sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుశ్చత్వారింశత్తమోzధ్యాయః - గణపతి స్తోత్రము పార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లు పలికెను- సర్వే జానంతి జగతి దుర్గాం శంకర కింకరీం | అపేక్షా రహితా దాసీ తస్యా వై జీవనం వృథా ||
1 ఈశ్వరస్య సమాః సర్వాస్తృణ పర్వతజాతయః | దాసీపుత్రస్య శిష్యస్య దోషః కస్యేతి చ ప్రభో ||
2 విచారం కర్తుముచితం త్వం చ ధర్మవిదాం వరః | వీరభద్రః కార్తికేయః పార్షదాః సంతి సాక్షిణః ||
3 సాక్ష్యే మిథ్యాం కోవదేద్వా ద్వావేషాం భ్రాతరౌసమౌ | సాక్ష్యేసమే శత్రుమిత్రే సతాం ధర్మనిరూపణ ||
4 సాక్షీసభాయాం యత్ సాక్ష్యం జానన్నప్యన్యథా వదేత్ | కామతః క్రోధతోవాzపి లోభన చ భ##యేన చ ||
5 స యాతి కుంభీపాకం చ నిపాత్య శతపూరుషం | తైశ్చ సార్ధం వసేత్తత్ర యావచ్చంద్ర దివాకరౌ ||
6 అహం విబోధితుం శక్తా యున్నిర్ణేత్రీ ద్వయోరపి | తథాzపి తవసాక్షాత్తు మమాజ్ఞా నిందితా శ్రుతౌ ||
7 కింకరాణాం ప్రభా తత్ర నృపే వసతి సంసది | ఉదితే భాస్కరే పృథ్వ్యాం ఖద్యోతోహి యథాప్రభో ||
8 సుచిరం తపసా ప్రాప్తం త్వదీయం చరణాంబుజం | పరిత్యాగభ##యేనైవ సంతతం భీతయా మయా ||
9 యత్కంచిత్కోపశోకాభ్యాముక్తం మోహేన తత్పరం | తత్ క్షమస్వ జగన్నాథ పుత్రస్నేహాచ్చ దారుణాత్ ||
10 ఈ దుర్గాదేవి శంకరుని దాసియను విషయమందరకును తెలియును. ఇంకను నేను ఎట్టికోరికలు లేని దాసిని. అట్టి దాసి బ్రతుకియున్నను ఆమె జన్మవ్యర్థమేయగును. అటువంటి దాసీపుత్రుడగు గణపతి మరియు నీ శిష్యుని నీవు విచారించుట సమంజసము. ఈ విషయమున నీకు వీరభద్రుడు, కుమారస్వామి, నీ అనుచరులందరు సాక్ష్యముగానున్నారు. వీరందరకు గణపతి భార్గవరాములు సమానమైనవారే. ధర్మనిరూపణసమయమున సాక్ష్యమిచ్చునప్పుడు సత్పురుషులకు శత్రువైనను, మిత్రుడైనను ఒకే విధముగానుందురు. అట్లే ఒకరిపై ద్వేషభావముకాని, మరియొకరిపై ప్రేమగానియుండదు. అందువలన సాక్ష్యమిచ్చుచున్నప్పుడు అబద్ధములను ఎవరుకూడ చెప్పరు. సభలో తెలిసిన విషయమును సంకల్పముతోనైన, కోపముతోనైన, లోభము, భయమువంటి కారణములవలన కాని వక్రీకరించి చెప్పినచో అతడు తన వందతరములవారిని కుంభీపాక నరకమునకు పంపును. అట్లే అతడు సూర్యచంద్రులున్నంతవరకు తనవారితో కలిసి కుంభీపాక నరకముననుండును. నేను గణపతి, భార్గవరాముల దోషములను నిర్ణయించి చెప్పగలికినప్పటికిని నాభర్తయగు మీముందు చెప్పుట వేదవిరుద్ధము కాగలదు. రాజున్నసభలో కింకరునివలె సూర్యునిముందు మిణుగురుపురుగువలె మీముందు నాజ్ఞానము వెలవెలబోవును. చాలాకాలము తపస్సుచేసి నిన్ను భర్తగాపొందితిని. అందువలన మీభయమువలన నేను న్యాయనిర్ణయము చేయలేకున్నాను. భార్గవరాముడు నా పుత్రునకు గాయము కలిగించెనను కోపముతో, దుఃఖముతో నా పుత్రునిపైగల వాత్సల్యముచే నేను చెప్పినమాటలను మీరు క్షమింపుడని తన భర్తయగు శివుని పార్వతి కోరినది. త్వయా యది పరిత్యక్తా తదా పుత్రేణ తేన కిం | సాధ్య్వాః సద్వంశజాయాశ్చ శతపుత్రాధికః పతిః ||
11 అసద్వంశప్రసూతా యా దుశ్శీలా చ జ్ఞానవర్జితా | స్వామినం మన్యతే నాసౌ పిత్రోర్దోషేణ కుత్సితా ||
12 కుత్సితం పతితం మూఢం దరిద్రం రోగిణం జడం | కులజా విష్ణుతుల్యం చ కాంతం పశ్యతి సంతతం ||
13 హుతాశ నో వాసూర్యో వా సర్వతేజస్వినాం వరః | పతివ్రతాతేజసశ్చ కళాం నర్హంతి షోడశీం ||
14 మహాదానాని పుణ్యాని వ్రతాన్యనశనాని చ | తపాంసి పతిసేవయః కళాంనార్హంతి షోడశీం ||
