sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకాదశోధ్యాయః - గంగను మోహించిన శ్రీకృష్ణుని రాధాదేవి దూషించుట నారద ఉవాచ - నారద మహర్షి ఇట్లనెను - కలేః పంచసహస్రే సా సమతీతే సురేశ్వరీ | క్వగతా సా మహాభాగా తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 1 గంగాదేవి కలియుగమున ఐదువేల సంవత్సరముల తర్వాత ఎక్కడికి వెళ్ళినదో వివరముగా తెలుపుడు. నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను- భారతం భారతీశాపాత్ సమాగత్యేశ్వరేచ్ఛయా | జగామ తం చ వైకుంఠం శాపాంతే పునరేవ సా || 2 భారతం భారతీ త్యక్త్వా చాగమత్ తత్‌హరేః పదం | పద్మావతీ చ శాపాంతే గంగాయాశ్చైవ నారద || 3 గంగా సరస్వతీ లక్ష్మీశ్చైతాస్తిస్రః ప్రియా హరేః | తులసీ సహితా బ్రహ్మన్ చతస్రః కీర్తితాః శ్రుతౌ ||
4 నారదా! సరస్వతీ దేవి యొక్క శాపముననుసరించి భారతదేశమును చేరిన గంగాదేవి శాపము తీరిన తరువాత మరల వైకుంఠమునకు చేరెను. అట్లే గంగా దేవి యొక్క శాపము ముగిసినపిదప లక్ష్మీ సరస్వతులు వైకుంఠమునకు చేరిరి. వేదములలో శ్రీహరికి గంగా సరస్వతి, లక్ష్మీ, తులసీదేవి యను నలుగురు ఇష్టమైన వారని చెప్పబడినది. నారద ఉవాచ - నారదమహర్షి ఇట్లడిగెను - హేతునా కేన దేవీ వై విష్ణుపాదాబ్జ సంభవా | ధాతుః కమండలుస్థాచ శంకరస్య శిరోగత్యా ||
5 బభువ సాముని శ్రేష్ఠ గంగా నారాయణ ప్రియా | అహో కేన ప్రకారేణ తన్మే వ్యాఖ్యాతుమర్హసి ||
6 బ్రహ్మదేవుని కమండలువు లోను పరమశివుని శిరస్సు పైన నున్న గంగాదేవి ఎందువలన విష్ణుపాదాబ్జసంభవయైనది. అట్లే నారాయణుని ప్రియురాలుగా ఎట్లైనది ఈ విషయమును నాకు వివరించి చెప్పుడు. శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లనెను - పురాబభూవ గోలోకే సా గంగా ద్రవరూపిణీ | రాధాకృష్ణాంగ సంభూతా తదంశా తత్స్వరూపిణీ ||
7 ద్రవాధిష్టాతృరూ పా యా రూపేణ ప్రతిమా భువి | నవ¸°వన సంపన్నా రత్నాభరణ భూషితా || 8 శరన్మధ్యాహ్న పద్మాస్యా సస్మితా సుమనోహరా | తప్తకాంచన వర్ణాభా శరచ్చంద్ర సమప్రభా ||
9 స్నిగ్దప్రభాzతి సుస్నిగ్దా శుద్ద సత్వస్వరూపిణీ | సుపీన కఠినశ్రోణీ సునితంబముగం వరం ||
10 పీనోన్నతం సుకఠినం స్తనయుగ్మం సువర్తులం | సుచారు నేత్రయుగళం సుకటాక్షం సువక్త్రిమం ||
11 వక్రిమం కబరీభారం మాలతీ మాల్యసంయుతం | సింధూర బిందు లలితం సార్థం చందన బిందుభిః ||
12 కస్తూరీ ప్రతికా యుక్తం గండయుగ్మం మనోహరం | బిందూక కుసుమాకారమధరోష్ఠం చ సుందరం ||
13 పక్వదాడిమ బీజాభ దంతపంక్తి సముజ్వలా | వాససీ వహ్నీశుద్దే చ నీవీయుక్తే చ బిభ్రతీ ||
14 సా సకామా కృష్ణపార్శ్వే సముత్తస్థే సులజ్జితా | పద్మపత్ర సమానాభ్యాం లోచనాభ్యాం విభోర్ముఖం ||
15 నిమేష రహితాభ్యాం చ పిబంతీ సతతం ముదా | ప్రపుల్ల వదనా హర్షాన్నవ సంగమ లాలసా ||
16 మూర్ఛితా ప్రభూరూపేణ పులకాంకిత విగ్రహా | ఏతస్మిన్నంతరే తత్రవిద్యమానాచ రాధికా ||
17 గోపీత్రింశత్కోటి యుక్తా కోటి చంద్ర సమప్రభా | కోపేన రక్తపద్మాస్యా రక్త పంకజలోచనా ||
18 శ్వేత చంపకవర్ణాభా మత్తవారణగామినీ | అమూల్య రత్నఖచిత నానాభరణ భూషితా ||
19 మాణిక్యఖచితం హారమమూల్యం వహ్నిశౌచకం | పీతాభ వస్త్రయుగళం నీవీయుక్తం చ బిభ్రతీ ||
20 స్థల పద్మప్రభాజుష్టం కోమలం చ సురంజితం | కృష్ణదత్తార్ఘ్వ సంయుక్తం విన్యసంతీ పదాంబుజం ||
21 రత్నేంద్ర రాజి ఖచిత విమానాదవరూహ్య చ | సేవ్యమానా చ సఖీభిః శ్వేత చామర వాయునా ||
22 కస్తూరీ బిందుతిలకం చందనేందు సమన్వితం | దీప్త దీప ప్రభాకారం సిందూరాయణ సుందరం ||
23 దధతీ భాలమధ్యేచ సీమంతాధస్తదుజ్వలం | పారిజాత ప్రసూనాది మాలాయుక్తం సువక్రిమం ||
24 సుచారు కబరీ భారం కంపయంతీ చ కంపితా | సుచారు నాసాసంయుక్తమోష్టం కంపయితీ రుషా ||
