sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టోదzశోధ్యాయః - శంకర శంఖచూడుల సంభాషణ నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు నారదునితో అనెను - శ్రీకృష్ణం మనసా ధ్యాత్వా రాజా కృష్ణపరాయణః | బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ పుష్పతల్పాన్ననోహరాత్ || 1 రాత్రివాసః పరిత్యజ్య స్నాత్వా మంగళవారిణా | ధౌతే చ వాససీ ధృత్వా కృత్వా తిలకముజ్వలం || 2 చకారాహ్నికమావశ్యం అభీష్ట గురువందనం | దధ్యాజ్యం మధు లాజాంశ్చ సో೭పశ్యద్వస్తుమంగళం || 3 రత్నశ్రేష్ఠం మణిశ్రేష్ఠం వస్త్ర శ్రేష్ఠం చ కాంచనం | బ్రహ్మణభ్యో దదౌ భక్త్వా యథా నిత్యం చ నారద || 4 అమూల్యరత్నం యత్కించిన్ముక్తా మాణిక్య హీరకం | దదౌ విప్రాయ గురవే యాత్రా మంగళ##హేతవే || 5 గజరత్నం చాశ్వరత్నం ధేనురత్నం మనోహరం | దదౌ సర్వం దరిద్రాయ విప్రార్థం మంగళాయ చ || 6 కోశాగార సహస్రంచ నగరాణాం త్రిలక్షకం | గ్రామానాం శతకోటించ బ్రమ్మణభ్యో దదౌ ముదా || 7 పుత్రం కృత్వా చ రాజేంద్రం సుచంద్రం దానవేషు చ | పుత్రే సమర్ప్య భార్యాం చ రాజ్యం వై సర్వ సంపదం || 8 ప్రజానుచరసంఘం చ కోశౌఘం వాహనాదికం | స్వయం సన్నాహయుక్తశ్చ ధనుష్పాణిర్బభూవ హ || 9 భృత్యద్వారా క్రమైణౖవ స చక్రే సైన్యం సంచయం | అశ్వానాం చ త్రిలక్షేణ పంచలక్షేణ హస్తినాం || 10 రాథానామయుతైనైన ధానుష్కాణాం త్రికోటిభిః | త్రికోటిభిశ్చర్మిణాం చ శూలినాం చ త్రికోటిభిః || 11 కృతా సేనాzపరిమితా దానవేంద్రేణ నారద | యస్యాం సేనాపతిశ్చైవ యుద్ధ శాస్త్ర విశారదః || 12 మహారథః స విజ్ఞేయే రథినాం ప్రవరో రణ | త్రిలక్షాక్షౌహిణీ సేనాపతిం కృత్వా నరాధిపః || 13 త్రింశదక్షౌహిణీ వాద్యభాండౌఘం చ చకార సః | బహిర్బభూవః శివిరాన్మనసా శ్రీహరిం స్మరన్ || 14 రత్నేంద్ర సార ఖచితం విమానం హ్యారురోహ సః | గురువర్గాన్ పురస్కృత్య ప్రయ¸° శంకరాంతికం || 15 పుష్పభద్రానదీతీరే యత్రాక్షయవటః శుభః | సిద్ధాశ్రమం చ సిద్ధానాం సిద్ధిక్షేత్రం చ నామతః || 16 కపిలస్య తపః స్థానం పుణ్యక్షేత్రం చ భారతే | పశ్చిమోదధిపూర్వే చ మలయస్య చ పశ్చిమే || 17 శ్రీశైలోత్తర భాగేచ గంధమాదన దక్షిణ | పంచయోజన విస్తీర్ణ దైర్ఘ్యే శతగుణా తథా || శాశ్వతీ జలపూర్ణా చ పుష్పబద్రానదీ శుభా || 18 లవణోదప్రియా భార్యా శశ్వత్సౌభాగ్య సంయుతా | శుద్ధ స్ఫటిక సంకాశా భారతే చ సుపుణ్యదా || 19 శరావతీ మిశ్రితా