sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచదశోzధ్యాయః - మాలతీ కాలపురుషుల సంవాదము బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను- కేనరోగేణ హి మృతోzధునా సాధ్వి తవ ప్రియ | సర్వరోగచికిత్సాం చ జానామి చ చికిత్సకః ||
1 మృతతుల్యం మృతం రోగత్సాహాభ్యంతరే సతి | మహాజ్ఞానేన తం జీవం జీవయామ్యవలీలయా ||
2 రాజమృత్యుం యమం కాలం వ్యాధిమానీయ త్వత్పురః | నిబధ్య దాతుం శక్తోzహం వ్యాధో బధ్వా పశుం యథా || 3 యతో న సంచరేద్వ్యాధిః దేహేషు దేహధారిణాం | వ్యాధినాం కారణం యద్యత్సర్వం జానామి సుందరి || 4 యతో న సంచరేత్ వ్యాధిబీజం దుష్టమమంగళం | తదుపాయం విజానామి శాస్త్రతత్వానుసారతః || 5 యో వా యోగేన భేదేన దేహత్యాగం కరోతి చ | తస్య తం జీవనోపాయం జానామి యోగధర్మతః || 6 బ్రాహ్మణస్య వచః శ్రుత్వా స్ఫీతా మాలావతీ సతీ | సస్మితా స్నిగ్ధచిత్తా సా తమువాచ ప్రహర్షితా || 7 ఓ సాధ్వి మాలావతీ! నీ భర్త ఏరోగము వల్ల చనిపోయెనో తెలుపుము. నేను వైద్యుడను. అన్ని రోగములకు చికిత్స చేయుదును. చనిపోయినట్లున్నా రోగమువలన చనిపోయినా నాకు గల వైద్యజ్ఞానముతో వారము దినములలో అతనిని బ్రతికింతును. మృత్యువును, యముని, కాలుని, వ్యాధిని బోయవాడు పశువును కట్టివేసి తెచ్చినట్లు కట్టివేసి నీ ముందుకు తీసికొని రాగలను. దుష్టము అమంగళ##మైన వ్యాధికారణము వ్యాపించకుండా చేయు ఉపాయములను శాస్త్రజ్ఞానము ననుసరించి తెలుసుకొన్నాను. ఎవరైన బాధలు భరించలేక యోగమార్గమున దేహత్యాగము చేసినచో అతనిని కూడ యోగ పద్ధతిలోనే తిరిగి బతికించగలను. అందువలన నీ భర్తృ మరణకారణము నాకు తెలుపుము. బ్రాహ్మణుని పై మాటలు విని మాలావతి సంతోషముతో ప్రశాంతమైన మనస్సుతో ఇట్లనెను. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను- అహో శ్రుతం కిమాశ్చర్యం వచనం బాలవక్త్రతః | వయసాzతిశిశుః దృష్టో జ్ఞానం యోగవిదాంవరం || 8 త్వయా కృతా ప్రతిజ్ఞా చ కాంతం జీవయితుం మమ | విపరీతం న సద్వాక్యం తత్‌క్షణం జీవితః పతిః || 9 జీవయిష్యతి మత్కాంతం పశ్చాద్వేదవిదాం వరః | యద్యత్పృచ్ఛామి సందేహాత్తద్భవాన్ వక్తుమర్హతి || 10 సభాయాం జీవితే కాంతే తస్య తీవ్రస్య సన్నిధౌ | త్వాం హి ప్రష్టుం న శక్తాzహం విద్యమానే మదీశ్వరే || 11 ఏతే బ్రహ్మాదయో దేవా విద్యమానాశ్చ సంసది | త్వం చ వేదవిదాం శ్రేష్ఠో న చ కశ్చిన్మదీశ్వరః || 