sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టథ్రింశత్తమోZధ్యాయః - పరశురామనకు శ్రీలక్ష్మీ కవచ వర్ణనం నారాయణ ఉపాచ- నారాయణుడు నారదునితో ఇట్లులు పలికెను- సూర్యచంద్రే పతితే బ్రహ్మన్రాజేంద్రాణాం శిరోమణిః | ఆగమత్పుష్కరాక్షస్తు సేనాతయక్షౌహిణీయుతః ||
1 సూర్యవంశోద్భవో రాజా సుచంద్ర తనయో మహాన్ | మహాలక్ష్మీ సేవకశ్చ లక్ష్మీవాన్ సూర్య సన్నిభః ||
2 మహాలక్ష్మాశ్చ కవచం గళే యస్య మనోహరం | పరమైశ్వర్య సంయుక్త సై#్రలోక్య విజయీ తతః ||
3 ఓ నారదా! రాజేంద్రులలో శ్రేష్ఠుడగు సుచంద్రుడు రణరంగమున పడిపోయునప్పుడు పుష్కరాక్షుడనువాడు మూడక్షౌహిణుల బలముతో రణరంగమునకు వచ్చెను. పుష్కరాక్షుడు సూర్యవంశోద్భవుడగు సుచంద్రమహారాజు యొక్క పుత్రుడు. అతడు ఎల్లపుడు మహాలక్ష్మీని సేవించుచుండును. అతని కంఠమున నెల్లప్పుడు మహాలక్ష్మీ దేవి యొక్క కవచముండును. ఆ కవచము వలన అతడెల్లప్పుడు అంతులేని యైశ్వర్యముతో ముల్లోకములను జయింప గలిగి యుండెను. అని పలికెను. తం దృష్ట్వా భ్రాతరః సర్వే రైణుకేయస్య ధీమతః | ఆయయః సమరం కర్తుం నానాశస్త్రాస్త్ర పాణయః ||
4 రాజేంద్రః శరజాలేన ఛేదయామాస తాంస్తథా | చిచ్ఛుదుః శరజాలం చ తేవీరాశ్చైవ లీలయా ||
5 చిచ్ఛుదుః స్యందనం రాజ్ఞఃతేవీరా ః పంచబాణతః | సారథిం పంచబాణన రథాశ్వం దశభాణతః ||
6 తద్ధనుః సప్తబాణన తూర్ణం వై పంచబాణతః | చిచ్ఛుదుస్తద్భ్రాతృవర్గాన్ విప్రాః శంకరశూలతః ||
7 తేచ త్రక్షైహిణీం సేనాం నిజఘ్నశ్చాపి లీలయా | హంతుం నృపేంద్రం తే వీరా ః శివశూలం నిచిక్షిపుః || గలే బభూవ తచ్ఛాలం రాజ్ఞః పుష్కరమాలికా || 8 శక్తిం చ పరిఘం చైవ భుశుండీం ముద్గరం తథా | గదాంచ చిక్షిపుర్విప్రాః కోపేన జ్వలదగ్నయః || 9 తాని శస్త్రాణి చూర్ణాని క్ష్మాభృతో దేహయోగతః | విస్మితా భ్రాతరః సర్వే భృగో రేవ మహామునే || 10 రథం ధనుశ్చ శస్త్రాణి చాస్త్రాణి వివిధాని చ | సేనాం ప్రస్థాపయామాస కార్తవీర్యార్జునః స్వయం || 11 రాజా స్యందనమారుహ్య పుష్కరాక్షో మహాబలః | చకార శరజాలం చ మహాఘోరతరం మునే || 12 చిచ్ఛుదుః శరజాలం తే వీరాః శస్త్రాస్త్రపాణయః | రాజా వ్పస్వాపనేనైవ నిద్రితాంస్తాంశ్చకార హ|| 13 భ్రాతౄంశ్చ నిద్రితాన్ దృష్ట్వా జామదగ్నో మహాబలః | క్షత విక్షత సర్వాంగన్ బోధయామాస తత్వతః || 14 బోధయిత్వా తాన్నివార్య జగామ రణమూర్ధని | చిక్షేప పర్శుం కోపేన శీఘ్రం రాజ జిఘాంసయా || 15 ఛిత్వా రాజ్ఞః కిరీటం చ పర్శుర్భూమౌ పపాత హ | జగ్రాహ పరశుం శీఘ్రం జామదగ్నో మహాబలః || 16 తదా శంకర శూలం చ చిక్షేపే మంత్ర పూర్వకం | నృపస్య కుండలం ఛిత్వా జగామ శివ సన్నిధిం || 17 రాజా నిహంతుం తం రామం శరజాలం చకార హ | చిచ్ఛేద శరజాలం చ రైణుకేశ్చలీలయా || 18 క్రమేణ రాజా నానాస్త్రం చిక్షేపే మంత్రపూర్వకం | తచ్ఛిచ్ఛేద క్రమేణౖవ భృగు శస్త్రభృతాం వరః || 19 భృగుశ్చిక్షేప నానాస్త్రం మహాసంధాన పూర్వకం | తచ్చిచ్ఛేద మహారాజః సంధానేనైవ లీలయా || 20 రామశ్చిక్షేప సంధాయ బ్రహ్మస్త్రం మంత్ర పూర్వకం | రాజా నిర్వాపణం చక్రే సంధానేనైవ లీలయా || 21 సర్వాణ్యస్త్రాణి శస్త్రాణి రామః పాశుపతం వినా | చిక్షేప కోప విభ్రాంతో భూపశ్చిచ్ఛేద తాని చ || 22 రామః స్తుత్వా శివం నత్వాZదదే పాశుపతం మునే | నారాయణచ్ఛ భాగవానోచద్విప్రరూపధృక్ || 23 రణరంగమునకు వచ్చిన పుష్కరాక్ష మహారాజును చూచి భార్గవరాముని సోదరులందరు అనేక శస్త్రాస్త్రములను ధరించి అతనితో యుద్ధము చేయుటకై బయలుదేరిరి. అప్పుడ పుష్కరాక్షుడు తన బాణములచే భార్గవరాముని సోదరులను వేధించసాగెను. భార్గవరాముని సోదరులు పుష్కరాక్షమహారాజు ప్రయోగించిన బాణజాలమును అవలీలగా ఛేదించిరి. అట్లే ఐదు బాణములు వేసి ఆ మహారాజు యొక్క రథమును భగ్నము చేసిరి. ఇంకను ఐదు బాణములు వేసి ఆ మహారాజు యొక్క సారథిని పదిబాణములతో అతని రథాశ్వములను చంపివేసిరి. అట్లే ఏడుబాణములతో ఆ మహారాజుయొక్క ధనుస్సును ఐదు బాణములతో అతని అమ్ములపొదిని భగ్నము చేసి శంకరుని యొక్క శూలమును ప్రయోగించి పుష్కరాక్షుని సోదరులను, అతని యొక్క మూడక్షౌహిణుల సైన్యమును సంహరించిరి. భార్గవరాముని సోదరులు ప్రయోగించిన శక్తి పరిఘమును, భుంశుండి, ముద్గరము, గద మొదలగు ఆయుధములన్నియు ఆ మహారాజు యొక్క శరీరమును తగులగనే పిండియై పోయినవి. దానిని చూచి పరశురాముని సోదరులందరు ఆశ్చర్యపోయిరి. అప్పుడు కార్తవీర్యార్జునుడు తన రథమునెక్కి ధనువు, అస్త్రశస్త్రములను ధరించి తన సేనను వెంటనిడుకొని రణరంగమునకు బయలుదేరెను. ఆసమయమున పుష్కరాక్ష మహారాజు రథమునెక్కి బాణములచే మహాభయంకరమైన యుద్ధమును చేసెను. బార్గవరాముని సోదరులు శస్త్రాస్త్రములు ధరించి పుష్కరాక్షుని బాణముల నిన్నింటిని భగ్నము చేసిరి. అప్పుడు పుష్కరాక్షుడు నిద్రాస్త్రమును వేసి వారినందరును నిద్రపోవునట్లు చేసెను. తన తమ్ములందరు పుష్కరాక్షుని బాణములచే దెబ్బలు తిని నిద్రపోవుచుండగా మహాబలుడగు భార్గవ రాముడు చూచి వారిని తత్వజ్ఞానముచే మేల్కొల్పి వారిని యుద్ధరంగమునకు వెళ్ళకుండ నిరోధించి పుష్కరాక్షుని చంపుటకై తాను స్వయముగా బయలు దేరెను. పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగింపగా అది రాజుయొక్క కిరీటమును క్రింద పడవేసి భూమిపై పడిపోయినది. పరశురాముడు తన గండ్రగొడ్డలిని తిరిగి తీసికొని శంకరుని యొక్క త్రిశూలము ను మంత్రపూర్వకముగా ప్రయోగించెను. అది రాజు యొక్క కుండలములను ఛేదించి శివుని సన్నిదికి