sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షట్ త్రింశత్తమోzధ్యాయః - పరశురామ కార్తవీర్యర్జునుల యుద్దవర్ణనం నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను- మత్స్యరాజే నిపతితే రాజా యుద్ధ విశారదః | రాజేంద్రాన్ ప్రేషయామాస యుద్దే శస్త్ర విశారదాన్ ||
1 బృహద్బలం సోమదత్తం విదర్భం మిథిలేశ్వరం | నిషధాధిపతిం చైవ మగధాధిపతిం తథా ||
2 ఆయయుః సమరే యోద్దుం జామదగ్న్యం మహారథాః | త్రితయాక్షౌహిణీభిశ్చ సేనాభిః సహ నారద ||
3 రామస్య భ్రాతరః సర్వే వీరాస్తీక్ణాస్త్రపాణయః | వారయామాసురసై#్రశ్చ తానేవ రణమూర్థని ||
4 తే వీరాః శరజాలేన దివ్యాస్త్రేణ ప్రయత్నతః | మారయామాసురేకైకం భ్రాతృవర్గాన్ భృగోస్తథా ||
5 ఆయ¸° సమరే శ్రీఘ్రం దృష్ట్వా తాంశ్చ పరాజితాన్ | పినాకహస్తః సభృగుః జ్వలదగ్నిశిఖోపమః ||
6 రణరంగమున మత్స్యదేశాధీశ్వరుడు చనిపోయిన పిమ్మట యుద్ధమునందు ఆరితేరిన కార్తవీర్యుడు శస్త్రాస్త్ర విశారదులైన రాజశ్రేష్ఠులను రణరంగమునకు పంపెను. వారిలో మిక్కిలి బలము కల సోమదత్తుడు, విదర్భ దేశాధీశుడు, మిథిలనగరాధిపతి, నిషధాధిపతి, మగధరాజు మొదలగు వారు కలరు. మహారథులైన ఆ రాజన్యులు తమ తమ సేనలతో పరశురామనెదుర్కొనుటకు వచ్చిరి. వాడియగు శస్త్రాస్త్రసంపద కలిగిన పరశురాముని సోదరులు ఆ రాజులనందరను యుద్ధమున అడ్డగించిరి. అప్పుడా రాజులు తమ తమ బాణపరంపరచే అస్త్రములచే భార్గవరాముని సోదరులను వేరువేరుగా ఎదుర్కొనిరి. చిక్షేప నాగపాశం చ జమదగ్న్యో మహాబలః | చిచ్ఛేద తం గారుడే సోమదత్తో మహాబలః | 7 భృగుః శంకర శూలేన సోమదత్తం జఘాన హ | బృహద్బలం చ గదయా విదర్భం ముష్టిభిస్తథా || 8 మైథిలం ముద్గరేణౖవ శక్త్యావై నైషధం తథా | మగధం చరణోద్ఘాతైరస్త్రజాలేన సైనికాన్ || 9 నిహత్య నిఖిలాన్భూపాన్ సంహారాగ్ని సమో రణ | దుద్రావ కార్తవీర్యం చ జామదగ్న్యో మహాబలః || 10 మహాబలపరాక్రమబంతుడగు భార్గవ రాముడు ప్రయోగించిన నాగపాశమున సోమదత్తుడు గారుడాస్త్రముచే ఖండించెను. అప్పుడు పరశురాముడు శంకరుని త్రిశూలమును ప్రయోగించి ఆ మహారాజును సంహరించెను. అట్లే బృహద్బలుని గదచే, ముష్టిఘాతములచే విదర్భ దేశాధిపతిని, ముద్గరముచే మిథిలాధిపతిని, శక్త్యాయుధముచే నిషధాధిపతిని, పాదఘాతములచే మగధరాజును, ఇంకను తన అస్త్రములచే ఆయా రాజుల సైన్యమునంతయు సంహరించెను. ఈ విధముగా రాజులనందరను సంహరించి