sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
త్రిచత్వారింశత్తమోzధ్యాయః - గణశదంతభంగకారణము నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను- గణశ వచనం శ్రుత్వా స తదా రాగతః సుధీః | పర్శుహస్తస్సవై రామో నిర్భయో గంతుముద్యతః ||
1 గణశ్వరస్తదా దృష్ట్యా శ్రీఘ్రమముత్ధాయ యత్నతః | వారయామాస స ప్రీత్యా చకార వినయం పునః || 2 రామస్తం ప్రేరయామాస హుంకృత్వాతు పునః పునః | బభూవ చ తతస్తత్ర వాగ్యుద్దం హస్తకార్షణౖః || 3 గణపతి పరశురామునితో పలికిన పలుకులు వినికూడ భార్గవరాముడు చేతిలో గొడ్డలిధరించి నిర్భయముగా శంకరుని అభ్యంతరమందిరములోనికి వెళ్ళసాగెను. అప్పుడు గణపతి వెంటనే లేచి పరశురాముని వెళ్ళకుండ అడ్డగించెను. ఐనను పరశురాముని ప్రేమతోనే చూచెను. అప్పుడు భార్గవరాముడు హుంకరించుచు యుద్ధమునకు ప్రేరేపించుచు చేతులను త్రిప్పుచు వాగ్యుద్దమును చేయనారంభించెను. పర్శునిక్షేపణం కర్తుం మనశ్చక్రే భృగుస్తదా | హాహాకృత్వా కార్తికేయో బోధయామాస సంసది || 4 పరశురాముడు గణపతిపై తనగొడ్డలిని వేయబోగా కుమారస్వామి హాహాకారముచేయుచు పరశురాముని ఇట్లు ప్రబోధించెను. అవ్యర్థమస్త్రం హేభ్రాతః గురుపుత్రే కథం క్షిపేః | గురువద్గురుపుత్రం చ మా భవాన్హంతుమర్హతి || 5 పర్శుం క్షిపంతం కుపితం రక్తపద్మదళేక్షణం | గణశో రోధయామాస నివర్తస్వేత్యువాచ తం || 6 పునర్గణశం రామశ్చ ప్రేరయామాస కోపతః | పపాత పురతో వేగాన్మనహీనో గజాననః || 7 గజాననః సముత్థాయ ధర్మం కృత్వాతు సాక్షిణం | పునస్తం బోధయామాస జితక్రోధః శివాత్మజః || 8 నివర్తస్వ నివర్తస్వేత్యుచ్చార్య చ పునః పునః | ప్రవేశ##నే తే కా శక్తిరీశ్వరాజ్ఞాం వినా ప్రభో || 9 మమ భ్రాతా త్వమతిథి ర్విద్యాసంబంధతో ధ్రువం | ఈశ్వరప్రియశిష్యశ్చ సోఢం వై తేన హేతునా || 10 నహ్యహం కార్తవీర్యశ్చ భూపాస్తే క్షుద్రజంతవః | అతో విప్ర న జానాసి మాం చ విశ్వేశ్వరాత్మజం || 11 క్షణం తిష్ఠ నివర్తస్వ సమరే బ్రాహ్మణాతిథే | క్షణాంతరే త్వయా సార్థం యాస్యామీశ్వర సన్నిధిం || 12 ఓసోదరా! అమోఘమైన అస్త్రమును గురుపుత్రునిపై ఎందుకు ప్రయోగించుచున్నావు. గురువువలె గురుపుత్రుని చంపబూనుట మంచిదికాదు అని కుమారస్వామి పలికెను. ఐనను కోపముతో ఎఱ్ఱనైన కండ్లతో గొడ్డలిని గణపతిపై ప్రయోగింపబోవు పరశురాముని గణపతి అడ్డగించి అతనిని వెనకకు తిరుగుమని కోరెను. ఐనను పరశురాముడు కోపముతో గణపతిని కొట్టగా గణపతి వెంటనే క్రిందపడెను. గణపతి వెంటనేలేచి ధర్మదేవతను సాక్షిగాచేసి, కోపమును జయించినవాడు కావున అతడు పరశురాముని ప్రబోధింపసాగెను.