12 నారీం రక్షతి భర్తా చేన్న కోzపి ఖండితుం క్షమః | శాస్తిం కరోతి యది స న కోzపి రక్షితా భువి || 13 ఏవం దేవేషు నో శక్తిః శ##క్రే వా బ్రహ్మరుద్రయోః | స్త్రీపుంభావశ్చ బోద్ధవ్యః స్వామీ కర్తా చ యోషితాం || 14 స్వామీ కర్తా చ హర్తా చ శాస్తా పోష్టా చ రక్షితా | అభీష్టదేవః పూజ్యశ్చ న గురుః స్వామినః పరః || 15 కన్యా సత్కులజాతా యా సా కాంతవశవర్తినీ | యా స్వతంత్రా చ సా దుష్టా స్వభావకుటిలా ధ్రువం || 16 దుష్టా పరపుమాంసం చ సేవతే యా నరాధమా | సా నిందతి పతిం శశ్వదసద్వంశ ప్రసూతికా || 17 ఉపబర్హణ భార్యాzహం కన్యా చిత్రరథస్య చ | వధూర్గంధర్వరాజస్య కాంతభక్తా సదా ద్విజ || 18 సర్వం కలయితుం శక్తస్త్వం చ వేదవిదాం వర | కాలం యమం మృత్యుకన్యాం మదభ్యాశం సమానయ || 19 మాలావతీవచః శ్రుత్వా విప్రో వేదవిదాం వరః | సభామధ్యే సమాహూయ తాన్ ప్రత్యక్షం చకార హ || 20 ఓహో! చిన్న పిల్లవాని ముఖమునుండి ఎంత ఆశ్చర్యకరమైన మాటలు వెడలినవి. వయస్సులో చాలా చిన్నవాడు. కాని జ్ఞానము యోగజ్ఞానుల కన్న మిన్నగా కన్పించుచున్నది. నీవు నా భర్తను బ్రతికింతునని చెప్పిన మాటలు యథార్థమైనవి. మీమాటల వలననె నాభర్త తరువాత బ్రతికింపవచ్చును. కాని తొలుత నేనడిగిన సందేహములను తీర్చగలరు. ఎందువలననగా నా భర్త జీవించి యున్నప్పుడు అతని సన్నిధిలో స్వతంత్రముగా మిమ్ము ప్రశ్నింపజాలను. ఈసభలో ఉన్న బ్రహ్మాది దేవతలుగాని, వేదవేత్తలలో శ్రేష్ఠుడవైన నీవు కాని నా భర్తవు కావు. అందువలన స్వేచ్ఛగా అడుగుచున్నాను. భర్త తన భార్యను రక్షించుచున్నప్పుడు వద్దని చెప్పుటకు ఎవరికి వీలుండదు. అట్లే అతడు కాదన్నప్పుడు ఆమెను ఎవ్వరు రక్షించలేరు. ఈవిధముగా బ్రహ్మ రుద్రులకు కాని, ఇతర దేవతలకు గాని వీలుకాదు. స్త్రీకి భర్త సమస్త కార్యములకు కర్త యగుచున్నాడు. హరించువాడు కూడ. అట్లే శాసించగలిగినవాడు, రక్షించగలిగినవాడు అతడే. ఇష్టమైన దేవత, గురువు, గౌరవించతగినవాడు అతడే. భర్తను మించిన గురువు స్త్రీకి లేనే లేడు. ఉన్నత వంశములో పుట్టిన స్త్రీ భర్త యొక్క అదుపు, ఆజ్ఞలలో ఉండును. స్వేచ్ఛా స్వాతంత్ర్యములతో నున్న స్త్రీ స్వభావతః కుటిల, దుష్టురాలు కూడ. దుష్టురాలైన స్త్రీ పరపురుషుని కూడ సేవించును. పైగా మంచి వంశములో పుట్టని స్త్రీ భర్తను ఎల్లప్పుడు నిందించుచుండును. నేను చిత్రరథుడను గంధర్వ రాజు కూతురను. ఉపబర్హణుడను