sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోనత్రింశత్తమో೭ధ్యాయః - నారదమహర్షి ప్రశ్నలు సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను - దదర్శాశ్రమమాశ్చర్యం దేవర్షిర్నారదస్తథా | ఋషేర్నారాయణసై#్యవ బదరీవన సంయుతం || 1 నానా వృక్షఫలాకీర్ణం పుంస్కోకిలరుత శ్రుతం | శరభేంద్రైః కేసరీంద్రైః వ్యాఘ్రోఘః పరివేష్టితం || 2 ఋషీంద్రస్య ప్రభావేణ హిసం భయ వివర్జితం | మహారణ్యమగమ్యం చ స్వర్గాదపి మనోహరం || 3 సిద్ధేంద్రాణాం మునీంద్రాణామాశ్రామాణాం త్రికోటిభిః | ఆవృతం చందనాంణ్యౖః పారిజాత వనాన్వితం || 4 దదర్శతమృషీంద్రంచ సభామధ్యే మనోహరం | రత్నం సింహాసనస్థంచ వసంతం యోగినాం గురుం || 5 జపంతం పరమం బ్రహ్మ కృష్ణమాత్మానమీశ్వరం | ప్రణనామ చ తం దృష్ట్వా బ్రహ్మ పుత్రశ్చ శౌనక || 6 దేవర్హియైన నారదుడు బదరీవనములతో నున్న నారాయణ మహర్షియొక్క ఆశ్రమమును చూచెను. ఆ బదరికాశ్రమము అనేకములైన వృక్షములతో ఫలముతో నున్నది. కోకిలల కుహూనాదము ఎల్లప్పుడు అచ్చట వినిపించుచుండును. శరభమృగములు, సింహములు, పులులు మొదలగు క్రూర జంతువులున్నను మహర్షియొక్క ప్రభావమువలన అచ్చట హింసకాని, భయముకాని లేకుండును. అచ్చటి మహారణ్యము చాలా గహనమైనదైనా స్వర్గము కంటే మనోహరముగా కనిపించును. అచ్చట మహాసిద్ధులయొక్క, మహర్షుల యొక్క ఆశ్రమములనేకమున్నవి. చందనారణ్యములు, పారిజాతవనములనేకమున్నవి. అచ్చటి సభా భవనము యొక్క మధ్యలోనున్న రత్నసింహాసమున యోగులకు గురువును, ఆత్మేశ్వరుడు పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని నామమును జపించుచున్న నారాయణ మహర్షిని చూచి నారదుడు అతనికి నమస్కరించెను. ఉత్థాయ సహసాలింగ్య యుయుజే పరమాశిషం | ప్రపచ్ఛ కుశలం స్నేహాచ్చకారాతిథి పూజనం || 7 రత్నాసింహాసనే రమ్యే వాసయామాస నారదం | నివసన్నాసనే రమ్యే వర్త్మ శ్రమ వివర్జితః || 8 ఉవాచ తమృషిశ్రేష్ఠః భగవంతం సనాతనం | అధీత్య వేదాన్ సర్వాంశ్చ పితుః స్థానే సుదుర్గమాన్ || 9 నారాయణమహర్షి లేచి నారదుని కౌగిలించుకొని, ఆశీర్వదించి కుశలమడిగి అతిథి పూజ చేసెను. తరువాత నారదుని రత్న సింహాసనమున కూర్చుండబెట్టెను. నారదుడు మార్గాయాసము తీరిన తరువాత నారాయణ మహర్షితో ఇట్లనెను. జ్ఞానం సంప్రాప్యం యోగీంద్రాత్ మంత్రం వై శంకరాద్విభో | మనో మే నహి తృప్నోతి దుర్నివారంచ చంచలం || 10 దృష్టం మయా త్వత్పాదాబ్జం మనసా ప్రేరితేన చ | కించిత్ జ్ఞాన విశేషం చ లబ్ధుమిచ్ఛామి సాంప్రతం || 11 యత్ర కృష్ణగుణాఖ్యానం జన్మమృత్యు జరాపహం || 12 బ్రహ్మ విష్ణు శివద్యాశ్చ సురేంద్రశ్చ సురా విభో | కం చింతయంతి మునయో మనవశ్చ విచక్షణాః || 13 కస్మాత్ సృష్టిశ్చ భవతి కుత్ర వా సంప్రలీయతే | కో వా సర్వేశ్వరో విష్ణుః సర్వ కారణ కారకః || 14 తస్యేశ్వరస్య కిం రూపం కర్మనా కిం జగత్పతే | విచార్య మనసా సర్కవం తద్భవాన్ వక్తు మర్హతి || 15 ఓ మహర్షి నేను యోగేంద్రుడైన శంకరుని జ్ఞానమును సంపాదించి కొన్నప్పటికీ నా మనస్సు తృప్తి పొందలేదు. అది చంచలమైనది. ఐనను నామనస్సు యొక్క ప్రేరేపణ వలన ఇక్కడకు వచ్చి మీపాదపద్మముల నాశ్రయించితిని. ప్రస్తుతము కొంత విశేషజ్ఞానము పొందవలెనని కోరికగలదు. జన్మను, ముసలితనమును, మృత్యవునపహరించు కృష్ణునియొక్క దివ్యగుణకీర్తన ఎచ్చట జరుగునో, బ్రహ్మ, విష్ణు, శివుడు మొదలగు దేవతలు మహర్షులు, మనువులు ఎవరిని ధ్యానింతురో, ఎవరి వలన ఈ సమస్త విశ్వము, సమస్త ప్రాణులు సృష్టించబడినవో, ఇవన్నియు ఎవరిలో విలీనమగుచున్నవో, ఎవరు సర్వేశ్వరుడో, సర్వవ్యాపకుడో, సర్వకారణకారణుడో, ఆ సర్వేశ్వరుని రూపమెట్లుండును. అతను చేయుపని ఎటువంటిది? ఈ విషయములను చక్కగా మీరు నాకు చెప్పగలరు. నారదస్య వచఃశ్రుత్వా ప్రహస్య భగవానృషిః | కథాం కథితుమారేభే పుణ్యాం భువనసావనీం || 16 నారదుని మాటలు విని పూజ్యుడైన నారాయణ ఋషి భగవంతునకు సంబంధించిన పుణ్యకథను చెప్పుటకు మొదలుపెట్టెను. ఇది శ్రీవైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనకసంవాదే నారాయణం ప్రతి నారద ప్రశ్నో నామ ఏకోనత్రింశత్తమో೭ధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున సౌతిశౌనకుల సంవాదము గల బ్రహ్మ ఖండమున నారాయణ మహర్షిని నారాదుడు ప్రశ్నించుట అను ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.