15 పుత్రోవాzపి పితావాzపి బాంధవోzథ సహోదరః | యోషితాం కులజాతానాం న కశ్చిత్ స్వామినః సమః || 16 మీరు కోపముచే నన్ను వదలిపెట్టిన నాకు పుత్రుడున్నను లాభములేదు. మంచి కులమునందు పుట్టిన పతివ్రతాస్త్రీకి నూరుగురు పుత్రులకంటె భర్త గొప్పవాడుగా కనిపించును. తెలివిలేనిది, చెడుకులమున పుట్టినది, చెడునడకగలస్త్రీ తన భర్తను గౌరవించదు. సత్కులములో పుట్టిన సాధ్వీమణి తన భర్త దుష్టుడైనను, పతితుడైనను, మూర్ఖుడైనను, దరిద్రుడైనను, రోగియైనను, జడస్వభావము కలిగియున్నను అతనిని విష్ణుమూర్తిని గౌరవించినట్లు గౌరవించును. అగ్ని, సూర్యుడు ఎంతగొప్ప తేజస్సంపన్నులైనను పతివ్రతా తేజస్సులో పదునారవవంతైన కాజాలరు. అట్లే గొప్పనైన దానములు, పుణ్యకార్యములు, సర్వవ్రతములు, సమస్తోపవాసములు ఇవన్నియు భర్తృసేవలో పదువారవ వంతైనను కాజాలవు. సత్కులములో జన్మించిన పతివ్రతా శిరోమణికి పుత్రుడుగాని, తండ్రిగాని, సోదరుడుగాని, సమీపబంధువుగాని ఎవ్వరైనను తనభర్తతో సమానమైనవారు కాజాలరని పార్వతీదేవి పలికెను. ఇత్యుక్త్వా స్వామినం దుర్గా దదర్శ పురతోభృగుం | శంభోః పదాబ్జం సేవంతం నిర్భయం తమువాచహ || 17 ఈవిధముగా పార్వతీదేవి భర్తతో పలికి, తనభర్తయొక్క పాదపద్మములను సేవింపుచు నిర్భయముగానున్న భార్గవరాముని చూచి ఇట్లు పలికెను. పార్వత్యువాచ - పార్వతీదేవి ఇట్లు పలికెను- అహోరామ మహాభాగ బ్రహ్మవంశ్యోzసి పండితః | పుత్రోzసి జమదగ్నేశ్చ శిష్యోవై యోగినాం గురోః || 18 మాతా తే రేణుకాసాధ్వీ పద్మాంశాసత్కులోద్భవా | మాతామహో వైష్ణవశ్చ మాతులశ్చ తతోzధికః || 19 త్వంచ రేణుక భూపస్య మనువంశోద్భవస్య చ | దౌహిత్రోమాతులః సాధుః శూరోవిష్ణుపదాశ్రయః || 20 కస్యదోషేణ దర్దర్షస్త్వం న జానేzప్యశుద్ధధీః | యోషాం దోషైర్జనో దుష్టస్తమృతే శుద్దమానసః || 21 అమోఘం ప్రాప్య పర్శుం చ గురుం చ కరుణానిధిం | పరీక్షాం క్షత్రియే కృత్వా బభూవాzస్యసుతే పునః || 22 గురవే దక్షిణా దానముచితం చ శ్రుతౌ శ్రుతం | భగ్నోదంతస్తత్సుతస్య భింది మస్తకమప్యహో || 23 గణశ్వరం రణ జిత్వా స్థితశ్చేదావయోః పురః | సత్వం లబ్ద్యాzశిషో లోకే పూజితోzభూర్జగత్త్రయే || 24 పర్శునామోఘ వీర్యమేణ శంకరస్య వరేణ చ | హంతుం శక్తః సృగాలశ్చసింహం శార్దూల మాఖుభుక్ || 25 త్వద్విధం లక్షకోటిం చ హంతుం శక్తో గణశ్వరః | జితేంద్రియాణాం ప్రవరో నహి హంతి చ మక్షికాం || 26 తేజసా కృష్ణతుల్యోzయం కృష్ణాంశశ్చ గణశ్వరః | దేవాశ్చన్యే కృష్ణకళాః పూజాzస్యపురతస్తతః || 27 వ్రతప్రభావతః ప్రాప్తః శంకరస్య వరేణ చ | శోకేనాతి కఠోరేణ జహి సంపద్వినాzపదం || 28 ఓభార్గవరామా! నీవు బ్రాహ్మణుడవు. పైగా పండితుడవు. జమదగ్ని మహర్షియొక్క పుత్రుడవు. పరమయోగియైన శంకరునకు శిష్యుడవు. ఇక నీ తల్లియగు రేణుక మహాపతివ్రత లక్ష్మీదేవియొక్క అంశకలది. సద్వంశములో జన్మించినది. అట్లే నీ మాతామహుడగు రేణుకడు విష్ణుభక్తుడు. నీ మోనమామ నీ తాతగారికంటెన ఎక్కువ విష్ణుభక్తిగలవాడు. నీవు మనువంశమునకు చెందిన రేణుక భూపతికి దౌహిత్రుడవు. నీమేనమామ సాధుస్వభావముగలవాడు, బలపరాక్రమవంతుడు. విష్ణుభక్తుడు కూడ. మరి నీవు ఎవరి దోషమువలన ఈవిధముగా ఐతివి. నీవు దుష్టస్వభావముగలవాడవగుటకు కారణమిటో నాకు తెలియదు. నీవు దయాసముద్రుడగు గురువు వలన పరశువును పొందితివి. దానిని తొలుత క్షత్రియులపై పరీక్షించి తరువాత