sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకవింశోzధ్యాయః - నారదుని శాప విముక్తి సౌతిరువాచ- సౌతి ఇట్లు పలికెను - బభూవ కాలే బాలశ్చ క్రమేణ పంచహాయనః | జాతిస్మరో జ్ఞానయుక్తః పూర్వమంత్రస్మృతః సదా ||
1 గీయతే సతతం కృష్ణయశోనామగుణాదికం | క్షణం రోదతి నృత్యేన పులకాంచితవిగ్రహః ||
2 కృష్ణసంబంధినీం గాథాం శ్రుణోతి యత్ర తత్ర వై | తత్సంబంధిపురాణం చ తత్ర తిష్ఠతి బాలకః ||
3 ధూలిధూసరసర్వాంగో ధూలినైవేద్యమీప్సితం | ధూలిషు ప్రతిమాం కృత్వా ధూలినా పూజయేద్ధరిం ||
4 పుత్రమాహ్వయతే మాతా ప్రాతరాశా చేన్మునే | హరిం సంపూజయామీతి మాతరం సంవదేత్పునః ||
5 కళావతికి జన్మించిన ఆ బాలుడు క్రమముగా ఐదు సంవత్సరములవాడయ్యెను. అతడు చిన్నతనముననే జ్ఞాని. అతనికి గత జన్మసృతి కలదు. పూర్వ జన్మలో నేర్చుకొన్న అన్ని మంత్రముల స్మృతి కలదు. అతడు ఎల్లప్పుడు శ్రీకృష్ణుని నామములను గుణములను కీర్తించువాడు. క్షణకాలము తన నిస్సహాయతను గుర్తించి ఏడ్చును. వెంటనే సంతోషముతో నృత్యము చేయుచుండును. కృష్ణుని కథలుగాని, కృష్ణునికి సంబంధించిన పురాణ విషయములు వినుచు కూర్చొనెడివాడు. తన శరీరము నిండ ధూలినిండిపోగా ధూలితోనే శ్రీ కృష్ణప్రతిమను చేసినట్లు భావించుకొని ధూలితోనే అతనిని పూజించి, ధూలితోనే నైవేద్యము పెట్టెడివాడు. తల్లి భోజనము చేయుటకు రమ్మని పిలిచినప్పుడు శ్రీహరిని పూజిస్తున్నట్లు సమాధానమిచ్చేవాడు. శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను - కిం నామ బాలకస్యాస్య జన్మన్యత్ర బభూవ హ | వ్యుత్పత్యా సంజ్ఞయా వ్శాపి తద్భవాన్వక్తుమర్హతి || 6 సౌతి మహర్షీ! ఈజన్మలో ఆ బాలకుని పేరేమి? దాని అర్థమేమిటి? దానినంతయు చెప్పగలవు. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను - అనావృష్ట్యవశేషే చ కాలే బాలో బభూవ హ | నారం దదౌ జన్మకాలే తేనాయం నారదాభిదః || 7 దదాతి నారంజ్ఞానం చ బాలకేభ్యశ్చ బాలకః | జాతిస్మరో మహాజ్ఞానీ తేనాయం నారదాభిధ || 8 వీర్యేణ నారదసై#్యవ బభూవ బాలకో మునే | మునీంద్రస్య వరేణౖవ తేనాయం నారదాభిధః || 9 అనావృష్టి కాలమున ఈ బాలుడు జన్మించెను. అతని జన్మకాలమున నీరు ఇచ్చినందువలన (వర్షము పడుటచే) ఈ శిశువునకు నారదుడని పేరు వచ్చెను. అట్లే ఈ బాలుడు తోటిబాలురకు జ్ఞానము నిచ్చువాడు కావున నారదుడని పిలువబడెను. అట్లే కాశ్యపుడైన నారదమునీంద్రుని యొక్క వీర్యము వలన, అతని అనుగ్రహమువలన పుట్టినందువలన ఇతనిని నారదుడని పిలిచిరి. శౌనక ఉవాచ- శౌనక మహర్షి ఇట్టనెను - శిశునామ చ విజ్ఞాతం వ్యుత్పత్యా చ యథోచితం | మునీంద్రస్య కథం నామ నారదశ్చేతి మంగళం || 10 ఓ మహర్షీ! మీరు కళావతి పుత్రునిపేరు, ఆపేరుకు గల అర్థము తెలిపితిరి. అట్లే ఆబాలకుని జన్మకు కారణమైన మహర్షి పేరు నారదుడని ఎట్లు వచ్చినదో తెలుపుడు. సౌతిరువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను - అపుత్రకాయ విప్రాయ ధర్మపుత్రో నరో మునిః దదౌ పుత్రం కశ్యపాయ తేనాయం నారదాభిధః || 11 ధర్మ దేవత పుత్రుడైన నరుడను ముని పుత్రులు లేని కశ్యపుడను మునికి పుత్రునిచ్చినందువలన కాశ్యపుడైన ఆబాలునకు నారదుడను పేరు వచ్చినది. శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను - అధునా నామ వ్యుత్పత్తిః శ్రుతా సౌతే శిశోరపి | శూద్రయోనౌ బ్రహ్మపుత్రః కథం స నారదాభిధః || 12 ఓ మహర్షీ నారదుడను పేరు ఎట్లు వచ్చినదో తెలిపితివి కాని బ్రాహ్మణునకు శూద్రస్త్రీకి పుట్టిన ఆ శిశువునకు శ్రేష్ఠమైన 'నారద' అను పేరెట్లు వచ్చినది? సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లనెను- కల్పాంతరే బ్రహ్మ కంఠాద్బభూవుర్బహవో నరాః | నరాన్ దదౌ చ తత్కంఠం తేన తన్నారదం స్మృతం || 13 తతో బభూవ బాలశ్చ నారదాత్కంఠదేశతః | అతో బ్రహ్మ నామ చక్రే నారదశ్చేతి మంగళం || 14 సాంప్రతం శిశువృత్తాంతం సావధానం నిశామయ | ఉపాలంభరహస్యేన విశిష్టం కిం ప్రయోజనం || 15 వవృధే గోపికాబాలో విప్రగేహే దినే దినే | సపుత్రాం పాలితాం చక్రే బ్రాహ్మణః స్వసుతాం యథా || 16 ఏతస్మిన్నంతరే విప్రా ఆయయుర్విప్రమందిరం | శిశవః పంచవర్షీయా మహాతేజస్వినో యథా || 17 ప్రచ్ఛన్నం హృతవంతశ్చ గ్రీష్మమధ్యాహ్న భాస్కరం | మధుపర్కాదికం దత్వా తాన్ననామ గృహీ ద్విజ || 18 ఫలమూలాదికం కాలే చత్వారో ముని పుంగవాః | విప్రదత్తం బభుజి రేతచ్ఛేషం బుభుజే శిశుః || 19 చతుర్థకో మునిస్తసై#్మ కృష్ణమంత్రం దదౌ ముదా | తేషాం బభూవ దాసః స ద్విజస్య మాతురాజ్ఞయా || 20 ఏకదా శిశుమాతా చ గచ్ఛంతీ నిశి వర్త్మని | మమార సర్పదష్టా చ తత్‌క్షణం స్మరతీ హరిం || 21 సద్యో జగామ వైకుంఠం విష్ణుయానేన సా సతీ | విష్ణుపార్షదసంయుక్తా సద్రత్ననిర్మితేన చ || 22 ప్రాతర్బాలో ద్విజైస్సార్థం ప్రయ¸° విప్రమందిరాత్ | తత్వజ్ఞానం దదుస్తసై#్మ బ్రాహ్మణాశ్చ కృపాళవః || 23 బ్రహ్మపుత్రాః శిశుం త్యక్త్వా