sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

షోడశోzధ్యాయ: - తులసీ శంఖచూడుల వృత్తాంతము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో అనెను-

తులసీ పరితుష్టా సా చాస్వాప్సీత్‌ హృష్టమానసా | నవ¸°వన సంపన్నా ప్రశంసంతీ వరాంగనా || 1

చిక్షేప పంచ బాణశ్చ పంచ బాణాంశ్చ తాం ప్రతి | పుష్పాయుధేన సా దగ్ధా పుష్పచందన చర్చితా|| 2

పులకాంచిత సర్వాంగీ కంపితా రక్తలోచనా | క్షణం సా శుష్కతాం ప్రాప క్షణం మూర్ఛామవాప హ || 3

క్షణముద్విగ్నతాం ప్రాప క్షణం తంద్రాం సుఖావహం | క్షణం సా దహనం ప్రాప క్షణం ప్రాపప్రమత్తతాం || 4

క్షణం సా చేతనాం ప్రాప క్షణం ప్రాప విషణ్ణతాం | ఉత్తిష్ఠంతీ క్షణం తల్పాద్గచ్ఛంతీ నికటం క్షణం || 5

భ్రమంతీ క్షణముద్వేగాత్‌ వివసంతీ క్షణం పునః | క్షణమేవ సముద్వేగాత్‌ అస్వాప్సీత్‌ పునరేవ సా || 6

పుష్పచందన తల్పం చ తద్బభూవాతి కంటకం | విపమాహారకం స్వాదు దివ్యరూపం ఫలం జలం || 7

నిలయశ్చ నిరాకారః సూక్ష్మవస్త్రం హుతాశనః | సిందూర పత్రకం చైవ వ్రణతుల్యం చ దుఃఖదం || 8

క్షణం దదర్శ తంద్రాయాం సువేషం పురుషం సతీ | సుందరం చ యువానం చ సస్మితం రసికేశ్వరం || 9

చందనోక్షిత సర్వాంగం రత్న భూషణ భూషితం | ఆగచ్ఛంతం మాల్యవంతం పశ్యంతం తన్ముఖాంబుజం || 10

కథయంతం రతికథాం చుంబంతమదరం మహుః | శయానం పుష్పతల్పే చ సమాశ్లిష్యం తమంగకం || 11

పునరేవతు గచ్ఛంతం ఆగచ్ఛంతం వసంతకం | కాంత క్వయాసి ప్రాణవ తిష్ఠేత్యేవమువాచ సా || 12

పునః స్వచేతనాం ప్రాప్య విలలాప పునః పునః | ఏవం తపోవనే సా చ తస్థౌ తత్రైవ నారద || 13

తులసీదేవి బ్రహ్మదేవుడిచ్చిన వరమువలన సంతసించి సంతోషముతో నిద్రపోయెను. ఆ సమయమున మన్మథుడు తన పంచబాణముల నామెపై వేసెను. అందువలన తులసి అనేక విధములైన మన్మథవికారములను పొంది విపరీతముగా ప్రవర్తించినది. ఆమెకు పుష్పచరందన తల్పము కంటకమయముగా తోచినది. మంచి ఆహారము ఫలములు, జలము విషతుల్యమైనవి. ఆమె ఉన్న ఆశ్రమము ఆకారము లేనియట్లు తాను కట్టుకొన్న వస్త్రములు మండుచున్నట్లుగా మన్మథ వికారములను పొందినది.

ఆసమయమున ఆమె మగత నిద్రలో నుండగా రసికేశ్వరుడు, యువకుడు, చక్కగా అలంకరించుకొన్న ఒక పురుషుని చూచెను. అతడు చందనాది సువాసన ద్రవ్యశోభితుడై, రత్నాలంకారములు ధరించి మాటిమాటికి తనను చూచుచున్నట్లు, ఆమెకు రతి కథలు చెప్పుచు చుంబించుచు, ఆలింగనము చేసేకొనుచున్నట్లు కనిపించెను. అతడు వెళ్ళిపోవుచున్నట్లు కనిపించగానే ప్రియా ఎచ్చటకి పోవుచున్నావు నిలు నిలుమని అనుచు మేల్కాంచెను. ఆమె తన స్వప్పములో జరిగిన వృత్తాంతములు తలచుకొని మాటిమాటికి విలపించెను. ఇట్లు బాధపడుచు ఆమె ఆశ్రమములోనే ఉండినది.

శంఖచూడో మహాయోగీ జైగీషవ్యాన్‌ మనోరమం | కృష్ణస్య మంత్రం సంప్రాప్య ప్రాప్య సిద్ధింతు పుష్కరే || 14

పఠన్‌ సదా తు కవచం సర్వమంగళ మంగళం | బ్రహ్మేశాచ్చ వరం ప్రాప్య యత్తన్మనసి వాంఛితం || 15

ఆజ్ఞయా బ్రహ్మణః సోzపి బదరీం వై సమాయ¸° | ఆగచ్ఛంతం శంఖచూడమపశ్యత్తులసీ మునే || 16

నవ¸°వనసంపన్నం కామదేవ సమప్రభం || 17

శ్వేత చంపక ర్ణాభం రత్నభూషణ భూషితం | శరత్పార్వణ చంద్రాస్యం శరత్పంకజలోచనం || 18

మహారత్న గణాక్లుప్త విమానస్థం మనోహరం | రత్నకుండల యుగ్మాఢ్యగండస్థల విరాజితం || 19

పారిజాత ప్రసూనాఢ్య మాల్యవంతం చ సుస్మితం | కస్తూరీ కుంకుమ యుతం సుగంధి తిలకోజ్వలం || 20

శంఖచూడుడను మహాయోగి శ్రీకృష్ణమంత్రోపదేశము పొంది పుష్కర క్షేత్రమున మంత్ర సిద్ధిని కూడి పొంది సమస్తమంగళకరమైన శ్రీకృష్ణకవచమును పఠించుచు తులసి ఉన్న ఆశ్రమమునకు వచ్చెను. అతడు కూడ బ్రహ్మదేవుని వలన పరమేశ్వరుని వలన తనకు ఇష్టమైన వరమును పొంది బ్రహ్మదేవుని ఆదేశముపై బదరికాశ్రమమునకు వచ్చెను.

నవ¸°వన సంపన్నుడు మన్మథుని వలె అందమైనవాడు, శ్వేత చంపకము వంటి శరీర కాంతి కలవాడు, శరత్కాల చంద్రునివంటి ముఖము కలవాడు శరత్కాల పద్మముల వంటి నేత్రములు కలవాడు, పారిజాత కుసుమముల మాల ధరించినవాడు, కస్తూరీ కుంకుమ ధరించిన శంఖచూడుడు ఆమె ఆశ్రమమునకు వచ్చుండగా తులసి అతనిని చూచినది.

సా దృష్ట్యా సన్నిధానే తం ముఖమాచ్ఛాద్య వాససా | సస్మితా తం నిరీక్షంతీ సకటాక్షం పునః పునః || 21

బభూవ సా నమ్రముఖీ నవసంగమ లజ్జితా | కాముకీ కామబాణన పీడితా పులకాన్వితా || 22

పిబంతీ తన్ముఖాంభోజం లోచనాభ్యాం చ సంతతం | దదర్శ శంఖచూడశ్చ కన్యామేకాం తపోవనే || 23

పుష్పచందన తల్పస్థాం వసంతీం వాససా వృతాం | పశ్యంతీం తన్ముఖం శశ్వత్సస్మితాం సుమనోహరాం || 24

సుపీన కఠినశ్రోణీం పీనోన్నత పయోధరాం | ముక్తాపంక్తి ప్రభాజుష్ట దంత పంక్తిం సుబిభ్రతీం || 25

పక్వబింబాధరోష్ఠీంచ సునాసాం సుందరీం వరాం | తప్త కాంచన వర్ణాభాం శరచ్ఛంద్ర సమప్రభాం || 26

స్వతేజసా పరివృతాం సుఖ దృశ్యాం మనోరమాం | కస్తూరీ బిందు భిస్సార్ధమధశ్చందన బిందునా || 27

సిందూర బిందునా శశ్వత్‌ సీమంతాధః స్థలోజ్వలాం | నిమ్ననాభి గభీరాం చ తదధస్త్రివళీ యుతాం || 28

కరపద్మతలా రక్తాం నఖచంద్రైర్విభూషితాం | స్థల పద్మప్రభాజుష్టం పాదపద్మం చ బిభ్రతీం || 29

