sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టమో೭ధ్యాయః - పృథ్వీ స్తోత్రము నారద ఉవాచ - నారదుడిట్లనెను- హరేర్నిమేషమాత్రేణ బ్రహ్మణః పాతఏవ చ | తస్యపాతే ప్రాకృతికః ప్రళయః పరికీర్తితః || 1 ప్రళ##యే ప్రాకృతే చోక్తం తత్రాzదృష్టా వసుంధరా | జలప్లుతాని విశ్వాని సర్వే లినా హరావితి || 2 వసుంధరా తిరోభూతా కుత్ర వా తత్ర తిష్ఠతి | సృష్టేర్విధానసమయే సాzవిర్భూతా కథం పునః || 3 కథం బభూవ సా ధన్యా మాన్యా సర్వాశ్రయా జయా | తస్యాశ్చ జన్మవిస్తారం వద మంగళకారణం || 4 శ్రీహరి యొక్క ఒక నిమేషకాలములో బ్రహ్మదేవుని ఆయుర్దాయము తీరిపోవునని, అప్పుడు ప్రాకృతిక ప్రళయము జరుగుననియు, ఆ సమయమున భూమి కన్పింపకపోవుననియు, సమస్త లోకములు నీటిలో మునిగిపోవునని, సమస్తజీవులు శ్రీహరిలో విలీన మగునని మీరింతకు పూర్వము తెలిపితిరి. ప్రాకృతిక ప్రళయ కాలమున భూమి అంతర్ధానమై ఎక్కడ ఉండును? సృష్ఠిజరుగునప్పుడు మరల ఎట్లు ఆవిర్భవించును. అన్ని జీవులకు ఆశ్రయభూతమైన ఆ భూమి పూజ్యురాలెట్లయ్యెను, ఆ భూమి జన్మవృత్తాంతమెట్టిది? మొదలగు విషయములను మీరు నాకు వివరింపుడు. శ్రీనారాయణ ఉవాచ - నారాయణుడిట్లు పలికెను- సర్వాదిసృష్టౌ సర్వేషాం జన్మ కృష్ణాదితి శ్రుతిః | ఆవిర్భావస్తిరోభావః సర్వేషు ప్రళ##యేషు చ || 5 సృష్టిప్రారంభ సమయమున సమస్తజీవులు శ్రీకృష్ణునినుండి పుట్టునని సమస్త ప్రళయకాలములందు శ్రీకృష్ణుని యందే అంతర్ధానము చెందునని తిరిగి అతని నుండే ఆవిర్భవించునని వేదములు తెల్పుచున్నవి. శ్రూయాతాం వసుధాజన్మ సర్వమంగళ మంగళం | విఘ్ననిఘ్నం పరం పాపనాశనం పుణ్యవర్ధనం || 6 అహో కేచిద్వదంతీతి మధుకైటభ##మేదసా | బభూవ వసుధా ధన్యా తద్విరుద్ధమతం శ్రుణు || 7 ఊచతుస్తౌ పురా విష్ణుం తుష్టౌ యుద్ధేన తేజసా | ఆవాం జహి న యత్రోర్వీ పయసా సంవృతేతి చ || 8 తయోర్జీవన కాలేన ప్రత్యక్షా చ భ##వేత్ స్ఫుటం | తతో బభూవ మేదశ్చ మరణానంతరం తయోః || 9 మేదినీతి చ విఖ్యాతా ఇత్యుక్తాయైస్తన్మతం శ్రుణు | జలధౌతా కృశాపూర్వం వర్ధితా మేదసా యతః || 10 అందరకు మంగళముల నిచ్చునది విఘ్నముల పోగొట్టునది, పుణ్యమును కలిగించునది ఐన భూమి జన్మవృత్తాంతమును వినుము. కొందరు ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మెదళ్ళవలన ఏర్పడినదందురు. మదుకైటభులు విష్ణుమూర్తితో యుద్ధము చేయునప్పుడు విష్ణువుయొక్క తేజస్సునకు సంతోషపడి వారు విష్ణువుతో ఇట్లనిరి. మమ్ము నీరు కన్పించని స్థలమున చంపుమని కోరుకొనిరి. అట్లే శ్రీహరి వారిని చంపగా వారి మేదస్సు దానిపై బడుటవలన భూమి మేదినీ యను పేర ఖ్యాతి నందినది. అనగా ప్రళయ కాలమున నీటిలో మునిగి యున్న భూమి వారు బ్రతికి యుండగనే నీటినుండి పైకి వచ్చినందువలన స్పష్టముగా కన్పించినది. అట్లే వారి మరణానంతరము మధుకైటభుల మేదస్సువలన పెరిగి స్పష్టముగా కన్పించినదని అందురు. కథయామి చ తజ్జన్మ సార్థకం సర్వసమ్మతం | పురాశ్రుతం చ శ్రుత్యుక్తం ధర్మవక్త్రాచ్చ పుష్కరే || 11 మహావిరాట్ శరీరస్య జలస్థస్య చిరం స్ఫుటం | మలో బభూవ కాలేన సర్వాంగ వ్యాపకో ధ్రువం || 12 స చ ప్రవిష్టః సర్వేషాం తల్లోమ్నాం వివరేషుచ | కాలేన మహతా తస్మాద్బబూవ వసుధా మునే || 13 ప్రత్యేకం ప్రతిలోమ్నాం చ స్థితా కూపేషు సా స్థిరా | ఆవిర్భూతా తిరోభూతా సా చలా చ పునః పునః || 14 ఆవిర్భూతా సృష్టికాలే తజ్జలాత్పర్యుస్థితా | ప్రళ##యే చ తిరోభూతా జలాభ్యంతరవస్థితా || 15 కాని ధర్ముని వలన పుష్కర క్షేత్రమున భూమి పుట్టుక గురించి విని యుంటిని. అది వేదప్రోక్తము సమస్త జన సమ్మతమైనది. ఆ విషయమేమనగా నీటిలో నున్న మహావిరాట్పురుషుని శరీరమున ఏర్పడిన మలము కాలక్రమముగా సమస్త శరీరమున వ్యాపించినది. ఆమలము మహావిరాట్పురుషుని ప్రతి రోమ కూపమున నిండిపోయినది. అది మరల మరల ఆవిర్భవించినది. తిరోధానము చెందినది. ఆ మలమే భూమిగా ఏర్పడినది. సృష్టికాలమున జలమునుండి పైకి వచ్చినందునవలన ఆవిర్భవించిన దని, ప్రళయకాలమున జలమునందు మునిగియున్నందువలన అంతర్ధానము చెందినదని చెప్పబడినది. ప్రతి విశ్వేషు వసుధా శైలకానన సంయుతా | సప్త సాగర సంయుక్తా సప్తద్వీపమితా సతీ || 16 హిమాద్రిమేరు సంయుక్తా గ్రహచంద్రార్క సంయుతా | బ్రహ్మవిష్ణు శివాద్యైశ్చ సురైః లోకైస్థథా నుతా || 17 పుణ్య తీర్థసమాయుక్తా పుణ్యభారత సంయుతా | కాంచనీ భూమి సంయుక్తా సర్వదుర్గసమన్వితా || 18 పాతాలాః సప్త తదధః తదూర్ధ్వే బ్రహ్మలోకకః | ధ్రువలోకశ్చ తత్రైవ సర్వం విశ్వం చ తత్రవై || 19 ఏవం సర్వాణి విశ్వాని పృథివ్యాం నిర్మితానివై | ఊర్ధ్వం గోలోకవైకుంఠౌ నిత్యౌ విశ్వపరౌ చ తౌ || 20 నశ్వరాణి చ విశ్వాని కృత్రిమాకృత్రిమాణి చ | ప్రళ##యే ప్రాకృతే బ్రహ్మన్ బ్రహ్మణశ్చ నిపాతనే || 21 మహావిరాడాదిసృష్టౌ సృష్టః కృష్ణేన చాత్మనా | నిత్యః స్థితః స ప్రళ##యే కాష్ఠాకాశేశ్వరైః సహ || 22 క్షిత్యధిష్ఠాతృ దేవీ సా నారాహీ పూజితా సురైః | మనుభిర్మునిభిః విపై#్రః గంధర్వాదిభిరేవ చ || 23 విష్ణోః వరాహరూపస్య పత్నీ సా శ్రుతి సమ్మతా | తత్పుత్రో మంగళో జ్ఞేయః సుయశా మంగళాత్మజః || 