స్వస్థానం ప్రయయుః కిల | మహాజ్ఞానీ శిశుస్తస్థౌ గంగాతీరే మనోహరే || 24 తత్ర స్నాత్వా విప్రదత్తం విష్ణుమంత్రం జజాప సః | క్షుత్పిపాసారోగశోకహరం వేదేషు దుర్లభం || 25 మహారణ్య చ ఘోరే చ అశ్వత్థమూలసన్నిధౌ | కృత్వా యోగాసనం తస్థౌ సుచిరం తత్ర బాలకః || 26 బ్రహ్మదేవుని కంఠమునుండి చాలామంది నరులు ఉద్భవించిరి. బ్రహ్మదేవుని కంఠము నరులను ఇచ్చినందువలన దానిని నారదమనిరి. ఆ కంఠదేశమునుండి పుట్టిన బాలునికి బ్రహ్మదేవుడు నారదుడను పేరు పెట్టెను. ఇప్పుడు కళావతీపుత్రుని వృత్తాంతము వినుము. ఆ గోపికాబాలుడు బ్రాహ్మణునిఇంటిలో దిన దినము పెరుగుచుండగా ఒక దినమున గొప్ప బ్రహ్మతేజస్సు కలవారు, ఐదు సంవత్సరముల వయస్సుగల సనకసనందాది బ్రాహ్మణకుమారులు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చిరి. వారికి మధుపర్కాదికములనిచ్చి నమస్కరించి ఇంకను వారికి ఆ బ్రాహ్మణుడు ఫలమూలాదికముల నిచ్చి గౌరవించెను. ఆ మునులు భుజింపగా మిగిలినదాన్ని (భుక్తశేషాన్ని) బాలుడు భుజించెను. ఆ బ్రాహ్మణ కుమారులలో నాలుగవ వ్యక్తి సనత్కుమారుడు ఆ బాలునకు శ్రీకృష్ణమంత్రోపదేశము చేయగా ఆతడు తల్లి ఆజ్ఞపై తనకు మంత్రోపదేశము చేసిన సనత్కుమారునకు దాసుడయ్యెను. ఒకనాడు బాలకుని తల్లి రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు పాము కరచి మరణముపాలయ్యెను. ఆమె నారాయణుని తలచుచు ప్రాణములు వదలినందువలన మంచి రత్నములచే నిర్మించబడిన విష్ణువిమానములో విష్ణుమూర్తియొక్క అనుచరులతో కలసి వైకుంఠమునకు పోయెను. తల్లి చనిపోయిన తరువాత ఆ బాలుడు బ్రాహ్మణులతో కలిసివెళ్ళగా వారతనికి తత్వజ్ఞానమునుపదేశించిరి. మహాజ్ఞానియైన ఆ బాలుడు గంగలో స్నానముచేసి ఆ గంగా తీరమున అశ్వత్థవృక్షముక్రింద యోగాసనమును వేసికొని తనకు సనత్కుమారుడుపదేశించిన విష్ణుమంత్రమును జపించుచు చాలాకాలముండెను. శౌనక ఉవాచ- శౌనకుడిట్లనెను- కం మంత్రం బాలకః ప్రాప కుమారేణ చ ధీమతా | దత్తం పరం శ్రీహరేశ్చ తద్భవాన్ వక్తుమర్హతి || 27 బాలకుడు బ్రాహ్మణకుమారునిచే పొందిన శ్రీహరి మంత్రమేది? దానిని వివరముగా చెప్పుడు. సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను - కృష్ణేన దత్తో గోలోకే కృపయా బ్రహ్మణా పురా | ద్వావింశత్యక్షరో మంత్రో వేదేషు చ సుదుర్లభః || 28 తం చ బ్రహ్మా దదౌ భక్త్యా కుమారాయ చ ధీమతే | కుమారేణ స దత్తశ్చ మంత్రశ్చ శిశ##వే ద్విజ || 29 ఓం శ్రీం