చ నిర్గతా సా హిమాలయాత్ | గోమంతం వామతః కృత్వా ప్రవిష్టా పశ్చిమోదధౌ || 20 రాజగు శంఖచూడుడు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించుకొని, బ్రాహ్మీముహూర్తమున పుష్పశయ్యనుండి లేచి, రాత్రి ధరించిన వస్త్రములను వదలివేసి, మంగళస్నానమును చేసి, ఉతికిన వస్త్రములు ధరించి, ముఖమున తిలకమును పెట్టుకొనెను. ఆతరువాత ఆహ్నిక కృత్యములన్నియు తీర్చుకొని పెరుగు, నేయి తేనే మొదలగు మంగళవస్తు దర్శనము చేసెను. అటుపిమ్మట ప్రతిదినము చేయునట్లుగానే మణిని, రత్నమును, వస్త్రమును బ్రాహ్మణులకు దానముచేసి యాత్రయందు మంగళము జరుగునట్లు రత్న మాణిక్యములను గురువునకు దానము చేసెను. అట్లే మంచి ఏనుగును, గుఱ్ఱమును, ఆవును దరిద్రుడైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ తరువాత పుత్రుడగు సుచంద్రునకు రాజ్యాభిషేకము చేసి అతనికి తన భార్యయగు తులసిని రాజ్యమును, అనుచరులను, కోశమును అప్పగించి యుద్ధమునకు బయలుదేరెను. అతని వెంట మూడు లక్షల గుఱ్ఱములు, ఐదులక్షల ఏనుగులు, పదివేల రథములు మూడుకోట్ల ధనుర్ధరులు మూడుకోట్ల ఖడ్గధారులు, మూడుకోట్ల శూలాయుధ ధరులు బయలుదేరిరి. యుద్ధశాస్త్రవిశారదుడు రథికులలో శ్రేష్టుడైన సేనాధిపతిని మహారథుడందురు. శంఖచూడుడు మూడులక్షల అక్షోహిణుల సేనను సేనాధిపతిని నియమించి ముపై#్ప అక్షోహిణుల సేన వాద్యముతో శిబిరమునుండి యుద్దమునకై బయలుదేరెను. అతని ముందు గురువుల సమూహముండెను. శంఖచూడుడు పరమేశ్వరుడు నివసించియున్న పుష్పభద్రానదీతీరమందలి అక్షయవట ప్రాంతమునకు బయలుదేరెను. ఆ ప్రాంతము సిద్ధులకు సిద్ధిక్షేత్రము. సిద్ధాశ్రమమను పేర ప్రసిద్ధిగాంచినది. ఆ పుణ్యక్షేత్రమున కపిలమహర్షి తపమాచరించెను. ఆ క్షేత్రము పశ్చిమ సముద్రమునకు తూర్పుగా, మలయ పర్వతమునకు పడమరదిశలో, శ్రీశైలమునకు ఉత్తర దిశలో గంధమాదన పర్వతమునకు దక్షిణమున నున్నది. పుష్పభద్రానది ఐదు యోజనములు విస్తరించి ఐదువందల యోజనముల పొడవై యున్నది. ఆ నదిలో ఎల్లప్పుడు నీరు నిండుగానుండును. ఆ నది నిత్యము సముద్రునితో సంగమించుటవలన సముద్రునకు ప్రియమైన భార్య యగుచున్నది శరావతీనది, గోమతీనదులతో కలిసి పశ్చిమ సముద్రమున ఆ నది కలియుచున్నది అని నారాయణుడు నారదునితోననెను. తత్ర గత్వా శంఖచూడో లు లోకే చంద్రశేఖరం | వటమూలే సమాసీనం సూర్యకోటి సమప్రభం || 21 కృత్వా యోగసరే స్థిత్వా ముద్రాయుక్తం చ సస్మితం | శుద్ధస్పటిక సంకాశం జ్వలంతం బ్రహ్మ తేజసా || 22 త్రిశూలపట్టిశధరం వ్యాఘ్ర చర్మాంబరం వరం | తప్త కాంచన వర్ణాభం జటాజాలం చ బిభ్రతం || 23 త్రినేత్రం పంచవక్త్రం చ నాగయజ్ఞోపవీతినం | మృత్యుంజయ కాలమృత్యుం విశ్వమృత్యుకరం పరం || 24 భక్త మృత్యుహరం శాంతం గౌరీకాంతం మనోహరం | తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదాం || 25 ఆశుతోషం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం | విశ్వనాథం విశ్వరూపం విశ్వబీజం చ విశ్వజం || 26 విశ్వంభరం విశ్వవరం విశ్వసంహార కారణం | కారణం కారణానాం చ నరకార్ణవ తారణం || 27 జ్ఞాన ప్రదం జ్ఞానబీజం జ్ఞానానందం సనాతనం | అవరుమ్య వివానాశ్చ స దృష్ట్వా దానవేశ్వరః || 28 సర్వేః సార్థం భక్తియుతః శిరసా ప్రణనామ సః | వామతో భద్రకాళీం చ స్కందం తత్పురతః స్థితం || 29 ఆశిషం చ దుదుస్తసై#్మ కాళీస్కందశ్చ శంకరః | ఉత్తస్థుః దానవం దృష్ట్వా సర్వే నందీశ్వరాదయః || 30 పరస్పరం చ సంభాషం తే చక్రుస్తోత్ర సాంప్రతం | రాజా కృత్వా చ సంభాషామువాస శివసన్నిధౌ || 31 ప్రసన్నాత్మా మహాదేవో భగవాం స్తమువాచ హ || 32 శంఖచూడుడు రత్నవిమానమున వెళ్ళి పుష్పభద్రానదీ తీరమున వటవృక్షము కిందనున్న పరమశివుని చూచెను. అతడు సూర్యకోటి సమప్రభుడు, యోగాసనమున చిన్ముద్రతో నున్నవాడు. ఆ పరమశివుడు త్రిశూలమును, పట్టిశముము, పులి తోలును ధరించినవాడు. బంగారు మేనివాడు. జటాజూటాదారి త్రినేత్రుడు మృత్యుంజయుడు. జ్ఞానదాత. శంఖచూడుడు తన విమానము నుండి దిగి పరమేశ్వరునకు భక్తితో నమస్కరించెను. అట్లే శంఖరుని ఎడమప్రక్కనున్న భద్రకాళికి ముందున్న కుమారస్వామికి భక్తితో నమస్కరించెను. శంఖచూడుని నమస్కారములనందుకొన్న కాళి, స్కందుడు శంకరుడు అతనికి ఆశీస్సులనొసగిరి. పరమేశ్వరుని దగ్గరనున్న గణమంతయు శంఖచూడుని చూడగనే నిలబడిరి. ఆ తర్వాత వారు పరస్ఫరము సంభాషణములు గావించుకొనిరి. సంభాషణానంతరము తన సమీపమున కూర్చున్న శంఖచూడునితో పరమేశ్వరుడిట్లు మాట్లాడెను. శ్రీమహాదేవి ఉవాచ - మహాదేవుడిట్లు శంఖచూడినితో అనెను - విధాతా జగతాం బ్రహ్మా పితా ధర్మస్య ధర్మవిత్ | మరీచిస్తస్య పుత్రశ్చ వైష్ణవశ్చా೭పి ధార్మికః || 33 కశ్చపశ్చా೭పి తత్పుత్రో ధర్మిష్ఠశ్చ ప్రజాపతిః | దక్షః ప్రీత్యా దదౌ తసై#్మ భక్త్యా కన్యాస్త్రయోదశ || 34 తాస్వేకా చ దనుః సాధ్వీ తత్సౌభాగ్యేన వర్ధితా | చత్వారింశద్దనోః పుత్రాః