24 ప్రతిలోకమున భూమి కలదు. ఆభూమియందు పర్వతములు అడవులు, సప్తసముద్రములు, సప్తద్వీపుములు హిమాలయము, మేరువువంటి పర్వతములు కలవు. అట్లే అచ్చట గ్రహములు, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మవిష్ణు శివాది దేవతలుందురు. అనేక పుణ్యతీర్థములు పుణ్యభూమియైన భారతదేశము, అచ్చట ఉన్నవి. ఆ భూమి క్రింద సప్త పాతాళములు పైన బ్రహ్మలోకము, ధ్రువలోకము ఆ పైన శాశ్వతమైన గోలోక వైకుంఠలోకములుండును. ఈ లోకములన్నియు సహజమైనవి అసహజమైనవి కూడ. ప్రాకృత ప్రళయమున బ్రహ్మదేవుని ఆయుస్సు ముగియగనే అసహజమైన లోకములు నశించును. సృష్టిప్రారంభకాలమున శ్రీకృష్ణునిచే మహావిరాట్పురుషుడు సృష్టించబడును. వారాహీ దేవత భూమికి అధిష్ఠాన దేవత. ఆమె దేవతలు గంధర్వులు మానవులందరిచే పూజలనందుకొనుచున్నది. వారాహీదేవి వరాహరూపమున నున్న విష్ణుమూర్తి యొక్క భార్య. వారి పుత్రుడే మంగళుడను కుజుడు. అతని కొడుకు సుయశుడు. నారద ఉవాచ - నారదుడిట్లనెను - పూజితా కేన రూపేణ వారాహీ చ సురైర్మహీ | వరాహేణ చవారాహీ సర్వైః సర్వాశ్రయా సతీ || 25 తస్యాః పూజా విధానం చాప్యధశ్చోద్దరణ క్రమం | మంగళం మంగలస్యా zపి జన్మవ్యాసం వద ప్రభో || 26 సమస్త జీలవులకు ఆశ్రయమైన ఈ భూమిని ఏరూపముతో అందురు పూజించినారు. ఆ పృథివియొక్క పూజావిధానమును ఉద్దరణ క్రమమును వివరముగా తెలుపుడు. అట్లె కుజుని యొక్క జన్మ ప్రకారమును కూడ వివరించుడని నారరుడు వేడుకొనెను. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- వారామే చ వరాహశ్చ బ్రహ్మణా సంస్తుతః పురా | ఉద్దధార మహీం హత్వా హిరణ్యాక్షం రసాతలాత్ || 27 జలే తాం స్థాపయామాస పద్మపత్రం యథార్ణవే | తత్రైవ నిర్మమే బ్రహ్మా సర్వం విశ్వం మనోహరం || 28 దృష్ట్వా తదధిదేవీం చ సకామాం కాముకో హరిః | వరాహరూపీ భగవాన్ కోటి సూర్యసమప్రభః || 29 కృత్వా రతికరీం శయ్యాం మూర్తిం చ సుమనోహరాం | క్రీడాం చకార రహసి దివ్యవర్షమహర్నిశం || 30 సుఖ సంభోగ సంస్పర్శాత్ మూర్ఛాం సంప్రాప సుందరీ | విదగ్ధా యా విదగ్ధేన సంగమో zపి సుఖప్రదః || 31 విష్ణుస్తదంగ సంస్పర్శాత్ బుబుధే న దివానిశం | వర్షాంతే చేతనాం ప్రాప్య కామీ తత్యాజ కాముకీం || 32 దధార పూర్వం రూపం హి వారాహం చైవ లీలయా | పూజాం చకార భక్త్వా చ ధ్యాత్యా చ ధరణీం సతీం || 33 ధూపైర్దీపైశ్చ నైవేద్యైః సిందూరై రనులేపనైః | వసై#్త్రః పుషై#్పశ్చ బలిభిః సంపూజ్యోవాచ తాం హరిః || 34 బ్రహ్మదేవునిచే నుతులు గొన్న ఆదివరాహస్వామి హిరణ్యాక్షుని చంపి భూమిని పాతాళమునుండి పైకెత్తెను. అతడు భూమిని సముద్రపు నీటిపై పద్మపత్రమువలె నుంచెను. నీటినుండి పైకి వచ్చిన భూమిపై బ్రహ్మదేవుడు జీవులనన్నటిని సృష్టించెను. భూమికి అధిదేవతయైన వారాహి దేవియొక్క మనసు నెరిగిన ఆదివరాహమూర్తి దివ్య వర్షకాలము రాత్రింబగళ్ళు ఆమె క్రీడింపసాగెను. వారాహీదేవియొక్క అంగస్పర్శవలన వరాహమూర్తి మైమరచి పోయెను. దివ్యవర్షము తరువాత స్పృహలోనికి వచ్చిన ఆ స్వామి భూమిని గొప్పగా పూజించి ఇట్లు పలికెను. మహావరాహ ఉవాచ - మహావరాహమూర్తి ఇట్లు పలికెను - సర్వాధారా భవ శుభే సర్వేః సంపూజితా శుభం | మునిభిర్మనుభిర్దేవైః సిద్ధైర్వా మానవాదిభిః || 35 జలోచ్ఛ్వాసాత్ జలత్యాగ గృహారంభ ప్రవేశ##నే | వాపీతడాగారంభే చ శుభే చ కృషి కర్మస్త్రణి || 36 తవ పూజాం కరిష్యంతి సంభ్రమేణ సురాదయః | మూఢా యే న కరిష్యంతి యాస్యంతి నరకం చ తే || 37 మంగళమూర్తియైన ఓ భూదేవి! నీవు జీవులందరకు ఆధారముకమ్ము. నిన్ను దేవ గంధర్వ మానవులందరు ఎల్లప్పుడు గౌరవింతురు. గృహారంభసమయమున, గృహప్రవేశసమయమున బావులు, చెరువుల త్రవ్వునపుడు, వ్యవసాయము చేయు సమయమున దేవతలు మొదలైనవారందరు నీ పూజను తప్పక చేయుదురు. పై కర్మలలో నీ పూజను చేయని వారు నరకమునకు తప్పక పోవుదురు. వసుధోవాచ - భూదేవి ఇట్లు పలికెను - వహామి సర్వం వారాహరూపేణాzహం తవాజ్ఞయా | లీలామాత్రేణ భగవాన్ విశ్వం చ సచరాచరం || 38 ముక్తాం శుక్తిం హరేరర్చాం శివలింగం శిలాం తథా | శంఖం ప్రదీపం రత్నం చ మాణిక్యం హీరకం మణిం || 39 యజ్ఞసూత్రం చ పుష్పం చ పుస్తకం తులసీదళం | జపమాలాం పుష్పమాలాం కర్పూరం చ సువర్ణకం || 40 గోరోచనం చందనం చ శాలగ్రామజలం తథా | ఏతాన్వోఢు మశక్తాzహం క్లిష్టా చ భగవన్ శ్రుణు || 41 భగవన్ నీయొక్క ఆజ్ఞననుసరిచి చరాచర విశ్వమును అవలీలలగా మోయగలను. కానీ ముత్యమును, ముత్యపుచిప్పను. శివలింగమును, శాలగ్రామశిలను, శంఖమును, దీపమును, రత్నమును, మాణిక్యమును, యజ్ఞ సూత్రమును, పుష్పమును, పుస్తకమును, తులసీదళమును, జపమాలను, పుష్పమాలను, కర్పూరమును, బంగారమును, గోరోచనమును, చందనమును, సాలగ్రామజలమును మాత్రము ఏమాత్రము మోయలేదు. అనగా వీటిని భూమిపై సరాసరి పెట్టకుండ ఏ ఆకో, ఏ పీటనో వేసి వాటిపై పెట్ట వలెను. శ్రీ భగవానువాచ - భగవంతుడైన నారాయణుడిట్లనెను- ద్రవ్యాణ్యతాని యే మూఢా అర్పయిష్యంతి సుందరి | యాస్యంతి తే కాలసూత్రం దివ్యం వర్షశతం త్వయి || 42 ఇత్యేవముక్త్వా భగవాన్విరరామ చ నారద | బభూవ తేన గర్భేణ తేజస్వీ మంగళగ్రహః || 43 పూజాం చక్రుః పృథివ్యాశ్చ తే సర్వే చాజ్ఞయా హరేః | దధ్యుః కాణ్వోక్తమార్గేణ తుష్టువుఃస్తవనేన చ || 44 దద్యుర్మూలేన మంత్రేణ నైవేద్యాదికమేవచ | సంస్తుతా త్రిషులేకేషు పూజితా సా బభూవ హ || 45 ఓ భూదేవి ! నీవు పేర్కొనిన ద్రవ్యములను జ్ఞానము లేక ఎవడు భూమిపై ఉంచునో వాడు నూరు సంవత్సరములు నరకలోకమున నుండును అని చెప్పి ఊరుకుండెను. భూదేవి విష్ణుమూర్తియొక్క తేజస్సుచే మంచి తేజస్సుగల కుజుని కన్నది. శ్రీహరియొక్క ఆజ్ఞపై దేవతలందరు భూమిని పూజించిరి. కాణ్వశాఖలో చెప్పబడిన పద్ధతి ప్రకారము ఆమెను ధ్యానించి స్తుతించిరి. అట్లే మూలమంత్రముతో నైవేద్యము మొదలగు వాటినిచ్చిరి. ఈ విధముగా భూదేవి మూడులోకములయందు పూజనీయురాలాయెను. నారద ఉవాచ - నారదుడిట్లు పలికెను - కిం ధ్యానం స్తవనం కిం వా తస్యా మూలం చ కిం వద | గూఢం సర్వపురాణషు శ్రోతుం కౌతూహలం మమ || 46 భూదేవతా ధ్యాన మేవిధముగానుండును? స్తోత్ర పద్ధతి, ఆదేవతయొక్క మూలమంత్రము మొదలగునవి పురాణములలో నిగూఢముగా నున్నవి. వాటిని తెలుసుకొనవలెనను కుతూహలము నాకు గలదు అని అడిగెను. నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు పలికెను - అదౌ చ పృథివీ దేవి వరాహేణ సుపూజితా | తతో హి బ్రహ్మణా పశ్చాత్ తతశ్చ పృథునా పురా || 47 తతః సర్వైః మునీంద్రైశ్చ మనుభిర్నారదాదిభిః | ధ్యానం చస్తవనం మంత్రం శ్రుణు వక్ష్యామి నారద || 48 ఓం హ్రీం శ్రీం వాం వసుధాయై స్వాహా | ఇత్యనేన తు మంత్రేణ పూజితా విష్ణునా పురా || 49 శ్వేత చంపక వర్ణాభాం శతచంద్ర సమప్రభాం | చందనోత్‌క్షిత సర్వాంగీం సర్వభూషణ భూషితాం || 50 రత్నాధారం రత్నగర్భాం రత్నాకర సమన్వితాం | వహ్ని శుద్ధాంశుకాధానం సస్మితం వందితాం భ##జే || 51 ధ్యానేనానేన సా దేవీ సర్వైర్వై పూజితా భ##వేత్ | స్తవనం శ్రుణు విప్రేంద్ర కాణ్యశాఖోక్త మేవచ || 52 భూదేవిని తొలుత వరాహమూర్తి పూజించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు, అతని తర్వాత పృథు చక్రవర్తి, ఆ తర్వాత దేవతలు, మునులు, మానవులు, భూమిని పూజించిరి. భూదేవత మూలమంత్రము ధ్యానమంత్రము స్తోత్రము ఈ విధముగా ఉన్నవి. ''ఓం హ్రీం శ్రీం వాం వసుధాయై స్వాహా'' అనునది మూలమంత్రము. తెల్లని చంపకపుష్పములవంటి శరీరము కలది, నూరు చంద్రులతో సమానమైన కాంతి గలది, శరీరమునందంతట చందనము కలది. సర్వ భూషణములు ధరించినది, రత్నములకు ఆధారమైనది, రత్నగర్భ, సముద్రములతో నున్నది, మేలిమి బంగారము వంటి వస్త్రములు ధరించునది, చిరునవ్వుతో కూడుకున్నది అగు భూ దేవిని నేను