారీం పశ్యంతం సస్మితం ద్విజః || 42

సువేషయా కన్యకయా సస్మితేన ద్విజేన చ | దదర్శ శ్లిష్టమాత్మానం తుష్టేన పరిశ్లిష్టయా || 43

ఫలితం పుష్పితం వృక్షం దేవతా ప్రతిమాం నృపం | గజస్థం చ రథస్థం చ పశ్యంతం స్వం దదర్శ హ || 44

పీత వస్త్ర పరీధానాం రత్నాలంకార శోభితాం | విశంతీం బ్రహ్మణీం గేహం పశ్యంతిం స్వం దదర్శ హ || 45

శంఖం చ స్ఫటికం శ్వేతమాలాం ముక్తాం చ చందనం | సువర్ణం రజతం రత్నం పశ్యంతం స్వం దదర్శ హ || 46

గజం వృషం చ సర్పం చ శ్వేత చ శ్వేత చామరం | నీలోత్పలం దర్ఫణం చ బార్గవో వై దదర్శ హ || 47

రథస్థం నవరత్నాఢ్యం మాలతీమాల్య భూషితం | రత్న సింహాసనస్థం స్వం భృగుః స్వప్నే దదర్శ హ || 48

భార్గవ రాముని స్వప్నము వాయుపిత్త కఫాది దూషితమైన నమస్సు చింతించినది కాదు.

అతని స్వప్నములో అతడు ఏనుగును, గుఱ్ఱమును, గుట్టను, సౌధమును ఎక్కుచున్నట్లు కనబడినది. క్రిములు తన శరీరమును భక్షించుచుండగా చూచి ఏడ్చుచున్నట్లు కనిపించినది. అట్లే చందనమును పూసికొని నౌకను ఎక్కినట్లు, పట్టువస్త్రమును, పుష్పమాలలను ధరించి యున్నట్లు కనిపించినది. మలమూత్రాములచే వసచే తన శరీరము పూయబడి ఉన్నట్లు, వీణను మ్రోగించుచున్నట్లు స్వప్నము వచ్చినది. నదీతీరమున వెడల్పైన పద్మముల రేకులపై నున్నట్లు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసము, తినుచున్నట్లు అటుపిమ్మట తాంబూలమును వేసికొని బ్రహ్మణుల ఆశీస్సులు తీసికొనుచున్నట్లు స్వప్నము కలిగినది. ఫలములను, పుష్పములను, దీపమును తాను చూచుచున్నట్లు, పండిన ఫలములను, పాలను, చక్కర కలిపిన వేడి వేడి యన్నమును, స్వస్తికము అనువంటను, తినుచున్నట్లు కల వచ్చినది. మరల అతనిని జలజంతువులు, తేళ్ళు, చేపలు, పాములు తినుటకు లేక కాటువేయుటకు రాగా భయముచే అతడు పరుగెత్తుచున్నట్లు కల వచ్చినది. తరువాత అతడు సూర్య చంద్రమండలముల చూచుచున్నట్లు, పుత్రులు కల ముత్తైదువ కనిపించినట్లు, స్వప్నము వచ్చెను. చక్కని వేషముతో నున్న కన్యక అతనిని కౌగలించుకొనినట్లు, బ్రహ్మణుడు సంతోషముతో ఆలింగనమొనర్చుకొన్నట్లు, ఫలములు, పుష్పములు గల వృక్షమును , దేవతా విగ్రహమును చూచినట్లు, తాను రథముపైనను, ఏనుగుపైనను ఉన్నట్లు, పట్టువస్త్రము, రత్నాలంకారములు ధరించిన బ్రహ్మణస్త్రీ తన ఇంటిలోనికి ప్రవేశించుచున్నట్లు, శంఖమును, స్ఫటికమును, తెల్లని, మాలను, ముత్యములను, చందనమును, బంగారును, వెండిని, రత్నమును, ఏనుగును, వృషభమును, తెల్లని సర్పమును శ్వేత చామరములను నీలోత్పలమును, అద్దమును కలలో చూచెను. తాను నవరత్నములుగల రథమును మాలతీ మాల ధరించి ఎక్కినట్లు, ఇంకను, రత్నసింహాసనమున ఉన్నట్లు కల గనెను.

పద్మశ్రేణీం పూర్ణకుంభం దధి లాజాన్‌ ఘృతం మధు | పర్ణఛత్రం ఛత్రిణం చ భృగుః స్వప్నే దదర్శహ || 49

బక పంక్తిం హంస పంక్తిం కన్యాపంక్తిం వ్రతాన్వితాం | పూజయంతీం ఘటం శుభ్రం భృగుః స్వప్నే దదర్శ హ || 50

మండవస్థం ద్విజగణం పూజయంతం హరం హరిం | జయోzస్త్విత్యుక్తవంతం తం భృగుః స్వప్నే దదర్శహ || 51

సుధావృష్టిం పర్ణవృష్టిం ఫలవృష్టిం చ శాశ్వతీం | పుష్పచందనం వృష్టిం చ భృగుః స్వప్నే దదర్శ హ || 52

సద్యోమాంసం జీవమత్స్యం మయూరం శ్వేతఖంజనం | సరోవరం చ తీర్థాని భృగుః స్వప్నే దదర్శహ || 53

పారావతం శుకం చాషం శంఖం చిల్లం చ చాతకం | వ్యాఘ్ర సింహం చ సురభిం భృగుః స్వప్నే దదర్శహ || 54

గోరోచనం హరిద్రాంచ శుక్ల ధాన్యాచలం వరం | జ్వలదగ్నిం తథా దూర్వాం భృగుః స్వప్నే దదర్శహ || 55

దేవాలయ సమూహం చ శివలింగం చ పూజితం | అర్చితాం మృణ్మయీం శైవాం భృగుః స్వప్నే దదర్శహ || 56

యవగోధూమ చూర్ణానాం భక్ష్యాణి వివిధాని చ | భృగుర్దదర్శ స్వప్నే చ బుభుజే చ పునః పునః || 57

దివ్యవస్త్రపరీధానా రత్నభూషణ భూషితాః | అగమ్యాగమనం స్వప్నే చకార భృగునందనః || 58

దదర్శ నర్తకీం వేశ్యాం రుధిరం చ సురాం పపౌ | రుధిరోక్షిత సర్వాంగః స్వప్నే చ భృగునందనః || 59

పక్షిణాం పీతవర్ణానాం మానుషాణాం చ నారద | మాంసాని బుభుజే రామో హృష్టః స్వప్నేzరుణోదయే || 60

ఆకస్మాన్నిగడైర్భద్ధం క్షతం శ##స్త్రేణ స్వం పునః | దృష్ట్వా చ బుబుధే ప్రాతః సముత్తస్థౌ హరింస్మరన్‌ || 61

భార్గవ రాముడు తన స్వప్నములో పద్మముల వరుసను, పూర్ణకుంభమును, పెరుగును, పేలాలను, నేతిని, తేనెను, తాటియాకులచే చేయబడిన ఛత్రి గల వానిని, కొంగల వరుసను, హంసల వరుసను, పూర్ణఘటమును పూజించు కన్యలను వ్రతమున నున్న కన్యలను, మండపములోనున్న శంకరుని లేక విష్ణువును పూజించుచున్న బ్రహ్మణులను, తనకు జయము కలుగునట్లు వారు ఆశీర్వదించుచున్నట్లు చూచెను.

అదేవిధముగా అమృతవర్షమును, ఆకులు రాలుటను, ఫలములు వర్షముగా పడుటను, పుష్పములు చందనముల వృష్టిని, అప్పుడే కోసిన మాంసమును, జీవించియున్న, చేపలను, నెమలిని, తెల్లని కాటుక పిట్టను, సరోవరమును, పుణ్యతీర్థమును, పావురమును. చిలుకను, పాలపిట్టను, శంఖమును, ఆడ చిన్న గ్రద్ధను, చాతక పక్షిని, పులిని, సింహమును, ఆవును, తన పూజలందుకొన్న శివలింగమును, అట్లే పూజింపబడిన మృణ్మయ లింగమును, తన స్వప్నములో భార్గవ రాముడు చూచెను. యవలు, గోధుమల పిండిని, రకరకములైన భక్ష్య పదార్థములను తినుచున్నట్లు దివ్యవస్త్రములు, దివ్యాలంకారములు ధరించిన దివ్య స్త్రీతో సంగమము చేయుచున్నట్లు, నర్తకి, వేశ్య, రక్తము, కల్లును, తనస్వప్నములో చూచెను. అట్లే తన శరీరము నందంతట రక్తమును పూసికొన్నట్లు, పచ్చని రంగుగల పక్షుల మాంసములను తినుచున్నట్లు, అకస్మాత్తుగా తనను సంకెళ్ళతో కట్టివేసినట్లు ఆయుధములచే దెబ్బలు తిన్నట్లు ఉదయకాలమందలి తన స్వప్నములో భార్గవ రాముడు చూచెను.

అతీవ హృష్టః స్వప్నేన ప్రాతః కృత్యం చకారసః | మనసా బుబుధే సర్వం విజేష్యామి రిపుం ధ్రువం || 62

ఉదయ కాలమున వచ్చిన ఈ శుభస్వప్నముల వలన భార్గవ రాముడు మిక్కిలి సంతోషించి తన శత్రువును తప్పక చంపగలనని తలచి తన ప్రాతః కృత్యములను సంతోషముతో చేసికొనెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతేయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే త్రయస్త్రింశత్తమోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్తమహపురాణములో మూడవదగు గణపతిఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన బార్గవ రాముని స్వప్న వృతాంతమను

ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters