sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షష్ఠో
నారాయణ ఉవాచ - నారాయణు డిట్లనెను -
సరస్వతీ సా వైకుంఠే స్వయం నారాయణాంతికే | గంగాశాపేన కళయా కలహాద్భారతే సరిత్ || 1
పుణ్యదా పుణ్యజననీ పుణ్య తీర్థ స్వరూపిణీ | పుణ్యవద్భిర్నిషేవ్యా చ స్థితిః పుణ్యవతాం మునే || 2
తపస్వినాం తపోరూపా తపస్యాకారరూపిణీ | కృతపాపేధ్మ దాహాయ జ్వలదగ్ని స్వరూపిణీ || 3
జ్ఞానే సరస్వతీ తోయే గతం యైర్మనవైర్భువి | తేషాం స్థితిశ్చ వైకుంఠే సుచిరం హరిసంసది || 4
భారతే కృతపాపశ్చ స్నాత్వా తత్రైవ లీలయా | ముచ్యతే సర్వ పాపభ్యో విష్ణులోకే వసేచ్చిరం || 5
చతుర్దశ్యాం పౌర్ణమాస్యామక్షయా యాం దినక్షయే | గ్రహణ చ వ్యతీపాతేzsన్యస్మన్పుణ్య దినేzపి చ || 6
అనుషంగేణ యః స్నాతి హేలయా శ్రద్ధయాzపివా | సారూప్యం లభ##తే నూనం వైకుంఠే స హరే రపి || 7
సరస్వతీమంత్రకం చ మాసమేకంతు యోజపేత్ | మహామూర్ఖః కవీంద్రశ్చ సభ##వేన్నాత్ర సంశయః || 8
నిత్యం సరస్వతీ తోయే యః స్నాత్వా ముండయేన్నరః | న గర్భవాసం కురుతే పునరేవ స మానవః || 9
ఇత్యేవం కథితం కించిద్భారతీ గుణ కీర్తనం | సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 10
వైకుంఠములో నారాయణుని సమీపమున నిత్యము నివసించు సరస్వతీదేవి గంగాదేవి యొక్క శాపమువలన తన అంశతో ఈ భారత వర్షమున నదీ రూపమున అవతరించినది. ఆ సరస్వతీ నది పుణ్యములను కల్గించును. పుణ్యతీర్థముల స్వరూపిణి. పుణ్యవంతులచే సేవించబడుచున్నది. తాపసుల యొక్క తపఃఫలస్వరూపిణి. తపోరూపిణి. చేసిన పాపములనన్నిటిని సమూలముగా నాశనము చేయును. ఈ సరస్వతీ నది యొక్క నీటిలో స్నానము చేయువారు ఎల్లప్పుడు వైకుంఠమున శ్రీహరి సమీపమున ఉందురు. వారి సర్వపాపములన్నియు నశించును. చతుర్దశినాడు, పూర్ణిమనాడు, అక్షయ తదియానడు, సాయంకాల సమయమున, గ్రహణ సమయమున, వ్యతీపాతకాలమున, ఇతర పుణ్య దినములలో శ్రధ్ధతో స్నానము చేసినను, శ్రద్ధలేకుండ స్నానము చేసినను వైకుంఠమున శ్రీహరి సారూప్యమును తప్పక పొందుదురు.
సరస్వతీ మంత్రమును ఒకనెల నిష్ఠతో జపించినచో మిక్కిలి మూర్ఖుడైనను మహావిద్వాంసుడు కాగలడు. అట్లే సరస్వతీ నదీ జలమున ప్రతిదినమున ప్రతి దినము స్నానము చేయు మానవులకు పునర్జన్మ అనునది ఉండదు.
ఈ విధముగా సుఖమును, మోక్షము నిచ్చు భారతీదేవి స్తోత్రమును తెలిపితిని. ఇంకను చెప్పవలసినదేమైన ఉన్నచో అడుగుము అని నారాయణ ముని పలికెను.
సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను -
నారాయణ వచః శ్రుత్వా నారదో మునిసత్తమః | పునః పప్రచ్ఛ సందేహచ్ఛేదం శౌనక సత్వరం || 11
ఓ శౌనక మహర్షీ ! నారదముని నారాయణుని మాటలు విని తిరిగి సందేహము తొలగించు కొనుటకు ఈ విధముగా అడిగెను.
కథం సరస్వతీదేవీ గంగా శాపేన భారతే | కళయా కలహేనైవ సమభూత్పుణ్యదా సరిత్ || 12
శ్రవణ శ్రుతి సారాణాం వర్ధతే కౌతుకం మమ | కథామృతానాం నో తృప్తిః కేన శ్రేయసి తృప్యతే || 13
కథం శశాప సా గంగా పూజితాం తాం సరస్వతీం | శాంతా సత్యస్వరూపా చ పుణ్యదా సర్వదా నృణాం || 14
తేజస్విన్యోర్ధ్వయోర్వాదకరణం శ్రుతి సుందరం | సదుర్లభం పురాణషు తన్మే వ్యాఖ్యాతుమర్హసి || 15
గంగా సరస్వతీ దేవతలకెందుకు కలహమేర్పడినది. ఆ కలహమున సరస్వతీదేవి పుణ్యప్రదమైన నదిగా ఎందుకు మారినది?
వేదసారములైన కథలను వినవలెనని ఉన్నది. వాటిని ఎన్ని మార్లు విన్నను తృప్తి కలుగదు. మంచివాటి విషయములలో తృప్తి ఎన్నడును కలుగదుకదా.
సత్యగుణస్వరూప, మానవులకెప్పుడను పుణ్యమను కలిగించునది, శాంతురాలైన గంగ పూజ్యురాలైన సరస్వతినెందుకు శపించినది? ఈ వృత్తాంతము పురాణములలో ఎచ్చట కన్పడదు. ఈ విషయమును సమగ్రముగా వివరించుడు.
నారాయణ ఉవాచ - నారదుడిట్లడిగెను -
శ్రుణు నారద వక్ష్యామి కథామేతాం పురాతనీం | యస్యాః స్మరణమాత్రేణ సర్వపాపాత్ర్పముచ్యతే || 16
లక్ష్మీస్సరస్వతీ గంగా తిస్రోభార్యా హరేరపి | ప్రేవ్ణూ సమాస్తాస్తిష్ఠంతి సతతం హరిసన్నిధౌ || 17
చకార సైకదా గంగా విష్ణోర్ముఖ నిరీక్షణం | సస్మితా చ సకామా చ సకటాక్షం పునః పునః || 18
విభుర్జహాస తద్వక్త్రం నిరీక్ష్య చ ముదా క్షణం | క్షమాం చకార తద్దృష్ట్వా లక్ష్మీర్నైవ సరస్వతీ || 19
బోధయమాస తాం పద్మా సత్వరూపాచ సస్మితా | క్రోధావిష్టా చ సా వాణీ న చ శాంతా బభూవ హ || 20
ఉవాచ గంగాం భర్తారం రక్తాస్యా రక్తలోచనా | కంపితా కోపవేగేన శశ్వత్ ప్రస్ఫురితాధరా || 21
నారద! స్మరించినంత మాత్రమున అన్ని పాపముల తొలగించు ప్రాచీనమైన ఈ కథను చెప్పెదను.
శ్రీహరికి లక్ష్మి, గంగ, సరస్వతి అను భార్యలు ముగ్గురు కలరు. వారు శ్రీహరి సన్నిధిలో అన్యోన్యముగా ప్రేమతో ఉందురు. ఒకనాడు గంగాదేవి విష్ణువును కామముతో చిరునవ్వుతో చూచెను. అప్పుడు విష్ణువు కూడా ఆమె ముఖమును చూచి నవ్వెను. దీనిని చూచి లక్ష్మీదేవి సహించినను, సరస్వతీదేవి మాత్రము ఓర్చుకొలేకపోయెను. సత్వస్వరూపిణియగు లక్ష్మీదేవి సరస్వతీ దేవికి నచ్చ చెప్పినను వాణి క్రోధావిష్టురాలై శాంతిని మాత్రము పొందలేదు. ఆ విధముగా ఎఱ్ఱనైన ముఖముతో, ఎరుపెక్కిన కళ్ళతో కోపముతో వణుకుచున్న పెదవులతో, కంపించుచుండెను.
సరస్వత్యువాచ - సరస్వతీ దేవి ఇట్లనెను -
సర్వత్ర సమతా బుద్ధిః సద్భర్తుః కామినీః ప్రతి | ధర్మిష్ఠస్య వరిష్ఠస్య విపరీతా ఖలస్య చ || 22
జ్ఞాతం సౌభాగ్యమధికం గంగాయాం తే గదాధర | కమలాయం చ తత్త్యుల్యం న చ కించిన్మయి ప్రభో || 23
గంగాయాః పద్మయా సార్థం ప్రీతిశ్చాపి సుసమ్మతా |క క్షమాంచకార తేనేదం విపరీతం హరిప్రియా || 24
కింజీవనేన మేzత్రైవ దుర్భగాయాశ్చ సాంప్రతం | నిష్ఫలం జీవనం తస్యా యా పత్యుః ప్రేమవంచితా || 25
త్వా సర్వేశం సత్వరూపం యేవదంతి మనీషిణః | తే చ మూర్ఖా న వేదజ్ఞాః న జానంతి మతిం తవ || 26
సరస్వతీవచః శ్రుత్వా దృష్ట్యా తాం కోపసంయుతాం | మనసాతు సమాలోచ్య స జగామ బహిః సభాం || 27
మంచి భర్త తన భార్యలందరిపై సమాన భావము కలిగియుండును. భర్త దుష్టుడైనచో దీనికి విపరీతముగా ఎవరినో ఒకరిని ఎక్కువగా ప్రేమించుచుండును. ఓగదాధరుడవైన నారాయణ! నీ చేష్టలవలన నీకు గంగపై మిక్కిలి ప్రేమ ఉన్నట్లు కమలయైన లక్ష్మీదేవిపై కూడా ప్రేమ ఉన్నట్లు తెలియుచున్నది. అట్లే నీకు నాపై ప్రేమలేదు. గంగకు పద్మకు ఇద్దరిమధ్య సఖ్యమున్నట్లున్నది. అందువలననే గంగాదేవి యొక్క ప్రవర్తనను లక్ష్మీదేవి అనుమతించినది. అందువలన నేను బ్రతికి ప్రయోజనము లేదు.
భగవాన్! నిన్ను విద్వాంసులు సర్వేశ్వరుడని, సత్యస్వరూపుడని అందురు. కాని నా దృష్టిలో వారు మూర్ఖులు. వేదార్థమెరుగని వారు. నీ మనోభావములను గుర్తించనివారు.
ఈ విధముగా కోపముతో మాట్లాడుచున్న సరస్వతీదేవి మాటలు విని నారాయణుడు మనస్సులో బాగుగా ఆలోచించి అక్కడినుండి బయటకు వెళ్ళిపోయెను.
గతే నారాయణ గంగామవోచన్నిర్భయం రుషా | రాగాధిష్ఠాతృ దేవీ సా వాక్యం శ్రవణ దుఃసహం || 28
హే నిర్లజ్జే సకామా త్వం స్వామిగర్వంకరోషి కిం | అధికం స్వామి సౌభాగ్యం విజ్ఞాపయితు మిచ్ఛసి || 29
మానహానిం కరిష్యామి తవాద్య హరిసన్నిధౌ | కిం కరిష్యతి తే కాంతో మమ వై కాంత వల్లభే || 30
ఇత్యేవ ముక్త్వా గంగా యాజిఘృక్షుం కేశముద్యతాం | వారయమాస తాం పద్మా మధ్యదేశస్థితా సతీ || 31
శశాప వాణీ తాం పద్మాం మహాకోపవతీ సతీ | వృక్షరూపా సరిద్రూపా భవిష్యసి న సంశయః || 32
విపరీతం యతో దృష్ట్వా కించిన్నో వక్తుమర్హసి | సంతిష్టసి సభామధ్యే యథావృక్షో యథా సరిత్ || 33
శాపం శ్రుత్వా చ సా దేవి న శశాప చుకోప న | తత్రైవ దుఃఖితా తస్థౌ వాణీం ధృత్వా కరేణ చ || 34
అత్యుద్ధతాం చ తాం దృష్ట్వా కోప ప్రస్ఫురితాననా | ఉవాచ గంగా తాం దేవీం పద్మాం పద్మ విలోచనా || 35
శ్రీమన్నారాయణుడు అక్కడినుండి వెళ్ళిపోయిన తరువాత సరస్వతీదేవి గంగను వినరానిమాటలతో ఇట్లనెను.
''ఓ సిగ్గులేనిదానా కాముకురాలవై స్వామి(భర్త) నావాడన్నట్లు గర్వంగా ప్రవర్తించుచు భ##ర్తే నిన్నే అధికముగా ప్రేమించునట్లు దానిని అందరకు తెలుపుటకు ప్రయత్నించుచున్నావు. శ్రీహరి సన్నిధిలోనే నీ గర్వమునడంతును. అప్పుడు నీప్రియుడేమి చేయునో చూచెదను.'' అని గంగాదేవి యొక్క వెంట్రుకలు పట్టుకొని లాగుటకు ప్రయత్నించుచున్న సరస్వతీదేవిని మధ్యలో ఉన్న లక్ష్మీదేవి నివారింపజూచెను.
అప్పుడు సరస్వతి లక్ష్మీదేవిని మిక్కిలి కోపముతో చూచి ఇక్కడ విపరీతమైన కార్యము జరుగుచున్నను వృక్షమువలె, నదివలె మాట్లాడక ఉన్నందువలన నీవు వృక్షముగా, నదిగా మారుమని శాపమును పెట్టెను.
సరస్వతీదేవి తనకు శాపమిచ్చినను లక్ష్మీదేవి కోపగించక దుఃఖముతో ఆ సరస్వతీదేవి చేతిని పట్టుకొని నిలుచుండెను.
సరస్వతీదేవి కోపముతో చాలా ఉద్ధతగానున్నట్లు భావించిన గంగ, లక్ష్మీదేవితో కోపముతో ఈ విధముగా అనెను.
గంగోవాచ - గంగాదేవి ఇట్లనెను -
త్వముత్సృజ మహోగ్రాం తాం పద్మే కిం మే కరిష్యతి | వాగ్దుష్టా వాగధిష్టాత్రీ దేవీయం కలహప్రియా || 36
యావతీ యోగ్య తాస్యాశ్చ యావతీ శక్తిరేవ వా | తథా కరోతు వాదం చ మయాసార్థం సుదుర్ముఖా || 37
స్వబలం యన్మమబలం విజ్ఞాపయితుమర్హతు | జానంతు సర్వేzప్యుభయోః ప్రభావం విక్రమం సతి || 38
ఇత్యేవ ముక్త్వా సా దేవీ వాణ్యౖ శాపం దదావితి | సరిత్స్వరూపా భవతు సా యా త్వామశపద్రుషా || 39
అధోమర్త్యం సా ప్రయాతు సంతి యత్రైవ పాపినః | కలౌ తేషాం చ పాపాంశం లభిష్యతి న సంశయః || 40
ఓ లక్ష్మీదేవి చాలా కోపముతోనున్న ఈ సరస్వతిని వదిలిపెట్టుము. ఈమె వాక్కులకు అధిష్ఠాన దేవతయైనప్పటికిని, మంచి మాటలు మాట్లాడునది కాదు. కలహములు పెట్టుకొను స్వభావము కలది. ఆమెకు యోగ్యత ఎంతవరకున్నదో ఆమె శక్తికూడా అంతనే ఉన్నది. ఆమె నాతోటి మాత్రమే వాదు పెట్టుకొననిమ్ము. ఇద్దరి బలము ప్రభావము అందరికి తెలియును' అని గంగాదేవి సరస్వతీ దేవికి ఈ విధముగా శాపమునిచ్చెను.
సరస్వతీ దేవీ! నీవు కూడా నదిగా మారి భూలోకమునకు వెళ్ళుము. పాపులున్న ప్రాంతమున ప్రవహించుట వలన వారి పాపములలో కొంత భాగము నీకు తప్పక లభించగలదు.
ఇత్యేవం వనచం శ్రుత్వా తాం శశాప సరస్వతీ | త్వమేవ యాస్యసి మహీం పాపిపాపం లభిష్యసి || 41
గంగాదేవి మాటలు విని సరస్వతి కోపముతో ''నీవే భూలోకమునకు వెళ్ళి అచ్చటి పాపాత్ముల పాపమును పొందెద''వని గంగను శపించెను.
ఏతస్మిన్నంతరే తత్ర భగవానాజగామ హ | చతుర్భుజశ్చతుర్భిశ్చ పార్షదైశ్చ చతుర్భుజైః || 42
సరస్వతీం కరే ధృత్వా వాసయామాస వక్షసి | బోధయామాస సర్వజ్ఞః సర్వజ్ఞానం పురాతనం || 43
శ్రుత్వా రమస్యం తాసాం చ శాపస్య కలహస్యచ | ఉవాచ దుఃఖితాస్తాశ్చ వాక్యం సామయికం విభుః || 44
అప్పుడు చతుర్భుజుడైన నారాయణుడు, చతుర్భుజులైన తన సహచరులతో అక్కడకు వచ్చెను. అతడు సరస్వతీదేవి చేయిపట్టుకొని ఆమెను తన రొమ్మునకు చేర్చుకొని వారి కలహ కారణమును, శాపమును తెలుసుకొని సమయానుకూలమైన మాటలతో వారితో ఇట్లనెను.
శ్రీభగవానువాచ- భగవంతుడైన నారాయణు డిట్లనెను-
లక్ష్మి త్వం కళయా గచ్ఛ ధర్మధ్వజగృహం 'శుభే | అయేనిసంభవా భూమౌ తస్య కన్యా భవిష్యసి || 45
తత్రైవ దైవదోషేణ వృక్షత్వం చ లభిష్యసి | మదంశస్యాసురసై#్యవ శంకచూడస్య కామినీ || 46
భూత్వా పశ్చాచ్ఛ మత్పత్నీ భవిష్యసి న సంశయః | త్రైలోక్యపావనీ నామ్నా తులసీతి చ భారతే || 47
కళయా చ సరిద్భూత్వా శీఘ్రం గచ్ఛ వరాననే | భారతం భారతీశాపాన్నామ్నా పద్మావతీ భవ || 48
గంగే యాస్యసి చాంశేన పశ్చాత్త్యం విశ్వపావనీ | భారతం భారతీశాపాత్పాపదాహాయ దేహీనాం || 49
భగీరథస్య తపసా తేన నీతా సుదుష్కరాత్ | నామ్నా భాగీరథీ పూతా భవిష్యసి మహీతలే || 50
మదంశస్య సముద్రస్య జాయా జాయే మమాజ్ఞయా | మత్కలాంశస్య భూపస్య శంతనోశ్చ సురేశ్వరి || 51
ఓలక్ష్మి! నీవు నీ అంశాంశరూపముతో అయోనిజవై ధర్మధ్వజుడను మహారాజునకు కూతురుగా పుట్టి దైవాపచారము వలన వృక్షముగా తులసియను పేరుతో ముల్లోకములను పవిత్రము చేయగలవు. అట్లే నీ అంశవలన పుట్టిన శంఖ చూడుడను రాక్షసునకు భార్యవై కొంతకాలమునకు మరల నాకు భార్యకు కాగలవు. అదే విధముగా నీవు ఈ భరతఖండమున పద్మావతి యనుపేర నదిగా మారగలవు.
ఓగంగ! నీవుకూడా నీ అంశస్వరూపముతో ఈ భరత ఖండమున ముల్లోకములను పవిత్రము చేయు పాపాత్ముల పాపములను ధ్వంసము చేయునదిగా మారగలవు. భగీరథుడను రాజర్షి చేసిన అఖండ తపస్సువలన భాగీరథిగా భూలోకమునకు వచ్చి నా అంశస్వరూపుడైన సముద్రునికి, నా అంశాంశరూపుడైన శంతను మహారాజునకు భార్యవుకాగలవు.
గంగాశాపేన కళయా భారతం గచ్ఛ భారతి | కలహస్య ఫలం భుంక్ష్య సపత్నీభ్యాం సహాzచ్యుతే || 52
స్వయం చ బ్రహ్మసదనం బ్రహ్మణః కామినీ భవ | గంగా యాతు శిస్థానమత్ర పద్మైవ తిష్ఠతు || 53
శాంతా చ క్రోధరహితా మద్భక్తా మత్స్వరూపిణీ | మహాసాధ్వీ మహాభాగా సుశీలా ధర్మచారిణీ || 54
యదంశకళయా సర్వా ధర్మిష్టాశ్చ పతివ్రతాః | శాంతరూపాః సుశీలాశ్చ ప్రతివిశ్వేషు యోషితః || 55
తిస్రో భార్యాః త్రయఃశ్యాలాః త్రయోభృత్యాశ్చ బాంధవాః | ధ్రువం వేదవిరుద్ధాశ్చ న హ్యేతే మంగళప్రదాః || 56
స్త్రీపుంవచ్చ గృహే యేషాం గృహిణాం స్త్రీవశః పుమాన్ | నిష్ఫలం జన్మ వై తేషామశుభం చ పదే పదే || 57
ముఖదుష్టా యోని దుష్టా యస్య స్త్రీ కలహప్రియా | అరణ్యం తేన గంతవ్యం మహారణ్యం గృహాద్వరం || 58
జలానాం చ స్థలానాంచ ఫలానాం ప్రాప్తిరేవచ | సతతం సులభా తత్రనతే షాం తద్గృహేzపి చ || 59
పరమగ్నౌస్థితిః హింస్ర జంతూనాం సన్నిధౌ సుఖం | తతోzపిదుఃఖం పుంసాంచ దుష్టస్రీసన్నిధౌ ధ్రువం || 60
వ్యాధిజ్వాలా విషజ్వాలా వరం పుంసాం వరాననే | దుష్టస్త్రీణాం ముఖజ్వాలా మరణాదతిరిచ్యతే || 61
పుంసశ్చ స్త్రీజితస్యేహ జీవితం నిష్పలం ధ్రువం | యదహ్నా కురుతే కర్మ న తస్యఫలభాగ్భవేత్ || 62
స నిందితోzత్ర సర్వత్ర పరత్ర నరకం వ్రజేత్ | యశః కీర్తివిహీనో యో జీవన్నపి మృతో హి సః || 63
బహ్వీనం చ సపత్నీనాం నైకత్ర శ్రేయసీ స్థితిః | ఏకభార్యః సుఖీ నైన బహుభార్యః కదాచన || 64
ఓ సరస్వతి! నీవు గంగాదేవి యొక్క శాపముననుసరించి భారతదేశమునకు వెళ్ళి, మీ కలహ ఫలమును నీ సవతులతో కలిసి అనుభవింపుము.
నీవు బ్రహ్మలోకమునకు పోయి బ్రహ్మదేవునకు భార్యగా కమ్ము. గంగాదేవి శివలోకమునకు పోవును.
శాంతురాలు, నాభక్తురాలు, మహాపతివ్రత, సుశీల, ధర్మచారిణి యగు లక్ష్మీదేవి నా దగ్గరనే ఉండును. ఆ లక్ష్మీదేవియొక్క అంశాశవలన జన్మించిన స్త్రీలందరు పరమ ధార్మికులు, పతివ్రతలు, సౌశీల్యవతులు శాంత స్వరూపలుగా నుందురు.
భిన్న మనస్తత్వం గలిగిన భార్యలు, భృత్యువులు, బంధువులుండుట వేదములకు విరుద్ధమైన విషయము. ఇటువంటి వారెన్నడును మేలును కలిగించరు. ఎవరి ఇంట స్త్రీ పురుషుని వలె ప్రవర్తించునో, ఏ పురుషుడు స్త్రీ వశ##మై యుండునో వారి జన్మ నిష్ఫలమగును. వారికి అడుగడుగునా కష్టములే దాపురించును. కలహములు పెట్టుకొను స్త్రీ, దుర్భాషలాడుస్త్రీ, వ్యభిచారి కలపురుషునకు ఇంటికంటె అడవిలో ఉండుటయే శ్రేష్ఠమైనది. అడవిలో నీరు, స్థలము, పండ్లు పుష్కలముగా సులభముగా లభించును గదా.
అగ్నిలో సైతముండవచ్చును. క్రూరజంతువుల సమీపముననైన ఉండవచ్చును. కాని దుష్టస్త్రీల సమీపములో ఉండలేము. దుష్టస్త్నీల ముఖజ్వాల కంటె (పరుషమైన మాటలకంటె) వ్యాధి జ్వాలమైనను, విషజ్వాలయైనను సులభ##మైనవే. స్త్రీకి సంపూర్ణముగా లొంగిన మానవుని జీవితము వ్యర్థమైనది. ఆతడు తాను చేసిన సత్కర్మల ఫలితముననుభవింపజాలడు. అతడు ఇహలోకమున నిందలు పొందుచు పరలోకమున నరకమును పొందును. కీర్తిలేని మానవుడు జీవించినను చనిపోయినవాడే అగును.
అనేక భార్యలు కలవాడు ఎన్నడు సుఖమనుభవింపలేడు. అందువలన ఒకే భార్య ఉండుట అన్ని విధముల శ్రేయస్కరమైనది.
గచ్ఛ గంగే శివస్థానం బ్రహ్మస్థానం సరస్వతి | అత్ర తిష్ఠతు మద్దేహే సుశీలా కమలాలయా || 65
సుసాధ్యా యస్య పత్నీ చ సుశీలా చ పతివ్రతా | ఇహ స్వర్గసుఖం తస్య ధర్మమోక్షౌ పరత్ర చ || 66
పతివ్రతా యస్యపత్నీ స చ ముక్తః శుచిః సుఖీ | జీవన్మృతోzశుచిర్ధుఃఖీ దుఃశీలాపతిరేవ యః || 67
ఇత్యుక్త్వా జగతాం నాథో విరరామ చ నారద |
ఓ గంగాదేవి! నీవు శివలోకమునకు పొమ్ము. సరస్వతి నీవు బ్రహ్మలోకమునకు పొమ్ము. సౌశీల్యవతియగు లక్ష్మీదేవి నా దేహముననే ఉండును.
సుశీలవతి పతివ్రతయగు భార్య కలవానికి ఇహలోకమున స్వర్గసౌఖ్యములు, పరలోకమున మోక్షము కలుగును. శీలవతికాని స్త్రీయొక్క భర్త దుఃఖములనను భవించును. అతడు బ్రదికియున్నను చచ్చినవానితో సమానము.
ఈ విధముగా జగన్నాయకుడైన నారాయణుడు లక్ష్మీ, గంగా సరస్వతులతో పలికి ఊరకుండెను.
అత్యుచ్చైరురుదర్దేవ్యః సమాలింగ్య పరస్పరం || 68
తాశ్చ సర్వాసమాలోచ్య క్రమేణోచుః సదీశ్వరం | కంపితాః సాశ్రునేత్రాశ్చ శోకేన చ భ##యేన చ || 69
శ్రీమన్నారాయణుని మాటలు విని లక్ష్మీ, గంగా, సరస్వతులు ఒకరి నొకరు కౌగిలించుకొని ఉచ్చై స్వరముతో ఏడ్చిరి. కొంతసేపైనా తరువాత వారందరు తమలో తామాలొచించుకొని, శోకభయములతో కన్నీళ్ళు కారగా కంపించుచు నారాయణునితో ఇట్లు పలికిరి.
సరస్వత్యువాచ - సరస్వతీ దేవి ఇట్లనెను -
ప్రాయశ్చిత్తం దేహి నాథ దుష్ఠాయాం జన్మ శోధకం | సత్ స్వామినా పరిత్యక్తాః కుత్ర జీవంతి కాః స్త్రియః || 70
దేహత్యాగం కరిష్యామి ధ్రువం యోగేన భారతే | అత్యున్నతో నిపతనం ప్రాప్తుమర్హతి నిశ్చితం || 71
భర్త వదలివేసినచో స్త్రీ లేవిధముగా బ్రతుకుదురు. అందువలన మా జన్మను పవిత్రము చేయు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుము. లేనిచో యోగము ద్వారా ఈశరీరమును వదిలివేతును. కానిచో ఎత్తైన శిఖిరము నుండి కిందపడియైనను దేహత్యాగమును చేయుదురు.
గంగోవాచ - గంగాదేవి ఇట్లనెను -
అహం కేనాపరాధేన త్వయాత్యక్తా జగత్పతే | దేహత్యాగం కరిష్యామి నిర్దోషా యా వధం లభ || 72
నిర్దోష కామినీ త్యాగం కురుతే యో జనో భ##వే | స యాతి నరకం కల్పం కిం తే సర్వేశ్వరస్య వా || 73
నేను ఏ తప్పువలన వదలివేయబడినానో తెలుపుము. లేనిచో నేను దేహత్యాగము చేయుదును. అందువలన నిర్దోషురాలిని చంపిన పాపమును నీవు పొందుదువు. తప్పులేని భార్యను వదలివేసినచో అతనికి కల్పకాలము నరకము సిద్ధించును. సర్వేశ్వరుడవగు నీకు దీనిని గురించి ప్రత్యేకముగా చెప్పవలసిన పనిలేదు.
లక్ష్మీరువాచ - లక్ష్మీదేవి ఇట్లనెను-
నాథ సత్వస్వరూపస్త్యం కోపః కథమహో తవ | ప్రసాదం కురు చాస్మభ్యం సదీశస్య క్షమా వరా || 74
భారతం భారతీశాపాద్యాస్యామి కళయా యది | కతికాలం స్థితిస్తత్ర కదా ద్రక్ష్యామి తే పదం || 75
దాస్యంతి పాపినః పాపం మహ్యం స్నానావగాహనాత్ | కేన తస్యద్విముక్తాz హమాగమిష్యామి తే పదం || 76
కళయా తులసీరూపా ధర్మధ్వజసుతా సతీ | బూత్వా కదా లభిష్యామి త్వత్సాదాంబుజమచ్యుత || 77
వృక్షరూపా భవిష్యామి తదధిష్ఠాతృదేవతా | మాముద్ధరిష్యసి కదా తన్మే బ్రూహి కృపానిధే || 78
గంగా సరస్వతీ శాపాద్యది యాస్యతి భారతం | శాపేన ముక్తా పాపాచ్చ కదా త్వాం వా లభిష్యతి || 79
గంగాశాపేన సా వాణీ యది యాస్యతి భారతం | కదా శాపాద్వినిర్ముచ్య లభిష్యతి పదం తవ || 80
ఇత్యుక్తా కమలా ద్వితీయ ఖండము - 6వ అద్యాయము - ద్వితీయ ఖండము - 6వ అధ్యాయమూంతపదం ధృత్వా ననామ చ | సుకేశైర్వేష్టయిత్వా చ రురోద చ పునః పునః || 82
హే నాథ! నీవు సత్వగుణ స్వరూపుడవు. నీకు కోపము ఎట్లు వచ్చును. నీవంటివానికి క్షమించేగుణము ఉండును. అందువలన మమ్ములనందరిని క్షమించుము.