ఆరక్తవర్ణం లలితం అలక్తక సమప్రభం | స్థలపద్మైశ్చ జలజైః పద్మరాగవిరాజితాం || 30

శరదిందు వినింద్యైక నఖేంద్వోఘ విరాజితాం | అమూల్య రత్న సంమిశ్రయావకేన స్వలంకృతాం || 31

మణీంద్ర ముఖ్య ఖచిత క్వణన్మంజీర రంజితాం || 32

దధతీం కబరీ భారం మాలతీ మాల్య సంయుతం | అమూల్య రత్న సంక్లుప్త మకరాకృతి రూపిణా || 33

చిత్రకుండల యుగ్మ శ్రీ సుషుమా పరిశోభితాం | రత్నేంద్ర ముక్తాహార శ్రీస్తన మధ్యస్థలోజ్వలాం || 34

రత్నకంకణకేయూర శంఖభూషణ భూషితాం | రత్నాంగుళీ యకైర్దివ్యైః అంగుళ్యావళిభిర్యుతాం || 35

దృష్ట్యా తాం లలితాం రమ్యాం సుశీలాం సుదతీం సతీం | ఉవాస తత్సమీపే చ మధురం తామువాచ సః || 36

శంఖచూడుడు తన దగ్గరికి రాగా అతని అందమునకు ఆశ్చర్యపడి తులసి తనముఖమును బట్టతో కప్పుకొని కటాక్షదృష్టితోచూడసాగినది. అతనిని చూడగనే మన్మథ బాణ పీడితయై నవ సంగమము వలన సిగ్గుపడ్డట్లు సిగ్గుపడినది. అతని ముఖ కమలమును తన కళ్ళతో తాగుచున్నట్లు తదేక దృష్టికో చూడసాగినది.

శంఖచూడుడు కూడ పుష్పచందన శయ్యపై పడుకొని తనముఖమును తదేక దీక్షతో చూచుచున్న కన్యయగు తులసిని ఆ తపోవనమున చూచెను. తులసి చాలా అందమైనది. అనేక రత్నహారములను కేయూరములను రత్నాంగుళీయకములను ధరించి మనోహరముగా కన్పించినది. అందువలన అతడు ఆమె సమీపమున కూర్చుండి మధురముగా తులసితో ఇట్లు మాట్లాడసాగెను.

శంఖచూడ ఉవాచ- శంఖచూడుడిట్లు పలికెను-

కా త్వం కస్య చ కన్యాసి ధన్యే మాన్యే సుయోషితాం | కా త్వం కామిని కల్యాణ సర్వ కల్యాణ దాయిని || 37

స్వర్గభోగాది సరితి విహారే హార రూపిణి | సంసారదార సారేచ మాయాధారే మనోహరే || 38

జగద్విలక్షణ క్షామే మునీనాం మోహకారిణి | మౌనం త్యక్త్వా కింకరం మాం సంభాషాం కురు సుందరి || 39

ఇత్యేవం వచనం శ్రుత్వా సకామా ఆమలోచనా | సస్మితా నమ్రవదనా సకామం తమువాచ సా || 40

ఓ కన్యా! నీవెవరవు? ఎవరి పుత్రికవు? నీవుచాల అందమైనదానవు. స్వర్గా%ది భోగములను సరస్సులో విహరించుచున్నదానవు. ప్రపంచమున నీ అందము చాలా విలక్షణమైనది. నీవు మహర్షులకు కూడ మోహమును కలిగించునంత అందకత్తెవు. నీవు మౌనమును వదలి పెట్టి'నీ సేవకుడనగు నాతో సంభాషింపుము అని శంఖచూడుడనగా తులసి తలవంచుకొని చిరునవ్వు ఏర్పడగా ఇట్లు మాట్లాడెను.

తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను-

ధర్మధ్వజసుతాzహం చ తపామ్యత్ర తపోవనే | తపస్వినీహ తిష్ఠామి కస్త్వం గచ్ఛయథాసుఖం || 41

కామినీం కులజాతాం చ రహస్యేకాకినీం సతీం | న పృచ్ఛతి కులే జాతః ఏవమేవ శ్రుతౌ శ్రుతం || 42

లంపటోzసత్కులే జాతో ధర్మశాస్త్రార్థ వర్జితః | యేనాzశ్రుతః శ్రుతేరర్థఃస కామీచ్ఛతి కామినీం || 43

ఆపాతమదురామంతే చాంతకాం పురుషస్య తాం | విషకుంభాకార రూపామృతాస్యాం చ సంతతం || 44

హృదయే క్షురధారాభాం శశ్వన్మధురం భాషిణీం | స్వకార్య పరినిష్పత్తి తత్పరాం సతతం సదా || 45

కార్యార్థే స్వామివశగాం అన్యథైవావశాం సదా | స్వాంతర్మలిన రూపాం చ ప్రసన్న వదనేక్షణాం || 46

శ్రుతౌ పురాణ యాసాం చ చరిత్రమనిరూపితం | తాసు కో విశ్వసేత్ర్పాజ్ఞో హ్యప్రాజ్ఞ ఇవ సర్వదా || 47

తాసాం కోవా రిపుర్మిత్రం ప్రార్థయంతీం నవం నవం | దృష్ట్యా సువేషం పురుషమిచ్ఛంతం హృదయే సదా || 48

బాహ్యే స్వాత్మ సతీత్వం చ జ్ఞాపయంతీం ప్రయత్నతః | శశ్వత్కామాం చ రామాం చ కామాధారాం మనోహరాం || 49

బాహ్యే ఛలాచ్ఛాదయంతీం స్వాంతర్మైథున లాలసాం | కాంతం గ్రసంతీం రహసి బాహ్యేతీవ సులజ్జితాం || 50

మానినీం మెథునాభావే కోపినీం కలహాంకురాం | సంభీతాం భూరి సంభోగాత్‌ స్వల్పమైథున దుఃఖితాం || 51

సుమృష్టాన్నం శీతతోయమాకాంక్షంతీం చ మానసే | సుందరం రసికం కాంతం యువానం గుణినం సదా || 52

సుతాత్పరమతిస్నేహం కుర్వంతీం రతికర్తరి | ప్రాణాధికం ప్రియతమం సంభోగ కుశలం ప్రియం || 53

పశ్యంతీం రిపుతుల్యంచ వృద్దం వా మైథునాzక్షమం | కలహం కుర్వతీం శశ్వత్తేన సార్థం సుకోపనాం || 54

చర్చయా భక్షయంతీం తం కీనాశ ఇవ గోరజః | దుస్సాహస స్వరూపాంచ సర్వ దోషాశ్రయాం సదా || 55

శశ్వత్కపటరూపాంచ సర్వదోషాశ్రయం సదా | బ్రహ్మ విష్ణుశివాదీనాం దుస్త్యాజ్యాం మోహరూపిణీం || 56

తపోమార్గార్గళాం శశ్వన్ముక్తి ద్వార కపాటికాం | హరేర్భక్తి వ్యహితాం సర్వమాయా కరండికాం || 57

సంసారకారాగారే శశ్శ్వన్నిగడ రూపిణీం || 58

ఇంద్రజాల స్రూపాంచ మిథ్యావాది స్వరూపిణీం | బిభ్రతీం బాహ్య సౌందర్యం మధ్యాంగమతికుత్సితం || 59

నానా విణ్మూత్ర పూయానామాధారం మలసంయుతం | దుర్గంధి దోష సంయుక్తం రక్తాక్తం చాప్యసంస్కృతం || 60

మాయారూపాం మాయినాం చ విధినా నిర్మితం పురా | విషరూపాం ముముక్షూణాం అదృశ్యాం చైవ సర్వదా || 61

ఓ యువకుడా! నేను ధర్మద్వజ మహారాజుగారి పుత్రికను. ఉన్నత వంశమున పుట్టినవాడెవ్వడు రహస్య ప్రదేశమున ఒంటరిగా ఉన్నకన్యతోమాట్లాడడు. ఉన్నత కులమున జన్మించక ధర్మశాస్త్రములు క్షుణ్ణముగా చదువక లంపటుడై తిరుగు కాముకుడు మాత్రమే కామిని కావలెనని కోరును.

కాని స్త్రీయన్నచో ఆపాతమదురముగానుండును. తరువాతి కాలమున పురుషుని చాలా ఇక్కట్లపాలు చేయును. హృదయము ఆసిధారవలె ఉన్నను మాటలు మాత్రము అమృతము వలె నుండును. తన కార్యము పూర్తియైన తరువా ముఖము చూపదు. వేదములలో పురాణములలో ఇట్టి స్త్రీల స్వభావము చెప్పబడలేదు. అందువలన తెలివికలవాడు స్త్రీని ఎన్నడు విశ్వసింపడు.

అట్లే మోహరూపిణియైన స్త్రీ బ్రహ్మాదులకు సైతము మోహమును పుట్టించును. ఈమె తపోమార్గమునకు అడ్డంకుగానుండును. ముక్తిద్వారమునకు ద్వారమువంటిది. సంసారమనే కారాగారమున నున్న ఇనుపగొలుసు వంటిది. మోసము చేయువారినే మోసము చేయు స్వభావము కలది. మోక్షము కోరువారికి విషరూపిణి. అట్టి స్త్రీతో ఉన్నత వంశ భవుడెవ్వడు రహస్య ప్రదేశమున మాట్లాడడు.

ఇత్యుక్త్వా తులసీ తం చ విరరామ చ నారద | సస్మితః శంఖచూడశ్చ ప్రవక్తుముపచక్రమే || 62

తులసి ఈ విధముగా శంఖచూడునితో చెప్పగా అతడు చిరునవ్వుతో ఇట్లనెను.

శంఖ చూడ ఉవాచ- శంఖచూడు డిట్లనెను-

త్యా యత్కథితం దేవి న చ సర్వమలీకకం | కించిత్సత్యమలీకం చ కించిన్మత్తో నిశామయ || 63

నిర్మితం ద్వివిధం ధాత్రా స్త్రీరూపం సర్వమోహనం | కృత్యారూపం వాస్తవం చ ప్రశస్యం చాప్రశంసితం || 64

లక్ష్మీ సరస్వతీ దుర్గా సావిత్రీ రాధికాదికం | సృష్టి సూత్ర స్వరూపం చాప్యాద్యం స్రష్ట్రాతు నిర్మితం || 65

ఏతాసామంశరూపం యత్‌ స్త్రీ రూపం వాస్తవం స్మృతం | తత్ర్పశస్యం యశోరూపం సర్వమంగళ కారణం || 66

శతరూపా దేవహూతిః స్వధా స్వాహా చ దక్షిణా | ఛాయావతీ రోహిణీ చ వరుణానీ శచీ తథా || 67

కుబేర వాయుపత్నీ సాzప్యదితిశ్చ దితిస్తథా | లోపాముద్రాzనసూయాచ కైటభీ తులసీ తథా || 68

అహల్యారుంధతీమేనా తారామండోదరీ పరా | దమయంతీ వేదతీ గంగా చ యమునా తథా || 69

పుష్టిస్తుష్టిః స్మృతిర్మేధా కాళికా చ వసుంధరా | షష్ఠీ మంగళచండీ చ మూర్తిర్వై ధర్మకామినీ || 70

స్వస్తిః శ్రద్ధా చ కాంతిశ్చ తుష్టిః శాంతిస్తథా పరా | నిద్రా తంద్రా క్షుత్సిపాసా సంధ్యా రాత్రిర్దినాని చ || 71

సంపత్తి వృత్తి కీర్త్యశ్చ క్రియాశోభా ప్రభాంశకం | యత్‌ స్త్రీరూపం చ సంభూతం ఉత్తమం తద్యుగే యుగే || 72

కృత్యాస్వరూపం తద్యత్తు స్వర్వేశ్యాదికమేవవా | తదప్రశస్యం విశ్వేషు పుంశ్చలీ రూపమేవచ || 73

సత్వప్రధానం యద్రూపం తచ్చ శుద్ధం స్వభావతః | తదుత్తమం చ విశ్వేషు సాధ్వీరూపం ప్రశంసితం || 74

తద్వాస్తవం చ విజ్ఞేయం ప్రవదంతి మనీషిణః | రజోరూపం తమోరూపం కృత్యాసు ద్వివిధం స్మృతం || 75

స్థానాభావాత్‌ క్షణాభావాత్‌ మధ్యవృత్తేరభావతః | దేహ క్లేశేన రోగేణ తత్సంసర్గేణ సుందరి || 76

బహుగోష్ఠావృతేనైవ రిపురాజ భ##యేన చ | రజోరూపస్య సాధ్వీత్వమేతేనైవోప జాయతే || 77

ఇదం మధ్యమ రూపం చ ప్రవదంతి మనీషిణః | తమోరూపం దుర్నివార్యమధమం తద్విదుర్బుదా || 78

న పృచ్ఛతి కులే జాతః పండితశ్చ పరస్త్రియం | నిర్జనే దుర్జనే వాzపి రహస్యే వచసా స్త్రియం || 79

ఆగచ్ఛామి త్త్సమీపమాజ్ఞయా బ్రహ్మణోzధునా | గాంధర్వేణ వివాహేన త్వాం గృహీష్యామి శోభ##నే || 80

ఓ తులసీదేవి! నీవు చెప్పినదంతయు అసత్యము కాదు. నీ మాటలలో కొంతసత్యము, కొంత అసత్యము కూడ ఉన్నది. అందువలన నామాటలను వినుము.

బ్రహ్మదేవుడు స్త్రీ రూపమును అందరకు మోహమును కల్గించునట్లు చేసెను. అట్టి స్త్రీరూపము ప్రశంసించతగిన వాస్తవరూపము, నిందించతగిన కృత్యారూపము అని రెండువిధములుగా నున్నది.

లక్ష్మీ, సరస్వతీ, దుర్గా, సావిత్రీ, రాధ వారి అంశలవలన జన్మించిన స్త్రీలందరు ఉత్తములు. వారి రూపము అన్ని యుగములలో అంతట కూడ ప్రశంసింపతగినది. ఇది సత్వగుణ ప్రధానమైనది. స్వభావతః శుద్దమైన సాద్వీరూపము ప్రశంసించతగినది. దీనిని పండితులు వాస్తవరూపమందురు.

ఇక రెండవదైన కృత్యారూపము, దేవవేశ్యల రూపము. ఈ భూమిపైనున్న సై#్యరచారిణులైన స్త్రీల రూపము నిందింపదగినది. కృత్యారూపము రజోరూపము తమోరూపమని రెండు విధములుగా ఉన్నది.

స్థలము దొరకకనో, సమయము చిక్కకనో, మధ్యవ్యక్తులు లేకనో శరీరము బాగుగా లేనందువలననో, శత్రువులు, రాజులయొక్క భయమువలననో ఇంకను కొన్ని ఇతర కారణమువలన రజోరూపలైన స్త్రీలు పతివ్రతలుగా నున్నారు. ఇది మధ్యమరూపమని పండితులు పేర్కొనుచున్నారు. తమోగుణరూపము చాలా అధమమైనదని అందురు.

ఉన్నత వంశమున పుట్టిన వాడెవడు నిర్జన ప్రదేముననున్నను దుర్జనులున్న ప్రదేశముననున్నను పరస్త్రీతో రహస్యముగా సంభాషణ చేయడు.

నేను బ్రహ్మదేవుని ఆజ్ఞవలన నీ దగ్గరికి వచ్చినాను. నిన్ను గాంధర్వ వివాహము చేసికొనుటకు ఇష్టపడుచున్నాను. అహమేవ శంఖచూడో దేవవిద్రావకారకః | దనువంశోద్భవో విశ్వే సుదామాzహం హరేః పురే || 81

అహమష్టసు గోపేషు గోగోపీ పార్షదేషుచ | అధునా దానవేంద్రోz హం రాధికాయాశ్చ శాపతః || 82

జాతిస్మరోzహం జానామి కృష్ణమంత్రం ప్రభావతః | జాతిస్మరా త్వం తులసీ సంసక్తా హరిణా పురా || 83

త్వమేవ రాధికా కోపాజ్జాతాzసి భారతే భువే | త్వాం సంభోక్తుమిచ్ఛకోzహం నాలం రాధా భయాత్తతః.|| 84

ఇత్యేవ ముక్త్వా సపుమాన్విరరామ మహామునే | సస్మితా తులసీ హీష్టా ప్రవక్తుముపచక్రమే || 85

నేను దనుజవంశములో పుట్టి దేతలనందరను భయపెట్టుచున్న శంఖచూడుడను వాడను. నేను వైకుంఠమున శ్రీహరిదగ్గర సుదాముడను పేరుతో నుంటిని. అచ్చట గోపకులకు, గోపికలకు అనుచరులుగా నున్న ఎనమండుగురు గొల్లలలో నేనొకడను. కాని రాధాదేవి శాపములన దానవేంద్రుడిగా జన్మనెత్తితిని. శ్రీకృష్ణుని మంత్ర ప్రభావమువలన పూర్వ జన్మ జ్ఞానము నాకు కలదు. అట్లే నీపేరు తులసి. నీకు కూడా నీ పూర్వజన్మజ్ఞానము కలదు. పూర్వము నీవు శ్రీహరితో సంగమించినందువలన దానిని చూచిన రాధికా దేవి కోపముతో పెట్టిన శాపమువలన ఈ భారతభూమిలో జన్మనెత్తితివి. వైకుంఠమున నున్ననీ సంభోగము నాశించినను రాధాదేవి భయమువలన నేను సాహసము చేయలేదు.