ఓభార్గవరామా! నీవు శంకరుని అంతఃపురమునకు వెళ్ళకుండ వెనుదిరుగుము. ఈశ్వరుని ఆజ్ఞలేక అంతఃపురమునకు వెళ్ళుటకు నీకెట్టి సామర్థ్యముకలదు? నీవు నాకు సోదరునివంటివాడవు. పైగా మాఇంటికి వచ్చిన అతిథివి. ఈశ్వరునకు చాలప్రేమగల శిష్యుడవు. అట్లే మన ఇద్దరకు విద్యాగురువు ఒక్కడేయైనందువలన నీవు చేయుపనులను నేను సహింపవలసియున్నది. ఓపరశురామా!నేను కార్తవీర్యునివంటివాడనుకాను. అట్లే బలహీనులైన రాజులవంటివాడను కాను. నేను జగత్పతియగు శంకరుని పుత్రుడను విషయము నీకు తెలియకున్నది. అందువలన ఓ బ్రహ్మణాతిథీ నీవు ఈయుద్దమును చేయక క్షణకాలముండుము. ఈక్షణము గడిచిన పిమ్మట నీతో ఈశ్వరునియొక్క సమీపమునకు నేనుకూడ వత్తునని గణశుడు పలికెను. నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లు పలికెను- హేరంబవచనం శ్రుత్వా ప్రజహాస పునః పునః | పర్శుం క్షేప్తుం మనశ్చక్రే ప్రణమ్య హరిశంకరౌ || 13 పర్శుం క్షిపంతం కోపేన తం చ రామం గజాననః | దృష్ట్యా ముమూర్షుం దేవేశో ధర్మం కృత్వాతు సాక్షిణం || 14 యోగేన వర్ధయామాస 'శుండాం తాం కోటియోజనాం | యోగీంద్రస్తత్ర సంతిష్ఠన్ భ్రామయిత్వా పునః పునః || 15 శతథా వేష్టయిత్వా తు భ్రామయిత్వా తు తత్రవై | ఊర్ధ్వముత్తోల్య వేగేన క్షుద్రాహిం గరుడోయథా || 16 సప్తద్వీపాంశ్చ శైలాంశ్చ మేరుం చాఖిలసాగరాన్ | క్షణన దర్శయామాస రామం యోగపరాహతం || 17 హస్తపాదాద్యనాథం తం జడం సర్వాంగకంపితం | పునస్తం భ్రామయామాస దర్పితం దర్పనాశనః || 18 గణపతియొక్క మాటలను విని పరశురాముడు నవ్వి శ్రీహరిని, శంకరుని నమస్కరించి తన గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగింపబూనెను. అప్పుడు గణపతి ధర్మదేవతను సాక్షిగా పెట్టి యోగవిద్యవలన తన తొండమును బాగుగాపెంచి దానిచే పరశురాముని పట్టుకొని చుట్టుముట్టు త్రిప్పసాగెను. ఆ గణపతి తన తొండముచే పరశురాముని చిన్నపామును గరుత్మంతుడు ఒడిసిపట్టుకొని త్రిప్పినట్లు త్రిప్పుచు సప్తమహాద్వీపములను, కులపర్వతములను, మేరుపర్వతమును, సమస్తముద్రములను భార్గవరామునకు క్షణములో చూపించెను. అట్లే మితిమీరిన గర్వముతోనున్న భార్గవరాముని అతని సమస్తావయవములు కంపించునట్లు మరల అతనిని త్రిప్పసాగెను. భూర్లోకం చ భువర్లోకం స్వర్లోకం చ సురేశ్వరః | జనోలోకం తపోలోకం ధ్రువలోకం చ తత్పరం || 19 గౌరీలోకం శంభులోకం దర్శయామాస నారద | దర్శయిత్వాతు విధ్యండం స పపౌ సప్తసాగరాన్ || 20 పునరుద్గిరణం చక్రే సనక్రమకరోదకం | తత్ర తం పాతయామాస గంభీరే సాగరోదకే || 21 ముమూర్షుం తం సంతరంతం పునర్జగ్రాహ లీలయా | పునస్తత్ర భ్రామయిత్వా యోగీంద్రో యోగమాయయా || 22 వైకుంఠం దర్శయామాస సలక్ష్మీకం చతుర్భుజం | క్షణం తత్రభ్రామయిత్వా యోగీంద్రో యోగమాయయా || 23 పునః కరం చ యోగేన వర్ధయామాస లీలయా | గోలోకం దర్శయామాస విరజాంచ నదీశ్వరీం || 24 బృందావనం శృంగశతం శైలేంద్రం రాసమండలం | గోపీగోపాదిభిస్సార్థం శ్రీకృష్మం శ్యామసుందరం || 25 ద్విభుజం