నీ గురుపుత్రునిపై ప్రయోగించితివి. గురువునకు దక్షిణ సమర్పించుట తగినదని వేదములు చెప్పుచున్నవి. కాని నీవు గురుపుత్రుని దంతమును భగ్నము చేసితివి. ఇక అతని శిరస్సును త్రెంపివేయుము. నీవు మా పుత్రుడగు గణపతిని యుద్దమున జయించి కూడ మాముందు నిలిచితివి. అట్లే మా ఆశీస్సులను పొంది ఈ లోకములందు గౌరవమును పొందితివి. నీవు శంకరునియొక్క అమోఘమైన బలముచే అతని వరముచే గండ్రగొడ్డలిచే గణపతిని జయించితివి. పరమేశ్వరుని అనుగ్రహమున్నచో నక్క సింహమును చంపును. అట్లే నీవు గణపతిని జయించితివి. గణపతి నీవంటి లక్షకోట్ల జనమును అవలీలగా సంహరించును. జితేద్రియులలో శ్రేష్ఠుడగు గణపతి ఈగను కూడ చంపడు. ఈ గణపతి తేజస్సులో శ్రీకృష్ణునితో సమానుడు. అతని అంశస్వరూపుడు. ఇతర దేవతలు శ్రీకృష్ణుని అంశాశరూపులు. శంకరునియొక్క ప్రభావమువలన అతని వరమువలన గణపతి పూజను ప్రజలు తొలుత చేయుదురు. అతడు పుణ్యవ్రతముయొక్క ప్రభావమువలన శంకరుని వరములవలన జన్మించెను. ఇత్యుక్త్వా పార్వతీ రోషాత్తం రామం హంతుముద్యతా | రామః సస్మార తం కృష్ణం ప్రణమ్య మనసా గురం || 29 ఏతస్మిన్నంతరే దుర్గా దదర్శ పురతో ద్విజం | అతీవ వామనం బాలం సూర్యకోటి సమప్రభం || 30 శుక్లదంతం శుక్లవాసం శుక్లయజ్ఞోపవీతినం | దండిం ఛత్రిణం చైవ సుప్రభం తిలకోజ్వలం || 31 దధతం తులసీమాలాం సస్మితం సుమనోహరం | రత్నకేయూరవలయం రత్నమాలావిభూషితం || 32 రత్ననూపురపాదం చ సద్రత్న మకుటోజ్వలం | రత్నకుండలయుగ్మాడ్య గండస్థలవిరాజితం || 33 స్థిరముద్రాం దర్శయంతం భక్తవామకరేణ చ | దక్షిణzభయముద్రాం చ బక్తేశం బక్తవత్సలం || 34 బాలికాబాలకగణౖర్నాగరైః సస్మితైర్యుతం | కైలాసవాసిభిః సర్వై రావృద్దైరీక్షితం ముదా || 35 ఈ విధముగా పార్వతీదేవి పలికి భార్గవరాముని చంపబోయెను. అప్పుడు భార్గవరాముడు శ్రీకృష్ణునకు నమస్కరించి తన గురువైన శంకరుని కూడ మనస్సులో స్మరించుకొనెను. ఆ సమయమున అక్కడకు ఒక బ్రాహ్మణబాలకుడు వచ్చెను అతడు చాల పొట్టిగానుండెను. కోటి సూర్యులతో సమానమైన కాంతిగల ఆ బ్రాహ్మణ కుమారుని దంతములు, వస్త్రములు, యజ్ఞోపవీతము అన్నియు తెల్లగా ఉన్నవి. అతడు దండమును, ఛత్రమును, ఉజ్వలమైన తిలకమును ధఱించెను. అతని మెడలో తులసిమాలలు రత్నభుషణములున్నవి. అతని చేతులకు రత్నకేయూరములు కలవు. పాదములకు రత్ననూపురములు, శిరస్సున రత్నకిరీటము, చెవులకు రత్నకుండలములు కలవు. అతడు ఎడమ చేతితో స్థిరముద్రను, కుడిచేత అభయముద్రను ధరించి బాలురు, బాలికలు నవ్వుచు తనవెంటరాగా అచ్చటకు వచ్చెను. అప్పుడతనిని కైలాసముననున్న జనులందరు సంతోషముతో చూచిరి. తం దృష్ట్యా సంభ్రమాచ్ఛంభుః సభృత్యః సహపుత్రకః | మూర్ద్నా భక్త్యాప్రాణమచ్చ దుర్గా స్రా దండవద్భువి || 36 ఆశిషం ప్రదదౌ బాలః సర్వేభ్యో వాంఛితప్రదాం | తం దృష్ట్వా బాలకాస్సర్వే మహాశ్చర్యం య¸°భియా || 37 దత్వా తసై#్మ శివోభక్త్యా తూపచారాంస్తు షోడశ | పూజాం చకార శ్రుత్యుక్తాం పరిపూర్ణతమస్య చ || 38 తుష్టావ కాణ్వశాఖోక్తస్తోత్రేణ నతకంధరః | పులకాంకిత సర్వాంగో భగవంతం సనాతనం .| 39 రత్నసింహాసనస్థం చ ప్రావోచచ్ఛంకరః స్వయం | అతీవ తేజసాzత్యంతం ప్రచ్చన్నాకృతిమేవ చ || 40 ఆ బ్రాహ్మణకుమారుని శంకరుడు చూచి తన పుత్రులు పరివారము, దుర్గాదేవితో కలిసిఅతనికి సాష్టాంగదండ ప్రణామములొనర్చెను. అప్పుడా బ్రాహ్మణకుమారుడు అందరకు వారివారి కోరికలు తీరునట్లు ఆశీర్వదించెను. ఆ కైలాసనగరముననున్న బాలకులు సైతము అతనిని చూచి చాలా ఆశ్చర్యమును పొందిరి. శివుడా బ్రాహ్మణ బాలకుని షోడశోపచారములతో వేదోక్త ప్రకారముగా పూజించెను. అట్లే తన తలను వంచుకొని శుక్లయజుర్వేదమునకు సంబంధించిన కాణ్వశాఖయందు చెప్పబడిన స్తోత్రముచే ఆ బాలకుని స్తుంతించెను. ఇంకను అధికమైన తేజస్సుతో నిండిన ఆ బాలుని రత్నసింహాసనము కూర్చండబెట్టి వినయవిధేయతలతో నిట్లు పలికెను. శంకర ఉవాచ - శంకరుడిట్లు పలికెను- ఆత్మారామేషు కుశల ప్రశ్నోzతీవ విడంబనం | తే శశ్వత్కుశలాధారాః కుశలాః కుశలప్రదాః || 41 అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం | ప్రాప్తస్వమతిథిర్బ్రహ్మన్ కృష్ణసేవాఫలోదయాత్ || 42 పరిపూర్ణతమః కృష్ణో లోకనిస్తారహేతవే | పుణ్యక్షేత్రే హికళయా భారతే చ కృపానిధిః || 43 అతిథిః పూజితో యేన పూజితాః సర్వదేవతాః | అతిథర్యస్య సంతుష్ట స్తస్య తుష్టోహరిః స్వయం || 44 స్నానేన సర్వతీర్థేషు సర్వ దానేన యత్ఫలం | సర్వవ్రతోపవాసే సర్వయజ్ఞేషు దీక్షయా || 45 సర్త్వైస్తపోభిర్వివిధైర్నిత్యనైమిత్తికాదిభిః | త దేవాతిథిసేవాయాః కళాం నార్హంతి షోడశీం || 46 అతిథిర్యస్య బగ్నాశో యాతి రుష్టశ్య మందిరాత్ | కోటిజన్మార్జితం పుణ్యం తస్య నశ్యతి నిశ్చితం || 47 స్త్రీగోఘ్నశ్చ కృతఘ్నశ్చ బ్రహ్మఘ్నో గురుతల్పగః | పితృమాతృ గురూణాం చ నిందకో నరఘాతకః || 48 సంధ్యాహీనః స్వఘాతీ చ సత్యఘ్నో హరినిందకః | బ్రహ్మస్వస్థాప్య హారీ చ మిథ్యా సాక్ష్యప్రదాయకః || 49 మిత్రద్రోహీ కృతఘ్నశ్చ వృషవాహశ్చ సూపకృత్ | శవదాహీ గ్రామయాజీ బ్రాహ్మణో వృషలీపతిః || 50 శూద్రశ్రాద్దాన్నభోజీ చ శ్రూద్రశ్రాద్దేషు భోజకః | కన్యావిక్రయకారీ చ శ్రీహరేర్నామవిక్రయీ|| 51 లాక్షా మాంసతిలానాం చ లవణస్య తిలస్య చ | విక్రేతా బ్రాహ్మణశ్చైవ తురగానాం గవాం తథా || 52 ఏకాదశీ కృష్ణసేవా హీనో విప్రశ్చ భారతే | ఏతే మహాపాతకినస్త్రిషు లోకేషు నిందితాః || 53 కాలసూత్రే చ నరకే పతంతి బ్రహ్మణాం శతం | ఏతేభ్యోzప్యధికః సోzపి యశ్చాతిథి పరాజ్ముఖః || 54 ఆత్మారాములగు మీ వంటివారిని క్షేమమడుగుట తెలివితక్కువ అనిపించును. మీరు ఇతరులకు క్షేమము కలిగింతురు. క్షేమము మిమ్ములను ఆధారము చేసికొని యుండును. నా ఇంటికి మీరు వచ్చినందువలన నా జీవతము సఫలమైనది. నేను చేసి శ్రీకృష్ణసేవకు ఫలితముగా మీరు నాకు అతిథిగా వచ్చితిరి. సమస్తపూర్ణుడగు శ్రీకృష్ణుడు దయాసముద్రుడు గావున ప్రపంచమును ఉద్ధరించుటకై ఈ భారతక్షేత్రమున తనయొక్క అంశతో పుట్టుచున్నాడు. అందువలన మీరు శ్రీకృష్ణుని అంశ కలిగినవారు. అతిథిని పూజించినచో సమస్త దేవతలను పూజించినట్లగును. అతిథి ఎవరి ఇంటికి వచ్చి సంతృప్తితో పోవునో ఆ యజమానిని గురించి శ్రీహరి సంతోషపడును. సమస్త పుణ్యతీర్థములందు స్నానముచేసినచో, సమస్త దానములిచ్చినచో, సమస్త వ్రతములందు ఉపవాసమాచిరించినచో సమస్త యజ్ఞములు చేసినచో, సమస్తతపస్సులను ఆచరించినచో, ఇంకను నిత్యనైమిత్తికములగు సమస్త పుణ్యకార్యములు చేసినచో కలుగు పుణ్యఫలము అతడి సేవలో పదువనార వంతైనను కాజాలవు. అతిథి ఇంటికి వచ్చి భగ్నాశుడై , కోపముతో ఎవరి ఇంటినుండి తిరిగి పోవునో ఆ ఇంటి యజమాని కోటి జన్మలనుండి చేసిన పుణ్యమంతయు నశించును. స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను చంపినవాడు, మేలును మరచినవాడు, గురుభార్యతో