ఇట్లుశంఖచూడుడు చెప్పి ఊరకుండగా తులసి మిక్కిలి సంతోషంతో ఇట్లుచెప్పనారంభించినది.

తులస్యువాచః తులసి ఇట్లు చెప్పినది -

ఏవం విధో బుధో విశ్వే బుధేషు చ ప్రవంసితః | కాంతమేవం విధం కాంతా శశ్వదిచ్ఛతి కామతః || 86

త్వయాzహమధునా సత్యం విచారేణ పరాజితా | స నిందితశ్చాప్యశుచిః యః పుమాంశ్చ స్త్రియా జితః || 87

నిందంతి పితరోదేవా బాంధావాః స్త్రీజితం జనం | స్త్రీ జితం మనసా వాచా పితా భ్రాతా చ నిందతి || 88

శుధ్యేద్విప్రో దశాహేన జాతకే మృతకే తథా | భూమిపో ద్వాదశాహేన వైశ్యః పంచదశాహతః || 89

శూద్రో మాసేన వేదేషు మాతృవద్వర్ణ సంకరః | అశుచిః స్త్రీజితః శుధ్యేత్‌ చితా దహన కాలతః || 90

న గృహ్ణంతీచ్ఛయా తస్య పితరః పిండ తర్పణం | న గృహ్ణంతీచ్ఛయా దేవాః తస్య పుష్ప జలాదికం || 91

కిం తస్యజ్ఞాన తపసా జపహోమ ప్రపూజనైః | కిం విద్యయా వా యశసా స్త్రీభిర్యస్య మనోహృతం || 92

విద్యాప్రభావ జ్ఞానార్థం మయా త్వం చ పరీక్షితః | కృత్వా పరీక్షాం కాంతస్య వృణోతి కామినీ వరం || 93

వరాయ గుణహీనాయ వృద్ధాయాజ్ఞానినే తథా | దరిద్రాయ చ మూర్ఖాయ రోగిణ కుత్సితాయ చ || 94

అత్యంత కోపయుక్తాయ చాత్యంత దుర్ముఖాయచ | పంగులాయాంగహీనాయ చాంధాయ బధిరాయ చ || 95

జడాయ చైవ మూకాయ క్లీబతుల్యాయ పాపినే | బ్రహ్మహత్యాం లభేత్సోపి యః స్వక న్యాం దదాతి చ || 96

శాంతాయ గుణినే చైవ యూనే చ విదుషే తథా | వైష్ణవాయ సుతాం దత్వా దశవాజిఫలం లభేత్‌ || 97

యః కన్యాపాలనం కృత్వా కరోతి విక్రయం యది | విపదా ధనలోభేన కుంభీపాకం స గచ్ఛతి || 98

కన్యామూత్రపురీషం చ తత్ర భక్షతి పాతకీ | కృమిభిర్దంశితః కాకైః యావదింద్రాశ్చ తుర్దశ || 99

తదంతే వ్యాధయోనౌ చ లభ##తే జన్మనిశ్చితం | విక్రీణాతి మాంసభారం వహత్యేవ దివానిశం || 100

ఇత్యేవముక్త్వా తులసీ విరరామ తపోవనే | ఏతస్మిన్నంతరే బ్రహ్మా తయోరంతికమాయ¸° | 101

నీవంటి విద్వాంసుని అందరు ప్రశంసింతురు. నీవలె దాపరికములేకుండ మాట్లాడు యువకుని ప్రతిస్త్రీ ఎల్లప్పటికి కోరుకొనును. నీ ఆలోచనా రీతి చాలా గొప్పది. నీ ఆలోచనా రీతి వల్ల నేను పరాజయమును పొందితిని.

స్త్రీకి లోబడిన పురుషుని పితరులు, దేవతలు, బంధువులు, తండ్రి అన్నదమ్ములు అందరు నిందింతురు. జాతకర్మలోనైనా, మృతుడైనప్పుడు కూడ బ్రహ్మణుడు పది దినములలోల పరిశుద్ధుడగును. శూద్రుడు నెలలోపల పరిశుద్ధుడగును. స్త్రీజితుడైనవాడు చితిలో కాలిన తరువాతనే పరిశుద్ధుడగును. అతడు పెట్టు పిండతర్పణములను పితృదేవతలు సంతోషముగా తీసికొనరు. అట్లే దేవతలు స్త్రీకి లోబడినవాడిచ్చు పుష్పజలాదికమునుస్వీకరింపరు. అట్టివాడు జ్ఞానమును సంపాదించుకొనినను, తపస్సు, చేసినను, జపహోమాది కార్యక్రమములు చేసినను అన్నియు వ్యర్థమగును.

నీ విద్యాప్రభావమును తెలిసికొనుటకై నిన్ను పరీక్షించితిని. స్త్రీ తనకు నచ్చిన యువకుని శక్తియుక్తులను పరీక్షించి అతనిని వరించును.

గుణహీనునకు, వృద్ధునకు, అజ్ఞానికి, దరిద్రునకు, సదారోగికి, మూర్ఖనకు, దుష్టునకు, అతికోపము కలవానికి, అంగహీనునకు, జడునకు, నపుంసకునకు తన పుత్రికనిచ్చి వివాహము చేసినచో అతడు బ్రహ్మహత్యాపాపమును పొందును.

సుగుణాలరాశి, విద్వాంసుడు, శాంతుడగు యువకుడైన వైష్ణవునకు పిల్లనిచ్చినవాడు పది అశ్వమేధయాగములు చేసిన ఫలితము పొందును.

చిన్నప్పటినుండి పిల్లను పెంచి పెద్దచేసి ఆపదవల్లనో ధనమునకాశపడో కన్యావిక్రమయము చేసినవాడు కుంభీపాక నరకముననుభవించును. పదునలుగురింద్రులు గడచునంతవరకు నరకమున చిత్ర విచిత్ర శిక్షల ననుభవించును. ఆతరువాత ఆటవికుల ఇంట జన్మించును.

ఈవిధముగా తులసి శంఖచూడునితో మాట్లాడుచున్నప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు

వచ్చెను.

మూర్ధ్న ననామ తులసీ శంఖచూడశ్చ నారద | ఉవాస తత్ర దేవేశశ్చోవాచ చ తయోర్హితం || 102

కిం కరోషి శంఖచూడ సంవాదమనయా సహ | గాంధర్వేణ వివాహేన త్వమస్యాః గ్రహణం కురు || 103

త్వం చ పురుషరత్నం చ స్త్రీరత్నం స్త్రీష్వియం సతీ | విదగ్ధాయావిదగ్ధేన సంగమో గుణవాన్‌ భ##వేత్‌ || 104

నిర్విరోధసుఖం రాజన్‌ కోవా త్యజతి దుర్లభం | యోzవిరోధ సుఖత్యాగీ స పశుర్నాత్ర సంశయః || 105

కిముపేక్షసి త్వం కాంతం ఈదృశం గుణినం సతీ | దేవానామసురాణాంచ దానవానాం విమర్దనం || 106

యథా లక్ష్మీశ్చ లక్ష్మీశే యథా కృష్ణే చ రాధికా | యథా మయిచ సావిత్రీ భవానీ చ భ##వే యథా || 107

యథా ధరా వరాహేచ యథా మేనా హిమాలయే | యథాత్రావనసూయాచ దమయంతీ నలే యథా || 108

రోహిణీ చ యథా చంద్రే యథా కామే రతిః సతీ | యథాzదితిః కశ్యపే చ వసిష్ఠేzరుంధతీ యథా || 109

యథాzహల్యా గౌతమేచ దేవహూతిశ్చ కర్దమే | యథా బృహస్పతౌ తారా శతరూపా మనౌ యథా || 110

యథా చ దక్షిణా యజ్ఞే యథా స్వాహా హుతాశ##నే | యథా శచీ మహేంద్రేచ యథా పుష్టిర్గణశ్వరే || 111

దేవసేనా యథాస్కందే ధర్మే మూర్తిర్యధా సతీ | సౌభాగ్యా సుప్రియా త్వం చ శంఖచూడే తథా భవ || 112

అనేన సార్థం సుచిరం సుందరేణ చ సుందరి | స్థానే స్థానే విహారంచ యథేచ్ఛం కురు సంతతం || 113

తులసీ శంకచూడులు బ్రహ్మదేవునికి నమస్కంరించిరి. బ్రహ్మదేవుడచ్చట కూర్చొని శంఖచూడుడా! తులసితో ఏమి మాట్లాడుచున్నావు. నీ వామెను గాంధర్వవిధితో వివాహమును చేసికొనుము. నీవు పురుషులలో శ్రేష్ఠుడవు. తులసి స్త్రీలలో రత్నము వంటిది. మీ ఇద్దరి కలయిక మిక్కిలి మేలును కలిగించును. విరుద్ధము కాని సుఖమును ఎవరు వదులుదురు? వదలినచో అతడు పశుతుల్యుడు.

ఓ తులసి! నీవు ఇటువంటి సుద్గుణములు కలవానిని, అందమైన వానిని పతిగా పొందుటకు ఎందులకు ఉపేక్ష చేయుచున్నావు. ఇతడు దేవతలను, అసురులను, దానవులను కూడ జయించిన వీరుడు.

లక్ష్మీదేవి విష్ణువునకు, కృష్ణునకు రాధిక, నాకు సావిత్రి, శివునకు పార్వతి, ఆదివరాహునకు భూమి, హిమాలయమునకు మేన, అత్రిమహర్షికి అనసూయ, నలునకు దమయంతి, చంద్రునకు రోహిణి, మన్మథునకు రతీదేవి, కశ్యపునకు దితి, వశిష్ఠునకు అరుంధతి, గౌతమునకు అహల్య, కర్దమ మహర్షికి దేవహూతి, బృహస్పతికి తార, మనువునకు శతరూప, యజ్ఞమునకు దక్షిణ, అగ్నికి స్వాహాదేవి, దేవేంద్రునకు శచీదేవి, గణపతికి పుష్టి, సుబ్రహ్మణ్యస్వామికి దేవసేన, ధర్మునకు మూర్తీదేవి ఏవిధముగా ప్రియమైనారో అట్లే శంఖచూడునికి నీపై అమితమైన ప్రేమ కలదు అందువలన సుందరుడైన ఈ శంఖచూడునితో యథేచ్ఛగా విహరింపుము.

పశ్చాత్ర్పాప్యసి గోవిందం గోలోకే పునరే చ | చతుర్భుజం చ వైకుంఠే శంఖచూడే మృతే సతి || 114

ఇత్యేవమాశిషం కృత్వా స్వాలయం ప్రయ¸° విధిః | గాంధర్వేణ వివాహేన జగృహే తాం చ నారద || 115

ఈ శంఖచూడుడు చనిపోయిన పిదప గోలోకమున నున్న శ్రీకృష్ణుని, వైకుంఠమున నున్న చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును పొందుదువు. అని బ్రహ్మదేవుడు వారిద్దరకు శుభాశీస్సులొసగి బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయెను.

అప్పుడు శంఖచూడుడు గాంధర్వవిధితో తులసిని పరిణయమాడెను.

స్వర్గే దుందుభివాద్యం చ పుష్పవృష్టిర్బభూవహ | స రేమే రమయా సార్థం వాసగేహే మనోహరే || 116

మూర్ఛాం సంప్రాప తులసీ నవసంగమ సంగతా | నిమగ్నా నిర్జనే సాధ్వీ సంభోగసుఖ సాగరే || 117

చతుః షష్టి కళామానం చతుః షష్టివిధం సుఖం | కామశాస్త్రే యన్నిరుక్తం రసికానాం యతేప్పితం || 118

అంగప్రత్యంగ సంశ్లేష పూర్వకం స్త్రీ మనోహరం | తత్సర్వం సుఖశృంగారం చకార రసికేశ్వరః || 119

అతీవ రమ్యే దేశేచ సర్వజంతు వివర్జతే | పుష్ప చందన తల్పేచ పుష్పచందన వాయునా || 120

అతీవ రమ్యే దేశేచ సర్వజంతు వివర్జితే | పుష్ప చందన తల్పేచ పుష్పచందన వాయునా || 120

పుష్పోద్యానే నదీతీరే పుష్పచందన చర్చితే | గృహీత్వా రసికాం రామాం పుష్ప చందన చర్చితాం || 121

భూషితాం భూషణౖః సర్వైరతీవ సుమనోహరాం | సురతేర్వితతి ర్నాస్తి తయోః సురత విజ్ఞయోః || 122

జహార మానసం భర్తుర్లీలయా తులసీ సతీ | చేతనాం రసికాయాశ్చ జహర రసభావవిత్‌ || 123

వక్షసశ్చందనం బాహ్వోస్తిలకం విజహార సా | స చ జగ్రాహ తస్యాశ్చ సిందూర బిందు పత్రకం || 124

స తద్వక్షసి తస్యాశ్చ నఖరేఖాం దదౌ ముదా | సా దదౌ తద్వామ పార్శ్వే కరభూషణ లక్షణం || 125

రాజా తదోష్ఠపుటకే దదౌ దశన దంశనం | తద్గండయుగళే సా చ ప్రదదౌ తచ్చతుర్గుణం || 126

సురతేర్విరతౌ తౌ చ సముత్థాయ పరస్పరం | సువేషం చక్రతుస్తత్ర యత్తన్మనసి వాంఛితం || 127

తులసీ శంఖచూడుల వివాహసమయమున స్వర్గమున దుందుభివాద్యములు చెలరేగినవి. దేవతలు పుష్పవృష్టిని కురిపించిరి. శంఖచూడుడు తన భార్యతో కామశాస్త్రమున చెప్పబడిన చతుష్పష్టి కళలను, చతుష్పష్టివిధములుగా అనుభవించెను. చాల అందమైన ప్రదేశమున నదీతీరమున పుష్పోద్యానమున పుష్పచందన శయ్యపై పుష్పములు, చందనముల వాయువు వీయుచుండగా సుఖసంభోగమున మునిగెను. వారి రతికి అంతులేకుండ పోయెను.

తులసి తన భర్త మనుస్సును హరింపగా, శంఖచూడుడు రసికయగు తన భార్య మనస్సును హరించెను. రత్యనంతరము ఆరు కోరుకున్నట్లు అలంకరించుకొనిరి.

కుంకుమాక్త చందనేన సా తసై#్మ తిలకం దదౌ | సర్వాంగే సుందరే రమ్యే చకార చానులేపనం || 128

సువాసితం చ తాంబూలం వహ్ని శుద్ధే చ వాససీ | పారిజాతస్య కుసుమం మాల్యం చైవ సుశోభనం || 129

అమూల్య రత్న నిర్మాణమంగుళీయకముత్తమం | సుందరం చ మణివరం త్రిషులోకేషు దుర్లభం || 130

దాసీ తవాహమిత్యేవం సముచ్చార్య పునః పునః | ననామ పరయా భక్త్యా స్వామినం గుణశాలినం || 131

సస్మితా తన్ముఖాంభోజం లోచనాభ్యాం పపౌ పునః | నిమేషరహితాభ్యాం చ సకటాక్షం చ సుందరం || 132

సచ తాం చ సమాకృష్య చకార వక్షసి ప్రియాం | సస్మితం వాసాzచ్ఛన్నం దదర్శ ముఖ పంకజం || 133

చుచుంబ కఠినే గండే బింబోష్ఠే పునరేవచ | దదౌ తసై#్య వస్త్రయుగ్మం వరుణాదాహృతం చ యత్‌ ||

తదాహృతాం రత్నమాలాం త్రిషులోకేషు విశ్రుతాం || 134

దదౌ మంజీరయుగ్మం చ స్వాహాయాశ్చ హృతం చ యత్‌ | కేయూరయుగ్మం ఛాయాయా రోహిణ్యాశ్చైవ కుండలం 135

అంగుళీయక రత్నాని రత్యాశ్చ వరభూషణం | శంఖం సురుచిరం చిత్రం యుద్దత్తం విశ్వకర్మణా || 136

విచిత్రపీఠక శ్రేణీం శయ్యాం చాపి సుదుర్లభాం | భూషణాని చ దత్వా చ పరీహరం చకార హ || 137

నిర్మాయ కబరీభారం తస్యాశ్చ మాల్యసంయుతం | సుచిత్రం పత్రకం గండే జయలేఖ సమం తథా || 138

చంద్రలేఖా త్రిభిరుక్తం చందనేన సుగంధినా | పరితః పరితశ్చిత్రైః సార్థం కుంకుమ బిందుభిః || 139