25 పూర్వకాలమున గోలోకమందు గంగాదేవి రాధాకృష్ణుల అంగములనుండి ద్రవరూపముగా పుట్టినది. ద్రవవస్తువులకు ఆమె అధిష్టాన దేవత. నవ¸°వనముతో రత్నాభరణములో ఉన్న ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలెనున్నది. ఆమె శరీరకాంతి బంగారు వలె నున్నది. శుద్ద సత్వ స్వరూపిణీ యగు ఆగంగాదేవీ పీనము, కఠినమైన నితంబముతో, పీనోన్నతము, సుకఠినమైన స్తనయుగ్మముతో, అందమైన నేత్ర యుగళముతో అలరారుచున్నది. అట్లే ఆ దేవి మాలతీ మాలగల వంకర కొప్పుగలది. పాపిటల చంతన బిందువులతో నున్న సిందూర బిందువులున్నవి. చెక్కిళ్ళపై కస్తూరి పత్రములున్నవి. ఆమె దంతములు పండిన దానిమ్మగింజలవలెనున్నవి. బంగారు కాంతి గల రెండు వస్త్రములను ధరించి శ్రీకృష్ణుని పార్శ్వమున లజ్జతో పద్మపత్రములవంటి కన్నులతో శ్రీ కృష్ణుని ముఖముని చూచుచు కామముతో మూర్ఛచెందినది. ఆ సమయమున అచ్చటనే ఉన్న రాధిక ముఖము కోపముతో ఎరుపెక్కినది. తెల్లని చంపక పుష్పము వంటి కాంతిగల ఆ రాధ రత్నాభరణములను రెండు పీతాంబరములను ధరించి పద్మముల వంటి కాంతిగల కోమలమైన పాదములను రత్నవిమానమునుండి క్రింద ఉంచి చెలికత్తెలు చామరములు వీయగా అందమైన కొప్పును కదలించును కోపముతో పెదవులు కంపించగా అచ్చట నిలిచినది. గత్వా తష్టౌకృష్ణపార్వ్శే రత్న సింహాసనే వరే | సఖీనాం చ సమూహైశ్చ పరిపూర్ణా విభోః సభా ||
26 తాం చ దృష్ట్యా సముత్తస్థౌ కృష్ణః సాదరమచ్యుతః | సంభాష్య మధురాలాపైః సస్మితశ్చ ససంభ్రమః ||
27 ప్రణము రభిసంత్రస్తా గోపా నమ్రాత్మకంధరాః తుష్టువుస్తే చ భక్త్వా తం తుష్టాన పరమేశ్వరం ||
28 రాధాదేవి తన సఖులతో శ్రీకృష్ణుని పార్శ్వమందున్న రత్నసింహాసనమున కూర్చొనెను. అమెను చూచి శ్రీకృష్ణుడు ఆదరముతో లేచి మధురమైన మాటలతో పలుకరించెను. అచ్చటనున్న గొల్లలు వంచిన శిరస్సులతో శ్రీకృష్ణుని స్తుతింపగా రాధాదేవి సైతము అతనిని స్తుతించినది. ఉత్థాయ గంగా సహసా సంభాషాం చ చకార సా | కుశలం పరి పప్రచ్ఛ భీతాzతివినయేనచ ||
29 నమ్రభావస్థితా త్రస్తా శుష్క కంఠౌష్ట తాలుకా | ధ్యానేన శరణాపన్నా శ్రీకృష్ణ చరణాంబుజే ||
30 తత్ హృత్పద్మేస్థితః కృష్ణో భీతాయో చాzభయం దదౌ | బభూవ స్థిరచిత్తా సా సర్వేశ్వరవరేణ చ ||
31 రాధికా దేవిని చూచి గంగ వెంటనే లేచి భయముతో అతివినయముతో కుశలమడిగెను. ఆ గంగ వినయముతో భయము వలన ఎండిపోయిన శ్రీకృష్ణుని శరణు వేడినది. అతడామెకు అభయమివ్వగా గంగాదేవికి ధైర్యము సమకూరినది. ఊర్థ్వం సింహాసనస్థాం చ రాధాం గంగా దదర్శ సా | సుస్నిగ్దాం సుఖ దృశ్యాం చ జ్వలంతీం బ్రహ్మ తేజసా ||
32 అసంఖ్య బ్రహ్మణామాద్యాం చాది సృష్టిం సనాతనీం | యథా ద్వదశవర్షీయాం కన్యాంచ నవ¸°వనాం ||
33 విశ్వవృందే నిరుపమాం రూపేణ చ గుణన చ | శాంత కాంతామనంతాం తామాద్యంత రహితాం సతీం ||
34 శుభాం సుభద్రాం సుభగాం స్వామిసౌభాగ్య సంయుతాం | సౌందర్య సుందరీం శ్రేష్ఠాం సుందరీష్వఖిలాసు చ ||
35 కృష్ణార్ధాంగీం కృష్ణసమాం తేజసా వయసా త్విషా | పూజితాం చ మహాలక్ష్మీం మహాలక్ష్మీశ్వరేణ చ ||
36 ప్రచ్ఛాద్యమానాం ప్రభయా సభామీశస్య సుప్రభాం | సఖీదత్తం చ తాంబూలం గృహ్ణతీమన్యదుర్లభం ||
37 అజన్యాం సర్వజననీం ధన్యాం మాన్యాం చ మానినీం కృష్ణప్రాణాధిదేవీం చ ప్రాణప్రియతమాం రమాం ||
38 దృష్ట్యా రాసేశ్వరీం తృప్తిం న జగామ సురేశ్వరీ | నిమేష రహితాభ్యాం చ లోచనాభ్యాం పపౌ చ తాం ||
39 రాధాదేవి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచుండెను. ఆమె బ్రహ్మలందరికి ఆదిదేవత. పన్నెండు సంవత్సరముల కన్యవలె ఉండెను. రూపమున గుణములలో ప్రపంచమున సాటిలేనిది, ఆద్యంత రహిత. ప్రపంచమున నున్న సుందరస్త్రీలందరికంటె సుందరమైనది. శ్రీకృష్ణునకు అర్ధాంగి. తేజస్సున, వయస్సున కాంతియందు శ్రీకృష్ణునితో సమానమైనది. మహాలక్ష్మీశ్వరుడైన శ్రీకృష్ణునిచే పూజింపబడినది. శ్రీకృష్ణునకు ప్రాణప్రియ. అట్టి రాధ సింహాసనమున ఉండగా గంగాదేవి రెప్పవాలని కన్నులతో ఆమెను చూచినది. ఏతస్మిన్నంతరే రాధా జగదీశమువాచ సా | వాచా మధురయా శాంతా వినీతా సస్మితా మునే ||
