sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
వింశోzధ్యాయః - ఉపబర్హణుని జన్మ వృత్తాంతము సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను - ముదా మాలావతీసార్థం గంధర్వశ్చోపబర్హణః | రేమే కాలావశేషం చ తాభిశ్చ నిర్జనే వనే ||
1 గంధర్వ రాజో ముముదే పుత్ర దారాదిభిః సహ | నానావిధం క్రతువరం మహత్పుణ్యం చకార హ ||
2 రాజత్వం బుభుజే రాజా కుబేరభవనోపమే | రేమే సుశీలయా సార్థం స్థిర¸°వనయుక్తయా ||
3 గంధర్వరాజః కాలే చ గంగాతీరే మనోహరే | పత్న్యా సార్థమసూంస్త్యక్త్వా వైకుంఠం చ య¸° ముదా ||
4 శైవః శివప్రసాదేన పుత్రస్య విష్ణుసేవయా | బభూవ దాసో వైకుంఠే విష్ణోః శ్యామశ్చతుర్భుజః ||
5 కృత్వా పిత్రోశ్చ సత్కారం గంధర్వశ్చోపబర్హణః | బ్రాహ్మణభ్యో దదౌ విప్ర ధనాని వివిధాని చ ||
6 కాలే స్వయం బ్రహ్మశాపాత్ప్రాణాంస్త్యక్త్వా విచక్షణః | స జజ్ఞే వృషలీగర్భే బ్రహ్మబీజేన శౌనక ||
7 ఉపబర్హణ గంధర్వుడు తన భార్యయైన మాలావతితో, ఇతర స్త్రీలతో కలిసి తనకు మిగిలిపోయిన కాలమును సుఖముగా గడిపెను. ఉపబర్హణుని తండ్రియైన గంధర్వరాజు తన భార్యా పుత్రులతో సంతోషముతో నుండి మిక్కిలి పుణ్యమును కలిగించు అనేక యాగములను చేసి కుబేర భవనము వంటి తన ఇంటిలో సుఖముగా నుండెను. ఆ గంధర్వరాజు తనకాలము తీరిన పిదప గంగాతీరమున భార్యా సమేతముగా ప్రాణములు వదలి వైకుంఠమునకు పోయెను. ఆతడు శైవుడైనను తన పుత్రుని విష్ణుసేవవల్ల, శివుని యొక్క అనుగ్రహమువలన వైకుంఠమున నాల్గు భుజములు కల విష్ణుదాసుడాయెను. ఉపబర్హణ గంధర్వుడు తలిదండ్రులకు శ్రాద్ధాది సత్కారము చేసి బ్రాహ్మణులకు అనేకములైన దానములు చేసెను. ఆతడు కూడ తన కాలము తీరుటవలన బ్రహ్మశాపమువలన ప్రాణములు వదలిపెట్టి దాసీగర్భమున బ్రాహ్మణుని వలన జన్మనెత్తెను. మాలావతీ వహ్నికుండే పుష్కరే భారతే భువి | కృత్వా తు వాంఛితుం కామం ప్రాణాంస్తత్యాజ సా సతీ ||
8 సృంజయస్య తు పత్న్యాం చ మనువంశోద్భవస్య చ | జజ్ఞే నృపస్య సాధ్వీ సా పుణ్యా జాతిస్మరా వరా ||
9 ఉపబర్హణగంధర్వః పతిర్మే భవితేతి చ | ఇతి కామా కాముకీ సా సుందరీ సుందరీవరా ||
10 మాలావతి పుష్కర క్షేత్రమున యజ్ఞకుండమున బడి తన ప్రాణములను వదిలెను. ఆమె మనువంశమున పుట్టిన సృంజయుడను వాని ఇంట అతనికి కూతురుగా పుట్టెను. ఆమె పాతివ్రత్య మహిమవలన తన పూర్వ జన్మమును స్మరించుకొనుచు, ఈజన్మమునందును మరల ఉపబర్హణ గంధర్వుడే భర్త కావలెనని కోరుచుండెను. శౌనక ఉవాచః శౌనకుడిట్లనెను - బ్రహ్మవీర్యాచ్ఛూద్రపత్న్యాం గంధర్వశ్చోపబర్హణః | జాతః కేన ప్రకారేణ తద్భవాన్ వక్తు మర్హతి || 11 ఉపబర్హణ గంధర్వుడు బ్రాహ్మణుని వలన శూద్రస్త్రీ యందు ఏ విధముగా పుట్టెనో ఆ వృత్తాంతమంతయు వివరించుడు. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లనెను- కాన్యకుబ్జే చ దోశే చ ద్రుమిలో నామ రాజకః | కళావతీ తస్య పత్నీ వంధ్యా చాపి పతివ్రతా || 12 స్వామి దోషేణ సా వంధ్యా కాలే చ భర్తురాజ్ఞయా | ఉపతస్థే వనే ఘోరే నారదం కాశ్యపం మునిం || 13 ధ్యాయమానం చ శ్రీకృష్ణం జ్వలంతం బ్రహ్మతేజసా | తస్థౌ సువేషం కృత్వా సా ధ్యానాంతే చ మునేః పురః || 14 గ్రీష్మ మధ్యాహ్న మార్తండ ప్రభాతుల్యేన తేజసా | తపంతం దూరతోzప్యేవం సమీపం గంతుమక్షమా || 15 ధ్యానాంతే చ మునిశ్రేష్ఠః పరః కృష్ణపరాయణః | దదర్శ పురతో దూరే సుందరీం స్థిర¸°వనాం || 16 చారుచంపకవర్ణాభాం శరత్పంకజలోచనాం | శరత్పార్వణచంద్రాస్యాం రత్నభూషణ భూషితాం || 17 బృహన్నితంబభారార్తాం పీనశ్రోణిపయోధరాం | శోభితాం పీతవస్త్రేణ సస్మితాం రక్తలోచనాం || 18 మోహితాం మునిరూపేణ కామబాణప్రపీడితాం | దర్శయంతీం స్తనశ్రోణిం మైథునాసక్తచేతసా || 19 సిందూరబిందుభూషాఢ్యాం సుచారుకజ్జలోజ్వలాం | పదాలక్తక శోభాఢ్యాం రూపేణౖవ యథోర్వశీం || 20 మునిః పప్రచ్ఛ దృష్ట్వా తాం కా త్వం కామిని నిర్జనే | కస్య పత్నీ కథం వాzత్ర సత్యం బ్రూహి చ పుంశ్చలి || 21 మునేశ్చ వచనం శ్రుత్వా కంపితా చ కళావతీ | కళావతీ | ఉవాచ వినయేనైవ కృత్వా చ శ్రీహరిం హృది || 22 కాన్యకుబ్జ దేశమున ద్రుమిళుడను రాజుగలడు. అతని భార్యపేరు కళావతి. ఆమె పతివ్రతయైనప్పటికి భర్తయందున్న లోపమువలన పుత్రులు కలుగలేదు. అందువలన భర్తయొక్క ప్రేరణవలన అడవిలో తపస్సు చేసికొనుచున్న కశ్యపవంశ సంజాతుడైన నారదుడను ముని వద్దకు వెళ్ళెను. ఆ ముని బ్రహ్మ వర్చస్సు కలిగి శ్రీకృష్ణుని గురించి ధ్యానము చేయుచుండెను. గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యుని వంటి కాంతితో ప్రకాశించుచున్న ఆ మునిని కళావతి సమీపించలేకపోయినది. ఐనను శ్రీకృష్ణభక్తుడైన ఆ ముని తన ధ్యానము చివర తనముందు అందముగా అలంకరించుకొని, మంచి సౌందర్యము, మంచి ¸°వనములతో నున్న ఆ కళావతిని చూచెను. ఆమె చంపకపుష్పమువలె పచ్చనైన మేలిమి బంగారు రంగు కలది, శరత్కాలమందలి కలువలవంటి కన్నులు కలది. బృహన్నితంబము, బలిసిన పయోధరములు కలది. పచ్చని చీరకట్టుకొని మద్యము త్రాగినందువలన ఎఱ్ఱని కన్నులు కలది. నొసట సిందూరపు చుక్కతో, భూషణములతో, కాటుక గల కళ్ళతో, పాదములకున్న పారాణితో ఊర్వశివలె కనిపించినది. ఆమె మునిరూపమును చూచి మోహించి తన చన్నులు కన్పడునట్లు చేయుచు తన మనస్సులోని భావమెరింగించెను. నిర్జన వనములో తనకెదురుగా