సంగమించువాడు, తల్లిదండ్రులను, గురువులను నిందించువాడు, మానవ హింససేయువాడు, సంధ్యావందన మాచరింపనివాడు, శ్రీహరిని నిందించువాడు, బ్రాహ్మణుని ధనమును, అగ్రహారములను అపహరించువాడు, కూడ సాక్ష్యములను చెప్పువాడు, మిత్రులకు ద్రోహము చేయువాడు, వృషభముపై నెక్కి తిరుగువాడు, వంటలు చేసి బ్రతుకువాడు, శవములను దహించువాడు, పురోహితుడు, శూద్రస్త్రీని ఉంచుకొన్న బ్రాహ్మణుడు, శూద్రుల ఇంట శ్రాద్దాన్నమును భుజించువాడు, కన్యలనమ్ముకొని బ్రతుకువాడు, శ్రీహరియొక్క పేరును చెప్పుకొని బ్రతుకువాడు, లాక్షారసమును, మాంసమును, నూవులను, గుఱ్ఱములను, ఆవులను అమ్ముకొని బ్రతుకు బ్రాహ్మణుడు, ఏకాదశీతిథినాడు శ్రీకృష్ణుని పూజింపని బ్రాహ్మణుడు వీరందరు మహాపాతకులుగా పేర్కొనబడుచున్నారు. వీరందరు కాలసూత్రనరకమున శతబ్రహ్మలు గతించువరకుందురు. అతిథిని అవమాన మొనర్చినవాడు వీరందరికన్నను నీచుడు అని శంకరుడు పలికెను. నారాయణ ఉవాచ- నారాయణముని నారదునితో ఇట్లనెను- శంకరస్య వచః శ్రుత్వా సంతుష్టః శ్రీహరిః స్వయం | మేఘగంభీరయా వాచా తమువాచ జగత్పతిః || 55 శంకరుని పలుకులను విన్న జగత్పతి యగు శ్రీమహావిష్ణువు మేఘగర్జనవలె గంభీరముగా శంకరునితో ఇట్లు పలికెను. శ్వేత ద్వీపాదాగతోzహం జ్ఞాత్వా కోలాహలం చ వః | అస్య రామస్య రక్షార్ధం కృష్ణభక్తస్య సాంప్రతం || 56 నైతేషాం కృష్ణభక్తామశుభం విద్యతే క్వచిత్ | రక్షామి తాంశ్చక్రహస్తో గురుమన్య వినా శివ || 57 నాహం పాతా గురౌ రుష్టే బలవద్గురుహేళనం | తత్పరః పాతకీ నాస్తి సేవాహీనో గురోశ్చయః || 58 మాన్యః పూజ్యశ్చ సర్వేభ్యః సర్వేషాం జనకో భ##వేత్ | అహో యస్య ప్రసాదేన సర్వాన్పశ్యతి మానవః || 59 జనకో జన్మదానాచ్చ పాలనాచ్చ పితానృణాం | తతో విస్తార కారణాత్కళయా సప్రజాపతిః || 60 పితుః శతగుణం మాతా పోషణాద్గర్భదారణాత్ ష వంద్యాపూజ్యా చ మాన్యా చ ప్రసూస్స్యాద్వై వసుంధరా || 61 మాతుః శతగుణం వంద్యః పూజ్యోమాన్యోzన్న దాయకః | యద్వినా నశ్వరో దేహో విష్ణుశ్చ కళయాzన్నదః || 62 అన్నదాతుః శతగుణోzభీష్టదేవః పరః స్మృతః | గురుస్తస్మాచ్ఛతగుణో విద్యమంత్రప్రదాయకః || 63 అజ్ఞాన తిమిరాచ్ఛన్నం జ్ఞాన దీపేన చక్షుషా | యః సర్వార్థం దర్శయతి తత్పరో నైవ బాంధవః || 64 గురుదత్తేన మంత్రేణ తపసేష్టసుఖం లభేత్ | సర్వజ్ఞత్వం సర్వసిద్దిం తత్పరో నైవ బాంధవః || 65 ఇచ్చట జరుగుచున్న కోలాహలమును విని శ్రీకృష్ణభక్తుడగు ఈ భార్గవరాముని రక్షించుటకై శ్వేతద్వీపమునుండి ఇచ్చటకు వచ్చితిని. కృష్ణభక్తులకు అశుభము ఎన్నడును జరుగదు. గురువుయొక్క అనుగ్రహములేని వారిని తప్ప కృష్ణభక్తులందరిని చేతియందు చక్రమును ధరించి నేను రక్షింతును. గురువు కోపించినచో వారి ని నెనెప్పుడు రక్షించను. గురువును అవమానించుట ఎప్పుడు తగదు. గురువుయొక్క సేవను చేయనివానికంటె పాపాత్ముడెక్కడను ఉండడు. అందరికంటెను. జనకుడు గౌరవించతగినవాడు. జనకుని యొక్క అనుగ్రహము వలననే మానవుడీ ప్రపంచమును చూడగలుగుచున్నాడు. జన్మనిచ్చినందువలన అతనిని జనకుడని, పెంచి పోషించినందువలన పితయని పిలుతురు అంతకంటె ను గొప్ప కారణమువలన అతడు ప్రజాపతియగు చున్నాడు. గర్భమున ధరించి, కని, పెంచినందువలన తల్లిదండ్రికంటె ఎక్కువగా మాన్యురాలగును. అన్నదాత తల్లికంటె నూరురెట్లు ఎక్కువగా గౌరవింపతగినవాడు. అన్నము పెట్టువాడు లేనిచో ఈ శరీరము నష్టమగును. అందువలన అన్నదానము చేయువాడు