దానవాస్తేజసోజ్వలాః || 35 తేష్వేకో విప్రచిత్తిశ్చ మహాబల పరాక్రమః | తత్పుత్రా ధార్మికో దంభో విష్ణుభక్తో జితేంద్రియః || 36 జజాప పరమం మంత్రం పుష్కరే లక్షవత్సరం | శుక్రాచార్యం గురుం కృత్వా కృష్ణస్య పరమాత్మనః || 37 తదా త్వాం తనయం ప్రాప పరం కృష్ణ పరాయణం | పురా త్వం పార్షదో గోపో గోపేష్యష్టసు ధార్మికః || 38 అధునా రాధికా శాపాద్భారతే దానవేశ్వరః | ఆబ్రహ్మస్తంబ పర్యంతం భ్రమం మేనే చ వైష్ణవః || 39 సాలోక్య సార్‌ష్టి సారూప్య సామీపై#్యక్యం హరేరపి | దీయమానం న గృహ్ణంతి వైష్ణవాః సేవనం వినా || 40 బ్రహ్మత్వమమరత్వం వా తుఛ్చం మేనే చ వైష్ణవః | ఇంద్రత్వం నా కుబేరత్వం న మేనే గుణనాసు చ || 41 కృష్ణభక్తస్య తే కిం వా దేవానాం విషయే భ్రమే | దేహి రాజ్యం చ దేవానాం మత్ర్పీతిం కురు భూమిప || 42 సుఖం స్వరాజ్యే త్వం తిష్ఠ దేవాస్సంతు స్వకే పదే | అలం భ్రాతృవిరోధేన సర్వే కశ్యపవంశజాః || 43 యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికానిచ | జ్ఞాతి ద్రోహస్య పాపస్య కలాం నార్హంతి షోడశీల || 44 స్వసంపదాం చ హానిం చ యది రాజేంద్ర మన్యసే | సర్వావస్థాసు సమతా కేషాం యాతి చ సర్వదా || 45 బ్రహ్మణశ్చ తిరోభావో లయే ప్రాకృతికే సతి | ఆవిర్భావః పునస్తస్య ప్రభ##వేదీశ్వరేచ్ఛయా || 46 జ్ఞానం బుద్ధిశ్చ తపసా స్మృతిర్లోకస్య నిశ్చితం | కరోతి సృష్టిం జ్ఞానేన స్రష్టా సోzసి క్రమేణచ || 47 ఓ శంఖచూడుడా! లోకములను సృష్టించు బ్రహ్మదేవుడు అందరికి తండ్రివంటివాడు. అతని పుత్రుడు పరమ వైష్ణవుడైన మరీచి మహర్షి. ఆతని పుత్రుడు ధర్మిష్ఠుడైన కశ్యప ప్రజాపతి. దక్షప్రజాపతి కశ్యపునకు తన కుమార్తెలు పదమువ్వురును భక్తితో ఇచ్చెను. ఆ దక్షప్రజాపతి పుత్రికలలో దనువు ఒక కూతురు. దనువునకు మంచితేజస్సంపన్నులైన నలుబదిమంది పుత్రులు కలిగిరి. వారిలో మహాబలవంతుడగు విప్రచిత్తి ఒకడు. ఆతని పుత్రుడు పరమ ధార్మికుడు విష్ణుభక్తుడునైన దంభుడు. ఆతడు శుక్రాచార్యుని గురువుగా చేసికొని పుష్కరక్షేత్రమున శ్రీకృష్ణమంత్రమును లక్షసంవత్సరములు జపము చేసెను. అందువలన గొప్ప కృష్ణభక్తుడవగు నిన్ను పుత్రునిగా పొందెను. నీవు పూర్వము శ్రీకృష్ణుని అనుచరులైన ఎనమండుగురు గోపకులలో ఒకడవు. రాధికాదేవి శాపమువలన దానవేశ్వరుడవై భారత భూమిపై నున్నావు. విష్ణుభక్తుడు బ్రహ్మమొదలు స్తంబమువరకు అన్నియు అసత్యములని తలచును. అట్లే