వికృతపు చేష్టలు చేయుచున్న ఆమెను చూచి ముని, నీవెవరవు? నీభర్త పేరేమి? నిజము చెప్పుమని గద్దించెను. మునియొక్కమాటలు విని కళావతి భయపడుచు మనస్సులో శ్రీహరిని తలచుచు వినయముతో నిట్లనెను. కళావత్యువాచ- కళావతి ఇట్లనెను - గోపికాzహం ద్విజశ్రేష్ఠ ద్రుమిలస్య చ కామినీ | పుత్రార్థినీ చాగతాzహం త్వన్మూలం భర్తురాజ్ఞయా || 23 వీర్యాధానం కురు మయి స్త్రీ నోపేక్ష్యా హ్యుపస్థితా | తేజీయసాం న దోషాయ వహ్నేః సర్వభుజో యథా || 24 వృషలీవచనం శ్రుత్వా చుకోప మునిసత్తమః | ఉవాచ నీత్యం సత్యం చ కోపప్రస్ఫురితాధరః || 25 ఓ మహర్షీ! నేను ద్రుమిలుడను రాజు భార్యను, గోపికను, నా భర్తయొక్క ఆజ్ఞవలననే పుత్రులను కోరుకొని మీ దగ్గరకు వచ్చితిని. దగ్గరకు వచ్చిన స్త్రీని ఉపేక్షించుట తగనిది. అగ్ని ఏవిధముగా అన్నిటిని భక్షించునో తేజస్సు కలవారికి దోషములంటవు. అందువలన నాకు పుత్రులు కలుగునట్లు చేయుము. శూద్రస్త్రీయగు కళావతి మాటలు విని ముని కోపముతో వణకుచున్న పెదవులతో, నీతియుక్తమైన మాటను ఇట్లు పలికెను. కాశ్యప ఉవాచ- కాశ్యపుడిట్లనెను- యః స్వలక్షీంచ భోగార్హాం పరాయ దాతుమిచ్ఛతి | తం సా త్యజతి మూఢం చ వేదవాద ఇతిధ్రువం || 26 న త్వం ద్రుమిలభోగార్హా పునరేవ భవిష్యసి | విరక్తేన స్వయం త్యక్త్వా న గృహ్ణాతి చ త్వాం పునః || 27 యః శూద్రపత్నీం గృహ్ణాతి బ్రాహ్మణో జ్ఞానదుర్బలః | స చండాలో భ##వేత్సత్యం న కర్మార్హో ద్విజాతిషు || 28 పితృశ్రాద్ధే చ యజ్ఞే చ శిలాస్పర్శే సురార్చనే | అధికారశ్చ తసై#్యవమిత్యాహ కమలోద్భవః || 29 కుంభీపాకం స్వయం యాతి పాతయిత్వా చ పూరుషాన్ | మాతామహాన్ స్వాత్మనశ్చ దశ పూర్వాన్ దశాపరాన్ || 30 తత్తర్పణం మూత్రమేవ పిండం సద్యః పురీషకం | శాలగ్రామస్య తత్ స్పర్శే చోపవాస స్త్రిరాత్రకం || 31 తదిష్టదేవో గృహ్ణాతి న నైవేద్యం న తజ్జలం | సన్యాసినాం బ్రాహ్మణానాం తదన్నం చ పురీషవత్ || 32 కుంభీపాకే పచ్యతే స శక్రాంతం యావదేవ హి | ఏకవింశతి పురుషైః సార్థం సత్యం చ పుంశ్చలి || 33 పత్రోచ్ఛిష్టం చ యో భుంక్తే శూద్రాణాం బ్రాహ్మణాధమః | తత్తుల్యోzధరభోజీ చైవేత్యాంగిరసభాసితం || 34 శూద్రో వా యది గృహ్ణాతి బ్రాహ్మణీం జ్ఞానదుర్బలః | స పచ్యతే కాలసూత్రే యావదింద్రాశ్చతుర్దశ || 35 అష్టాదశేంద్రావచ్ఛిన్నం కాలం చ కాలసూత్రకే | బ్రాహ్మణీ పచ్యతే తత్ర భక్షితా క్రిమిభిర్ధ్రువం || 36 తతశ్చండాలయోనౌ చ లబ్ధ్వా జన్మ చ బ్రాహ్మణీ | శూద్రశ్చ కుష్ఠీ భవతి జ్ఞాతిభిః పరివర్జితః || 37 ఇత్యుక్త్వా చ మునిశ్రేష్ఠో విరరామ చ శౌనక | వృషలి తత్పురస్తస్థౌ శుష్కకంఠౌష్ఠతాలుకా || 38 అనుభవించుటకు తగిన తన లక్ష్మిని ఇతరులకిచ్చుటకు ఎవడిష్టపడునో అతనిని ఆ లక్ష్మి వీడు మూఢుడని వేదవాదరతుడని భావించి వదలిపెట్టును. నీవు చేయుచున్న పనివలన నీవు మరల ద్రుమిలునికి అనుభవయోగ్యవు కాజాలవు. అతడు విరక్తుడై నిన్ను వదలిపెట్టి మరల నిన్ను స్వీకరించడు. మానసిక దౌర్బల్యముతో బ్రాహ్మణుడు శూద్రుని భార్యను స్వీకరించినచో అతడు చండాలుడగును. ద్విజుడు చేయు కర్మకు అనర్హుడగును. అతనికి పితృశ్రాద్ధమున, యజ్ఞమున, దేవతార్చనయందు అర్హత ఉండదని బ్రహ్మదేవుడనెను. అట్లే అతడు కుంభీపాకమనే నరకమున పడును. తనకు, తన తల్లికి ముందున్న పదితరముల వారిని, తరువాతనున్న పదితరముల వారిని కూడ కుంభీపాక నరకమునకు పంపును. అతడుచేసిన తర్పణములు పిండములు పితృదేవతలకు పనికిరావు. అతడు సాలగ్రామశిలను ముట్టుకొనినచో మూడు రాత్రులుపవాసముండవలెను. అతడు పెట్టిన నైవేద్యమును, అన్నమును దేవతలుగాని, సన్యాసులుగాని బ్రాహ్మణులుగాని స్వీకరించరు. శూద్రుల ఉచ్ఛిష్టమును, దానితో సమానమైన శూద్రస్త్రీయొక్క పెదవులను సేవించినవాడు తనకు ఇటు, అటు ఇరువది ఒక్క తరములవారిని కుంభీపాక నరకమునకు పంపును. శూద్రుడు మానసిక దౌర్బల్యముచే బ్రాహ్మణ స్త్రీతో సంగమించినచో అతడు పదునలుగురు ఇంద్రులు గతించువరకు నరకములోనుండును. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడ పదునెనమిది మంది ఇంద్రులు గతించు వరకు నరకమున బాధలు పడును. తరువాత కూడ ఆమె చండాలుర ఇంటిలోనే పుట్టును. ఆ శూద్రుడు కుష్ఠురోగమును పొందును. ఇట్లు కాశ్యపముని చెప్పగా కళావతి ఎండిన పెదవులతో ఏమియు మాటాడుటకు తోచక ఊరకుండెను. ఏతస్మిన్నంతరే తేన పథా యాతి చ మేనకా | తస్యా ఊరూ స్తనౌ దృష్ట్వా మునేర్వీర్యం పపాత హ || 39 ఋతుస్నాతా చ వృషలీ పీత్వా తత్ర క్షణం ముదా | మునిం ప్రణమ్య ప్రహృష్టా ప్రయ¸° భర్తురంతికం || 40 గత్వా ప్రణమ్య ద్రుమిలం కాంతా కాంతం మనోహరం | సర్వం నివేదయామాస వృత్తాంతం గర్భహేతుకం || 41 కళావతీవచః శ్రుత్వా ప్రహృష్ట వదనేక్షణః | ఉవాచ కాంతాం మధురం పరిణామసుఖావహం || 42 ఆ సమయమున అటువైపుగా పోవుచున్న మేనకయొక్క తొడలను, స్తనములను చూచిన కాశ్యపునకు వీర్యపాతము జరిగినది. ఋతుస్నాతయైన కళావతి ఆవీర్యమును త్రాగి సంతోషముతో అచ్చటినుండి తన భర్త దగ్గరకు వెళ్ళినది. ఆమె ఇంటికి వెళ్ళి తనగర్భమునకు కారణమైన వృత్తాంతమంతయు చెప్పినది. ద్రుమిలుడు కళావతి మాటలు విని సంతోషపడి తన భార్యతో ఇట్లు పలికెను. ద్రుమిల ఉవాచ- ద్రుమిలుడిట్లనెను - విప్రస్య వీర్యం త్వద్గర్భే వైష్ణవస్య మహాత్మనః | వైష్ణవో భవితా బాలస్త్వం చ భాగ్యవతీ సతీ || 43 యద్గర్భే వైష్ణవో జాతో యస్య వీర్యేణ వా సతి | తయోర్యాతి చ వైకుంఠం పురుషాణాం శతం శతం || 44 తౌ చ విష్ణువిమానేన సద్రత్ననిర్మితేన చ | యాతౌ వైకుంఠనగరం జన్మమృత్యు జరాహరం || 45 కస్యచిత్ బ్రాహ్మణసై#్యవ గేహం గచ్ఛ శుభాననే | పశ్చాన్మమాంతికం భ##ద్రే యాస్యసీతి హరేః పురం || 46 ఇత్యుక్త్వా గోపరాజశ్చ స్నాత్వా కృత్వా తు తర్పణం | సంపూజ్యాభీష్టదేవం చ బ్రాహ్మణభ్యో ధనం దధౌ || 47 అశ్వానాం చ చతుర్లక్షం గజానాం లక్షమేవ చ | శతం మత్తగజేంద్రాణాం బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 48 ఉచ్చైఃశ్రవః పంచలక్షం రథానాం చ సహస్రకం | శకటానాం త్రిలక్షం చ బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 49 గవాం ద్వాదశలక్షం చ మహిషాణాం త్రిలక్షకం | త్రిలక్షం రాజహంసానాం బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 50 పారావతానాం లక్షం చ శుకానాం చ శతం మునే | లక్షం చ దాసదాసీనాం బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 51 గ్రామాణాంచ సహస్రంచ నగరాణాం శతం శతం | ధాన్యతండులశైలం చ బ్రాహ్మణభ్యో దదౌ ముదా || 52 శతకోటిం సువర్ణానాం రత్నానాం చ సహస్రకం | ముద్రాణాం కోటికలశం బ్రామ్మణభ్యో దదౌ ముదా || 53 దదౌ తైజసపాత్రాణాం భూషణానామసంఖ్యకం | తాం స్త్రియం రత్నభూషాఢ్యాం బ్రాహ్మణాయ దదౌ ముదా || 54 రాజ్యం దత్వా మహారాజోzప్యంతర్బాహ్యే హరిం స్మరన్ | జగామ బదరీం గోపో మనోగామీ ఘుదాన్వితః || 55 తత్రమాసం తపః కృత్వా గంగాతీరే మనోహరే | ప్రాణాంస్తత్యాజ యోగేన సద్యోదృష్టో మహర్షిభిః || 56 స చ విష్ణువిమానేన రత్నేంద్రనిర్మితేనచ | సంయుక్తో విష్ణుదూతైశ్చ వైకుంఠం చ జగామ హ || 57 తత్ర ప్రాప హరేర్దాస్యం హరిదాసో బభూవ సః | వృత్తాంతం చ కళావత్యాః శ్రూయాతామితి శౌనక || 58 వైష్ణవుడు, మహాత్ముడైన బ్రాహ్మణుని యొక్క వీర్యము నీగర్భమున ఉన్నందువలన నీకు పుట్టబోవు బాలుడు వైష్ణవుడు అగును. అందువలన నీవు చాలా అదృష్టవంతురాలవు. వైష్ణవుడు ఎవరి గర్భమున జనించునో, ఎవరి వీర్యమువలన పుట్టునో వారి వేయి తరములవారు వైకుంఠమునకు పోదురు. ఓ కళావతీ! నీవు ఒక బ్రాహ్మణుని ఇంటికిపొమ్ము. నీమరణానంతరము నాదగ్గరకు, వైకుంఠమునకు రాగలవు. అని ఆ గోపకులరాజగు ద్రుమిలుడు స్నానము చేసి తర్పణము లిచ్చి తన అభీష్ట దేవతను పూజించి బ్రాహ్మణులకు అనేక విధములైన దానములు చేసి చివరకు రత్నభూషణములతో నున్న తన భార్యను ఒక బ్రాహ్మణునకు అప్పగించి తన మనస్సులో, బయట (వాక్కుతో) శ్రీహరిని స్మరించుచు మనోవేగమున బదరీనారాయణమునకు వెళ్ళెను. అచ్చట గంగాతీరమున