చేరుకొనెను. పుష్కరాక్షుడు భార్గవ రాముని చంపుటకు బాణములను ప్రయోగింపగా భార్గవరాముడు వాటిని అవలీలగా ఛేదించెను. అప్పుడు రాజు మంత్రపూర్వకముగా అనేకాస్త్రములను ప్రయోగించెను. శస్త్రాస్త్ర ప్రయోగ విశారదుడగు భార్గవ రాముడు వాటినన్నిటిని అవలీలగా ఛేదించెను. అట్లే భార్గవ రాముడు మంత్రపూర్వమకముగా ప్రయోగించిన అస్త్రములన్నిటిని మహారాజు కూడ అవలీలగా శాంతింపజేసెను. అప్పుడు భార్గవరాముడు బ్రహ్మస్త్రమును ప్రయొగింపగా పుష్కరాక్షుడు దానిని శాంతింపజేసెను. భార్గవరాముడు శివునకు నమస్కరించి పాశుపతాస్త్రమును ప్రయోగింపబూనగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణుని యొక్క రూపమును ధరించి అచ్చటకు వచ్చెను. బ్రహ్మణ ఉవాచ- బ్రాణ్ముడిట్లు పలికెను- కిం కరోషి భృగో వత్స త్వమేవ జ్ఞానినా వరః | నరం హంతుం పాశుపతం కోపాత్కిం క్షిపసి భ్రమాత్ || 24 విశ్వం పాశుపతేనైవ భ##వేద్భస్మ చ సత్వరం | సర్వఘ్నం స్యాచ్ఛస్త్రమిదం వినా శ్రీకృష్ణమీశ్వరం || 25 అహోపాశుపతం జేతుం నాలమేవ సుదర్శనం | హరేః సుదర్శనం చైవ సర్వాస్త్రపరిమర్దకం || 26 ఖట్వాంగినః పాశుపతం హరే హరే సుదర్శనం | ఏతే ప్రధానే సర్వేషామస్త్రాణాం చ జగత్త్రయే || 27 త్యజ పాశుపతం బ్రహ్మన్ మదీయం వచనం శ్రుణు యథా జేష్యసి రాజానం పుష్కరాక్షం మహాబలం || 28 కార్తవీర్యమజేతం యథా జేష్యసి సాంప్రతం | శ్రూయతాం సావధానేన తత్సర్వం కథయామి తే || 29 ఓ భార్గవరామా! నీవు మిక్కిలి జ్ఞానము కలవాడవు. అట్టినీవు ఇప్పుడు ఏమి చేయబోవుచున్నావు. నీవు కోపముతో ఒక సాధారణమానవుని చంపుటకై పాశుపతాస్త్ర మును ప్రయోగింపనున్నావు . ఈ పశుపతాస్త్రమువలన సమస్త ప్రపంచము క్షణములో భస్మము కాగలదు. ఈ అస్త్రము పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని తప్ప మిగిలిన ప్రపంచమునంతయు నాశనము చేయును. ఈ పాశుపతాస్త్రమును ప్రయోగించు తలపును మానుకొమ్ము. నీకు పుష్కరాక్షమహారాజును, కార్తవీర్యార్జునుని జయించు ఉపాయమును చెప్పెదను. సావధానముగా వినుమని పలికెను. మహాలక్ష్మ్యా శ్చ కవచం త్రిషు లోకేషు దుర్లభం | భక్త్యాచ పుష్కరాక్షేణ ధృతం కంఠే విధానతః || 30 పరం దుర్గతినాశిన్యాః కవచం పరమాద్భుతం | ధృతం చ దక్షిణ బాహౌ పుష్కరాక్షసుతేన చ || 31 కవచస్య ప్రభావేణ విశ్వం జేతుం క్షమౌ చ తౌ | కోజేతా చ త్రిభువనే దేహే చ కవచే స్థితే || 32 బ్రాహ్మణస్య వచః శ్రుత్వా రామః సంత్రస్తమానసః | ఉవాచ బ్రహ్మణం వృద్ధం హృదయేన విదూయతా || 34 ఓ పరశురామా! ముల్లోకములయందు లభింపని మహాలక్ష్మీదేవియొక్క కవచము పుష్కరాక్ష మహారాజుయొక్క కంఠమున కలదు. అట్లే దుర్గతిని నాశనము చేయు దుర్గాదేవి కవచము పుష్కరాక్షని పుత్రుని కుడిరెట్ట (దక్షిణబాహువునకు) కు కలదు. ఈ కవచముయొక్క భ్రావమువల వారు ఈ ప్రపంచమును జయింపగలరు. శరీరమందు ఎచ్చటనైనను ఈ కవచములుండగా ముల్లోకములలో ఎవ్వరు వారిని జయింపలేరు. అందువలన నీ ప్రతిజ్ఞ పూర్తి చేయుటకు నేను వారి దగ్గర భిక్షమోత్తుకొందును అను బ్రాహ్మణ వృద్ధుని మాటలను విని భార్గవరాముడు భయపడుచు అతనితో ఇట్లు పలికెను. పరశురామ ఉవాచ: పరశురాముడిట్లు పలికెను- నజానామి మహాప్రాజ్ఞ కస్త్వం బ్రహ్మణ రూపధృక్ | శ్రీఘ్రం చ భ్రూహి మాం మూఢం తదా గచ్ఛ నృపాంతికం || 35 జామదగ్న్య వచః శ్రుత్వా ప్రహస్య బ్రహ్మణః స్వయం | ఉక్త్వా చాహం విష్ణురితి య¸° భిక్షితుమీశ్వరః || 36 గత్వా తయోః సన్నిధానాం యయాచే కవచం చ తౌ | దదతుస్తే చ కవచే విష్ణవే విష్ణుమాయయా || గృహీత్వా కవచే విష్ణుః వైకుంఠం నిర్జగామ సః || 37 ఓ పండితుడా! నీవెవరో నాకు తెలియదు. బ్రహ్మణవేశమును ధరించిన నీవెవరవు? ఈ విషయమును వెంటనే తెలుపుము. అటు పిమ్మట పుష్కరాక్షుని దగ్గరకు వెళ్ళుము అని పరశురాముడనగా బ్రహ్మణుడు నవ్వి నేను స్వయముగా విష్ణుమూర్తినని చెప్పి ఆ మహారాజును యాచించుటకు పోయెను. ఆ బ్రహ్మణుడు పుష్కరాక్షుడు, అతని పుత్రుని సమీపమునకు పోయి కవచములనిమ్మని వారిని యాచించెను. విష్ణుమాయవలన వారిద్దరు తమ కవచముల నీయగా వాటిని స్వీకరించి శ్రీమహావిష్ణువు వైకుంఠమునకు పోయెను. నారద ఉవాచ- నారద మహర్షి నారాయణమునితో ఇట్లనెను- మహాలక్ష్మ్యాశ్చ కవచం కేనదత్తం మహామునే | పుష్కరాక్షాయ భూపాయ శ్రోతుం కౌతూహలం మమ|| 38 కవచం చాపి దుర్గాయాః పుష్కరాక్షసుతాయ చ | దుర్లభం కేన వా దత్తం తద్భవాన్వక్తు మర్హసి || 39 కవచం చాపి కిం భూతం తయోర్వా తస్యకిం ఫలం | మంత్రౌ తు కిం ప్రకారౌ చ తన్మే బ్రూహి జగద్గురో || 40 ఓ నారాయణ మునీ! పుష్కరాక్షభూపతికి మహాలక్ష్మీ కవచమును ఎవరుపదేశించిరి. అట్లే అతని పుత్రునకు దుర్గాకవచమును ఎవరుపదేశించిరి ?ఈ కవచముల స్వరూపమొట్లుండును? వాటి ఫలితమొట్లుండును? ఆయా మంత్రముల స్వరూపమొట్లుండునను విషయము లన్నిటిని నాకు తెలుపుమని కోరెను. నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను- దత్తం సనత్కుమారేణ పుష్కరాక్షాయ ధీమతే | మహాలక్ష్మ్యాశ్చ కవచం . మంత్రాశ్చాపి దశాక్షరః || 41 స్తవనం చాపు గోప్యం వై ప్రోక్తం తచ్చరితం చ యత్ | ధ్యానం చ సామవేదోక్తం పూజాం చైవ మనోహరం || 42 దుర్గాయాశ్చాపి కవచం దత్తం దుర్వాససా పురా | స్తవనం చాపి గోప్యం చ మంత్రశ్చాపి దశాక్షరః || 43 పశ్చాచ్ర్చోష్యసి తత్సర్వం దేవాశ్చ పరమాద్భుతం | మహాయుద్ధ సమారంభే దత్తం ప్రార్థనయా చ యత్ || 44 ఓ నారదా !