sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచవింశతితమో೭ధ్యాయః - కైలాసమునకు నారదుడు వెళ్ళుట సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లనెను - క్షణన విప్రవిప్రరో ముదాన్వితో జగామ శంభోస్సదనం మనోహరం | ఊర్ధ్వం ధ్రువాద్యోజనలక్షమీప్సితం మహార్హరత్నౌఘ వినిర్మతం మహత్ || 1 నిరాశ్రయే యోగబలేన శంభునాదృతం విచిత్రం వివిధాలయాన్వితం | దృష్టం సుపుణ్యశయసాధకైర్వరైః మునీంద్రవర్యైః పరిపూరితం శుభం || 2 మయూఖశూన్యం రవిచంద్రయోర్మునే హుతాశ##నైర్వేష్టితమేవ కేవలం | ప్రాకారరూపైరతిరిక్తవర్ధితైః ఉచ్చైరసంఖ్యాప్రమితైః శిఖోజ్జ్వలైః || 3 పురం వరం యోజనలక్ష విస్తృతం త్రికోటిరత్నేంద్ర గృహాన్వితం సదా | విరాజితం హీరకసారనిర్మితైః చిత్రైర్విచిత్రైర్వివిధైర్మనోహరైః || 4 మాణిక్యముక్తామణి దర్పణౖర్యుతం న స్వప్నదృష్టం ద్విజ విశ్వకర్మణః | ఆలక్పమేకైః శిసేవితైర్జనైః నిషేవితం సంతతమేవ శౌనక || 5 సిద్దైర్నియుక్తం శతకోటిలక్షకైః త్రికోటి లక్షైశ్చ యుతం స్వపార్షదైః | యుక్తం త్రిలక్షైర్వికటైశ్చ భైరవైః క్షేత్రైశ్చతుర్లక్ష శ##తైశ్చ వేష్టితం || 6 సురద్రుమైర్చేష్టితమేవ సంతతం మందారవృక్షప్రవరైః సుపుష్పితైః | విరాజితం సుందరకామధేనుభిః యథా బలాకాశతకైర్నభస్తలం || 7 దృష్ట్వా మునిర్విస్మయమాప మానసే కిం నాత్రచిత్రం సురయోగినాం గురౌ | లోకం త్రిలోకాచ్చ విలక్షణం పరం భీమృత్యు రోగార్తి జరాహరం వరం || 8 నారదుడు క్షణకాలములో శివలోకమును చేరుకొనెను. ఆ శివలోకము ధ్రువలోకము పైన లక్షయోజనముల దూరముననున్నది. ఆ లోకమునకు ఆధారమేమి లేకున్నను శంకరుడే దానిని తనయోగబలముచే పడిపోకుండ చేయుచున్నాడు. ఆ లోకమున చిత్ర విచిత్రములైన ఆలయములున్నవి. మునిశ్రేష్ఠులందరు అచ్చట నుందురు. ఆలోకము గొప్ప పుణ్యము చేసికొనిన సాధకులకు మాత్రమే కన్పించును. ఆ పట్టణమున సూర్యచంద్రులకాంతులు లేకున్నను అసంఖ్యాకమై చాలా ఎత్తు కలిగిన అగ్ని జ్వాలలతో నిత్యము ప్రకాశించుచుండును. అది లక్షయోజనముల వైశాల్యముగలది. విచిత్రములు, సుందరములు, మణులతో పరివేష్టితములైన వివిధ చిత్రములు గల మూడుకోట్ల రత్నగృహములు కలది. అది ఎల్లప్పుడు శివుని సేవించు జనములచే నిండిపోయినది. ఇంకను కోటికోట్ల సంఖ్యలో నున్న సిద్ధులచే మూడు లక్షల కోట్ల ఆత్మ పరివారముతో, మూడులక్షల భైరవులచే నాలుగు కోట్ల పుణ్యక్షేత్రములతో కూడికొనియున్నది. అచ్చట అనేకములైన కల్పవృక్షములు, మందారవృక్షములున్నవి. అచ్చటనున్నకామధేవులను చూచినచో తెల్లని కొంగలతో నిండిన ఆకాశము జ్ఞప్తికి వచ్చును. ముల్లోకములకన్నను విలక్షణమైనది, భయము, ఆర్తి, రోగములు ముసలితనము, మృత్యువు లేని ఆ లోకమును దర్శంచి నారదుడు చాలా విస్మయమందెను. వెంటనే అతడు దేవతలకు యోగులకు గురువైన మహేశ్వరుడున్న ఈ ప్రదేశమున పై చిత్రవిచిత్రములుండట సహజమే అని తలపోసెను. దూరే సభామండల మధ్యగం శివం దదర్శ శాంతం శివదం మనోహరం | పద్మత్రినేత్రం విధుపంచవక్త్రం గంగాధరం నిర్మల చంద్రశేఖరం || 9 ప్రతప్తహేమాభజటాధరం విభుం దిగంబరం శుభ్రమనంతమక్షరం | మందాకినీ పుష్కరబీజమాలయా కృష్ణేతి నామైవ ముదా జపంతం || 10 సునీల కంఠం భుజగేంద్రమండితం యోగీంద్ర సిద్ధేంద్ర