sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
4. చతుర్థోzధ్యాయః - సావిత్రి, రతీమన్మధులు, వరుణుడు మొ.వారి జననం సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లు పలికెను. ఆవిర్బభూవ తత్పశ్చాత్ కృష్ణస్య రసనాగ్రతః | శుద్ధస్ఫటిక సంకాశా దేవీ చైకా మనోహరా ||
1 శుక్లవస్త్రపరీధానా సర్వాలంకార భూషితా | బిభ్రతీ జపమాలాంచ సా సావిత్రీ ప్రకీర్తితా ||
2 సా తుష్టావ పురః స్థిత్వా పరంబ్రహ్మ సనాతనం | పుటాంజలిపరా సాధ్వీ భక్తినమ్రాత్మ కంధరా ||
3 ఆ తర్మాత శ్రీకృష్ణదేవుని నాలుకనుండి శుద్ధ స్ఫటికమువలె తెల్లనిది, అందమైనది, తెల్లని వస్త్రమును ధరించినది, సమస్తాలంకార సుశోభిత, జపమాలను చేతిలో ధరించిన ఒక దేవి ఆవిర్భవించినది. ఆమె పేరు సావిత్రి. ఆమె శ్రీకృష్ణుని ముందు నిలిచి, పరబ్రహ్మస్వరూపుడు, సనాతనుడు ఐన శ్రీకృష్ణుని, భక్తితో తలవంచుకొని, చేతులు జోడించుకొని ఇట్లు స్తుతించెను. సావిత్ర్యువాచ - సావిత్రిదేవి ఇట్లు పలికెను- నమామి సర్వబీజం త్వాం బ్రహ్మజ్యోతిః సనాతనం | పరాత్పరతరం శ్యామం నిర్వికారం నిరంజనం ||
4 ఇత్యుక్త్వా సస్మితా దేవీ రత్నసింహాసనే వరే | ఉవాస శ్రీహరిం నత్వా పునరేవ శ్రుతిప్రసూః||
5 సమస్తమునకు కారణభూతుడవు, బ్రహ్మస్వరూపుడవు, సనాతనుడవు, పరాత్పరతరుడవు, నల్లనివాడవు, నిర్వికారుడవు, నిరంజనుడవగు నిన్ను నమస్కరింతును. చిరునగవు కల ఆ సావిత్రి ఇట్లు శ్రీహరిని స్తుతించి, నమస్కరించి రత్న సింహాసనమున కూర్చుండెను. ఆవిర్బభూవ తత్పశ్చాత్ కృష్ణస్య పరమాత్మనః | మానసాచ్చ పుమానేకః తప్తకాంచన సన్నిభః || 6 మనోమధ్నాతి సర్వేషాం పంచబాణన కామినాం | తన్నాను మన్మథం తేన ప్రవదంతి మనీషిణః || 7 తస్య పుంసో వామ పార్శ్వాత్ కామస్య కామినీ వరా | బభూవాతీవ లలితా సర్వేషాం మోహకారిణీ || 8 రతిర్బభూవ సర్వేషాం తాం దృష్ట్యా సస్మితాం సతీం | రతీతి తేన తన్నామ ప్రవదంతి మనీషిణః || 9 హరిం స్తుత్వా తయా సార్ధం స ఉవాస హరేః పురః | రత్నసింహాసనే చాస్య పంచబాణో ధనుర్ధరః || 10 ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మ మనస్సునుండి మేలిమి బంగారమువంటి కాంతికల పురుషుడొకడు ఆవిర్భవించెను. ఆతడు తన పంచబాణములతో సమస్త కామికుల మనస్సులను చిలుకుచున్నందువలన అతనిని మన్మథుడని పండితులనుచున్నారు. మన్మథుని ఎడమవైపు అతనికి ప్రియురాలు, అందరికి మోహమును పుట్టించు ఒక స్త్రీ ఉదయించినది. చిరునవ్వు కల ఆమెను చూడగానే అచటనున్న అందరికి పరమ ప్రీతి ఏర్పడినది. అందువలననే ఆమెను రతీదేవిగా పండితులు పేర్కొనుచున్నారు. మన్మథుడు తన ప్రియురాలైన రతీదేవితోపాటు శ్రీహరిని స్తుతించి శ్రీహరిముందు రత్నసింహాసనముపై తన ధనుస్సును ధరించి ఉపవిష్టుడాయెను. మారణం స్తంభనం చైవ జృంభణం శోషణం తథా | ఉన్మాదనం పంచబాణాన్ పంచబాణో బిభర్తిసః || 11 బాణాంశ్చిక్షేప సర్వాంశ్చ కామో బాణపరీక్షయా | సద్యః సర్వే సకామాశ్చ బభూవురీశ్వరేచ్ఛయా || 12 రతిం దృష్ట్వా బ్రహ్మణశ్చ రేతః పాతో బభూవ హ | తత్ర తస్థౌ మహాయోగీ వస్త్రేణాచ్ఛాద్యలజ్జయా || 13 వస్త్రం దగ్ధ్వా సముత్తస్థౌ జ్వలదగ్నిః సురేశ్వరః | కోటి తాళప్రమాణశ్చ సశిఖశ్చ సముజ్వలన్ || 14 కృష్ణస్తద్వర్ధనం దృష్ట్వా ససర్జాపః స్వలీలయా | నిశ్వాసవాయునా సార్ధం ముఖబిందుం సముద్గిరన్ || 15 విశ్వౌఘం ప్లావయామాస ముఖబిందుజలం ద్విజ | తత్ర కించిజ్జలకణం వహ్నిం శాంతం చకార హ || 16 తతః ప్రభృతి తేనాగ్ని స్తోయాన్నిర్వాణతాం వ్రజేత్ | మారణము, స్తంభనము, జృంభణము, శోషణము, ఉన్మాదము అను ఐదు బాణాలను మన్మథుడు ధరించెను. మన్మథుడు తన బాణముల శక్తిని పరీక్షించుటకై వాటినన్నిటిని అచ్చటనున్న దేవతలపై ప్రయోగించినాడు. మన్మథబాణ ప్రయోగమువలన పరమేశ్వరుని ఇచ్ఛవలన అచటనున్న దేవతలందరు వెంటనే మోహమును పొందినారు. రతీదేవిని చూచిన బ్రహ్మదేవునికి వెంటనే రేతోపాతము జరిగినది. మహాయోగియైన బ్రహ్మదేవుడు సిగ్గుతో వస్త్రముతో దానిని కప్పుకొనెను. కాని జ్వలించుచున్న ఆ అగ్ని బ్రహ్మ దేవుని వస్త్రమును కాల్చివేసి కోటి తాటిచెట్ల ప్రమాణముతో మంటలతో పెరుగసాగెను. పెనుమంటలతో పెరుగుచున్న అగ్నిని చూచి శ్రీకృష్ణుడు తన లీలతో నీటిని సృష్టించెను. భగవంతుని నిశ్వాసవాయువు వలన వెదజల్లబడిన ముఖబిందుజలము సర్వ ప్రపంచములను పవిత్రము చేసినది. ఆ ముఖబిందుజలము యొక్క చిన్న కణమే భయంకరమైన ఆ అగ్నిని చల్లార్చినది. నాటినుండి అగ్ని, నీటి వల్ల శాంతిని పొందుచున్నది. ఆవిర్భూతః పుమానేకః తతస్తధిదేవతా || 17 ఉత్తస్థౌ తజ్జలాదేకః పుమాన్ స వరుణః స్మృతః | జలాధిష్ఠాతృదేవోzసౌ సర్వేషాం యాదసాంపతిః || 18 భగవంతుడు సృష్టించిన జలములనుండి వాటికి అధిదేవతయైన పురుషుడుద్భవించాడు. సమస్త జలములకుఅధిపతి, జలములకు అధిష్టానదేవతయైన ఆ పురుషుడు వరుణుడని పిల్వబడినాడు. ఆవిర్భభూవ కన్యైకా తద్వహ్నేః వామ పార్శ్వతః | సా స్వాహా వహ్నిపత్నీం తాం ప్రవదంతి మనీషిణః || 19 జలేశస్య వామపార్శ్వాత్ కన్యా చైకా బభూవ సా | వరుణానీతి విఖ్యాతా వరుణస్య ప్రియాసతీ || 20 అగ్నికి ఎడమవైపు ఆవిర్భవించిన కన్యను 'స్వాహాస అని, అగ్నియొక్క భార్య అని విద్వాంసులు అంటారు. అట్లే వరుణుని యొక్క వామపార్శ్వమున