sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
తృతీయో೭ధ్యాయః - విశ్వ బ్రహాండముల వర్ణన శ్రీనారాయణ ఉవాచ - శ్రీనారాయణుడిట్లనెను - అథాండం తజ్జలేzతిష్ఠత్ యావద్వై బ్రహ్మణోవయః | తతఃస్వకాలే సహసా ద్విధారూపో బభూవ సః || 1 త్మన్మధ్యే శిశురేకశ్చ శతకోటి రవిప్రభః | క్షణం రోరూయమాణశ్చ స శిశుః పీడితః క్షుధా || 2 పితృ మాతృ పరిత్యక్తో జలమధ్యే నిరాశ్రయః | నైకబ్రహ్మాండనాథోయే దదర్శోzర్ధ్వమనాథవత్ || 3 స్థూలాత్ స్థూల తమః సోzపి నామ్నా దేవో మహావిరాట్ | పరమాణుర్యథా సూక్ష్మాత్పరః స్థూలాత్తథాప్యసౌ ||4 తేజసాం షోడశాంశోzయం కృష్ణస్య పరమాత్మనః | ఆధారోzసంఖ్యవిశ్వానాం మహావిష్ణుస్సరేశ్వరః || 5 ప్రత్యేకం రోమ కూపేషు విశ్వాని నిఖిలాని చ | అద్యాzపి తేషాం సంఖ్యాంచ కృష్ణో వక్తుం నహి క్షమః || 6 యథాస్తి సంఖ్యా రజసాం విశ్వానాం న కదాచన | బ్రహ్మ విష్ణు శివాదీనం తథా సంఖ్యా న విద్యతే || 7 ప్రతి విశ్వేషు సంత్యేవం బ్రహ్మవిష్ణుశివాదయః | పాతళాత్ బ్రహ్మలోకాంతం బ్రహ్మాండం పరికీర్తితం || 8 స్త్రీ రూపిణియైన శ్రీకృష్ణశక్తిచే నీటిలో వదలిపెట్టబడిన అండము ఆ జలములో బ్రహ్మయొక్క నూరు సంవత్సరాల వరకుండెను. ఆ తరువాత అది రెండు రూపముల పొందినది. అందోకటి అండాకారముననే ఉండగా రెండవది శిశురూపము చెందినది. శతకోటి సూర్యకాంతులతో ప్రకాశించు ఆ శిశువు ఆకలితో బాధ చెంది ఏడ్చుచుండెను. తల్లి తండ్రులచే వదలిపెట్టబడిన ఆ శిశువు నీటిలోపల ఆశ్రయము లేక అనాథవలె పైకి చూచెను. అనేక బ్రహ్మాండనాయకుడు, స్థూలమైన వాటికంటే మిక్కిలి స్థూలమైనవాడు అగు ఆ శిశువును మహావిరాట్ అని పిలుతురు. ఆతడు శ్రీకృష్ణపరమాత్మ తేజస్సులో పదునారవ భాగము. అసంఖ్యాకమైన విశ్వములకతడు ఆధారభూతుడు. అతనిని మహావిష్ణువని కూడ అందురు. ఆతని రోమకూపములయందు సమస్త విశ్వములున్నవి. అసంఖ్యాకమైన ఆ విశ్వముల సంఖ్యను శ్రీకృష్ణుడు కూడ చెప్పలేడు. రేణువుల సంఖ్యనైనా చెప్పవచ్చును గాని విశ్వముల సంఖ్యను మాత్రము చెప్పలేము. అట్లే ఆయా విశ్వములందున్న బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల సంఖ్యను కూడ చెప్పలేము. ప్రతి విశ్వమునందు బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలున్నారు. పాతాళలోకమునుండి బ్రహ్మలోకము వరకున్న దానిని బ్రహ్మాండముగా పేర్కొనుచున్నారు. తత ఊర్ద్వే చ వైకుంఠో బ్రహ్మాండాద్బహిరేవ సః | సచ సత్య స్వరూపశ్చ శశ్వన్నారాయణో యథా || 9 తదూర్ద్వే గోళకశ్చైవ పంచాశత్కోటి యోజనాత్ | నిత్యః సత్యస్వరూపశ్చ యథాకృష్ణస్తథా zప్యయం || 10 సప్తద్వీపమితా పృథ్వీ సప్తసాగర సంయుతా | ఏకోన పంచాశుదుపద్వీపాzసంఖ్యవనాన్వితా || 11 ఊర్ధ్వం సప్త సువర్లోకా బ్రహ్మలోక సమన్వితాః | పాతాళాని చ సప్తాధశ్చైవం బ్రహ్మాండమేవచ || 12 ఊర్ధ్వం ధరాయా భూర్లోక భువర్లోక స్తతః పరః | సువర్లోకస్తు తతః పశ్చాన్మహర్లోకస్తతో జనః || 13 తతః పరస్తపోలోకః సత్యలోకస్తతః పరః | తతః పరోబ్రహ్మలోక స్తప్తకాంచన నిర్మితః || 14 ఏవం సర్వం కృత్రిమం తద్బాహ్యాభ్యంతర ఏవచ | తద్వినాశే వినాశశ్చ సర్వేషామేవ నారద || 15 జలబుద్బుదవత్సర్వం విశ్వసంఘమనిత్యకం | నిత్యౌ గోలోక వైకుంఠౌ సత్యౌ శశ్వదకృత్రిమౌ || 16 బ్రహ్మాండము కన్న భిన్నముగా దానికి పై భాగముననున్నది. వైకుంఠము నారాయణుని వలె నిత్యమైనది. సత్యమైనది. వైకుంఠమున కంటే ఏబదికోట్ల యోజనములపైన గోలోకము కలదు. అది శ్రీకృష్ణదేవుని వలె నిత్యమైనది, సత్యమైనది. భూమి ఏడు ద్విపములతో, సప్తసాగతరములతో, నలుబది తొమ్మిది ఉపద్వీపములతో అసంఖ్యాకమైన అడవులతో ఉన్నది. దానికి పైన బ్రహ్మలోకముతో నున్న ఏడు సువర్లోకములన్నవి. ఈ భూమికింద ఏడు పాతాళ లోకములన్నవి. ఈ విధముగా సువరాది సప్తలోకుముల పాతాళాది సప్తలోకములతోనున్న భూమి బ్రహ్మండమనమడును. భూమికి పై భాగమున భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, ఆ తరువాత జనోలోకము, అటుపిమ్మట తపోలోకము, దానిపైన సత్యలోకము, సత్యలోకముపైన మేలిమి బంగారముచే నిర్మింపబడిన బ్రహ్మలోకము కలవు. ఈలోకములన్నియు కృత్రిమమైనవి. అశాశ్వతమైనవి. ఈ విశ్వములన్నియు నీటి బుడగలవలె అశాశ్వతమైనవి. కాని గోలోక వైకుంఠలోకములు మాత్రము సత్యమైనవి. శాశ్వతమైనవి. అకృత్రమమైనవి. లోకకూపే చ విధ్యండం ప్రత్యేకం తస్య నిశ్చితం | ఏషాం సంఖ్యాం న జానాతి కృష్ణో zన్యస్యాzపనికా కథా || 17 ప్రత్యేకం ప్రతివిధ్యండే బ్రహ్మ విష్ణు శివాదయః | తిస్రః కోట్యః సురాణాంచ సంఖ్యా సర్వత్ర పుత్రక || 18 దిగీశాశ్చైవదిక్పాలాః నక్షత్రాణి గ్రహాదయః | భువి వర్ణాశ్చ చత్వారోzధో నాగాశ్చ చరాచరాః || 19 విరాట్పురుషుని యొక్క ప్రతి రోమ కూపమందు బ్రహ్మాండమున్నది. ఈ బ్రహ్మాండములయొక్క సంఖ్య శ్రీకృష్ణపరమాత్మకే తెలియదన్నచో ఇతరుల కెవరికి తెలియును? ప్రతి బ్రహ్మాండమున ప్రత్యేకముగా బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు, ముప్పది కోట్ల సురలు, దిక్పాలకులు, నక్షత్రములు, గ్రహాదులు కలవు. భూమిపై నాల్గు వర్ణముల జనులున్నారు. భూమిక్రింద నాగులు చరాచర జగత్తు కలదు. అథ కాలేన సవిరాడూర్ధ్వం దృష్ట్వా పునః పునః | డింభాంతరం చ శూన్యం చ న ద్వితీయ కథంచన || 20 చింతామవాప క్షుద్యుక్తో రురోద చ పునః పునః | జ్ఞానం ప్రాప్య తదా దధ్యౌ కృష్ణం పరమ పూరుషం || 21 తతో దదర్శ తత్రైవ బ్రహ్మ జ్యోతిః సనాతనం | నవీన నీరదవ్యామం ద్విభుజం పీతవాససం || 22 సస్మితం మురళీహస్తం భక్తానుగ్రహకారకం | జహాస బాలకస్తుష్టో దృష్ట్వా జనకమీశ్వరం || 23 వరం తసై#్మ దదౌ తష్టో పరేశః సమయోచితం | మత్సయోజ్ఞాన యుక్తశ్చ క్షుత్పిపాసా వివర్జితః || 24 బ్రహ్మాండాసంఖ్య నిలయో భవ వత్స లయావధి | నిష్కామో నిర్భయశ్చైవ సర్వేషాం వరదో వరః || 25 కొంతకాలమునకా విరాట్పురుషుడు పైకి మాటి మాటికి చూచుచు ఇంకొక శిశువును కాని, ఇతరమైన వస్తువును గాని చూడక చింతగలవాడై ఆకలితో చాలాసేపు ఏడ్చెను. కొంతకాలమునకు జ్ఞానము బడసి పరమపురుషుడైన శ్రీకృష్ణుని తనమనసులో ధ్యానించుకొనెను. అందువలన పరబ్రహ్మ స్వరూపుడు. జ్యోతిస్స్వరూపుడు, నూతన మేఘమువలె నల్లనివాడు, రెండు భుజములు కలవాడు, పీతాంబరసుశోభితుడు. చేతిలో మురళి కలవాడు, భక్తులననుగ్రహించువాడగు శ్రీకృష్ణుడు దర్శనమొసగెను. విరాట్పురుషుడు పరమేశ్వరుడు, ఆత్మజనకుడైన ఆ శ్రీకృష్ణుని చూచినవ్వి అనేక విధములుగా స్తుతించెను. అందువలన ఆ పరమేశ్వరుడు సంతోషించి ఆకలిదప్పులు లేక నావలెనే జ్ఞాన యుక్తుడవు కమ్మని, నిష్కాముడవై, నిర్భయుడవై అందరకు వరములను ఇచ్చుచు, లయకాలమువరకు అసంఖ్యాకమైన బ్రహ్మాండములకు నిలయము కమ్మని ఆ బాలకునకు వరమిచ్చెను. ఇత్యుక్త్వా తద్దక్షకర్ణే మహామంత్రం షడక్షరం | త్రిః కృత్వా ప్రజజాపాదౌ వేదాంగమవరం పరం || 26 ప్రణవాది చతుర్ధ్వంతం కృష్ణ ఇత్యక్షరద్వయం | వహ్ని జ్వాలాంత మిష్టం చ సర్వవిఘ్నహరం పరం || 27 మంత్రం దత్వా తదాzహారం కల్పయామాస వై ప్రభుః | శ్రూయతాం తత్ బ్రహ్మపుత్ర నిబోధ కథయామి తే || 28 ప్రతివిశ్వేషు నైవేద్యం దద్యాద్యై వైష్ణవో జనః | షోడశాంశం విషయిణో విష్ణోః పంచదశాస్య వై || 29 నిర్గుణస్యాత్మనశ్చైవ పరిపూర్ణతమస్య చ | నైవేద్యే న చ కృష్ణస్య నహి కించిత్ర్పయోజనం || 30 యుద్దదాతి చ నైవేద్యం యసై#్మ దేవాయ యో జనః | సచ ఖాదతి తత్సర్వం లక్ష్మీదృష్ట్యా పునర్భవేత్ || 31 తం చ మంత్రం వరం దత్వా తమువాచ పునర్విభుః | అన్యో వరః క ఇష్టస్తే తం మే బ్రూహి దదామి తే || 32 విరాడ్రూపుడైన బాలకునకు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు వరమిచ్చి, అతని కుడిచెవిలో వేదాంగము, మిక్కిలి శ్రేష్ఠమైన షడక్షరీ మంత్రమును మూడు మార్లు ఉచ్చరించెను. ఓంకారముతో ప్రారంభ##మై చతుర్థ్యంతమైన కృష్ణ శబ్దము కలిగి స్వాహాకాంరాంతమైన ఓం కృష్ణాయ స్వాహా అను మంత్రము అన్ని విఘ్నములు తొలగించును. ఆమంత్రమునుపదేశించి పరమాత్మ ఆ బాలున కాహారమును కల్పించెను. ప్రతి విశ్వమున వైష్ణవులైనవారు పరమాత్మకు నైవేద్యమిడుదురు. దానిలో పదునారవ భాగము విష్ణువునకు చెందగా మిగిలిన పదునైదులుభాగము శ్రీకృష్ణునకు చెందును. నిర్గుణుడు, సర్వపరిపూర్ణుడైన శ్రీకృష్ణునకు నైవేద్యముయొక్క అవసరము లేకున్నను, భక్తుడు ఇచ్చిన నైవేద్యమును స్వీకరించి తన చల్లని దృష్టితో ఆ భక్తునకు మరల అన్ని సంపదలు కలుగునట్లు చేయును. శ్రీ కృష్ణు డా బాలకునకు మంత్రమును, వరమును ఇచ్చి ఇంకను నీకు కావలసిన దేదియైన ఉన్నచో అడుగుమని, దానిని సంతోషముతో ఇత్తునని పేర్కొనెను. కృష్ణస్య వచనం శ్రుత్వా తమువాచ మహావిరాట్ | అదంతో బాలకస్తత్ర వచనం సమయోచితం || 33 శ్రీకృష్ణుని పలుకులు విని దంతములు సహితము రాని బాలకుడైన మహావిరాట్పురుషుడు సమయోచితముగా ఇట్లు పలికెను. మహావిరాడువాచ - మహావిరాట్పరుషుడిట్లనెను - వరం మే త్వత్పదాంభోజ భక్తిర్భవతు నిశ్చలా | సంతతం యావదాయుర్మే క్షణం వా సుచిరం చవా || 34 త్వద్భక్తియుక్తో యో లోకే జీవన్ముక్తః స సంతతం | త్వద్భక్తి హీనో మూర్ఖశ్చ జీవన్నపి మృతో హి సః || 35 కిం తజ్జపేన తపసా యజ్ఞేన యజనేన చ | వ్రతేనైవోపవాసేన పుణ్యతీర్థనిషేవయా || 36 యావదాత్మా శరీరేzస్తి తావత్ స్యాచ్ఛక్తి సంయుతం | పశ్చాద్యాంతి గతే తస్మిన్ న స్వతంత్రాశ్చ శక్తయః || 37 స చ త్వం చ మహాభాగ సర్వాత్మా ప్రకృతేః పరః | స్వేచ్ఛామయశ్చ సర్వాద్యో బ్రహ్మ జ్యోతిః సనాతనః || 38 ఇత్యుక్త్వా బాలకస్తత్ర విరరామ చ నారద | ఉవాచ కృష్ణః ప్రత్యుక్తిం మధురాం శ్రుతిసుందరీం || 39 భగవాన్! నేను బ్రతికి యుండునంతవరకు ఎల్లప్పుడు నీ పాదపద్మములపై భక్తియుండునట్లు నన్ననుగ్రహింపుము. నీభక్తి కలవాడు ఈ లోకమున బ్రతికియున్నను మోక్షమందినవాడు. నీభక్తిలేని మూర్ఖుడు బ్రతికియున్నను చనిపోయినవానితో సమానుడు. నీభక్తిలేనిచో జపించినను తపస్సు చేసినను, యాగములు చేసినను, వ్రతములాచరించినను,ఉపవాసములు చేసినను, పుణ్య తీర్థములు సేవించినను ఫలితముండదు. శరీరమున ఆత్మ ఉండునంతవరకే మానవుడు శక్తి కలిగి యుండును. ఆ ఆత్మ శరీరమునుండి దూరమైనచో ఆ శక్తులేవి పనికిరావు. అట్టి పరమాత్మవైన నీవు ప్రకృతి కంటె శ్రేష్ఠుడవు. స్వేచ్ఛామయుడవు. పరబ్రహ్మవు. జ్యోతి స్వరూపుడవు. సనాతనుడవు. ఈ విధముగా మహావిరాడ్రూపుడైన బాలకుడు పలుకగా శ్రీకృష్ణుడు చెవులకింపు కలిగించునట్లు మధురముగా ఇట్లు పలికెను. శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లు పలికెను - సుచిరం సుస్థిరం తిష్ఠ యథాzహం త్వం తథా భవ | అసంఖ్య బ్రహ్మణాం పాతే పాతస్తే న భవిష్యతి || 40 అంశేన ప్రతి విధ్యండే త్వం చ పుత్ర విరాట్ భవ | త్వన్నాభిపద్మే బ్రహ్మా చ విశ్వస్రష్టా భవిష్యతి || 41 లలాటే బ్రహ్మణశ్చైవ రుద్రాశ్చైకాదశైవ తు | శివాంశేన భవిష్యంతి సృష్టి సంచరణాయ వై || 42 కాలాగ్నిరుద్రస్తేష్వేకో విశ్వసంహార కారకః | పాతా విష్ణుశ్చ విషయీ క్షుద్రాంశేన భవిష్యతి || 43 మద్భక్తియుక్తః సతతం భవిష్యసి వరేణ మే | ధ్యానేన కమనీయం మాం నిత్యం ద్రక్ష్యసి నిశ్చితం || 44 మాతరం కమనీయం చ మమ వక్షస్థలస్థితాం | యామి లోకం తిష్ఠవత్సేత్యుక్త్వా సోzతరధీయత || 45 బాలకా! నావలె నీవును చాలాకాలము స్థిరముగా నుండుము. అసంఖ్యాకులైన బ్రహ్మదేవులు గతించినను నీకు మాత్రము మరణమురాదు. ప్రతి బ్రహ్మాండమున నీ అంశ##చేత విరాట్ స్వరూపుడవుగా కమ్ము. నీయొక్క నాభిపద్మమున విశ్వములను సృష్టించు బ్రహ్మదేవుడు ఉద్భవించును. బ్రహ్మదేవుని లలాటమున శివాంశవలన సృష్టిస్థితికై పదకొండుగురు రుద్రులు ఉద్భవింతురు. ఆ రుద్రులలో సంహారకుడైన కాలాగ్ని రుద్రుడొకడు. నీయొక్క అతి తక్కువనైన అంశవలన లోకరక్షకుడైన విష్ణువు ఉద్భవించును. నాయొక్క వరమువలన ఎల్లప్పుడూ నా భక్తి కలిగి యుందువు. ధ్యానమున నన్ను ఎల్లప్పుడు చూడగలవు. అట్లే నా వక్షస్థలముపై నున్న నీ తల్లిని కూడా ధ్యానమున చూడగలవు. ఇకనేను పొయివత్తునని చెప్పి ఆ శ్రీకృష్ణపరమాత్మ అంతర్ధానము చెందెను. గత్వా చ నాకం బ్రహ్మాణం శంకరం స ఉవాచ హ | స్రష్టారం స్రష్టుమీశం చ సంహర్తారం చ తక్షణం || 46 శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకమునకు వెళ్ళి విశ్వస్రష్ట యగు బ్రహ్మతో, విశ్వ సంహారకుడైన శంకరునితో ఇట్లు పలికెను. శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను - సృష్టిం స్రష్టుం గచ్ఛ వత్స నాభిపద్మోద్భవో భవ | మహావిరాట్ లోమకూపే క్షద్రస్య చ విధేః శ్రుణు || 47 గచ్చ వత్స మహాదేవ బ్రహ్మభాలోద్బవో భవ | అంశేన చ మహాభాగ! స్వయం చ సుచిరం తపః || 48 ఇత్యుక్త్వా జగతాం నాథో విరరామ విధేః సుత | జగామ నత్వా తం బ్రహ్మ శివశ్చ శివదాయకః || 49 బ్రహ్మదేవా! నీవు మహావిరాట్ స్వరూపుని యొక్క రోమ కూపమునందున్న చిన్నవి విరాడ్రూపముయొక్కనాభిపద్మమున పుట్టి సృష్టిని చేయుటకై వెళ్ళుము. అట్లే మహాదేవుడా నీవు స్వయముగా అంతులేని తపమాచరించి విరాడ్రూపుని అంశవలన బ్రహ్మదేవుని పాలభాగమునుండి జన్మనెత్తుము. ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ శివులతో మాట్లాడి వారి నమస్కారములను స్వీకరించి గోలోకమునకు వెళ్ళెను. మహావిరాట్ లోమకూపే బ్రహ్మాండే గోళ##కే జలే | సబభూవ విరాట్ క్షుద్రో విరాడంశేన సాంప్రతం || 50 శ్యామో యువా పీతవాసాః శయానో జలతల్పకే | ఈషద్ధాసః ప్రసన్నాస్న్యో విశ్వరూపే జనార్దనః || 51 తన్నాభికమలే బ్రహ్మా బభూవ కమలోద్భవః | సంభూయ పద్మ దండంచ బభ్రామ యుగలక్షకం || 52 నాంతం జగామ దండస్య పద్మనాభస్య పద్మజః | నాభిజస్య చ పద్మస్య చింతామాప పితామహః || 53 స్వస్థానం పునరాగత్య దధ్యౌ కృష్ణపదాంబుజం | తతో దదర్శ క్షుద్రం తం ధ్యాత్వా తద్దివ్య చక్షుషా || 54 శయానం జలతల్పేచ బ్రహ్మాండ పిండమావృతే | యల్లోమకూపే బ్రహ్మాండం తంచ తత్పరమీశ్వరం || 55 శ్రీకృష్ణం చాపి గోలోకం గోప గోపీ సమన్వితం | తం సంస్తూయ వరం ప్రాప తతః సృష్టిం చకార సః || 56 బభూవుర్బ్రహ్మణః పుత్రా మానసా సనకాదయః | తతో రుద్రాః కపాలాచ్చ శివసై#్యకాదశ స్మృతాః || 57 బభూవ పాతా విష్ణుశ్చ వామే క్షుద్రస్య పార్శ్యతః | చతుర్భుజశ్చ భగవాన్ శ్వేత ద్వీప నివాసకృత్ || 58 క్షుద్రస్య నాభిపద్మే చ బ్రహ్మా విశ్వం ససర్జ సః | స్వర్గం మర్త్యంచ పాతాళం త్రిలోకం సచరాచరం || 59 ఏవం సర్వం లోమకూపే విశ్వం ప్రత్యేక మేవచ | ప్రతి విశ్యం క్షుద్రవిరాట్ బ్రహ్మ విష్ణు శివాదయః || 60 మహావిరాట్ స్వరూపుని యొక్క రోమకూపమునందలి బ్రహ్మాండమున గోళక జలమున విరాడంశతో చిన్న విరాట్ స్వరూపుడు ఉద్భవించెను. ఆ చిన్ననైన విరాడ్రూపుడే శ్యామవర్ణముగలవాడు, యువకుడు, పీతాంబరుడు, జలతల్పముపై పరుండువాడు, విశ్వరూపియగు జనార్దనుడు. అతని నాభికమలమున కమలోద్భవుడైన బ్రహ్మదేవుడు జన్మించెను. బ్రహ్మదేవుడు పుట్టిన తరువాత తాను పుట్టిన కమల నాళమున లక్షయుగములు తిరిగెను. ఐనను పద్మనాభుని నాభికమల నాళముయొక్క అంతును మాత్రమతడు చూడలేకపోమెను. అందువలన నతడు మిక్కిలి చింతించి, తిరిగి స్వస్థానమును చేరి, శ్రీకృష్ణుని పాదపంకజములనతడు ధ్యానించెను. ఆ ధ్యానప్రభావమువలన దివ్యచక్షువులను పొంది వాటితో క్షుద్ర (చిన్న) విరాడ్రూపుని జలతల్పమున పడికొనియున్న జనార్దనుని, అతని రోమ కూపములందున్న బ్రహ్మాండమును, తరువాత గోలోకమును, గోపగోపికలతోనున్న పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని చూచి ఆతనిని స్తుతించి అతని అనుగ్రహము పొంది, సృష్టిని ప్రారంభించెను. ఆ బ్రహ్మకు మానసపుత్రులగు సనకాది మహర్షులుదయించిరి. తరువాత అతని నొసటినుండి శివాంశకలిగిన ఏకాదశరుద్రులు ఉదయించిరి. క్షుద్ర విరాడ్రూపుని యొక్క ఎడమభాగమున లోకరక్షకుడైన విష్ణువు చతుర్భుజములతో శ్వేత ద్వీపనివాసుడుగా ఆవిర్భవించెను. ఆ క్షుద్రవిరాడ్రూపుని నాభిపద్మమున ఉద్భవించిన బ్రహ్మదేవుడు చరాచరసృష్టి సహితమైన త్రిలొకములను సృష్టించెను. ఈ విధముగా మహావిరాట్ స్వరూపుని రోమకూపములయందు అనంత విశ్వములు ప్రతి విశ్వమున క్షుద్రవిరాట్ స్వరూపుడు బ్రహ్మ విష్ణు శివాది దేవతలుద్భవించిరి. ఇత్యేవం కథితం వత్స కృష్ణసంకీర్తనం శుభం | సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతు మిచ్ఛసి || 61 నారదా! ఈవిధముగా సుఖమును, మోక్షమును ఇచ్చు శ్రీకృష్ణచరితమును తెలిపితిని. ఇంకను నీవు విన దల్చుకొన్న దేదియైన ఉన్నచో తెలుపుము. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే విశ్వబ్రహ్మాండ వర్ణనం నామ తృతీయోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవ దగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున చెప్పబడిన విశ్వబ్రహ్మాండముల వర్ణనమను మూడవ అధ్యాయము సమాప్తము.