నమో భగవతే రాసమండలేశ్వరాయ | శ్రీకృష్ణాయ స్వాహేతి చ పూర్వోక్తం కవచం చ యత్ || 30 మహాపురుషస్తోత్రం చ పూర్వోక్తం కవచం చ యత్ | అస్యౌపయోగికం ధ్యానం సామవేదోక్తమేవచ || 31 ఇరువది రెండు అక్షరములుగల ఈ మంత్రమును శ్రీకృష్ణుడు గోలోకమున బ్రహ్మదేవునకు ఉపదేశించెను. బ్రహ్మదేవుడు దానిని తన కుమారునకు ఉపదేశించగా అతడు ఈ బాలునకు ఉపదేశించెను. ఓం శ్రీం నమో భగవతే రాసమండలేశ్వరాయ శ్రీకృష్ణాయ స్వాహా అనుమంత్రము కల్పవృక్షమువంటిది. ఇది మహాపురుష స్తోత్రము, మరియు పూర్వము చెప్పబడిన కవచము ఇవన్నియు కల్పవృక్షమువలె కోరికలు తీర్చునవి. వీటి ధ్యానము సామవేదములో చెప్పబడినది. తేజోమండలరూపే చ సూర్యకోటిసమప్రభే | యోగిభిర్వాంఛితం ధ్యానే యోగైః సిద్ధగణౖః సురైః || 32 ధ్యాయంతే వైష్ణవా రూపం తదభ్యంతరసన్నిధౌ | అతీవ కమనీయానిర్వచనీయం మనోహరం || 33 నవీనజలదశ్యామం శరత్పంకజలోచనం | శరత్పార్వణ చంద్రాస్యం పక్వబింబాధికాధరం || 34 ముక్తాపంక్తి వినిందైక దంతపంక్తిమనోహరం | సస్మితం మురళీన్యస్త హస్తావలంబనేవ చ || 35 కోటి కందర్పలావణ్యం లీలాధామమనోహరం | చంద్రలక్షప్రభాజుష్టం పుష్టశ్రీయుక్త విగ్రహం || 36 త్రిభంగసంగియుక్తం ద్విభుజం పీతవాససం | రత్నకేయూరవలయ రత్ననూపురభూషితం || 37 రత్నకుండలయుగ్మేన గండస్థలవిరాజితం | మయూరపుచ్ఛచూడం చ రత్నమాలావిభూషితం || 38 శోభితం జానుపర్యంతం మాలతీవనమాలయా | చందనోక్షిత సర్వాంగం భక్తానుగ్రహకారకం || 39 మణినా కౌస్తుభేంద్రేణ వక్షఃస్థలసముజ్వలం | వీక్షితం గొపికాభిశ్చ శశ్వద్వ్రీడితలోచనైః || 40 స్థిర¸°వన యుక్తాభిర్వేష్టితాభిశ్చ సంతతం | భూషణౖర్భూసితాభిశ్చ రాధావక్షఃస్థలస్థితం || 41 బ్రహ్మవిష్ణుశివాద్యైశ్చ పూజితం వందితం స్తుతం | కిశోరం రాధికాకాంతం శాంతరూపం పరాత్పరం || 42 నిర్లిప్తం సాక్షిరూపం చ నిర్గుణం ప్రకృతేః పరం | ధ్యాయేత్సర్వేశ్వరం తం చ పరమాత్మానమీశ్వరం || 43 యోగులు, సిద్ధులు, దేవతలు కోరుకున్న ఆ పరమాత్మ రూపమును వైష్ణవులు ధ్యానింతురు. ఆ పరమాత్మ రూపము మిక్కిలి అందమైనది. నూతన మేఘమువలె నల్లనిది. అతని కళ్ళు శరత్కాలమందలి తామరలవంటివి. ముఖము శరత్కాలమందలి పున్నమి చంద్రునివంటిది. పెదవులు పండిన దొండపండు కన్న అందమైనవి. దంతములవరుస ముత్యాలవరుస కన్న మిన్ననైనది. అతని హస్తమున మురళి ఉండును. అతని అందము కోటి మన్మథులతో సమానమైనది. త్రిభంగిమతో నున్నది. ఆతడు ద్విభుజుడు, పీతవస్త్రము