చతుర్విధమోక్షములను కూడ ఇష్టపడడు. బ్రహ్మత్వమైనను దేవత్వమైనను అతని దృష్టిలో తుచ్ఛమైనది. ఇంద్రపదవిని, కుబేరత్వమును అసలే ఇష్టపడదు. అతనికి హరిసేవనయే శ్రేష్ఠమైనది. కావున కృష్ణభక్తుడవగు నీకు దేవతల విషయము భ్రమరూపమైనది. అందువలన దేవతల రాజ్యమును వారికిచ్చివేసి సుఖముగా నీరాజ్యమున నుండుము. తమ రాజ్యమును తాము పాలించుకొందురు. మీరందరు కశ్యప ప్రజాపతి పుత్రులు. భాతృవిరోధము ఎవ్వరికిని కూడదు. బ్రహ్మహత్యాది పాపములు భాతృద్రోహపాతకమునకు పదునారవ వంతైన కాజాలవు. నీ సంపద కొంత నశించునని నీవు భావించినచో సమత యనునది ఎక్కడను సంభవించదు. బ్రహ్మదేవుడు కూడా ప్రాకృతికలయ సమయమున నశించును. తరువాత భగవంతుని ఇచ్చవలన పునర్జన్మనెత్తుచున్నాడు. ఆతడు తపస్సుచేసి జ్ఞానమును సంపాదించుకొని క్రమముగా సృష్టిని చేయుచున్నాడు. పరిపూర్ణతమోధర్మః సత్యే సత్యాశ్రయః సదా | సోzపి త్రిభాగస్త్రేతా యాం ద్విభాగో ద్వాపరే స్మృతః || 48 ఏకభాగః కలేః పూర్వే తత్‌హ్రాసశ్చ క్రమేణ చ | కళామాత్రం కలేః శేషే కుహ్యాం చంద్రకళా యథా || 49 యాదృక్తేజో రవేర్గ్రీష్మే నతాదృక్ శిశిరే పునః | దినే చ యాదృజ్‌మధ్యాహ్నే సాయం ప్రాతర్నతత్సమం || 50 ఉదయం యాతి కాలేన బాల్యతాం చ క్రమేణ చ | ప్రకాండతాం చ తత్పశ్చాత్కాలేzస్తం పునరేవ సః || 51 దినే ప్రచ్ఛన్నతాం యాతా కాలేవై దుర్దినే ఘనే | రాహుగ్రస్తే కంపితశ్చ పునరేవ ప్రసన్నతాం || 52 పరిపూర్ణతమశ్చంద్రః పూర్థిమాయాం చా యాదృశః | తాదృశో నభ##వేన్నిత్యం క్షయం యాతి దినే దినే || 53 పునః స పుష్టతాం యాతి పరకుహ్వా దినే దినే | సంపద్యుక్తః శుక్ల పక్షే కృష్ణే వ్లూనశ్చ యక్ష్మణా|| 54 రాహు గ్రస్తే దినే వ్లూనో దుర్దినే నిబిడే ఘనే | కాలే చంద్రో భ##వేత్ శుద్ధో భ్రష్టశ్రీః కాలభేదకే || 55 భవిష్యతి బలిశ్చేంద్రో భ్రష్టశ్రీః సుతలేzధునా | కాలేన పృథ్వీ సస్యాఢ్యా సర్వాధారా వసుంధారా || 56 కాలే జలే నిమగ్నా సా తిరోభూతా విపద్గతా | కాలే నశ్యంతి విశ్వాని ప్రభవంత్యేవ కాలతః || 57 చరాచరాశ్చ కాలేన నశ్యంతి ప్రభవంతి చ | ఈశ్వరసై#్యన సమతా కృష్ణస్య పరమాత్మనః || 58 అహం మృత్యుంజయో యస్మా దసంఖ్యం ప్రాకృతం లయం | అదృశ్యం చాపి పశ్యామి వారం వారం పునః పునః || 59 స చ ప్రకృతి రూపశ్చ స ఏవ పురుషః స్మృతః | స చాత్మా సర్వజీవశ్చ నానారూపధరః పరః || 60 కరోతి సతతం యోహీ తన్నామగుణ కీర్తనం | కాలం మృత్యుం స జయతి జన్మరోగం జరాం భయం || 61 స్రష్టా కృతో విధిస్తేన పాతా విష్ణుః కృతో భ##వే | అహం కృతశ్చ సంహర్తా వయం విషయిణో యతః || 62 కాలాగ్ని రుద్రం సంహారే నియుజ్య విషయే నృప | అహం కృతశ్చ సతతం తన్నామ గుణ కీర్తనం || 63 తేన మృత్యుంజయోzహం చ జ్ఞానేనానేన నిర్భయః | మృత్యుర్మత్తో భయాద్యాతి వైనతేయాది వోరగః || 64 కృతయుగమున ధర్మము పరిపూర్ణముగానుండెను. త్రేతాయుగమున మూడు భాగములుండినది. ద్వాపరమున రెండు భాగములు మాత్రమే ధర్మముండినది. కలియుగమున తొలుత ఒక భాగముండి క్రమక్రమముగా క్షీణించుచున్నది. కలియుగము యొక్క చివరి భాగమున అమావాస్యనాడు చంద్రకళ యున్నట్లు ధర్మముండును. సూర్యుని ప్రకాశము గ్రీష్మ ఋతువున ఉన్నట్లు శిశిరఋతువున ఉండదు. మధ్యాహ్నమున నున్నట్లు ఉదయమున సాయంకాలమున ఉండదు. మేఘములు కప్పినప్పుడు పగటిపూటనైనను సూర్యప్రకాశము ప్రచ్ఛన్నముగా నుండును. చంద్రుడు పున్నమనాడు ఎంత ప్రకాశించుచుండునో మిగిలిన దినములలో అంతగా ప్రకాశించడు. పూర్ణిమ తరువాత క్రమక్రమముగా క్షీణించి అమావాస్య తరువాత వృద్ధిపొందును. మేఘములు కప్పినప్పుడు రాహువు గ్రసించినపుడు అతని కాంతి క్షీణించును. బలి చక్రవర్తి ఇప్పుడు తన సంపదలన్నియు కోల్పోయి పాతాళముననున్నాడు. భూమి ఒకప్పుడు సస్యశ్యామలమై కనిపించును. మరియొకప్పుడు నీటిలో మునిగిపోవును. ఈ చరాచర సృష్టియంతయు పుట్టుచున్నది, నశించుచున్నది. అదువలన సమతయనునది ఎచ్చటను లేదు. నేను మృత్యుంజయుడను. అందువలననే అసంఖ్యాకమైన ప్రాకృతలయములు చూడగలుగుచున్నాను. పరమాత్మయే ప్రకృతిరూపుడు. అతడు సర్వజీవాత్మ. అనేక రూపములను ధరించువాడు. ఎవరు ఆ పరమాత్మ నామగుణ సంకీర్తనము ఎల్లప్పుడు చేయుచుందురో వారు కాలమును మృత్యువును జన్మ, రోగ, జరాభయమును జయింతురు. ఆ పరమాత్మయే బ్రహ్మదేవుని సృష్టికొరకు, లోకరక్షకుడై విష్ణువును, లోకసంహారమునకై నన్ను సృష్టించెను. నేను రుద్రులలో ఒకడైన కాలాగ్ని రుద్రుని, సంహార కార్యమున నియోగించి ఆ పరమాత్మ యొక్క నామగుణ సంకీర్తమునెల్లప్పుడు చేయుచుందును. అందువలననే నేను మృత్యుంజయుడనైతిని. గరుత్మంతుని చూచిన సర్పము వలె నన్ను చూడగానే మృత్యువు పరుగెత్తుకొని పోవును అని శంకరుడు శంఖచూడునితో అనెను. ఇత్యుక్త్వా స చ సర్వేశః సర్వజ్ఞః సర్వభావనః | విరరామాథ శర్వశ్చ సభామధ్యే చ నారద || 65 రాజా తద్వచనం శ్రుత్వా ప్రశశంస పునః పునః | ఉవాచ సుందరం దేవం పరం వినయపూర్వకం || 66 శంకరుడు ఈ విధముగా సభలో శంఖచూడునితో అనిన పిమ్మట అతడు మిక్కిలి వినయముతో పరమశివునితో ఇట్లనెను. శంఖచూడ ఉవాచ - శంఖచూడుడిట్లు పలికెను- త్వయా యత్కథితం నాథ సర్వం సత్యం చ నానృతం | తథాపి కించిద్యత్సత్యం శ్రూయతాం మన్నివేదనం || 67 జ్ఞాతిద్రోహే మహాత్పాపం త్వయోక్తమధునా త్రయం | గృహీత్వా తస్య సర్వస్వం కుతః ప్రస్థాపితో బలీ || 68 మయా సముద్ధృతం సర్వమైశ్వర్యం విక్రమేణ చ | సుతలాచ్చ సముద్ధర్తుం నాలం సోzపి గంగాధరః || 69 సభ్రాతృకో హిరణ్యాక్షః కథం దేవైశ్చ హింసితః | శుంభాదయశ్చాసురావై కథం దేవైర్నిపాతితాః || 70 పురా సముద్రమథనే పీయూషం భక్షితం సురైః | క్లేశభాజోవయం తత్ర తైః సర్వఫలభాజనైః || 71 క్రీడాభాండమిదం సర్వం కృష్ణస్య పరమాత్మనః | యదా దదాతి యసై#్మ స తసై#్యశ్వరం భ##వేత్తదా || 72 దేవదానవయోర్వాదః శశ్వన్నైమిత్తకః సదా | పరాజయో జయస్తేషాం కాలేzస్మాకం క్రమేణ చ || 73 తత్రావయోర్విరోధే చ గమనం నిష్ఫలం తవ | నమసంబంధినోర్భంధ్వోః ఈశ్వరస్య మహాత్మనః || 74 జాయతే మహతీ లజ్జా స్పర్ధాzస్మాభిః సహాzధునా | తతోzధికా చ సమరే కీర్తిహానిః పరాజయే || 75 శంఖచూడవచః శ్రుత్వా ప్రహస్యాహ త్రిలోచనః | యథోచితం సుమధురం అత్యుగ్రం దానవేశ్వరం || 76 పరమశివా! మీరు చెప్పినదంతయు సత్యమే. నేను కాదనజాలను. ఐనను నా నివేదమును కొంతమీరు కూడ వినవలెను. జ్ఞాతి ద్రోహమువల్ల గొప్ప పాపము సంభవించునని మీరు మాటిమాటికి అంటిరి. కాని బలిచక్రవర్తి సర్వస్వమును అపహరించి అతనిని ఎక్కడికో పంపినారు. ఈ ఐశ్వర్యమంతయు నా పరాక్రమముచే సంపాదించబడినది. దానిని కాదని ఎవ్వరందురు. హిరణ్యాక్షుని అతని తమ్ములతో సహ దేవతలేవిధముగా హింసించినది అందరకు తెలియును. శుంభ-నిశుంభాది రాక్షసులను దేవతలెట్లు చంపిరో అందరకు తెలియును. ఇంకను సముద్ర మథన సమయమున మేము కష్టపడగా దేవతలు అమృత రూపఫలితమును పొందినారు. ఈప్రపంచమంతయు పరమేశ్వరునికి క్రీడా భాండమువంటిది. అతడు ఎవరికి ఎంత ఇచ్చిన వారి అది వారికి అంతే చెందును. దేవదానవ యుద్ధము ఎల్లప్పుడు ఏదో ఒక నిమిత్తమున జరుగుచున్నదే. వారికి పరాజయము జయము సంభవించినవి. అట్లే మాకును జయపరాజయములు లభించినవి. అందువలన పరమాత్మకు సమబంధువులమైన మన మధ్య జోక్యము నిష్ఫలమగును. ఈ మాటలతోటి తగవును చూచిన నాకు చాలా సిగ్గువేయుచున్నది. ఇది యుద్ధమున జరిగినచో గొప్ప కీర్తి కలుగును. లేక అందు పరాజయమే లభించిన కీర్తి హాని సంభవించును. అను శంఖచూడుని మాటలు విని త్రిలోచనుడు నవ్వి మహాభయంకరుడైన దానవేశ్వరునితో ఇట్లు పలికెను. శ్రీమహాదేవ ఉవాచ - శ్రీ మహాదేవుడిట్లనెను - యుష్మాభిః సహ యుద్దం మే బ్రహ్మవంశ సముద్భవైః | కా లజ్జా మహతీ రాజన్ అకీర్త్విర్వా పరాజయే || 77 యుద్ధమాదౌ హరేరేవ మధునాకైటభేన చ | హిరణ్య కశిపోశ్చైవ సహ తేనాత్మనా నృప || 78 హిరణ్యాక్ష్యస్య యుద్ధం చ పునస్తేన గదాభృతా | త్రిపురైః సహ యుద్ధం చ మయా చాపి పురా కృతం || 79 సర్త్వైశ్వర్యాః సర్వమాతుః ప్రకృత్యాశ్చ బభూవహ | సహశుంభాదిభిః పూర్వం సమరం పరమాద్భుతం || 80 పార్షదప్రవరస్త్యం చ కృష్ణస్య పరమాత్మనః | యేయేహతాశ్చ తే దైత్యా నహి కేzపి త్వయా సమాః || 81 కా లజ్జా మహతీ రాజన్ మమ యుద్ధే త్వయా సహ | సురాణాం శరణసై#్వవ ప్రేషితస్య హరేరహో || 82 దేహి రాజ్యం చ దేవానాం వాగ్వ్యయే కిం ప్రయోజనం | యుద్ధం మా కురు మత్సార్థమితి మే నివ్చితం వచః || 83 ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరరామ చ నారద | ఉత్తస్థౌ శంఖచూడశ్చ స్వామాత్యైః సహ సత్వరః || 84 ఓ శంఖచూడుడా! బ్రహ్మదేవుని వంశములో పుట్టిన మీతో యుద్ధము చేసినచో సిగ్గుపడుటెందులకు? పరాజయము వలన చెడుపేరు వచ్చునని భయమెందులకు? మీతో తొలుత శ్రీహరియే యుద్ధమునాచరించినాడు. మధుకైటభులతో హరిణ్యకశిప, హిరణ్యాక్షులతో శ్రీహరియే యుద్ధమొనర్చినాడు. నేను త్రిపురాసురులతో యుద్ధము చేసితిని. సర్వమాతయు దుర్గాదేవి శుంభనిశుంభులతో పరమాద్భుతముగా యుద్ధమొనరించినది. నీవు శ్రీకృష్ణదేవుని అనుచరుడవు. ఇంతవరకు చనిపోయిన రాక్షసులందరు నీకంటే తక్కువవారే. అందువలన నీతో యుద్ధము చేసినచో నేను సిగ్గుపడవలసిన పని ఏమాత్రములేదు. ఐనను వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి నాతో యుద్ధము మాత్రమే చేయవద్దని నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. శంకుని మాటలు విని లాభము లేదనుకొని శంఖచూడుడు తన అమాత్యులతో కలిసి అచ్చటినుండి లేచెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యనే శివ శంఖ చూడ సంవాదో నామా అష్టాదశోzధ్యాయః | శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములోని రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదములో చెప్పబడిన తులస్యుపాఖ్యానములో శివ శంఖచూడుల సంవాదమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.