sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్తత్రింశత్తమోzధ్యాయః - భద్రకాళీ కవచ నిరూపణం నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను- కవచం శ్రోతు మిచ్చామి తాం చ విద్యాం దశాక్షరీం | నాథ త్వత్తో హి సర్వజ్ఞ భద్రకాళ్యాశ్చ సాంప్రతం ||
1 ఓ నారాయణమునీ! నాకు భద్రకాళియొక్క కవచమును, దశాక్షరమైన భద్రకాళీ మంత్రమును తెలిసికొనవలెనని యున్నది. నీవు సర్వము తెలిసినవాడవు కావున వీటిని నాకు వివరింపుమని కోరెను. నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు చెప్పెను- శ్రుణు నారద వక్ష్యామి మహావిద్యాం దశాక్షరీం | గోపనీయం చ కవచం త్రిషు లోకేషు దుర్లభం ||
2 ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహేతి చ దశాక్షరీం | దుర్వాసా హి దదౌ రాజ్ఞై పుష్కరే సూర్య పర్వణి ||
3 దశలక్షజపేనైవ మంత్రసిద్ధిః కృతా పురా | పంచ లక్షజపేనైవ పఠన్ కవచ ముత్తమం ||
4 బభూవ సిద్ద కవచోzప్యయోధ్యా మాజగామ సః | కృత్నాం హి పృథివీం జిగ్యే కవచస్య ప్రభావతః ||
5 ఓనారద! దశాక్షరియగు మహావిద్య, గోప్యముగా ఉంచ తగినది, ముల్లోకములయందు లభ్యము కానిదగు ఈ కవచమును నీకు నేను వివరించి చెప్పెదను. "ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా" అనునది దశాక్షరి యగు భద్రకాళీ మంత్రము. దీనిని సూర్యగ్రహణ సమయమున పుష్కరక్షేత్రమున రాజునకు దూర్వాసమహర్షి ఉపదేశించెను. ఈమంత్రమును పది లక్షల పర్యాయములు జపించినచో మంత్ర సిద్ధి కలుగును. అట్లే ఈ కవచమును ఐదు లక్షల పర్యాయములు పఠించినచో కవచ సిద్ధి కలుగును. ఇట్లు మంత్ర సిద్ధిని కవచ సిద్ధిని, పొంది రాజగు సుచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చెను. ఆ కవచముయొక్క ప్రభావమువలన సుచంద్రుడు భూమినంతయు జయించెను అని పలికెను- నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు పలికెను- శ్రుతా దశాక్షరీ విద్యా త్రిషు లోకేషు దుర్లభా | అధునా శ్రోతు మిచ్ఛామి కవచం బ్రూహి మే ప్రభో || 6 నీ అనుగ్రహమువలన ముల్లోకములయందు దుర్లభ##మైన కాళికా దేవియొక్క దశాక్షరీ మంత్రమును వింటిని. ఇప్పుడు నాకు భద్రకాళియొక్క కవచమును నాకు తెలుపుమని కోరెను. నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలుకసాగెను- శ్రుణు వక్ష్యామి విప్రేంద్ర కవచం పరమాద్భుతం | నారాయణన యద్దత్తం కృపయా శూలినే పురా || 7 త్రిపురస్య వధే ఘోరే శివస్య విజయాయ చ | తదేవ శూలినా దత్తం పురా దుర్వాససే మునే || 8 దుర్వాససా చ యద్దత్తం సుచంద్రాయ మహాత్మనే | అతి గుహ్యంతరం తత్వం సర్వమంత్రౌఘ విగ్రహం || 9 ఓ నారదమునీ నీకు అత్యుద్భుతమైన భద్రకాళీ కవచమును వివరింతును. దీనిని పూర్వకాలమున శ్రీమన్నారాయణుడు త్రిపురాసుర సంగ్రామ సమయమున శివుడు విజయమును పొందవలెనని అతనికి ఉపదేశించెను. శంకరుడు దీనిని దుర్వాసమహర్షికి ఉపదేశింపగా అతడు సుచంద్రమహారాజునకు ఉపదేశించెను. ఈ కవచము మక్కిలి రహస్యమైనది. సమస్త మంత్రములకు సారభూతమైనది అని అనెను. ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా మే పాతు మస్తకం | క్లీం కపాలం సదాపాతు హ్రీం హ్రీం హ్రీమితిలోచనే || 10 ఓం హ్రీం త్రీలోచనే స్వాహా నాసికాం మే సదాzవతు | క్లీం కాళికే రక్ష రక్ష స్వాహా దంతాన్సదాzవతు || 11 క్లీం భద్రకాళికే స్వాహా పాతుమేzధరయుగ్మకం | ఓం హ్రీం హ్రీం క్లీం కాళికాయై స్వాహా కంఠకం సదాzవతు || 12 ఓం హ్రీం కాళికాయై స్వాహా కర్ణయుగ్మం సదాzవతు | ఓం క్రీం క్రీం క్లీం కాళ్యైస్వాహా స్కంధం పాతు సదామమ || 13 ఓం క్రీం భద్రకాళ్యై స్వాహా మమ వక్షః సదాzవతు | ఓం క్లీం కాళికాయై స్వాహా మమ నాభిం సదాzవతు || 14 ఓం హ్రీం కాళికాయై స్వాహా మమపృష్ఠం సదాzవతు | రక్త బీజ వినాశిన్యై స్వాహా హస్తౌ సదాzవతు || 15 ఓం హ్రీం క్లీం ముండమాలిన్యై స్వాహా పాదౌ సదాzవతు | ఓం హ్రీం చాముండాయై స్వాహా సర్వాంగం మే సదాzవతు || 16 ప్రాచ్యాం పాతు మహాకాళీ చాగ్నేయ్యాం రక్త దంతికా | దక్షిణ పాతు చాముండా నైఋత్యాం పాతు కాళికా || 17 శ్యామా చ వారుణ పాతు వాయున్యాం పాతు చండికా | ఉత్తరే వకటాస్యా చాపై#్యశాన్యాం సాట్టహాసినీ || 18 పాతూర్ధ్వం లోలజిహ్వా సా మాయాzధ్యా పాత్వధః సదా | జలే స్థలే చాంతరిక్షే పాతు విశ్వ ప్రసూః సదా || 19 ఓం హ్రీం శ్రీం క్లీం కాళికాయై స్వాహా అను మంత్రము నా శిరస్సును రక్షించుగాక! క్లీం అను మంత్రము నాకపాలమునురక్షించుగాక! హ్రీం హ్రీం హ్రీం అను మంత్రము నా కన్నుల రక్షించుగాక! ఓం హ్రీం త్రిలోచనే స్వాహా అనునది నా నాసికను రక్షించుగాక! క్లీం కాళికే రక్ష రక్ష స్వాహా అనునది నా దంతములను రక్షించుగాక! క్లీం భద్రకాళికే స్వాహా అను మంత్రము నా అధరములను రక్షించుగాక! ఓం హ్రీం హ్రీం క్లీం కాళికాయై స్వాహా అనునది నా కంఠమును రక్షించుగాక! ఓం హ్రీం కాళికాయై స్వాహా అను మంత్రము నాకర్ణములను రక్షించుగాక! ఓం క్రీం క్రీం క్లీం కాళ్యైస్వాహా అను మంత్రము నా స్కంధములను రక్షించుగాక! ఓం క్లీం భద్రకాళ్యై స్వాహా అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక! ఓం క్లీం కాళికాయై స్వాహా అను మంత్రము నా నాభిని రక్షించుగాక! ఓం హ్రీం కాళికాయై స్వాహా అనుమంత్రము నా పృష్ఠభాగమును రక్షించుగాక! రక్తబీజవినాశిన్యై స్వాహా అను మంత్రము నా చేతులను ఎల్లప్పుడు రక్షించుగాక! ఓం హ్రీం క్లీం మండమాలిన్యై స్వాహా అను మంత్రము నాపాదములను రక్షించుగాక! ఓం హ్రీం చాముండాయైస్వాహా అను మంత్రము నాసర్వాంగముల రక్షించుగాక! కాళికాదేవి నా తూర్పుదిక్కును, రక్త దంతిక ఆగ్నేయదిగ్భాగమును, చాముండ దక్షిణ దిగ్భాగమును, కాళిక నా నైఋతి దిగ్భాగమును, శ్యామ నా పశ్చిమ దిశను, చండిక నా వాయవ్య దిగ్భాగమును, వికటాస్య నా ఉత్తర దిగ్భాగమును, అట్టహాసినీ జలమున, స్థలమున ఆకాశమున ఎల్లప్పుడు రక్షించుగాక. ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘ విగ్రహం | సర్వేషాం కవచానాం చ సారభూతం పరాత్పరం || 20 సప్తద్వీపేశ్వరో రాజా సుచంద్రోzస్య ప్రభావతః | కవచస్య ప్రభావేణ మాంధాతా పృథివీపతిః || 21 ప్రచేతా లోమశ##శ్చైవ యతః సిద్ధో బభూవ హ | యతో హి యోగినాం శ్రేష్ఠః సౌభరిః పిప్పిలాయనః || 22 యదిస్యాత్సిద్దకవచః సర్వసిద్ధీశ్వరో భ##వేత్ | మహాదానాని సర్వాణి తంపాస్యేవం వ్రతానిచ | నిశ్చితం కవచస్యాస్య కలాం నార్హంతి షోడశీం || 23 ఓ నారదా!ఈవిధముగా నీకు సమసమ్తమంత్రములయొక్క సారభూతమైనది, సమస్త కవచముల యొక్క సారభూతమైన భద్రకాళీ కవచమును తెల్పితిని. ఈ కవచముయొక్క ప్రభావము వలన సుచంద్రుడు అఖండమైన భూమండలమునకు అధిపతి కాగల్గెను. అట్లే మాంధాత చక్రవర్తి కాగలిగెను. ప్రచేతసుడు, లోమశడు ఈ కవచము యొక్క ప్రభావము వలననే సిద్దులు కాగల్గిరి. పిప్పలాయనుడగు సౌభరి యోగులలో శ్రోష్ఠుడయ్యెను. ఈ కవచము సిద్దించినచో అతడు సమస్త సిద్దిగణమున శ్రేష్ఠుడగును. మహాదానములు, సమస్త తపస్సులు, సమస్త వ్రతములు ఈ కవచమునకు పదువారవ అంశ##మైన కాజాలవు. ఇదం కవచ మజ్ఞాత్వా భ##జేత్కాళీం జగత్ప్రసూం | శతలక్షం ప్రజప్తోzపి న మంత్రః సిద్దిదాయకః || 24 ఈ కవచమును వదిలిపెట్టి జగన్మాతయగు భద్రకాళి మంత్రమును కోటి పర్యాయములు జపించినను ఆ మంత్రము సిద్ధింపదు అని పలికెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే భద్రకాళీ కవచ నిరూపణం నామ సప్తత్రింశత్తమోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన భద్రకాళీ కవచమను ముప్పయియేడవ యధ్యాయము సమాప్తము.