sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వాదశోzధ్యాయః - గంగా విష్ణువుల గాంధర్వ వివాహము నారద ఉవాచ - నారదుడిట్లనెను - లక్ష్మీః సరస్వతీ గంగా తులసీ లోకపావనీ| ఏతా నారాయణసై#్వవ చతస్రశ్చ ప్రియా ఇతి||
1 గంగా జగామ వైకుంఠమిదమేవ మయా శ్రుతం | కథం సా తస్య పత్నీ చ బభువ బ్రూహి కేశవ ||
2 లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి ఈ నలుగురు శ్రీకృష్ణునకు ప్రియమైనవారు. వారిలో గంగ వైకుంఠమునకు వెళ్ళినట్లు నేను వింటిని. ఐతే ఆ గంగ నారాయణునకు ప్రియురాలైన విషయమును నాకు వివరించుడు. నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు పలికెను- గంగా జగామ వైకుంఠం తత్పశ్చాచ్ఛ గతో విధిః | గత్వోవాచ తయా సార్థం ప్రణమ్య జగదీశ్వరం ||
3 గంగ వైకుంఠమునకు వెళ్ళగా బ్రహదేవుడు తరువాతి వైకుంఠములోకమునకు పోయెను. వారు అక్కడకు వెళ్ళిన తరువాత బ్రహ్మ శ్రీమన్నారాయణుని నమస్కరించి ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను - రాధాకృష్ణాంగ సంభూతా యా దేవీ ద్రవరూపిణీ | తదధిష్ఠాతృ దేవీయం రూపేణాప్రతిమా భువి || 4 నవ¸°వన సంపన్నా సుశీలా సుందరీ వరా | శుద్ద సత్యస్వరూపా చ క్రోధాzహంకార వర్జితా || 5 యుదంగ సంభవా నాzన్యం వృణోతీయం చ తం వినా | తత్రాపి మానినీ రాధా మహతేజస్వినీవరా || 6 సముద్యతాం పాతుమియం భీతేయం బుద్దిపూర్వకం | వివేశ చరణాంభోజే కృష్ణస్య పరమాత్మనః || 7 సర్వం విశుష్కం గోలోకం దృష్ట్యాహమగమం తదా | గోలోకం యత్రకృష్ణశ్చ సర్వవృత్తాంత లబ్దయే || 8 సర్వాంతరాత్మా సర్వం నో జ్ఞాత్వాzభిప్రాయమేవచ | బహిశ్చకార గంగాంచ పాదాంగుష్ఠ సఖాగ్రతః || 9 దత్వాzసై#్య రాధికామంత్రం పూర్వయిత్వా చ గోళకం | సంప్రణమ్య చ రాధేశం గృహీత్వాzత్రాగమం విభో || 10 ఈగంగ రాధా కృష్ణుల యొక్క అంగముల నుండి ద్రవరూపముతో ఆవిర్భవించినది. జలరూపిణియైన గంగకు అధిష్ఠాటన దేవతయగు ఈమే నవ¸°వనముకలది. సుందరి, శుద్ద సత్వస్వరూప, క్రోధాహంకరాములు లేనిది, కృష్ణుని యొక్క శరీరమునుండి పుట్టినందువలన అతనిని తప్ప ఇంకొకరిని వివాహము చేసుకొటకు ఇష్టపడలేదు. తన భర్తను వివాహము చేసికొనదలచిన గంగపై కోపముతో రాధాదేవి ఆ జలమునంతయు త్రాగుటకు మొదలిడెను. అందువలన గంగ భయపడి శ్రీకృష్ణపరమాత్మ పాదములను శరణువేడినది. శ్రీకృష్ణుని పాదములయందు లీనమై గంగయుండుట వలన ప్రపంచమంతయు శుష్కించి పోయినది. అందువలన నేను విషయమును తెలిసికొనవలెనని గోలోకమునకు వెళ్ళితిని, సర్వాంతరాత్మయగు శ్రీ కృష్ణుడు మా అభిప్రాయమును గుర్తించి తన పాదంగుష్ఠము నుండి ఆమెను బయటకు పంపెను. అట్లే ఆమెకు రాధికామంత్రమును ఉపదేశించగా గంగ ప్రపంచమంతట నిండిపోయింది. అందువలన నేను పరమాత్మకు నమస్కరించి ఇక్కడకు తిరిగి వచ్చితిని. గాంధర్వేణ వివాహేన గృహేణమాం సురేశరీం | సురేశ్వరస్త్యం రసికో రసికాం రసభావనః || 11 పుంరత్నం పుంసుదేవేషు స్త్రీరత్నం స్త్రీష్వియం సతీ | విదగ్దాయా విదగ్దేన సంగమో