జ్వలత్ర్పదీపాకారం చ సిందూర తిలకం దదౌ | తత్పాద పద్మయుగళే స్థల పద్మవినిందితే || 140

చిత్రాలక్తక రాగం చ నఖరేషు దదౌ ముదా | స్వవక్షసి ముహుర్న్యస్తం సరాగం చరణాంబుజం || 141

హేదేవి తవ దాసోzహమిత్యుచ్చార్య పునః పునః | రత్న నిర్మాణ యానేన తాం చ కృత్వాస్వవక్షసి || 142

తపోవనం పరిత్యజ్య రాజాస్థానాంతరం య¸° | మలయే దేవనిలయే శైలే శైలే పునః పునః || 143

స్థానే స్థానేzతి రమ్యే చ పుష్పోద్యానేzతి నిర్జనే | కందరే కందరే సింధుతీరే చ సుందరే

వనే || 144

పుష్ప భద్రానదీ తీరే నీరవాత మనొహరే | పులినే పులినే దివ్యే నద్యాం నద్యాం నదే న || 145

మధౌ మమధుకరాణాం చ మధర ధ్వని నాదితే | వినిస్యందే సుపవనే నందనే గంధమాదనే |7 146

దేవోద్యానో దేవవనే చిత్రే చందన కాననే | చంపకానాం కేతకీనాం మాధవీనాం చ మాధవే || 147

కుందానాం మాలతీనాంచ కుముదాంభోజ కాననే | కల్పవృక్షే కల్పవృక్షే పారిజాతవనే వనే || 148

నిర్జనే కాంచనీస్థానే ధన్యే కాంచన పర్వతే | కాంచీవనే కించనకే కంచకే కాంచనాకరే || 149

పుష్పచందన తల్పే చ పుంస్కోకిలరుత శ్రుతే | పుష్పచందన సంయుక్తః పుష్ప చందనాయునా || 150

కాముక్యా కాముకః కామాత్‌ స రేమే రమయా సహ | న తృప్తో దానవేంద్రశ్చ తృప్తిం నైవ జగామ సా || 151

హవిషా కృష్ణవర్త్మేవ వవృధే మదనస్తయోః | తయా సహ సమాగత్య స్వాశ్రమం దానవస్తతః || 152

రమ్యం క్రీడాలయం కృత్వా విజహార పునస్తతః | ఏవం సంబుభుజే రాజ్యం శంఖచూడః ప్రతాపవాన్‌ || 153

తులసి శంఖచూడునకు కుంకుమ అద్దిన చందనముతో తిలకము దిద్దెను. అట్లే అతని శరీరమున కంతట చందనానులేపనము చేసినది. ఆతరువాత సువాసన గల తాంబూలమును పరిశుద్ధమైన వస్త్రములను, పారిజాత పుష్పమును, అమూల్య రత్నములచే నిర్మింపబడిన ఉంగరము నిచ్చి నేను నీ దాసురాలను అని చెప్పి అనేక నమస్కారములు చేసెను. అతని ముఖమును రెప్పవాల్చక చూడసాగెను.

అట్లే శంఖచూడుడు తన ప్రియురాలిని రొమ్ముపై నుంచుకొని ముసుగుతో కప్పబడిన ఆమె ముఖమును చూచుచు మాటిమాటికి ముద్దుపెట్టుకొనెను. తరువాత తులసికి వరుణుని గెలిచి తెచ్చిన వస్త్రములను, రత్నమాలను, అగ్నిదేవుని జయించి తెచ్చిన స్వాహాదేవియొక్క నూపురములను, చంద్రుని జయించి తెచ్చిన రోహిణీదేవి కుండలములను, ఉంగరములను,విశ్వకర్మ ఒసగిన వస్తువులను, విచిత్రమైన పీటలను, గొప్పనైన శయ్యను ఇచ్చెను. అట్లే ఆమె వెంట్రుకలు దువ్వుచు కొప్పుపెట్టి దానికి మాలలు చుట్టెను. తులసిదేవి చెక్కిళ్ళపై చిత్రవిచిత్రములైన మకరికా పత్రములనమర్చెను. చందనముతో తులసిదేవి నొసట మూడు చంద్రరేఖలు దిద్ది దాని చుట్టు కుంకుమబిందువులు పెట్టి దీపజ్వాలవలె నున్న తిలకమును తీర్చిదిద్దెను. గోళ్లకు చిత్రవిచిత్రమైన లత్తుకనద్దెను. ఆమెపాదములను తన రొమ్ముపైనుంచుకొని ఓదేవి నేను నీ దాసుడనని మాటిమాటికి ఉచ్చరించి రత్న విమానము ఇంకొక స్థానమునకు తీసికొని వెళ్ళెను.

దేవతలకు నిలయమైన మలయపర్వతమున అతి రమ్యమైన పుష్పోద్యానమున, సింధునదీ తీరమున నున్న సుందర వనములో, పుష్ప భద్రానదీ తీరముననున్న ఇసుకలపైన, తుమ్మెదల నాదముతో మనోహరమైన గంధమాదన పర్వతమందలి ఉద్యానవనమున, నందనోద్యానవనమున మల్లెలు, మాలతులు, కలువలు, తామరలు కల ఉపవనములో, మేరు పర్వతుముపై నున్న ఉపవనములో పుష్పశయ్యపై పుష్పముల చందనముల గాలి వీచుచుండ వారిద్దరు రతి కేళి చేసిరి. ఐనను వారిద్దరి కోరిక తీరలేదు. నేయిబోసినచో మండు మంటవలె వారి కోరిక చల్లారలేదు, పైగా అభివృద్ధి కాసాగినది.

చివరకు తులసీ శంఖచూడులు తమ ఆశ్రమమునకు తిరిగి వచ్చి అందమైన క్రీడాలయమును నిర్మించుకొని సుఖముగా విహరించససాగిరి.

ఏకమన్వంతరం పూర్ణం రాజరాజేశ్వరో బలీ | దేవనామసురాణాం చ దానవానాం చ సంతతం || 154

గంధర్వాణాం కిన్నరాణాం రాక్షసానాం చ శాస్తిదః | హృతాధికారా దేవాశ్చ చరంతి భిక్షుకా యథా || 155

పూజాహోమాదికం తేషాం జహార విషయం బలాత్‌ | ఆశ్రయం చాధికారం చ శస్త్రాస్త్ర భూషణాదికం || 156

నిరుద్యమాః సురాః సర్వే చిత్రపుత్తలికా యథా | తే చ సర్వే విషణ్ణాశ్చ ప్రజగ్ము బ్రహ్మణః సభాం || 157

బలవంతుడు, చక్రవర్తియగు శంఖచూడుడు ఒక మన్వంతర కాలము దేవదానవ, గంధర్వ కిన్నరాదులకు, రాక్షసులకు దానవులకు ఆజ్ఞలిచ్చుచు పరిపాలనము చేసెను.

అప్పుడు దేవతలు అధికారమును కోల్పోయి బిచ్చగాండ్రలె ఇటునటు తిరుగసాగిరి. వారి పూజాహోమాదికములను, అధికారమును, శస్త్రాస్త్రభూషణాదికములను శంఖచూడుడు బలవంతముగా తీసికొనెను. అందువలన దేవతలందరు పనిపాటలు లేక చిత్రమునందలి బొమ్మలవలెనైరి.

అందువలన దేవతలందరు తమ కష్ఠములను చెప్పుకొనుటకు బ్రహ్మలోకమునకు వెళ్ళిరి.

వృత్తాంతం కథయామాసూ రురుదుశ్చ భృశం ముహుః | తదా బ్రహ్మా సురైస్సార్థం జగామ శంకరాలయం || 158

దేవతలు తమ బాధలన్నిటిని బ్రహ్మదేవునికి చెప్పుకొనగా అతడు వారిని తీసికొని కైలాసమునకు వెళ్ళెను.