ధ్యానింతును. ఇతి ధ్యానశ్లోకము. ఈ ధ్యానశ్లోకముతో భూదేవి సమస్తజనులచే పూజింపబడినది. ఇక కాణ్వశాఖయందు చెప్పబడిన స్తోత్రము ఈ ప్రకారముగా ఉన్నది. విష్ణురువాచ - విష్ణుమూర్తి ఇట్లు పలికెను- యజ్ఞసూకరజాయ త్వం జయందేహి జయావహే | జయేzజయే జయధారే జయశీలే జయప్రద || 53 సర్వాధారే సర్వబీజే సర్వశక్తి సమన్వితే | సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే స్థిరే || 54 సర్వ సస్యాలయే సర్వ సస్యాఢ్యే సర్వ సస్యదే | సర్వ సస్యహరే కాలే సర్వసస్యాత్మికే క్షిత 55 మంగళే మంగళాధారే మంగళ్యే మంగళప్రదే | మంగళార్థే మంగళాంశే మంగళం దేహి మే పరం || 56 భూమే భూమిపసర్వస్యే భూమిపాలపరాయణ | భూమిపాహంకారరూపే భూమిం దేహి వసుంధరే || 57 ఓ భూదేవి! నీవు యజ్ఞవరాహమునకు భార్యవు. నీవు నాకు సర్వకార్యములందు జయము కల్గునట్లు చేయుము. నీవు జయ స్వరూపిణివి అజయ స్వరూపిణివి కూడ. నీవు జయమునిచ్చుదానవు. జయశీలవు. సమస్త చరాచరసృష్టికి ఆధారభూతురాలవు. సమస్తమునకు కారణభూతురాలవు. సర్వశక్తి సమన్వితవు. అన్ని కోరికలు తీర్చుదానవు. స్థిరముగా ఉండుదానవు. సమస్త సస్యములకు నిలయమైనదానవు. సమస్త సస్యముల నిచ్చుదానవు. సమస్త సస్యములను హరించుదానవు. సర్వ సస్య స్వరూఫిణివి. నీవు మంగళ స్వరూపవు. మంగళ వస్తువులకు ఆధారభూతవు. మంగళములనిచ్చు నీవు మాకు మంగళములనొసగుము. ఓ భూదేవి! నీవు రాజులకు సర్వస్వమవు. రాజుల యొక్క అహంకార రూపిణివి. అట్టి నీవు మాకు భూ సమృద్ధిని కలుగజేయుము. ఇదం స్త్రోత్రం మహాపుణ్యం తాం సంపూజ్య చ యః పఠేత్ | కోట్యంతరే జన్మని న సంభ##వే ద్భూమిపేశ్వరః || 58 భూమిదానకృతం పుణ్యం తాం సంపూజ్య చ యః పఠేత్ | దత్తాపహారజాత్పాపాన్ముచ్యతే నాత్ర సంశయః || 59 అంబువీచి బూఖననాత్పాన్ముచ్యతే స ధ్రువం | అన్యకూపే కుపదజాత్పాపాన్ముచ్చేత స ధ్రువం || 60 పరభూశ్రాద్ధ జాత్పాపాన్ముచ్యతే పాత్ర సంశయః | భూమౌ వీర్యత్యాగ పాపాత్ దీపాది స్థాపనాత్తథా || 61 పాపేన ముచ్యతే ప్రాజ్ఞః స్తోత్రస్య పఠనాన్మునే | అశ్వమేధ శతం పుణ్యం లభ##తే నాత్ర సంశయః || 62 అత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాసమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణ ద్వితీయ ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే పృథివ్యుపాఖ్యానే పృథివీస్తోత్రం నామ అష్టమోzధ్యాయః || శ్రీబ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమందున్న పృథివ్యుపాఖ్యానములో పృథివీస్తోత్రమను ఎనమిదిదవ అధ్యాయము సమాప్తము.