ఆవిర్భవించిన కన్యను ''వరుణానీ|| అని, వరుణుని యొక్క భార్య అని కూడ అంటారు. బభూవ పవనః శ్రీమాన్ విభోః నిశ్వాసవాయుతః | సచ ప్రాణాశ్చ సర్వేషాం నిశ్వాసస్తత్ఫలోద్భవః || 21 తస్య వాయోః వామపార్శ్వాత్ కన్యా చైకా బభూవ హ | వాయోఃపత్నీ చ సా దేవీ వాయవీ పరికీర్తితా || 22 పరమాత్మ నిశ్వాసమునుండి ఉద్భవించిన వాయువు సమస్త ప్రాణులకు ప్రాణముగా నయ్యెను. అదే ఇతర ప్రాణులకు నిశ్వాసముగా మారినది. ఆ వాయువు యొక్క ఎడమ పార్శ్వమున ఆవిర్భవించిన స్త్రీ వాయుపత్ని. ఆమెను ''వాయవి'' అని పిలుతురు. కృష్ణస్య కామబాణన రేతఃపాతో బభూవ హ | జలే తద్రేచనం చక్రే లజ్జయా సుర సంసది|| 23 సహస్రవత్సరాంతే తడ్డింభరూపం బభూవహ | తతో మహాన్ విరాట్ జజ్ఞే విశ్వౌఘాధార ఏవ సః || 24 యసై#్యకలోమవివరే విశ్వైకస్య వ్యవస్థితిః | స్థూలాత్ స్థూలతరః సోzపి మహాన్నాన్యః తతః పరః || 25 స ఏవ షోడశాంశోzపి కృష్ణస్య పరమాత్మనః | మహావిస్ణుః స విజ్ఞేయః సర్వాధారః సనాతనః || 26 మన్మథుని బాణమువలన బ్రహ్మకు రేతః పతనము జరుగగా అతడు దానికి సిగ్గుతో జలమున వదిలెను. ఆ రేతస్సు వేయి సంవత్సరముల తరువాత శిశు రూపమును చెందినది. ఆ శిశువే ప్రపంచములకన్నిటికి ఆధార భూతుడు. మహత్స్వరూపుడు, విరాడ్రూపుడు. అతనియొక్క ఒక్కొక్క రోమకూపమున ఒక్కొక్క విశ్వముండును. అతడు స్థూలస్వరూపములకెల్లా స్థూలరూపుడు. అతనికంటె మహత్ స్వరూపుడు ఎవ్వరూ లేరు. అతడు కృష్ణ పరమాత్మ యొక్క పదునారవ అంశము. సర్వాధారుడు సనాతనుడైన అతడే మహావిష్ణువు. మహార్ణవే శయానః స పద్మపత్రం యథాజలే | బభూవతుః తౌ ద్వౌ దైత్యౌ తస్యకర్ణమలోద్భవౌ || 27 తౌ జలాచ్చ సముత్థాయ బ్రహ్మాణం హంతుముద్యతౌ | నారాయణశ్చ భగవాన్ జఘనే తౌ జఘాన హ || 28 బభూవ మేదినీ కృత్స్నా కార్త్స్యేన మేదసా తయోః | తత్రైవ సంతి విశ్వాని సా చ దేవీ వసుంధరా || 29 ఆ మహావిష్ణువు జలమున తామరాకువలె సముద్రముపై పవళించియుండగా అతని కర్ణమలమునుండి ఇద్దరు రాక్షసులు పుట్టిరి. వారు పుట్టగనే సముద్రజలములనుండి పైకి వచ్చి బ్రహ్మదేవుని చంపుటకు పూనుకొనిరి. అందువలన నారాయణుడు వారిని తన ఊరువులమధ్య నుంచుకొని చంపెను. ఆ రాక్షసులయొక్క మేదస్సు వలన ఈ మేదిని (భూమి) ఏర్పడినది. ఈ భూమిపై విశ్వములన్ని ఉన్నవి. ఆ దేవిని ''వసుంధర'' అని అందురు. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ బ్రహ్మఖండే సౌతి శౌనక సంవాదే సృష్టినిరూపణ చతుర్థోzధ్యాయః || బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమగు బ్రహ్మఖండమున సృష్టినిరూపణ ప్రకరణమున చతుర్థాధ్యాయము సమాప్తము.