మహాబలపరాక్రమవంతుడగు భార్గవ రాముడు కార్తవీర్యార్జుని పైకి పరుగెత్తెను. దృష్ట్వా తం యోద్దుమాయాంతం రాజానశ్చ మాహారథాః | ఆయయుః సమరం కర్తుం కార్తవీర్యం నివార్యచ || 11 కాన్యకుబ్జాశ్చ శతశః సౌరాష్ట్రాః శతశస్తథా | రాష్ట్రీయాః శథశ##శ్చైవ వీరేంద్రాః శతశస్తథా || 12 సౌమ్యా వాంగశ్చ శతశో మహారాష్ట్రాస్తథా దశ | తథా గుర్జరజాతీయాః కలింగాః శతశస్థథా || 13 కృత్వా తు శరజాలం చ భృగుశ్చిచ్ఛేద తక్షణం | తం ఛిత్వాzభ్యుత్థితో రామో నీహార మివ భాస్కరః || 14 త్రిరాత్రం యయుధే రామసై#్తః సార్థం సమరాజిరే | ద్వాదశాక్షౌహిణీం సేనాం తథా చిచ్ఛేద పర్శునా || 15 రంభాస్తంభసమూహం చ యథా ఖడ్గేన లీలయా | ఛిత్వా సేనాం భూపవర్గం జఘాన శివశూలతః || 16 కార్తవీర్యార్జునితో యుద్ధము చేయుటకై వచ్చుచున్న భార్గవ రాముని చూచి కార్తవీర్యుని యుద్ధముచేయకుండ నివారించి మహారథులైన రాజులు భార్గవ రామునితో యుద్ధము సేయుటకు ముందునకు వచ్చిరి. వారిలో కాన్యకుబ్జ దేశమునకు చెందిన వారు నూరుగురు, నూరుగురు సౌరాష్ట్రదేశమునుక చెందినవారు, నూరుమంది రాష్ట్రీయులు, నూరుగు వీరేంద్రులు, నూరుగురు సోమదేశపువారు, నూరుగురు వంగదేశీయులు, పదిమంది మహారాష్ట్రులు, అట్లే గుర్జరదేశము కళింగదేశమునకు సంబంధింబచిన వారు వందలమంది ఉన్నారు. ఆ రాజన్యులు వేసిన శరవర్షమును భార్గవరాముడు క్షణకాలమున ఛిన్నాభిన్నము చేసెను. ఆ రాజుల బాణపరంపరమ తుత్తునియలు చేసిన భార్గవ రాముడు మంచును చీల్చుకొని వచ్చుచున్న సూర్యుని వలె ప్రకాశించెను. పరశురాముడు ఆ రాజులతో వారి సైన్యముతో ఒంటరిగా మూడు దినములు పోరాడి, ఆరాజులయొక్క పన్నెండు ఆక్షౌహిణుల సైన్యమును తన గండ్రగొడ్డలిచే, ఖడ్గముచే అరటి చెట్లను ఖండించినట్లు తేలికగా చంపెను. వారి సైన్యమునంతయు సంహరించిన పిదప శంకరుని యొక్క శూలముచే రాజులనందరను అవలీలగా సంహరించెను. సర్వాంస్తాన్నిహతాన్ దృష్ట్వా సూర్యవంశసముద్భవః | ఆజగామ సుచంద్రశ్చ లక్ష రాజేంద్ర సంయుతః || 17 ద్వాదశాక్షౌహిణీభిశ్చ సేనాభిః సహ సంయుగే | కోపేన యుయుధే రామం సింహం సింహో యథా రణ || 18 భృగుః శంకర శూలేన నృపలక్షం నిహత్య చ | ద్వాదశాక్షౌహిణీం సేనామహన్వై పర్శునా బలీ || 19 నిహత్య సర్వాసేనాశ్చ సుచంద్రం యుయుధే బలీ | నాగాస్త్రం ప్రేరయామాస నిర్ హృతం తం భృగుః స్వయం || 20 కాన్యకుజ్జమహారాజులు మొదలగు రాజులందరు యుద్ధమున