విష్ణ్యంశ కలవాడగును. అన్నదాతకంటె ఇష్టదైవము నూరురెట్లు అధికముగా పూజింపతగినది. విద్య లేక మంత్రోపదేశము చేయు గురువు ఇష్టదేవతకంటె నూరురెట్లు అగుచున్నాడు. అజ్ఞానమను చీకటి యావరించియున్న ఈ విశ్వమును జ్ఞానమను దీప సహాయముతో సమస్తమును చూపింపగలుగు గురువును మించిన బంధువు ఎవ్వరు కాజాలరు. గురువు ఉపదేశించిన మంత్రము వలన తపస్సువలన మానవుడు సమస్త సుఖములను పొందగలడు. అట్లే అతడు సమస్త సిద్ధులు పడసి సర్వజ్ఞుడు కాగలడు. సర్వం జయతి సర్వత్రవిద్యాయా గురుదత్తయా | తస్మాత్పూజ్యో హి జగతి కోవాబంధుస్తతోzధికః || 66 విద్యాంధో వా ధనాందో వా యోమూఢో న భ##జేద్గురుం | బ్రహ్మహత్యాదిభిః పాపై స లిప్తో నాత్ర సంశయః || 67 దరిద్రం పతితం క్షుద్రం నరబుద్ధ్యా చరేద్గురుం| తీర్థస్నాతోzపి న శుచిర్నాధికారీ చ కర్మసు|| 68 పితరం మాతరం భార్యాం గురుపత్నీం గురుం పరం | యోనపుష్ణాతి కాపట్యాత్స మహాపాతకీ శివ || 69 గురుర్భ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః | గురుదేవ పరంబ్రహ్మ గురుర్భాస్కర రూపకః || 70 గురుశ్చంద్రస్తథేంద్రస్చ వాయుశ్చ వరుణోzనలః | సర్వరూపో హి భగవాన్పరమాత్మా స్వయం గురుః || 71 నాస్తి వేదాత్పరం శాస్త్రం న హి కృష్ణాత్పరః సురః | నాస్తి గంగాసమం తీర్థం న పుష్పం తులసీ దళాత్ || 72 నాస్తి క్షమావతీ భూమేః పుత్రాన్నాస్త్యపరః ప్రియః | నచ దైవాత్పరాశక్తిర్నెకాదశ్యాః పరం వ్రతం || 73 శాలగ్రామాత్పరో యంత్రో న క్షేత్రం భారతాత్పరం | పరం పుణ్యస్థలానాం చ పుణ్యం బృందావనం యథా || 74 మోక్షదానాం యథా కాశీ వైష్ణవానాం యథా శివః | నపార్వత్యాః పరాసాధ్వీన న గణశాత్పరో వశీ || 75 న చ విద్యా సమోబంధుర్నాస్తి కశ్చిద్గురోః పరః | విద్యాదాతుః పుత్రదారౌ తత్సమో నాత్ర సంశయః || 76 గురుస్త్రియాం చ పుత్రే చాప్యభవవద్రామ హేళనం | పరం సమ్మార్జనం కర్తుమాగతోzహం తవాలయం || 77 గురువు నేర్పిన విద్యవలన మానవుడు సర్వత్ర విజయముపొందును. అందువలన గురువు అందరికంటె ను గౌరవింపదగినవాడు. విద్యామదముతోనైన ధనమదముతోనైన గురువు ను గౌరవింపని వానికి బ్రహ్మహత్యాది పాపములన్నియు కలుగును. గురువు దరిద్రుడైనను, పతితుడైనను, క్షుద్రుడైనను అతనియందు సామాన్యబుద్ధియున్నచో ఆ శిష్యుడు ఎన్ని పుణ్యతీర్థములందు స్నానమాచరించినను అతడు పవిత్రుడు కాజాలడు. అట్లే అతడు పుణ్యకర్మలు చేయుటకు అధికారి కాజాలడు. తల్లిని, తండ్రిని, భార్యను, గురుభార్యను, కపటబుద్ధిచే పోషింపని మానవుడు మాహాపాతకియగును. గురువు పరబ్రహ్మరూపుడు, అతడే విష్ణురూపుడు, మహేశ్వర స్వరూపుడు, చతుర్ముఖ బ్రహ్మరూపుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్నిరూపుడు, ఈ విధముగా గురువు సర్వరూపుడైన పరమాత్మయగుచున్నాడు. వేదమును మించిన శాస్త్రము, కృష్ణుని మించిన దేవుడు , గంగను మించిన తీర్థము, తులసీ దళమువంటి పుష్పము, భూమికంటె ఓర్పుకలవ్యక్తి , పుత్రునికంటె ప్రియమైనవాడు, దైవమును మించిన శక్తి, ఏకాదశీవ్రతమును మించిన వ్రతము , సాలగ్రామమువంటి యంత్రము, భారతమువంటి క్షేత్రము, బృందావనమువంటి పుణ్యతీర్థము, కాశివంటి మోక్షము నొసగు క్షేత్రము , శివునివంటి విష్ణుభక్తుడు , పార్వతీ దేవి వంటి పతివ్రత ఈ లోకమునందు కనిపించదు. అట్లే విద్యతో సమానమైన బంధువు. గురువును మించినవాడు ఎక్కడను లేడు. విద్యనొసగిన గురువుతో సమానముగా అతని భార్యను, పుత్రుని