మురళీహస్తం సస్మితం సుమనోహరం | రత్నసింహాసనస్థం చ రత్నభూషణభూషితం || 26 తేజసా కోటిసూర్యాభం రాధావక్షస్థలస్థితం | ఏవం కృష్ణం దర్శయుత్వా ప్రణమయ్య పునః పునః || 27 క్షణన లంబమానం చ భ్రామయిత్వా పునః పునః | దృష్ట్వా కృష్ణం చేష్టదేవం సర్వపాపప్రణాశనం || భ్రూహత్యాదికం పాపం భృగోర్దూరం చకార హ || 28 న భ##వేద్యాతనా నష్టా వినా భోగేన పాపజా | స్వల్పాం చ బుభుజే రామోగతాzన్యా కృష్ణదర్శనాత్ || 29 క్షణన చేతనాం ప్రాప్య భువి వేగాత్పపాతహ | బభూవ దూరీభూతం చ గణశస్తంభనం భృగోః || 30 గణపతి భార్గవరాముని తన తొండముతో నొడిసిపట్టి అతనికి భూలోకమును, భువర్లోకమును, స్వర్లోకమును, జనోలోకమును, తపోలోకమును, ధ్రువలోకమును, అట్లే గౌరీలోకమును, శంకరలోకమును బ్రహ్మాండమును చూపించెను. ఆ తరువాత ఏడు సముద్రములలోనున్న నీటిని త్రాగి మరల వమనము చేసెను. అట్టి సాగరజలములలో భార్గవరాముని పడవేసేను. సముద్రజలములలోపడి కొట్టుమిట్టాడుచున్నప్పుడు అతనిని మరల ఒడిసిపట్టుకొని తన యోగమాయతో త్రిప్పుచు వైకుంఠమును చూపించెను. అచ్చట చతుర్భుజుడు, లక్ష్మీసమేతుడైన నారాయణుడున్నాడు. అటుపిమ్మట భార్గవరామునకు తన తొండమును పెంచి గోలోకమును, ఆలోకమమందున్న విరజానదిని, బృందావనమును, శతశృంగపర్వతమును, రాసమండలమును చూపెను. ఆ గోలోకమున రెండుభుజములతో, చేతిలో మురళిని పట్టుకొని, రత్నభూషణాలంకృతుడై రత్నసింహాసనమున రాధాదేవి వక్షస్థలముపైనున్న శ్రీకృష్ణపరమాత్మను చూపెను. సర్వపాపహరుడు ఇష్టదేవుడగు శ్రీకృష్ణపరమాత్మయొక్క దర్శనము వలన భార్గవరాముడు చేసి భ్రూణహత్యాదిపాపములన్నియు నశించిపోయినవి. చేసిన పాపములు అనుభవించకతీరిపోవు. భార్గవరాముడు తానుచేసికొన్న పాపముల ఫలితమును కొంత అనుభవించెను. మిగిలిన పాపము శ్రీకృష్ణుని దర్శించినందువలన సంపూర్ణముగా నశించినది. అతడు క్షణకాలము చైతన్యము పొందగా వేగముగా అతనిని క్రిందపడవేసెను. సస్మార కవచం స్తోత్రం గురుదత్తం సుదుర్లభం | అభీష్టదేవం శ్రీకృష్ణం గురుం శుంభుం జగద్గురుం || 31 చిక్షేప పర్శుమవ్యర్థం శివతుల్యం చ తేజసా | గ్రీష్మమధ్యాహ్నమార్తండప్రభాశతగుణం మునే || 32 పితరవ్యర్థమస్త్రం చ దృష్ట్యా గణపతిః స్వయం | జగ్రాహ వామదంతేన నాస్త్రం వ్యర్థం చకారహ || 33 నిపాత్య పర్శుర్వేగేన భిత్వా దంతం సమూలకం | జగామ రామహస్తం చ మహాదేవబలేన చ || 34 హాహేతి శబ్దమాకాశే దేవాశ్చ క్రుర్మహాభియా | వీరభద్రః కార్తికేయః క్షేత్రపాలాశ్చ పార్షదాః || 35 పపాత భుమౌ దంతశ్చ సరక్తః శబ్దయంస్తదా | పపాతగైరికాయుక్తో యథాస్ఫటికపర్వతః || 36 భార్గవ రాముడు తనయొక్క అభీష్టదేవుడగు శ్రీకృష్ణుని, గురువగు శంకరుని స్మరించుకొనుచు తన గురువగు శంకరుడు తనకు ప్రసాదించిన శ్రీకృష్ణకవచమును శ్రీకృష్ణస్తోత్రమును చదువుచు అమోఘమైన తన గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించెను. ఆ గండ్రగొడ్డలి ప్రభావమున శంకరునివంటిది. గ్రీష్మకాలమందలి మధ్యాహ్నసూర్యులవంటి కాంతిగలది. అమోఘమైన , తనతండ్రియొక్క ఆ గొడ్డలిని గణపతిచూచి తనయొక్క ఎడమ దంతమునకు తగిలించి ఆ శస్త్రము వ్యర్థము కాకుండచేసెను. ఆ గొడ్డలి వేగముగా గణపతియొక్క ఎడమప్రక్కనున్న దంతమునకు తగిలి దానిని సమూలముగా పెకలించి శంకరుని మహిమవలన తిరిగి పరశురాముని చేతికి చేరెను. అప్పుడు అధికమైన భయముచే వీరభద్రుడు, కుమారస్వామి, ఇతక క్షేత్రపాలకులు, అనుచరులు మొదలగు దేవతలందరు హాహాకారములు చేసిరి. అప్పుడు గణపతియొక్క దంతము రక్తముతో, గైరిక ధాతువుతోనున్న స్ఫటిక పర్వతమువలె పెద్దచప్పుడు చేయుచు భూమిపై పడిపోయెను. శ##బ్దేన మహతా విప్ర చకంపే పృథివీ భియా | కైలాసస్థాః జనాస్సర్వే మూర్చామాపుః క్షణః భీయా || 37 నిద్రా బభంజ తత్కాలే నిద్రేశస్య జగత్ర్పభోః | ఆజగామ బహిశ్శంభుః పార్వత్యాసహ సంభ్రమాత్ || 38 పురో దదర్శ హేరంబం లోహితాస్యం క్షతేన తం | భగ్నదంతం జితక్రోధం సస్మితం లజ్జితం మునే || 39 పప్రచ్ఛ పార్వతీ శీఘ్రం స్కందం కిమితి పుత్రక | సచ తాం కథయామాస వార్తాం పౌర్వాపరం భియా || 40 చుకోప దుర్గా కృపయా రురోద చ ముహుర్ముహుః | ఉవాచ శంభోః పురతః పుత్రం కృత్వా స్వవక్షసి || 41 సంబోధ్య శంభుం శోకేన భియా వినయ పూర్వకం | ఉవాచ ప్రణతా సాధ్వీ ప్రణతార్తిహరం పతిం || 42 నారదా! గణపతియొక్క దంతము క్రిందపడినప్పుడు కలిగిన శబ్దమువలన భూమియంతయు భయముతో కంపించెను. కైలాసనగరమున ఉన్న జనులందరు భయముతో క్షణకాలము మూర్ఛనొందిరి. ఆ శబ్దమునకు జగత్ర్పభువగు శంకరునకు నిద్రాభంగమై పార్వతీదేవితో కలసి తన భవనమునుండి బయటకువచ్చెను. అప్పుడాతనికి తన దంతము పోయినందువలన ఎఱ్ఱనైన ముఖముతో, కోపమును జయించినవాడుకావున సిగ్గుతో తలవంచుకొనియున్న గణపతి కన్పించెను. అప్పుడు పార్వతీదేవి అచ్చటనున్న కుమారస్వామిని ఏమి జరిగెనో వివరింపుమని కోరగా ఆ సుబ్రహ్మణ్యమూర్తి జరిగిన విషయమునంతయు ఆమూలాగ్రముగ వినిపించెను. అందువలన దుర్గాదేవికి భార్గవరామునిపై కోపము కలిగినది. తన పుత్రుని దీనావస్థను చూచి దుఃఖించినది. ఆ దేవి తన పుత్రడగు గణపతిని అక్కున చేర్చుకొని భక్తజనులయొక్క ఆర్తిని పోగొట్టు తన భర్తకు నమస్కరించి అతనితో ఇట్లు పలికెను. ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ తృతీయే గణపతిఖండే నారాదనారాయణసంవాదే గణశదంతభంగకారణవర్ణనం నామ త్రిచత్వారింశత్తమోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున మూడవదగు గణపతిఖండమున నారాదనారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన గణపతి యొక్క దంతభంగకారణమను నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.