మునీంద్ర వందితం | సిద్ధేశ్వరం సిద్ధ విధాన కారణం మృత్యుంజయం కాలయమాంతకారకం || 11 ప్రసన్నహాస్యాస్య మనోహరం వరం విశ్వశ్రయాణాం శివదం వరప్రదం | సదా೭శుతోషం భవరోగవర్జితం భక్త ప్రియం భక్తజనైన బంధుం || 12 నారదుడు సభా మధ్యలోనున్న శాంతి స్వరూపుడు, మంగళార్థ ప్రదాయి, మనోహరుడు, పద్మములవంటి మూడుకన్నులు గలవాడు, చంద్రుని వంటి ఐదు ముఖములు గలవాడు గంగాధరుడు, చంద్రుని శిరోలంకారముగా కలవాడగు శివుని దూరమునుండే చూచెను. ఆ శివుడు స్వచ్ఛమైన బంగారువంటి జడలు ధరించినవాడు. దిగంబరుడు, అంతములేనివాడు, నాశరహితుడు. నారదుడు చూచిన సమయమున శివుడు ఆకాశగంగలో పుట్టిన నల్లకలువల బీజములతో కూర్చిన మాలతో శ్రీకృష్ణనామజపు చేయుచుండెను. అతడు నీలకంఠుడు. అతని మెడచుట్టు సర్పముండెను. అతడు మృత్యుంజయుడు. కాలయములను అంతముచేయువాడు. చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడు, అల్పసంతోషి, భక్తులపై ప్రేమగలవాడు. స్వపరభేదములేక ప్రపంచమున నున్న ప్రాణలందరకు వరము లిచ్చువాడు. అతనిని ఎల్లప్పుడు ముని శ్రేష్ఠులు, యోగీంద్రులు, సిద్ధేంద్రులు సేవించుచుందురు. గత్వాసమీపంమునిరేష శూలినం ననామమూర్ధ్నాపులకాంక విగ్రహః | వీణాం త్రితంత్రీం క్వణయున్ పునర్జగౌ కృష్ణం స తుష్టాన కలం సుకంఠః || 13 దృష్ట్వా మునీంద్రప్రవరం చ సస్మితం విధేః సుతం వేదవిదాం వరిష్ఠం | యోగీంద్ర సిద్ధేంద్రమహర్షిభిః సమం హర్షేణ పీఠాదుదపశ్యదీశ్వరః || 14 దదౌ చ తసై#్మ మునయే ససంభ్రమాత్ ఆలింగనం చాశిషమాసనాదికం | ప్రపచ్ఛ భద్రాగమన ప్రయోజనం తపోధనం తం తపసాచ శౌనక || 15 సద్రత్న సింహాసన సుందరే పరః చోవాస శంభుర్వర పార్షదైస్సహ | నోవాస ధాతుస్తనయః కృతాంజలిః తుష్టావ భక్త్యా ప్రణతః ప్రభుం ద్విజ || 16 గంధర్వరాజేన కృతేన నారదః స్తోత్రేణ రమ్యేణ శుభప్రదేన చ | స్తుత్వా ప్రణామం పునరేవ కృత్వా భవాజ్ఞయేవాస భవస్య వామతః || 17 చకార తత్రైవ నివేదనం శివే మనో೭భిలాషం నిజకామపూరకే | శ్రుత్వామునేస్తద్వచనం కృపానిధిః ద్రుతం ప్రతిజ్ఞాయ చకార చోమితి || 18 నారదుడు శంకరుని సమీపమనుకు వెళ్ళి, నమస్కరించి మూడు తీగలు కల తన వీణను మ్రోగించుచు మంచికంఠముతో శ్రీకృష్ణుని స్తుతించెను. శంకరుడు బ్రహ్మ దేవుని పుత్రుడైన నారదుని చూచి చిరునవ్వుతో తన యొద్దనున్న యోగీంద్రులు, సిద్ధేంద్రులు, మహర్షులతో కలసి పీఠమునుండి లేచి నిలబడి నారదుని కౌగిలించుకొని, ఆశీర్వదించి ఆసనమొసగి అతని కుశలప్రశ్న చేసి, రాకకుగల కారణమడిగెను. శంకరుడు తన అనుచరులు యోగీంద్రులు, సిద్ధేంద్రులు మహర్షులతో సహ ఆసనమున కూర్చున్నప్పటికి నారదుడు కూర్చొనక చేతులు జోడించి భక్తితో అతనికి నమస్కరించి స్తుతి చేసెను. ఆతరువాత మరల శంకరునకు నమస్కరించి అతని అనుజ్ఞపై శివుని ఎడమ ప్రక్కనున్న ఆసనమున కూర్చొనెను. నారదుడు తన మనోభిలాషను శంకరునకు తెల్పగా దయాసముద్రుడగు శంకరుడు విని సరేయని అనెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే కైలాసం ప్రతి నారదాగమనం నామ పంచవింశతి తమో೭ధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంభాషణల బ్రహ్మా ఖండమున కైలాసమునకు నారదుడు చేరుట అను ఇరువది యైదవ అధ్యాయము సమాప్తము.