గౌరవింపవలెను. కాని పరశురాముడు గురుభార్యయగు పార్వతిని, అతని పుత్రుడగు గణపతిని అవమానించెను. అందువలన నాభక్తుని దోషమును నివారించుటకు నీ ఇంటికి వచ్చితిని బ్రహ్మణ బాలకవేషమును ధరించిన శ్రీమహావిష్ణువు పలికెను. నారాయణ ఉవాచ- నారాయముని నారదునితో ఇట్లు పలికెను- ఇత్యేవముక్త్యా శంభుం చ దుర్గాం సంభోద్య నారద| ఉవాచ- భగవాంస్తత్ర సత్యచసారం పరం వచః || 78 ఈ విధముగా శ్రీమహావిష్ణువు శంకరునితో పలికి పార్వతీదేవితో సత్యసారమైన మాటలనిట్లు పలికెను. శ్రీవిష్ణురువాచ- శ్రీమహావిష్ణువిట్లు పలికెను- శ్రుణుదేవి ప్రవక్ష్యామి మదీయం వచనం శుభం | నీతియుక్తం వేదసారం పరిణానసుఖావహం || 79 యథా తే గజవక్త్రశ్చ కార్తికేయశ్చ పార్వతి | తథా పరశురామశ్చ బార్గవో నాత్ర సంశయః || 80 నాస్త్యేషు స్నేహభేదశ్చ తవ వా శంకరస్య చ | విచార్యసర్వం సర్వజ్ఞే కురు మాతర్యథోచితం || 81 పుత్రేణ సార్థం పుత్రస్య వివాదో దైవదోషతః | దైవం హంతుం కోహి శక్తో దైవం చ బలవత్తరం || 82 పుత్రాభిధానం వేదేషు పశ్య వత్సే వరాననే | ఏకదంత ఇతిఖ్యాతం సర్వదేవ నమస్కృతం || 83 పుత్రనామాష్టకం స్తోత్రం సామవేదోక్తమీశ్వరి | శ్రుణుష్వావహితం మాతః సర్వవిఘ్నహరం పరం || 84 ఓ పార్వతీ దేవి ! వేదసారము, నీతియుక్తమైన నా మాటలను శ్రద్ధగా వినుము. ఓ పార్వతి !నీకు గణపతి కుమారస్వామి ఎటువంటివారో శంకరుని శిష్యుడైన బార్గవరాముడు కూడ అటువంటివాడే . నీకు శంకరునకు వీరి విషయమున భేదమేమియు కనిపించదు. అందువలన సర్వజ్ఞురాలవైన నీవు ఈ విషయమును యథోచితముగ విచారించి పనిచేయుము. ఒక పుత్రునితో మరియొక పుత్రుడు వివాదమునకు దిగుట దైవ దోషమువలన సంభవించును. దైవమును ఎవ్వరు అతిక్రమింపలేరు. అది మిక్కిలి బలియమైనది. ఓ పార్వతీ !వేదములందు నీ పుత్రుని నామము ఏకదంతుడని ప్రసిద్ధిచెదినది. పేరు సమస్త దేవతలు గౌరవింతురు. é ఓ !తల్లీ సామవేదమున గణపతియొక్క నామాష్టకము కలదు. అది సమస్త విఘ్నములను హరించును. కాన దానిని శ్రద్ధగా వినుము అని శ్రీమహా విష్ణువు పలికెను. గణశ మేకదంతం చ హేరంబం విఘ్ననాయకం | లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం || 85 అష్టాఖ్యార్థం చ పుత్రస్య శ్రుణుమార్హరప్రియే | స్తోత్రాణాం సారభూతం చ సర్వవిగ్నహరం పరం || 86 జ్ఞానార్థవాచకో గశ్చణశ్చ నిర్వాణవాచకః | తయోరీసం పరంబ్రహ్మ గణసం ప్రణమామ్యహం || 87 ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః | బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్మహం || 88 దీనార్థవాచకో హేశ్చ రంబః పాలక వాచకః | పాలకం దీనలోకానాం హేరంబం ప్రణమామ్యహం || 89 విపత్తి వాచకో విఘ్నో నాయకః కండనార్థకః | విపత్ఖండనకారం తం ప్రణమే విఘ్ననాయకం || 90 విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరం | పిత్రా దత్తైశ్చ వివిధైర్వందే లంబోదరం చ తం || 91 శూర్పాకారౌ చ యత్తర్ణౌ విఘ్నవారణకారకౌ | సంపద్దౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహం || 92 విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ద్నిపుష్పకం | దత్గజేంద్రముకం కాంతం గజవక్త్రం నమామ్యహం || 93 గుహస్యాగ్రే చ జాతోzయమావిర్భూతో హరాలయే | వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్ర పూజితం || 94 గణశుడు, ఏకదంతుడు, హేరంబుడు, విఘ్ననాయకుడు, లంబోదరుడు, శూర్పకర్ణుడు, గజవక్త్రుడు, గుహాగ్రజుడు అనునవి గణపతియొక్క అష్టనామములు. శంకరుని ప్రియురాలవగు ఓ తల్లీ! నీ పుత్రుని అష్టనామముల అర్థమును కూడ వినుము. ఈ నామాష్టకము స్తోత్రములన్నిటిలోను సారబూతమైనది. సమస్త విఘ్నములను పోగొట్టుటనది. 