sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్తదశోధ్యాయః - తులసీ శంఖచూడుల వృత్తాంతము నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు నారాదునితో పలికెను - బ్రహ్మా శివం సంనియోజ్య సంహారే దానవస్య చ | జగామ స్వాలయం తూర్ణం యథాస్థానం మహామునే || 1 చంద్రభాగా నదీతీరే వటమూలే మనోహరే | తత్ర తస్థౌ దేవో దేవనిస్తారహేతవే || 2 దూతం కృత్వా పుష్పదంతం గంధర్వేశ్వరమీప్సితం | శీఘ్రం ప్రస్థాపయామాస శంఖచూడాంతికం ముదా || 3 సచేశ్వరాజ్ఞయా శీఘ్రం య¸° తన్నగరం వరం | మహేంద్రనగరోత్కృష్టం కుబేరభవనాధికం || 4 పంచ యోజన విస్తీర్ణం దైర్ఘ్యే తద్ద్విగుణం మునే | స్ఫాటికాకార మణిభిః సమంతాత్పరివేష్టితం || సప్తభిః పదిఖాభిశ్చ దుర్గమాభిః సమన్వితం || జ్వలదగ్నినిభైర్నిత్యం శోభితం రత్నకోటిభిః | యుక్తం చ వీథి శతకైర్మణివేది సమన్వితైః || 6 పరితో వణిజాం సంఘైర్నానావస్తు విరాజితైః | సిందూరాకారమణిభిర్నిర్మితైశ్చ విచిత్రితైః || 7 భూషితం భూషితైర్దిర్దివ్యైరాశ్రమైః శతకోటిభిః | గత్వా దదర్శ తన్మధ్యే శంఖచూడాలయం వరం || 8 బ్రహ్మదేవుడు శంఖచూడుని సంహారమునకై శివుని నియోగించి తనలోకమునకు వెళ్ళెను. శంకరుడు దేవతలనుద్ధరించుటకు చంద్రభాగానదీ తీరముననున్న మఱ్ఱిచెట్టు నీడలో కూర్చుండి పుష్పదంతుడను గంధర్వుని శంఖచూడుని యొద్దకు దూతగా పంపించెను. ఆ శంఖచూడుని నగరము అమరావతికంటె గొప్పగా ఉండినది. అచ్చటి భవనములు కుబేరుని భవనముల కంటె శ్రేష్ఠమైనవి. ఆ నగరము ఐదు యోజనముల విస్తీర్ణముతో పదియోజనములు పొడవుగా నున్నది. చుట్టు ఏడు అగడ్తలున్నవి. వందలకొలది వీథులున్నవి. వాటిలో వర్తక సమూహములు అనేక వస్తువులను తెచ్చి విక్రయింతురు. అచ్చట దివ్యాశ్రమములు నూరుకోట్లకు పైగా నున్నవి. అట్టి నగర మధ్య భాగమున పుష్పదంతుడు శంఖచూడుని చూచెను. అతీవ వలయాకారం యథాపూర్ణేందుమండలం | జ్వలదగ్ని శిఖాభిశ్చ పరిఖాభిశ్చతసృభిః || 9 సుదుర్గమం చ శత్రూణం అన్యేషాం సుగమం సుఖం | అత్యుచ్చైర్గగన స్వర్శ్య మణి ప్రాచీరవేష్టితం || 10 రాజితం ద్వాదశద్వారైః ద్వార పాలసమన్వితైః | రత్న కృత్రిమ పద్మాఢ్యై రత్న దర్పణ భూషితైః || 11 మణీంద్రసార ఖచితైః శోభితం లక్షమందిరైః | శోభితం రత్నసోమానైః రత్నస్తంభవిరాజితైః || 12 రత్నచిత్ర కపాటాద్యైః సద్రత్న కలశాన్వితేం | రత్నేంద్ర చిత్ర రాజీభిః సుదీప్తాభిర్వరాజితైః || 13 పరితో రక్షితం శశ్వద్దానవైః శతకోటిభిః | దివ్యాస్త్ర దారిభిః శూరై మహాబలపరాక్రమైః|| 14 సుందరైశ్చ సువేషైశ్చ నానాలంకార భూషితైః | తాన్ దృష్ట్యా పుష్పదంతో೭పి వరద్వారం దదర్శ సః || 15 చంద్రునివలె వలయాకారమున నున్న అతని అంతఃపురమునకు మరొక నాలుగు అగడ్తలున్నవి. వాటివల్లె శత్రువులెవరు దానిని ప్రవేశింపలేరు. భవనములన్నయు మణి నిర్మితములు. అవి ఆకాశము నంటుచున్నవి. ద్వారపాలురు ఎల్లప్పటికి రక్షించు పది రెండు ద్వారములున్నవి. రత్నములతో, చిత్రములతో, రత్నకలశములతో నున్న కవాటము లా ద్వారములకున్నవి. వాటిని ఎల్లప్పుడు మహాబలపరాక్రమసమపన్నులై దివ్యాస్త్రములను ధరించియున్న భటులు రక్షింతురు. అటువంటి ద్వారములనన్నిటిని చూచుచు పుష్పదంతుడు ప్రధాన ద్వారమును చేరెను. ద్వారే నియుక్తం పురుషం శూలహస్తంచ సస్మితం | తిష్ఠంత పింగళాక్షంచ తామ్రవర్ణం భయంకరం || 16 కథయామాస వృత్తాంతం జగామ తదనుజ్ఞయా | అతిక్రమ్య నవద్వారం జగామా೭భ్యంతరం పురం || 17 న కైశ్చిత్ వారితో దూతో దూతరూపేణ తస్యచ | గత్వా సో೭భ్యంతరం ద్వారం ద్వారపాలమువాచ హ || 18 రణస్య సర్వవృత్తాంతం విజ్ఞాపయితుమీశ్వరం | స చ తం కథయిత్వాచ దూతం గంతు మువాచ హ || 19 స గత్వా శంఖచూడం తం దదర్శ సుమనోహరం | రాసమండలమధ్యస్థం స్వర్ణసింహాసనస్థితం || 20 మణీంద్ర ఖచితం చిత్రం రత్నదండ సమన్వితం | రత్న కృత్రమపుషై#్పశ్చ ప్రశస్తం శోభితం సదా || 21 భృత్యేన హస్త విధృతం స్వర్ణచ్ఛత్రం మనోహరం | సేవితం పార్షదగణౖర్వ్యజనైః శ్వేత చామరైః || 22 సువేషం సుందరం రమ్యం రత్నభూషణ భూషితం | మాల్యానులేపనం సూక్ష్మవస్త్రం చ దధతం మునే || 23 దానవేంద్రైః పరివృతం సువేషం చ త్రికోటిభిః | శతకోటిరన్యైశ్చ భ్రమద్భిః శస్త్రధారిభిః || 24 ఏవంభూతం చ తం దృష్ట్వా పుష్పదంతః సవిస్మయః | ఉవాచ రణవృత్తాంతం యదుక్తం శంకరేణ చ || 25 పుష్పదంతుడు ప్రధానద్వారమును చేరి అచ్చట శూలహస్తుడై మహాభయంకరముగా నున్న ద్వారపాలకునకు తాను వచ్చిన వృత్తాంతమును వివరించి అతనిఅనుజ్ఞతో లోనికేగి అంతఃపురమును ప్రవేశించెను. అతడు దూత కావున ఎవ్వరితనిని అడ్డగించలేదు. ఆ విధముగా అంతఃపురమును ప్రవేశించి అచ్చటనున్న ద్వారపాలకుని అనుజ్ఞతో అంతఃపురమున నున్న శంఖచూడుని దర్శించెను. అప్పుడు శంఖచూడుడు రత్న సింహాసనముపైన కూర్చుని రత్నదండమును చేతపట్టుకొని, ఒక భృత్యుడు బంగారు ఛత్రమును పట్టకొనగా, మరికొందరు తెల్లని చామరములు వీయుచుండగా, రత్నాలంకార శోభితుడై, సూక్ష్మ వస్త్రములను మాల్యములను, అను లేపనమును ధరించి యుండెను. అతని చుట్టు అనేకులైన రాక్షసులు కూర్చొని యుండిరి. శస్త్రాస్త్రములను ధరించిన భటులు అతని చుట్టు తిరుగుచుండిరి. ఆ విధముగా నున్న శంఖచూడుని చూచి పుష్పదంతుడు చాలా ఆశ్చర్యపడి శంకరుడు చెప్పిన యుద్ధ వృత్తాంతమును యథాతథముగా తెల్పెను. పుష్పదంత ఉవాచ - పుష్పదంతుడిట్లు పలికెను - రాజేంద్ర శివదూతో೭హం ప్రభో | యదుక్తం శంకరేణౖవ తత్ర్బవీమి నిశామయ || 26 రాజ్యం దేహి చ దేవానామధికారం చ సాంప్రతం | దేవాశ్చ శరణాపన్నా దేవేశే శ్రీహరౌ పరే || 27 దత్వాత్రిశూలం హరిణా తుభ్యం ప్రస్థాపితః శివః | చంద్రభాగానదీతీరే వటమూలే త్రిలోచనః || 28 విషయం దేహితేషాం చ యుద్ధం వా కురు నిశ్చయం| గత్వా వక్ష్యామి కిం శంభుం తద్భవాన్ వక్తుమర్హతి || 29 ఓ మహారాజా ! నేను శివుని దూతను. నాపేరు పుష్పదంతుడు. శంకరుడు చెప్పిన మాటలను యథాతథముగా చెప్పుచున్నాను. వినుమ. దేవతలకు రాజ్యమును అధికారమును ఇచ్చివేయుము. దేవతలందరు ఈ విషయమున శ్రీహరిని శరణువేడిరి. అతడు శివునకు త్రిశూలమునిచ్చి నీగురించి పంపెను. ఆ పరమశివుడు చంద్రభాగానదీతీరమున మఱ్ఱిచెట్టు నీడలో కూర్చొని యున్నాడు. నీవు దేవతలకు వారి రాజ్యమునిత్తువో యుద్ధము చేయుదువో స్పష్టముగా చెప్పినచో శంకరునకు నేను చెప్పుదును అనెను. దూతస్య వచనం శ్రుత్వా శంఖచూడః ప్రహస్య చ | ప్రభాతేహ్యాగమిష్యామి త్వంచ గచ్ఛేత్యువాచ హ || 30 స గత్వోవాచ తూర్ణం తం వలమూలస్థమీశ్వరం | శంఖచూడస్య వచనం తదీయం యత్పరిచ్ఛదం || 31 దూతగా వచ్చిన పుష్పదంతుని మాటలు విని శంఖచూడుడు నవ్వి నేను రేపుదయము వత్తును నీవు వెళ్ళిపొమ్మనెను. పుష్పదంతుడట్లే బయలుదేరి వటవృక్షము యొక్క నీడలో నున్న శివునితో శంఖచూడుని మాటలను అతని బలమును వివరించి చెప్పెను. ఏతస్మిన్నంతరే స్కందః ఆజగామ శివాంతికం | వీరభద్రశ్చ నందీచ మహాకాళః సుభద్రకః || 32 విశాలాక్షశ్చ బాణశ్చ పింగళాక్షో వికంపనః | విరూపో వికృతిశ్చైవ మణిభద్రశ్చ భాష్కలః || 33 కపిలాక్షో దీర్ఘదంష్ట్రో వికటస్తమ్రలోచనః | కాలంకటో బలీ భద్రః కాలజిహ్వాః కుటీచరః || 34 బలోన్మత్తో రణశ్లాఘీ దుర్జయో దుర్గమస్తథా | అష్టౌచ భైరవా రౌద్రా రుద్రాశ్చైకాదశస్మృతాః || 35 వాసవో వాసవాద్యాశ్చ ఆదిత్యా ద్వాదశస్మృతాః | హుతాశనశ్చ చంద్రశ్చ విశ్వకర్మాశ్వినౌ చ తౌ || 36 కుబేరశ్చ యమశైవ జయంతో నల కూబరః | వాయుశ్చ వరుణశైవ బుధోవై మంగళస్తథా || 37 ధర్మశ్చ శనిరీశానః కామదేవశ్చ వీర్యవాన్ | ఉగ్రదంష్ట్రా చోగ్రచండా కోట్టరీ కైటభీ తథా || 38 స్వయం శతభుజాదేవీ భద్రకాళీ భయంకరీ | రత్నేంద్రరాజి ఖచిత విమానోపరి సంస్థితా || 39 రక్తవస్త్రపరీధానా రక్తమాల్యానులేపనా | నృత్యంతీ చ హసంతీ చ గాయంతీ సుస్వరం ముదా || 40 అభయం దదతీ భక్తమభయా సా భయం రిపుం | బిభ్రతీ వికటాం జిహ్వాం సులోలాం యోజనాయతాం || 41 ఖర్పరం వర్తులాకారం గంభీరం యోజనాయతం | త్రిశూలం గగన స్పర్శి శక్తిం వై యోజనాయతాం || 42 శంఖం చక్రం గదాం పద్మం శరాంశ్చాపం భయంకరం | ముద్గరం ముసలం వజ్రం ఖడ్గం ఫలకముజ్వలం || 43 వైష్ణవాస్త్రం వారుణాస్త్రం ఆగ్నేయం నాగపాశకం | నారాయణాస్త్రం బ్రహ్మాస్త్రం గాంధర్వం గారుడం తథా || 44 పార్జన్యంవై పాశుపతం జృంభణాస్త్రంచ పార్వతం | మహేశ్వరాస్త్రం వాయవ్యం దండం సంమోహనం తథా || నానావిధాన్యాయుధాని దివ్యాస్త్ర శతకం పరం || 45 ఆగత్య తత్ర తస్థౌ సా యోగినీనాం త్రికోటిభిః | సార్థం వై డాకినీనాం చ వికటానాం త్రికోటిభిః || 46 భూతప్రేత పిశాచాశ్చ కూష్మాండ బ్రహ్మ రాక్షసాః | వేతలాశ్చైవ యక్షాశ్చ రాక్షసాశ్చైవ కింకరాః || 47 తాభిశ్చైవ సహ స్కందో నత్వావై చంద్రశేఖరం | పితుః పార్శ్వే సభాయాంచ సమువాస భవాజ్ఞయా || 48 ఆ సమయమున వీరభద్రుడు, నంది, మహాకాళుడు, సుభద్రకుడు, విశాలాక్షుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, బాష్కలుడు, కపిలాక్షుడు, దీర్ఘదంష్ట్రుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలంకటుడు, బలీభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు రణశ్లాఘి, దుర్జయుడు, దుర్గముడు, ఎనమండుగురు బైరవులు, ఏకాదశరుద్రలు, ఇంద్రుడు మొదలగు దేవతలు, అష్టదిక్పాలురు, కోట్టరీ, కైటభీ, మొదలగువారు వచ్చిరి. భ్రదకాళి త్రిశూలము, శంఖ చక్ర, గదాద్యాయుధములు, వైష్ణవాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి అస్త్రములు ధరించి డాకినులు, వికటలు, వెంటరాగా అచ్చటికి వచ్చెను. బూత ప్రేత పిశాచగణము కూఏష్మాండ బ్రమ్మరాక్షసులు, భేతాళులు,యక్షులు మొదలగువారందరితో కలసి కుమారస్వామి వచ్చి తండ్రికి నమస్కరించి అతని ప్రక్క కూర్చుండెను. అథ దూతే గతే తత్ర శంఖచూడః ప్రతాపవాన్ | ఉవాచ తులసీం వార్తాం గత్వా೭ భ్యంతరమేవచ || 49 రణవార్తాం చ సా శ్రుత్వా శుష్కకంఠోష్ఠ తాలుకా | ఉవాచ మధురం సాధ్వీ హృదయేన విదూయతా || 50 దూతయైన పుష్పదంతుడు వెళ్ళిపోయిన తరువాత శంఖచూడుడు అంతఃపురమునకు వెళ్ళి తులసితో ఈవిషయమునంతయు చెప్పెను. యుద్ధవార్త వినబడగానే తులసి బాధపడుచు పెదవులెండి పోగా ఈ విధముగా తన భర్తతో అనెను. తులస్యువాచ - తులసి ఇట్లు పలికినది - హేప్రాణనాథ హే బంధో తిష్ఠ మే వక్షసి క్షణం | హే ప్రాణాధిష్ఠాతృదేవ రక్ష మే జీవనం క్షణం || 51 భుంక్ష్య జన్మసు భోగ్యం తద్యద్వై మనసి వాంఛితం | పశ్యామి త్వాం ఓణం కించిల్లోచనా భ్యాం