చనిపోవుటను గమనించిన సూర్యవంశోద్భవుడగు సుచంద్రుడను రాజు లక్షలమంది రాజేంద్రులతో, పన్నెండు అక్షౌహిణుల సైన్యముతో కలసి సింహము సింహముతో పోరాడినట్లు యుద్ధము చేసెను. భార్గవ రాముడు శంకరుని యొక్క శూలముచే రాజుల నందరను సంహరించి తన గండ్రగొడ్డలిచే పన్నెండు అక్షౌహిణుల సైన్యమును చంపెను. ఈ విధముగా సుచంద్రుని సైన్యమును, అతని తోడి రాజన్యులను పరశురాముడు సంహరించి సుచంద్రునితో యుద్దము సేయదలచి ఆ మహారాజుపై నాగాస్త్రమును వేసెను. నాగపాశంచ చిచ్ఛేద గారుడేన నృపేశ్వరః | జహాస చ భృగుం రాజా సమరే చ పునః పునః || 21 భృగుర్నారాయణాస్త్రం చ చిక్షేప రణమూర్ధని | అస్త్రం య¸° తన్నిహంతుం శతసూర్యసమప్రభం || 22 దృష్ట్యాస్త్రం నృపశార్దూలశ్చావరుహ్య రథాత్ క్షణాత్ | న్యస్తశస్త్రః ప్రాణమచ్చ స్తుత్వా నారాయణం శివం || 23 తమేవం ప్రణతం త్యక్త్యా య¸° నారాయణాంతికం | అస్త్రరాజో భగవతో రామః సంప్రాప విస్మయం || 24 భృగుః శక్తిం చ ముసలం తోమరం పట్టిశం తథా | గదాం పర్శుం చ కోపేన చిక్షిపే తజ్జిఘాంసయా || 25 జగ్రాహ కాళీ తాన్సర్వాస్సుచంద్ర స్యందనస్థితా | చిక్షేప శివశూలం స నృపమాల్యం బభూవ తత్ || 26 దదర్శ పురతో రామో భద్రకాళీం జగత్ప్రసూం | వహంతీం ముండమాలాం చ వికటాస్యాం భయంకరీం || 27 విహాయ శస్త్రమస్త్రంచ పినాకం చ భృగుస్తథా | తుష్టావ తాం మహామాయాం భక్తినమ్రాత్మకంధరః || 28 మహారాజగు సుంచద్రుడు గారుడాస్త్రమును పడగొట్టి భార్గవరాముని చూచి నవ్వెను. అప్పుడు భార్గవరాముడు నారాయణాస్త్రమును ప్రయోగింపగా శతసూర్యులతో సమానమైన కాంతిగల యా నారాయణాస్త్రము సుచంద్రుని చంపుటకు పోయెను. అప్పుడామహారాజువెంటనే తన రథమునుండి క్రిందకు దిగి తన అస్త్రశస్త్రములనన్నిటిని వదలి నారాయణాస్త్రమునకు నమస్కరించెను. ఈవిధముగా తనకు నమస్కరించుచున్న మహారు%ాజును వదలిపెట్టి నారాయణాస్త్రము నారాయణుని చేరుకొనగా భార్గవరాముడు చాలా ఆశ్చర్యపడెను. వెంటనే భార్గవ రాముడు సుచంద్రుని చంపుటకై శక్తిని, ముసలమును, తోమరమును, పట్టిశమును, గదను, గొడ్డలిని ప్రయోగించగా ఆ మహారాజుయొక్క రథములో ఉన్న కాళికాదేవి భార్గవరాముడు ప్రయోగించిన శస్త్రములనన్నిటిని గ్రహించి పారవేసెను. అప్పుడు పరశురాముడు శివ శూలమును విసిరివేయగ నది యా మహారాజుమెడలో మాలయైనది. అప్పుడు కూడ భార్గవ రాముడు ఆశ్చర్యపడిచూడగా నా మహారాజు యొక్క రథముపై జగన్మాతయు, పుఱ్ఱల పేరును మెడలో ధరించినదియు, మహాభయంకరమైన నోరుగలదియగు భద్రకాళి కనిపించినది. అప్పుడా భార్గవరాముడు తన శస్త్రాస్త్రములను, ధనుస్సును వదిలిపెట్టి ఆ మహామాయను భక్తితో తలవంచుకొని నమస్కరించెను. పరశురామ ఉవాచ- పరశురాముడు భద్రకాళితో నిట్లనెను- నమః శంకరకాంతాయై సారాయై తే నమో నమః | నమో దుర్గతి నాశిన్యై మాయాయై తే నమో నమః || 29 నమో నమో జగద్దాత్ర్యై జగత్కర్య్రై నమో నమః | నమోస్తు తే జగన్మాతే కారణాయై నమో నమః || 30 ప్రసీద జగతాం మాతః సృష్టి సంహారకారిణి | త్వత్పాదౌ శరణం యామి ప్రతిజ్ఞాం సార్థికాం కురు || 31 త్వయి మే విముఖాయాంచ కో మాం రక్షితుమీశ్వరః | త్వం ప్రసన్నా భవ శుభే మాం భక్తం భక్తవత్సలే || 32 యుష్మాభిః శివలోకే చ మహ్యం దత్తో వరః పురా| తం వరం సఫలం కర్తుత్వమర్హసి వరాననే || 33 శంకరుని భార్యవు. సారరూపిణి యగు నీకు నమస్కారము. అట్లే దుఃఖములను దూరము చేయు మాయా స్వరూపిణి యగు నీకు నమస్సులు. జగములన్నిటికి ఆధారభూతవు. జగములన్నిటికి సృష్టికర్తవు. జగన్మాతవు, కారణరూపిణివి అగు నీకు నమస్కారము. లోకములనన్నిటిని, సృష్టించుచు సంహరించుచున్న ఓ జగన్మాతా!నీవు శాంతింపుము. నేను నీ పాదములను శరణు వేడుచున్నాను. నీవు నా ప్రతిజ్ఞను సఫలము చేయుము. జగన్మాతవగు నీవే కోపించినచో నన్ను రక్షించువారెవ్వరు? భక్తవత్సలవగు నీవు భక్తుడనగు నాపై ప్రసన్నురాలవుకమ్ము. శివలోకమున మీరు నాకిచ్చిన వరమును సఫలము చేయుమని భార్గవ రాముడు భద్రకాళిని ప్రార్థించెను. రేణుకేయస్తవం శ్రుత్వా ప్రసన్నాzభవదంబికా | మా భైరిత్యేవ ముక్త్యా తు తత్రైవాంతరధీయత || 34 ఏతత్ భృగుకృతం స్తోత్రం భక్తియుక్తశ్చ యః పఠేత్ | మహాభయాత్సముత్తీర్ణః స భ##వేదేవ లీలయా || 35 స పూజితశ్చ త్రైలోక్య తత్రైవ విజయీ భ##వేత్ | జ్ఞాని శ్రేష్ఠో భ##వేచ్చైవ వైరి పక్షవిమర్దకః || 36 ఏతస్మిన్నంతరే బ్రహ్మ భృగుం ధర్మభృతాం వరం | ఆగత్య కథయామాస రహస్యం రామమేవ చ || 37 భార్గవ రాముడు చేసిన స్తుతిని విని భద్రకాళి చాలా సంతోషించి నీవు భయపడకుమని చెప్పి అక్కడనే అంతర్దానమయ్యెను. భార్గవరాముడు చేసిన ఈ స్తోత్రమును భక్తితో చదివిన వాడు అవలీలగా మహాభయములనన్నిటిని తప్పించుకొనును. అతడు త్రైలోక్యపూజితుడగను. విజయములనన్నిటిని పొందును. అతడు మిక్కిలి జ్ఞానము కలవాడై శత్రువులనందరను నాశనము చేయగలుగును. ఆ సమయమున