సరస్వతీ దేవి శాపముననుసరించి నేను నా అంశస్వరూపముతో భారతదేశమునకు పోయినచో అక్కడ ఎంతకాలముందును? మరల నిన్ను ఎప్పుడు చూడగలను.?
నదీరూపమున నున్న నా నీటిలో పాపులు స్నానము చేసి తమ తమ పాపముల నాకిచ్చినచో ఆ పాపములనుండి నాకు విముక్తి ఏవిధముగా లభించును? అట్లే నా అంశవలన ధర్మధ్వజ మహారాజు పుత్రికమైన తులసిగా మారినచో తిరగి నీపరమ పదమునెప్పుడు చేరుకొగలను. తులసిగా వృక్షాధిష్ఠాన దేవతగా వృక్షరూపమున ఉండునన్ను ఎప్పడు పునరుద్ధరించగలవు? ఈవిషయమును దయాసముద్రుడవైన నీవు తెలుపగలవు.
సరస్వతీదేవి శాపముననుసరించి గంగా భారతదేశమునకు పోయినచో ఆమె సరస్వతీదేవి శాపమునుండి, పాపుల పాపముల నుండి ఎప్పుడు ముక్తి చెందును?
సరస్వతిని బ్రహ్మలోకమునకు పొమ్మని గంగను శివమందిరమునకు పొమ్మని అనిన నీ మాటలను ప్రస్తుతము క్షమించి వదిలివేయుము.
ఈ విధముగా లక్ష్మీదేవి తన భర్త పాదములను పట్టుకొని నమస్కరించుచు మాటిమాటికి ఏడ్చెను.
ఉవాచ పద్మనాభస్తాం ప్రభాం కృత్వా స్వవక్షసి | ఈషద్ధాసః ప్రసన్నాస్యః భక్తానుగ్రహకారకః || 83
భక్త జనముననుగ్రహించు నారాయణుడు ఆమెను తన అక్కున చేర్చుకొని చిరునవ్వుతో ఇట్లు పలికెను.
నారాయణ ఉవాచ - నారాయణుడిట్లనెను-
త్వద్వాక్యమాచరిష్యమి స్వవాక్యం చ సురేశ్వరి | సమతాం చ కరిష్యామి శ్రుణు తత్ర్కమమేవ చ || 84
భారతీ యాతు కళయా సరిద్రూపా చ భారతం | అర్ధాంశా బ్రహ్మసదనం స్వయం తిష్ఠతు మద్గృహే || 85
భగీరథేన నీతా సా గంగా యాస్యతి భారతం | పూతం కర్తుం త్రిభువనం స్వయం తిష్ఠతు మద్గృహే || 86
తత్రైవ చంద్రమౌళేశ్చ మౌళిం ప్రాప్య్యతి దుర్లభం | తతః స్వభావతః పూతాzప్యతిపూతా భవిష్యతి || 87
ఓ సురేశ్వరి, లక్ష్మీదేవి! నీ మాట, నామాట రెండు జరుగనట్లు చేయుదును. అదెట్లనగా సరస్వతీదేవి తన అంశాంశ స్వరూపమున నదీ రూపు వహించి భారత దేశమునకు వెళ్ళును. అట్లే ఆమె యొక్క అర్ధాంశ రూపము బ్రహ్మలోకమునకు పోవును. ఇక మిగిలిన అంశతో ఇచ్చటనే ఉండును.
గంగాదేవి భగీరధుని వలన ముల్లోకములను పవిత్రము చేయుటకు భారతదేశమునకు పోవును. అట్లే చంద్రశేఖరుడైన పరమశివుని శిరస్సుపై చేరి సహజముగా పవిత్రమైనదైనా అతి పవిత్రము కాగలదు.
కళాంశాంశేన గచ్ఛ త్వం భారతే కమలోద్భవే | పద్మావతీ సరిద్రూపా తులసీ వృక్షరూపిణీ ||88
కలేః పంచ సహస్రే చ గతే వర్షే చ మోక్షణం | యుష్మాకం సరితాం భూయో మద్గృహే చాగమిష్యథ || 89
సంపదాం హేతుభూతా చ విపత్తిః సర్వదేహినాం | వినా విపత్తేర్మహిమా కేషాం పద్మే భ##వేద్భవే || 90
మన్మంత్రోపాసకానాం చ సతాం స్నానావగాహనాత్ | యుష్మాకం మోక్షణం పాపాత్ పాపి స్పర్శన హేతుకాత్ || 91
పృథివ్యాం యాని తీర్థాని సంత్యసంఖ్యాని సుందరి | భవిష్యంతి చ పుతాని మద్భక్త స్పర్శ దర్శనాత్ || 92
మన్మంత్రోపాసకా భక్తా భ్రమంతే భారతే సతి | పూతం కర్తుం భారతం చ సుపవిత్రాం మసుంధరాం || 93
మద్భక్తా యత్ర తిష్ఠంతి పాదం ప్రక్షాళయంతి చ | తత్ స్థానం చ మహాతీర్థం సుపవిత్రం భ##వేద్ధ్రువం || 94
స్త్రీఘ్నో గోఘ్నః కృతఘ్నశ్చ బ్రహ్మఘ్నో గురుతల్పగః | జీవన్ముక్తో భ##వేత్పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 95
అసిజీవి మషీజీవీ ధానకః శూద్రయాజకః | వృషవాహో భ##వేత్పతో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 96
విశ్వాసఘాతీ మిత్రఘ్నో మిథ్యాసాక్ష్యప్రదాయకః | న్యాసహారీ భ##వేత్పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 97
ఋణగ్రస్తో వార్దుషికో జారజః పుంశ్చలీ పతిః | పూతశ్చ పుంశ్చలి పుత్రో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 98
శూద్రానాం సూపకారశ్చ దేవలో గ్రామయాజకః | అదీక్షితో భ##వేత్పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 99
అశ్వత్థఘాతకశ్చైవ మద్భక్తానాం చ నిందకః | అనివేదిత భోజీ చ పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 100
మాతరం పితరం భార్యాం భ్రాతరం తనయం సుతాం | గురోఃకులం చ భగినీం వంశహీనం చ బాంధవం || 101
శ్వశ్రూం చ శ్వశురం చైవ యో న పుష్ణాతి నారద | సమహాపాతకీ పూతో మద్భక్త స్పర్శ దర్శనాత్ || 102
దేవద్రవ్యాపహారీచ విప్రద్రవ్యాపహారకః | లక్షాలోహ రసానాం చ విక్రేతా దుహితుస్థతా || 103
మహాపాతకీనశ్చైతే శూద్రాణాం శవదాహకాః | భ##వేయు రేతే పూతాశ్చ మద్భక్త స్పర్శ దర్శనాత్ || 104
ఓ లక్ష్మీదేవి నీవు నీ అంశాంశాంశ స్వరూపముతో భారతదేశమున ''పద్మావతి'' యను నదిగా తులసీ వృక్షముగా జన్మించును.
కలియుగమున ఐదువేల సంవత్సరముల పిదప నదీ రూపముననున్న మీరందరు మోక్షము చెంది నాసాన్నిధ్యమున కేతెంతురు.
సమస్త జీవులకు ఆపదలు సంపత్తుకు కారణమగుచున్నవి. ఈ సంసారమున ఆపదలు లేకుండా అభివృద్ధి ఎవరికి జరుగును.
నామంత్రమును ఉపాసన చేయు భక్తులు స్నానము చేయుట వలన పాపులను తగిలిన పాపము నుండి మీకు మోక్షము లభించును.
ఈ భూమిపై నున్న అంతులేని తీర్థములన్ని నా భక్తుల స్పర్శవలన దర్శనము పునీతములగును. నామంత్రమును ఉపాసన చేయు భక్తులు ఈ భూమిని పవిత్రమొనర్చుటకై తిరుగుచున్నారు. నా భక్తులు ఎక్కడ ఉందురో పాదప్రక్షాళనము చేయుదురో ఆ స్థలము అత్యంత పవిత్రమైన మహాతీర్థము కాగలదు. నా భక్తులయొక్క స్పర్శవలన, దర్శనము వలన స్త్రీ హత్యచేసిన వాడైనను గోవులను చంపినను, బ్రాహ్మణుని చంపినను, గురుభార్యా సమాగమము చేసినను, కృతఘ్నడైనను పవిత్రుడై జీవన్ముక్తుడగును. అట్లే ఆయుధములను నమ్ముకొని బ్రతుకు సైనికుడు మొదలగువారు, ఇతరులకు కాగితములు వ్రాయుచు బ్రతికే లేఖకులు, శూద్రయాజకుడు, వృషభమునెక్కి తిరిగేవాడు, విశ్వాసములేనివాడు, మిత్రులను చంపినవాడు, తప్పుడు సాక్ష్యములు చెప్పువాడు, తన వద్ద దాచి యుంచిన సొమ్మును అపహరించవాడు, ఋణగ్రస్తుడు, జారత్వమువలన పుట్టినవాడు పుంశ్చలీపతి, పుంశ్చలీపుత్రుడు, అన్యాయమైన వడ్డీలవల్ల బ్రతుకువాడు వీరందు నా భక్తుల స్పర్శ వలన దర్శనము వలన ముక్తిని పొందుదురు. అదే విధముగా శూద్రుల ఇంటిలో వంటచేయువాడు, దేవాలయమున పూజలు చేసి బ్రతుకువాడు, దీక్షితుడు కానివాడు, రావిచెట్టును పడగొట్టినవాడు, నా భక్తులను నిందించువాడు, నాకు నివేదింపబడని అన్నము తినువాడు, తల్లిని, తండ్రిని, భార్యను పుత్రులను, సోదరుని గురువుయొక్క వంశమును, సోదరిని, సంతానములేని బంధువును అత్తమామలను పోషింపనివాడు మహాపాతకి ఐనను నాభక్తుల స్పర్శ దర్శనమువలన అతడు పవిత్రుడగును. అట్లే దేవద్రవ్యమును అపహరించువాడు బ్రాహ్మణద్రవ్యమును అపహరించువాడు, కన్యాశుల్కము తీసికొన్నవాడు, లత్తుక, లోహద్రవ్యములు, రసద్రవ్యములను అమ్ముకొనువాడు, శూద్రశములను దహించువాడు వీరందరు కూడా మహాపాతకము చేసికొన్నవారు. వీరు సైతము నా భక్తుల పాదస్పర్శవలన, వారి దర్శనము వలన పవిత్రులగుదురు.
లక్ష్మీరువాచ - లక్ష్మీదేవి ఇట్లు పలికెను -
భక్తానాం లక్షణం బ్రూహి భక్తానుగ్రహ కారక | యేషాం సందర్శన స్పర్శాత్సద్యః పూతా నరాధమాః || 105
హరి భక్తివిహీనాశ్చ మహాహంకార సంయుతాః | స్వప్రశంసారతా దూర్తా శఠావై సాధునిందకాః || 106
పునంతి సర్వతీర్థాని యేషాం స్నానావగాహనాత్ | యేషాంచ పాదరజసా పూతా పాదోదకాన్మహీ || 107
యేషాం సందర్శనం స్పర్శం దేవా వాంఛంతి భారతే | సర్వేషాం పరమోలాభో వైష్ణవానాం సమాగమః || 108
నహ్యమ్మయాని తీర్థని న దేవా మృచ్ఛిలామయాః | తేపునంత్యురుకాలేన విష్ణుభక్తాః క్షణాదహో || 109
భక్తుల ననుగ్రహించు పరమాత్మా! నీ భక్తులు పాదస్పర్శవలన, వారి దర్శనము వలన హరిభక్తిరహితులు, మిక్కిలి గర్వించువారు, ఆత్మప్రశంస చేసికొనువారు, సాధుపురుషులను నిందించు దుష్టులు పునీతులగుదురు. ఆ హరిభక్తులు స్నానము చేసినందువలన సమస్త పుణ్యతీర్థములు, వారి పాదధూళివలన, పాదోదకమువలన భూమి పవిత్రమగును. దేవతలందరు ఆ హరిభక్తుల సందర్శనమును, పాదస్పర్శమును ఎల్లప్పుడు కోరుకొందురు.
ఆ వైష్ణవులతోటి సమాగమము అందరకు లాభమును చేకూర్చును. పుణ్యతీర్థములు, దేవతా విగ్రహములు పవిత్రము చేయజాలని వారిని విష్ణుభక్తులు క్షణములో పునీతులుగా నొనర్తురు. అందువలన ఆ హరిభక్తుల లక్షణము తెలుపుము.
సౌతిరువాచ - సౌతి మహర్షి ఇట్లనెను -
మహాలక్ష్మీ వచః శ్రుత్వా లక్ష్మీకాంతశ్చ సస్మితః | నిగూఢతత్వం కథితుం ఋషిశ్రేష్ఠోపచక్రమే || 110
మహాలక్ష్మీ దేవి మాటలు విని నారాయణుడు చిరునవ్వుతో నిగూఢతత్వమగు విషయమునిట్లు చెప్పెను.
శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
భక్తానాం లక్షణం లక్ష్మి గూఢం శ్రుతి పురాణయోః | పుణ్యస్వరూపం పాపఘ్నం సుఖదం ముక్తిదాయకం || 111
సారభూతం గోపనీయం న వక్తవ్యం ఖలేషు చ | త్వాం పవిత్రాం ప్రాణతుల్యం కథయామి నిశామయ || 112
గురువక్త్రాత్ విష్ణుమంత్రో యస్య కర్ణే విశేద్వరః | వదంతి వేదవేదాంగాత్ తం పవిత్రం నరోత్తమం || 113
పురుషాణాం శతం పూర్వం పూతం తజ్జన్మమాత్రతః | స్వర్గస్థం నరకస్థం వా ముక్తిం ప్రాప్నోతి తత్‌క్షణాత్ || 114
యైః కశ్చిద్యత్ర వా జన్మ లబ్ధం యేషు చ జంతుషు | జీవన్ముక్తాస్తే చ పూతా యాంతి కాలే హరేః పదం || 115
మద్భక్తియుక్తో మాత్పూజానియుక్తో మద్గుణాన్వితః | మద్గుణశ్లాఘనీయశ్చమ న్నివిష్టశ్చ సంతతం || 116
మద్గుణ శ్రుతి మాత్రేణ సానందః పులకాన్వితః | సగద్గదః సాశ్రునేత్రః స్వాత్మవిస్మృతిరేవచ 117
నవాంఛంతి సుఖం ముక్తిం సాలోక్యాది చతుష్టయం | బ్రహ్మత్వమమరత్వం వా తద్వాంఛా మమ సేవనే || 118
ఇంద్రత్వం చ మనుత్వం చ దేవత్వం చ సుదుర్లభం | స్వర్గరాజ్యాదిభోగం చ స్వప్నేzపి నహి వాంఛతి || 119
బ్రహ్మాండాని వినశ్యంతి దేవా బ్రహ్మాదయస్థథా | కల్యాణ భక్తి యుక్తశ్చ మద్భక్తో న ప్రణశ్యతి || 120
భ్రమంతి భారతే భక్తా లబ్ధ్వా జన్మ సుదుర్లభం | తే೭పి యాంతి మహీం పూతాం కృత్వా తీర్థః మమాలయం || 121
ఓ లక్ష్మీదేవి! నా భక్తుల లక్షణము వేదపురాణములకు సహితమందనిది. పుణ్యస్వరూపమైనది. పాపముల పొగొట్టునది. ముక్తిని కలిగించునది కావున దీనిని దుర్మర్గులకు చెప్ప తగదు. నీవు పరమ పవిత్రమైన దానవు. న ప్రాణములతో సమానమైన దానవు కావున నీకు నా భక్తుల లక్షణమును చెప్పుచున్నాను.
ఏ భక్తుని చెవిలో విష్ణుమంత్రము గురువుయొక్క ముఖము నుండి ప్రవేశించునో ఆ భక్తుడు వేద వేదాంగములకంటే పవిత్రుడు. ఆతని జన్మవలననే ఆతని పూర్వీకులు నూరు తరములవారు పవిత్రులగుదురు. వారు నరకమందున్నా, స్వర్గమందున్నా వెంటనే ముక్తిని పొందుదురు. అతని పూర్వీకులు ఎట్టి జన్మపొందినను జీవన్ముక్తులై కాలక్రమమున శ్రీహరి స్థానమున పొందుదురు. నా భక్తి కలవాడు, నాపూజలు సేయువాడు, నావంటి గుణములు కలవాడు ఎల్లప్పుడు కీర్తింపబడును. నా కథలు వినినంతమాత్రమున ఆనందముతో పులకాన్వితుడై కన్నీరుకారగా తనను తాను మరచిపోవును. అతనికి నాసేవ తప్ప ముక్తి సుఖము, స్వర్గాది భోగములవసరములేదు. వాటిని కలలోనైనా స్మరింపడు. బ్రహ్మాండాదిలోకములు, దేవతలు, బ్రహ్మదులు నశించినప్పటికిని నా భక్తుడు మాత్రము నశింపడు.
నా భక్తులు భారతదేశమున జన్మించి దేశాటనము సేయుచు ఈ భూమిని పవిత్రము చేసి, చివరకు నేనుండు ప్రాంతమును చేరుదురు.
ఇత్కేతత్కథితం సర్వం కురు పద్మే యథోzచితం | తదాజ్ఞా తాశ్చ తాశ్చక్రుః హరిః తస్థౌ సుఖాసనే || 122
ఓ లక్ష్మీ! నా భక్తుల లక్షణమును సర్వము నీకు తెలిపితిని అని నారాయణుడనిన తరువాత అతని అనుజ్ఞగైకొని అందరు అచ్చట సుఖాసనములందు కూర్చొనిరి.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయ ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే సరస్వత్యుపాఖ్యానం నమా షష్ఠోzధ్యాయః |
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణ సంవాదములో సరస్వత్యుపాఖ్యానము అను
ఆరవ అధ్యాయము సమాప్తము.