sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వితీయోzధ్యాయ : - దేవతల జన్మవివరణ నారద ఉవాచ -నారదమహర్షి ఇట్లనెను - సమాసేన శ్రుతం సర్వం దేవీనాం చరితం విభో | విబోధనార్థం బోధస్య వ్యాసతో వక్తుమర్హసి || 1 స్పష్టేరాద్యా సృష్టివిధౌ కథమావిర్భభూవ హ | కథం వా పంచధా భూతా వద వేదవిదాం వర || 2 భూతా యా యాశ్చ కళయా తయా త్రిగుణయా విభో | వ్యాసేన తాసాం చరితం శ్రోతు మిచ్ఛామి సాంప్రతం || 3 తాసాం జన్మానుకథనం ధ్యానం పూజావిధిం పరం | స్తోత్రం కవచమైశ్వర్యం శౌర్యం వర్ణయ మంగళం || 4 భగవన్ ! మీ వలన సమస్త దేవీమూర్తుల చరిత్రను తెలిసికొంటిని. ఐనా దానినిన విపులీకరించి నాకు తెల్పగలరు. సృష్టికి ఆద్య స్వరూపయైన ప్రకృతి ఏవిధముగా ఆవిర్భవించినదో, తిరిగి ఆమె ఐదు విధములుగా ఎట్లు మారినదో, సత్వ రజస్తమోగుణ రూపులైన ఆమె అంశస్వరూపలెవరో, వారి జన్మవృత్తాంతమును, ధ్యానపద్దతిని, పూజపద్దతిని, స్తోత్రమును కవచమును మొదలైన వాటినన్నిటిని సవిస్తరముగా నాకు తెల్పుడు. శ్రీనారాయణ ఉవాచ - శ్రీనారాయణడిట్లనెను. నిత్యాత్మా చ సభో నిత్యం కాలో నత్యో దిశో యథా | విశ్వేషాం గోకులం నిత్యం నిత్యో గోలోక ఏవచ || 5 కతదైకదేశో వైకుంఠో లంబభాగః స నిత్యకః | తథైవ ప్రకృతిర్నిత్యా బ్రహ్మలీనా సనాతనీ || 6 యథాగ్నౌ దాహికా చంద్రే పద్మే శోభా ప్రభ రవౌ | శశ్వద్యుక్తా న భిన్నా సా తథా ప్రకృతిరాత్మని || 7 వినా స్వర్ణం స్వర్ణకారః కుండలం కర్తుమక్షమః | వినామృదం కులాలోహి ఘటం కర్తుం న హీశ్వరః || 8 న హిక్షమస్తథా బ్రహ్మా సృష్టిం స్రష్టుం తయా వినా | సర్వ శక్తి స్వరూపా సా తయా స్యాచ్ఛక్తిమాన్ సదా || 9 నారదా! ఆత్మ నిత్యమైనది. ఆకాశము నిత్యము. కాలము నిత్యమైనది. దిక్కులు నిత్యమైనవి. గోకులము నిత్యమైనది. గోలోకము నిత్యమైనది. ఆగోలోకములో ఒక భాగమైన వైకుంఠము కూడ నిత్యమైనదే. అట్లే సనాతన స్వరూపిణియైన ప్రకృతి కూడ నిత్యమైనదే. అగ్నికి కాల్చు స్వభావము సహజము. చంద్రునకు, పద్మమునకు శోభ సహజమైనది. సూర్యునకు కాంతి సహజము. ఇవి విడదీయరానివి. అట్లే పరమాత్మతో ప్రకృతి ఎల్లప్పుడు కలిసి ఉండును. ప్రకృతి పరమాత్మలు భిన్న భిన్నమైనవారు కారు. కంసాలి బంగారము లేకుండా ఏవిధముగా కుండలముము చేయలేడో, కుమ్మరివాడు మట్టిలేకుండా కుండ లేవిధముగా చేయలేడో అట్లే పరబ్రహ్మ ప్రకృతి సహాయము లేకుండ సృష్టిని చేయలేడు. ఆ ప్రకృతి సర్వశక్తి స్వరూప. ఆమె వలననే పరమాత్మ సర్వశక్తి స్వరూపుడగుచున్నాడు. ఐశ్వర్యవచనః శక్ చ తిః పరాక్రమవాచకః | తత్స్వరూపా తయోర్దాత్రీ యా సా శక్తిః పరికీర్తితా || 10 సమృద్ధి బుద్ధి యశసాం వచనో భగః | తేన శక్తిర్భగవతీ భగరూపా చ సా తదా || 11 తయా యుక్తః సదాzత్మా చ భగవాంస్తేన కథ్యతే | స చ స్వేచ్ఛామయః కృష్ణః సాకారశ్చ నిరాకృతిః || 12 తేజోరూపం నిరాకారం ధ్యాయంతే యోగినః సదా | వదంతి తే పరం బ్రహ్మా పరమాత్మానమీశ్వరం || 13 అదృశ్యం సర్వ ద్రష్టారం సర్వజ్ఞం సర్వ కారణం | సర్వదం సర్వ రూపాంతం అరూపం సర్వపోషకం || 14 'శక్' అనునది ఐశ్వర్యమును తెల్పును. 'తి ' అనునది పరాక్రమమునకు సూచకము. ఐశ్వర్య, పరాక్రమ స్వరూపిణి, ఐశ్వర్య పరాక్రమముల నొసగునది కావున ప్రకృతిని శక్తి అని పిలుతురు. భగః అనునది సమృద్ధిని, బుద్ధిని, కీర్తిని తెలుపును. సమృద్ధి, బుద్ధి, యశోరూపమైన ఆ శక్తిని భగవతి అని అందురు. ఆ భగవతితో కలిసి ఉన్నందువలన పరమాత్మను భగవంతుడని పిల్తురు. వైష్ణవాస్తం న మన్యంతే తద్భక్తాః సూక్ష్మ దర్శినః | వదంతి కస్య తేజస్తే ఇతి తేజస్వినం వినా || 15 తేజోమండల మధ్యస్థం బ్రహ్మ తేజస్వినం పరం | స్వేచ్ఛామయం సర్వరూపం సర్వకారణ కారణం || 16 అతీవ సుందరం రూపం బిభ్రతం సుమనోహరం | కిశోరవయసం శాంతం సర్వ కాంతం పరాత్పరం || 17 నవీన నీరదా భాసం రాసైక శ్యామసుందరం | శర్మన్నధ్యాహ్య పద్మౌఘ శోభామోచక లోచనం || 18 ముక్తాసార మహాస్వచ్ఛ దంత పంక్తి మనోహరం | మయూరపుచ్ఛచూడం చ మాలతీ మాల్య మండితం || 19 సునాసం సస్మితం శశ్వద్భక్తానుగ్రహ కారకం | జ్వలదగ్ని విశుద్ధైక పీతాంశుక సుశోభితం || 20 ద్విభుజం మురళీహస్తం రత్నభూషణ భూషితం | సర్వాధారం చ సర్వేశం సర్వ శక్తియుతం విభుం || 21 సర్వైశ్వర్య ప్రదం సర్వం స్వతంత్రం సర్వమంగళః | పరిపూర్ణతమం సిద్ధం సిద్ధిదం సిద్ధి కారణం || 22 ధ్యాయంతే శశ్వదేవం రూపం సనాతనం | జన్మ మృత్యు జరావ్యాధి శోక భీతిహరం పరం || 23 శ్రీకృష్ణభక్తులకు వైష్ణవులు పరమాత్మనిరాకారుడను మాటను విశ్వసింపరు. వారి అభిప్రాయమున తేజస్వియైన సాకారరూపము లేక తేజస్సు అనునది ఉండదు. వైష్ణవులు తేజోమండలము యొక్క మధ్యనున్న పరబ్రహ్మ పరమ తేజస్విగా భావింతురు. ఆ పరబ్రహ్మ సంపూర్ణ స్వేచ్ఛామయుడు, సమస్త సృష్టి స్వరూపుడు. సమస్త సృష్టికారణములకు మూల పురుషుడని అందురు. మిక్కిలి సుందర రూపుడు, కిశోరవయసులో వున్నవాడు. శాంతుడు, పరాత్పరుడు, నూతన మేఘకాంతి కలవాడు, రాసక్రీడలోనున్న ఏకైక శ్యామసుందరుడు, పద్మముల వంటి కన్నులు, ముత్యాలవంటి దంతములు కలవాడు, శిరస్సున నెమలి ఈక కలవాడు. మాలతీ పుష్పముల మాలను ధరించినవాడు. అందమైన ముక్కుతో, చిరునవ్వుతో ఉన్నవాడు, ఎల్లప్పుడు భక్తులననుగ్రహించువాడు, అగ్నివలె పరిశుద్ధమైన పీతాంబరము కలవాడు, చేతిలో మురళి, మెడలో రత్నభూషణములు కలవాడు, సమస్తసృష్టికి ఆధారభూతుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తులు కలవాడు, సర్వైశ్వర్యము నిచ్చువాడు. సర్వస్వతంత్రుడు. సర్వమంగళ రూపుడు,సర్వ పరిపూర్ణుడు, సమస్త సిద్ధులకు భక్తులకిచ్చువాడు, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక భీతులను పోగొట్టువాడుగా వారు భావించి అతనిని ధ్యానింతురు. బ్రహ్మణోవయసా యస్య నిమేష ఉపచార్యతే | స చాత్మా పరమంబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే || 24 కృషిస్తద్భక్తి వచనః నశ్చ తద్దాస్య కారకః | భక్తి దాస్య ప్రదాతా యః స కృష్ణః ప్రకీర్తితః || 25 కృషిశ్చ సర్వవచనో నకారో బీజవాచకః | సర్వబీజ పరం బ్రహ్మ కృష్ణ ఇత్యబిధీయతే || 26 అసంఖ్య బ్రహ్మణాం పాతే కాలేzతీతేzపి నారద | యద్గుణానాం నాస్తి నాశస్తత్సమానో గుణన చ || 27 స కృష్ణః సర్వసృష్ట్వాదౌ సిసృక్షుస్త్వేక ఏవచ | సృష్ట్యున్ముఖస్తందశేన కాలేన ప్రేరితః ప్రభుః || 28 స్వేచ్ఛామయః స్వేచ్ఛయా చ ద్విధారూపో బభూవ హ | స్త్రీ రూపా వామ భాగాంశాద్దక్షిణాంశః పుమాన్ స్మృతః || 29 తాం దదర్శ మహాకామి కామాధారః సనాతనః | అతీవ కమనీయాంచ చారు చంపక సన్నిభాం || 30 పూర్ణేందు బింబసదృశ నితంబయుగళాం పరాం | సుచారు కదళీస్తంభ సదృశ శ్రోణి సుందరీం || 31 శ్రీయుక్త శ్రీఫలాకార స్తన యుగ్మ మనోహరం | పుష్ట్యా యుక్తాం సులలితాం మధ్యక్షీణాం మనోహరాం || 32 అతీవ సుందరీం శాంతాం సస్మితాం వక్రలోచనాం | వహ్నిశుద్ధాంశుకాధానం రత్నభూషణ భూషితాం || 33 శశ్వచ్చక్షుశ్చరాభ్యాం పిబంతీం సతతం ముదా | కృష్ణస్య సుందరముఖం చంద్రకోటివినిందకం || 34 కస్తూరీ బిందుభిః సార్ధం అధశ్చందన బిందువా | సమం సిందూర బిందుం చ ఫాలమధ్యే చ బిభ్రతం || 35 సువక్ర కబరీభారం మాలతీ మాల్య భూషితం | రత్నేంద్ర సారహారం చ దధతీం కాంతకాముకీం || 36 కోటి చందరప్రభాజుష్ట పుష్ట శోభా సమన్వితాం | గమనే రాజహంసీం తాం దృష్ట్వా ఖంజన గంజనీం || 37 అతిమాత్రం తయాసార్ధం రాసేశో రాసముండలే | రాసోల్లాసేషు రహసి రాసక్రీడాం చకార హ || 38 నానాప్రకారశృంగారం శృంగారో మూర్తిమానివ | చకా రసుఖ సంభోగం యావద్వై బ్రహ్మణోవయః || 39 బ్రహ్మదేవుని వయస్సంతయు ఎవరికి నిమిషమువలె ఉండునో ఆపరబ్రహ్మను శ్రీకృష్ణదేవుడని అందురు. కృషియనగా ఆ పరమాత్మయందలి భక్తి. 'న' అనగా ఆ పరమాత్మ దాస్యమును కలిగించుట. అందువలన కృష్ణుడనగా ఆ పరమాత్మయందు భక్తిని దాస్యబుద్ధిని కలిగించువాడు. ఇంకను కృషి యనునది సమస్తమును తెల్పును. న అనునది బీజవాచకము. సమస్త సృష్టి కారణమైన పరబ్రహ్మమును కృష్ణుడని అందురు. అంతులేని బ్రహ్మదేవతలందరు మరణించినను, కాలమంతయు గడచిపోయినను శ్రీకృష్ణపరమాత్మ గుణములకు నాశము లేదు. అట్లే ఆతని గుణములతో సమానమైవాడెవడు ఈ సృష్టిలో కనరాడు. ఆ కృష్ణపరమాత్మ సమస్త సృష్టి జరుగకముందు తానొక్కడే ఉన్నను సృష్టిని చేయదలచి అతని అంశమువలన, కాలము వలన ప్రేరేపింపబడి తనయొక్క ఇచ్ఛననుసరించి రెండు విధములుగా మారెను. ఆ పరమాత్మ ఎడమ భాగము స్త్రీ రూపము కాగా కుడిభాగము పురుషుడయ్యెను. పురుషరూపమున నున్న పరమాత్మ మహాకాముకుడై మిక్కిలి అందమైనది చంపక పుష్పము వలె కోమలమైనది. నిండు చంద్రునివలె గుండ్రనైన పిరుదులు కలది. అరటి కాడలవంటి తొడలు కలది, బిల్వ ఫలములవలె గుండ్రని స్తనములు కలది. సన్నని నడుముగలది, మిక్కిలి అందమైనది. శాంత సుస్మిత, పరిశుభ్రమైన వస్త్రములు రత్నభూషణములు ధరించినది. కస్తూరిబిందువుల మధ్య పెద్దని సిందూరపుచుక్కను, క్రింద చందనపు చుక్కను నొసట ధరించినది. మాలతీ పుష్పముల మాలగల వంకరకొప్పును, మెడలో రత్నములు, ఇంద్రనీలమణులు కల మాలను ధరించినది, రాజహంసవంటి గమనము కలది, కాటుకవంటి ఆస్త్రీని చూచి రహస్య ప్రదేశమున నూరు బ్రహ్మ సంవత్సరములు అనేక విధములైన శృంగార చేష్టలతో సంభోగమొనరించెను. తతః సచ పరిశ్రాంతః తస్యా యోనౌ జగత్పితా | చకార వీర్యాధానం చ నిత్యానందః శుభక్షణ || 40 గాత్రతో యోషితస్తస్యాః సురతాంతే చ సువ్రత | నిఃససరా శ్రమజలం శ్రాంతాయాస్తేజసా హరేః || 41 మహాసురతఖిన్నా యా నిశ్వాసశ్చ బభూవహ | తదాధారశ్రమజలం తత్సర్వం విశ్వగోలకం || 42 సచనిశ్వాస వాయుశ్చ సర్వధారో బభూవహ | నిశ్వాసవాయుః సర్వేషాం జీవినాం చ భ##వేషు చ || 43 బభూవ మూర్తిమద్వాయోః వామాంగాత్ప్రాణవల్లభా | తత్పత్నీ సా చ తత్పుత్రాః ప్రాణాః పంచ చ జీవినాం || 44 ప్రాణోzపానః సమానశ్చైవోదానో వ్యాన ఏవచ | బభూవురేవ తత్ఫుత్రా అధః ప్రాణాశ్చ పంచ చ || 45 ఘర్మతోయాధిదేవశ్చ బభూవ వరుణో మహాన్ | తద్వాంమాంగాచ్చ తత్పత్నీ వరుణానీ బభూవ హ || 46 ఆ పురుషుడు దానివలన పరిశ్రమనొంది శుభసమయమున ఆ స్త్రీయొక్క యోనిలో తన వీర్యమునుంచెను. సురత కాలాంతమున పరిశ్రమచెందిన ఆ స్త్రీ శరీరమునుండి చెమట బిందువులేర్పడినవి. అట్లే మహాసురతమువలన ఖేదము చెందిన ఆ స్త్రీ దీర్ఘ నిశ్వాసమును వదలెను. ఆ స్త్రీ యొక్క చెమట బిందువులనుండి సమస్త విశ్వగోళకములు, ఏర్పడినవి. ఆమె యొక్క నిశ్వాసవాయువు ఈ ప్రపంచములందున్న సమస్త ప్రాణికోట్లకు ఆధారమైన నిశ్వాసవాయువుగా పరిణమించినది. ఆకారముకల ఆ వాయువుయొక్క ఎడమ భాగమునుండి అతని భార్యయు ప్రాణ, అపాన, వ్యాస ఉదాన, సమానములను అతని పుత్రులు ఐదు ప్రాణములుగా ఏర్పడిరి. ఆమె చెమటనీటి నుండి నీటిని అధిదేవతయైన వరుణుడుద్భవించెను. అతని వామాంగమునుండి ''వరుణాని'' అనెడు అతని భార్య ఆవిర్భవించెను. అథ సా కృష్ణశక్తిశ్చ కృష్ణాద్గర్భం దధారహ | శతమన్వంతరం యావత్ జ్వలంతీ బ్రహ్మ తేజసా || 47 కృష్ణప్రాణాధిదేవీ సా కృష్ణప్రాణాధిక ప్రియా | కృష్ణస్య సంగినీ శశ్వత్ కృష్ణ వక్షస్థల స్థితా || 48 శతమన్వంతరాతీతే కాలే పరమ సుందరీ | సుషావాండం సువర్ణాభం విశ్వాధారాలయం పరం || 49 దృష్ట్యా చాండం హి సాదేవి హృదయేన విదూయతా | ఉత్ససర్జ చ కోపేన తదండం గోళ##కే జలే || 50 దృష్ట్వా కృష్ణశ్చ తత్త్యాగం హాహాకారం చకార హ | శశాప దేవీం దేవేశః తక్షణం చ యథోచితం || 51 యతోzపత్యం త్వయాత్వక్తం కోపశీలే సునిష్ఠురే | భవ త్వమనపిత్యాzపి చాద్య ప్రభృతి నిశ్చితం || 52 యాస్త్వదంశరూపాశ్చ భవిష్యంతి సురస్త్రియః | అనపత్యాశ్చ తాః సర్వాః త్వత్సమా నిత్య¸°వనాః ||53 శ్రీకృష్ణ శక్తి స్వరూపిణియగు ఆస్త్రీ శ్రీకృష్ణుని వలన గర్భమును శతమన్వంతరకాలము ధరించెను. ఆమె శ్రీకృష్ణుని ప్రాణములకు అధిదేవత. అతని ప్రాణములకంటె ఎక్కువ ప్రియమైనది. శ్రీకృష్ణుని వక్షస్థలముపై నున్న ఆమె ఎల్లప్పుడు అతనిని వదలక ఉండునది. శతమన్వంతరముల తరువాత ఆమె బంగారు కాంతిగలదియు విశ్వధారణయోగ్యమైన అండమును ప్రసవించినది. అవయవములు లేని ఆ అండమును చూచి బాధాతప్తమైన హృదయముతో కోపముతో దానినామె బ్రహ్మాండ గోళకమందలి జలములో పారవేసినది. శ్రీకృష్ణుడా దృశ్యమునుచూచి హాహాకారము చేయుచు. కోపస్వభావముగలదానా ! నీవు నీ బిడ్డను చేజేతులారా దూరము చేసికొన్నందువలన నీవు కాని, నీ అంశస్వరూపాలైన దేవతా స్త్రీలుగాని నీవలె నిత్య¸°వనలైనా సంతానమునకు నోచుకోరు.'' అని శపించెను. ఏతస్మిన్నంతరేదేవీ జిహ్మాగ్రాత్సహసా తతః | ఆవిర్బభూవ కన్యైకా శుక్ల వర్ణా మనోహరా || 54 పీతవస్త్రపరీధానా వీణా పుస్తక ధారిణీ | రత్న భూషణ భూషాఢ్యా సర్వశాస్త్రాధిదేవతా || 55 అథ కాలాంతరే సాచ ద్విధారూపా బభూవ హ | వామార్ధాంగా చ కమలా దక్షిణార్ధా చ రాధికా || 56 ఏతస్మిన్నంతరే కృష్ణో ద్విధారూపో బభూవ హ | దక్షిణార్ధః స్యాత్ ద్విభుజః వార్ధశ్చ చతుర్భుజః || 57 ఉవాచ వాణీం శ్రీకృష్ణః త్వమస్య భవ కామినీ | అత్రైవ మానినీ రాధా నైవ భద్రం భవిష్యతి || 58 ఏవం లక్ష్మీం సప్రదదౌ తుష్టో నారాయణాయ వై | సంజగామ చ వైకుంఠం తాభ్యాం సార్ధం జగత్పతిః || 59 అనపత్యే చ తే ద్వేచ యతో రాధాంశ సంభ##వే | నారాయణాంగాదభవన్ పార్షదాశ్చ చతుర్భుజాః || 60 తేజసా వయసా రూపగుణాభ్యాం చ సమాః హరేః | బభూవుః కమలాంగాచ్చ దాసీకోట్యశ్చ తత్సమాః || 61 దేవియొక్క జిహ్వాగ్రమునుండి తెల్లని రంగుతో అందమైనది, పీతాంబరమును, రత్నభూషణములను ధరించినది, చేతులలో వీణ, పుస్తకములను ధరించినది, సమస్త శాస్త్రములకు అధిదేవతయైన సరస్వతీ దేవి వెంటనే ఉదయించినది. కొంతకాలమున కామె వామార్ధాంగమునుండి లక్ష్మిగా, దక్షిణార్ధాంగమునుండి రాధగా రెండు రూపములనందనది. అట్లే శ్రీకృష్ణుడు కూడా దక్షిణార్ధాంగము నుండి ద్విభుజుడైన కృష్ణుడుగా వామార్ధాంగమునుండి చతుర్భుజుడైన నారాయణుడుగా రెండు రూపములు పొందెను. శ్రీకృష్ణుడు సరస్వతిని నారాయణునకు ప్రియురాలుగా చేసెను. పూజ్యురాలైన రాధాదేవి ఇచ్చటనే ఉండునని చెప్పి లక్ష్మీదేవిని కూడా నారాయుణన కివ్వగా అతడు వారితో కలిసి వైకుంఠమునకు పోయెను. రాధాంశమున జన్మించిన లక్ష్మీ సరస్వతులకు కూడ సంతానము కలుగలేదు. కాని లక్ష్మీ దేవి అవయములనుండి ఆమెతో సమానమైన దాసీ జనమెంతయో పుట్టినది. అట్లే నారాయణుని అవయముల నుండి వయస్సున, రూపమున, గుణములతో అతనికి సమానులైన చతుర్భుజులైన అనుచరులెందరో ఉద్భవించిరి. అథగోలోక నాథస్య లోమ్నాం వివరతో మునే | ఆసన్న సంఖ్యగోపాశ్చ వయసా తేజసా సమాః || 62 రూపేణ సుగుణనైవ వేషాద్వా విక్రమేణ చ | ప్రాణతుల్యాః ప్రియాః సర్వే బభూవుః పార్షదా విభో || 63 రాధాంగ లోమ కుపేభ్యో బబూవుర్గోపకన్యకాః | రాధా తుల్యాశ్చ సర్వాస్తాః నాzన్య తుల్యాః ప్రియంవాదాః || 64 రత్నభూషణ భూషాఢ్వాః శశ్వత్సుస్థిర ¸°వనాః | అనపత్యాశ్చ తాః సర్వాః పుంసః శాపేన సంతతం || 65 గోలోకనాథుడైన శ్రీకృష్ణుని రోమ కూపములనుండి వయస్సులో, తేజస్సులో, రూపమున, గుణములలో పరాక్రమమున శ్రీకృష్ణునితో సమానులైన అసంఖ్యాకులైన గోపాలబాలురు ఉదయించిరి. వీరందరు ఆ కృష్ణపరమాత్మకు ప్రాణములతో సమానమైన అనుచరవర్గము. అట్లే రాధాదేవి యొక్క రోమకూపములనుండి రాధాదేవితో సమానమైనవారు, రత్నభూషణములుకలవారు, స్థిరమైన ¸°వనము కల అనేక గోపికా కన్యలావిర్భవించిరి. కానీ వారందరు రాధాంశసంభూతలు. కావున పరమ పురుషుని యొక్క శాపము వలన సంతాన రహితలైరి. ఏతస్మిన్నంతరే విప్ర సహసా కృష్ణదేహతః | ఆవిర్బభూవ సాదుర్గా విష్ణుమాయా సనాతనీ || 66 దేవీ నారాయణీశానా సర్వశక్తి స్వరూపిణీ | బుధ్యధిష్టాతృదేవీ సా కృష్ణస్య పరమాత్మనః || 67 దేవీనాం బీజరూపా చ మూల ప్రకృతిరీశ్వరీ | పరిపూర్ణతమా తేజః స్వరూపా త్రిగుణాత్మికా || 68 తప్తకాంఛన వర్ణాభా సూర్యకోటి సమప్రభా | ఈషద్ధాస ప్రసన్నాస్యా సహస్ర భుజ సంయుతా || 69 నానా శస్త్రాస్త్రనికరం బిభ్రతీ సా త్రిలోచనా | వహ్నీ శుద్ధాంశుకాధానా రత్నభూషణ భూషితా || 70 యస్యాశ్చాంశాంశకలయా బభూవుః సర్వయోషితః | సర్వ విశ్వస్థితా లోకా మోహితా మాయయా యయా || 71 సర్వేశ్వర్య ప్రదాత్రీ చ కామినాం గృహమేధినాం | కృష్ణభక్తి ప్రదాత్రీ చ వైష్ణవానాం చ వైష్ణవీ || 72 మముక్షూణాం మోక్షదాత్రీ సుఖినాం సుఖదాయినీ | స్వర్గేషు స్వర్గలక్ష్మీః సా గృహలక్ష్మీః గృహేష్వసౌ || 73 తపస్విషు తపస్యా చ శ్రీరూపా సా నృపేషు చ | యా చాగ్నౌ దాహికా రూపా ప్రభారూపాచ భాస్కరే || 74 శోభాస్వరూపా చంద్రే చ పద్మేషు చ సుశోభనా | సర్వశక్తి స్వరూపా యా శ్రీకృష్ణే పరమాత్మని || 75 యయా చ శక్తిమానాత్మా యయా వై శక్తిమజ్జగత్ | యయా వినా జగత్సర్వం జీవన్మృతమివస్థితం || 76 యా చ సంసార వృక్షస్య బీజరూపా సనాతనీ | స్థితిరూపా బుద్ధిరూపా ఫలరూపాచ నారద || 77 క్షుత్పిపాసా దయాశ్రద్ధా నిద్రాతంద్రాక్షమా ధృతిః | శాంతిర్లజ్జాతుష్టి పుష్టి భ్రాంతి కాంత్యాది రూపిణీ || 78 సా చ సంస్తూయ సర్వేశం తత్పురః సముపస్థితా | రత్నసింహాసనం తసై#్య ప్రదదౌ రాధకేశ్వరః || 79 ఆ సమయమున శ్రీకృష్ణుని దేహమునుండి విష్ణుమాయయైన దుర్గవెంటనే ఆవిర్భవించినది. ఆ దుర్గాదేవి నారాయణుని మాయా స్వరూపిణి. శంకరుని యొక్క పత్ని. సమస్త శక్తి స్వరూపిణి. శ్రీకృష్ణ పరమాత్మయొక్క బుద్ధికి అధిష్ఠాన దేవత. దేవతాస్త్రీలందరకు కారణరూపిణి. ఆమెయే మూలప్రకృతి.సర్వ పరిపూర్ణమైనది. తేజః స్వరూప. సత్వరజాదిత్రిగుణాత్మిక. బంగారు వంటి కాంతి కలది. సూర్యుని వంటి తేజస్సు కలది. వేయి చేతలలో అనేక విధములైన శస్త్రాస్త్రములను ధరించినది. మూడు కన్నులు కలది. పరిశుద్ధమైన వస్త్రములను రత్నాభరణములను ధరించినది. ఆ దుర్గాదేవియొక్క అంశమువలన అంశాంశముల వలన సమస్త స్త్రీలు ఉద్భవించిరి. సమస్త లోకములు ఈమె యొక్క మాయవలన మోహింపబడినవి. ఈమె భక్తులమొక్క అన్ని కోర్కెలను తీర్చును. వైష్ణవి యగు నీ దుర్గ వైష్ణవులకు విష్ణుభక్తిని కలుగజేయును. మోక్షము కోరువారికి మోక్షమునిచ్చును. సుఖము కోరువారికి సుఖములనిచ్చును. ఈమె స్వర్గమున స్వర్గలక్ష్మిగా, గృహములందు గృహలక్ష్మిగా, తపస్సు చేసికొనువారికి తపస్సుగా,రాజులకు లక్ష్మీరూపమున కనిపించును. ఈ దుర్గాదేవి అగ్నియందు దాహకశక్తిగా, సూర్యునియందు కాంతిగా, చంద్రునిలో పద్మములలో శోభారూపిణిగా, శ్రీకృష్ణ పరమాత్మయందు సర్వశక్తిమంతమగుచున్నది. పరమాత్మ సహితము ఈ దుర్గాదేవివలన శక్తివంతుడగుచున్నాడు. ఈమె లేనిచో జగత్తతంతయు జీవన్మృతముగా కన్పించును. సనాతని యగు ఈ దుర్గ సంసారమనే వృక్షమునకు మూలకారణమైనది. స్థితికి కారణమైనది. బుద్ధి, ఫలస్వరూపిణిగా నున్నది. ఆకలి దప్పులు, దయ, శ్రద్ధ, నిద్ర, తంద్ర, క్షమ, ధృతి, శాంతి, లజ్జ, తుష్టి, పుష్టి భ్రాంతి, కాంతి మొదలగునవన్నియు ఈమె స్వరూపములే. ఆ దుర్గాదేవి శ్రీకృష్ణపరమాత్మను స్తుతింపగా నతడు ఆమె కూర్చుంచుటకై రత్న సింహాసనము నొసగెను. ఏతస్మిన్నంతరే తత్ర సస్త్రీకశ్చ చతుర్ముఖః | పద్మనాభో నాభిపద్మాన్నిస్ససార పుమాన్మునే || 80 కమండలుధరః శ్రీమాన్ తపస్వీ జ్ఞానానాం వరః | చతుర్ముఖస్తం తుష్టావ ప్రజ్వలన్ బ్రహ్మతేజసా || 81 సుదతీ సుందరీ శ్రేష్ఠా శతచంద్రసమప్రభా | వహ్నిశుద్ధాంశుకాధానా రత్న భూషణ భూషితా || 82 రత్న సింహాసనే రమ్యే స్తుతా వై సర్వకారణం | ఉవాస స్వామినా సార్థం కృష్ణస్య పురతో ముదా || 83 ఆ సమయమున విష్ణుమూర్తియొక్క నాభికమలమునుండి కమండలువు ధరించినవాడు, తపస్వి, జ్ఞానులలో శ్రేష్ఠుడు, చతుర్ముఖుడగు బ్రహ్మదేవుడు భార్యాసహితముగా బ్రహ్మతేజస్సుచే ప్రకాశించుచు బయలువెడలెను. శతచంద్రులతో సమానమైన కాంతిగలది, సుందరి, పరిశుద్ధమైన వస్త్రములను, రత్నభూషణములను ధరించిన అతని స్త్రీ సమస్త సృష్టికి కారణుడైన శ్రీకృష్న పరమాత్మను స్తుతించి అతని ముందు తన స్వామితో కలసి రత్న సింహాసనముపై కూర్చుండెను. ఏతస్మిన్నంతరే కృష్ణో ద్విధారూపో బభూవ హ | వామార్ధాంగో మహాదేవో దోక్షిణో గోపికాపతిః || 84 శుద్ధస్ఫటికసంకాశః శతకోటిరవిప్రభః | త్రిశూలపట్టిశధరో వ్యాఘ్రచర్మధరో హరః || 85 తప్తకాంచనవర్ణాభజటాభారధరః పరః | భస్మబూషణగాత్రశ్చ సస్మితశ్చంద్రశేఖరః || 85 దిగంబరో నీలకంఠః సర్పభూషణభూషితః | బిభ్రద్దక్షిణహస్తేన రత్నమాలాం సుసంస్కృతాం || 87 ప్రజపన్ పంచవక్త్రేణ బ్రహ్మజ్యోతిః సనాతనం | సత్యస్వరూపం శ్రీకృష్ణం పరమాత్మానమీశ్వరం || 88 కారణం కారణానాం చ సర్వమంగళ మంగళం | జన్మమృత్యు జరావ్యాధి శోక భీతి హరం పరం || 89 సంస్తూయ మృత్యోర్మృత్యుం తం జాతో మృత్యుంజయాభిధః | రత్న సింహాసనే రమ్యే సమువాస హరేః పురః || 90 ఆ సమయమున కృష్ణుడు తన కుడిపార్శ్వమున శ్రీకృష్ణుడుగా, ఎడమపార్శ్వమున మహాదేవుడుగా మారెను. ఆ మహాదేవుడు పరిశుద్ధమైన స్ఫటికమువంటి వన్నె కలవాడు, శతకోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు. త్రిశూలము, పట్టిశమను ఆయుధములను, వ్యాఘ్రచర్మమును, బంగారువన్నెగల జడలను ధరించినవాడు. శరీరమున భస్మమే భూషణముగా కలవాడు. చంద్రుని ఆభరణముగా ధరించినవాడు, దిగంబరుడు, నీలకంఠుడు, సర్పములే ఆభరణములుగా కలవాడు. అతడు తన కుడి చేతిలో రత్నమాలను ధరించి, తన ఐదు ముఖములతో సత్య స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్మను జపించుచుండెను. కారణకారణుడు. సర్వమంగళ##మైనవాడు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక భీతులతను తొలగించువాడు, మృత్యువునకే మృత్యువగు ఆ శ్రీకృష్ణుని జపించి మహాదేవుడు మృత్యుంజయుడయ్యెను. ఆ మహాదేవుడు శ్రీకృష్ణుని స్తుతించి అతని ముందు రత్నసింహాసమున కూర్చుండెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారాయణ నారద సంవాదే దేవదేవ్యుత్పత్తిర్నామ ద్వితీయోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదియగు ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాద సమయమున తెలుపబడిన దేవ, దేవ్యుత్పత్తి యనెడు ద్వితీయాధ్యాయము సమాప్తము.||