ఒకనెలవరకు తీవ్రమైన తపస్సుచేసి యోగమార్గమున తన ప్రాణములను వదలిపెట్టెను. తరువాత ఆ ద్రుమిలుడు రత్నములు, ఇంద్రమణులచే నిర్మింపబడిన విష్ణువిమానమున విష్ణుదూతలు వెంటరాగా వైకుంఠమును చేరెను. అచ్చట అతడు విష్ణువునకు దాసుడయ్యెను. ఇక కళావతి వృత్తాంతమునిప్పుడు వినుము - గతే కళావతీ నాథే ఉచ్చైశ్చ ప్రరురోద హ | వహ్నౌ ప్రాణాంస్త్యక్తుకామా బ్రాహ్మణనైవ రక్షితా || 59 బ్రాహ్మణోమాతరిత్యుక్త్వా తాం గృహీత్వా ముదాzన్వితః | జగామ రత్నపూర్ణం చ స్వగేహం చ క్షణన చ || 60 సా విప్రగేహే సాధ్వీ చ సుషావ తనయం వరం | తప్తకాంచనవర్ణాభం జ్వలంతం బ్రహ్మతేజసా || 61 తత్రస్థా యోపితః సర్వా దద్రుశుర్బాలకం శుభం | గ్రీష్మమధ్యాహ్న మార్తండజితం తం బ్రహ్మ తేజసా || 62 కామదేవాధికం రూనే చంద్రాధికశుభాననం | శరత్పార్వణచంద్రాస్యం శరత్పంకజలోచనం || 63 హస్తపాదాదివలితం సుకపోలం మనోహరం | పద్మచక్రాంకితం పాదపద్మం వాzతులముజ్వలం || 64 కరయుగ్మం వాzతులంచ రుదంతం చ స్తనార్థినం | యోషితో బాలకం దృష్ట్వా ప్రయయుః స్వాశ్రమం ముదా || 65 పుత్రదారయుతో విప్రః ప్రహృష్టశ్చ ననర్త చ | స బాలో వవృధే తత్ర శుక్లపక్షే యథా శశీ || 66 పుపోష బ్రాహ్మణస్తాం చ సపుత్రాంచ యథా సుతం || 67 కళావతి తన నాథుడు చనిపోయిన విషయము తెలుసుకొని పెద్దగా ఏడ్చి ప్రాణములను వదలుటకు సిద్ధపడెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లీ అని కళావతిని పిలిచి ఆమెను చావకుండా రక్షించి తన ఇంటికి తీసుకొనిపోయెను. కళావతి ఆ బ్రాహ్మణునింటిలో బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న బంగారు రంగువంటి కొడుకును కనెను. అచ్చట ఉన్న స్త్రీలు గ్రీష్మకాల మధ్యాహ్నమున ప్రకాశించుచున్న సూర్యునివంటి బ్రహ్మతేజస్సు కలవాడును, మన్మథుని కంటె మించిన రూపము, చంద్రునికంటె అందమైన ముఖము, తామరలవంటి కళ్ళు, అందమైన చెక్కిళ్ళు, పద్మ చక్రాంకితమైన పాదములు, చేతులు కలిగి పాలకొరకు ఏడ్చుచున్న బాలకుని చూచి సంతోషించిరి. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునివలె దిన దిన ప్రవర్ధమానుడగుచుండగా చూచి బ్రాహ్మణుడు భార్యాపుత్రులతో కలసి చాలా సంతోషించెను. ఆ బ్రాహ్మణుడు కళావతిని ఆమె కొడుకును ఇద్దరిని పోషింపసాగెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతిశౌనక సంవాదే ఉపబర్హణ జన్మకథనం నామవింశోzధ్యాయః శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున బ్రహ్మ ఖండమునందు సౌతి శౌనక సంవాదమున ఉపబర్హణుని జన్మ వృత్తాంత కథనమను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.