కలవాడు, రత్నకేయూరములు, రత్నాభరణములు, రత్ననూపురములు కలవాడు. అట్లేరత్నకుండలములతో ప్రకాశించుచున్న చెక్కిళ్ళు గలివాడు. తలకొప్పులో నెమలి పింఛముగలవాడు. మోకాళ్ళవరకు వ్రేలాడుచున్న మాలతీ పువ్వుల మాల కలవాడు. సమస్తమైన అవయవములయందు చందనలేపము కలవాడు, వక్షఃస్థలమున కౌస్తుభ రత్నము ఉన్నవాడు. ఆతని చుట్టు భూషణాలంకృతలు, సిగ్గు కల కళ్ళున్నవారు, స్థిర¸°వనలగు గోపికాస్త్రీలుందురు. అతడు రాధాదేవి వక్షఃస్థలమున ఉండును. అతనిని త్రిమూర్తులు పూజింతురు. అతడు కిశోరవయస్కుడు. రాధికా మనోహరుడు. నిర్గుణుడు. ప్రకృతి కంటె మిన్నయైన ఆ పరమాత్మ ధ్యానించవలెను. ఇదం తే కథితం ధ్యానం స్తోత్రం చ కవచం మునే | మంత్రోపయోగికం సత్యం మంత్రశ్చ కల్పపాదపః || 44 సాంప్రతం బాలకస్తస్థౌ ధ్యానస్థస్తత్ర శౌనక దివ్యం వర్షసహస్రం చ నిరాహారః కృశోదరః || 45 శక్తిమాన్ పరిపుష్టశ్చ సిద్ధమంత్ర ప్రభావతః | దదర్శ బాలకో ధ్యానే దివ్యం లోకంచ బాలకం || 46 రత్నసింహాసనస్థం చ రత్న భూషణ భూషితం | కిశోరవయసం శ్యామం గోపవేషం చ సస్మితం || 47 గోపైర్గోపాంగనాభిశ్చ వేష్టితం పీతవాససం | ద్విభుజం మురళీహస్తం చందనేన విచర్చితం || 48 బ్రహ్మవిష్ణుశివాద్యైశ్చ స్తూయమానం పరాత్పరం | దృష్ట్వా చ సుచిరం శాంతం శాంతశ్చ గోపికాసుతః || 49 విరరామ చ శోకార్తో యదా తద్ద్రష్టుమక్షమః | రురోదాశ్వత్థమూలే చ న దృష్ట్వా బాలకం శిశుః || 50 ఓ శౌనకమునీ! నీకు ధ్యానము, స్తోత్రము కవచములను చెప్పితిని. ఈ శ్రీకృష్ణవింశత్యక్షరీ మంత్రము కల్పవృక్షమువలె కోరిన కోరికలను తీర్చును. ఓ మహర్షీ గోపికాసుతుడైన ఆబాలుడు ఆహారమును వదలిపెట్టి కృశించిన ఉదరము కలవాడై వేయి దివ్యసంవత్సరములు ధ్యానమున నుండెను. ఇన్ని సంవత్సరములు ఆహారములేపోయినను మంత్ర సిద్ధి జరిగినందువలన శక్తి, పుష్టి యథాత తథముగానుండెను. ఆ బాలకుడు ధ్యానము చేయుచున్న సమయమున దివ్యలోకమున రత్న సింహాసనముపై కూర్చున్న ఒక శిశువును చూచెను. అతడు రత్న భూషణములు కలవాడు, నల్లనివాడు, గొల్లవాని వేషమున నున్నవాడు, గోవులు, గోపికలు పరివేష్టించి యుండగా పచ్చని పట్టువస్త్రము కట్టుకొని, మురళిని పట్టుకొని, శరీరమున శ్రీచందనమును ధరించియుండెను. శాంతమూర్తి, పరాత్పరుడైన ఆ మురళీకృష్ణుని బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలైన దేవతలందరు స్తుతించుచుండిరి. ఆ రూపమును చూచి గోపికాసుతుడు శాంతిపొందుచున్న సమయమున ఆ బాలమురళీ కృష్ణుని రూపము అదృశ్యమాయెను. ఆ బాలకృష్ణుని తిరిగి చూడజాలక గోపికాసుతుడు శోకార్తుడై తాను చేయుచున్న ధ్యానమును వదలి ఆ రావిచెట్టు క్రింద ఏడ్చుచుండెను. బభూవాకాశవాణీతి రుదంతం బాలకం ప్రతి | సత్యం ప్రబోధయుక్తం చ హితమేవ మితాక్షరం || 51 సకృద్యద్దర్శితం రూపం తదేవ నాధునా పునః | అపి పక్వ కషాయాణాం దుర్దర్శంచ కుయోగినాం || 52 ఏతస్మిన్విగ్రహేzతీతే సంప్రాప్తే దివ్యనిగ్రహే | పునర్‌ర్దక్షపి గోవిందం జన్మమృత్యుహరం హరిం || 53 ఇతి శ్రుత్వా బాలకశ్చ విరరామ ముదాన్వితః | కాలే తత్యాజ తీర్థే చ తనుం కృష్ణం హృది స్మరన్ || 54 బాలకృష్ణుని పునర్దర్శనమునకై ఏడ్చుచున్న గోపికా సుతునితో ఆకాశవాణి అతనిని ప్రబోధించుచు హితమైనది, మితాక్షరమైనది. సత్యమైనది అగు ఈ మాటలు వినిపించినది. ఓబాలుడా! ఇంతకు ముందు నీవు చూచిన రూపము మరల నీకు కన్పించదు. పూర్తిగా యోగము సిద్ధించిని వారు ఎంత కష్టపడినను ఆ పరమాత్మయొక్క సంపూర్ణ దర్శనము చేయజాలరు. నీయొక్క ఈ శరీరము గతించి నీకు దివ్యశరీరము లభించినపుడు జన్మ మృత్యువులను హరించు గోవిందుని మరల చూడగలవు. ఆకాశవాణి యొక్క పై మాటలు విని బాలకుడు తృప్తిపడి ఏడ్పును మానెను. కాలము గడుచుచుండగా ఆ బాలుడు పుణ్యక్షేత్రమున హరిని స్మరించుకొనుచు తన శరీరమును వదిలిపెట్టెను. నేదుర్దుంభయః స్వర్గే పుష్పవృష్టిర్బభూవ హ | బభూవ శాపముక్తశ్చ నారదశ్చ మహామునిః || 55 తనుం త్యక్త్వా సజీవశ్చ విలీనో బ్రహ్మవిగ్రహే | బభూవ ప్రాక్తనాన్నిత్యః కాలభేదే తిరోహితః || 56 ఆవిర్భావస్తిరోభావః స్వేచ్ఛయా నిత్యదేహినాం | జన్మమృత్యు జరావ్యాధిర్బక్తానాం నాస్తి శౌనక || 57 ఆ బాలకుడు శ్రీహరి స్మరణ చేయుచు శరీరమును వదలగానే స్వర్గమున దుందుభులు మ్రెగినవి. పుష్పవృష్టి కురిసినది. ఆతని జీవుడు కాలక్రమమున ప్రోక్తన శరీరమును వదలి నిత్య శరీరమును పొంది పరబ్రహ్మ యొక్క శరీరమున అంతర్ధానమునందెను. నిత్య దేహులకు పుట్టుక లేక మరణము వారి స్వేచ్ఛననుసరించి జరుగును. ఆ భక్తులకు పుట్టుక, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనునవి ఉండవు. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ బ్రహ్మ ఖండే సౌతి శౌనక సంవాదే నారద శాప విమోచనం నామైకవింశోzధ్యాయః|| శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంవాదము గల బ్రహ్మ ఖండమున నారదశాప విమోచనమను ఇరువదియొకటవ అధ్యాయము సమాప్తము.