సర్వం సంకథయామాస విధాతా చంద్రశేఖరం | బ్రహ్మా శివశ్చతైస్సార్థం వైకుంఠం చ జగామ హ || 159

సుదుర్లభం పరంధామ జరామృత్యుహరం పరం | సంప్రాప చ వరం ద్వారమాశ్రమాణాం హరేరహో || 160

దదర్శ ద్వారపాలాంశ్చ రత్న సింహాసన స్థితాన్‌ | శోభితాన్‌ పీతవసై#్రశ్చ రత్నభూషణ భూషితాన్‌ || 161

వనమాలాన్వితాన్‌ సర్వాన్‌ శ్యామసుందర విగ్రహాన్‌ | శంఖ చక్ర గదా పద్మ ధరాంశ్చై వచతుర్భుజాన్‌ || 162

సస్మితాన్‌ పద్మవక్త్రాంశ్చ పద్మనేత్రాన్‌ మనోహరాన్‌ | బ్రహ్మా తాన్‌ కథయామానే వృత్తాంతం గమనార్థకం || 163

తేzనుజ్ఞాం చ దదుస్తసై#్మ ప్రవివేశ తదాజ్ఞయా | ఏవంచ షోడ ద్వారన్‌ నిరీక్ష్య కమలోద్భవః || 164

దేవైస్పార్థం తానతీత్య ప్రవివేశ హరేః సభాం | దేర్షిభిః పరివృతాం పార్షదైశ్చ చతుర్భుజైః | 165

నారాయణ స్వరూపైశ్చ సర్వైః కౌస్తుభ భూషితైః | పూర్ణేందు మండలాకారాం చతురస్రాం మనోహరాం || 166

మణీంద్ర సార నిర్మాణాం హీరసార సుశోభితాం | అమూల్య రత్నఖచితాం రచితాం స్వేచ్ఛయా హరేః || 167

మాణిక్యమాలా జాలాఢ్యాం ముక్తాపంక్తివిభూషితాం | మండితాం మండలాకారై రత్నదర్పణ కోటిభిః || 168

విచిత్రైశ్చిత్రరేఖాభిః నారాచిత్రవిచిత్రితాం | పద్మరాగేంద్ర రచితై రచితాం పద్మకృత్రిమైః || 169

సోపాన వతకైర్యుక్తాం స్యమంతక వినిర్మితైః | పట్టసూత్రగ్రంథియుతైశ్చారు చందన పల్లవైః || 170

ఇంద్రనీలమణిస్తంభైర్వేష్టితాం సుమనోహరాం | సద్రత్న పూర్ణకుంభానాం సమూహైశ్చ సమన్వితాం || 171

పారిజాత ప్రసూనానాం మాలాజాలైర్విరాజితాం | కస్తూరీకుంకుమాక్తైశ్చ సుగంధి చందన ద్రవైః || 172

సుసంస్కృతాం తు సర్వత్ర వాసితాం గంధవాయునా | విద్యాధరీ సమూహానాం సంగీతైశ్చ మనోహరాం || 173

సహస్రయోజనాయామాం పరిపూర్ణాంచ కింకరైః | దదర్శ శ్రీహరి బ్రహ్మా శంకరశ్చ సురైః సహ || 174

బ్రహ్మదేవుడు దేవతలు పడుచున్న బాధలన్నిటిని చంద్రశేఖరునకు వెల్లడించెను. అప్పుడు శంకరుడు కూడ వారి వెంట రాగా దేవతలందరు వైకుంఠమునకు పోయిరి.

అచ్ఛట సుదుర్లభ##మైనది, ఉన్నతమైనది, జరామృత్యువులను పోగొట్టునది అగు శ్రీహరి నివాసస్థానముయొక్క ప్రథమ ద్వారము చేరిరి. అచ్చట పట్టువస్త్రములు ధరించి మంచి ఆభరణములు కలిగి రత్నసింహాసనమున నున్న నాల్గు భుజములు కల ద్వారపాలకులను దేవతలు చూచిరి. ఆ ద్వారపాలకులు నారాయణునివలె శ్యామసుందర విగ్రహులు, వనమాల ధరించినవారు శంఖ చక్రాద్యాయుధముల ధరించినవారు. పద్మముఖులు తామరస నేత్రులు.

బ్రహ్మదేవుడు వారికి తాము వచ్చిన విషయమును తెల్పివారి అనుజ్ఞతో లోపలికి ప్రవేశించెను. ఇటువంటి పదహారు ద్వారములను దాటి శ్రీవారి యొక్క సభలోని దేవతలందరు ప్రవేశించిరి.

ఆశ్రీహరి సభలో దేవర్షులు నాల్గుభుజములు కల శ్రీహరి సేవకులున్నారు. వారందరు నారాయణ స్వరూపులు అందరు కౌస్తుభ రత్నభూషితులు. ఆ సభ గొప్పనైన రత్నమాణిక్యములచే శోభిల్లునది. మాణిక్యముల మాలలు ముత్యాలమాలలు ఆ సభను అలంకరించినవి. గుండ్రని అద్దములతో చిత్రరేఖలతో అనేక విధములైన చిత్రములతో ఆ సభనిండిపోయినది. ఆ సభా భవనముయొక్క మెట్లు పద్మరాగమణులతో స్యమంతకమణులతో నిర్మించబడినవి. ఇంద్రనీలమణుల స్థంభములతో మంచి రత్నములచే చేయబడిన పూర్ణకుంభములతో ఆ సభ అలంకరింపబడినది. అచ్ఛట పారిజాత పుష్పముల మాలలు కనిపించును. చందనద్రవముతో అలికి కస్తూరీ కుంకుమలతో ఆ సభాప్రాంగణము ముగ్గులు పెట్టబడినది. సహస్రయోజన పరిమితమై విద్యాధర స్త్రీల సంగీతములతో ఆ సభ మనోహరముగా నుండినది. అట్టి సభలో బ్రహ్మ శంకరాది దేవతలు శ్రీహరిని సందర్శించుకొనిరి.

వసంతం తన్మద్యదేశే యథేందుం తారకావృతం అమూల్య రత్న నిర్మాణ చిత్ర సింహాసన స్థితం || 175

కిరీటినం కుండలినం వనమాలా విభూషితం | శంఖ చక్రగదా పద్మ ధారిణం చ చతుర్భుజం || 176

నవీననీరదశ్యామం సుందరం సుమనోహరం | అమూల్య రత్నం నిర్మాణ సర్వాభరణ భూషితం || 177

చందనోక్షితసర్వాంగం బిభ్రతం కేళిపంకజం | పురతో నృత్య గీతం చ పశ్యంతం సస్మితం ముదా || 178

శాంతం సరస్తీ కాంతం లక్ష్మీధృత పదాంబుజం | భక్త ప్రదత్త తాంభూలం భుక్తవంతం సువాసితం || 179

గంగయా పరయా భక్తయా సేవితం శ్వేత చామరై: | సర్వైశ్చ స్తూయమానం చ భక్తి నమ్రాత్మ కంధరై: || 180

ఏవం విశిష్టం తం దృష్ట్వా పరిపూర్ణతమం విభుం | బ్రహ్మాదయ: సురా: సర్వే ప్రణమ్య తుష్టుపుస్తదా || 181

ఆ సభామధ్యమున చుక్కల మధ్య చంద్రునివలె ఉన్నవాడును, రత్నసింహాసనమున నున్నవాడు, నాల్గు భుజములు కలవాడు కిరీటి, గది, చక్రహస్తి, కుండలి, వనమాలాధరుడు, అమూల్య రత్నాభరనములు కలవాడు శరీరమునందంతటా చందనము పూసుకొన్నవాడు, ముందు జరుగుచున్న నృత్యమును, గీతమును ఆలకించుచున్నవాడు, సరస్వతికి ప్రియుడ, లక్ష్మిదేవి చరణసేవ సేయుచుండగా గంగ చామరములు వీయుచుండగా భక్తులందరు సేవించుచున్న శ్రీహరిని దేవతలందరు చూచిరి.

పులకాంకిత సర్వాంగా: సాశ్రునేత్రా: సగద్గదా: | భక్త్యా పరమయా భక్తా భీతా నమ్రాత్మ కంధరా: || 182

పుటాంజలి యుతో భూత్వా విధాతా జగతామపి | వృత్తాంతం కథయామాస వినయేన హరే: పుర: || 183

హరి: తద్వచనం శ్రుత్వా సర్వజ్ఞ: సర్వభావవిత్‌ | ప్రహస్యోవాచ బ్రహ్మాణం రహస్యం చ మనోహరం || 184

దేవతలందరు పులకాంకితులై కన్నీరు కారగా గద్గద స్వరముతో శిరసు వంచుకొని యుండిరి. జగములనన్నిటిని సృష్టించు బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని శ్రీహరి ముందు దేవతల విషయమును విన్నవించెను. శ్రీహరి బ్రహ్మదేవుని మాటలు విని నవ్వుచు రహస్యభూతమైన ఈ విషయమునిట్లు తెలిపెను.