పుష్కరాక్షభూపతికి మహాలక్ష్మీ కవచమును, దశాక్షరమైన తన్మంత్రమును, పూర్వము సనత్కుమారుడు ఉపదేశించెను. మహాలక్ష్మీ స్తోత్రము, ధ్యానము పూజ ఇవన్నియు చాల రహస్యమైనవి. ఇవి సామవేదమున చెప్పబడినవి. అట్లే పుష్కరాక్షభూపతి పుత్రునకు దుర్గాకవచమును, దుర్గాస్త్రోత్రమును, దశాక్షరమైన గుర్గామంత్రమును, దుర్వాసమహర్షి ఉపదేశించెను. దేవాసురమహాసంగ్రామ సమయమున ఉపదేశింపబడిన, అత్యద్భుతమైన ఈ దుర్గాకవచమును, స్త్రోత్రమును, మంత్రమును తరువాత నీకు వివరించెదను. మహాలక్ష్మ్యాశ్చ మంత్రం చ శ్రుణు తం కథయామి తే | ఓం శ్రీం కమల వాసిన్యై స్వాహేతి పరమాద్భుతం || 45 ధ్యానం త సామవేదోక్తం శ్రుణు పూజావిధిం మునే | దత్తం తసై#్మ కుమారేణ పుష్కరాక్షాయ ధీమతే || 46 సహస్రదళంపద్మస్థాం పద్మనాభప్రియాం సతీం | పద్మాలయాం పద్మవక్త్రాం పద్మపత్రాభలోచనాం || 47 పద్మపుష్పప్రియాం పద్మ పుష్పతల్ఫాధిశాయినీం | పద్మినీం పద్మహస్తాం చ పద్మమాలా విభూషితాం || 48 పద్మ భాషణభూషాఢ్యాం పద్మశోభా వివర్ధినీం | పద్మాటవీం ప్రపస్యంతీం సస్మితాం తాం భ##జే ముదా || 49 ఓ నారదా! నీకు మహాలక్ష్మీ మంత్రమును చెప్పెదను వినుము. "ఓం శ్రీం కమలవాసిన్యై స్వాహా "అనునది మహాలక్ష్మీదేవి యొక్కదశాక్షర మంత్రము. ఆమె యొక్క ధ్యానము, పూజా పద్ధతి సామవేదమున చెప్పబడినది. వీటన్నిటిని సనత్కుమారుడు పుష్కరాక్ష మహారాజునకుపదేశించెను. వేయి రేకుల గల పద్మమున నున్నదియు, శ్రీహరి సతియు, పద్మమున మిక్కిలి మక్కువను చూపునదియు, పద్మముల శయ్యపై పరుండునదియు, చేతిలో పద్మములు ధరించునదియు, పద్మముల మాలకలదియు, పద్మపుష్పభూషణములు కలదియు, పద్మములకు శోభను కలిగించునదియు, పద్మవనమును చూచుచున్నదియు, చిరునవ్వుతోనున్న మహాలక్ష్మీని నేను సేవింతును. (ఇవి ధ్యాన శ్లోకములు) చందనాష్టదళే పద్మే పద్మ పుష్పేణ పూజయేత్ | గణం సంపూజ్య దవ్తా చైవోపచారాంశ్చ షోడశ || 50 తతః స్తుత్వా చ ప్రణమేత్తాధకో భక్తి పూర్వకం | కవచం శ్రూయతాం బ్రహ్మన్సర్వసారం దదామి తే || 51 మహాలక్ష్మీ దేవిని అష్టదళపద్మమున పద్మపుష్పములచే పూజించి ఆమె గణమును కూడ పూజించి షోడశోపచారములను సమర్పించి అర్చింపవలెను. అటుపిమ్మట ఆదేవిని స్తుతించి భక్తితో నమస్కరించవలెను. ఇక సర్వకవచసారమగు మహాలక్ష్మీ కవచమును నీకు చెప్పుచున్నాను. వినుము. అని నారాయణుడు పల్కెను. శ్రుణు విపేంద్ర పద్మాయాః కవచం పరమం శుభం | పద్మనాభేన యద్దత్తం బ్రహ్మణ నాభి పద్మకే || 52 సంప్రాప్య కవచం బ్రహ్మ తత్పద్మే ససృజే జగత్ | పద్మాలయా ప్రసాదేన సలక్ష్మీకో బభూవ సః || 53 పద్మలయావరం ప్రాప్య పాద్మశ్చ జగతాం ప్రభుః | పాద్మేన పద్మ కల్పే చ కవచం పరమాద్భుతం || 54 దత్తం సనత్కుమారాయ ప్రియ పుత్రాయ ధీమతే | కుమారేణ చ యద్దత్తం పుష్కరాయ చ నారద || 55 యద్ధృత్వా పటనాద్బ్రహ్మా సర్వసిద్ధేశ్వరో మహాన్ | పరమైశ్వర్య సంయుక్తః సర్వ సంపత్సమన్వితః || 56 యద్ధృత్వా చ ధనాధ్యక్ష| కుబేరశ్చ ధనాధిపః | స్వాయంభువో మనుః శ్రీమాన్పఠనాద్ధారణాద్యతః || 57 ప్రియవ్రతోత్తానపాదౌ లక్ష్మీవంతౌ యతో మునే | పృథుః పృథ్వీపతిః సద్యోహ్యభవద్ధారణాద్యతః || 58 కవచస్య ప్రసాదేన స్వయం దక్షః ప్రజాపతిః | ధర్మశ్చ కర్మణాం సాక్షీ పాతా యస్య ప్రసాదతః || 59 యద్ధృత్వా దక్షిణ బాహౌ విష్ణుః క్షీరోదశాయితః | భక్త్యా విధత్తే కంఠే శేషో నారాయణాంశకః || 60 యద్ధృత్వా వామనం లేభే కశ్యపశ్చ ప్రజాపతిః | సర్వ దేవాధిపః శ్రీమాన్మహేంద్రో దారణాద్యతః || 61 రాజా మరుత్తో భగవానభవద్ధారణాద్యతః | త్రైలోక్యాధిపతిః శ్రీమాన్నహూషో యస్య ధారణాత్ || 62 విశ్వం విజిగ్వే ఖట్వాంగః పఠనాద్ధారణాద్యతః | ముచుకుందో యతః శ్రీమన్మాందాతృతనయో మహాన్ || 63 ఓ నారదా !మహాలక్ష్మీ కవచము అధిక శుభములను కలిగించును. దీనిని శ్రీమహావిష్ణువు నాభిపద్మమున నున్న తన పుత్రుడగు బ్రహ్మదేవునకు తొలుత ఉపదేశించెను. బ్రహ్మదేవుడీ కవచమును పొందిన తరువాత ఈ జగత్తునంతయు సృష్టింపగల్గెను. అతడు లక్ష్మీదేవియొక్క అనుగ్రహమువలన లక్ష్మీవంతుడయ్యెను. మహాలక్ష్మీ దేవి యొక్క అనుగ్రహమును పొందిన పద్మభవుడు పద్మకల్పమున ఈ కవచమును బుద్ధిమంతుడు, తన పుత్రుడగు సనత్కుమారునకు ఉపదేశించెను. సనత్కుమారిడీ కవచమును పుష్కరా మహారాజునకు ఉపదేశించెను. ఈ కవచమును ధరించి పఠించుచున్నందువలననే బ్రహ్మదేవుడు సమస్త సిద్ధిసమన్వితుడు, పరమైశ్వర్యము, సమస్త సంపదలు కలవాడయ్యెను. అట్లే కుబేరుడు దీనిని ధరించి పఠించుచున్నందువలన ధనాధిపతి కాగల్గెను. స్వాయంభువుడు ఈ కవచము వలననే మనువయ్యెను. అట్లే దీని ప్రభావము వలననే ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడు అధిక సంపత్సమేతులైరి. పృథు మహారాజు ఈ కవచము యొక్క ప్రభావము వలననే పృథ్వీపతియయ్యెను. అట్లే దక్షుడు ప్రజాపతియయ్యెను. అదే విధముగ ధర్మదేవలత సమస్త కర్మలకు సాక్షిగా, సమస్త జీవులకు రక్షకుడుగా ఏర్పడెను. శ్రీమహావిష్ణువు కూడ ఈ కవచమును తన దక్షిణ భుజమునకు కట్టుకొని క్షీరసాగరశాయి అయ్యెను. శ్రీమన్నారాయణాంశ వలన సంభవించిన ఆదిశేషుడు దీనిని భక్తితో ఎల్లప్పుడు తన కంఠమున ధరించును. కశ్యప ప్రజాపతి ఈ కవచమును మహేంద్రుడు దీని వలననే సమస్త దేవతలకు అధిపతియయ్యెను. రాజగు మరుత్తు దీనివలననే భగవంతుడయ్యెను. నహుషుడు ఈ కవచమును ధరించినందువలననే ముల్లోకములకు అధిపతియయ్యెను. అదే విధముగా శంకరుడు త్రిపురములను జయించెను. అట్లే మాంధాత చక్రవర్తి పుత్రుడగు ముచికుందుడు ఈ కవచమును ధరించి పఠించినందువలననే గొప్పవాడయ్యెను అని నారాయణముని పలికెను. సర్వసంపత్ప్రదస్యాస్య కవచస్య ప్రజాపతిః | ఋషిశ్ఛందశ్చ బృహతీ దేవీ పద్మాలయా స్వయం || 64 ధర్మార్థ కామ మోక్షేషు వినియోగః ప్రకీర్తితః | పుణ్యబీజం చ మహతాం కవచం పరమాద్భుతం || 65 ఓం హ్రీం కమల వాసిన్యైస్వాహా మే పాతు మస్తకం | శ్రీం మే పాతు కపాలం చ లోచనే శ్రీం శ్రియై నమః || 66 ఓం శ్రీం శ్రియై స్వాహేతిచ కర్ణయుగ్మం సదాZవతు | ఓం క్లీం మహాలక్ష్మ్యై స్వాహా మే పాతు నాసికాం || 67 ఓం శ్రీం పద్మాలయాయైచ స్వాహా దంతాన్సదాZవతు | ఓం శ్రీం కృష్ణప్రియాయై చ దంత రంద్రం సదాZవతు || 68 ఓం శ్రీం నారాయణశాయై మమ కంఠం సదాZవతు | ఓం శ్రీం కేశవ కాంతాయై మమస్కంధు సదాZవతు || 69 ఓం శ్రీం పద్మనివాసిన్యై స్వాహా నాభిం సదాZవతు | ఓం హ్రీం శ్రీం సంసారమాత్రే మమవక్షః సదాZవతు || 70 ఓం శ్రీం మోం కృష్ణకాంతాయై స్వాహా పృష్ఠం సదాZవతు| ఓం హ్రీం శ్రియైస్వాహా చ మముహసౌ సదాZవతు || 71 ఓం శ్రీనివాస కాంతాయై మమ పాదౌ సదాZవతు | ఓం హ్రీం శ్రీం క్లీం శ్రియై స్వాహా సర్శాంగం మే సదాZవతు || 72 ప్రాచ్యాం పాతు మహాలక్ష్మీ రాగ్నేయాం కమలాలయా | పద్మా మాం దక్షిణ పాతు నైఋత్యాం శ్రీహరి ప్రియా || 73 పద్యాలయా మాం పశ్చిమే వాయువ్యాం పాతు సా స్వయం | ఉత్తరే కమలా పాతు చైశాన్యాం సింధు కన్యకా || 74 నారాయణీ పాతూర్థ్వ మధో విష్ణుప్రియాZవతు | సంతతం తర్వతః పాతు విష్ణు ప్రాణాధికా మమ || 75 సమస్త సంపదలనొసగు ఈ మహాలక్ష్మీ కవచమునకు ఋషి ప్రజాపతి, ఛందస్సు బృహతీఛందము, మహాలక్ష్మీయే దానికి దేవత. చతుర్వర్గ ప్రాప్తికై దీనిని పఠించవలెను. మహాపురుషులకు సైతము కవచమనదగిన ఈ కవచము పుణ్యమును కలిగించును. ఓం హ్రీం కమలవాసిన్యై స్వాహా అను మంత్రము నాశిరస్సును రక్షించుగాక ! శ్రీం అనునది నా కపాలమును శ్రీం శ్రియైనమః అనునది నా కండ్లను రక్షించుగాక ! ఓం శ్రీం శ్రియై స్వాహా అను మంత్రము నా కర్ణములను రక్షించుగాక! ఓం క్లీం మహాలక్ష్మ్యై స్వాహా అను మంత్రము నా నాసికను రక్షించుగాక! ఓం శ్రీం పద్మాలయాయై స్వాహా అను మంత్రము నాదంతముల రక్షించుగాక ! ఓం శ్రీం కృష్ణ ప్రియాయై అను మంత్రము నాదంతరంధ్రముల రక్షించుగాక ! ఓం శ్రీం నారాయణశాయై అను మంత్రము నా కంఠమును రక్షించుగాక ! ఓం శ్రీం కేశవ కాంతాయై అను మంత్రము నా స్కంధములను రక్షించుగాక ! ఓం శ్రీం పద్మ నివాసిన్యై స్వాహా అను మంత్రము నానాభిని రక్షించుగాక! ఓం హ్రీం శ్రీం సంసారమాత్రే అను మంత్రము నా వక్షస్థలమును రక్షించుగాక ! ఓం శ్రీం మోం కృష్ణకాంతాయై స్వాహా అనునది నాపృష్ఠభగమును రక్షించుగాక ! ఓం హ్రీం శ్రీం శ్రియై స్వాహా అను మంత్రము నా హస్తముల రక్షించుగాక ! ఓం శ్రీనివాస కాంతాయై అను మంత్రము నాపాదముల రక్షించుగాక ! ఓం హ్రీం శ్రీం క్లీం శ్రియై స్వాహా అను మంత్రము నా సర్వంగాములను ఎల్లప్పుడు రక్షించుగాక ! మహాలక్ష్మి నా తూర్పు భాగమున కమలాలయ నా ఆగ్నేయ భాగమును , పద్మ నా దక్షిణ భాగమును, శ్రీహరి ప్రియ నా నైఋతిభాగమును, పద్మాలయ నాపశ్చిమభాగమును, మహాలక్ష్మీ నా వాయవ్యభాగమును, కమల నాఉత్తర భాగమును, సింధు కన్యక నా ఈశాన్య భాగమును, నారాయణి నాఊర్ధ్వ భాగమును, విష్ణుప్రియ నా యొక్క అధోభాగమును, విష్ణుప్రాణాధిక యగు మహాలక్ష్మీ నన్ను అన్ని దిక్కులనుండి ఎల్లప్పుడు కాపాడుచుండుగాక! ఇతి తే కథితం వత్స సర్వ మంత్రౌఘ విగ్రహం | సర్వైశ్వర్య ప్రదం నామ కవచం పరమాద్భుతం || 76 సువర్ణ పర్వతం దత్వా మేరుతుల్యం ద్విజాతయే యః | యత్ఫలం లభ##తే ధర్మీ కవచేన తతోZధికం || 77 గురుమభ్యర్చ్య విధివత్కవచం దారయేత్తు యః| కంఠే వా దక్షిణ బాహౌ స శ్రీమాన్ ప్రతి జన్మని || 78 అస్తి లక్ష్మీర్గృహే తస్య నిశ్చలా శతపూరుషం | దేవేంద్రైశ్చాసురేంద్రైశ్చ సోZవధ్యో నిశ్చితం భ##వేత్ || 79 స సర్వపుణ్యవాన్ధీమాన్ సర్వయజ్ఞేషు దీక్షితః | స స్నాతః సర్వ తీర్థేషు యస్యేదం కవచం గళే || 80 యసై#్మ కసై#్మ న దాతవ్యం లోభమోహ భ##యైరపి | గురుభక్తాయ శిష్యాయ శరణ్యాయ ప్రకాశ##యేత్ || 81 ఇదం కవచమజ్ఞాత్వా జపేల్లక్ష్మీం జగత్ప్రసూం | కోటి సంఖ్యం ప్రజప్తోZపి న మంత్రః సిద్ధిదాయకః || 82 ఓ నారదా! సమస్త మంత్రస్వరూపమైనది, సర్వైశ్వర్య ప్రదమను పేరు కలదియగు మహాలక్ష్మీ కవచము చాల శ్రేష్ఠమైనది. బ్రహ్మణునకు మేరు పర్వతమంత బంగారమును దానము చేసినచో లబించు పుణ్యముకంటె ఈ కవచము వలన ఎక్కువ పుణ్యము లభించును. గురువును శాస్త్రపద్ధతిననుసరించి పూజించి అతనిచే నుపదేశము పొంది ఈ కవచమును కంఠమందున లేక కుడిరెట్టకైన కట్టుకొనువాడు ప్రతి జన్మలో శ్రీమంతుడగును. వాని ఇంటిలో లక్ష్మీదేవి నూరు తరముల వరకు సుస్థిరముగా నుండును. అతనిని దేవతలు గాని రాక్షసులు గాని సంహరింపలేరు. ఈ కవచమును ధరించువాడు సమస్తపుణ్యములను చేసిన వాడగును. సమస్త యజ్ఞములు చేసినవాడగును. అట్లే సమస్త తీర్థములను సేవించిన వానితో సమానుడగును. ఇట్టి కవచమును ఎట్టి పరిస్థితిలోను గురుభక్తి లేని వానికి శిష్యుడు కానివానికి, శరణుకోరనివానికి ఇవ్వకూడదు. ఈ కవచము లేకుండ మహాలక్ష్మీ మంత్రమును కోటి పర్యాయములు జపము చేసినను ఆ మంత్రము సిద్ధిని కలిగించదని నారాయణముని నారద మహర్షికి తెలిపెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారద నారాయణ సంవాదే శ్రీలక్ష్మీ కవచ వర్ణనం నామాష్టత్రింశత్తమోZధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున చెప్పబడిన శ్రీలక్ష్మీ కవచమను ముప్పయి యెనిమిదవ అధ్యాయము సమాప్తము.