40 అప్పుడు రాధ వినయవంతురాలై మధురమైన మాటలతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికినది. రాధికోవాచ- రాధిక ఇట్లు పలికెను.- కోzయం ప్రాణశ కల్యాణీ సస్మితా త్వన్ముఖాంబుజం | పశ్యంతీ సతతం పార్శ్వం సకామా రక్తలోచనా ||
41 మూర్చాం ప్రాప్నోతి రూపేణ పులకాంకిత విగ్రహా | వస్త్రేణ ముఖ మాచ్ఛాద్య నిరీక్షంతీ పునః పునః ||
42 త్వంచాపి తాం సన్నిరీక్ష్య సకామః సస్మితః సదా | మయి జీవతి గోలోకే భూతా దుర్వృత్తిరీదృశీ ||
43 త్వమేవ చైవం దుర్వృత్తం వారం వారం కరోషిచ | క్షమాం కరోమి తే ప్రేవ్లూ స్త్రీజాతి ః స్నిగ్దమానసా ||
44 సంగృహ్యేమాం ప్రియామిష్టాం గోలోకాద్గచ్ఛలంపట | అన్నథా నహితే భ్రదం భవిష్యతి సురేశ్యం ||
45 హే భగవాన్ చిరునవ్వుతో నీ ముఖాంబుజమును చూచుచున్న ఈ కాముకురాలెవరు? మిమ్ములనుచాటుగా మాటిమాటికి చూచుచు పులకించిన శరీరముతో మూర్చపోవుచున్నది. నీవు కూడా ఆమెను కాముకుడవై చిరునవ్వుతో చూచుచున్నావు. స్త్రీజాతికి సహజమైన ప్రేమతో మాటిమాటికి క్షమించిచున్నాను. అందువలన నీకు ప్రియురాలైన ఈస్త్రీని తీసికొని గోలోకమునుండి వెళ్ళిపొమ్ము. లేనిచో నీకు మంచి జరుగదు. దృష్టస్త్యం విరజాయుక్తో మయా చందన కాననే | క్షమా కృతా మయాపూర్వం సఖీనాం వచనాదహో ||
46 త్వయా మచ్ఛబ్దమాత్రేణ తిరోధానం కృతం పురా | దేహం సంత్యజ్య విరజా నదీరూపా బభూవ సా ||
47 కోటి యోజన విస్థీర్ణా తతో దైర్ఘ్యే చతుర్ఘుణా | అధ్యాzపి విద్యమానా సా తవసత్కీర్తి రూపిణీ ||
48 గృహం మయి గతాయాం చ పునర్గత్వా తదంతికం | ఉచ్చైరరౌషీః విరజే చేతి సంస్మరన్ ||
49 తదా తోయాత్పముత్థాయ సాయోగాత్ సిద్దయోగినీ | సాలంకారా మూర్తిమతీ దదౌతుభ్యం చ దర్శనం
50 తతస్తాం చ సమాశ్లిష్య వీర్యధానం కృతం త్వయా | తతో బభూవుప్తస్యాం చ సముద్రాః సప్తచైవ హి ||
51 శ్రీకృష్ణా! నీవు ఒకప్పుడు చందనవనములో ''విరజ''తోకలిసి విహరించుచున్నపుడు నేను చూచి కోపగించితిని, కాని నా స్నేహితురాండ్ర మాటలను విని నిన్ను క్షమించితిని. నీవు విరజతో కలసి తిరుగుతున్నప్పుడు నా శబ్దమును వినినంతమాత్రమున నీవు మాయమైతివి. విరజ తన శరీరమును వదలి, నదిగా మారినది. విరజానది కోటి యోజనముల విస్తీర్ణముతో నాలుగు కోట్ల యోజనముల పొడవుతో నేటికిని, ప్రవహించుచున్నది. నేను ఇంటికి తిరిగి పోగానే నీవు ఆమె దగ్గరకు వెళ్ళి విరజా! విరజా! అని గట్టిగా పిలిచితివి. అప్పుడు సిద్దయోగినియైన విరజాదేవి నీటినుండి బయటకు వచ్చెను. అప్పుడామెను నీవు కౌగిలించుకొని రతి జరుపగా ఆమెకు నీవలన ఏడు సముద్రములు ఉద్భవించినవి. దృష్టస్త్యంచ శోభయా గోప్యా యుక్తశ్చంపక కాననే | సద్యో మచ్ఛబ్దమత్రేణ తిరోధానం కృతం త్వయా ||
52 శోభా దేహం పరిత్యజ్య ప్రావిశచ్ఛంద్రమండలం | తతస్తస్యాః శరీరం చ స్నిగ్దం తేజో బభూవహ ||
53 సంవిభజ్య త్వయా దత్తం హృదయేన విదూయతా | రత్నాయ కించిత్ స్వర్గాయ కించిన్మతివరాయ చ ||
54 కించిత్ స్త్రీణాం ముఖాబ్జేభ్యః కించి ద్రాజ్ఞే చ కించన | కించిత్ ప్రకృష్టవస్త్రేభ్యో రౌప్యేభ్యశ్చాపి కించన ||
55 కించిత్ చందనపంకేభ్యః తోయేభ్యశ్చాపి కించన | కించిత్ కిసలయేభ్యశ్చ పుష్పేభ్యశ్చాపి కించన ||
56 కించిత్ ఫలేభ్యః సస్యేభ్యః సుపక్వేభ్యశ్చకించన | నృపదేప గృహేభ్యశ్చ సంస్కృతేభ్యశ్చ కించన ||
57 శ్రీకృష్ణా! నీవొకప్పుడు చంపకవనములో శోభయను గోపికతో కలిసి తిరుగుచుండగా చూచితిని. అప్పుడు కూడా నా శబ్దమును వినగానే నీవు అంతర్ధానమైతివి. శోభకూడ తన శరీరమును వదలి చంద్రమండలమును ప్రవేశించినది. ఆమె శరీరము గొప్ప తేజస్సుగా మారగా నీవు బాధపడు మనస్సుతో రత్నము, బంగారమున, విద్యవంతులయందు, స్త్రీల ముఖములయందు, రాజునందు, విలువైన వస్త్రముల యందు కాసులయందు, చందనమున, నీటిలో చిగురుటాకుల యందు రాజుల ఇండ్లయందు, దేవాలయములయందు, సంస్కృతులైన జనులయందు తేజోరూపమైన ఆమెయొక్క శరీరమును పంచిపెట్టితివి. దృష్టస్త్యం ప్రభయా గోప్యా యుక్తో బృందావనే వనే | సద్యోమచ్ఛబ్దమాత్రేణ తిరోధానం కృత్యం త్వయా ||
58 ప్రభా దేహం పరిత్యజ్య ప్రావిశత్ సూర్యమండలం | తతస్తస్యాః శరీరం చ తీక్షణం తేజో బభూవహ ||
59 సం విభజ్య త్వయా దత్తం ప్రేవ్ణూ చ రుదతా పురా | విభజ్య చక్షుషోర్దత్తం లజ్జయా తద్భయేన చ ||
60 హుతాశనాయ కించిచ్ఛ నృపేభ్యశ్చాపి కించిత్ పురుష సంఘేభ్యో దేవేభ్యశ్చాపి కించన ||
61 కించిత్ దస్యుగణభ్యశ్చ నాగేభ్యశ్చాపి కించన | బ్రాహ్మణభ్యోమునిభ్యశ్చ తపస్వీభ్యశ్చ కించన ||
62 స్త్రీభ్యః సౌభాగ్య యుకాభ్యో యుశస్విభ్యశ్చ కించన | తచ్చ దత్వాచ సర్వేభ్యః పూర్వం రోదితు ముద్యతః ||
63 శ్రీకృష్ణా నీవు పూర్వము ''ప్రభ'' అను గోపికాస్త్రీతో కలిసి విహరించుచుండగా నేను చూచితిని. అప్పుడు కూడా నా శబ్దమును వినగానే నీవు అంతర్దానమైతివి. ''ప్రభ'' కూడా దేహమును వదిలి సూర్యమండలమునకు పోయినది. అప్పుడు ఆమె శరీరమునుండి వేడియైన తేజస్సు ఉద్భవించినది. నీవప్పుడు ఆమెపై గల ప్రేమతో ఏడ్చుచు కళ్ళకు, అగ్నికి, రాజులకు మానవసంఘములకు, దేవతలకు, దస్యులకు, సర్పములకు, బ్రాహ్మణులకు, మునులకు, సౌభాగ్యవతులైన స్త్రీలకు, కీర్తి కలవారికి ఈ తేజస్సును పంచి ఇచ్చితివి. శాంత్యా గోప్యా యుతస్త్వం చ దృష్టో వై రాసమండలే | వసంతే పుష్పశయ్యాయాం మాల్యవాన్ చందనోక్షితః ||
64 రత్నప్రదీపైర్యుక్తశ్చ రత్న నిర్మితమందిరే | రత్న భూషణ భూషాఢ్యో రత్నభూషితయా సహా ||
65 త్వయా దత్తం చ తాంబూలం భుక్తా సాచ సువాసితం | తయా దత్తం చ తాంబూలం భుక్తావాన్ త్వంపురా విభో ||
66 సద్యో మచ్ఛబ్ద మాత్రేణ తిరోధానం కృతం త్వయా | శాంతిర్దేహం పరిత్యజ్య భియా లీనా త్వయి ప్రభో ||
67 తతస్త్స్యాః శరీరం చ గుణశ్రేష్ఠం బభువహ | సంవిభజ్య త్వయాదత్తం ప్రేవ్ణూ చ రుదతా పురా ||
68 విశ్వే విషయిణ కించిత్ సత్వరూపాయ విష్ణవే | శుద్దసత్వస్వరూపాయై కించిత్ లక్ష్మై పురా విభో ||
69 త్వన్మంత్రోపాసకేభ్యశ్చ వైశ్ణవేభ్యశ్చ కించన | తపస్విభ్యశ్చ ధర్మాయ ధర్మిష్ఠేభ్యశ్చ కించన ||
70 శ్రీకృష్ణా! ఒకప్పుడు నీవు రత్నమందిరములున్న రాసమండలమున 'శాంతి' యను గోపికతో కలసి పూలపాన్పుపై ఉండగా నేను చూచితిని, అప్పడు ఆమెను నీవిచ్చిన సుగంధమైన తాంబులమును తినినది. అట్లే నీవు కూడా ఆమె ఇచ్చిన తాంబూలమును తింటివి. అప్పడు కూడా నా చప్పుడు వినపడగానే లీనమైపోయింది. ఆమే శరీరము శ్రేష్టగుణమగు రూపుదాల్చగా దానిని నీవు ఆమెపై గల ప్రేమతో ఏడ్చుచు సత్వస్వరూపుడైన విష్ణువుకు, లక్ష్మీదేవికి, నీమంత్రము నుపాసించు వైష్ణవులకు, మునులకు ధర్మునకు, ధర్మిష్టులకు కొంత కొంత భాగము నిచ్చితిని. మయా పూర్వం హి దృష్టస్యం గోప్యా చ క్షమయాసహ | సువేషవాన్ మాల్యవాంశ్చ గంధచందనసంయుతః ||
71 రత్న భూషితయా చారు చందనోక్షితయాతయా | సుఖేన మూర్ఛితస్తల్పే పుష్పచందనసంయుతే ||
72 శ్లిష్టోzభూర్నిద్రయా సద్యః సుఖేన నవసంగమాత్ | మయాప్రబోధితౌ సాచ భవాంశ్చ స్మరణం కురు ||
73 గృహీతం పీతవస్త్రం తే మురళీ చ మనోహరా | వనమాలా కౌస్తుభశ్చాప్యమూల్యం రత్నకుండలం ||
74 పశ్చాత్ ప్రదత్తంప్రేవ్ణూచ సఖీనాం వచనాదహో | లజ్జయా కృష్ణవర్ణోభూరధ్యాzపి చ భవాన్ ప్రభో ||
75 క్షమా దేహం పరిత్యజ్య లజ్ఞయా పృథివీం గతా | తతస్తస్యాః శరీరం చ గుణశ్రేష్ఠం బభువ హ ||
76 సంవిభజ్య త్వయాద్తతం ప్రేవ్ణూ చ రుదతా పురా | కించిద్దత్తం విష్ణవేచ వైష్ణవేభ్యశ్చ కించన ||
77 ధర్మిష్ఠేభ్యశ్చ ధర్మాయ దుర్భలేభ్యశ్చ కించన | తపస్వభ్యోzపి దేవేభ్యః పండితేభ్యశ్చ కించన ||
78 ఏతత్తే కథితం సర్వం కిం భూయః శ్రోతు మిచ్చసి | త్వద్గుణం బహు విస్తారం జానామి చ పరం విభో ||
79 ఇత్యేవముక్త్యా సారాధా రక్తపంకజలోచనా | గంగాం వక్తుం సమారేభే సమ్రాస్యాం లజ్జితాం సతీం ||
80 నీవొకప్పుడు''క్షమ''యనే గోపికతో కలిసియుండగా చూచితిని. అప్పుడు నీవు మంచి వేషముతో పుష్పమాల చందనము ధరించియున్నావు. ఆ గోపిక కూడా రత్నాభరణములతో చందనముతోనుండినది. మీరిరువురు పుష్పములు చందనము కలశయ్యపై సుఖమూర్చితులై ఉంటిరి. ఆ సమయమున నేను మిమ్ములనిద్దరిని నిద్రనుండి లేపినసంగతిని స్మరింపుము. అప్పుడు నేను తీసికొన్న పీతవస్త్రము, మురళి, వనమాలా కౌస్తుభరత్నములను ప్రేమతో నా చెలికత్తెల మాటపై నీకు తిరిగి ఇచ్చివేసితివి. అప్పుడు నీవు సిగ్గుతో నల్లబడితివి. అనలుపురంగు నేటికి నీ శరీరమున కన్పించుచున్నది. క్షమాదేవి శరీరమును వదిలిపెట్టి భూమినాశ్రయించినది. తరువాత ఆమె శరీరము ఒక శ్రేష్ఠగుణమైనది. అప్పుడు నీవామెపై గల ప్రేమతో ఏడ్చుచు ఆమె శరీరమును విష్ణుమూర్తికి, వైష్ణవులకు, ధర్మిష్ఠులకు, ధర్మునకు, దుర్బలులకు, మునులకు, దేవతలకు, పండితులకు, పంచిపెట్టితివి. ఇంకను ఏమైన వినదల్చితివా? నీగుణమును సంపూర్ణముగా నేనెరుగుదును అని రాధ ఎరుపెక్కిన కళ్ళతో సిగ్గుపడుచు నమస్కరించుచున్న గంగతో మాట్లాడుటకు మొదలిడెను. గంగా రహస్యం యోగేన జ్ఞాత్వా వై సిద్దయోగినా | తిరోభూయ సభామధ్యాత్ స్వజలం ప్రవివేశ సా ||
81 రాధా యేగేవ విజ్ఞాయ సర్వత్రావస్థితాం చ తాం | పానం కర్తుం సమారేభే గండూషాత్సిద్ధయోగినీ ||
82 గంగా రహస్యం యేగేన జ్ఞాత్వా వై సిద్దయోగినీ | శ్రీకృష్ణ చరణాంభోజం పరమం శరణం యయ ||
83 గోలోకం చైవ వైకుంఠం బ్రహ్మలోకాదికం తథా | జల జంతు సమూహైశ్చ మృతదేహైః సమన్వితం ||
84 సర్వతో జలశూన్యంచ శుష్క పంకజ గోళకం | జల జంతు సమూహైశ్చ మృతదేహైః సమన్వితం ||
85 బ్రహ్మ విష్ణు శివానంత ధర్మేంద్రేందు దివాకరాః | మనవో మానవాః సర్వే దేవాః సిద్దా తపస్వినః ||
86 గోలోకం చ సమాజగ్ముః శుష్కకంఠౌష్ఠతాలుకా ః | సర్వే ప్రణముర్గోవిందం సర్వేశం ప్రకృతేః పరం ||
87 వరం వరేణ్యం వరదం వరిష్ఠం వరకారణం | వరేశం చ వరార్హం సర్వేషాం ప్రవరం ప్రభుం ||
88 నిరీహంచ నిరాకరం నిర్లప్తంచ నిరాశ్రయం | నిర్గుణం చ నిరుత్సాహం నిర్వ్యూహం చ నిరంజనం ||
89 స్వేచ్ఛామయం చ సాకారం భక్తానుగ్రహ విగ్రహం | సత్యస్వరూపం సత్యేశం సాక్షిరూపం సనాతనం ||
90 పరం పరేశం పరమం పరమాత్మానమీశ్వరం | ప్రణమ్య తుష్ణువుః సర్వే భక్తి నమ్రాత్మ కంధరాః ||
91 సగద్గదాః సాశ్రునేత్రాః పులకాంకిత విగ్రహాః | సర్వే సంస్తూయ సర్వేశం భగవంతం పరం హరిం ||
92 జ్యోతిర్యయం పరం బ్రహ్మ సర్వకారణ కారణం | అమూల్య రత్నఖచిత చిత్ర సంహాసన స్థితం ||
93 సేవ్యమానం చ గోపాలైః శ్వేత చామరవాయునా | గోపాలికా నృత్యగీతం పశ్యంతం సస్మితం ముదా ||
94 వల్గువేషైః పరివృతం గోపైశ్చ శతకోటిభిః చందనోక్షిత సర్వాంగం రత్నభూషణ భూషితం ||
95 నవీన నీరద శ్యామం కిశోరం పీతవాసనం | యథా ద్వాదశవర్షీయం బాలం గోపాల రూపిణం ||
96 కోటి చంద్ర ప్రభాజుష్ట పుష్టశ్రీయుక్త విగ్రహం | స్వతేజసా పరివృతం సుసాదృశ్యం మనోహరం ||
97 కోటి కందర్ప సౌందర్య లీలాలావణ్య విగ్రహం | దృశ్యమానం చ గోపీభిః సస్మితాభిశ్చ సంతతం ||
98 భూషణౖర్భూషితాభిశ్చ మహారత్న వినిర్మితై ః | పిబంతీభిర్లోచనాభ్యాం ముఖ చంద్రం ప్రభోర్ముదా ||
99 ప్రాణాధిక ప్రియతమా రాధా వక్షస్థలస్థితం | తయా ప్రదత్తం తాంబూలం భుక్తవంతం సువాసితం || పరిపూర్ణతమం రాసే దదృశుః సర్వతః సురాః ||
100 సిద్దయోగినియైన గంగ యోగజ్ఞానముతో రాధాదేవి చెప్పబోవు మాటల భావమును తెలిసికొని ఆ సభమధ్యలోనుండి తన జలములతో ప్రవేశించినది. రాధాదేవి కూడా యోగజ్ఞానముతో గంగ జలరూపముతో అంతట ఉన్నట్లుగా గుర్తించి ఆ నీటినంతయు త్రాగుటకుపక్రమించెను. గంగాదేవి యోగజ్ఞానముతో రాధాదేవియొక్క మనోభావమును గుర్తించి శ్రీకృష్ణుని పాదములను శరణువేడి అచ్చట విలీనమైనది. రాధాదేవి గోలోకమున వైకుంఠమున బ్రహ్మలోకము మొదలగు లోకములన్నిటిలో గంగాదేవిని చూడలేకపోయినది. గంగాదేవి తన శరీరమును ఉపసంహరించుకొన్నందువలన సమస్తలోకములు జల శూన్యమైనవి. జలజంతువులన్నియు నీరు లేక చనిపోయినవి. అప్పుడు బ్రహ్మ, విష్ణు శివాది దేవతలందరు మనువులు, మానవులు, సిద్దులు మునులందరు ఎండిపోయిన పెదవులు నాలుకలతో ప్రకృతి కంటే ఉన్నతుడైన సర్వేశ్వరుని చూచిరి. ఆ శ్రీకృష్ణుని యొక్క నిర్గుణ తత్వమును తెలిసికొని భక్తులనుగ్రహించు తలపుతో సాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మను సందర్శించుకొనిరి. సమస్త చరాచర సృష్టికి కారణ భూతుడు, జ్యోతిర్మయుడు, రత్న సింహాసనము పైనున్నవాడు. గోపాలురు చామరములు వీయగా గోపికలు నృత్యము గానము సేయుచుండగా అనేక గోపగోపిపరివృతుడు, శరీరమంతటను చందనమును అలదుకొనినవాడు, రత్నభూషణ భూషితుడు, మేఘశ్యాముడు, పీతాంబరము ధరించినాడు, పన్నెండు సంవత్సరముల బాలునివలెనుండువాడు, కోటి చంద్రులకాంతిగల శరీరము కలాడు, కోటి మన్మథకారుడు, ప్రాణములకన్న మిన్నయగు రాధాదేవి తాంబూలమును సేవించుచున్నవాడు. రాధాదేవి వక్షస్థలముపై నున్నవాడగు శ్రీకృష్ణుని దేవతలందరు దర్శించుకొనిరి. మునయే మానవాస్సిద్దాస్తపసా చ తపస్వినః | ప్రహృష్ట మానసాః సర్వే జగ్ముః పరమ విస్మయం ||
101 పరస్పరం సమాలోచ్య తే తుమూచుః చతుర్ముఖం | నివేదితు జగన్నాథం స్వాభిప్రాయమభీప్సితం ||
102 బ్రహ్మా తద్వచనం శ్రుత్వా స్థితం విష్ణోస్తు దక్షిణ | వామతో వామదేవస్య చాగమత్కృష్ణముత్తమం ||
103 పరమానందయుక్తంచ పరమానందరూపకం | సర్వం కృష్ణమయం ధాతా చాపశ్యద్రాసమండల ||
104 సర్వం సమానవేషం చ సమానాసన సంస్థితః ||
105 ద్విభుజం మురళీహస్తం వనమాల విభూషితం | మయూర పుచ్ఛచూడంచ కౌస్తుభేవ విరాజితం ||
106 అతీవ కమనీయంచ సుందరం శాంత విగ్రహం | గుణ భూషణ రూపేణ తేజసా వయాసా త్విషా ||
107 వాససా యశసాzకృత్యా మూర్త్యా సుందరయా సమం | పరిపూర్ణితమం సర్వ సర్వైశ్వర్య సమన్వితం ||
108 కః సేవ్యః సేవకోవేతి దృష్ట్యా నిర్వక్తుమక్షమః | క్షణం తేజః స్వరూపంచ రూపరాశియుతం క్షణం ||
109 ఏకమేవక్షణం కృష్ణం రాధయా సహితం పరం | ప్రత్యేకాసన సంస్థంచ తయాచ సహితం క్షణం ||
110 రాధారూపధరం కృష్ణం కృష్ణ రూప కలత్రకం | కింస్రీరూపం చ పుంరూపం విధాతా ధ్యాతుమక్షమః ||
111 హృత్పద్మస్థం చ శ్రీకృష్ణం ధాతా ధ్యానేన చేతసా | చకార స్తవనం భక్త్వా ప్రణమ్యాథ త్వనేకధా ||
112 తతః స చక్షురున్మీల్య పునశ్చ తదునుజ్జయా | అపశ్యత్ కృష్ణమేకం చ రాధావక్షస్థల స్థితం ||
113 స్వపార్షదైః పరివృతం గోపీమండల మండితం | పునః ప్రణముః తం దృష్ట్యా తుష్టువుశ్చ పునశ్చతే ||
114 విజ్ఞాయ తదభిప్రాయం తానువాచ సురేశ్వరః | సర్వాత్మా సర్వయజ్ఞేశః సర్వేశః సర్వభావనః ||
115 మునులు, సిద్దులు, మానవులు మొదలగు వారందరు పరమాత్మను చూచి మిక్కిలి సంతోషముతో పరమాశ్చర్యమునకులోనైరి. అప్పుడు వారందరు కలసి ఆలోచించుకొని శ్రీకృష్ణపరమాత్మతో తమ అందరి అభిప్రాయమును వెల్లడించుటకు బ్రహ్మదేవుని ఎన్నుకొనిరి. బ్రహ్మదేవుడు వారి మాటలకు ఒప్పుకొని విష్ణుపూర్తి యొక్క కుడిభాగమున, పరమశివుని ఎడమభాగమున నున్న కృష్ణుని చూచెను. అచ్చట రాసమండలమున సమస్తము కృష్ణమయముగా కన్పించెను. అందరు ఒకే వేషముతో ఒకే అసనముననున్నట్లు కన్పించిరి. రెండు భుజములతో మురళిచేతిలో ధరించి వనమాలా విభూషితుడై నెమలిపింఛమును, కౌస్తుభరత్నమును ధరించి అతిసుందరముగా శాంతిమూర్తియై యున్నట్లు కనిపించిరి. వారి వస్త్రములు, ఆకృతి, వయస్సు, తేజస్సు, భూషణములందరికి ఒకే విధముగానుండినవి, అచ్ఛట సేవకుడెవరు? యజమాని ఎవరు అని చెప్పవీలుకాకుండెను. ఒక క్షణము కృష్ణుడు రాధ ప్రత్యేకాసనములందున్నట్లు, ఇంకొక క్షణము రాధాదేవితో కలిసి యున్నట్లు , వేరొకక్షణమున రాధాదేవి మాత్రమే కనిపించగా మరియొక క్షణమున కృష్ణుడు మాత్రమే కనిపించెను. అచ్చట స్త్రీలెవరో పురుషులెవరో బ్రహ్మదేవుడు కూడ గుర్తించలేక పోయెను. అప్పుడు బ్రహ్మదేవుడు తన హృదయకమలముననున్న శ్రీకృష్ణుని ధ్యానమనస్కుడై దర్శించి అనేక ప్రకారములుగా నమస్కరించి భక్తితో స్తుతించెను. ఆ తరువాత హృదయకమలమున నున్న శ్రీకృష్ణుని ఆనుజ్ఞతో కళ్ళు తెరవగా గోపిమండల మండితుడు, తన అనుచరగణముతో కలసి రాధాదేవి దగ్గరనున్న శ్రీకృష్ణుని చూచెను. అప్పుడు బ్రహ్మదేవుని వెంటనున్న మానవ దేవత గణము శ్రీకృష్ణునకు పునః పునః నమస్కారములొనరించిరి. అప్పుడు సర్వాత్మ స్వరూపుడు సర్వేశుడైన పరమాత్మ వారి మనోగతమును గుర్తించి ఇట్లనెను. శ్రీ భగవానువాచ - పరమాత్మయైన శ్రీకృష్ణుడిట్లనెను. ఆగచ్ఛ కుశలం బ్రహ్మన్ ఆగచ్ఛ కమలాపతే | ఇహాగచ్చ మహాదేవ శశ్వత్కుశలమస్తు వః ||
116 ఆగతాః స్థ మహాభాగా గంగానయన కారణాత్ ః గంగా మచ్చరణాంబోజే భ##యేన శరణం గతా ||
117 రాధే మాం పాతు మిచ్ఛంతీ దృష్ట్యా మత్సన్నిధానతః | దాస్యామీమాం బహిః కృత్వా యూయం కురుత నిర్భయాం ||
118 శ్రీకృష్ణస్యవచః శ్రుత్యా సస్మితః కమలోద్భవః తుష్టాన సర్వారాధ్యాం తాం రాధాం శ్రీకృష్ణపూజితాం ||
119 వక్త్రైశ్చతుర్భిః సంస్తూయ భక్తి నమ్రాత్మకంధరః | ధాతా చతుర్ధాం వేదానాం ఉవాచ చతురాననః ||
120 గంగాత్వదంగసంభూతా ప్రభోర్వై రాసమండలే | ద్రవరూపా చ సా జాతా ముగ్దయూ శంకరస్వరాత్ ||
121 కృష్ణాంశా చ త్వదంశా చ త్వత్కన్యాసదృశీప్రియా | త్వన్మంత్ర గ్రహణం కృత్వా కరోతు తన పూజనం ||
122 భవిష్యతి పతిస్తస్యా వైకుంఠే చ చతుర్భుజః | భూగతాయాః కళాయాశ్చలవణోదశ్చ వారధిః ||
123 గోలోకస్థా చ యా రాధా సర్వత్రస్థా తదాత్మికా | తదాత్మికా త్వం దేవేశి సర్వదా చ తవాత్మజా ||
124 బ్రహ్మదేవుడా! ఇక్కడికి రమ్ము. శంకరుడా నీవు కూడా ఇక్కడికి రమ్ము. మీరు సుఖముగా ఉండుడు. మీరందరు గంగకై ఇక్కడకు వచ్చితిరి. కాని నా సమీపమున నున్న గంగను రాధాదేవి పానము చేయుటకు సిద్దపడిరి. అందువలన మీరు గంగాదేవి భయమును దూరము చేయుడు. శ్రీకృష్ణుని మాటలు విని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో సర్వారాధ్య, శ్రీ కృష్ణపూజితయగు రాధను, భక్తితో తల వంచుకొని తన చతుర్ముఖములతో ఇట్లు స్తుతించెను. ఈగంగాదేవి రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మ మరియు నీయొక్క శరీరమునుండి జన్మించినది. ఆమె మీ ఇద్దరి అంశకలది నీకు కూతురు వంటిది. ఆమె నీ మంత్రముతో నీ పూజను చేసినచో ఆమెకు వైకుంఠమున నున్న చతుర్భుజుడైన విష్ణువు భర్తకాలగడు. భూమిలో నున్న ఆమె అంశస్వపియైన గంగకు సముద్రుడు భర్త కాగలడు. గోలోకమున నున్న గంగాదేవి నీ వంటిది నీకు కూతురు కూడా అని అనెను. బ్రహ్మణోవచనం శ్రుత్వా స్వీచకార చ సస్మితా | బహిర్బభూవ సా కృష్ణపాదాంగుష్ఠ సఖాగ్రతః ||
125 తత్రైవ సంవృతా శాంతా తస్థౌ తేషాం చ మధ్యతః | ఉవాస తోయాదుత్థాయ తధిష్ఠాతృదేవతా ||
126 తత్తోయం బ్రహ్మణా కించిత్ స్థాపితం చ కమండలౌ | కించిద్దదార శిరసి చంద్రార్దే చంద్రశేఖరః ||
127 గంగాయై రాధికామంత్రం ప్రదదౌ కమలోద్భవః | తత్‌స్తోత్రం కవచం పూజావిధానం ధ్యానమేవ చ ||
128 సర్వం తత్సామవేదోక్తం పురశ్చర్యాక్రమం తథా | గంగా తామేవ సంపూజ్య వైకుంఠం ప్రయ¸° సతీ ||
129 లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ విశ్వపావనీ | ఏతా నారాయణసై#్యన చత్రపోయేషితో మునే ||
130 బ్రహ్మదేవుని మాటలను విని రాధాదేవి సరే యనెను. అప్పుడు గంగా దేవి శ్రీకృష్ణుని పాదాంగుష్టమునుండి బయలు వెడలినది. అచ్చటనే పరమశాంతముగా ఆమె ఉండినది. ఆ గంగనీటిని బ్రహ్మదేవుడు తన కమండలువులో ఉంచుకొనగా పరమశివుడు తన శిరస్సున ధరించెను. బ్రహ్మదేవుడు గంగాదేవికి రాధికామంత్రమును, స్తోత్రమును, కవచమును, పూజావిధానమును. ధ్యాన ప్రకారమును, పురశ్చర్యక్రమమును తెలిపెను. అందువలన గంగ రాధను పూజించి వైకుంఠమును చేరుకొనెను. నారాయణునకు లక్ష్మి సరస్వతి, గంగ, తులసి వీరు నలుగురు భార్యలు. అధతం సస్మితః కృష్ణో బ్రహ్మణం సమువాచహ | సర్వం కాలస్య వృత్తాంతం దుర్భోధ్యమనవిపశ్చితం ||
131 అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునకు కాల వృత్తాంతము నిట్లు చెప్పదొడగెను. శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లు పలికెను - గృహాణ గంగాం హే బ్రహ్మన్ హేవిష్ణో హే మహేశ్వర | శ్రుణు కాలస్య వృత్తాంతం యదతీతం నిశామయ ||
132 యూయం చ యోzన్యదేవాశ్చ మునయే మనస్తథా | సిద్దాస్తపస్వినశ్చైవ యేయే zత్రైవ సమాగతాః || 133 తేతే జీవంతి గోలోకే కాల చక్రవివర్జితే | జలాప్లుతం సర్వవిశ్వమాగతం ప్రాకృతే అయే ||
134 బ్రహ్మాద్యా యేzన్య విశ్వస్థాస్తే లీనా అధునా మయి | వైకుంఠం చ వినా సర్వం సజలం పశ్య పద్మజ ||
135 గత్వా సృష్టిం కురు పునః బ్రహ్మలోకాదికం పరం | స బ్రహ్మాండం విరచయ పశ్చాద్గంగా చ యాస్యతి ||
136 ఏవమన్వేషు విశ్వేషు సృష్ట్యా బ్రహ్మాదికం పునః | కరోమ్యహం పునఃసృష్టిం గచ్ఛ శీఘ్ర సురైః సహ ||
137 ముచ్చక్షుషోర్నిమేషేణ బ్రహ్మణః పతనం భ##వేత్ | గతాఃకతి విధాస్తే చ భవిష్యంతి చ వేధసః ||
138 ఇత్యుక్త్వా రాధికానాతో జగామాంతఃపురం మునే | దేవా గత్వాం పునః సృష్టిం చక్రురేవ ప్రయత్నతః ||
138 ఓ బ్రహ్మదేవుడా ! విష్ణుమూర్తీ ! పరమశివుడా! గంగను మీమీలోకములకు తీసుకొని వెళ్ళుడు. ఇక మీరు కాలము యొక్క వృత్తాంతమును వినుడు. మీరు, తక్కిన దేవతలు, మునులు, సిద్దులు, తనస్వులు ఇంకను ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వారందరు కాలమునకు అతీతులైన గోలోకముననే ఉందురు. ప్రాకృతలయమున సమస్త ప్రపంచము జలమున ముగినియున్నది. ఇతర లోకములందున్న బ్రాహ్మ మొదలైనవారందరు ఇప్పుడు నాలో వీలీనమై యున్నారు. ఇప్పుడు గోలోకవైకుంఠములు తప్ప తక్నకిన లోకములన్నియు నీటిలో మునిగియున్నవి. అందువలన నీవు బ్రహ్మాండాదిలోకములను సృష్టింపుము. నేను ఇతర లోకములలో బ్రహ్మసృష్టిని చేసెదను. నా కనురెప్పపాటుతోనే (నిమిషకాలముననే ) బ్రహ్మయొక్క ఆయువు తీరిపోవును. ఈ విధముగా ఎందరో బ్రహ్మలు పుట్టినారు. గతించినారు. పుట్టబోవుదురు. ఈ విధముగా శ్రీకృష్ణుడు కాల విషయమును చెప్పి తన అంతఃపురమునకు వెళ్ళెను, దేవతలు కూడా తమతమలోకములకు పోయి మరల సృష్టిచేయుటకు ఉద్యమించిరి. ఈ విధముగా శ్రీకృష్ణుడు కాల విషయమును చెప్పి తన అంతఃపురమునకు వెళ్ళెను. దేవతలు కూడా తమతమ లోకములకుపోయి మరల సృష్టించెయుటకు ఉద్యమించిరి. గోలోకే చ స్థితా గంగా వైకుంఠే శివలోకకే ః బ్రహ్మలోకే తథాzన్యత్ర యత్ర తత్ర పురాస్థితా ||
140 తత్రైవ సాగతా గంగా చాజ్ఞయా పరమాత్మనః | నిర్గతా విష్ణుపాదాబ్జాత్ తేన విష్ణుపదీస్మృతా ||
141 ఇత్యేవం కథీతం సర్వంగంగోపాఖ్యానముత్తం | సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతు మిచ్ఛసి ||
142 గంగ గోలోకమున వైకుంఠమున, కైలామున, బ్రహ్మలోకమున ఇంకను పూర్వమున్నచోట్ల అంతటా ఉండినది. విష్ణుమూర్తి యొక్క పాదాబ్జములనుండి బయటకు వచ్చినందవలన గంగకు విష్ణుపది యను పేరు వచ్చెను. ఈ విధముగా మోక్షము నిచ్చు గంగోపాఖ్యనమును నీకు విరించితిని. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయ ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే
గంగోపాఖ్యానం నామ ఏకాదశోzధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున చెప్పబడిన గంగోపాఖ్యానమనే. పదకొండవ అధ్యాయము సమాప్తము.