శ్రీభగవానువాచ- భగంతుడగు శ్రీహరి ఇట్లనెను-

శంఖచూడస్య వృత్తాంతం సర్వం జానామి పద్మజ | మద్భక్తస్య చ గోపస్య మహాతేజస్విన: పురా || 185

సురా: శ్రుణుత తత్సర్వం ఇతిహాసం పురాతనం | గోలోకసై#్యవ చరితం పాపఘ్నం పుణ్యకారణం || 186

సుదామా నామగోపశ్చ పార్షద ప్రవరో మమ | స ప్రాప దానవీం యోనిం రాధాశాపాత్సుదారుణం || 187

తత్రైకదాzహమగమం స్వాలయాద్రాసమండలం | విహాయ మానినీం రాధాం మమప్రాణాధికాం పరాం || 188

సా మాం ఇరజయా సార్ధం విజ్ఞాయ కింకరీముఖాత్‌ | పశ్చత్ర్కుధా సాzజగామ మాం దదర్శ చ తత్రచ || 189

విరజాం చ నదీరూపాం మాం జ్ఞాత్వాచ తిరోహితాం | పునర్జగామ సా రుష్టా స్వాలయం సఖిఖి: సహ || 190

మాందృష్ట్యా మందిరే దేవీ సుదామ సహితం పురా | భృశం మాం భర్త్సయామాస మౌనీభూతం చ సుస్థిరం || 191

తచ్ఛృత్వ చ సుమహాంశ్చ సుదామా తాం చుకోపహ | సచ తాం భర్త్సయామాస కోపేన మమ సన్నిధౌ || 192

తచ్ర్ఛుత్వా సా కోపయుక్తా రక్తపంకజలోచనా | బహిష్కర్తుం చకారాజ్ఞాం సంత్రస్తా మమ సంసది || 193

సఖీలక్షం సముత్తస్థౌ దుర్వారం తేజసోzజ్వలం | బహిశ్చకార తం తూర్ణం జల్పంతం చ పున: పునం || 194

బ్రహ్మదేవుడా! శంఖ చూడుని వృత్తాంతమంతయు నాకు తెలియును. అతడు పూర్వజన్మలో నా భక్తుడు. గోపులలో నొకడు. దేవతలారా! అతని చరిత్ర ఇది.

అతడు పూర్వజన్మలో సుదాముడనే గోపాలుడు. నా అనుచరులలో శ్రేష్ఠుడు. రాధాదేవి యొక్క వాపమువలన దానుడై పుట్టినాడు.

ఒకప్పుడు నేను నాకు ప్రాణముకంటె మిన్నయైన రాధాదేవి లేకుండ ఒంటరిగా నా గృమమునుండి రాసమండలమునకు వెళ్ళి విరజ యనే గోపికతో విహరించుచుంటిని. ఈ విషయమును చెలికత్తెలు రాధాదేఇకి చెప్పిరి. ఆమె అతికోపముతో రాసమండల స్థలమునకు రాగానే విరజ నదీరూపమై పోయినది. నేను కూడ మాయమైతిని. ఆ కోపముతోనే రాధాదేవి అంతఃపురానికి వెళ్ళినది. అచ్చట నేను సుదాముడు కలిసి మాట్లాడుకొనుచున్నాము. నన్ను చూడగానే రాధాదేవి కోపమునాపుకొనలేక నన్ను మాటలతో పీడించసాగినది. నేనప్పుడు ఏమి అనక మౌనముగా నుంటిని. కాని సుదాముడామె మాటలను విని సహించలేక నాముందరనే ఆమెను నిందించసాగెను. సుదాముని మాటలు వినగానే రాధాదేవి కోపముతో ఆతని నచటినుండి వెళ్ళగొట్టుట కనుమతి నిచ్చినది. రాధాదేవి ఆజ్ఞను వినగానే ఆమె చెలికత్తెలు అతనిని అక్కడినుండి బలవంతముగా గెంటివేసిరి. అప్పుడు కూడా సుదాముడు తనధోరణి మార్చుకొనలేదు.

సా చ తద్వచనం శ్రుత్వా సమారుష్టా శశాప తం | యాహి రే దానవీం యోనిమిత్యేవం దారుణం వచః || 195

తం గచ్ఛంతం శపంతం చ రుదంతం మాం ప్రణమ్య చ | వారయామాస సా తుష్టా రుదంతీ కృపయా పునః || 196

హే వత్స తిష్ఠ మాగచ్ఛ క్వయాసీతి పునః పునః | సముచ్చార్యచ తత్పశ్చాజ్జగామ సా చ విస్మితా|| 197

గోప్యశ్చ రురుదుః సర్వాః గోపాశ్చేతి సుదుఃఖితా | తే సర్వే రాధికా చాపి తత్పశ్చాత్‌ బోధితా మయా || 198

ఆయాస్యతి క్షణార్ధేన కృత్వా శాపస్య పాలనం | సుదామన్‌ త్వమిహాగచ్ఛేత్యువాచసా నివారితా || 199

గోలోకస్య క్షణార్ధేన చైకమన్వంతరంభ##వేత్‌ | పృథివ్యాం జగతాం ధాతః ఇత్యేవం వచనం ధ్రువం || 200

స ఏవ శంఖచూడవ్చ పునస్తత్రైవ యాస్యతి | మహాబలిష్ఠో యోగిశః సర్వమాయావిశారదః || 201

సుదాముడు తన ధోరణి మార్చుకొనక ఇంకా ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటే అతని మాటలు విని రాదాదేవి అతనిని దానవుడవై పుట్టుమని శపించెను.

అప్పుడా సుదాముడు నాకు నమస్కరించి ఏడ్చుచూ పోవుచుండగా రాధాదేవియే అతనిని నివారించినది. అక్కడి గోపికలు గోపాలకులు సుదామునకు ఇచ్చిన శాపమునకు మిక్కిలి చింతించిరి.

అప్పుడు నేను రాధికను, గోపగోపికలందరిని ఓదార్చి సుదాముడు క్షణార్ధములో గోలోకమునకు తిరిగి వచ్చుచుంటిని, గోలోక మందలి అరక్షణము భూమిపై ఒక మన్వంతరము. అందువలన శంఖచూడుడు భూమిపై ఒక మన్వంతరము గడిపి తిరిగి గోలోకమునకు వచ్చును.

మమ శూలం గృహీత్వా చ శీఘ్రం గచ్ఛత భారతం | శివః కరోతు సంహారం మమశూలేన రక్షసః || 202

మమైవ కవచం కంఠే సర్వమంగళ మంగళం | బిభర్తి దానవః శశ్వత్‌ సంసారవిజయీ తతః || 203

తత్ర బ్రహ్మన్‌ స్థితే కంఠే న కోపి హింసింతుం క్షమః | తద్యాచ్ఞాం చ కరిష్యామి విప్రరూపో హమేవ చ || 204

సతీత్వ భంగస్తత్పత్న్యా యత్ర కాలే భవిష్యతి | తత్రైవ కాలే తన్మృత్యురితి దత్తో వర్సస్త్వయా || 205

తత్పాత్న్యాశ్చోరదే వీర్యమర్సయిష్యామి నిశ్చితం | తక్షణనైవ తన్మృత్యుర్భవిష్యతి న సంశయః || 206

పశ్చాత్పా దేహముత్సృజ్య భవిష్యతి ప్రియా మమ | ఇత్యుక్త్వా జగతాం నాథో దదౌ శూలం హరాయ చ || 207

శూలం దత్వా య¸° శీఘ్రం హరిరభ్యంతరం ముదా | భారతం చ యయుర్దేవా బ్రహ్మ రుద్ర పురోగమాః || 208

శివుడు నాశూలముతో శంఖచూడుని సంహరించును. అట్లే శంఖచూడుడు సర్వమంగళములకు మంగళప్రదమైన నా కవచమును మెడలో సర్వదా ధరించును. ఆ కవచమాతని కంఠమున ఉండగా ఆతనినెవ్వరు హింసించనైనలేరు. అందువలన నేను బ్రాహ్మణ వేషమున దానిని యాచించెదను. అట్లే ఆతని భార్య సతీత్వము పైతమాతని నెల్లప్పుడు కాపాడుచుండును. ఆతని భార్య సతీత్వభంగము జరిగినప్పుడే అతనికి మృత్యువగునని నీవే వరమిచ్చితివి. అందువలన నేనే తులసియొక్క సతీత్వమును సైతము భంగము చేయుదును. ఆమె తన దేహత్యాగము చేసి తిరిగి నాకు ప్రియురాలు కాగలదు అని శ్రీహరి దేవతలతో పలికి తన శూలమును వారికి ఇచ్చెను. దేవతలందరు సంతోషముతో భారతదేశమునకు వెళ్ళిరి.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే తులస్యుపాఖ్యానం నామా షోడశోధ్యాయః

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున తులస్యుపాఖ్యానమను

పదునారవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters