sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుర్థ్మోధ్యాయః - సరస్వతీ కవచము నారదఉవాచ - నారదమహర్షి ఇట్లనెను - శ్రుతం సర్వమపూర్వం చ త్వత్ర్పసాదాత్సుధోపమం | అధునా ప్రకృతీనాంచ వ్యాసం వర్ణయ భో ప్రభో || 1 కస్యాః పూజా కృతా కేన కథం మర్త్యే ప్రకాశితా | కేన వా పూజితా కా వా కేన కావా స్తుతా మునే || 2 కవచం స్తోత్రకం ధ్యానం ప్రభావం చరితం శుభం | కాభిః కాభ్యో వరోదత్తస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి || 3 ప్రభూ! నీదయవలన అపూర్వమైన విషయమును తెలసికొంటిని. ఇప్పుడు ప్రకృతి దేవతలకు సంబంధించిన వివరణను తెల్పగలవు. ఏదేని పూజనెవరు చేసిరి? భూమిపై ఆమె ధ్యానాదికము నెవరు తెల్పిరి? ఆదేవియొక్క, కవచము, స్తోత్రము, ధ్యానము, ప్రభావము, చరిత్ర ఎట్టివి? ఆ దేవతలు ఎవరికి వరములిచ్చిరి? మున్నగు విషయములనన్నిటిని వివరముగా నాకు తెలుపగలరు. నారాయణ ఉవాచ- నారాయణుడిట్టు పలికెను- గణశ జననీ దుర్గా రాధా లక్ష్మీః సరస్వతీ | సావిత్రీ వై సృష్టివిధౌ ప్రకృతిః పంచధాస్మృతా || 4 ఆసీత్పూజ్యా ప్రసిద్ధా చ ప్రభావః పరమాద్భుతః | సుధోపమం చ చరితం సర్వమంగళ కారణం || 5 ప్రకృత్యంశాః కళాయాశ్చ తాసాం చ చరితం శుభం | సర్వం వక్ష్యామి తే బ్రహ్మన్ సావధానం నిశామయ || 6 వాణీ వసుంధరా గంగా షష్ఠీ మంగళ చండికా | తులసీ మానసీ నిద్రా స్వధా స్వాహా చ దక్షిణా || 7 తేజసా మాత్సమాస్తాశ్చ రూపేణ చ గుణన చ || 8 సంక్షేపమాసాం చరితం పుణ్యదం శ్రుతి సుందరం | జీవకర్మవిపాకంచ తచ్చ వక్ష్యామి సుందరం || 9 దుర్గాయాశ్చైవ రాధాయ విస్తీర్ణం చరితం మహత్ | తచ్చ పశ్చాత్ప్రవక్ష్యామి సంక్షేపాత్ క్రమతః శ్రుణు || 10 ప్రకృతి సృష్టి సమయమున గణపతి తల్లియైన దుర్గగా, రాధగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, సావిత్రిగా ఐదువిధములుగా నగుచున్నది. వారియొక్క పూజ ప్రసిద్ధమైనది. వారి ప్రభావము చాల ఆశ్చర్యకరమైనది. వారి చరిత్ర సర్వమంగళములకు కారణమైనది. అది అమృతము వంటిది. ఆ ప్రకృతియొక్క అంశలు, అంశాంశలు వారియొక్క శుభ చరిత్రము సర్వము నీకు తెలుపుదును. సరస్వతి, భూమి, గంగా, షష్ఠీదేవి, మంగళచండిక, తులసి మానసీదేవి, నిద్రాదేవి, స్వధా, స్వాహా, దక్షిణ, వీరందరు తేజస్సులో రూపములో గుణమున నాతో సమానమైవారు. వీరి చరిత్రను సంక్షేప్తముగా నీకు తెల్పుదును. అట్లే సుందరమైన జీవకర్మవిపాకమును నీకు తెల్పుదును. దుర్గాదేవి, రాధాదేవుల చరిత్ర చాలా విస్తరమైనది, అందువలన వీటిని తరువాత చెప్పెదను. మిగిలిన వాటిని క్రమముగా సంక్షేపముగా చెప్పెదను. వినుము. ఆదౌ సరస్వతీ పూజా శ్రీకృష్ణేన వినిర్మితా | యత్ప్రసాదాన్మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః || 11 ఆవిర్భూతా యదా దేవీ వక్త్రతః కృష్ణయోషితః | ఇయేష కృష్ణం కామేన కౌముకీ కామరూపిణీ || 12 సచ విజ్ఞాయ తద్భావం సర్వజ్ఞః సర్వమాతరం | తామువాచ హితం సత్యం పరిణామ సుఖావహం || 13 సరస్వతీదేవి పూజ శ్రీకృష్ణునితో రచింపబడినది. ఆమె యొక్క అనుగ్రహమువలన మూర్ఖుడు కూడా పండితుడగుచున్నాడు. శ్రీకృష్ణుని భార్యయగు ప్రకృతి ముఖమునుండి పుట్టిన సరస్వతీదేవి కాముకియై శ్రీకృష్ణుని కామించెను. కాని సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆమె మనోభావమును గుర్తించి పరిణామకాలమున సుఖమును కల్గించు హితవును ఆమెకు చెప్పెను. శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను- భజ నారాయణం సాధ్వి మదంశం చ చతుర్భుజం | యువానం సుందరం సర్వగుణయుక్తం చ మత్సమం || 14 కామదం కామినీనాంచ తాసాం తం కామపూరకం | కోటి కందర్ప లావణ్యం లీలాన్యక్కృత మన్మథం || 15 కాంతే కాంతం చ మాం కృత్వా యది స్థాతుమిహేచ్ఛసి | త్వత్తో బలవతీ రాధా న తే భద్రం భవిష్యతి || 16 యో యస్మాద్బలవాన్వాపి తతోzన్యం రక్షితుం క్షమః | కథం పరాన్సాధయతి యది స్వయమనీశ్వరః || 17 సర్వేశ్వస్సర్వశాస్తాzహం రాధాం రాధితుమక్షమః | తేజసా మత్సమా సా చ రూపేణ చ గుణన చ || 18 ప్రాణాధిష్ఠాతృదేవీ సా ప్రాణాంస్త్యక్తుం చ కః క్షమః | ప్రాణతోzపి ప్రియః కుత్ర కేషాంవాస్తి చ కశ్చన || 19 త్వం భ##ద్రే గచ్చ వైకుంఠం తవ భద్రం భవిష్యతి | పతిం తమీశ్వరం కృత్వా మోదస్వ సుచిరం సుఖం || 20 వివర్జితా లోభమోహ కామకోపేన హింసయా | తేజసా త్వత్సమా లక్ష్మీ రూపేణ చ గుణన చ || 21 తయా సార్థం భవ ప్రీత్యా సుఖం కాలం ప్రయాస్యతి | గౌరవం చాపి తత్తుల్యం కరిష్యతి పతిర్ద్వయోః || 22 ఓ సాధ్వి, నీవు నా అంశరూపుడు, చతుర్భుజుడు, యువకుడు, సుందరుడు, సమస్త సద్గుణయుక్తుడు, నాతో సమానవైనవాడు, కామినుల కామము తీర్చువాడు. కోటి మన్మథుల లావణ్యము కలవాడగు నారాయణుని సేవించుము. ఓ కాంతా! నన్ను ప్రియునిగా చేసికొని ఇక్కడ ఉండవలెనని కోరుకునుచున్నావు. కాని రాధాదేవి నీకంటె గొప్పది. అందువలన నీకిచట మంచి జరుగదు. తాను బలవంతుడైనచో ఇతరులను రక్షింపగలడు. కాని తానే బలహీనుడైనచో ఇతరులనేవిధముగా రక్షింపగలడు? నేను సర్వేశుడను. అందరను శాసించగలవాడను, ఐనను రాధను వ్యతిరేకించలేను. ఎందువలన అంటే ఆరాధ తేజస్సున, రూపమున, గుణమున, నాతో సమానమైనది. అట్లే ఆమె నా ప్రాణములకు అధిష్ఠాన దేవత. ఎవరు కూడ తమ ప్రాణములను వదులుకోరు కదా! అందువలన నేను రాధను దూరము చేసికొనలేను. నీవు వైకుంఠమునకు వెళ్ళినచో నీకు మేలు జరుగగలదు. నారాయణుని భర్తగా చేసికొని నీవు చాలకాలము సుఖముగా ఉండుము. లక్ష్మీదేవి లోభ, మోహ, కామ,కోప, హింసాది గుణములు లేనిది. తేజస్సులోను, గుణములోను, రూపములోను నీతో సమానమైనది. ఆమెతో కలిసి సుఖముగా కాలమును గడపగలవు. నీభర్తయగు నారాయణుడు కూడ మీ ఇద్దరిపై సమానమైన గౌరవమును చూపించును. ప్రతి విశ్వేషు తే పూజాం మహతీం తే ముదాన్వితాః | మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభేషు సుందరి || 23 మానవో మనవో దేవా మునీంద్రాశ్చ ముముక్షవః | సంతశ్చ యోగినః సిద్ధాః నాగగంధర్వ కిన్నరాః || 24 మద్వరేణ కరిష్యంతి కల్పేకల్పే యథావిధి | భక్తి యుక్తాశ్చ దత్వా వై చోపచారాంశ్చ షోడశ || 25 కాణ్వశాఖోక్త విధినా ధ్యానేన స్తవనేన చ | జితేంద్రయాః సంయతాశ్చ పుస్తకేషు ఘటేz పి చ || 26 కృత్వా సువర్ణఘటికాం గంధ చందన చర్చితాం | కవచం తే గ్రహిష్యంతి కంఠే వా దక్షిణ భుజే || 27 పఠిష్వంతి చ విద్వాంసః పూజకాలే చ పూజితే | ఇత్యుక్త్వా పూజయామాస తాం దేవీం సర్వపూజితః || 28 ఓ సరస్వతీ ! ప్రతి విశ్వమున నీ పూజను మాఘశుద్ద పంచమినాడు విద్యారంభము చేయు సమయమున, మానవులు, దేవతలు, మునీంద్రులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, యక్షులు మొదలైనవారందరు భక్తితో కాణ్వశాఖయందు చెప్పబడినట్లు షోడశోపచారములను చేయుదురు. జితేంద్రియులు, యమనియమవంతులైన వారు పుస్తకమునందో, కలశమునందో నిన్నావాహన చేసి ధ్యానము, స్తోత్రము మొదలైన వాటితో నిన్ను పూజింతురు. నీ కవచమును పత్రముపై లిఖించి గంధము, చందనములతో అలంకరించి బంగారు భరిణలో ఉంచి కంఠమున లేక కుడి భుజమున (తాయత్తుగా) ధరింతురు. విద్వాంసులు పూజాకాలమున నీ ధ్యానస్తోత్రములను, కవచమును పఠింతురు. ఈ విధముగా పలికి సర్వపూజితుడైన శ్రీకృష్ణుడు ఆ సరస్వతీ దేవిని కూడా పూజించెను. తతస్తత్పూజనం చక్రుర్బ్రహ్మవిష్ణు మహేశ్వరాః | అనంతశ్చాzపి ధర్మశ్చ మునీంద్రాః సనకాదయః || 29 సర్వే దేవాశ్చ మనవో నృపా వా మానవాదయః | బభూవ పూజితా నిత్యా సర్వలోకైః సరస్వతీ || 30 శ్రీకృష్ణుడు పూజించిన తరువాత ఆ ఆసరస్వతీ దేవిని బ్రహ్మవిష్ణు మహేశ్వరులు, ధర్ముడు, సనకాది మునీంద్రులు, ఇతర దేవతలందరు రాజులు, మానవులు మొదలగువారందరు పూజించిరి. అందువలన ఆ దేవి అందరిచే ఎల్లప్పుడు పూజలందుకొనుచున్నది. నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను- పూజావిధానం స్తవనం ధ్యానం కవచమీప్సితం | పూజోపయుక్తం నైవేద్యం పుష్పం వా చందనాదికం || 31 వద వేదవిదాం శ్రేష్ఠ శ్రోతుం కౌతూహలం మమ | వర్ధతే సాంవ్రతం శశ్వత్కిమిదం శ్రుతి సుందరం || 32 వేదములన్నియు తెలిసినవారిలో శ్రేష్ఠుడవైన శ్రీమన్నారాయణా! సరస్వతీ దేవి యొక్క పూజా విధానమును, ధ్యాన స్తోత్రములను, కవచమును. పూజకు కావలసిన నైవేద్యమును, పుష్ప, చందనాదికములు నన్నిటిని వివరముగా తెలుసుకొనవలెనని అనుకొనుచున్నాను. నారాయణ ఉవాచ - నారయణుడు ఇట్లనెను - శ్రుణనారద వక్ష్యామి కాణ్వశాఖోక్త పద్ధతిం | జగన్మాతుః సరస్వతాః పూజావిధిసమన్వితాం || 33 మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభదినేzపిచ | పూర్వాహ్నే సంయమం కృత్వా తత్రస్యాత్సంయతః శుచిః || 34 స్నాత్వా నిత్యక్రియాం కృత్వా ఘటం సంస్థాప్య భక్తితః | సంపూజ్య దేవషట్కంచ నైవేద్యాదిదేవ చ భి || 35 గణశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం | సంపూజ్య సంయతోzగ్రే చ తతోzభీష్టం ప్రపూజయేత్ || 36 ధ్యానేన వక్ష్యమాణన ధ్వాత్వా బాహ్యఘటే ద్విజ | ధ్వాత్వా పునః షోడశోపచారైః తాం పూజయేద్వ్రతీ || 37 పూజోపయుక్తం నైవేద్యం యద్యద్వేదే నిరూపితం | వక్ష్యామి సాంప్రతం కించిత్ యథాz ధీతం తథాగమం || 38 నవనీతం దధిక్షీరం లాజాంశ్చ తిల లడ్డుకాన్ | ఇక్షుమిక్షురసం శుక్ల వర్ణం పక్వగుడం మధు || 39 స్వస్తికం శర్కరాం శుక్ల ధాన్యస్యాక్షతమక్షతం | అస్విన్న శుక్ల ధాన్యస్య పృథుకం శుక్లమోదకం || 40 ఘృతసైంధవ సంస్కారైః హవిషై#్యః వ్యంజనైస్తథా | యవగోధూమ చూర్ణానాం మిష్టాన్నంచ సుధోపమం || 42 నారికేళం తదుదకం కేసరం మూలమార్ద్రకం | పక్వరంభాఫలం చారు శ్రీఫలం బదరీఫలం || కాలదేశోద్భవం పక్వఫలం శుక్లం సుసంస్కృతం || నారద! కాణ్వశాఖోక్త పద్ధతిలో నున్న సరస్వతీదేవి పూజా పద్ధతిని తెల్పుచున్నాను. మాఘమాసముయొక్క శుధ్ద పంచమినాడైనను, విద్యారంభము చేయు దినమునందైనా ఉదయము నియమముతో స్నానము చేసి పరిశుద్ధుడు కావలెను. తరువాత నిత్యపూజాది కార్యక్రమములన్నీ చేసికొని భక్తితో కలశ స్థాపన చేయవలెను. ఆ తరువాత గణపతి, సూర్యుడు, అగ్ని, విష్ణువు, శివుడు, దుర్గ అను ఆరుగురు దేవతలను పూజించి నైవేద్యాదులను సమర్పించుకొనివలెను. అటుపిమ్మట ఇష్టదేవతను కూడ పూజించవలెను. ఆ తరువాత కలశమున సరస్వతీ దేవతనావాహనము చేసి ముందు చెప్పబోవు పద్ధతితో ఆ దేవిని ధ్యానించి షోడశోపచారపూజలతో ఆరాధించి నైవేద్యమును పెట్టవలెను. సరస్వతీ దేవి పూజయందు ఉపయోగించవలసిన నైవేద్యమును గురించి వేదమున ఈ విధముగా చెప్పబడినది. వెన్న, పెరుగు, పాలు, పేలాలు, నూవుండలు, చెరుకు, చెరుకురసము, తెల్లనిబెల్లము,స్వస్తికము (ఒకవిధమైన వంటకము), చక్కర, నూకలేమాత్రము లేని తెల్లబియ్యపన్నము, ఉడికించని తెల్లబియ్యపుటటుకులు, తెల్లని లడ్డులు, నేయి, సైంధవలవణములు కల వ్యంజనములతో సిద్ధము చేయవడిన వంటకము, నేయి కలిపిన యవలు, గోధుమలయొక్క పిండి, స్వస్తికము యొక్క పిండి , నేయితోనున్న పరమాన్నము, తియ్యని అన్నము, టెంకాయ, టెంకాయ నీళ్ళు, కేసరము, అరటిపండ్లు, నేరేడుపండ్లు, రేగుపండ్లు మొదలైనవి నైవేద్యముగా పెట్టవలెను. సుగంధి శుక్ల పుష్పంచ గంధాఢ్యం శుక్లచందనం | నవీనం శుక్ల వస్త్రం చ శంఖం చ సుమనోహరం || మాల్యం చ శుక్ల పుష్పాణాం ముక్తాహారది భూషణం || 44 సువాసనగల తెల్లని పువ్వులు, మంచివాసనగల తెల్లని చందనము, కొత్త తెల్లబట్ట, శంఖము, తెల్ల పువ్వుల మాల, ముత్యాల హారములు ఆ దేవీపూజలో ఉపయోగింపతగు వసప్తువులు. యత్‌దృష్టం చ శ్రుతౌ ధ్యానం ప్రశస్తం శ్రుతిసుందరం | తన్నిబోధ మహాభాగ భ్రమభంజన కారణం || 45 సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం | కోటి చంద్ర ప్రభాజుష్ట పుష్ప శ్రీయుక్త విగ్రహాం || 46 వహ్ని శుద్దాంశుకాధానాం సస్మితం సుమనోమరాం | రత్నసారేంద్ర ఖచిత వరభూషణ భూషితాం || 47 సుపూజితాం సురగణౖర్ర్బహ్మ విష్ణు శివాదిభిః | వందే భక్త్వా వందితాం తాం మునీంద్రమనుమానవైః || 48 ఏవం ధ్యాత్వా చ మూలేన సర్వం తద్వా విచక్షణః | సంస్తూయ కవచం దృత్వా ప్రణమేద్దండుద్భువి || 49 వేదములలో చెప్పబడిన ధ్యానపద్దతిని చక్కగా వినుము. సరస్వతీదేవి తెల్లని వర్ణము కలది. చిరునవ్వుతో అందముగానుండును. కోటి చంద్రుల కాంతి గల శరీరముగలది. బంగారము వన్నెగల వస్త్రమును, మంచిరత్నములున్న భూషణములను ధరించును. బ్రహ్మవిష్ణు శివాది దేవతలతో పూజలందుకొనుచున్నది. మహర్షులు, నరులు మొదలైన వారితో నమస్కారములు నందుకొనుచున్నది. ఇట్టి రూపముతో నున్న సరస్వతీ దేవిని నమస్కరించి మూలమంత్రమును జపించుచు కవచమును ధరించి సాష్టాంగ నమస్కారమును చేయవలెను. యేషాం స్యాదిష్టదేవీయం తేషాం నిత్యం శుభం మునే | విద్యారంభే చ సర్వేషాం వర్షాంతే పంచమీదినే || 50 సర్వోపయుక్తమూలం చ వైదికాష్టాక్షరః పరః | యేషాం యదుపదేశోవా తేషాం తన్మూలమేవచ || 51 శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా | లక్ష్మీమాయాదికం చైవ మంత్రోzయం కల్పపాదపః || 52 పురా నారాయణశ్చేమం వాల్మీకాయ కృపానిధిః | ప్రదదౌ జాహ్నవీ తీరే పుణ్యక్షేత్రే చ భారతే || 53 భృగుర్దదౌ చ శుక్రాయ పుష్కరే సూర్యపర్వణి | చంద్రపర్వణి మారీచో దదౌ వాక్పతయే ముదా || 54 భృగవే చ దదౌ తుష్ఠో బ్రహ్మా బదరికాశ్రమే | ఆస్తీకాయ జనత్కారుర్దదౌ క్షీరోదసన్నిదౌ || విభాండకో దదౌ మేరావృష్యశృంగాయ ధీమతే || 55 శివః కాణాదమునయే గౌతమాయ దదౌమునే | సూర్యశ్చ యాజ్ఞవల్క్వాయ తథా కత్యాయనాయ చ || 56 శేషః పాణినయే చైవ భారద్వాజాయ ధీమతే | దదౌ శాకటనాయ సుతే బలి సంసది || 57 చతుర్లక్షజపేనైన మంత్ర సిద్ధిర్భవేన్నృణాం | యది స్యాత్సిద్ధమంత్రో హి బృహస్పతి సమో భ##వేత్ || 58 విద్యారంభకాలమున, మాఘశుద్ధ పంచమినాడు ఇష్టదేవతయగు నీమెను ఎవరు పూజింతురో వారికి ప్రతిదినము శుభములే కలుగుచుండును. లక్ష్మీ బీజమైన ''శ్రీం'' మాయాదేవి బీజాక్షరమైన ''హ్రీం'' ముందు కల ''శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా'' అను వైదికమైన అష్టాక్షరమంత్రము చాలా శ్రేష్ఠమైనది. ఈ మూల మంత్రము అందరకు ఉపయోగించునది. కల్పవృక్షము వంటిది. ఈ మూలమంత్రమును దయగల నారాయణుడు వాల్మీకికి ఈ భారతమున గంగాతీరమున ఉపదేశించెను. భృగువు పుష్కరక్షేత్రమున సూర్యగ్రహణ సమయమున శుక్రునకు ఉపదేశించగా, మారీచ మహర్షి అదే పుష్కరక్షేత్రమున చంద్రగ్రహణ సమయమున బృహస్పతికి ఉపదేశము చేసెను. బ్రహ్మదేవుడీ మంత్రమును బదరికాశ్రమమున భృగుమహర్షికి ఉపదేశించెను. జరత్కారు మహర్షి తన పుత్రడగు ఆస్తీక మహర్షికి క్షీరసముద్ర సమీపమున దీనిని ఉపదేశించెను. అట్లే విభాండకమహర్షి మేరు పర్వతమున తన పుత్రుడగు ఋష్యంశృంగునకు ఉపదేశము చేయగా శివుడు కాణాదమహర్షికి గౌతమ మునికి ఈ మంత్రమును ఉపదేశించెను. అదేవిధముగా సూర్యడు యాజ్ఞవల్క్యమహర్షికి కాత్యాయనునకు ఉపదేశించెను. శేషుడు పాణిని మహర్షికి, భారద్వాజ మహర్షికి, శాకటాయనునకు పాతాళమున ఈ మంత్రోపదేశము చేసెను. ఈ మూలమంత్రమును నాల్గు లక్షలు జపించినచో మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్ర సిద్ధినందిన వ్యక్తి బుద్ధిలో బృహస్పతితో సమానమైన వాడగును. కవచం శ్రుణు విపేంద్ర యద్దత్తం విధినా పురా | విశ్వశ్రేష్ఠం విశ్వజయం భృగవే గంధమాదనే || 59 ప్రపంచమున సర్వశ్రేష్ఠమైనది. సమస్త జయముల కల్గించునది యగు సరస్వతీ కవచమును బ్రహ్మదేవుడు పూర్వమున గంధమాదవ పర్వతమున భృగుమహర్షికి ఉపదేశించెను. భృగురువాచ - భృగుమహర్షి ఇట్లు పలికెను - బ్రహ్మన్ బ్రహ్మ విదాంశ్రేష్ఠ బ్రహ్మజ్ఞాన విశారద | సర్వజ్ఞ సర్వ జనక సర్వ పూజక పూజిత || 60 సరస్వతాశ్చ కవచం బ్రూహి విశ్వజయం ప్రభో | ఆయాతయామ మంత్రాణాం సమూహో యత్రసంయుతః || 61 బ్రహ్మజ్ఞాన వంతులలో శ్రేష్ఠమైనవాడు, గొప్పని బ్రహ్మ జ్ఞానము కలవాడు, సర్వజ్ఞుడు, సమస్తమునకు కారణమైనవాడు, సమస్తపూజ్యులచే పూజింపవడిన ఓ బ్రహ్మదేవుడా! విశ్వజయమునిచ్చు సరస్వతీ కవచమును తెల్పుము. ఈ కవచము సమస్త మంత్రసారమైనది, పరమశ్రేష్టమైనది. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను - శ్రుణువత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదం | శ్రుతిసారం శ్రుతిసుఖం శ్రుత్యక్తం శ్రుతి పూజితం || 62 ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం బృందావనే వనే | రాసేశ్వరేణ విభూనా రాసేవై రాజమండలే || 63 అతీవ గోపనీయం చ కల్పవృక్షసమం పరం | అశ్రుతాద్భుత మంత్రాణాం సమూహైశ్చ సమన్వితం || 64 యద్ధృత్వా పఠనాద్బ్రహ్మన్ బుద్ధిమాంశ్చ బృహస్పతిః | యద్ధృత్వా భగవాన్ శుక్రః సర్వదైత్యేషు పూజితః || 65 పఠనాద్ధారణాద్వాగ్నీ కవీంద్రో వాల్మికీ మునిః | స్వాయంభువో మనుశ్చైవ యద్ధృత్వా సర్వ పూజితః || 66 కణాదో గౌతమః కణ్వః పాణినిః శాకటాయనః | గ్రంథః చకార యద్ధృత్వా దక్షః కాత్యాయనః స్వయం || 67 ధృత్వావేదవిభాగం చ పురాణాన్యఖిలాని చ | చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయనః స్వయం || 68 శాతాతపశ్చ సంవర్తో వసిష్టశ్చ పరాశరః | యద్ధృత్వా పఠనాద్గ్రంథం యాజ్ఞవల్క్యశ్చకార సః || 69 ఋష్యశృంగో భరద్వాజశ్చాస్తీకో దేవలస్తథా | జైగీషవ్యోzథజాబాలి యద్ధృత్వా సర్వపూజితః || 70 కవచస్యాస్య విప్రేంద్ర ఋషిరేష ప్రజాపతిః | స్వయం బృహస్పతిశ్ఛందో దేవోరాసేశ్వరః ప్రభుః || 71 సర్వతత్వ పరిజ్ఞానే సర్వార్థేzపి చ సాధనే | కవితాసు చ సర్వాసు వినియోగః ప్రకీర్తితః || 72 వత్స! భృగుమహర్షీ! సమస్త కోరికలను తీర్చు సరస్వతీ కవచమును వినుము. ఇది వేదసారమైనది. వేదములలో చెప్పబడినది. వేదముల చేత పూజింపబడినది. చెవులకింపైనది. దీనిని రాసేశ్వరుడైన శ్రీకృష్ణపరమాత్మ గోలోకమునందున్న బృందావనములో నాకు చెప్పెను. ఇది కల్పవృక్షమువలె అన్ని కోర్కెలను తీర్చును. ఎన్నడు వినని అద్భుతమంత్ర సమూహములతో కూడుకున్నది. పరమరహస్యమైనది. ఈ కవచమును జపించి, ధరించి బృహస్పతి బుద్ధిమంతుడయ్యెను. శుక్రుడు సమస్త దైత్య దానవులకు గురువయ్యెను. వాల్మికిముని కవిశ్రేష్ఠుడయ్యెను. స్వాయంభువ మనువు సర్వపూజ్యుడయ్యెను, కణాదుడు, గౌతముడు, కణ్వుడు, పాణిని, శాకటాయనుడు, కాత్యాయనుడు శాస్త్రముల రచించిరి. కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడు వేదములను విభజించి సమస్త పురాణములు రచించెను. శాతాతపుడు సంవర్తుడు, వసిష్ఠుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు ధర్మగ్రంథములను రచించిరి, ఋష్యశృంగుడు, భరద్వాజముని, ఆస్తీకమహర్షి, దేవలుడు, జైగీషవ్యుడు, జాబాలి మహర్షి అందరిచే గౌరవించబడుచున్నారు. ఈ సరస్వతీ కవచమును బ్రహ్మదేవుడు ఋషి. బృహస్పతి ఛందస్సు. రాసేశ్వరుడైన శ్రీ కృష్ణపరమాత్మ దేవత. సర్వతత్వముల తెలిసికొనుటలో, సమస్తకార్యముల సాధించుటలో సాధించుటలో సమస్త కవిత్వ సిద్ధిలో దీనికి వినియోగము కలదు. ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరేమే పాతు పర్వతః | శ్రీ వాగ్దేవతాయై స్వాహా ఫాలంమే సర్వదాzవతు|| 73 ఓం సరస్వత్యైస్వాహేతి శ్రోత్రం పాతు నిరంతరం | ఓం శ్రీం హ్రీం భారత్యై స్వాహా నేత్రయుగ్మం సదాzవతు|| 74 ఓ హ్రీం వాగ్వాదిన్యైస్వాహా నాసాంమే సర్వతోzవతు | హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యైస్వాహా శ్రోత్రం సదాzవతు || 75 ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యైస్వాహేతి దంతపంక్తీః సదాzవతు | ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాzవతు || 76 ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధం మే శ్రీం సదాzవతు | శ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వహా వక్షః సదాzవతు || 77 ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా మే పాతు నాభికం | ఓం హ్రీం హ్రీం వాణ్యౖస్వాహేతి మమ పృష్ఠంసదాzవతు || 78 ఓం సర్వ వర్ణాత్మికాయై పాదయుగ్మం సదాzవతు | ఓం రాగాధిష్ఠాతృదేవ్యై సర్వాంగం మే సదాzవతు ||79 ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదాzవతు | ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా zగ్నిదిశి రక్షతు ||80 ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా | సతతం మంత్రరాజోzయం దక్షిణమే సదాzవతు || 81 ఓం శ్రీం హ్రీం త్ర్యక్షరోమంత్రో నైఋత్యాం మే సదాzవతు | కవి జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణzవతు || 82 ఓం సదంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాzవతు | ఓం గద్యపద్యవాసిన్యై స్వాహా మాముత్తరేzవతు || 83 ఓం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదాzవతు | ఓం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదాzవతు || 84 ఐం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాzధోమాం సదాzవతు | ఓం గ్రంథబీజరూపాయై స్వాహా మాం సర్వతోzవతు || ద్వితీయ ఖండము - 4వ అధ్యయముద్వితీయ ఖండము - 4వ అద్యాము 85 ఇతి థే కథితం విప్ర సర్వమాంత్రౌఘ విగ్రహం | ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం || 86 ''ఓం హ్రీం సరస్వత్యై స్వాహా' అనుమంత్రము నా శిరస్సునంతయు దక్షించుగా ''శ్రీవాగ్దేవతాయై స్వాహా'' అనునది నా నొసటిని రక్షించుగాక. ''ఓం హీం సరస్వత్యై స్వాహా'' అనునది నా చెవులనెల్లప్పుడు రక్షించుగాక ''ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా '' అనునది నా నాసిక నంతట రక్షించుగాక. ''హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా'' అను మంత్రము నా చెవులనెల్లపుడు రక్షించుగాక. ''ఐం'' అను ఏకాక్షరమంత్రము నాకంఠమునెల్లప్పుడు రక్షించుగాక. ''ఓం శ్రీ హిం'' అనునది నామెడను, ''శ్రీం'' అనునది నాస్కంధముల రక్షించుగాక. ''శ్రీం విద్యాధిష్ఠాతృ దేవ్యై స్వాహా'' అనునది నావక్షమునెల్లప్పుడు రక్షించుగాక. ''ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా'' అనునది నానాభిని ఎల్లప్పుడు రక్షించుగాక. ''ఓం హ్రీం హ్రీం వాణ్యౖస్వాహా'' అనునది నా పృష్ఠమును ఎల్లప్పుడు రక్షించుగాక. ''ఓం సర్వ వర్ణాత్మికాయై'' అనునది నా పాదములనెల్లప్పుడు రక్షించుగాక. ''ఓం రాగాధిష్ఠాతృదేవ్యై'' అను మంత్రము నా సమస్తావయములను రక్షించుగాక. ''ఓం సర్వ కంఠవాసిన్యై స్వాహా'' అనునది నా తూర్పుదిక్కును ఎల్లప్పుడు రక్షించుగాక. ''ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా'' అను మంత్రము నా ఆగ్నేయదిశను రక్షించుగాక. ''ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధ జనన్యై స్వాహా'' అను మంత్రరాజము నాకు దక్షిణ దిక్కును ఎల్లప్పుడు రక్షించుగాక. ''ఓం శ్రీం హ్రీం'' అను మూడక్షరాల మంత్రము నా నైఋతి దిక్కును రక్షించుగాక. ''కవి జిహ్వాగ వాసిన్యై స్వాహా'' అను మంత్రము నా పశ్చిమ దిక్కును రక్షించుగాక. ''ఓం సదంబికాయై స్వాహా'' అనునది నా వాయవ్య దిక్కును రక్షించుగాక. ''ఓం గద్య పద్యవాసిన్యై స్వాహా'' అనునది నా ఉత్తర దిక్కుని రక్షించుగాక. ''ఓం సర్వ శాస్త్రవాసిన్యై స్వాహా'' అనునది నా ఈశాన్య దిక్కును రక్షించుగాక. ''ఓం సర్వ పూజితాయై స్వాహా'' అను మంత్రము నా ఊర్ద్వ దిక్కును రక్షించుగాక. ''ఓం హ్రీం పుస్తక వాసిన్యై స్వాహా'' అను మంత్రము నాఅధో దిక్కును రక్షించుగాక. ''ఓం గ్రంథ బీజరూపాయై స్వాహా'' అనుమంత్రము నన్ను అన్ని వైపులనుండి రక్షించుగాక. ఈ విధముగా సర్వమంత్ర సారమైన విశ్వజయమును ఈ సరస్వతీ కవచమును నీకు తెల్పితిని. పురాశ్రుతం ధర్మ వక్త్రాత్పర్వతే గంధమాదనే | తవస్నేహాన్మయాzఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్ || 87 గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకార చందనైః | ప్రణమ్య దుండవద్భూమౌ కవచం ధారయేత్పుధీః || 88 పంచలక్షజపేనైవ సిద్ధంతు కవచం భ##వేత్ | యదిస్యాత్సిద్ధకవచో బృహస్పతి సమో భ##వేత్ || 89 మహావాగ్మీ కవీంద్రశ్చ త్రైలోక్య విజయీభ##వేత్ | శక్నోతి సర్వం జేతుం స కవచస్య ప్రభావతః || 90 ఇదం తే కాణ్వశాఖోక్తం కథితం కవచం మునే | స్తోత్రం పూజావిధానం చ ధ్యానంవై వందనం తథా || 91 ఈ సరస్వతీదేవి కవచమును ధర్ముని నుండి గంధమాదన పర్వతమున ఉపదేశము పొందితిని. నీపైగల స్నేహమువలన నీకిది తెల్పితిని. దీనిని అనర్హుడైనవానికి చెప్పవద్దు. ఈ కవచమంత్రమును ఉపదేశించు గురువును శాస్త్రపద్ధతిగా వస్త్రాలంకార చందనములచే గౌరవించి సాష్టాంగనమస్కారము చేసి ఈ కవచమును పత్రమున వ్రాసి దానినొక భరిణలో నుంచుకొని దానిని తనకుడిచేతికైనను లేక మేడలోనైనను ధరించవలెను. ఈ కవచమును ఐదు లక్షలమార్లు జపించిననది సిద్ధి పొందును. ఆవిధముగా సిద్ధిపొందినచో అతడు బృహస్పతి వంటి వాడగును. చక్కగా మాటాడగలుగును. కవీంద్రుడగును. ఈకవచము యొక్క ప్రభావమువలన అంతటా జయమును పొందును. కాణ్వశాఖయందు చెప్పబడిన ఈ సరస్వతీ దేవి కవచమును, స్త్రోత్రమును, పూజావిధానమును, ధ్యానమును వందనమును అన్నిటిని నీకు చెప్పితిని. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణ సంవాదే సరస్వతీకవచం నామ చతుర్థోzధ్యాయః || శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారదనారాయణ సంవాదమున సరస్వతీ కవచమను నాల్గవ అధ్యాయము సమాప్తము.