గుణవాన్భవేత్ || 12 ఉపస్థితాం చ యః కన్యాం న గృహ్ణాతి మదనేనచ | తం విహాయ మహాలక్ష్మీ రుష్ట యాతి న సంశయః || 13 యో భ##వేత్పండితః సోzపి ప్రకృతిం నావమన్యతే | సర్వే ప్రాకృతికాః పుంసః కామిస్యః ప్రకృతే ః కళాః || 14 త్వమేవ భగవానాద్యో నిర్గుణః ప్రకృతే ః పరంః | అర్ధాంగో ద్విభుజః కృష్ణోzప్యర్ధాంగేన చతుర్భుజః || 15 కృష్ణవామాంగసంభూతా పరమారాధికా పురా | దీక్షిణాంగాత్ స్వయం సాచ వామాంగాత్కమాలా యథా || 16 తేన త్వాం సా వృణోత్యేవ యతస్థ్యద్దేహా సంభవా | స్త్రీ పుంసౌ వై తథైకాంగౌ యథా ప్రకృతి పూరుషౌ|| 17 ఇత్యేపముక్త్వా ధాతా చ తాం సమర్ప్య జగామ సః | గాంధర్వేణ వివాహేన తాం జాగ్రాహ హరిః స్వయం || 18 ఈ గంగను గాంధర్వరీతిలో వివాహము చేసుకొమ్ము. మీరిద్దరు అన్యోన్యము తగినవారు. కోరికతో వచ్చిన కన్యను వివాహము చేసుకొననివానిని మహాలక్ష్మి వదిలపోవును. పండితుడైనను ప్రకృతిని అవమానించవద్దు. ఈ జగత్తులోని పురుషులందరు ప్రాకృతికులు స్త్రీలు ప్రకృతి యొక్క అంశసంభూతలు. నీవు ఆద్యుడవైన పరమాత్మవు. అర్ధాంగుడైన శ్రీకృష్ణుడు ద్విభుజుడు కాగా అతనికి అర్థాంగభూతుడవైన నీవు చతుర్భుజుడవైతివి. రాధ శ్రీకృష్ణుని ఎడమ భాగమునుండి పుట్టగా గంగా కుడి పార్శ్వమునుండి పుట్టినది. అందువలన నీ దేహమునుండి పుట్టిన గంగ నిన్ను వివాహము చేసుకొనదలచినది. ప్రకృతి పురుషులవలె స్త్రీ పురుషులిద్దరు ఒకే శరీరము కలవారు. ఈ విధముగా బ్రహ్మదేవుడు నారాయణునితో పలికి గంగను అతనికి సమర్పించెను. అప్పుడు శ్రీహరి గంగాదేవిని గాంధర్వ వివాహమున స్వీకరించెను. శయ్యాం రతికరీం కృత్వా పుష్పంచదన చర్చితాం | రేమో రమాపతిస్తత్ర గంగయా సహితో ముదా || 19 గాం పృథ్వీం చ గతా యస్మాత్ స్వస్థానం పునరాగతా| నిర్గతా విష్ణుపాదచ్చ గంగా విష్ణుపదీ స్మృతా || 20 మూర్ఛాం సంప్రాప సా దేవీ నవసంగమ మాత్రతః | రసికా సుఖసంభోగా ద్రసికేశ్వర సంయుతా || 21 శ్రీహరి గంగతో సుఖముగా నుండెను. గాం, గతా అనగా భూమిపైకి పోయినది కావున గంగయైనది. అట్లే విష్ణుపాదమునుండి బయల్లెడలినందువలన విష్ణుపది ఐనది. తద్ధృష్ట్యా దుఃఖితా వాణీ సాపత్న్యేర్ష్యా వివర్జితా | నిత్యమీర్ష్యతి తాం వాణీ న చ గంగా సరస్వతీం || 22 గంగాయ సహిసై#్యవ తిస్రోభార్యా రమాపతేః | సార్థం తులస్యా పశ్చాచ్చ చతస్రోహ్యభవన్మునే || 23 శ్రీహరి గంగతో సుఖముగా నుండుటను చూచి సవతియొక్క అసూయతో సరస్వతి దుఃఖించినది. అట్లే ఆమెను ఎల్లప్పుడు ఈర్ష్వాభావముతో చూచినది. కాని గంగ సరస్వతిపై ఈర్ష్వపడలేదు. శ్రీహరికి గంగతో కలిపి ముగ్గురు భార్యలు. తరువాత వచ్చిన తులసితో అతనికి భార్యలు నలుగురు. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయ ప్రకృతిఖండే నారాయణ సంవాదే గంగోపాఖ్యానం నామ ద్వదశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమును రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదమున తెల్పబడిన గంగోపాఖ్యానమను పన్నెండవ అధ్యాయము సమాప్తము.