గంధర్వరాజు భార్యను. నీవు అన్ని పనులు చేయ సమర్థుడవు. కావున ప్రస్తుతము కాలుని, యముని, మృత్యుకన్యను నాసమ్ముఖమునకు రప్పించుము. మాలావతి యొక్క పై మాటలు విని వేదవేత్తయైన ఆ బ్రాహ్మణుడు వారిని సభా మధ్యమున ప్రత్యక్షము చేయించెను. దదర్శ మృత్యుకన్యాం చ ప్రథమం మాలతీ సతీ | కృష్ణవర్ణాం ఘోరరూపాం రక్తాంబరధరాం వరాం || 21 సస్మితాం షఢ్భుజాం శాంతాం దయాయుక్తాం మహాసతీం | కాలస్య స్వామినో వామే చతుష్పష్టి సుతాన్వితాం || 22 కాలం నారాయణాంశం చ దదర్శ పురతః సతీ | మహోగ్రరూపం వికటం గ్రీష్మ సూర్య సమప్రభం || 23 షడ్వక్త్రం షోడశభుజం చతుర్వింశతిలోచనం | షట్పాదం కృష్ణవర్ణం చ రక్తాంబరధరం పరం || 24 దేవస్య దేవం వికృతం సర్వసంహారరూపిణం | కాలాధిదేవం సర్వేశం భగవంతం సనాతనం || 25 ఈషద్ధాస్యప్రసన్నాస్యమక్షమాలాకరం వరం | జపంతం పరమం బ్రహ్మ కృష్ణమాత్మానమీశ్వరం || 26 సతీ దదర్శ పురతో వ్యాధి సంఘాన్ సుదుర్జయాన్ | వయసాzతిమహావృద్ధాన్ స్తనంధాన్ మాతృసన్నిధౌ || 27 స్థూలపాదం కృష్ణవర్ణం ధర్మిష్ఠం రవినందనం | జపంతం పరమం బ్రహ్మ భగవంతం సనాతనం || 28 ధర్మాధర్మ విచారజ్ఞం పరం ధర్మస్వరూపిణం | పాపినామపి శాస్తారం దదర్శ పురతో యమం || 29 మాలతి (మాలావతి) మొదలు నల్లనిరంగు, భయంకర రూపము, ఎఱ్ఱని వస్త్రములు కలది, ఆరుభుజములతో దయకలిగి చిరునవ్వుతోనున్న మృత్యుకన్యను చూచెను. ఆమె అరువది నలుగురు పుత్రులతో తన భర్తయగు కాలుని వామపార్శ్వముననుండెను. తరువాత మాలావతి నారాయణాంశ కలవాడు, మిక్కిలి భయంకరమైన రూపము, ఆరు ముఖములు, పదునారు భుజములు, ఇరువదినాలుగు కండ్లు, ఆరుపాదములు, ఎఱ్ఱని వస్త్రములు ధరించిన కాలపురుషుని చూచెను. అతడు గ్రీష్మకాలపు సూర్యునివంటి కాంతికలవాడు. సర్వసంహార స్వరూపి. దేవదేవుడు, కాలమునకు అధిదేవత, చిరునవ్వు కల ముఖము, అక్షమాలగల కరముకలవాడు. పరబ్రహ్మ, పరమాత్మ, ఈశ్వరుడు ఐన శ్రీకృష్ణుని మంత్రమును అతడు ఎల్లప్పుడు జపము చేయుచుండెను. ఆ తరువాత మాలావతి అతిమహావృద్ధులు, తల్లియైన మృత్యుకన్య సమీపములో చంటిపిల్లల వలె ప్రవర్తించు వ్యాధి సమూహములను చూచెను. అటు పిమ్మట స్థూలపాదుడు కృష్ణవర్ణుడు, ధర్మస్వభావము కలవాడు, పరబ్రహ్మ, సనాతనుడగు శ్రీకృష్ణుని మంత్రమునెల్లప్పుడు జపించువాడు, ధర్మస్వరూపి, సూర్యనందనుడు ఐన యమధర్మరాజును చూచెను. అతడు పాపములు చేయుచున్నవారిని శిక్షించును. తాంశ్చ దృష్ట్యా చ నిశ్శంకా పప్రచ్చ ప్రథమం యమం | మాలావతీ మహాసాధ్వీ ప్రహృష్టవదనేక్షణా || 30 మహాసాధ్వియైన మాలావతి సంతోషముతో వారిని చూచి మొదలు నిర్భయముగా యమధర్మరాజును ఇట్లడిగెను. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను- హే ధర్మరాజ ధర్మిష్ఠ ధర్మశాస్త్ర విశారద | కాలవ్యతిక్రమే కాంతం కథం హరసి మే విభో || 31 ధర్మశాస్త్రములన్నీ ఎరిగిన ఓ ధర్మరాజా కాలమును అతిక్రమించి నా భర్తను ఏవిధముగా తీసుకొని వెళ్ళితివి? యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను- అప్రాప్తకాలో మ్రియతే న కశ్చిజ్జగతీతలే | ఈశ్వరాజ్ఞాం వినా సాధ్వి నామృతం చాలయామ్యహం || 32 అహం కాలో మృత్యుకన్యా వ్యాధయశ్చ సుదుర్జయాః | నిషేకేణ ప్రాప్తకాలం కాలయంతీశ్వరాజ్ఞయా || 33 మృత్యుకన్యా విచారజ్ఞా యం ప్రాప్నోతి నిషేకతః | తమహం కాలయామ్యేవ పృచ్ఛతాం కేన హేతునా || 34 మరణకాలము దాపురించని వాడెవడు ఈ భూమిపై చనిపోవుట లేదు. ఈశ్వరాజ్ఞలేక నేను చావని వానినెవనిని తీసికొని పోను. నేను, కాలుడు, మృత్యుకన్య, ఈ వ్యాధులు ప్రాప్తకాలుని మాత్రమే భగవంతుని ఆజ్ఞతో తీసికొని పోవుచున్నాము. ఈ మృత్యుకన్య అన్ని తెలిసిన వ్యక్తి. ఆమె ఎవరిని ఆశ్రయించునో అతనిని నేను కబళింతును. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను- త్వమపి స్త్రీ మృత్యుకన్యా జానాసి స్వామివేదనం | కథం హరసి మత్కాంతం జీవితాయాం మయి ప్రియే || 35 ఓ మృత్యుకన్యా! నీవుకూడా స్త్రీవి. నీకూ స్వామివేదన ఎట్లుండునో తెలియును, నేను బ్రతికి ఉండగా నా భర్తనెందుకు తీసికొని పోయితివి? మృత్యుకన్యోవాచ- మృత్యుకన్య ఇట్లనెను- పురా విశ్వసృజా సృష్టాzప్యహమేవాత్ర కర్మణి | న చ క్షమా పరిత్యక్తుం బహునా తపసా సతి || 36 సతీ సతీనాం మధ్యే చ కాచిత్తేజస్వినీ వరా | మామేవ భస్మసాత్కర్తుం క్షమా యది భ##వేద్భవే || 37 సర్వాపచ్ఛాంతిరేవేహ తదా భవతి సుందరి | పుత్రాణాం స్వామినః పశ్చాద్భవితా యద్భవిష్యతి || 38 కాలేన ప్రేరితాzహం చ మత్పుత్రా వ్యాధయశ్చ వై | న మత్సుతానాం దోషశ్చ న చ మే శ్రుణునిశ్చితం || 39 పృచ్ఛ కాలం మహాత్మానం ధర్మజ్ఞం ధర్మసంసది | తదా యదుచితం భ##ద్రే తత్కరిష్యసి నిశ్చితం || 40 మాలావతీ! నన్ను విశ్వమునకంత స్రష్టయైన బ్రహ్మదేవుడు ఈ మమారణకర్మమున నియోగించినాడు, అధికమైన తపస్సుచేసి కూడ దీనిని