sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
నవమో೭ధ్యాయః - పృథ్వీ ఉపాఖ్యానము నారద ఉవాచ - నారదుడిట్లు పలికెను - భూమి దానకృతం పుణ్యం పాపం తద్ధరణన యత్ | పరభూమౌ శ్రాద్ధరూపం కూపే కుపదజం తథా ||1 అంబువీచి భూఖనన బీజత్యాగజమేవ చ | దీపాది స్థాపనాత్పాపం శ్రోతిమిచ్ఛామి యత్నతః || 2 అన్యద్వా పృథివీ జన్యం పాపం యత్ర్పశ్నతః పరం | యదస్తి తత్ప్రతీకారం వద వేద విదాం వర || 3 భూదానము చేసినందువలన కలుగు పుణ్యమెట్టిదో, దానము చేసిన భూమిని అపహరించినందువలన, ఇతరుల ఇండ్లలో శ్రాద్ధము చేసినందువలన, దిగుడుబావులలో మైల అంటుకొనిన కాళ్ళు పెట్టినందువలన, భూమిని త్రవ్వినందువలన, వీర్యమును భూమిపై వదిలినందువలన, భూమిపై దీపాదులను పెట్టినందువలన ఏర్పడు పాపమును, పృథివి వల్ల సంభవించు ఇతర పాపములను, వాటి నివారణ మార్గములనన్నిటిని నాకు వివరించి చెప్పుడు. నారాయణ ఉవాచ- నారాయణమూర్తి ఇట్లు చెప్పెను- వితస్తిమాత్రం బూమిం చ యోదదాతి చ భారతే | సంధ్యాపూతాయ విప్రాయ స యాయాద్విష్ణుమందిరం || 4 భూమించ సర్వ సస్యాఢ్యాం బ్రహ్మణాయదదాతి యః | భూమిరేణు ప్రమాణ చ వర్షే విష్ణుపదే వసేత్ ||5 గ్రామం భూమిం చ ధ్యానం చ యోదదాత్యాదదాతి యః | సర్వ పాపాద్వినిర్‌క్తౌ చోభౌ వేకుంఠవాసినౌ || 6 భూమిదానం చ తత్కాలే యః సాధుశ్చానుమోదతే | స ప్రయాతి చ వైకుంఠం మిత్ర గోత్ర సమన్వితం || 7 స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేత్తు యః | కాలసూత్రే తిష్ఠతి స యావచ్చంద్ర దివాకరౌ || 8 తత్పుత్ర పౌత్ర ప్రభృతి ర్భూమిహీనః శ్రియాహతః |7 సుఖహీనో దరిద్రఃస్యాత్ అంతే యాతి చ రౌరవం || 9 గవాం మార్గం వినిష్కృష్య యశ్చ సస్యం దదాతి సః | దివ్యం వర్షంశతం చైవ కుంభీపాకే చ తిష్ఠతి || 10 గోష్ఠం తటాకం నిష్కృష్య మార్గం సస్యం దదాతి యః | స చ తిష్ఠత్యసీప్రతే యావచ్చంద్ర దివాకరౌ || 11 న పంచపిండ ముద్దృత్య స్నాతి కూపే పరస్య యః | ప్రాప్నోతి నరకం చైవ న స్నానఫలమేవచ || 12 కామీ భూమౌ చ రహసి బీజత్యాగం కరోతి యః | స్నిగ్ధరేణు ప్రమాణం చ వర్షం తిష్ఠతి రౌరవే || 13 అంబువీచ్యంబు ఖననం యఃకరోతి చ మానవః | స యాతి కృమిదంశం చ స్థితిస్తత్ర చ తుర్యుగం || 14 పరకీయే లుప్త కూపే కూపం మూఢః కరోతి యః | పుష్కరిణ్యాంచ లుప్తాయాం తాం దదాతి చ యోనరః || 15 సర్వం ఫలం పరసై#్యవ తప్తసూర్మిం వ్రజేత్తు సః తత్రతిష్ఠతి సంతప్తో యావదింద్రాశ్చతుర్దశ || 16 పరకీయ తడాగే చ పంకముద్ధృత్య చోత్సృజేత్ | రేణు ప్రమణవర్షంచ బ్రహ్మలోకే వసేన్నరః || 17 పిండం పిత్రే భూతి భర్తుః న ప్రదాయ చ మానవః | శాద్దం కరోతి యో మూఢో నరకం యాతి నిశ్చితం || 18 బూమౌ దీపం యోzర్పయతి సోzంధః సప్తసు జన్మసు | భూమౌ శంఖం చ సంస్థాప్య కుష్ఠం జన్మాంతరే లభేత్ || 19 ముక్తా మాణిక్యహీరం చ సువర్ణ చ మణిం తథా | యశ్చ సంస్థాపయే ద్భూమౌ దరిద్రః సప్త జన్మసు || 20 శివలింగం శిలామర్చ్యాం యశ్చార్పయతి భూతలే | శతమన్వంతరం యావత్కృమి భ##క్షే స తిష్ఠతి || 21 సూక్తం మంత్రం శిలాతోయం పుష్పంచ తులసీదళం | యశ్చార్పయతి భూమౌ చ సతిష్టేన్నరకే యుగం || 7 జపమాలాం పుష్పమాలాం కర్పూరం రోచనాం తథా | యే మూఢశ్చార్పయేద్బూమౌ స యాతి నరకంధ్రువం || ఈ భారతదేశమున మూడుపూటలు సంధ్యావందనమాచరించి గాయత్రీజపము చేసి పవిత్రుడైన బ్రాహ్మణునకు లేశమాత్రము భూమిని దానము చేసిన వాడు వైకుంఠమునకు తప్పక పోవును. గ్రామమును, భూమిని, ధాన్యమును ఎవరు దానము చేయుదురో, దానముగా స్వీకరింతురో వారిద్దరు సమస్త పాపములనుండి వినిర్ముక్తులై వైకుంఠమున నివసింతురు. తానుదానము చేసినను, ఇతరులు దానమొనర్చినను, బ్రాహ్మణుల కిచ్చిన వృత్తిని ఎవరు నాశనము చేయుదురో వారు సూర్య చంద్రులున్నంతవరకు నరకలోమున శిక్షలనుభవింతురు. అంతేకాక అతని సంతానము, వంశము భూమిని కోల్పోయి దరిద్రులై రౌరవనరకమున నివసించును. ఆవులు తిరుగు త్రోవలను చెడగొట్టి వ్యవసాయమునకై వినియోగించుకొనువాడు, ఆవుల కొట్టమును, చెరువును చెడగొట్టి స్వార్థమునకు వినియోగించుకొనువాడు, సూర్యచంద్రులున్నంతవరకు నరకమున కత్తులపై నిలుబడియుండగలడు. శ్రాద్ధమున పంచపిండములు పెట్టకుండ ఇతరుల బావిలో స్నానము చేసినచో నరకము మాత్రమే కాక ఆస్నానఫలము సహితము పొందలేడు. భూమిపై తన వీర్యమును వదలినవాడు, ఇతరులు తవ్వించిన బావి పూడ్కొనినచో ఆ పూడికను తీయించినవాడు దానఫలమును పొందలేడు. ఆ ఫలితము పూర్వపు యజమానికి మాత్రమే చెందును. కాని ఇతరులు త్రవ్వించిన చెరువులోని పూడికను తీయించినచో క్షణకాలమైనను బ్రహ్మలోకప్రాప్తి కలుగును. పిండము పెట్టక శ్రాద్ధము చేసినవాడు నరకమును పొందగా, భూమిపై దీపమునుంచినవాడు ఏడు జన్మలవరకు గుడ్డివాడు కాగలడు. అట్లే భూమిపై శంఖమునుంచిన కుష్ఠురోగమునకు గురియగును. శివలింగమును, సాలగ్రామ శిలను, మంత్రపుస్తకమును, సాలగ్రాముయొక్క అభిషేకతీర్థమును, పుష్పమును, తులసిని, జపమాలను, కర్పూరమును, గోరోజనమును భూమిపై పెట్టువాడు తప్పక నరకవాసఫలమునుభవించును. మునే చందన కాష్ఠంచ రుద్రాక్షం కుశమూలకం | సంస్థాప్య భూమౌ నరకే వసేన్మన్వంతరావధి || 24 పుస్తకం యజ్ఞసూత్రంచ భూమౌ సంస్థాపయేత్తుమః | నభ##వేద్విప్రయోనౌ చ తస్య జన్మాంతరే జనిః || 25 బ్రహ్మహత్యాసమం పాపం ఇహవై లభ##తే ధ్రువం | గ్రంథియుక్తం యజ్ఞసూత్రం పూజ్యం స్యాత్సర్వవర్ణకైః || 26 యజ్ఞం కృత్వాతు యో భూమింక్షీరేణ నహి సించతి | సయాతి తప్త సూర్మించ సంతప్తః సర్వ జన్మసు || 27 భూకంపే గ్రహణ యోzహి కరోతి ఖననం భువః | జన్మంతరే మహాపాపీ సోzంగహీనోభ##వేత్ ధ్రవం || 28 భవనం యత్ర సర్వేషాం భూమిస్తన ప్రకీర్తితా | వసురత్నం యాదధాతి వసుధా చ వసుంధరా || 29 హరేరూరౌ చ యాజాతా సా చోర్వీ పరికీర్తితా | ధరా ధరిత్రీ ధరిణిః సర్వేషాం ధరణాత్తు యా || 30 ఇజ్యా చ యాగభరణాత్ క్షోణీ క్షీణా లయే చయా | మహాలయే క్షయం యాతి క్షతిస్తేన ప్రకీర్తితా || 31 కాశ్యపీ కశ్యపస్యేయం అచలా స్థతి రూపతః | విశ్వంభరా తద్ధరణాచ్ఛాzనంతాzనంతరూపతః || 32 పృథివీ పృథుక కన్యాత్వాత్ ద్వితీయ ఖండము - 8వ అధ్యాయమువిస్తృతత్వా న్మహీమునే || 33 చందనపు కట్టెను, రుద్రాక్షను, దర్భను భూమిపైనుంచినచో మన్వంతరము వరకు నరకమున నివసించును. పుస్తకమును, యజ్ఞోపవీతమును, భూమిపై ఉంచినచో అతడు తర్వాతి జన్మలలో బ్రహ్మణుగా పుట్టరు. ఇది బ్రహ్మహత్యతో సమానమైన పాపము. ముడివేసిన యజ్ఞోపవీతము అన్ని కులములవారికి గౌరవించదగినది. యజ్ఞమును చేసి యజ్ఞాంతమును ఆ భూమిని పాలచే తడుపనిచో అతడు తప్తసూర్మి అను నరకమును అనుభవించును. భూకంపము వచ్చినప్పుడు, గ్రహణ కాలమున భూమిని ఎవ్వడు త్రవ్వునో అతడు మహాపాపి యగును. ఇతర జన్మలలో అంగహీనుడుగా పుట్టును. ధనమును రత్నాదులను (వసువును) ధరించినందువల్ల వసుధయని పిల్చిరి. శ్రీహరియొక్క ఊరువులనుండి పుట్టినందువలన దానిని ''ఉర్వి'' యనిరి. యాగవస్తువులను భరించుచున్నందువలన ''ఇజ్య'' యనిరి. లయకాలమున క్షీణించుచున్నందువలన ''క్షోణి''యైనది. మహాలయకాలమున సంపూర్ణముగా క్షతి చెందుచున్నందువలన ''క్షితి'' అనే పేర ప్రసిద్ధిబడసినది. కశ్యపమహర్షికి సంబంధించినది కావున దీనిని ''కాశ్యపి'' యనిరి. చంచలము కాకుండా ఉన్నందువలన ''అచల''యైనది. విశ్వమునంతయు భరించుచున్నందువలన ''విశ్వంభర''గా ప్రసిద్ధిచెందినది. అనంతమైన రూపము ఉన్నందువలన ''అనంత''యనుపేరుతో, పృథుమహారాజు కూతురు కావున ''పృథ్వి'' యను పేరుతో చాలా విస్తరించి యున్నందువలన ''మహీ'' యను పేర ప్రసిద్ధి చెందినది. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ ద్వితీయ ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే పృథివ్యుపాఖ్యానం నామ నవమోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదసమయమున తెలుపబడిన పృథివీ ఉపాఖ్యానమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.