ధర్మిష్ఠులలో శ్రేష్ఠుడగు బ్రహ్మదేవుడు అచ్చటకు వచ్చి భార్గవరామునకు ఒక రహస్యమునిట్లు చెప్పెను. బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లు పలికెను- శ్రుణురామ మహాభాగ రహస్యం పూర్వమేవ చ | సుచంద్రజయహేతుం చ ప్రతిజ్ఞా ఫలమేవ చ || 38 దశాక్షరీ మహావిద్యా దత్తా దుర్వాససా పురా | సుచంద్రాయైవ కవచం భద్రకాళ్యాః సుదుర్లభం || 39 కవచం భద్రకాళ్యాశ్చ దేవానాం చ సుదుర్లభం | కవచం తద్గళే యస్య సర్వ శత్రు విమర్దకం || 40 అతీవ పూజ్యం శస్తం చ త్రైలోక్యజయకారణం | తస్మిన్ స్తితే చ కవచే కస్త్యం జేతుమలం భువి || 41 భృగో గచ్ఛతు భిక్షార్థం కరోతు ప్రార్థనాం నృపం | సూర్య వంశోద్భవో రాజా దాతా పరమ ధార్మికః || 42 ప్రాణాంశ్చ కవచం మంత్రం సర్వం దాస్యతి నిశ్చితం || 43 భృగుః సన్యాసి వేషేణ గత్వా రాజాంతికం మునే | భిక్షాం చకార మంత్రం చ కవచం పరమాద్భుతం || 44 రాజా దదౌ చ తన్మంత్రం కవచం పరమాదరాత్ | తతః శంకరశూలేన తం జఘాన నృపం భృగుః || 45 ఓ భార్గవ రామా! నీవు సుచంద్రుని జయింపగలుగునది, నీప్రతిజ్ఞకు ఫలించు రహస్యమొకటి వినుము. దుర్వాసమహర్షి సుచంద్రునకు దశాక్షరీ మహామంత్రమును, భద్రకాళీ కవచమును ఉపదేశించెను. భద్రకాళీ కవచము దేవతలకు కూడ లభ్యము కానిది. ఆ కవచము ఎవరియొక్క కంఠముననుండునో అతనికి విజయము తప్పక లభించును. ఆ కవచము నీదగ్గర యుండినచో నిన్ను ఎవరును జయింపజాలరు. ఓభార్గవరాముడా! నీవు సుచంద్రుని దగ్గరకు వెళ్ళి ఈ కవచమును యాచింపుము. సూర్యవంశమందు పుట్టిన ఆ రాజు పరమధార్మికుడు, దానము చేయు స్వభావము కలవాడు. అతనిని యాచించినచో కవచమును, మంత్రమునే కాక ప్రాణములను సహితము దానము చేయును. అని చెప్పగా భార్గవరాముడు సన్యాసి వేషమున ఆ మహారాజునొద్దకు వెళ్ళి భద్రకాళియొక్క కవచమును, మంత్రమును దానముసేయుమని కోరెను. అప్పుడు సుంచంద్రుడు కూడ సంకోచ పడక మిక్కిలి యాదరముతో అతనికి భద్రకాళి యొక్క కవచమును, మంత్రమును దానము చేసెను. అప్పుడు పరశురాముడు శంకరుని శూలమును ప్రయోగించి ఆ మహారాజును చంపెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారాయణ సంవాదే భృగు కార్తవీర్య యుద్ధవర్ణనం నామ షట్త్రింశత్తమోzధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణ మునుల సంవాదసమయమునను తెలుపబడిన కార్తవీర్య పరశురాముల యుద్ధవర్ణనమను ముప్పయ్యారవ అధ్యాయము సమాప్తము.