వదలించుకొనలేక పోవుచున్నాను. గొప్ప తేజస్సుకల మహాపతివ్రత నన్ను భస్మముచేసినచో అందరకు అశాంతి కలుగును. నా పుత్రులకు, నాభర్తకు నేను భస్మమైనందువలన ఏమైనా జరుగనిమ్ము. నేను దానికి బాధచెందను. నా భర్తయగు కాలుని ప్రేరణచే నేను, నా పుత్రులైన వ్యాధులు ఈ పనిచేయుచున్నాము. ఇందు నాపుత్రుల తప్పు లేశమాత్రమైనా లేదు. అందువలన నీవు ఈ విషయమును ఈ ధర్మసదస్సులో ధర్మజ్ఞుడైన కాలుని అడుగుము. అతడు చెప్పినది విని నీకు ఏది ఉచితమని అనిపించునో దానిని చేయుము. మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను- హేకాల కర్మణాం సాక్షిన్ కర్మరూప సనాతన | నారాయణాంశో భగవన్నమస్తుభ్యం పరాయ చ || 41 కథం హరసి మత్కాంతం జీవితాయాం మయి ప్రభో | జానాసి సర్వదుఃఖం చ సర్వజ్ఞస్త్వం కృపానిధే || 42 ఓ కాలపురుషుడా! నీవు అందరుచేయు కర్మలకు సాక్షీభూతుడవు. కర్మస్వరూపివి, సనాతనుడవు. నారాయణాంశ కల నీకు నమస్కారము. ఓ దయానిధీ ! నీవు సర్వజ్ఞుడవు. అందరి దుఃఖములగురించి తెలియును. అట్టి నీవు నేను బ్రతికియుండగానే నా భర్తను ఎందుకు తీసికొని పోయినావు. కాలపురుష ఉవాచ- కాలపురుషుడిట్లనెను- కోవాzహం కో యమః కా చ మృత్యుకన్యా చ వ్యాధయః | వయం భ్రమామః సతతం ఈశాజ్ఞాపరిపాలకాః || 43 యస్య సృష్టా చ ప్రకృతిః బ్రహ్మ విష్ణు శివాదయః | సురామునీంద్రా మనవో మానవాస్సర్వ జంతవః || 44 ధ్యాయంతే తత్పదాంభోజం యోగినశ్చ విచక్షణాః | జపంతి శశ్వన్నామాని పుణ్యాని పరమాత్మనః || 45 యద్భయాద్వాతి వాతోzయం సూర్యస్తపతి యద్భయాత్ | స్రష్టా బ్రహ్మాజ్ఞయా యస్య పాతా విష్ణుర్యదాజ్ఞయా || 46 సంహర్తా శంకరః సర్వజగతాం యస్య శాసనాత్ | దిగీశాశ్చైవ దిక్పాలా యస్యాజ్ఞాపరిపాలకః || 47 రాశిచక్రం గ్రహాస్సర్వే భ్రమంతి యస్య శాసనాత్ | దిగీశాశ్చైవ దిక్పాలా యస్యాజ్ఞాపరిపాలకాః || 48 యస్యాజ్ఞయా చ తరవః పుష్పాణి చ ఫలాని చ | బిభ్రత్యేవ దదత్యేవ కాలే మాలావతీ సతి || 49 యస్యాజ్ఞయా జలాధారా సర్వాధారా వసుంధరా | క్షమావతీ చ పృథివీ కంపితా న భ##యేన చ || 50 సహసా మోహితా మాయా మాయయా యస్య సంతతం | సర్వప్రసూర్యా ప్రకృతిః సా భీతా యద్భయాదహో || 51 యస్యాంతం న విదుర్వేదా వస్తూనాం భావగా అపి | పురాణాని చ సర్వాణి యసై#్యవ స్తుతి పాఠకాః || 52 యస్య నామ విధిర్విష్ణుః సేవతే సుమహాన్ విరాట్ | షోడశాంశో భగవతః స ఏవ తేజసో విభుః || 53 సర్వేశ్వరః కాలకాలో