'గ' శబ్దము జ్ఞానార్థమును సూచించును. 'ణ' అను శబ్ధమునకు ముక్తియనునది అర్థము. ఈ రెండింటికి ఈశ్వరుడైన పరబ్రహ్మ కావున అతనికి గణశుడు ను పేరు కలిగినది. 'ఏక' అను శబ్దమునకు ప్రధానము అను అర్థము కలదు. 'దంత' శబ్దమునకు బలమను అర్థము కలదు. అందరి కన్నను బలము ప్రధానముగా కలవాడు కావున అతనిని ఏకదంతుడందురు. 'హే' అనునది దీనార్థమును తెలుపును. 'రంబ' అను పదమునకు పాలకుడను అర్థము కలదు. దీనజనులను రక్షించువాడు కావున అతడు హేరంబుడయ్యెను. 'విఘ్న' అను శబ్దమునకు ఆపదలను అర్థము కలదు. 'నాయక' శబ్ధము ఖండనమను అర్థమున కలదు. ఆపదలను ఖండించువాడు గావున అతడు విఘ్ననాయకుడయ్యెను. విష్ణుమూర్తి, మరియు తండ్రియగు శంకరుడు పెట్టిన వివిధములైన ఖాద్యములను తినినందువలన అతని ఉదరము వేలాడుచుండెను.అందువలన అతనిని లంబోదరుడని పలికిరి. గణపతి యొక్క చెవులు చేటలవలెనున్నవి. అవివిఘ్నములనన్నిటిని పోగొట్టును. సంపదలను కలిగించును. జ్ఞానరూపమైనవి. అటువంటి కర్ణములు కలవాడు కావున అతడు శూర్పకర్ణుడయ్యెను. విష్ణుప్రసాదరూపమైన పారిజాత పుష్పమును దుర్వాసమహర్షి దేవేంద్రునకివ్వగా ఆ పుష్పమునతడు ఏ గజముయొక్క తలపై ఉంచెనో అట్టి గజముఖము కలవాడు కావున అతడు గజవక్త్రుడయ్యెను. ఈ గణపతి గుహునికి ముందు జన్మించెను. అందువలననే సమస్త దేవతలయందు అగ్రపూజలందుకొను గణపతిని గుహాగ్రజుడని పిలుతురు. ఏతన్నామాష్టకం దుర్గే నానాశక్తియితం పరం| ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థ సహితం శుభం || 95 త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ | తతో విఘ్నాః పలాయంతే వైనతే యాద్యథోరగాః || 96 గణశ్రరప్రసాదేన మహాజ్ఞానీ భ##వేద్ధ్రువం | పుత్రార్థీ లభ##తే పుత్రం భార్యార్థీ కుశలాం స్త్రియం || 97 మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భ##వేద్ధ్రువం | పుత్రస్తే పస్య వేదే చ తథా కోపం చనో కురు|| 98 ఓ పార్వతీ! గణపతియొక్క నామాష్టకము నానాశక్తి సమన్వితమైనది. అట్లే అనేకార్థములు కలది. దీనిని మూడు పూటలు ప్రతిదినము చదివినచో అతడు ఎల్లప్పుడు సుఖము కలిగియుండును. అట్లే అంతట జయమును పొందును. అదే విధముగా గరుత్ముంతుని చూచిన సర్పములు పరుగెత్తుపోయినట్లు అతనిని చూచినచో విఘ్నములన్నియు పరుగెత్తిపోవును.గణనాథుని అనుగ్రహమువలన అతడు మహాజ్ఞానియగును.ఈ నామాష్టకమును పుత్రులు లేనివాడు శ్రద్ధగా చదివినచో పుత్రులు కలుగుదురు. వివాహమును ఆశించువానికి చక్కని భార్య లబించును. మహాజడుడుగా ఉండువాడు గొప్ప కవియగును. ఓ పార్వతీ దేవీ! భార్గవరాముడు కూడ నీకు పుత్రునివంటివాడే . అందువలన అతనిపై కోపపడకుమని శ్రీమహావిష్ణువు కోరెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే తృతీయే గణపతి ఖండే నారద నారాయణ సంవాదే గణశస్తోత్ర కథనం నామ చతుశ్చత్వారింశత్తమోzధ్యాయః|| శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున మూడవదగు గణపతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున పేర్కొనబడిన గణశ స్తోత్రముగల నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.