పిపాసితా || 52 ఆందోలయంతి ప్రాణా మే మనోదగ్ధం చ సంతతం | దుస్స్వప్నం చాద్యమే దృష్టం చాద్యైవ చరమేనిశి || 53 తులసీవచనం శ్రుత్వా భుక్త్వా పీత్వా నృపేశ్వరః | ఉవాచ వచనం ప్రాజ్ఞో హితం సత్యం యథోచితం || 54 ఓ ప్రాణనాథుడా ! ఒక క్షణము నా ఎదపై ఉండుము. నాప్రాణములను రక్షించుము. నీ మనసులోని కోరికను తీర్చుకొనము. నేను నిన్ను తనివి తీర చూడనిమ్ము నీమాటవినగానే నా మనస్సు ఆందోళన చెందుచున్నది. అట్లే ఈ తెల్లవారుజామున నా కొక పీడకల వచ్చినది. అందువలన యుద్ధమును విరమించుకొమ్మని తులసి ప్రార్థించగా రాజైన శంఖచూడుడు తులసి దగ్గరనే తిని, తాగి, సత్యము హితవైన మాటనిట్లు పలికెను. శంఖచూడ ఉవాచ - శంఖచూడుడిట్లనెను - కాలేన యోజితం సర్వం కర్మభోగ నిబంధనే | శుభం హర్షం సుఖం దుఃఖం భయం శోకమమంగళం || 55 కాలే భవంతి వృక్షాశ్చ శాఖావంతశ్చ కాలతః | క్రమేణ పుష్పవంతశ్చ ఫలవంతశ్చ కాలతః || 56 తేషాం ఫలాని పక్వాని ప్రభవంత్యేవ కాలతః | తే సర్వే ఫలినః కాలే కాలే కాలం ప్రయాంతి చ || 57 స్రష్టా చ కాలే సృజతి పాతాపాతి చ కాలతః | సంహర్తా సంహరేత్కాలే సంచరంతి క్రమేణ తే || 59 బ్రహ్మ విష్ణు శివాదీనాం ఈశ్వరః ప్రకృతేః పరః | స్రష్టా పాతాచ సంహర్తా సకృత్స్నాంశేన సర్వదా || 60 కాలే స ఏవ ప్రకృతిం నిర్మాయ స్వేచ్ఛయా ప్రభుః మ| నిర్మాయ ప్రాకృతాన్ సర్వాన్ విశ్వస్థాంశ్చ చరాచరాన్ || 61 ఆబ్రహ్మస్తంబపర్యంతం సర్వం కృత్రిమమేవచ ప్రవదంతి చ | కాలేన నశ్యత్యపిహి నశ్వరం || 62 భజ సత్యం పరం బ్రమ్మ రాధేశం త్రిగుణాత్పరం | సర్వేశం సర్వరూపంచ సర్వాత్మానంతమీశ్వరం || 63 జలం జలేన సృజతి జలం పాతి జలేన యః | హరేజ్జలం జలేనైవ తం కృష్ణం భజ సంతతం || 64 యస్యాజ్ఞయకా వాతి వాతః శీఘ్రగామీ చ సంతతరం | యస్యాజ్ఞయా చ తపనః తపత్యేవ యథాక్షణం || 65 యథాక్షణం వర్షతీంద్రో మృత్యుశ్చరతి జంతుషు | యథాక్షణం దహత్యగ్రిః చంద్రోభ్రమతి భీతవత్ || 66 మృత్యోర్మూలం కాలమూలం యమస్యచ యమం పరం | సృష్టారం స్రష్టురపిచ పాతుః పాలక మేవచ || 67 సంహర్తారం చ సంహర్తుః తం కృష్ణం శరణం వ్రజ | కో బంధశ్చైవ కేషాం వా సర్వబంధుం భజ ప్రియే1 || 68 అహం కోవా త్వం చ కావా విధినా యోజితాః పురా | త్వయా సార్థం కర్మణాచ పునస్తేన వియోజితః || 69 అజ్ఞానీ కాతరః శోకే విపత్తౌ చ న పండితః | సుఖం దుఃఖం భ్రమత్యేవ చక్రనేమి క్రమేణ చ || 70 నారాయణం తం సర్వేశం కాంతం ప్రాప్స్యసి నిశ్చితం | తపః కృతం యదర్థేచ పురా బదరికాశ్రమే || 71 మయా త్వం తపసాలబ్ధా బ్రహ్మణశ్చ వరేణహి | హరేరర్థే తవ తపో హరిం ప్రాప్స్యసి కామిని || 72 బృందావనే చ గోవిందం గోలోకే త్వం లభిష్యసి | అహం యాస్యామి తల్లోకం తనరుం త్యక్త్వా చ దానవీం || 73 తత్ర ద్రక్ష్యసి మాం త్వం చ త్వాంచద్రక్ష్యామి సంతతరం | ఆగమం రాధికాశాపాత్ భారతం చ సుదుర్లభం || 74 పునర్యాస్యమి తత్రైవ కః శోకోమే శ్రుణుప్రియే | త్వం హి దేహం పరిత్యజ్య దివ్యరూపం విధాయచ || 75 తత్కాలం ప్రాప్స్యసి హరిం మా కాంతే కాతరా భవ | ఇత్యుక్త్వా చ దినాంతే చ తయా సార్థం మనోహరే || 76 ఓ తులసి! కాలము అన్నిటిని కలిగించును. సుఖం, హర్షము, దుఃఖం, భయం మొదలగునవన్నియు కాలము వల్లనే జరుగుచున్నవి. చెట్లు పెరిగి పెద్దవై పుష్పఫలములనిచ్చి పండి పడిపోవటు కాలమూలముననే జరుగుచున్నది. ప్రాణాలన్నియు ఈ కాలము వలననే పుట్టుచున్నవి నశించుచున్నవి. బ్రహ్మదేవుడు కాలముననుసరించి ఈ విశ్వసృష్టి చేయగా విష్ణువు కాలముననుసరించి రక్షించుచున్నాడు. అట్లే శంకరుడు కాలప్రభావమువలననే ఈ విశ్వమును లయింప చేయుచున్నాడు. పరబ్రహ్మయగు కృష్ణుడు సైతము కాలముననుసరించియే బ్రహ్మాది దేవతలను, ప్రకృతిని సృష్టించుచున్నాడు. బ్రహ్మదేవుడు మొదలుకొని చీమల వరకున్న సమస్త ప్రపంచము అశాశ్వతమైనది. వాటి కాలము తీరగనే నశించుచున్నది. అందువలన సత్యస్వరూపుడు పరాత్పరుడు అగు శ్రీకృష్ణుని సేవింపుము. అతని ఆజ్ఞవలననే గాలి వీచుచున్నది. అగ్నిమండుచున్నది. ఇంద్రుడు వర్షించుచున్నాడు. మృత్యువు తన కార్యక్రమమును పూర్తి చేయుచున్నాడు. మృత్యువునకు, కాలమునకు యమునకు, సమస్త చరాచరసృష్టికి మూలపురుషుడగు శ్రీకృష్ణుని శరణుపొందుము. నేవీవరు నేనెవరు? ఎవరు ఎవరికి బంధువు. ఆ భగవంతుడే నిన్ను నన్ను ఈ విధముగా కలిపినాడు. మరల వియోగము కలిగింపనున్నాడు. అజ్ఞాని యగువాడు ఆపదలందు, శోకసమయమున బాధపుడు. కాని జ్ఞానవంతుడట్లు కాదు. అతగు సుఖదుఃఖములు చక్రములో ఆకులు పైకి కిందికి తిరుగుచున్నట్లే వచ్చునని భావించును. నీవు ఎవరి గురించి పూర్వము తపస్సు చేసినావో ఆ నారాయణుని వచ్చు జన్మలో భర్తగా పొందగలవు. నేను కూడ తపస్సు చేసి బ్రహ్మదేవుని వలన నిన్ను భార్యగా పొందినాను. గొలోకమందలి బృందావనములో నీవు నీ తపస్సున కనుకూలముగా గోవిందుని భర్తగా పొందుదువు. నేను కూడా ఈ రాక్షస శరీరమును వదలి గోలోకమునకు వచ్చి నిన్ను చూతురు. నీవుకూడ అక్కడ నన్ను చూచెదవు. నేను రాధాదేవి శాపమువలన ఈ భారత భూమికి వచ్చితిని. మరల తిరిగి పోవుచున్నాను. అందువలన దుఃఖింపవలసిన పనిలేదు. నీవుకూడ నీ శరీరమును వదిలి దివ్యరూపము ధరించి శ్రీహరిని పొందుదువు. అందువలన శోశింపనవసరములేదు అని శంఖచూడుడు తులసితో అనెను. సుష్వాస శోభ##నే తల్పే పుష్పచందన చర్చితే | నానా ప్రకారవిభ##వే చకార రత్నమందిరే || 77 రత్నప్రదీప సంయుక్తే స్త్రీరత్నం ప్రాప్య సుందరీం | నినాయ రజనీం రాజా క్రీడా కౌతుక మంగళైః || 78 కృత్వా వక్షసి కాంతాం తాం రుదంతీమతిదుఃఖితాం | కృశోదరీం నిరాహారం నిమగ్నాం శోకసాగరే || 79 పునస్తాం బోధయామాస దివ్యజ్ఞానేన బోధవిత్ | పురా కృష్ణేన యద్దత్తం భాండీరే తత్వముత్తమం || 80 స చ తసై#్య దదౌ తచ్ఛ సర్వశోకహరం పరం | జ్ఞానం సంప్రాప్య సాదేవి ప్రసన్న వదనేక్షణా || 81 క్రీడాం చకార హర్షేణ సర్వం మత్వా೭తి నశ్వరం | తౌ దంపతీ చ క్రీడార్తౌ నిమగ్నౌ సుఖసాగరే || 82 పులకాంకిత సర్వాంగౌ మూర్ఛితౌ నిర్జనే వనే | అంగప్రత్యంగ సంయుక్తౌ సుప్రీతౌ సురతోత్సుకౌ || 83 ఏకాంగౌ చ తథా ద్వౌ చార్ధనారీశ్వరౌ యథా | ప్రాణశ్వరం చతులసీమేనే ప్రాణాధికం పరం || 84 ప్రాణాధికాం చ తాం మేనేరాజా ప్రాణాధికేశ్వరీం | తౌ స్థితౌ సుఖసుప్తౌ చ తంత్రితౌ సుందరౌ సమౌ || 85 సువేషౌ సుఖసంభోగాదచేష్టౌ సుమనోహరౌ | క్షణం సచేతనౌ తౌ చ కథయంతౌ రసాశ్రయాం || 86 భుక్తవంతౌ చ తాంబూలం ప్రదత్తం చ పరస్పరం || 87 పరస్పరం సేవితౌ చ సుప్రీత్యా శ్వేతచామరైః | క్షణం శయానౌ సానందౌ వసంతౌ చ క్షణం పునః || 88 క్షణం కేళినియుక్తౌ చ రసపభావసమన్వితౌ | సురతాద్విరతిర్నాస్తి తౌ తద్విషయ పిండితౌ || 89 సతతం జయయుక్తౌ ద్వౌ క్షణం నైన పరాజితౌ || 90 శంఖచూడుడు ఆ తర్వాత పుష్పచందనములు కల శృంగార తల్పముపై పడుకొనెను. తులసిని తన దగ్గరకు తీసికొని ఏడ్చుచు అతి దుఃఖితయై నిరాహారగాయున్న తులసిని మరల ఓదార్పసాగెను. అట్లే శ్రీకృష్ణుడు తెలిపిన తత్వమునామెకు ఉపదేశించెను. ఆజ్ఞానమును పొంది తులసి సమస్తము క్షణికమని భావించి శోకవిదూరయైనది. రతి క్రీడయందు ఆర్తులైన ఆ తులసి శంఖచూడులు నిర్జనవనమున తమ కోర్కె తీర్చుకొనిరి. శృంగారమునకు చెందిన కథలను చెప్పుకొనుచు వారిరువురు అర్ధనారీశ్వరులవలె ఏకాంగులన్నట్లుగా భాసించిరి. ఒకరి కొకరు తాంబూలము నిచ్చుకొని తినుచు, భుక్త శేషమును పరస్పరము మార్చుకొనుచు, ఒకరి కొకరు చామరములు వీయుచు శృంగార రసమున ఓలలాడిరి. వారిరువురకు శృంగార విషయమున అపజయము లేదు. ఒకరిని మించి మరొకరన్నట్లుగా ఇద్దరు జయము పొందిరి. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే తులసీ శంఖచూడ సంభోగో నామ సప్తదశోధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున తెలుపబడిన తులసీ శంఖచూడుల సంభోగమను పదునేడవ అధ్యాయము సమాప్తము.