మృత్యోర్మృత్యుః పరాత్పరః | సర్వవిఘ్నవినాశాయ తం కృష్ణం పరిచింతయ || 54 సర్వాభీష్టం చ భర్తారం ప్రదాస్యతి కృపానిధిః | ఇమే యత్ర్పేరితాః సర్వే స దాతా సర్వసంపదాం || 55 ఇత్యుక్త్వా కాలపురుషో విరరామ చ శౌనక | కథాం కథితుమారేభే పునరేవ తు బ్రాహ్మణః || 56 ఓ మాలావతీ! నేను స్వతంత్రుడనుకాను. అట్లే యముడు, మృత్యుకన్య, వ్యాధులు, ఎవరుకూడా స్వతంత్రులు కారు. మేమందరము పరమేశ్వరుని ఆజ్ఞను పరిపాలించువారము. ఈ ప్రకృతి, బ్రహ్మ, విష్ణు శివాదులు, దేవతలు, మునీంద్రులు, మనువులు, మానవులు, సమస్తజంతువులు ఎవరియొక్క సృష్టిలో చేరినవారో, యోగులు ఏ పరమాత్మ పాదాంభోజములను ఎప్పుడు ధ్యానించుచుందురో, ఎవరి పవిత్ర నామములను సదా జపించుచుందురో, ఏ పరమాత్మయొక్క భయము వలన గాలి వీచుచున్నదో, సూర్యుడు ఎండనుకాయుచున్నాడో, ఎవరి ఆజ్ఞననుసరించి బ్రహ్మ సృష్టికార్యమును, విష్ణుమూర్తి రక్షణభారమును, శంకరుడు సంహనన కార్యమును చేయుచున్నారో, కర్మసాక్షియైన ధర్మదేవత, మేషాది ద్వాదశరాశి చక్రము, సమస్తగ్రహములు, దిక్పాలకులు, ఏ పరమాత్మ ఆజ్ఞను పరిపాలించుచున్నారో, ఎవరి ఆజ్ఞననుసరించి చెట్లు పువ్వులను, ఫలములను ఇచ్చుచున్నవో, జలమే ఆధారముగా కలది, అందరికి ఆధారభూతమైనది, మిక్కిలి ఓర్పు కలది అగు భూమి ఎవరియొక్క ఆజ్ఞాభయమువలన కంపించుటలేదో, ఎవరి మాయవలన మాయకూడ మోహమునందుచున్నదో, ఎవరిభయమువలన ప్రకృతి అన్నిటిని ఇచ్చుచున్నదో, వేదములు ఎవనియొక్క అంతమును తెలుపలేవో, పురాణములు, ఎవనిని స్తుతించునో, ఆ పరాత్పరుని నామమును విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అనుక్షణము సేవింతురు. విష్ణుమూర్తి ఆ పరాత్పరుని పదునారవ అంశ. అందువలన నీవు ఆ సర్వేశ్వరుని, కాలమునకు కాలభూతుడైన శ్రీకృష్ణుని సమస్త విఘ్నములు పోవుటకై ధ్యానింపుము. దయగల ఆ శ్రీకృష్ణుడు నీ సమస్తములైన కోరికలను, భర్తను ఇచ్చును. ఈ దేవతలందరు పరాత్పరుని ప్రేరణ వలననే సమస్త సంపదలనిచ్చుచున్నారు. అందువలన నీవు ఆ శ్రీకృష్ణుని శరణుపొందుము. అని కాలపురుషుడూరకుండెను. తరువాతి కథను బ్రాహ్మణుడిట్లు చెప్పసాగెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే మాలావతీ కాలపురుష సంవాదే పంచదశోzధ్యాయః. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములోని బ్రహ్మఖండమున మాలావతీ కాలపురుష సంవాదమను పదునైదవ అధ్యాయము సమాప్తము.